অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 -1959)

భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 -1959)

బాలలూ! ప్రపంచంలో అన్నిటి కన్నా సులువైన పనులు రెండున్నాయి. మొదటిది వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టడం, రెండవది ఇతరులను విమర్షించడం, కానీ ఈ రెండు పనులు మనిషికి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇవి సంతోషంగా ఉన్న మనిషిని సమస్యలలో పడవేయగలవు. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టి, పొదుపు చేయటం వేర్చుకున్న వారు జీవితంలో ఎంతో సుఖపడగలరు. తమ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు నివ్వగలరు. అలాగే నాలుకను అదుపులో ఉంచుకున్నవాడు లోకాన్ని జయంచగలడు. ఈ 'పొదుపు - అదుపు' అనే విషయాలను ప్రజలకు బోధించి వారికి ఒక క్రమ జీవితాన్ని అలవాటు చేసిన మహాపురుషులలో వారిలో మన తెలుగు వారైనా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఒకరు.

పొదుపు గురించి ఉద్భోదించి, డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా పొదుపు చేసేలా చేసి, ఆంధ్ర బ్యాంకును స్ధాపించి ఎందరికో ఎన్నో రకాలుగా సహాయం చేసిన మహావ్యక్తి అయన. మహాత్మగాంధీ, నెహ్రు, వల్లభాయి పటేల్ వంటి మహానాయకులు కూడా పట్టాభి గారి పొదుపు ఉద్యమం గురించి ప్రముఖంగా చర్చించుకునేవారు.

భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు 1880 నవంబరు 24 వ గుండుగొలను అనే గ్రామంలో జనమించారు. వారిది పేద కుటుంబం. తండ్రి కారణంగా పనిచేసేవారు. నాయనకు వచ్చే ఆరు రూపాలయ జీతంతో గుట్టుగా కాపురం చేసేవారు. తన ఆదాయంలో రూపాయే, అర్ధరూపాయే మిగిల్చేవారు కూడా. పంతులు చిన్నతనంలో తల్లిదండ్రులను ఏనాడూ డబ్బుకి పీడించలేదు. అవి కావాలని, ఇవి కావాలని సతయంచలేదు. ఇంటిలోని పరిస్ధితులు గమనిస్తూ, వాటికీ తగ్గట్టుగా మసలుకునేవాడు. తండ్రితో పాటు బజారుకి వెళ్లి వస్తువులు కొన్నప్పుడు తండ్రి వాటిని మేయడానికి కూలీని పిలిచినప్పుడు పంతులు ఆయనను వారించి, ఆ  సమానును థానే మేసి ఆ కూలి డబ్బులు మిగిల్చేవాడు. చివరకు ఇంట్లో వంటకు కావలసిన కట్టెలను కూడా నెత్తిమీద పెట్టుకుని తెచ్చేవాడు. ఒకసారి తోటి విద్యార్థి ఆలా చూసి గేలి చేసినప్పుడు "నేను నా ఇంటి పనులు చేసుకోటానికి సిగ్గుపడను. అనవసరంగా భేషజాలకు పోయి డబ్బు వృధా చేయను, మీరు నవ్వినందువలన కాకేం నష్టంలేదు" అన్నాడు.

పంతులుగారు ఏలూరులో హైస్కూలు విద్య ముగించి బందరునోబుల్ కళాశాలలో చేరారు. ఆ సమయంలో ప్రఖ్యాత విద్యావేత్త, సంఘా సంస్కర్త, బ్రహ్మ సమాజ సభ్యుడు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు ఆ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరరుగా ఉండేవారు. అచిరకాలంలోనే పంతులుగారు ఆయనకు సన్నిహితుడయ్యాడు. అయన అడుగుజాడలలో నడుస్తూ, మంచి పేరు తెచ్చుకుని డిగ్రీ పూర్తిచేశారు. తరువాత మద్రాసులో వైద్యం చదివి బందరులో ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పటికే దేశంలో స్వదేశీ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంది. భారతమంతా పిలుపు నందుకాని, పంతులుగారు కూడా స్వాతంత్య్రా సమరంలో పాల్గొని అనేక ఉద్యమాలు నడిపి, మహాత్మ గాంధీ వంటి నాయకుల ప్రశంసలు పొందారు. ఆ సమయంలోనే "కాంగ్రెసు చరిత్ర" అనే మహాగ్రంధాన్ని రాశారు.

పంతులుగారికి ఆర్ధిక ఇబ్బందులు తొలిగిన కూడా అయన తన 'పొదుపు ఉద్యమం' విడనాడలేదు. ఆయనకు స్నేహితుల నుంచి వచ్చిన ఉత్తరాల కవర్లను చింపి, వాటిలోపలై భాగంలో తాను చేయవలసిన పనులు రాసుకునేవారు. 'కాంగ్రెసు చరిత్ర' కు సంబంధించిన ఎక్కువ అధ్యయాలు అయన వాటిమీదే రాశారు. బట్టల విషయంలో కూడా ఎంతో పొదుపుగా ఉండేవారు. ధోతి తిరిగితే లుంగిగాను, అది చిరిగితే తువ్వాలుగాను, అది కూడా చిరిగితే రుమాల్లగాను  వాడేవారు.  అవి చిరిగినప్పుడు వాటిని లాంతర్లు తుడిచేందుకు ఉపయెగించేవారు.

ఒకసారి పంతులుగారు ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా ఎదురుగా ఉన్న ఇంట్లోని సోదరులు గట్టిగ మాట్లాడుకోవటం వినిపించింది. వారి వద్దనున్న డబ్బును దాచుకునేందుకు సరైన ప్రదేశం లేకపోవటంవలన తగాదా మెదలయ్యేముదితా అంతే! పంతులుగారు వారి డబ్బును తన వద్ద దాచడానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. వారి పేరున అకాయంట్లు ప్రారంభించి వారు జమ ఖర్చులు వేస్తుండేవారు. ఆలా అరుగుమీద స్ధాపించబడిన బ్యాంకుకి నేను భారతదేశంలో మొత్తం వేయి బ్రంచిలున్నాయి. అదే మన ఆంధ్రాబ్యాంకు.

పట్టాభిగారు ఆంధ్ర బాంకుతో పాటు కృష్ణ కోపరేటివ్ బ్యాంకు, ఆంధ్ర ఇన్నురెంను కంపెనీలు కూడా స్ధాపించారు. ఒకసారి ఒక నాయకుడు పట్టాభిగారితో "పొదుపు పొదుపు అంటూ మీరు ఊరికే పదిసార్లు ఎందుకు చెప్పారు. ఉన్నవాడు ఖర్చు పెట్టుకుంటే మీకేం పోయండి?" అని అడిగాడు. దానికి తీర్చుకుంటూపోతే కొండలోన కరగకమానవు. భోగాలకు పరిమితి లేదు. అంత అయిపోయిన తరువాత పశ్చాత్తపడి లాభంలేదు. మనకన్నా ఎక్కువగా ఉన్నవారిని చూసి వారిలా ఖర్చు పెట్టడం నేర్చుకోవటంకన్నా, మనకన్నా తక్కువ ఆదాయం వచ్చే వారిని చూసి వారిలా పొదుపు చేర్చుకుంటే జీవితంలో ఎంతో శాంతి ఉంటుంది. తృప్తి కలుగుతుంది. ఆలా పొదుపు చెయ్యటవమువలన భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు అన్నారు. పంతులుగారి దృష్టిలో పొదుపు అంతే కడుపు మాడ్చుకుని, జీవితాన్ని కుదించుకోమని కాదు. మీకు వచినదంతలో కనీసం నాలుగోవంతు పొదుపు చేసి, కాధించుకోమని కాదు. మీకు వచ్చినదాంట్లో కనీసం నాలుగోవంతు పొదుపు చేసి, ఖర్చులను అదుపుచేయమని అయన సిద్దాంతాన్ని నమ్మిన ప్రతివారు బాగుపడ్డారు.

ఒక గాంధేయవాదిగా, రచయితగా, జర్నలిస్టుగా, డాక్టరుగా బ్యాంకు నిర్వాహకుడుగా, సంఘా సేవకుడిగా అయన చేసిన సేవలు మరువలేనివి. అయన 1959 డిసెంబరు 17 న స్వర్గస్ధులయ్యారు.

బాలలూ! మరి మీరు కూడా ఈనాటి నుంచే 'పొదుపు' ప్రారంభిస్తారు కదూ. మీ పెద్దలు ఇచ్చిన దుబ్బను చెక్ లెట్లకి, ఐస్ క్రైంలకి, ఇతర అపరిశుభ్ర తినుబండారాలకి వృధా చేయకుండా ఒక డబ్బాలో దాచటం ప్రారంచించడి. కొంచెం పెద్ద మొత్తం అవగానే మీ దగ్గర్లో ఉన్న ఎదో ఒక బ్యాంకు లేక పోస్టాపీసులో ఖాతా ప్రారంభించి ఆదా చేయటం మొదలెట్టండి. అది భవిష్యత్తులో మీకెంతో సహాయపడుతుంది.

ఆధారం: రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate