অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రామానుజాచార్యుడు

రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త. హేతువాది, యేగి, రామమాజించార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్యదీక్షలో ప్రదర్షించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనస్యసామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఒక ఉదాహరణ.

రామానుజాచార్యుడు (1) బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సప్రమాదాయలన్ని అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేనవి. ఈ మతాలు దేవుడిని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలేకాని, వైదికమతానికి బదులుగా పఠించవలసినవికాదని నిరూపించాడు. (2) ఆదిశంకరుని అద్వైత సిద్దాంతంలోని సొగసులు సరిదిద్ది విశిష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. (3) ప్రస్ధాన త్రయాన్ని సాధారణ జనానికి అందించారు. వేదవ్యాసుని అభిమతానుగుణంగా బ్రహ్మసూత్రానికి పరిపూర్ణ వ్యాఖ్యగా శ్రీ భాష్యాన్ని అందించిన శ్రీ సాంప్రదాయ ప్రవర్తకులు. శ్రీ రామానుజాచార్యులు. గీతాభాష్యము, తర్కభాష్యము, వేదార్ధ సంగ్రహము, న్యాయమృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్వసారము, నారదీయ పంచరాత్రాగమము, రంగనాధస్తవము, గద్యత్రయము మరియు పెక్కు స్వరూప గ్రంధములను రచించారు. కనుక ఈయనకు భాష్యకారులు అని ఎంచేరు మానరు అని పేర్లు వచ్చాయి. ఆయన శేషాంశసంభూతులు అని చాలామంది అభిప్రాయము.

మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ పెరుంబుదూరులో  శ్రీ మాన్, అసురీ, 'సర్వక్రతు' కేశవ సోమయాజు దిశితాల్ మరియు కాంతిమతి అను పుణ్యదంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అని యజ్జలను పూర్తిచేసి 'సర్వక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఇంతకాలానికి తమకు సంతానం కలుగక పోవడంతో, భార్య కాంతిమతితో కలిసి తిరువల్లిక్కేణి ఒడ్డున ఉన్న పార్ధనరాధి స్వామి దేవాలయంతో యజాల ద్వారా ఆ స్వామిని తెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీ పెరుంబుదూరును వదలివెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహంవల్ల వీరిరువురికి రామానుజాచార్యులు  జనమించారు.

శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర అను సాంప్రదాయక గ్రంధం ప్రకారం ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118 , పింగలవర్షం, చైత్రమాసం, తరువాడిరై రాశి (ఆరుద్ర నక్షత్రం) శుశాపాశ పంచమి శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ క్రి. శ. 1017 ఏప్రిల్ 13 . శిశువు యెక్క జనన మాసం మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జమ్మ రాశు లతో సరితూగడంవల్ల రామానుజాచార్యులు మేనమామ అయన పెరియ తిరుమలనంబి రాయణను అది షెఘుని అవతారమని భావించి 'ఇళయపెరుమాళ్' అని నామకరణం చేశారు.

ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజు కాంచీపురం నుంచి శ్రీ పెరుంబుదూరు మీదగా పునమ్మల్లే అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రద్దాభక్తులు చిన్న ఇళయ పెరుమాళ్ ను ఎంతోగానో ఆకర్షించేవి. ఒక రోజు పూజ పూర్తి చేసుకుని తిరిగివెళ్ళున్న కంచిపూర్ణుని ఇళయపెరుమాళ్ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి భోజనానంతరం అతడికళ్ళు పట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ నిమ్మకులానికి చెందిన కంచి పూర్ణుడు ఉత్తమ బ్రాహ్మణకులంలో జనమించిన ఇళయపెరుమాళ్ సేవను నిరాకరించాడు. భగవంతుని పై అతడి భక్తిశ్రద్ధలు ఉన్నతమైనవని అందుచేత 'కంచిపూర్ణుడు' తనకు గురుసామానుడని వాదించి అతడిని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరి మధ్య పరశ్వర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మెదటిపారులు ఇళయపెరుమాళ్ కంచిపూర్ణుని వద్దనే అభ్యసించాడు. ఇళయపెరుమాళ్ (రామానుజాచార్యులు) పదహారవ ఏటా తంజామాంబ (తంజమ్మాళ్) తో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో, కుటుంబ సమేతంగా రామానుజాచార్యులు కాంచీ నగరానికి తరలివెళ్ళారు. నాటికీ కంచిలో పేరుపొందిన యాదవ ప్రకాశకుల వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు. యాదవ ప్రకాశకులు అద్వైతంలోను, భేదాభేదా వేదాంతంలోను పండిత్యాన్నీ గడించి అనేక మంది శిష్యులకు విద్యను నేర్పేవాడు. రామానుజాల వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు దిరికినందుకు పరమానందభరితుడైన యాదవ ప్రకాశకుడు అనతికాలంలోనే రామానుజుల 'భక్తి' పరమైన ఆలోచన విధానాన్ని గమనించాడు. యాదవ ప్రకాశుని ఉపవిషద్వ్యాఖ్యలు అకార్మికము, అనాస్తికములుగా ఉండటం రామానుజులు బాధించేది. అకారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు.

ఒకనాడు ఛాందోగ్యోపనిషత్తు పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యసం పుండరీకామేప మషిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు, 'ఎర్రనైన కోతి పిడూరులను పోలిన (కప్యసం) కమలాల వంటి కన్నులు గలవాడు అని అనువదించినట్లుగా యాదవ ప్రకాశకులు తన శిస్యులకు చెప్పాడు. అది విన్న రామానుజాల కన్నులలో ధారగా నీరుకారిసాగింది. యాదవ ప్రకాశకులు కారణముడుగగా అది సరైన వ్యాఖ్యకాదని బదులిచ్చాడు. ఆగ్రహించిన యూదావా ప్రకాశకులు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యసం' అనే పదానికి 'కం జలం పిబతి ఇతి కపి' నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు అని నూతన అర్ధాన్ని ఎప్పీ 'కప్యసం పుండరీకమేవమషిణి' అనే వాక్యానికి 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పిమ్చినా కమలాలవంటి కన్నులు కలవాడు అని భావాధిక్యతను, నాస్తికత్వాన్ని ఉటకించే అర్ధని చెప్పాడు. మరొకమారు సత్యం జనం అనంతంబ్రహ్మ' అనే మహావాక్యం పై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఙానం, అనంతం బ్రహ్మ యెక్క గుణాలని, అవే బ్రహ్మకడని వాదించాడు.

ఈ వాదోపహవాదాలలో రామానుజుల యెక్క పండిత్యం, అస్థికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవ ప్రకాశుడుకి కంటకింపు కాసాగింది. అహంకారపూరితంగా మనస్సుతో, ఈర్ష్యతో రామానుజులు హతమార్చడానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుని దవారా ఈ విషయాన్నీ తెలుసుకున్న రామానుజలు సమయానికి తప్పించుకొగలిగాడు. సాంప్రదాయ గ్రంధాల ప్రకారం ఈ తరుణంలో కంచిలో వెలిసిన 'వరదరాజస్వామి దంపతులు మారువేషంలో వచ్చి అతడిని రాశించారని తెలుస్తుంది'. తరువాత కొంతకాలానికి రామానుజులు వాదనలను అంగీకరించలేని యాదవ ప్రకాశకులు అతడిని తన శిష్యరికం నుండి విముక్తుణ్ణి చేస్తాడు.

'ఆళవందార్' అను నామధేయంతో ప్రసిద్ధుడైన యమణాచార్యుడు, వైష్ణవ సంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన తిరుచినాపల్లి జిల్లాలో ఉన్న శ్రీ రంగంలో శ్రీరంగనాధస్వామి దేవాలయంలో సేవలందించేవారు. యాదవ ప్రకాశు ని శిష్యరికంలో నున్న రామానుజాని గొప్పదనాన్ని తెలివితేటలను భక్తిపారమైన వ్యాఖ్యలను చూసి అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయంగా రామానుజులు కలుసుకోవాలని కాంచీపురాన్ని సందర్సించాడు. కానీ కారణాంతరాలవల్ల కలవలేక వేణుదురుగాడు. యాదవ ప్రకాశుడు తన శిష్యగణం నుంచి రామానుజాలను తొలగించిన విషయం తెలియగానే అతడిని తన శిస్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయనని తీసుకొని రావలసిందిగా 'మహాపూర్ణుడు' అనే శిష్యుని పంపాడు.

మహాపూర్ణుడు రామానుజాలను కలుసుకొని శ్రీ రంగం తీసుకువెళ్ళేలోపు యమునాచార్యులు పరమపదించారు. వీరు వచ్చేసరికి యమునాచార్యుల భౌతికకాయం అంత్యక్రియలకు సిద్ధపరచబడి ఉంది. కానీ అయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం రామానుజులు గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళు తాను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన రామానుజులు మీ మనసు నాకు తెలిసింది. బ్రహ్మ సూత్రములకు శ్రీ భాష్యము రాసి విశిష్టాద్వైత స్ధాపన చేస్తాను అన్నారు. యమునాచార్యుల చేతివేలు ముడిచినది కాస్తా పొడుగ్గా సాగింది. శ్రీ వైష్ణవ సిద్దాంతానికి ఆధారంగా ఉన్న విష్ణుపురాణాన్ని లోకానికి అందించిన మహనీయులు పరాశరులు, వేదసారాన్ని ద్రావిడ వేదంగా మలచిన మహానుభావులు నమ్మాళ్వారు వారి పేర్లను ఎవరికైనా పెట్టి కొన్ని శాస్త్రాలు రచించి వారి బుణం తీరుస్తాను అంటున్నారు ఇంతలో రెండోవేలు సాగింది. శ్రీ వైష్ణవాన్ని ఈ భూమి పై స్ధాపిస్తాను. పంచసంస్కారాలు అత్యంత ఆవశ్యకములని చాటి చెప్తాను. భక్తి సిద్దాంతం గొప్పదనాన్ని చాటి శరనాగఃటి వైశిష్ణ్యాన్ని అందరికి తెలిసేటట్లు చేస్తాను అన్నారు. మూడోవేలు తెరచుకుంది. ఈ విచిత్రాన్ని చూసి పులకించిపోయారు అక్కడివారు. యమునాచార్యులు తమకొక మహనీయుని చూపించారని పరవశించిపోయారు.

యమునాచార్యుని శిస్యుడైన పేరాయనంబి రామానుజాలతో తిరుక్కొట్టియూర్ లో గోదటిపూర్ణులు అనే గొప్ప పండితుడున్నారు. వారి వద్ద నువ్వు తిరుమాత్రం, చరమశ్లోకం వీటి అర్ధవిశేషాలను తెలుసోవాలని చెప్పడంతో రామానుజులు తిరుకొత్తయుర్ అనే ప్రసిద్ధమైన గోష్టీపురిచేరి అక్కడ ఉన్న గోష్టిపూర్ణులకు స్పష్టంగా దండ ప్రమాణం చేశారు. ఆచార్య! నేను మీ దాసుణ్ణి మీవలన తిరుమంత్రి, చరమశ్లోకాలను ఉపదేశంగా పొందాలని వచ్చాను. కాటశించండి అన్నారు.

వారి వినయసంపద గోష్టిపూర్ణుల్ని ఎంతో ఆనందపరచింది. ఆయన ఏ భావాన్ని ఆయనపైకి ప్రదర్షించలేదు వారిదొక సిద్దాంతం. అదేమంటే మంత్రంకోసం వచ్చినవారు నిజంగా తపనతో, ఆర్తితో వచ్చారా లేక సామాన్యంగా అందరిలా మంత్రోపదేశం పొందుదాం అనుకోని వచ్చారా? అత్యంత ఆర్తిలేని వారికీ పరమ పవిత్రమైన మంత్రాన్ని ఉపదేశించకూడదు. అందుకే కఠిన పరీక్షలు పెట్టి అందులో నెగ్గితే అప్పుడు చేద్దాం అనుకున్నారు. 'రామానుజ! ఆ మంత్రోపదేశానికి కొన్ని అర్వతాలుండాలి అవి నీలో ఉన్నాయే లేదో చూసి అప్పుడు చెప్తాలే అన్నారు. అలాగే అయన పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలబడ్డారు రామానుజలు. ఒకానొక పవిత్రీ సమయంలో ఆచార్యులు రామానుజాల కుడిచెవిలో మంత్రోపదేశంగావించారు'. దివ్వమంత్రి శ్వాకారంతో పులకించిపోయంది రామానుజాల దేహం. అయన ముఖపద్మమా మంత్రిభాస్కర కాంతులతో ప్రఫుల్లమైంది నెమ్మదిగా లేచి ఆచార్యులకు నమస్కరించి బయలుదేరారు. అయన మనస్సు అనేక రకాలుగా ఆలోచిస్తోంది. నేను ఈ మంత్రాన్ని పొందడానికి ఎంతో కలం ఎదురుచూశాను. ఇంత ఆర్తితో ఉన్న నాకు ఈ మంత్రం లభించడం ఇంత కష్టమైందే ఆ మంత్ర దొరకడం ఇంతకష్టమైతే ఎలా? ఇలా కాదు నేను ఈ మంత్రాన్ని ఆర్థికలవారందరిని పిలిచి చెపుతాను. ఎప్పుడొకడు ఇప్పుడే, అనుకున్న వెంటనే రణముజాలు మార్గంలో ఉన్న స్వామి ఆలయగోపురం ఎక్కి అందరికి ఉపదేశిస్తాడు. ఆ గురువు వచ్చి ఆచర్యల జాను ధిక్కరించినందుకు నీవు నరకానికి పోతావు అంటే. దానికి రామానుజలు నేను ఒక్కడినే నరకానికి పోతాను. కానీ అతి పవిత్రీమైన ఈ మంత్రాన్ని వినడంవల్ల ఇన్నివేల మంది మేశానికి వెళతారు. అంతవమదికి పరమపదం లభిస్తుంటే నేనొక్కడినే నరకబాధలు అనుభవిస్తే మాత్రమేమిటి ఆచార్య అని బదులిచ్చాడు. ఎంతటి జయూదర్యం. ఎంతటి త్యాగం. పరసమృద్ధిలో ఎంతో అనందం.

శ్రీ రామానుజులు ఒక ఆచార్యుడే గాక దయవరుడు. ప్రేమమూర్తి ఆశ్రితులను ఆదరించేవాడు. మల్లుడు అనే శిష్యుడిని తత్వజ్జానిగా చేసి, భగవంతునిగా తయారుచేశారు. కులము కంటే గుణము ముఖ్యమని భావించారు. అందరూ దాన్ని ఆచరించాలని తాను ప్రతిరోజు కావేది నదిలో స్నానంచేసి వాస్తు మెట్లు ఎక్కేటప్పుడు మాలాధనుర్ధనుని భుజం ఆసరాచేసుకొని ఎక్కేవారు. ఈ విషయం శిస్యులందరు గ్రహించేవారు. ఇలాగె ఒక చాకలివాడు స్వామికి ధరింపచేసి దోవతులను చక్కుగా ఉతికి తెచ్చేవాడు. శ్రీ రామానుజులు అతని సేవ, భక్తితత్వరత గమనించి, స్వామి సేవకు తనతోపాటు అతడిని కూడా గర్భాలయంలోని తీసుకువెళ్లి రంగనాథుని స్పర్శనం చేయంచారు. రామానుజాల వారు సత్వగుణ సంపన్నులు, కరుణాసముద్రులు, పరులు దుఃఖాన్ని దయతో పోగొట్టేవారు. వారితో అనుగ్రహశక్తి, అశేషమైనటువంటి జనం, అపార భక్తిప్రపత్తులు, వినయవిధేయతలు ఉండేవి.

రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైతాన్ని బలంగా ప్రతిపాదించడం. పలు ఆలయాల్లో మూర్తులను విష్ణసంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం. ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమవిధానాలు, పరిపాలన పద్ధతులు ఏర్పరచడం వంటివి చేశారు. క్రమంలో విస్తృత పర్యటనలు, వడ ప్రతివాదులు చేశారు.

కాంచీపురంలో శ్రీరంగంలో తమ జీవితాన్ని ఎక్కువ భాగం గడిపిన రామానుజులు శ్రీరంగనాథుని చేరి తమను రప్పించుకోమని ప్రార్ధించారు. కాదనలేకపోయాడు శ్రీరంగనాథుడు. అది 1137 వ సంవత్సరం మాఘు శుద్ధ దశమి శనివారం 120 సం ల దిర్గుఆయుష్మంతుడైన రామానుజులు శిస్యులందరిని తృప్తిగా చూశారు. శ్రీ రంగనాథా అనుగ్రహించారా తండ్రి దాసోహమ్ అంటూ బ్రహ్మరంద్రమార్గం ద్వారా పరమపదం చేరారు భగవద్రామానుజులు.

రామానుజాచార్యులు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలు:

  • ప్రస్తుతం సంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార్య వ్యవహారాలు ఛాందసంగా మరి సామజిక పురోగతికి అడ్డురాక మును పే గుర్తించి సహజ శ్రేయస్సుకై వాటిని మనడమే, మార్చటమే చేయడం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
  • దేవుని పూజించటం, మేష్టాన్ని సాధించటం మానవునిగా జనమించిన ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కుని దిక్కురించే అధికారం ఎవ్వరికి లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల, మాత తరథ్యాలను పరిశీలించి అర్ధం చేసుకోవడం మహత్వం, వైశంయులను పెంచుకోవడం ముర్ఖత్వం.
  • పూర్వం గురువులు చెప్పినంత నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది తప్పో, ఒప్పో నిర్ణయంచుకోవడం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
  • ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగిన పదిమందికి జరిగే మేలుకై తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate