অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

'పరుగుల రాణి' పి.టి. ఉష

'పరుగుల రాణి' పి.టి. ఉష

అది 1986 వ సంవత్సరం సెప్టెంబరు నెల. సోల్ నగరంలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. అక్కడ ఆ క్రీడల్ని చూట్టానికి వచ్చిన జనం డెబ్బయి అయిదు వేల వరకు ఉంటారు. స్త్రీల పరుగు పందాలు ప్రాంరంభించారు. అందులో ఒక అమ్మాయి వేగం అందర్నీ ఆకర్షించింది. అది 200 మీటర్ల పరుగు. అందరికన్నా ముందు అతివేగం పరుగెత్తే ఆమెను అంతా ఆశ్చర్యంగా, కనురెప్పలు వాల్చకుండా చూస్తున్నారు. అందర్నీ వెనకవేసి ఆమె గమ్యం చేరింది. బంగారు పథకం ఆమెకే! చూచేవాళ్ళు ఆనందంతో ఎంతసేపు చప్పట్లు కొట్టారో! ఎంతగా అచినందించారో! అక్కడే వెంటనే 400 మీటర్ల పరుగు, 400 మీటర్ల హర్డిల్స్ పరుగు, 400 మీటర్ల రిలే పరుగు జరుగుతున్నాయి. వాటితోను ఆమెదే ముందడుగు. ఈ నాలుగు బంగారు పథకాలు ఆమెకే! అవసింహంతలో నూరు మీటర్ల పరుగు చేజారింది. దీన్లో వెండి పథకం లభించింది. ఇలా ఒకేసారి ఐదు పతకాలు గెలిచి ఖండంతర కీర్తిని సాధించిన ఈ పరుగుల రాణి ఎవరు? మన భారత దేశానికే కీర్తి కిరీటాన్ని సాధించిన పి.టి.ఉష.

మన దేశపు పశ్చిమ తీరంలో కేరళ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం పచ్చటి టెంకాయ తోటలతో, పొలాలతో అందంగా ఉంటుంది. ఆ అందాల కేరళ రాష్ట్రంలో 'పాయెలీ' ఒక చక్కటి పల్లెటూరు. ఆ ఊర్లో ఇ.పి.మన్నన్ పైధాల్, అతని భార్య లక్ష్మిమ్మ ఉండేవాళ్ళు. వాళ్ళు సామాన్య కుటుంబీకులు. వాళ్ళు కొక చిన్న గుద్దల అంగడి. అదే వాళ్ళ జీవనం. వాళ్ళముద్దుల కూతురే పిలుపుళ్ళకండి తెక్కెవరంబిల్ ఉష, సంశిప్తంగా చెప్తే పి.టి.ఉష.

1964 వ సంవత్సరం మే నెల 20 వ తేదీన లక్ష్మిమ్మ కూతలు గ్రామంలో ఒక బిడ్డను కన్నది. అప్పుడు లక్ష్మిమ్మ తండ్రి 'కెలప్పన్' మలయాళంలో ప్రసిద్ధమైన 'అనిరుద్ధా చరిత్ర' చదవుతూవున్నాడు. ఆ కాప్యంలో నాయకురాలి పేరు 'ఉష'. అందుకని కెలప్పన్ తన ముద్దలా మానవరకుకి 'ఉష' అనే పేరు పెట్టాడు. ఉష, కిరణాల లాగా ఆమె పేరు కూడా క్రమంగా ఆ గ్రామం నుంచి కేరళ రాష్ట్రానికి, భారత దేశానికి, ఇతర ఖండాలకు కూడా వ్యాపించింది.

పిల్లల పైన పరిసరాల ప్రభావం ఉంటుంది. ఉషకు తాత కెలప్పన్ అంటే చాలా ఇష్టం. ఎందుకవి? కెలప్పన్ మంచి పండితుడు. తన చిన్నారి మనవరాలికి తియ్య తియ్యని, కమ్మ కమ్మని కధలు చెప్పేవాడు. మంచి మంచి పాటలు, పద్యాలు చదివి వినిపించేవాడు. భారత వీరులు కధలు వివరించేవాడు. మన సంస్కృతిని గురించి చెప్పేవాడు. ఇలా అయన అనేక అంశాలను ఆమెకు ఉగ్గుపాలతోనే రంగరించి పోశాడు. అందువలన ఆమెకు అప్పటినుంచే 'తనుకూడా పెద్దయి, ఏవైనా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోతవాలి' అనే కోరిక కలిగింది. దీనికి ప్రేరణ కెలప్పన్ ఇచ్చాడు. చూశారా, బాల ఉష తాను విన్నవాటిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కోరిక కోరిందో! అంతేనా? ఆ కోరిక నెరవేరడానికి ఎంతో కృషి చేసింది! చివరికి ఆ కోరికను సాధించింది. ఇదే గొప్ప వాళ్ళ లక్షణం.

ఆమె చక్కగా బడికి వెళ్ళేది. బడిలో చెప్పినవారిని శ్రద్దగా వినేది. చక్కగా చదువుకొనేది. ఆమె నినయం, విధేయతలు ఉపాధ్యాయులకు, తోటివాళ్ళకు కూడా నచ్చాయి. అందుకే అంతా ఆమెతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఆమె అజాత శత్రువు. చదువులో ఎప్పుడు ముందుండేది. ఇలా క్రమంగా నాలుగో తరగతికి వచ్చింది.

ఈ బడిలో వ్యాయమ విద్యకు బాలకృష్ణన్ అనే ఒక మంచి ఉపాద్యాయుడుండేవాడు. అయన స్వయంగా ఆటల్లో పాల్గొంటూ, తన విద్యార్థుల్లో పోటీలు పెట్టి వాళ్ళల్లో వ్యాయమ విద్యాపట్ట, క్రీడల పట్ల ఆసక్తిని కలిగించేవాడు. అయన ప్రోత్సాహంవల్ల ఆ పాఠశాల విద్యార్థులు ఇరుగు పొరుగు పాఠశాలలతో పోటీపడి నెగ్గేవాళ్ళు. ఒక రోజు ఒక వింత జరిగింది. అది ఒక సాయంకాలం. పిల్లల అట మైదానంలో ఆడుకొంటున్నారు. ఒకచోట కొంతమంది అమ్మాయిలో దాగుడు మూతలా ఆడుతున్నారు. బాలకృష్ణన్ మాష్టరు ఆడేవాళ్ళల్లో ఒక సన్నని చిన్న అమ్మాయి వేరుపులాగా పేరుగెడుతుంది. మిగిలినవాళ్లకు చిక్కడం లేదు. అయన అలానే కొద్దిసేపు పరిశింది చూశాడు. కళ్ళు ఇంతవి చేసి చూశాడు. నిజమే ఆ చిన్న పిల్ల జింకలాగా పరుగెడుతోంది. ఆమె కళ్ళలో విద్యుత్తు ఉందా? లేకపోతే అంతా వేగమా! ఆనందంతో అయన ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి - 'ఇదుగో ఓ చిన్నా! నీ పేరేంటి?' అని అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గుతో తలవంచి మెల్లగా 'ఉష' అంటూ వేగంగా జారుకొండి. ఐనా ఆమె పరుగువేగం మాత్రం అయన మనసులోనే నిలిచింది. మరుసటి రోజు ఆ మాష్టరు ఆ పాఠశాల పరుగులో ఛాంపియన్ ఐనా సరాలను పిలిపించాడు. ఉషను కూడా పిలిపించాడు. అప్పుడు ఉష వయసు 10 సం.ల. ఆమె చదివేది 4 వ తరగతి. మరి సరళ వయసు 13 సం.లు. ఆమె ఏడో తరగతి. ఆ ఇద్దర్ని పరిగెత్తిమ్చాడు. పరుగుల ఛాంపియన్ సరాలకన్నా ఉష వేగంగా పరుగుతీసింది. ఒకరికి ముడేసార్లు పరిశించిన- ఫలితం మాత్రం అదే. ఐనా ఆయనకు అది నమ్మబుద్ది కాలేదు. మరుసటిరోజు  కూడా అదే పోటీ. అదే ఫలితం. ఆ మాష్టరు ఆనందానికి అవధులు లేవు. ఔను తాను ఒక నూతన ఛాంపియన్ కు గుర్తించాడు గదా! విద్యార్థుల ప్రతిభను గుర్తించి,  మెరుగులు దిద్ది, వాళ్ళ కీర్తి పథకాలను చూస్తే ఏ ఉపాధ్యాయాడు ఆనందించాడు? ఇలా బాలకృష్ణన్ జాతీయ, అంతర్జాతీయ కీర్తి గడించిన ఒక 'పరుగుల బాలను' గుర్తించాడన్న మాట.

సామాన్యంగా ప్రాధిమిక, మాధ్యమిక పాఠశాలల్లో వ్యాయమ విద్యకు అంతగా గుర్తింపు లేదు. తల్లిదండ్రులు కూడా - పిల్లల అట పాలల్లో పడి సరిగా చదివారని - ఆటలకు వాళ్ళ పల్లెల్ని ప్రోత్సహించారు. అందులో ఆడపిల్లల్ని బొత్తిగా క్రీడలవైపుకే వాళ్ళనివ్వరు గాద! కానీ బాలకృష్ణన్ ప్రోత్సాహంవల్ల ఉష పాఠశాలలో రోజు పరుగు "ప్రాక్టీసు" చేస్తుండేది. ఒక్క పరుగే కాదు, దూరం దూకడం, ఎత్తుకు ఎగరడంలో కూడా. ఆమె పట్టుదల, అలుపులేని ప్రాక్టీసు, సాధించే వేగం అన్ని ఆయనకు మచ్చటగొలిపేవి. 1975 సం.లో జిల్లా స్ధాయిలో పాటశాలలకు ఆటలా పోటీలు జరిగాయి. ఆమె ఆ పోటీల్లో కాలికి గాయం చేసికొంది. గాయం బాధపెడుతున్న, ఆ భాధను దిగంరింగి, పోటీల్లో పాల్గొన్న ధిఆర్యం ఆమెది. ఆమె కృషి ఫలించి జిల్లా స్ధాయిల్లో రెండు పరుగు పండల్లోనూ, ఎత్తు ఎగరడం, దూరం దువ్వకంలోనూ మొత్తం నాలుగు ప్రధమ స్ధానాలు సాధించింది. అప్పుడు ఆమె అనందం ఎంతని! ఇలాల చాల చిన్నా వయసులోనే జిల్లాస్ధాయికి ఎదిగింది. దీనినే 'పిట్టకొంచెం కూత ఘానం' అంటారు.

ఆమె ప్రతిభకు ఆ పాఠశాల చాలలేదు. ఆమెకు మరింత మెరుగైన తఱిప్షిడు కావాలి. ఎలాగా! అప్పుడు కన్ననూర్ లో 'స్పోర్ట్స్ డివిజన్'ను స్ధాపించారు. అక్కడ విద్యార్ధులకి క్రీడల్లో తర్పీదు (శిక్షణ) ఇస్తారు. ప్రభుత్వం అందుకు మంచి కోచ్ లను నియమిస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇది గమనించిన బాలకృష్ణన్ ఆమెన్ కన్ననూర్ పంపమని మన్నన్ పెదాల్ని ఒత్తిడి చేశాడు. మన్నన్ ఆదాయం తక్కువ. ఆమెను పొరుగూరికి పంపి చదివించడం ఖర్చుతో కూడింది. అందునా ఆటలా కోసమా? ఆయనకు ఇష్టంలేదు. ఐతే ఉపాధ్యాయాలు ఆయనకు నచ్చజెప్పారు. చివరికి  అయన 'సరే' నన్నాడు.

'స్పార్ష్ కౌన్సిల్' లో చేరడానికి పరీక్షలు, పోటీలో ఉంటాయి. ఉష అన్నింటిని జయప్రదంగా పూర్తిచేసింది.  అందులో ప్రవేశాన్ని పొందింది. ఈ ప్రవేశం ఆమె జీవితాన్నే మార్చివేసింది. భారతదేశానికే పేరు తెచ్చిన గొప్ప క్రీడాకారణిని తయారుచేసింది.

ఉషకు శాస్త్రీయమైన శిక్షణ ఇక్కడి నుంచే ప్రారంభం అయంది. కొద్దీ రోజులు ఆమె మిగిలిన విద్యార్థుల్లానే ఉండింది. క్రమంగా అక్కడ ఉన్న కోచ్ మాధవన్ నంబియార్ ఈమె ప్రతిభను గుర్తించాడు. ఈయన గొప్ప క్రీడాకారుడు. శిక్షన ఇవ్వడంలో మంచి అనుభవ మున్నవాడు. మంచి క్రమశిక్షణ గలవాడు. మాధవన్ నంబియార్ ఉషకు ప్రత్యేక శిక్షణనిచ్చాడు. ఆమె అయన సూచనల్ని పాటించేది. ఆమెకు ఆ గురువు పై గురి కుదిరింది. అయన మార్గదర్శకర్వంలో ప్రాక్టీసుచేసి వేగాన్ని బాగా పెంచుకొంది. పాయెలీ లో ముడి వజ్రంలా గున్న ఆమె ఇప్పుడు సనాబత్తిన వజ్రంలా అయంది. నంబియార్ కు కూడా ఆమె ఇప్పుడు సనాబత్తిన వజ్రంలా అయంది. నంబియార్ కు కూడా గిరి కుదిరింది. ఈమె ఎప్పటికయినా జాతీయ స్ధాయికి వస్తుందనే దృఢ విశ్వసం ఏర్పడింది. ఆ గురు శిస్యుల నిరంతర కృషి ఫిలించింది.

1977 వ సం.లో. కేరళ రాష్ట్ర స్ధాయిలో జరిగిన పోటీల్లో ఉష బంగారు పతకం గెలిచింది. అదే సంవత్సరం డిశంబరులో నూరు మీటర్ల పరుగులో ఆమె జాతీయ స్ధాపించి, రాష్ట్రస్ధాయి నుంచి జాతీయ స్ధాయికి ఎదిగింది. జూనియర్ వయసులో ఉన్న ఉష సీనియర్లతో పోటీపడి పాత రికార్డుని బద్దులుకొట్టింది. ఆ విజయాన్ని మలయాళ పత్రిక 'మాతృభామి' మిక్కిలిగా మెచ్చకొంది. ఉష ఫొటోను ప్రచురించింది. ఆలా ఆమె ఎంతో మందికి పరిచయం అయంది. పాయెలీ గ్రామంలో ఒక బాల క్రీడాకారిణి జాతీయ క్రీడా నక్షత్రంగా మేలుగుతోంది. ఇలా కేరళ క్రికరంగంలో వెలుగుతోన్న ఉష కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆమె విజయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

అది 1978 వ సంవత్సరం మర్చి నెల 11 వ తేదీ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొందరు క్రీడాకారుల్ని సత్కరిస్తుంతోంది. వయసులో అందరికన్నా చిన్నదైనా ఉష కూడా ఆ సత్కారానికి వచ్చింది. బహుమతి ప్రదానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు. పెద్ద జనసందోహం. అంతా పెద్ద సభలో బెరుకు బెరుకుగా వచ్చి ఉష ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతిని అందుకొంది. సభలో జనం చప్పట్లతో అభినందిస్తున్నరు. అప్పుడు ఆమె పొందిన అనందం అంతులేనిది. ఆమె గురువులు, తల్లిదండ్రులు కూడా ఎంతగా ఆనందించారో! తల్లిదండ్రులకి అనందం అందించడంకన్నా గొప్పేముంది.

ఒక అప్పటినుంచి ఉష తన ద్యాస అంతా క్రీడల పైనే ఉంచింది. 1979 సం.లో. హైదరాబాదు నగరంలో జరిగిన జాతీయ క్రీడలకు ఆమె కూడా హాజరైంది. అప్పుడు 100 మీటర్ల దూరాన్ని 12.9 సెకండ్లలో పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తియండి. అప్పుడు ఆ క్రీడల్లో ప్రధానతర ఉషే, అందరి చర్చనీయాంశం ఉషే! ఎవరికీ అర్ధరకానిది ఆమె వేగమే.

1980 సం.లో. 'మాస్కో' నగరం ఒలంపిక్స్ కు రంగస్ధలం. మన దేశం నుండి చాల మంది క్రీడాకారులు మాస్కోకు వెళ్ళారు. వాళ్ళందరిలోకి అల్ప వయస్సురాలు ఎషే. అంతర్జాతీయ స్ధాయిలో జరిగిన ఈ ఒలంపిక్స్ ఆమెకు ఒక అవకాశాన్ని, మంచి అనుభవాల్ని ఇచ్చాయి. క్రమంగా ఈ అనుభవాలు భవిష్యత్తుకు పునాదులైనాయి.

1980 మార్చిలో కరాచీలో క్రీడలు. అక్కడికి రమ్మని ఉషకు ఆహ్వానం వచ్చింది. ఈ అవకాశం పోగొట్టుకోగూడదని ఆమె తలచింది. ఐతే క్రసీకి పోను - రాను ఖర్చులు. తండ్రి అంతా డబ్బు ఇవ్వలేదు. ఆమె చాలా మాధానపడింది. ఒక దశలో ఆ ఆశ కూడా వదులుకొంది. ఐనా పట్టదలగల వాళ్ళకి అదృష్టం కూడా కలిసిస్తుంది.

'కేధమాంలిక్ సిరియన్ బ్యాంక్' వాళ్ళు ఆ ఖర్చులు ఇచ్చారు. ఆ డబ్బును అతి జాగ్రత్తగా వాడుకొంటూ కరాచీ ట్రిప్పు ముగించింది.

భారతదేశపు క్రీడల్లో 1982 వ సంవత్సరం సువర్ణాక్షరాల్తో రాయదగింది. ఆసియా ఖండానికి చెందిన పలుదేశాల్లో ఆటలా పోటీలకు మన దేశం వచ్చాయి. ఆ సంవత్సరపు ఆసియా క్రోదాల్ని మన జారిపోయిం. భారతదేశపు క్రిందకిరీటంలో ఇదొక కలికితురాయి. దేశ దేశాల క్రికాభిమానులతో ఢిల్లీ నగరం కిలకిటలాడింది. ఇందుకు ప్రత్యేకంగా క్రిడాస్ధలాల్ని, స్టేడియాల్ని రూపొందించారు. పలుదేశస్థులకు తగినన్ని వసతులు, వంటకాలు సమకూర్చారు. ఆ క్రీడల్లో అనేక జాతులవాళ్ళు కలిసి, ఒకే కుటుంబంగా కలిసిమెలిసి తిరిగారు. భాష, ప్రాంతం, దేశం వేరైనా మానవులంతా ఒకటే అనే భావం అంతటా కనిపించింది. ఆ క్రీడా స్ధలాలు మానవ సముద్రంగా మారాయి. ఢిల్లీ నగరం క్రీడాకారులతో కళకళలాడింది. ఈ పోటీలో నిజంగా ఉషకు ఒక (ఛాలెంజ్) సవాలు. ఏం దురదృష్టమేగాని ఒక్కడా ఉష పరుగు ప్రారంభంలో కొద్దిగా తబ్బిబ్బు అయంది. అమ్దువలన నూరు మీటర్లు పరుగులో రెండో స్ధానంలో ఉండిపోయంది. 200 మీటర్ల పరుగులో మొదటి నుంచి ఉష అందరికన్నా ముందే ఉంది. అందరి కళ్ళు ఆమె పైనే. భారతీయులైతే మిక్కిలి ఉతకంతతో చూస్తున్నారు. గెలుపు ఉషదే అని అనుకొంటున్నారు. ఇంకో ఇరవై మీటర్లలో గమ్యం. చిత్రం! అంతవరకు ఉష వెనుకే పరుగెత్తుతున్న జపాన్ అమ్మాయి, ఒక్కసారిగా మెరుపులాగా ముందుకు దూసుకువెల్లింది. గమ్యం చేరనే చేరింది. అంతవరకు ముందున్న ఉషకు నేఁట్రుకవాసిలో ప్రధమ స్ధానం జారిపోయంది, ఆమె రెండో స్ధానంలోనే ఉండిపోవలసి వచ్చింది. అప్పుడు జపాన్ అమ్మాయికి బంగారు పతకం, ఉషకు వెండి పతకం ఇచ్చారు. ఆ వెండి పతకం అందుకొంటున్న ఉషకు కన్నీళ్ళపర్యంతం అయంది. ఔను మరి! ఆమె ఆశలు అడియానాలైనాయి. ఆమె ఇంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.

పి.టి.ఉష మూడుసార్లు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొంది. ఆసియా ఖండ స్ధాయిలో జరిగిన ఏడు పోటీల్లో పాల్గొంది. ఇవిగాక మరెన్నో! మొత్తం మీద మన దేశానికి 56 సార్లు ప్రాతినిధ్యం వహించంది. 55 పతకాలు గెలుచుకొంది. కొన్ని క్రీడల్లో ఒదిన, అధైర్యపడలేదు. ఓటమి గెలుపుకు సోపానం అని మరింత శ్రమించేది. ఇందుకు ఆమె తల్లిదండ్రుకు, కోచ్ నంభియారా, ఆమె అభిమానులు ఆమెకు ఇచ్చిన ప్రోద్బలమే కారణం.

ఆమె మిత భాషిణి. వినయ విధేయతలు ఆమెకు పెట్టని ఆభరణాలు తల్లిదండ్రుల్ని, గురువుల్ని అమితంగా గౌరవిస్తుంది. మిత్రులతో మిక్కిలి స్నేహంగా ఉంటుంది. షైనీ విల్సన్, వలసమ్మ, అశ్విని వచప్ప వంటి క్రీడాకారిణుల్లో ఆమె స్నేహంగా ఉండేది. ఆమెకు సంగీతం, తోటపని అంటే ఇష్టం. పూలబాల్, బలిబాల్, టెన్నిస్ వంటి క్రీడల్లో కూడా ప్రవేశముంది. ఆమెలో పట్టుదల, క్షమించి పనిచెయ్యడం, లాశయాలను చేరడానికి నిరంతర కృషి, అంకితభావం అధికం. విజయం సాధించాలనేదే ఆమె తపన.  అదే ఆమె దీక్ష. పాయెలీ గ్రామంలో పెరిగి, మంచి రైలు వేగంతో పరుగెత్తే ఆమెను 'పాయెలీ ఎక్స్ ప్రెస్' అంటారు. ఇలా ఇలా క్రమంగా ఆమె తన తల్లిదండ్రలు, గురువులు గర్వపడేటట్లుగా తన గ్రామం, రాష్ట్రం, మొత్తం దేశానికే గర్వకారణంగా కీర్తిని తెచ్చింది. మన జాతీయ పథకాన్ని దేశదేశాల్లో రెపరెపలాడించింది. ఆమె జీవితం ధన్యం.

ఆటల్లో, పోటీలో మునిగి తేలుతున్న ఆమె పొందిన బహుమానాలు, సత్కారాలు ఎన్నో! సోల్ క్రోదాల్లో ఆమె ఇరిజాదు పతకాలు గెలిచింది. ఆమెకు ఢిల్లీలో గొప్ప స్వాగతం లభించింది. అది అపూర్వం. ఎందరో క్రీడాభిమానులు విమానాశ్రయాన్ని జేజే ధ్వనులతో మార్మోగించారు. అప్పటి మన రాష్ట్రపతి ఆమెను ప్రత్యకే అతిధిగా గుర్తించి విందు ఇచ్చారు. నాటి మన ప్రధాని రాజీవ్ గాంధీ ఆమెను మెచ్చుకొని నిందు ఏర్పాటుచేశారు. కేరళ ముఖ్యమంత్రి ఆమెకు మంచి కారు, ఇల్లు, ఇచ్చారు.

ఆమెకు మన కేంద్ర ప్రభుత్వం ఘానంగా సత్కరించింది. 1983 సంవత్సరంలో ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున్ అవార్డు ఇచ్చింది. 1985 సంవత్సరంలో ఉషను గొప్పవాళ్ళ సరసన చేర్చి 'పద్మశ్రీ' బిరుదునికిచ్చింది. ఉషను గౌరవించడమంటే మనల్ని మనమే గౌరవించుకోవడం అన్నమాట.

ఉషను ఎంత గుర్తింపు ఉందొ ఒక చిన్న సంఘాతన చూస్తే తెలుస్తుంది.

ఒక విదేశీయుడు పి.టి.ఉషకు అభిమాని అయినాడు. అయన ఆమెను అభినందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఐతే చిరునామా మాత్రం పి.టి.ఉష, ఇండియా అని రాశాడు. ఇండియా అంటే చిన్న దేశమా! ఐతే ఆ ఉత్తరం నేరుగా కేరళ రాష్ట్రలో ఉన్న ఉషకు మామూలుగానే చేరింది. దీన్నిబట్టి ఏం గమనించారు? 'ఉష' అంతే భారతదేశంలో అంతా ప్రసిద్ధి అన్నమాట!

పూలవల్ల దారానికి కూడా వాసనా వస్తుంది గదా! అలానే శిష్యులవలన గురువులకు సైతం గుర్తింపు వస్తుంది. మాధవన్ నంబియార్ ఉషకు ఇచ్చిన శిక్షణకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను కూడా సత్కరించింది. ముఖ్యంగా 'ద్రోణాచార్య' బిరుదు నివ్వడం ద్వారా ఈ సత్కారం జరిగింది. ఇలా గురువులకు తెచ్చే శిష్యులు లభించడం ఉపాధ్యాయుల పుణ్యం కదా.

1991 సంవత్సరం ఆమె జీవితంలో చాలా ప్రధానమైంది. ఆ సంవత్సరం మార్చి నెలలో ఉషకు ఆమె తల్లి దండ్రులు పెళ్లిచూపులు ఈపాటుచేశారు. వరుడు కూడా క్రీడాకారుడే. కేంద్ర పారిశ్రామిక భద్రత విభాగంలో సర్కిల్ ఇన్స్ స్పెక్టర్. పేరు శ్రీనివాస్.

ఉష, శ్రీనివాస్ ఒకరికి ఒకరు నచ్చారు. పెద్దలు ఆశీర్వదించారు. అదే సంవత్సరం కేరళలోని 'గురువాయూర్' ఆలయంలో సంప్రదాయం ప్రకారం వాళ్ళ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఆటలా పోటీలకు దూరంగా ఉండసాగింది. ఆమె భక్తుకుడా క్రీడాసక్తిగలవ్డ్. అందువలన ఆమెను ప్రత్సాహిస్తూనే ఉన్నాడు.

ఆ దంపతులకు 1992 లో 'ఉజ్వర్' అనే అబ్బాయి పుట్టాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అబ్బాయి ఆటలు చూస్తూ ఉష తన పూర్వ జీవితాన్ని ఙాపకం చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఆమె క్రీడాజగత్తునుండి పూర్తిగా రిటైర్ కావడంలేదు. తిరిగి జాతీయ, అంతర్జాతీయ స్ధాయిల్లో పరుగు పదాల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతోంది. ఆమె ఆశయం ఫలించాలని ఆశిద్దాం.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate