অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎ.యస్.రావు

ఆంధ్రజాతి గారవించదగిన ప్రముఖులు అన్ని రంగాల్లో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ ఇంజనీరుగా పేరెన్నికగన్న డాక్టర్ కె.యల్.రావు ఒకరు. వీరి పూర్తి పేరు కానూరి లాష్మణరావు. రాయన బెజవాడ సమీపాన గల కంకిపాడు గ్రామంలో 1902 లో జనమించారు. వీరి తండ్రి గ్రామ కారణం. చిన్నతనం నుండే రామకృష్ణ పరమహంస, మహాత్మగాంధీ, వివేకానందుడు మెదలైన మహాపురుషులు జీవితచరిత్రలు చదివి వారిలాగా ఆదర్శంగా జీవించ లనుకొనేవారు. నీటికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం జరిగింది.

హైస్కూలు చదువు బెజవాడో జరిగింది. ఈ తరమువారు నమ్మలేనంత చౌకరోజులవి. ఆరోజుల్లో నెలకు ఎనిమిది రూపాయలతో ముప్పుత భోజనం టిఫెను పెట్టేవారు. అక్కడ మంచి మార్కులతో యస్.యస్.యల్.సి.పాసయ్యారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో లెక్కల గ్రాఫులో సితు లభించింది. బాగా చదివి ఇంటర్మీడియట్ కూడా డిస్టింక్షన్ లో పాసయ్యారు.

మెడిసిన్ లోను, గణితశాస్త్రం బి.ఎ.ఆనర్సులోను ఇంజనీరింగులోను సీటువచ్చింది. తన కోరిక ఇంజనీరు కావాలని, గింది ఇంజనీరింగు కళాశాలలో చేరారు. సివిల్ ఇంజనీరింగులో శ్రద్ధ ఎక్కవ. అయినా ఇంజనీరింగులో అన్ని విభాగాలు అధ్యయనం చేశారు. ఇంజనీరు కోర్సు పూర్తిచేశారు.

విశాఖపట్నం జిల్లా బోర్డులో సహాయ ఇంజనీరుగా ఉద్యోగం దొరికింది. సాధారణంగా ఇంజనీర్లకు పై సంపాదన ఉంటుంది. కాంట్రాక్టర్లు తమ లభిధకోసం లంచాలిస్తుంటారు. ఒక సందర్భంలో ఒక కాంట్రాక్టరు తన లోపం కప్పిపుచ్చుకోవడం కోసం ఈయనకు లంచం ఎర చూపాడు. రావుగారు మండిపడి ఆ కాంట్రాక్టు రద్దుచేస్తానని హెచ్చరించాడు. అతడు భయపడి పారిపోయాడు బయటికి. అది రావుగారి నిజాయితీ. ఎ నిజాయితీ జీవితమే అయన ఆఖరివరకు కొనసాగించారు. తన జీవిత చరిత్రలో యిలా వ్రాశారు. ఎవరైనా లంచం ఇవ్వజిపితే వారిపై అసహ్యభావం కలుగుతుంది. అది పాపకార్యమని, అతిహీనమైన పని అని నా మనసులో పాతుకొని పొయంది. ఆ భావమే నన్ను ఆ దశలో రాశించింది. "ఎంత నిజాయితీ! గాంధీజీ వివేకానందుల ప్రభావం ఊరికే పోలేదు."

ఈయన మిత్రడు డాక్టర్ యం.వి. కృష్ణారావు. వీరిద్దరూ ఆదర్శభావాలు కలువాళ్ళే. ప్రపంచమంతా తిరిగి విజ్ఙానం సంపాదించాలనే కోరిక ఉన్నవారు. ఇద్దరు బర్మాదేశం వెళ్ళాలని నిర్ణయంచుకున్నారు. కృష్ణారావుగారెందుకో వెళ్ళలేకపోయారు. రావుగారొక్కరే వెళ్ళారు.

రంగూన్ లో కార్మికసంఘా నాయకుడు నారాయణరావనే తెలుగువాడు. రావుగారు రంగూన్ వచ్చినందుకు నిరుత్సాహపరిచారు. అయినా ఈయన అధైర్యపడలేదు. స్వశక్తితో నీటిసరఫరా శాఖలో ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్ళకు ఆ ఉద్యోగం వదిలేసి కాంట్రాక్టర్ల కంపెనీలో చేరాడు. మరికొన్నాళ్ళకు దాన్ని కూడా వదిలేసి సిలోన్ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ ప్రొఫెసర్ గా చేరారు. ఆ ఉద్యోగం కూడా వదిలేసి ఇండియాకు తిరిగివచ్చి మెట్టూరు ప్రాజెక్టులో జానియర్ ఇంజనీరుగా చేరాడు.

గాంధీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా ఈయనకు చాల ఇష్టం. అయ్యదేవర కాళేశ్వరరావుగారు, కొమర్రాజు అచ్చమాంబగారు మెదలైన బంధువులందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. తాను కూడా చేరాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. అధికార్లు అంగీకరించలేదు. గింది ఇంజనీరింగు కాలేజీకి బదిలీ చేశారు. లెక్చరర్ గా చేరాక ఇంజనీరింగ్ లో రిసెర్చి (పరిశోధన) చేయాలనీ కోరిక కలిగింది. అది చాల కాశ్రమని అందరి భావన. రిస్వర్చ కోసం ఇంజనీరింగు ఎం.యస్సి.లో చేరాడు. గొప్ప న్యూటన్ బయలుదేరాడురా అని మిత్రులు ఎగతాళి చేశారుకూడా.

పరిశోధన విభాగం (రిసెర్చి) డైరెక్టరు కె.సి.చాకో అనే గొప్ప ఇంజనీరు. లండన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన వ్యక్తి. వీరి సలహా సహకారాలతో సిద్దాంత వ్యాసం సమర్పించారు రావుగారు. ఆ సిద్దాంతవ్యాసాన్ని ఇంగ్లండు పంపారు. అక్కడ ఇంజనీరింగే నిపుణులైన అండ్రస్, ఆస్కార్, పేజర్, బెట్టో అనేవాళ్ళు దాన్ని చదివి ఆశ్చర్యపోయారు. ఇంజనీరింగ్ లో పరిశోధన సిద్దాంత వ్యాసాన్ని సమర్పించి డిగ్రిపొందిన భారతీయుల్లో రావు ప్రథములు.

మేధాశక్తికి తొలి విజయం

మద్రాసు సెంట్రల్ రైల్వేస్టేషన్ కువారంనాడి గట్టున ఉంది. మద్రాసునగరం ఉత్తరం, దశినా ప్రాంతాలను కలిపే కీలకమైన బ్రిడ్జి యి నది పై నిర్మింపబడి ఉంది. సముద్రం ఉప్పు గాలి ప్రభావం వలన బ్రిడ్జి కిందిభాగం కాంక్రీటు పూడిపోయి ఇనుపకమ్ములు బయటపడ్డాయి. బ్రిడ్జి బలహీనపడిందన్న భావంతో ప్రభత్వం ఆ బ్రిడ్జి పై రాకపోకలు నిలిపివేసింది.

ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు పరిశీలించవలసిందిగా చీఫ్ ఇంజనీరు రావును కోరారు. రావుగారు బ్రిడ్జిని పరిశీలించి పథకం ఆలోచించాడు. అప్పుడుప్పుడో కాంక్రీటు విద్యలో ప్రజ్జాను సంపాదించుకుంటున్న రావుగారు సన్నకంకరతో కాంక్రీటు తయారుచేయంచి తుపాకీ గొట్టం లాంటి గొట్టాలతో కీలమును గీకేసిన కమ్ముల పై పిచికారీ చేయించాడు. సిమెంటు బాగా మెత్తుకొనేలా చేశాడు. ఇంకే! బ్రిడ్జి బాగుపడింది. రాకపోకలు నిర్భయముగా జరిగాయి. రావు కీర్తి దేశమంతా వ్యాపించింది.

ఈ విజయంతో కాంక్రీటు కట్టడలపైనా ఆ విద్యపైన శ్రద్ధ పెరిగింది రావుగారికి. ఈ విద్యలో ప్రపంచ ప్రసిద్ధులైన ప్రీషియేన్ట్ అనే ఇంజనీరు ప్రాన్సులో ఉన్నాడు. అయన దగ్గర ఈ విద్య చదవాలని రేవులో పట్టుదల కలిగింది. అధికారులు అందుకు అనుమతిమ్చలేదు. అయినా వెళ్ళడానికే నిశ్చయంచుకున్నాడు. భార్య వరలక్ష్మితో ప్రాన్సు బయలుదేరాడు.

చాలామంది విద్యార్థి భక్తులు బొంబాయి వరకు వచ్చి వీడ్కోలిచ్చారు. ప్రాన్సు చేరి ప్రీషియేన్ ట్ ను కలిశారు. తన కోరిక కొంతవరకు నెరవేరింది. 1939 లో ప్రాన్సు నుండి లండన్ చేరాడు. నేర్చుకున్న కాంక్రీటు విద్యలో అనుభవం సంపాదించాలని "కాంక్రీటు ఇంజనీరింగు" సంస్ధలో చేరాడు. అక్కడ చీఫ్ ఇంజనీరు రెనాల్డ్స్. మరొక ఇంజనీరు టర్నరు. అది శిక్షణ కేంద్రంగాదా! డబ్బు కట్టి శిక్షణ పొందవలసి వచ్చింది. ఈ డబ్బుకోసము, తన కుటుంబ పోషణకోసము సాయంకాల సమయాల్లో కాలేజీల్లో లెక్చర్లు ఇచ్చి డబ్బు సంపాదించేవాడు.

మద్రాసులో ప్రతి నెల జీతం తీసుకుంటూ, పదోన్నతి కలిగే ఉద్యోగంలో ఉంది కూడా ఇండియా వాడాలి లండను వచ్చాడు రావుగారు. లండన్ లో సంసారం గడవడానికి చిల్లర ఉద్యోగాలు చేసున్నాడు. కంకర్తు పై పరిశోధనే తన ద్యేయం. కష్టాలను లెక్కంచదలచలేదు.

1939 వ సంవత్సరం హిట్లర్ యుద్దాన్ని ప్రకటించాడు. యుద్దు వాతావరణంలో నిర్మాణ కార్యక్రమాలు కుంటుబడ్డాయి. బాంబులనుండి రాశించుకోవడం కోసం నేలను త్రవ్వి షెల్టర్స్(Shelters) కట్టడం అధికమైంది. ఈ కట్టడాలకు సంబంధించి కాంక్రీటు పై పరిశోధన ఎక్కువయింది.

రావు లెక్కల్లో ఘాటికులు. కానీ డిజైన్స్ వేయడంలో అంత మేధావి కాదు. ఇది పెద్ద లోటు అనిపించింది. రావుగారికి, లండన్ ప్రక్కనేగల థేమ్స్ నదిపై ప్రత్యకే తరహాలో కట్టబడిన బ్రిడ్జిని ప్రతిరోజు పరిశీలించి (డిజైన్స్) రూపకల్పన చేయడం నేర్చుకున్నాడు.

ఈ సమయంలో ఈయనకు లండన్ ప్రక్కనేగల ఒక పట్టణంలోని కళాశాలలో సీనియర్ లెక్చరర్ ఉద్యోగం లభించింది. ఈ పట్టణంలో, నీటికి అద్దెకు ఇల్లు చిక్కలేదు. రంగుజాతులవారికి వీళ్ళు ఇల్లు ఇవ్వరు. రావుగారికి మద్రాసు జీవితం గుర్తికు వచ్చింది. తన మిత్రులైన కొందరు తక్కువ కులస్థులని అగ్రజాతులవారు వారికీ ఇల్లు అవ్వడానికి నిరాకరించడం ఆయనకు ఙాపకం వచ్చింది. అక్కడ నల్లవాళ్ళే నల్లవాళ్ళకు ఇల్లు ఇవ్వనప్పుడు ఇక్కడ తెల్లవాళ్ళు రంగుజాతివారికి ఇల్లు ఇవ్వకపోవడంతో ఆశ్చర్యపడవలసినదేది లేదనుకున్నాడు. ఈ అద్దెయంతి వేట ఆ దంపతులకు కన్ను తెరిపించింది. కుల, మత, వర్ణ వివక్ష ఎంత చెడ్డదో అప్పుడు బాగా అర్ధమైంది. అతికష్టంమీద ఒక చిన్న కులకని వారితో వివాహం చేసుకున్నప్పుడు మారు మాట్లాడకుండా ఒప్పుకోవడం జరిగింది. సంతోషము కలిగింది.

ఈ కళాశాలలో రావు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నారు. తాను పైన గ్రంథం వ్రాశాడు. ఒక ప్రముఖ కంపెనీ ప్రచురించింది. కంపెనీ ప్రచురించిందంటే అది ఒక ప్రత్యేకత అన్నమాట. పుస్తకం పై మంచి రాయల్టీ కూడా వచ్చింది. మద్రాసులో కూడా ఈయన కీర్తి వ్యాపించింది. అయన పై గౌరవం పెరిగింది.

రావు అమెరికా వెళ్లి "సెల్యులార్ కాఫర్ డ్యాం" విషయమై వివరాలు సేకరించాలని మద్రాసు నుండి చీఫ్ ఇంజనీరుగారు ఉత్తరం వ్రాశారు.

"సెల్యులార్ కాఫర్ డ్యాం" అంటే ఏమిటి?

జల ప్రవాహంతో ఉన్న నదులకు ఆనకట్ట లేదా వంతెన కట్టాలంటే నదిలో ఒకవైపున ముందు నీరు లేకుండా చేసుకోవాలిగదా! కాఫర్ డ్యాంలు కట్టి మధ్యలోనుండి నీరు తీసేసి పునాదులు వేస్తారు. ఒకవైపు పూర్తికాగానే మరోవైపు కాపర్ డ్యాం కట్టి నీరు తీసేసి అక్కడ కూడా పునాదులు వేస్తారు. పునాదుల పై గోదాగాని, స్థంభాలుగాని కట్టడం పూర్తిఅయినాక వీటిని తొలగించి వేస్తారు.

యుద్ధం రోజుల్లో అమెరికా వెళ్ళడానికి ఇంగ్లండు ప్రభుత్వం అందికరించలేదు. ఎలాగో ఇండియా ప్రభుత్వం జోక్యంతో ఇంగ్లండువారి అనుమతి సంపాదించి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అన్నిరకాల నిర్మాణాలను నిశితంగా పరిశీలించాడు. అమెరికాలోని కొలరెడో నదిపై కట్టిన డ్యాం ప్రపంచంలోకెల్లా ఎత్తయినది. ఎక్కువ కాంక్రీటు ఉపయేగించి కట్టిన మరొక డ్యాం గ్రాండ్ లవ్ లి డ్యాం. ఈ రెండింటిని రూపకల్పన చేసినవాడు (డిజైనర్) విశ్వవిఖ్యాత ఇంజయానం చేసి మంచి రిపోర్టు తయారుచేశారు రావుగారు. గన్ని మద్రాసు పంపించారు. తాను ఇంగ్లండు వచ్చేశారు.

శ్రీరాంపాదసాగర్ ప్రణాళిక

గోదావరి నది పై పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టాలని మద్రాసు ప్రభుత్వం ఆలోచించింది. ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గోవిందరాజ అయ్యంగార్ తెలుగువారు కాదు. గవర్నను సలహాదారు యస్.పి. రామమూర్తి ముఖ్యమైన ప్రాజెక్టులను పరిశీలించడానికి చీఫ్ ఇంజనీరును అమెరికా వెళ్ళమని ప్రభుత్వం కోరింది. అయన అమెరికా వెళ్తూ ఇంగ్లండులో ఆగి రావుగారిని తనతో కూడా రమ్మన్నారు. తన కుటుంబ పరిస్ధితి అనుకూలించకపోయినా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదలుకోదలచలేదు రావుగారు. అదే అయన ప్రత్యేకత.

రెండవసారి అమెరికా వెళ్ళారు. చీఫ్ ఇంజనీరు అయ్యంగారితో కలిసి అనేక ప్రాజెక్టుల రూపకల్పనను (డిజైన్ లను) అధ్యయనం చేసి రిపోర్టు తయారుచేశారు. అయ్యంగార్ ఇండియా వచ్చారు. రావు ఇంగ్లండు వెళ్లిపోయారు.

తరువాత కొన్నిరోజులు రావుగారికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో తాను ఇండియాకు వచ్చి పోలవరం ప్రాజెక్టు పనులు చూడవలసింది త్వరలో మద్రాసు రావలసింది ఉంది. రావుగారు సంతోషంగా బయలుదేరారు. ఏడేళ్ళ తరువాత ఇండియాలో కలుమెపారు. అంటే 1946 లో అన్నమాట.

వచ్చిందే తడవుగా శ్రీరాం పాదసాగర్ డ్యాం డిజైన్ చేసే పని ప్రారంభించారు. ఈ పని ఒక్క సంవత్సరంలోనే ముగించారు. రూపకల్పన ప్రకారము దాన్ని నిర్మి స్తే హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం నీటిముంపుకు గురిఅవుతుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టు ఇచ్చంపల్లి దగ్గర కట్టడం మంచిదని హైదరాబాదు ప్రభుత్వం అన్నది. చీఫ్ ఇంజనీరు అయ్యంగార్ మాత్రం పోలవరం దగ్గరే కట్టాలన్నారు.

ప్రాథమికమైన పనులు పూర్తి అయ్యాక ప్రఖ్యాత నిపుణుడు వై.యల్. సాలెజ్ గారితో సంప్రదించడానికి అమెరికా వెళ్ళడు. మళ్ళీ రావుగారు. ఇండియాకు సంబంధించిన అనేక ప్రోజెక్టుల పై పరిశీలన జరుగుతున్న అమెరికాలోని అంతర్జాతీయ ఇంజరింగు కంపెనీలో, సాలెజ్ గారిని కలిసి డిజైన్ ఖరారు చేసుకొని భారతదేశం తిరిగి వచ్చారు. అయితే రాజకీయంగా ఆనాడు వచ్చిన మార్పలు కారణంగా ఆ నిర్మాణం ఆగిపోయంది.

ఖోస్లా కమిటీ - రావుగారి పాత్ర

లోయర్ భవాని, మలంపురా, ఇంకా మరికొన్ని డ్యాంల 'డిజైన్'  చేయవలసిందిగా రావుగారిని ప్రభుత్వం కోరింది. కృష్ణానది పై పులిచింతల, సిద్దేశ్వరం నిర్మాణానికి సంబంధించిన పనులను గూడు పర్యవేశించామని కోరింది. ఇవి కేవలం ఆంధ్రులకు సంబంధించిన ప్రాజెక్టులు కాబట్టి మద్రాసువాడైన చీఫ్ ఇంజనీరు గోవిందరాజు అయ్యగారికి నచ్చలేదు. రావును బదిలీ చేయంచాలని ప్రయత్నించాడు.

ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ కమిషన్ లో డైరెక్టరుగా నియమిస్తూ రావుగారికి ఉత్తర్వులందాయి. వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. కేంద్రప్రభుత్వం ఒరిస్సాలోని హిరాకుడ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ వారికీ అప్పజెప్పింది. భారతదేశమంతటా నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు పరిశీలించారు. పులిచింతల ప్రాజెక్ట్ కోసం మొదటినుండి ఆందోళన చేస్తున్న ముక్యతలరాజాతోపాటు ఆ ప్రాంతాన్ని సందర్సించి నందికొండ సరియైన స్ధలం అని నిర్ణయంచారు.

ఈ సమయంలో ప్రోజెక్టుల పరిశీలనకు ఖోస్లా కమిటీ, ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది పులిచింత ప్రాజెక్టు వాళ్ళ మద్రాసు ప్రాంతానికి రకంగానూ లాభం లేదన్న దృష్టితో ఆనతి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి సైతం ఈ ప్రాజెక్టుకు అడ్డుచెప్పారు. రావు తన మేధాశక్తితో ఆ ప్రాజెక్టు అన్నివిధాలా తగినదని నిరూపించి ఖోస్లా కమిటిచేత అంగీకరింపజేశారు. కానీ స్ధలం పులిచింతల మారుగా నందికొండకు మార్చారు. అదే నాగార్జునసాగర్. ఇవేగాక కాటన్ బ్యారాజు, ప్రకాశం బ్యారాజు, శ్రీశైలం, ఇడుక్కి, కోయిన, బీమా, యానాయ్, కోసి బ్యారాజు, గందాకా, నర్మదా, బలికుల, భాక్రానంగల్ మెదలయిన అనేక నదీలోయ ప్రోజెక్టుల రూపకల్పనలోను, నిర్మాణంలోనూ రావుగారికి ప్రమేయం వుంది.

1954 లో సెంట్రల్ వాటర్ అండ్ పేపర్ కమిషన్ కు చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి పొంది ఆతరువాత 1956 లో ఆ కమిషన్ లోనే సభ్యుడుగా కూడా అయ్యారు.

అవార్డులు - రివార్డులు

తన కృషికి గుర్తింపుగా 1947-48 లోను, 1953-54 లోను రావుగారు రాష్ట్రపతి అవార్డు పొందారు.

1951 - 61 మధ్యలో ఒక్క అంతర్జాతయ సదస్సుకు ఉపాద్యశుడయ్యాడు.

1959 - 60 విద్యాశ్చక్తి మరియు నీటిపారుదల కేంద్రమండలికి అద్యశ్యడయ్యాడు.

1960 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ అఫ్ సైన్స్ బిరుదు ఇచ్చి సత్కరించింది.

తరువాత హైదరాబాదు జవహర్ లాల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ యిచ్చింది.

ఇన్ని గౌరవాలు పొందిన రావుగారికి రావలసినంత ఖ్యాతి రాలేదు. దానికి కారణాలు అనేకం. ఇతర దేశాల్లో అయితే ఉహించరానంత గౌరవం పొందిఉండేవారు. ఇక్కడ ఉత్తర, దశినా బేధాలు, ప్రాంతీయ బేధాలు, కులభేదాలు ఇవన్నీ ఎవరి జాఉన్నత్యానికైనా అడ్డుతగిలేవే.

రాజకీయ జీవితం

ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, స్వతంత్రులు, రాజకీయాల్లో ఉండాలనుకుంటే వారికీ ఆటంకాలుండవు. పార్లమెంటు మెంబర్లుగానూ మంత్రులుగాను గూడు ఉంటున్నారు.  ఇలాంటి మేధావులు రాజకీయాల్లో ఉంటే దేశాభివృద్ధికి దోహదంగా ఉంటుందని ఒక్క సభలో రావుగారన్నారు. ఆనాటి సభకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన నెహ్రు గారు ఆ మాట విన్నారు.

ఈ సంఘాలనా జరిగిన కొన్నాళ్లకే పార్లమెంటు ఎన్నికలు రాణే వచ్చాయి. అది 1961 వ సంవత్సరం. రాజకీయాల తెలుసుగాని స్వార్ధపూరిత రాజకీయాల్లో అంతవరకు ప్రవేశం లేదు రావుగారికి. విజయవాడ పార్లమెంటు సీటుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ యిప్పించాడు సంజీవరెడ్డిగారు. రావుగారి బంధువే అయన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ప్రసాదరావుగారు ఈయనకు ప్రత్యర్థి.

కమ్యూనిస్టేపార్టీ కార్యకర్తలు క్రమశిక్షణాయుతంగా ప్రచారం చేశారు. అయ్యదేవర కాళేశ్వరరావుగారు, కొమాజు అచ్చమాంబగారు రావుగారి పోషణ విశేషంగా కృషిచేశారు. మొత్తానికి ఇరవైవేల ఓట్ల మెజార్టీతో రావు గెలిచారు.

పార్లమెంటులో 'ఎస్టిమేషన్ కమిటీ మెంబరు'గా  నియమింపబడ్డారు. అభివృద్ధి పొందుతున్న దేశాలకు సంబంధించిన బెర్లిన్ లో ఏర్పాటుచేసిన ఒక అంతర్జాతీయ సమావేశానికి భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు రావుగారు.

1963 జులై నెలలో నెహ్రు గారి నుండి నాగార్జున సాగర్ లో వున్నా రావుగారికి ఫోను వచ్చింది. నీటిపారుదల, విద్యుత్ శాఖలకు మంత్రిగా నియమిస్తున్నవి నెహ్రు గారు చెప్పారు. ప్రమాణస్వీకారానికి ఎప్పుడు వాస్తవాన్ని నెహ్రు గారు అడిగారు. నియెజకవర్గానికి వెళ్లి నింపాదిగా వస్తానన్నారు రావు. మరొకరయితే ఆ మంత్రిపదవిని ఇంకెవరైనా తన్నుకుపోతారేమేనని మరుక్షణమే పరుగుత్తేవారు. రావుగారికి పదవే ప్రాణం కాదుగదా.

19-7-63 వ తేదీ మంత్రగా పమాణం చేశారు. 1964 లో నెహ్రు గారు చనిపోయి శాస్తగారు ప్రధాని అయినపుడు, శాస్త్రగారు మరణించి ఇందిరాగాది ప్రధానిగా వచ్చినపుడు కూడా నీరు మంత్రివర్గంలో కొనసాగారు. మంత్రిగా కొనసాగడమే కాదు వీరి శాఖా ఎవరు మార్చులెదు. అది వీరి ప్రాముఖ్యం. తిరిగి 1967 ఎన్నికల్లో రావుగారు విజయవాడ నియెజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది వారి మంచితనానికి, గొప్పతనానికి, నియెజకవర్గ అభివృద్ధికి వారి చేసిన కృషికి తార్కాణం.

కృష్ణ, గోదావరి నదీజలాల పంపకంలో కొన్ని తగాదాలు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ విషయంలో వైశామ్యులు రాసాగాయి. రావుగారు న్యాయం అంట్లడిన అంద్రతారా రాష్ట్రాల ముఖ్యమంత్రలు, నిపుణులు వీరిని అనుమానంగా చూడసాగారు. ప్రాంతీయ దురభిమానం లేకండా దేశంశెమాన్ని మాత్రమే కంశించి నిరంతరం నిష్ఫశిషంగా కృషిచేస్తున్నప్పటికీ నిందలు తప్పలేదు.

ఈ పరిస్ధితులలో పదవి కొరకు పాకులాడటం రావుగారికి నచ్చలేదు. తనకు థానే రాజీనామా యిచ్చి ఇంటికి వచ్చారు. "నిరంతర కృషితో కార్యదీక్షతో అలసిపోయారు కాబట్టి ఇక విశ్రంతి తీసుకొండి." అని సహధర్మచారిణి వారలష్మిమ్మ సంతోషంగా పలికింది.

ఈ మహనీయుడు తన 85 వ యేటా 1986 లో మరణించారు. గతంలో కాటన్ ప్రభువు, మెకంజీ లాంటి వాళ్లు సూచించిన విధంగా, గంగా, కావేరి కలపాలన్న రావుగారి వాంఛ నెరవేరకుండానే పోయారు. భౌతికంగా అయన లేకపోయినా, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నంతకాలం అయన ప్రజాహృదయాల్లో జీవించే వుంటారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate