অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భగత్ సింగ్

భగత్ సింగ్

భగత్ సింగ్ జననం 1907 సెప్టెంబరు 22. తండ్రి పేరు కిషన్ సింగ్, తల్లి పేరు విద్యావతి దేవి. వీరి కుటుంబమంతా విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నదే. తండ్రి పోలీసుల నుండి తప్పించుకొని నేపాలు వెళ్లాడు. పిన తండ్రులు అజిత్ సింగ్, సువర్ణ సింగ్ లు కూడా విప్లవ కార్యకలాపాలలో పాల్గొని జైలుకు వెళ్ళినవారు. ఈయన పుట్టినరోజుననే వీరిద్దరూ విడుదలైనారు.

భగత్ సింగ్ డి.ఎ.వి పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. నేషనల్ కాలేజీలో చేరాడు. ఇచ్చట ఆయనకు క్రంతికారులతో పరిచయమైంది. ఇంట్లో వారంతా ఆయనకు వివాహం చేద్దామని చూశాడు. అయన పారిపోయి, ఢిల్లీలోని అర్జున్ పత్రికలో పనిచేయసాగాడు. అక్కడి నుండి కాన్పూరు వెళ్ళిపోయాడు. ప్రతాప్ అనే దినపత్రికలో బలవంత సింగ్ అనే పేరుతో పనిచేయసాగాడు.

ఈయనకు తల్లి యెడల అమితమైన ప్రేమ. క్రమంగా విప్లవ కార్యకలాపాలలో తీవ్రంగా పనిచేయ మెడలు పెట్టాడు. పంజాబులోని పేరెన్నికగన్న విప్లవవీరులలో ఒకరుగా ఈయన ప్రసిద్ధిగాంచాడు. లహురులో 1928 అక్టోబరులో సైమను కమిషన్ కు వ్యతిరేకంగా లాలాలజపతిరాయ్ పెద్ద ఉద్యమం లేవదీశాడు. లారీ చార్జలో లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి, మరణించాడు. దీనికి ప్రతీకారం చేయదలిచాడు. భగత్ సింగ్, లారీఛార్జ చేసిన డి.ఎన్.పి. సాండర్స్ ను లాలాజీ ప్రధమ మాసికం రోజుననే భగత్ సింగ్, ఆజాద్, రాజగురులు కలిసి పోలీసు స్టేషన్ వద్ద కాల్చి చంపారు.

పార్లమెంటు భవనంలో భగత్ సింగ్, బతుకేశ్వరదత్త, సుఖదేవు, రాజగురు మున్నగు విప్లవకారులు 1929 ఏప్రిల్ 8 న బాంబులు విసిరారు. "వందేమాతరం" "విప్లపవం వార్ధల్లాలి" అంటూ నినాదాలు చేసి నిర్బంధింపబడ్డారు.

కకోరి కుట్ర కేసులో భగత్ సింగ్ ఆజాద్ వెంట ఉన్నాడు. విప్లవ వీరుల సంఘాలనా కార్యంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లు జంటగా పనిచేశారు.

1930 మార్చి 23 న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు ఉరిశిక్ష విధించారు. చిరునవ్వుతో పోటీపడుతూ ఆ ముగ్గురు ఉరికంబాలెక్కారు. వారు తమ బలిదానంతో భారత ఇతిహాసంలో అమరులయ్యారు. భారత స్వాతంత్య్రా సౌధానికి పునాది శిలలయ్యారు. విప్లవ కార్యానికి తమ ఆహుతి ద్వారా ప్రాణం పోశారు. విప్లవ జ్వాలా అనగరలేదు. రగులుతానే యండనిపించారు. వారు జీవితం ధన్యమైంది.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate