অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉన్నవ లక్ష్మీబాయి

ఉన్నవ లక్ష్మీబాయి

చాలాకాలం క్రితం విజయవాడలో జరిగిన ఒక సాహిత్యసభలో ప్రసిద్ధ కవి ఒకరు. కవి, గాయక, పండిత శిల్పులను ప్రస్తుతిస్తూ ఉపన్యాసం చేసి ముగించాక లక్ష్మీబాయమ్మ పట్టరాని కోపంతో ఊగిపోతూ "ఏమి ఉపన్యాసమయ్యా ఇది? ఒక్క స్త్రీ పేరైన చెప్పావుకదేం? తెనుగు స్త్రీలలో పండితులు లేరా? చిత్రకారిణులు లేరా? ఆంధ్రనారీలోకం అంత గొడ్డుపోయి లేదు. ఆ స్త్రీలలో ఒక్కరి పేరైన చెప్పావు కాదేమరి" అని అడిగి, "ఈ తెలుగు జనాభాలో చెరిసగంగా ఉన్న స్త్రీలను గురించి ఒక్క ముక్కయిన చెప్పకపోతే ఇది తెలుగువారి సమగ్ర సభ ఎట్టా ఒతుందని" అధ్యాశుని మందలించి, "స్త్రీలనింత చిన్నచూపు చుసిన ఈ సభలో పాల్గొనటం మాకు మర్యాద కాదని" సభ నుంచి బైటికి వచ్చేశారట.

లక్ష్మీబాయమ్మ గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాళికలోని అమీనాబాద్ అనే గ్రామంలో జన్నించారు. పదేళ్ల వయసులోనే ఉన్నవ లక్ష్మీనారాయణగారితో వివాహం జరిగింది. ఈ దంపతులు గుంటూరు జిల్లాల్లో వితంతు వివాహాలు జరిపించటంలో చొరవ తీసుకున్నారు. ఊరంతా వెలివేసిన, పుట్టింటి వారు ఒత్తిడి తెచ్చిన లక్ష్మీబాయమ్మ భయపడలేదు. ఎంతో మంది బాలవితంతువులు వీరింటికి వచ్చేవారు. లక్ష్మీబాయమ్మ వారిని ఆదరించి, రవికెలు తొడిగి, పెళ్ళి ప్రయత్నాలు చేసి, వివాహాలు జరిపించేవారు. క్రమంగా జోతియేద్యమం వీరిని ఆకర్షించింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వాస్తుబహిష్కారం, కాది ఉద్యమం - అన్నింటిలోనూ ముందు నిలబడ్డారు పల్నాడు సీమలో పన్నులు కట్టకుండా రైతాంగాన్ని కూడగట్టినందుకు పోలీసులు లక్ష్మీనారాయణగారిని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. లక్ష్మీబాయమ్మ సహాయ నిరాకరణోద్యమ బాధ్యతంతా తన భుజాల మీద వేసుకుని ఇల్లు, వాకిలి వదిలి, పల్లెపల్లెకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని, జాతియేద్యమ ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ కు మహాల వాలంటీర్లను తయారుచేసి వారిచేత జాతియేద్యమ గీతాలు పాడిస్తూ ప్రచారం చేశారు.

లక్ష్మీనారాయణ గారు జైలు నుండి బైటకు రాగానే ఇద్దరు కలిసి బాలికలు కోసం శారదానికేతన్ అనే గురుకుల పరాశలను గుంటూరుల ప్రారంభించారు. విదేశీపాలన వాళ్ళ ప్రజలలో పాతుకుపోయిన పాశ్చాత్య భాషా వ్యామొహాన్ని, పాశ్చాత్యలను గుడ్డిగా అనుకరించే తత్తయాన్ని పోగొట్టటం ఈ పాఠశాల లష్యలలో ఒకటి. మాములు చదువుతుపాటు జీవనోపాధికి పనికివచ్చే వృత్తులు, కళలు నేర్పువారు. సంగీతం, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, జారీ నగిషీ పనులు, నూలు వాదకర, నేతపని, నవారు నేయటం, బుట్టల అల్లిక మెదలైనవి నేర్పేవారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా ప్రజల ఆదరణ వాళ్ళ శారదానికేతన్ వేగంగా అభివృద్ధి చెందింది. లక్ష్మీబాయమ్మ పూర్తిగా ఈ పరాశల పనులలో మునిగిపోయారు. పిల్లల చదువు, ప్రవర్తన, పనితనం అన్నిటిని అనే స్వయంగా చుసుకునేవారు. ఈ బాలికలను శిక్షణ పూర్తి కాగానే ప్రభుత్వ పరీక్షలకు పంపేవారు. స్త్రీలు ఒకరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకగలగాలని లక్ష్మీబాయమ్మ ఆశించేవారు. వితంతు వివాహాలు, విద్యాబోధన, అనాధ బాలికలకు ఆశ్రయం, వీటన్నిటితో సమయంలో అరెస్టే జైలుకి వెళ్ళరు.

ఈమె "గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని" గ్రహించారు. హాథియేద్యమంలో పాల్గొనే సమయంలో బంగారు నగలు ధరించానని ప్రమాణం చేసిన ఆమె స్వర్ణ కంకణం తీసుకునేపట్టుడు అది తాను ధరించనాన్ని చెప్పి మరి తీసుకున్నారు. శారదా నికేతన్ రజతోత్సవ సమయంలో ఆమె అనారోగ్యంగా ఉన్న ఆ సంస్ధావల్ల జీవితాలను మార్చుకోగలిన స్త్రీలందరిని మళ్ళీ చూడగలిగానని సంతోషించారు. తర్వాత కొద్దీ కాలానికే ఆమె మరణించారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate