অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

లోకమాన్య బాలగంగాధర తిలక్

లోకమాన్య బాలగంగాధర తిలక్

భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం జీవితాలను త్యాగం చేసిన అగ్రశ్రేణి మహానాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్. "స్వాతంత్య్రం నా జన్మహక్కు" అని గాంధీకి పూర్వమే ఎలుగెత్తిచాలిన సుప్రసిద్ధ దేశభక్తుడు. మహారాష్ట్రలో మరాఠా బ్రాహ్మణా వంశంలో 1853 లో పుట్టి 1919 లో పరమపదించిన ఈయన మనకు, భావిభారత ప్రజలకు మార్గదర్శకుడే కాక పూజనీయుడు కూడా. భగత్ సింగ్ మొదలగు విప్లవ వీరులతో కలసి మహారాష్ట్ర, బెంగాల్, పంజాబు మొదలగు రాష్ట్రాలలో స్వాతంత్య్రా సముపార్జన కోసం ప్రజలను మేలుకొలిపిన వైతాళికుడియన. ఈయన ఎంత దేశాభుక్తుడో అంతటి హిందూ మతాభిమాని.

బ్రిటిషు జాతీయగీతాన్ని కాదని "వందేమాతరం" అన్న భారత జాతీయ గేయాన్ని మన సభలలో ఆచరణలో పెట్టిన దేవాభిమాని ఈయన. అంతేకాదు, భారతీయ ప్రజలను స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేటట్లు చేయుటకు దేశంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలలో తెలియచేయుటకు "కేసరి" అని ఒక పత్రికను స్ధాపించాడు.

బ్రిటిషు ప్రభుత్వం ఈయన దేశభక్తికి, ఈయన "కేసరి" పత్రికలో రాస్తున్న అనేక విషయాలకు హడలిపోయి ఈయనను అనేకసార్లు జైలుకు పంపారు. అయినప్పటికీ ఈయనతో దేశాభిమానం నానాటికి వృద్ధి చెందింనదేగాని, తగ్గలేదు. ఇంక ఇలాకాదని పూనాలో జరిగిన ఓ హత్యకేసులో - వాస్తవానికి ఈయనకు సంబంధం లేకపోయినప్పటికీ ఈయన కూడా ఆ హత్యకు కారకుడేనని, ఇంక కొంతమంది దేశభక్తులను కలిపి ఒకేసారి ఆరు సంవత్సరాలు జైలుశిక్ష విధించారు. ఎలాగయినా ఈయనను దేశభక్తి నుండి మరల్చాలని బ్రిటీషువారు యెన్నో ఆశలు చూపారు.

తిలక్ ఉత్తమ దేశభక్తుడిగాక అత్యుత్తమ ప్రజాసేవకుడు. మహారాష్ట్రలో 1898 లో వచ్చిన ఘోరమయినా ప్లేగు వ్యాధికి వేలసంఖ్యలో ప్రజలు చనిపోతూ ఊళ్ళు వడలు పోతే ఉంటే వాళ్ళకు శారీరకంగా, మానసికంగా ఎంతో ఆత్మీయతతో సేవ చేశాడు.

పూనాలో ప్రసిద్ధి చెందిన న్యాయవాది కూడ. 1879 లో ఈయన న్యాయవాద వృత్తి స్వీకరించి "న్యాయవాది" అన్న పదానికి నిజమయిన న్యాయంను చేకూర్చిన వాకిలియన. అకారణంగా స్వాతంత్య్రా ఎద్దులనేక మందిని జైలులో పెడుతుంటే వారి తరపున ఉచితంగా వాదించడమేకాక ఆర్ధికంగా అనేక మందికి సహాయపడ్డాడు.

కాంగ్రెసులో ఈయన ఇమడలేకపోయాడు. కారణం, మానవ సహజమయిన సంకుచిత, స్వార్ధ స్వభావం లేనివాడై నందున అవే ప్రధానంగా పెట్టుకొనివున్న కొంతమంది పద్ధతులు నచ్చక 1907 సూరత్ కాంగ్రెసు మహాసభ నుంచి వైదొలిగాడు. అయితే వెంటనే "అనిబీసెంటు" తో కలిసి హోమ్ రూల్ రస్ధాపించాడు. ఈ మహాపురుషుడు 31-7-1919 న తన 66 వ యేట పరమపదించాడు.

పరమపదించే ముందు షిరిడి సాయిబాబా మహిమలు తెలిసి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక షిరిడి వెళ్లి సాయిబాబాను కలిసి మనదేశ స్వాతంత్య్రము ఎప్పుడు వస్తుందని అడగడానికి వచ్చానన్నాడు. అప్పుడు సాయిబాబా నీవు, నేను చూడము ముందు నీ గుండెను జాగ్రత్తగా చూచుకోమన్నాడు. ఆ సంవత్సరమే జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న తిలక్ గారు ఆంగ్ల పోలీసులు అయన గుండెలమీద లారీలు పెట్టి కొట్టడముతో కోలుకోలేని జబ్బుపడి సవర్గస్ధుడైనాడు.

స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వం ఈయన విషయంలో ఏమి చేయలేదు. ప్రజల్లో తప్ప ప్రభుత్వపరంగా ఈయన ఙాపకాలేమి లేవు.

భగవద్గితకు ఈయన రాసిన భాష్యం పరమ ప్రామాణికం. గణేష్ ఉత్సవాలు ఈయన ప్రవేశపెట్టినవే. అనాది అయిన హిందు సమాజం మీద మంచి పట్టు ఉన్న మనిషి, బుగ్వేదం కలం గురించి పాశ్చాత్య దేశాలలో నిర్ణయంచిన కాలాన్ని కొట్టిపారేసి ఈయన సొంత పరిశోధనలతో చాలా పూర్వానికి తీసుకొని వెళ్ళాడు. నిజానికి అది కుడా సరైనది కాదు. ఇంక ఇంక ఎంతో పూర్వకాలం నాటిది బుగ్వేదం కాలం.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate