অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేదవ్యాస మహర్షి

వేదవ్యాస మహర్షి

భారతీయ వాజ్మయానికి మూలా పురుషుడు. అది పురుష/డు వాల్మీకి అయితే, రెండవవాడు వేదవ్యాస మహర్షి రాయణకు కృష్ణద్వైపాయనాడు అను మరొక పేరు కూడా కలదు. ఈయన శరీరం నల్లడైనందున ఈయనకి పేరు వచ్చింది. ఈయన శంతనుని భార్య సత్యవతికి పరాశర మహర్షి ద్వారా కలిగాడు. ఈ సత్యవతి ఉపరిచారవసువనే రాజర్షి కూతురు. బెస్తరాజా వద్ద పెరిగింది. క్షత్రియ కన్య.

అపౌరుషేయాలైన వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వలన ఈయనకి వేదవ్యాసుడని పేరొచ్చింది. ఈయన వలన వేద విభాగం జరిగింది. కాబట్టే వెడలు చదువుకోవడానికి వీలైనది. ద్వాపర యుగాంతారంలోనే మహాభారత యుద్దానికి పూర్వమే ఈయన జ్నమించి ఉండటం వలన ఆ మహాయుద్ధ పూర్వాపరాలను, కంటితో చూచిన వాడైనందువలన ఆ చరిత్రను యధాతధంగా రాశాడు. ఈ మహాభారతం ఐదువేల నూరు సంవత్సరాల క్రితం ఈయన చేత రాయబడింది. ఈ కావ్యం 18 పర్వాలు కలిగి, లక్షశ్లోకాలు గల గ్రంథమిది. వీరిని ఈయన శిధ్యుడు శుకమహర్షి రాసి శుతునకు చెప్పగా, వారు అభిమన్యుని మనుమడైన జనమేజయునకు చెప్పారు. అప్పటి నుండే గ్రంధం ప్రజలు వినుటకందుబాటులోకి వచ్చింది.

ఈ మహాభారతంలో లేని కళగాని, రసముగాని లేదు. సర్వరస కళల భూయిష్టమైన కావ్యమిది. మానవజన్మ మెడలు మెషము పొందుటకు గల అంతర్ దశల విభాగాలను చెప్పుటయేకాక 'మానవుడు ఉత్తముడుగా ఆఖరుకు దేవుడుగా కూడా కాగలదు. ఆ విధంగా ఎలా అయ్యేది ఈ గ్రంధంలో మనకు లభ్యమవుతుంది'.

మహాభారతం ఉత్తమెత్తమైన కథ. మానవ వికాసానికి సంబంధించిన అనేక విషయాలు అందులో నిషేపించి యున్నవి. ఇందలి పాత్రలు, వారి విభిన్న మనస్తత్వాలు, వారి పట్టదలలు, కృత్య అకృత్యాలేకగా మానికెంతో ఆదర్శనీయమైన మహాగ్రంధిమిది. ఇందులో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏ పాత్రకపాత్ర ప్రత్యేక ప్రతిపత్తి కలిగినవే. ఈ గ్రంధాన్ని ఒకసారి చదివితే చాలు. మానవ జీవితం సర్వతోముఖాభివృద్ధి చెందితుంది.

ఇందులోని అనేక నిధులు, శాస్త్రాలు మానవ జీవితానికి ఉపయెగకరంగా ఉన్నవి. ప్రపంచ చరిత్రలో ఇంతటి గొప్ప గ్రంధం మరొకటి లేదు.

ఈయన వేదాలు అర్ధమగుటకు, ఉపనిషత్తులు రాశాడు. అవి అర్థమవడానికి మీమాంస చేశాడు. ఆ మానమహుడు చేసిన కృషే రేనాటి మన వికాసానికి కారణమయండి.

భగవడ్ఢిత గ్రంధం ఈ మహాభారతంలోనిదే. జైమిని మహర్షి కూడా బాగా రాశాడు. అది ప్రాచుర్యములోనే ఉన్నది. భారత చిరంజీవులలో ఈయన ఒకరు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate