অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గౌతమ బుద్ధుడు

బుద్ధుడు. ఈ పేరు మదిలోకి రాగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ధ్యానముద్రలో ఉన్న బోధిసత్వుడి నిర్మల రూపం మనకు గుర్తుకువస్తుంది. అహింసా సిద్దాంతం గుర్తొస్తుంది. జీవికి కష్టలెందుకు అని ఆలోచించి, అన్వేషణ మొదలు పెట్టిన గొప్పతనం ఙాపకానికి వస్తుంది. చింతలన్నింటికీ కోరికలే కారణమని నిగ్గుతేల్చిన అపూర్వమేధస్సు సాక్షత్కరిస్తుంది. శాంతంతో కొవాన్ని, సత్వకథతో హింసను, దానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని, సత్యంతో అసత్యాన్ని జయ్మచండి, సర్వప్రాణులు పట్ల సానుభూతిని కలిగి ఉండటమే నిజమైన దర్మం, మతమని ప్రపంచానికి చాటిన మహనీయుడు అయన. బుద్దుడి బోధనలు మానవుడికి పవిత్ర, ధర్మబద్ధజీవనానికి దారి చూపాయి. అందుకే అయన జనమించి 2500 ఏళ్ళు గడిచిన, అయన చింపిన మార్గం ఇంకా అప్రతిహతంగా సాగిపోతోంది. అలాంటి మహనీయుడు ఙానోదయం పొందిన చోటును ముష్కరులు లాష్మంగా చేసుకోవడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తాయింది.

సర్వం త్యజించి

గౌతమ బుద్దుడి అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తు పూర్వం 563 లో శుద్దోధనుడు, మహామాయాదేవి దంపతులకు కపిలవస్తు సమీపంలోని లుంబిని గ్రామంలో జనమించాడు. రాచకుటుంబంలో పుట్టిన ఈయన కొన్నేళ్లపాటు సకల సుఖాలను అనుభవించాడు. యశోదరను వివాహమాడాడు. వారికీ రాహులుడు అనే కుమారుడు ఉన్నాడు. ఒకరోజు అయన వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు తొలిసారిగా అయన వృద్ధుడిని, రోగిని, మృతదేహాన్ని చూశాడు. ఇది అయన మదిలో కలతను మిగిల్చింది. ఈతి బాధల గురించి ఆయనకు తెలిసివచ్చింది.  దుః ఖనికి కారణాన్ని వెతకాలి నిశచయంచుకున్నాడు. అంతే సకల సంఖ్యలను, కుటుంబాన్ని త్యజించి, సన్యాసిగా మారదు. దేశాటన చేస్తూ గాయకు సమీపంలోని నిరంజనా తటాకం ఒడ్డుకు చేరాడు. క్రీస్తు పూర్వం 531 సంవత్వరంలో రావి చెట్టు (బోధి వృక్షము) కింద కుర్చీని కొన్ని రోజులపాటు ధ్యానంలో మునిగిపోయాడు. శరీరం షూష్కించిన, చర్మం, ఎముకలు, మాంసం కరిగిపోయిన ఙానోదయం కానిదే. ధ్యానం నుంచి కదలరాదని గట్టిగ తీర్మానించుకున్నాడు. అయన ఆశయం సాధించి, ఙానోదయం అయ్యంది. ఈతి బాధల నుంచి విముక్తి కలిగింది. అప్పుడు సిద్ధార్థుడు. బుద్దుడిగా మారాడు. "ఇదే నా చివరి జన్మ. ఇక ముందు నాకు ఎలాంటి జన్మలు ఉండవు" అన్నవి అయన తొలిపలుకులుగా చెబుతారు. ఆ తర్వాత సార్ నాధ్ చేరుకొని తొలిసారిగా శిస్యులకు ఉపదేశం చేశాడు. 'దీన్ని ధర్మ చక్ర పరివర్తనం' అంటారు. అప్పటి నుంచి తన బోధనలతో ప్రపంచం దృష్టని ఆకర్షించారు.

బోధనలు

శోధనలో అనేక అంశాలను బుద్ధుడు గమనించాడు. వాటి ఆధారంగా బోధనలు చేశారు. ముఖ్యంగా జీవించడానికి అనుసరించాల్సిన త్రిరత్నాలు ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధిని పొందాయి. అవి

బుద్ధం శరణం గచ్చామి

(బుద్ది. మనస్సుకు దారి చూపే చుక్కాని)

ధర్మం శరణం గచ్చామి

(ధర్మం అనేది మనం నడవాల్సిన మార్గం)

సంఘం శరణం గచ్చామి

(మనతోపాటు జీవించే మానవ సమాజంతో కలిసి మనం నడవాలి)

ప్రతి ఒక్కరు ఈ మూడు సూత్రాలను అనుసరించాలని హితవు చెప్పాడు. కోరికలే దుః ఖనికి హేతువని తేల్చాడు. వాటిని ఎలా జయంచాలో శోధించాడు. సృష్టిలో ఏది శాశ్వతం కాదని, మంచి - చెడు ఏనాడైనా వచ్చిపోయేవాని చెప్పాడు. ఈ అశాశ్వత సిద్దాంతాన్ని అర్ధంచేసుకుని, మేలు, కీడు దేనికి పొంగిపోకుండా, కుంగిపోకుండా తామరాకు పై నీటిబొట్టులా ఉండాలని బోధించాడు. అప్పుడు జీవితంలో దుః ఖనికి తావే ఉండదని తేల్చిచెప్పాడు. ఏ జీవిని హింసించొద్దని హితవు పలికాడు. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటూ, కష్టసుఖాలను అతీతంగా ఉండాలన్నాడు. మనస్సును పూర్తిగా శ్వసమీద లగ్నం చేస్తే చింత, చింతన ఉండదంటూ విపస్సను పద్దతిని తేలిగ్గా బోధించాడు. ధ్యాన పద్దతిని అనుసరి స్తే కష్టం, దుః ఖం తలెత్తవని చెప్పాడు.

సుత్త, వినయ, అభిదమ్మ అనే త్రిపిటకాలను బుద్ధుడు అందించారు. ఇవన్నీ పాళీ భాషలో ఉన్నాయి. బౌద్దులు ఆచరించాల్సిన జీవన విధానాలను ఇందులో పొందుపరిచారు. జీవహింస చేయరాదు. అబద్దం ఆడరాదు. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు. మత్తుపానీయాలు సేవించరాదు. అవినీతి పాణిలు చేయకూడదు అనే పంచశీల సూత్రాలను బోధించారు. నీతి నియమాలతో కూడిన అష్టంగా మార్గాన్ని సూచించారు. ఇందులో సరైన దృష్టి, సత్యసంకల్పం, సత్యవాక్కు, సత్కర్మ, సత్యజీవనం, సత్యయత్నం, సత్యచింతనం, సత్యాలశ్యం అనే ఎనిమిది విధాలు ఉంటాయి. వీటిని అవలంభించినవారికి శాంతి, ఉన్నత బుద్ది, ప్రేమ, వివేకం కలుగుతాయని బోధించారు. క్రీస్తుపూర్వం 483 లో కుషి నగరంలో కాకుస్ధ నది తీరాన బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. "సామ్యేగద్రవ్యమంతా నశిస్తుంది. జనం పొందడానికి తీవ్రంగా ప్రయత్నించండి" అన్నవి అయన చివరి పాలకులుగా చెబుతారు.

  • వ్యక్తిగత దేవుడి పై వీరికి విశ్వసం ఉండదు. ఇది మానవత్వానికి, దైవానికి మధ్య సంబంధం అనే సూత్రానికి సంబంధించినది కాదు.
  • బౌద్దమతంలోని అనేక వర్గాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి. థేరవాద బౌద్ధం, మహాయాన బౌద్ధం, ధారావాడా బౌద్ధం. శ్రీలంక, కంబోడియా, దాయ్ ల్యండ్, లావోస్, మయన్మార్ లోను, మహాయాన బౌద్ధం. టిబెట్, చైనా, తైవాన్, జపాన్, కొరియా, మంగోలియాలో బలంగా ఉన్నాయి.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 37.6 కోట్లమంది బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారు.
  • బుద్దుడి జీవితంతో ముడిపడి ఉన్న నాలుగు ప్రధాన యాత్ర స్ధలాల్లో బుద్ధగయ ఒకటి. మిగతావి. కూసినగర్, లుంబిని, సార్ నాధ్.

ఎన్నటికీ ఇగిరిపోని గంధం

బౌద్ధమతం పురుడుపోసుకొని 2500 సంవత్సరాలు గడిచిపోయినా. అది ఇంకా పసివాడని మొగ్గలాగే ఉంది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది అయన నిరంతర ఝరిలాగా కొనదగుతూనే ఉంది. ప్రజలను సన్మార్గంలో నడిపిస్తునే ఉంది. బౌద్ధాన్ని కళాపరిధులు లేని 'అకాలీక' గా పేర్కొంటారు. కలదోషానికి తావులేని ధర్మాలు, విస్తృత ఆమీదయెగ్యత కారణంగా బౌద్ధం ఇంకా మనగలుగుతోంది. అనేకమతాలు అహింసను అనుసరిస్తున్నాయంటే అందుకు ప్రేరణ బుద్ధుడే.

బౌద్ధాల గురువు దలైలామా మాటల్లో చెప్పాలంటే. "ఆధునికి సమాజంలో బౌద్ధ మతానికి ప్రత్యేక పాత్ర ఉంది. మిగతా మతధర్మాలకు భిన్నంగా. బౌద్ధ మతం స్వాతంత్ర్య భావనను బలంగా ప్రతిపాదిస్తోంది. ఇది ఆధునిక సైన్స్ ప్రాధమిక సూత్రాలకు దగ్గరగా ఉంది" అని అయన చెప్పారు. "బౌద్ధాన్ని మనం మూడు విభాగాలుగా చూడొచ్చు. తత్వం, శాస్త్రం, మతం, మతం విభాగంలో సూత్రాలు, మాత విధానాలు బౌద్ధంతోనే ముడిపడి ఉన్నాయి." అయితే ఒకరి పై ఒకరు ఆధారపడుతూ జీవనాన్ని సాగించాలన్నదే బౌద్ధ తత్వం, మనస్సు, మానవ భావోద్వేగాలతో కూడిన బౌద్ధ శాస్త్రంతో అందరికి ప్రయెజనం కులుగుతుంది అని పేర్కొన్నారు. వివేకానందుడు, మహాత్మగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారెందరికో అయన బోధనలు ఆదర్శం. "బుద్ధుడు ప్రబోధించిన సత్యాలు సర్వకాలికం, సార్వజనీనం అని వివేకానందుడు చెప్పాడు. హింసతో నిండిపోయిన నేటి ప్రపంచానికి అయన వచనాలు ఒక ఊరట."

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate