অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రాణి చెన్నమ్మ

రాణి చెన్నమ్మ

1857 ఝన్సీరాణి లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన ప్రధమ స్వాతంత్ర్య సమరానికి 34 సంవత్సరాల ముందే కిత్తార్ రాణి చెన్నమ్మ బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా స్వాతిరెకంగ ప్రకంటించి యుద్ధం చేసింది.

ఈ కిత్తూర్ కర్ణాటకలోని దర్యాడ్ బెల్గామ్ల మధ్యఉన్న చిన్న రాజ్యం కిత్తూర్ వంశస్ధులైన మల్ల నార్జ అనే రాజు 1782 లో కిత్తార్ సింహాసన మెక్కాడు. ఈయన రెండవ భార్యే రాణి చెన్నమ్మ. ఈ కిత్తార్ నే కొందరు చిత్తూరు అని కూడా పిలుస్తుంటారు.

మల్ల నార్జ ఈస్టిండియా కంపెనీవారితో స్నేహముగా ఉంటూ రాజ్యాన్ని ఎంతో అభివృద్ధిపరిచాడు. అప్పుడు మహారాష్ట్రను శిశువులు పాలిస్తున్నారు.

పక్కరాజ్యం అందునా బ్రిటిషు వారితో  స్నేహముగా ఉంటూ అభివృద్ధి గాంచడం మరాఠా పీష్వాలకు ఇష్టము లేకుండెను. పీష్వాల అసూయా క్రమేపి పెరిగి ఆనాటి బ్రిటిషు గవర్నరు జనరల్ అయిన వెల్లస్లీకి, కిత్తరును స్వాధీనపరచుకోమని పీష్వాలు సలహా ఇచ్చారు. అప్పట్లో వెల్లస్లీ అందుకంగీకరించాలేది. కారణం మిగతా స్వదేశీ రాజాలను ఆమె రెచ్చగొడుతోందని భయపడ్డాడు.

అయితే అంత కలహాల మూలంగా పీష్వాలే కిత్తురు మీదపడి మల్ల నార్జను బందీగా తీసుకుపోయి 1816 లో వదిలారు. అతడు చాలాకాలం ఖైదులో ఉండుట వలన విడుదలై రాగానే మృత్యువాత పడ్డాడు. ఆ వెంటనే ఆయన మొదటి భార్య కొడుకు శివలింగారుద్ర నార్జ కిత్తారు రాజైనాడు. రాజ్యాభివృద్ది కంటే సాహిత్యం యుమ్డు, తత్వ శాస్త్రాల యందభిమానం కలవాడైనందున రాజ్యవ్యవహారాలు సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. స్వార్ధపరులైన ఓ ఇద్దరు సర్దారులు ఈస్టిండియా కంపెనీవారితో ఒప్పందం ఒకటి చేయించి, ఖానాపూర్ ప్రాంతాన్ని బ్రిటిషువారి కిచ్చేయడంతో రాణి చెన్నమ్మ ఈ ఒప్పందానికి బాధ పడింది.

అయినా చేసేది లేక బ్రిటీషువారు దుష్టబుద్ధిని గ్రహించి ఎందుకయినా మంచిదని సైన్యాన్ని ఆయత్త పరిచింది.

దర్యాడ్ లో ఉన్న బ్రిటిషు సైన్యాధికారి దేకర్ ఇది గ్రహించి కిత్తారు రాజాలు దరి దోపిడీ దొంగలయిన, దగ్గులకు, బందిపోట్లుకు ఆశ్రయమిస్తున్నదని పైవారికి ఆరోపణ చేశాడు.

1824 లో శివలింగారుద్ర సర్జ ఆరోగ్యం శినీంచింది. వెంటనే దాయాదుల పిల్లవాని నొకనిని తల్లి చెన్నమ్మ. సలహాతో దత్తత చేసుకున్నాడు. ఆ వెంటనే ఈ విషయము బ్రిటిషు ప్రతినిధియైన దేకరేకుతెలియపర్చారు. 11-9-1824 న శివలింగారుద్ర సర్జ మరణంతో రాణి చెన్నమ్మ, కిత్తారు దుర్గానికి రాణి అయంది. దేకర్ ఈ దత్తతచెల్లదని శివలింగదుర్గా సర్జాకు ఈ దత్తత ఉద్దేశ్యం లేదని, అబద్దాలన్నీ పోగుచేసి తన పై అధికారి చాప్లిన్ కు తెలియపర్చాడు. అనుమాస్పదముగా జరిగిన ఈ దత్తత చెల్లదని కిత్తారు కోశాగారాన్ని ముందు స్వాధీనము చేసుకోమని చాప్లిన్ దెకెరుకు జాబు రాశాడు.

ఏ అవకాశం చూసాకని ఎలా స్వతంత్ర రాజ్యాలను కబళించి వేద్దామా అని గోతి కింది నక్కలాగా చూస్తున్న బ్రిటిషు రాజనీతి ప్రకారం దేకర్ కోటలోని విశ్వసపాత్రలైనా ఉద్యోగులను రంపంచి ఆస్ధానాలలో తన మనుషులను పెట్టాడు. రాణివాసాన్ని ఖడులాగా బయటి వారెవ్వరితో సంప్రదింపులు లేకుండా చేశాడు. ఇది గ్రహించిన రాణి చెన్నమ్మ, కోడలిని తీసుకుని కాశి వెళ్లనున్నది. దేకర్ అందుకు ఒప్పుకోలేదు. వెళ్లదలి సై ఒక్క చెన్నమ్మనే వెళ్ళమన్నాడు.

దేకర్ మరణంతో చాప్లాన్ ఇతర ప్రాంతాల నుంచి తమ పాతాళాలు వచ్చేదాకా రాజి సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తూ గవర్నర్ జనరల్ వెల్లస్లీకి తక్షణమే పరాళాలు పంపమని కబురంపాడు. రాజసూత్రాల ప్రకారం తోటలో బందీలైన వారినందరిని వదిలిపెట్టింది చెన్నమ్మ.

చాప్లిన్ పొరుగు ప్రాంతాల నుండి సైన్యాన్ని పిలిపిస్తాడని, ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి తమకు లేదని రాణి చెన్నమ్మకు తెలిసే ఒదిన వారయినా వారు పెట్టిన శరథాలకే ఆమె ఒప్పుకుంది. కేవలం కాలయాపన కోసము చేస్తున్న చాప్లిన్ బ్రిటిషు సైన్యం రాగానే కోటను మాకు స్వాధీనము చేయమని లేకుంటే యుద్దానికి సిద & దాపడమని కబురంపాడు. రాణి చెన్నమ్మ అందుకంగీకరించక యుద్ధానికే సిద్దపడ్డది. 3-12-1824 న యుద్ధము ప్రారంభమై, 3-12-1824 న యుద్దమా ప్రారంభమై, 4-12-1824 ఒక్క రోజులోనే కోట లోపల బ్రిటీషువారు ప్రవేశించి 5-12-1824 కు కోట పూర్తిగా స్వాధీనమైంది. నేలమంది కిత్తారు సైనికులు  ఆ స్వాతంత్య్రా సమరంలో మరణించారు. రాణి చెన్నమ్మతో బాటు మరో ఇద్దరు రాజకుటంబా స్త్రీలు బందీలుగా చిక్కారు. వారిని తైల హోంగార్ కోటాలో బంధించారు. 2-2-1829 న రాణి చెన్నమ్మకు సహాయపడటానికి బయలుదేరితే అతనిని త్రోవలోనే బ్రిటీషువారు అడ్డగించారు. దానితో అతను సహాయము చేయలేకపోయాడు.

వ్యాపార నిమిత్తముగా వచ్చిన ఈస్టిండియా కంపెనీ వారు ఈ విధంగా స్వదేశీ సంస్ధానాల విషయంలో, చిన్న చిన్న రాజ్యాల విషయంలో జోక్యం చేసుకుని ఒక్కొక్క రాజ్యాన్నే కబళించి మొత్తం భారతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. వారి కుటిల రాజనీతి కంటే ఇక్కడి రాజాల అంత కలహాలు వారి విజయానికి మఖ్యకారణాలు.

ముఖ్యంగా ఆధునికమైన ఆయుధాలు లేకపోవడము, సైన్యానికి కొత్త పద్దతులలో శిక్షణ లేకపోవడం, సైనికాభివృద్ది చేసుకోకపోవడం, ఎవరి బ్రతుకు వారు బ్రతుకుదామని తృప్తి, భారతదేశము పరాయి పాలనా క్రందకు పోవడానికి ముఖ్యకారణాలు.

బ్రిటిష్ వారి నేడింరించడంలో ప్రరుషులతోబాటు మన స్త్రీలయిన ఝన్సీలక్ష్మిబాయి. రాణి చెన్నమ్మ మెదలాయన రాణులు తమ వంతు బాధ్యత నిర్వహించారుగాని ఫలితము లేకపోయంది.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate