অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

దాహాగం లక్ష్మీనారాయణ

దాహాగం లక్ష్మీనారాయణ

ఇప్పటి కరీంనగర్ జిల్లాలో మందేనా గ్రామం ఉన్నది. సుమారు నూటయాభయి సంవత్సరాల క్రితం ఆ గ్రామం నుంచి పురోహితుడొకాయన మధ్య రాష్ట్రాలకు ఈదర పోషణార్ధం వలన వెళ్ళాడు. ఇంటిపేరు దాహాగం వారు. పేరు పుల్లయ్య.

కమిటీ పట్నంలో సాధారపడి పౌఓహిత్య వృత్తి చేసుకొని జీవనం చేసేవాడు. అక్కడి పౌరుల మధ్య, ముఖ్యంగా తనలాగే ప్రవాసం వచ్చిన తెలుగువారి మధ్య పలుకుబడి, గౌరవము సంపాదించగలిగారు. సంసారాన్ని చక్కదిద్దుకుని నిలబెట్టుకొనేలోపుగానే పుల్లయ్యగారు అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అప్పటికాయనకు ముగ్గురు కొడుకులు. ఒక కూతురును. అతి ధైర్యసాహసాలతో పుల్లయ్యగారి భార్య, పిల్లలని వృద్ధిలోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో శ్రమించింది. ఆ పట్టణంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి వలన పోయన మరో గృహస్ధునింట వంటపనిలో చేరి పిల్లలిని పోషించటం ప్రారంభించింది. ఆ గృహస్ధు ఒక చిన్న వ్యాపారి. కొంచెం సంపన్నుడు. నిస్సంతు, పరోపకారశీలి. పుల్లయ్యగారి పిల్లలకు చదువుచెప్పించారు. ఆ పిల్లలలో పెద్దవాడు లక్ష్మీనారాయణ చురుకైనవాడు. కుశాగ్రబుద్ధి, చదువుమీదా, ప్రపంచమీదా ద్యాస ఉన్నవాడు. కళాశాలలో విద్యాభ్యాసం కోసం నాగపూర్ వచ్చారు. అక్కడ హిస్లాప్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కోసం ప్రవేశించింది. నాగపూర్ లో చదువుతున్నప్పుడే అక్కడ భారీ ఎత్తున జరిగే మైకా గనుల వ్యాపారాన్ని ప్రత్యక్షముగా చూడటం తతస్ధించింది. అదీకాక తన విద్యార్థిగా ఉన్నప్పడే తనుకు తన కుటుంబానికి సహాయపడుతున్న గృహస్ధు చేసే వ్యాపారంలో అయన కోరికమీద శ్రద్ధ తీసుకుంటుండేవాడు.

ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తిర్ణుడయిన తరువాత తన కుటుంబాన్ని పోషించిన గృహస్ధు చేసే వ్యాపారంలో సహాయం పడేందుకాని విద్యాబ్యాసానికి స్వస్తిచెప్పాడు. మేకను గనుల నుంచి కొనుగోలు ప్రదేశాలకు, బొంబాయి వంటి రేవు స్ధలాలలకు రవాణా చేసే వ్యాపారం బహులాభదాయకంగా ఉందని గ్రహించి ఆ గృహస్ధుని ఆ వ్యాపారాన్ని చేపట్టేట్టు చేశాడు. ఆ మూలకంగా అతడు మరింత సంపన్నుడయినాడు. అతనికి లక్షుమినారాయణగారితో అత్యంత విశ్వసం కుదరడం చేత వ్యాపారపురోగతి ఆయనకే వదిలివేశారు.

లక్షుమినారాయణగారు కాలక్రమంగా మైకగనులను గుత్తకు తీసుకున్నాడు. అప్పటి నుంచి వ్యాపారంలో రాబడిలో వెనుచూపులేదు. లక్షల ఆదాయం ఉండేది. ఇంతలో అకస్మాత్తుగా ఆ గృహస్ధు కనుమూయటం యావద్వ్యాపారాన్ని లక్షుమినారాయణగారికి దత్తం చేయటం జరిగింది.

అప్పటిదాకా మనదేశంలోని ఖనిజసముదాయాన్ని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం కేవలం ఆంగ్లేయులకే పరిమితమైన ఉండేది. అతి సాహసంతో లక్షుమినారాయణ గారు ఎగుమతి వ్యాపారాన్ని చేపట్టి కృతికృత్యులయ్యారు. విద్యాధికులైన ఎంగేయులను తన కింది ఉద్యోగస్ధులుగా చేర్చుకున్నారు. ఖనిజాల్లో ఎగుమతి వ్యాపారం చేపట్టిన ప్రధమ భారతీయుడు లక్ష్మీనారాయణగారిని చెప్పవచ్చును.

మైకా గనుల వైపరంలో ఉన్నపుడు లక్ష్మీనారాయణగారికి మనదేశంలో సాంకేతిక నైపుణ్యం చాల స్వల్పమైనదని గ్రాహ్యమయండి. ప్రతి స్వల్ప సాంకేతిక సమస్య పరిష్కారానికి విదేశీయులనే ఆహ్యానించవలసి వచ్చేది.

లక్ష్మీనారాయణగారు ప్రజాహిత కార్యరంగంలో కూడా ప్రవేశించారు. జిల్లా బోర్డు సభ్యుడిగాను, అనరరీ మేజిస్ర్టేట్ గాను, మధ్య రాష్ట్రాల ఇండస్ట్రయల్ బోర్డు సభ్యుడిగాను, నాగపురం పయనీర్ ఇన్సూరెన్స్ సంస్ధ ఆద్యషుడిగాను వ్యవహరించారు. 1920 లో మధ్యరాష్ట్రాల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1930 లో కేంద్ర శాసనసభలో సభ్యులయ్యారు. రావుబహద్దూర్ అయారు. ఆయనకు ఆంద్రాభిమానం ఆకుమరితం.

1927 లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారన్న వార్తవిని ఆనందభరితుడైనారు. తన యావదాస్తిని ఆ విశ్వవిద్యాలయానికి దానంగా ఇచ్చేయాలని సంకల్పించుకున్నారు.

మదరాసు గవర్నరుకు, విశ్వవిద్యాలయపద్యశాలయిన కట్టమంచి రామలింగారెడ్డి గారికి లేకపూర్వకంగా ధన సహాయాన్ని ప్రకటిస్తూ తనివ్వబోయే ఎలా సద్వినియెగం చెయ్యవలసిందో ఉపాధ్యాక్షలతో సంప్రదించదలకున్నానని రాశారు.

ఈ ప్రతిపాదన మీద రామలింగారెడ్డిగారు తగినంత స్రద్దు తీసుకోకపోగా ఉపేక్ష చేశారు. తనకున్న విద్యాధిక్యతతో లక్ష్మీనారాయణగారిని చిన్నచూపుతో చూశారు. లక్ష్మీనారాయణగారు ఉండబట్టలేక ఆంద్రాభిమానంతో బెజవాడ వచ్చారు. వచ్చేముందు రామలింగారెడ్డిగారికి ఉత్తరం కూడా రాశారు. తీరా లక్ష్మీనారాయణ గారు బెజవాడలో దిగేటప్పటికీ స్టేషనో విశ్వవిద్యాలయం వారి జాడలేదు. అయన మెల్లిగా వెయిటింగ్ రూమ్ లో చేరి విశ్రంతి తీసుకుంటున్నప్పుడెవరో ఒక చిన్న ఉద్యోగి రామలింగారెడ్డిగారి తరపున వచ్చి రామలింగారెడ్డిగారు కార్యాంతరానిమగ్నులై ఉన్నారని, విశ్వవిద్యాలయమన్నది ఇంకా ఏమి బెజవాడలో రూపొందలేదని, అంచేత లక్ష్మీనారాయణ గారు చూడదగ్గదేమి లేదని చెప్పడం జరిగింది. లక్ష్మీనారాయణ నిలువునా కూలిపోయారు. హతాశతో నాగపూరుకు తిరుగురైల్లో వెళ్ళిపోయారు.

తరువాత తన దానధర్మాలన్నీ నాగపురం విశ్వవిద్యాలయానికిచ్చారు. మూప్పయి  అయిదు లక్షల రూపాయలు ఆ విశ్వవిద్యాలయానికి దానం చేశారు. లక్ష్మీనారాయణ ఇంస్టిట్యాట్ అఫ్ టెక్నాలజీ అనే ఉన్నత విద్యాలయాన్ని ఏర్పాటుచేశారు.

నాగపూరు న్యాయశాస్త్ర కళాశాలకు, విశ్వవిద్యాలయానికి, న్యాయస్ధానానికి ఉచితంగా నివేశన స్ధలాలలను దానం చేశారు. తన దానములకంగా ఏర్పడే విద్యాలయం పక్కన ఆంధ్ర విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టల్ ఒకటి ఉండాలని షరతు పెట్టారు. అంద్రాబీమానం చంపుకోలేక ఆంధ్రవిశ్వవిద్యాలయానికి అమూల్యమైన తన పుస్తకభండాగారాన్ని దత్తం చేశారు. దానికోసం మా నాన్నగారు నాగపురం పోయా వారింట్లో బసచేసి పుస్తకాల నన్నింటిని బెజవాడకు తీసుకువచ్చారు.దానికి సవివరణంగా జాబితా తయారుచేశారు. అదే ఆంధ్రవిశ్వవిద్యాలయా ప్రధమ ప్రచురణ. లక్ష్మీనారాయణగారు 1930 లో మరణించారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate