অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సద్దర్ వల్లభాయ్ పటేల్

ఇండోర్ రాజు మల్హరరావు హెల్కార్ తన ఆస్ధాన ప్రముఖునితో దరంగమాడుతున్నారు.అయన తనోడిపోయే దశలో ఉండి చిరాకు పడుతున్నారు.

కొంచెం దూరంలో నిల్చుని ఉన్న ఒక వ్యక్తి ఆ ఆటను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజావారిని ఆ సంకటం నుంచి తప్పించాలనే ఉద్దేశం అతనికి కలిగింది. సాహసించి "రాజూ! పావు నాగదిలో కాదు, గదికి నడపండి" అని సూచించాడు. రాజు అలాగే చేసి విజయం అప్పగించారు.

రాజుగారి విజయానికి తోడ్పడిన వ్యక్తి ఝన్సీ లక్ష్మీభాయి తరపున ఆంగ్లేయులతో పోరాడిన వీరుడు. అతణ్ణి శిషించవలసిందని ఇండోర్ రాజుకు ఆంగ్లేయుల అప్పగించారు.

విప్లవం విఫలమైన ప్రజల్లో విప్లవ విరులపట్ల గౌరవదారాలు పెరిగాయి. ఆంగ్లేయులకు తోడ్పడి, విప్లవానికి వెన్నుపోటు పొడిచాడంటూ తనపై విమర్శలు రావటం కూడా అయన వింటున్నారు. ఈ కారణాలవల్ల విప్లవకారులపట్ల అయన దృక్పధంలో మార్పు రాసాగింది. దానికితోడు ఆటలో సాయపడిన అతనిపట్ల రాజూ ప్రసన్నులయ్యారు. అందుకే అతణ్ణి విముక్తుణ్ణి చేయవలసిందన్నారు.

ఆ వ్యక్తి కృతజాతతో రాజుగారికి నమస్కరించి కొలువు వెడలిపోయాడు. స్వగ్రామమైన కరాంసాద్ కి వెళ్ళి వ్యవసాయ వృత్తిలో నిమగ్నుడయ్యాడు. అతని పేరుజవేరిభాయ్ పటేల్.

లాడ్ భాయి అతనికాన్నివిధాలా అనుకూలవతి అయిన ఇల్లాలు. ఆమె చుట్టాలకు సురభి, అతిధ్వజ, అభ్యాగతులకు అన్నపూర్ణ. ఆ దంపతులకయిదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఉక్కుమనిషిగా పేరొంది, రామునికి లక్ష్మునిలా, కృష్ణునికి అర్జునునిలా గాంధీజీతో అనుభందాన్ని పెనవేసుకున్న వల్లభాయి పటేల్ వారిలో నాలుగవవాడు.

విద్యాభ్యాసం

ఆరవ ఏట కరమ్ సాద్ లోని గుజరాతి పాఠశాలలో పటేల్ విద్యాభ్యసమారంభమైయింది. కానీ అక్కడి వాతావరణంగాని, బోధనా పద్ధతులుగాని అతనికి నచ్చలేదు. ఆంగ్లవిద్యనభ్యసించాలనే ఉబలాటం ఉంది. కానీ అక్కడి వాతావరణంగాని, బోధనా పద్ధతులుగాని అతనికి వచ్ఛలేదు. ఆంగ్లవిద్యనభ్యసించాలనే ఉబలాటం ఉంది. కానీ ఆ పాఠశాల నడియాడ్ లో మాత్రమే ఉంది. అప్పటికే నడియాడ్ లో మేనమామలు ఇంట్లో ఉంటూ, అతని అన్న విరల్ బాయి విద్యాభ్యసం చేస్తున్నాడు. పటేల్ ను కూడా అక్కడకు పంపితే పొడుగు కోసుకొని పాలు తగినట్లవుతుందని తండ్రి భావించాడు. వల్లభాయ్ నీరుగారిపోయాడు. ఆ పరిస్ధితిలో అదృష్టం అతని ఇంటితలుపు తట్టినట్లయంది. తన ఊరిలోనే ఒక ప్రైవేట్ ఆంగ్లపాఠశాల స్ధాపించబడింది. అతనికి ప్రాణం లేచివచ్చినట్లయంది. మూడు సంవత్సరములు ఆ పాఠశాలలో విద్యార్జన చేశాడు. పిదప పెట్లడ్ గ్రామంలో అతడు తన ఊరివారీయన ఆరుగురు విద్యార్థులతో ఒక వసతిగృహాన్నిరుచుకొన్నాడు. మిగిలినవారిలా వారానికొకసారి ఇంటికివచ్చి సరుకులు తెచ్చేకొంటున్నాడు. రోజుకొకరు చొప్పున వంటచేస్తూ రెండు సంవత్సరాలలో ఐదవ తరగతి పూర్తిచేశాడు. ఇక్కడ చదువు పూర్తిఅయిన తరువాత అతడు అడియాడ్ లో ఉన్నత పాఠశాలలో చేరాడు.

అన్యాయాన్నెదిరించడం, అందుకోసం ఇంతటివారితోనైనా తలపడడం పటేల్ కు చిన్ననాటినుండి ఉన్న సుగుణాలు. పురపాలక సంఘానికి ఒక ఉపాద్యాయుడు అభ్యర్థిగా నిలబడ్డాడు. అయన ప్రత్యర్థి ఎన్నికలో తనకు గెలుపు తధ్యమన్న అహంకారంతో, "బడిపంతులు గెలిసై తన మీసం గొరిగించుకుంటా" నని భీషణ ప్రతిజ చేశాడు. అతని ప్రతిజను పటేల్ సవాలుగా తీసుకొన్నాడు. తన తోటి విద్యార్థుల సహకారంతో ఆ ఉపాధ్యాయుని పాశన రీయంబవళ్ళు కృషిచేశాడు. అతని కష్టం ఫలించి, ఆ ఉపాధ్యాయుడు గెలిచాడు.

22 వ ఏట అతనికి మెట్రిక్ పుర్తయ్యంది. న్యాయవాదిగా జీవితం సాగించాలని కాంక్ష ఉంది. కానీ యల్.యల్.బి. పూర్తి చేయాలంటే అధమం ఆరేళ్ళు పడుతుంది. అంతటి తీరికగాని, ఆర్ధికంగా తాహతుగాని తనకు లేదు. పుస్తకాలను స్ధానికి న్యాయవాదులవద్ద అడిగి తెచ్చుకొని, మూడేండ్లు నిర్విరామకృషి సల్పి, జిల్లా పీలిద్దరు పరీక్ష ప్యాసైనాడు.

లాయరుగా జీవితం

వకీలుగా అయన గోద్రాలో రెండు సంవత్సరములు ప్రాక్టీసు చేశారు. అటుతర్వాత ఆయన పెద్దపట్టణమైన బోథిసాదుకు తన కాపురం మార్చారు. కొద్దిరోజుల్లోనే అయన క్రిమినల్ లాయరుగా మంచిపేరు సంపాదించారు. పోలీసులు తెచ్చే కేసుల్లో అయన ముద్దాయిల తరపున వాదించేవారు. వారు తెచ్చే దొంగసషులను తన ప్రశ్నల పరంపరతో తికమకపెట్టి ముద్దాయిలను విడుదల చేయించేవారు. అయన వ్యయశాస్త్రపాఠవాలకు తార్కాణంగా కింది కేసు నుదహరించవచ్చు.

ఒక పర్యాయం అబ్కారీశాఖ ఇన్సవెక్టార్ దొంగ సారా  తయారుచేసేవాణ్ణి పట్టుకొని కేసుపెట్టాడు. అతనివద్ద లభించిన రెండు సారసిసల్ని సశ్యాలుగా మెజిస్టేట్ మూడు దాఖలు చేశాడు. ఆ ముద్దాయితరఫున పనిచేస్తున్న పటేల్ సీసాలోని ద్రవాన్ని పరీక్ష చేయించాలన్నారు. డాక్టరు పరీక్షవల్ల ఆ సీసాల్లోది సారాయి త్రాగేసి, వాటిలో నీళ్ళు పోశాడు.

ఈ విధంగా పటేల్ చేతిలో కేసులు వీగిపోవటం పోలీసువారికి, ప్రభుత్వ న్యాయవాదులకు కంటకప్రాయమైంది. ఏవో కుంటిసాకులు చేప్పి మేజి స్ట్రీట్ న్యాయస్ధానాన్ని ఆనంద్ కు మార్పించాడు. పటేల్ కూడా అక్కడికే మకాం మార్చారు. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడకన్నట్లయంది. ఇక లాభం లేదని సంవత్సరం తీరకకుండానే కోర్టును బొర్సాద్ కే మార్చారు.

భార్య వియెగం

ఒకనాడు పటేల్ కోర్టులో వాదిస్తుండగా తంతి వచ్చింది. ఒకసారి దాన్ని చదువుకొని, మరల తన వాదన కొనసాగించారు. కోర్టు కార్యక్రమం పూర్తయంది. అటుతర్వాత అయన భార్య చనిపోయందన్న వార్త తెలిసి లాయర్లు వల్లభభాయి గుండె నిబ్బరానికి, కార్యదీక్షకు విస్తుపోయారు.

ఆయనకు 16 వ ఏటనే వివాహమయంది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నాలు కుమార్తె మణిబెన్, కుమారుడు దహ్యభాయ్. భార్య మరిణించేవాటికి పటేల్ వయసు 33 సంవత్సరాలే. మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని ఎందరో ఆయనకు సలహా ఇచ్చారు. కానీ భార్యపై గల మమతానురాగాల్ని పురస్కరించుకొని, పునర్వివాహం పై అయన ఆసక్తి చూపలేదు.

బారిష్టరు చదువుకోసం సీమకు వెళ్ళేందుకు ఆయనకు అవకాశం వచ్చింది. కుమార్తెను, కుమారుని బొంబాయిలో 'క్వీన్ మేరీస్ రెసిడెన్షియల్ స్కూల్' లో చేర్చి, 1910 లో ఇంగ్లండులో వైద్యనారంభించారు. 'లా' పుస్తకాలు కొనడానికాయనవద్ద సొమ్ములు లేవు. అందుకే ప్రతిదినం తన బాసనుండి దాదాపు 12 మైళ్ళ దూరమున్న 'మిడిల్ టెంపుల్' గ్రంథాలయానికి నడచివెళ్ళి, రోజులు 10,12 గంటలపాటు గ్రంథపఠనం సాగించారు. ఈ విధంగా రెండు సంవత్సరాలు అహీరత్రాలు కృషిసల్పి, ప్రథమశ్రేణిలో అగ్రగణ్యుడుగా ఉత్తిర్ణులైనారు. ఏభై పౌన్లు బహుమానం అందుకొన్నారు. విద్యను పూర్తిచేసుకొని, భారతదేశానికి తిరిగివచ్చారు.

తన న్యాయవాద వృత్తిని అయన అహమ్మదాబాద్ లో సాగించారు.

గాంధీజీతో పరిచయం

గాంధీజీ అహమ్మదాబాదు లో సబర్మతి ఆశ్రమం స్ధాపించారు. పురప్రముఖులకు కూడలియైన గుజరాత్ క్లబ్బు నొకటి రెండుమార్లు సందర్సించారు. తన ఆశ్రమ లష్యలను వివరించారు. కానీ వల్లభాయ్ మాత్రం నన్నంటుకోవద్దన్నట్టు దూరంగా ఉన్నారు. పైగా గాంధీజీ ఉద్దేశాలను పరిహసించారు.

బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఆంగ్లేయులు నీలి తోటల యజమానులు. వారు భారతీయ రైతులను పీల్చి పిప్పిచేస్తున్నారు. గాంధీజీ అచ్చటి రైతుల సమస్యలను పరిష్కరింపబోయారు. మేథిహారి మెజిస్టేట్ అది సహించలేక పోయాడు. గాంధీజీని ఆ జిల్లాలో అడుగు పెట్టరాదంటూ నిషేదజ్జాలు జారీచేశాడు. దానితో ప్రభుత్వం తన కేసు నుపసంహరించుకొన్నది. ఆ నీలి తోటల వ్యవహారం కూలంకషంగా విచారించేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ఈ వార్త దేశాన్ని ఆసేతు శీతాచలం కదిలించింది. ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించాలనే లాశ్యంతో 'గుజరాత్ సభ' అనే ప్రజాసంస్ధ వెలిసింది. దానికి గాంధీజీ ఆద్యశస్ధానం ఆలంలరించారు. కార్యదర్శగా పటేల్ ఆయనకు తోడ్పడడానికుద్యుక్తులయ్యారు. ఆ సంస్ధ గోద్రాలో 1917 లో మొదటి రాజకీయసభ నిర్వహించింది. వెట్టిచాకిరి దురాచారాన్ని నిర్ములించాలని తీర్మానించి, అది ఆచరణలో విజయం కూడా సాధించింది.

కైరా సత్యాగ్రహం

1918 వ సంవత్సరంలో సైరా జిల్లాలో అతివృష్టివల్ల పంటలు నాశనమయ్యాయి. ఆ కారణంచేత శిస్తులు నిలుపు చేయండని రైతులు, శాసనసభ్యులు ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసుకొన్నారు. కానీ కలెక్టర్ కైరా జిల్లాలోని 603 గ్రామాల్లో కేవలం 104 గ్రామాల్లో మాత్రం శిస్తు నిలుపుచేశాడు. మిగిలినవారివద్ద కఠినచర్యలు తీసుకుని శిస్తులు వసూలుచేయండని ఉత్తర్వులు పంపాడు.

రైతులు బాధల్ని పరిష్కరించేందుకు గాంధీజీ పటేల్ సాయం తీసుకొన్నారు. పంటనష్టం వివరాలను తెలిపెందుకు పటేల్ తో కలిసి గవర్నరును సందర్సించారు. ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లుగా వ్యవహరించింది.

గాంధీజీ అధ్యక్షతన నడియడులో సభ జరిగింది. అయన సత్యాగ్రహానికి ప్రజలను సమాయత్తుల్ని చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోని శిస్తులు చెల్లించరాదంటూ నిర్ణయంచబడింది. పటేల్ ఆ ప్రాంత ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపారు.

శిస్తులు చెల్లించని రైతుల భూముల్ని, పశువుల్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. ఉద్యమం ఆరు నెలలపాటు సాగింది. రైతులు వెనుక్కు తగ్గలేదు. ప్రభుత్వానికి పైసా వాసులు కాలేదు.

ఇక తప్పనిసరి పరిస్ధితుల్లో ప్రభుత్వమే వెనుకంజ వేసింది. శిస్తులు చెల్లించగల్గిన వారినుండే వాసులు చేయండని ఉత్తర్వులు పంపింది. స్వాధీనపరచుకొన్న భూముల్ని, పశువుల్ని తిరిగి ఇచ్చివేసింది.

ఈ ఉద్యమం సందర్భంగా వల్లభాయ్ గాంధీజీ మరింత చేరువయ్యారు.

రౌంట్ చట్టం

దేశ ప్రజల్లో నానాటికి స్వరాజ్య కాంక్ష పెచ్చుపెరుగుతున్నది. దాన్ని అణచివేయాలని ప్రభుత్వం 1919 లో రౌంట్ చట్టం ప్రవేశ పెట్టింది. పోలీసులకు విశేషాధికారాలిచ్చింది. ప్రజల వాక్స్వాతంత్య్రాన్ని హరించింది. గాంధీజీ ఈ చట్టాన్ని రచ్చకీడవాలని భావించారు. పటేల్ మెదలైన నాయకులతో సమాలోచనలు జరిపారు. సత్యాగ్రహానికి నాంది సూచకంగా ఏప్రిల్ 6 న హర్తాళ్ చేశారు. 24 గంటలుపవాసదీక్ష వహించారు. పనులు మానివేయాలి దేశ ప్రజలకు విజ్జప్తి చేశారు. భారతీయులందరు తమ మధ్యగల వైషమ్యాలను విస్మరించి, ఒకే బాటలో నడిచారు.

వల్లభభాయ్ అహమ్మదాబాద్ లో ఊరేగింపు నిర్వహించి, ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఉపన్యసించారు. నిషిద్దమైన గాంధీ సాహిత్యాన్ని విక్రయంచారు. ఢిల్లీ, అమృత్ సర్, లెహెర్ పట్టణాలలో ఉరేగింపుల పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ పరిస్ధితుల్ని పరిశీలించేందుకు బయలుదేరిన గాంధీజీని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు. ఈ వార్త కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించింది. దానితో రెచ్చిపోయిన అమృత్ సర్, అహమ్మదాబాద్ పట్టణాల ప్రజలు దౌర్జన్య చర్యలకు పూనుకొన్నారు. అహమ్మదాబాద్ లో ప్రశాంత పరిస్ధితులు నెలకొనేందుకు పటేల్ ఎంతగానో పాటుపడ్డారు.

అల్లర్లు సద్దుమణిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతీకార చర్యలకు పూనుకొంది. అహమ్మదాబాద్ పట్టణ ప్రజల పై 9 లక్షల అపరాధపు పన్ను విధించింది. అది చెల్లిందటానికి నిరాకరించిన పటేల్ సోపాను ప్రభుత్వం వేలంవేసి వచ్చిన సొమ్ము జమకట్టుకొంది. అంతేకాక పెక్కుమంది పై అక్రమ కేసులు బాణయంచింది. వల్లభాయ్ ముద్దాయిల తరపున వాదించి ఎందరినో విడుదల చేయించారు. ప్రభుత్వం చడీచప్పుడు కాకుండా గాంధీజీని బొంబాయి కి తెచ్చి విడిచింది.

సహాయ నిరాకారణం

బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్ లో సైనిక శాసనాన్ని ప్రకటించింది. ప్రభుత్వాధికారులు తీసుకునే చర్యలని కోర్టులోనూ సవాలు చేయరాదని శాసించింది. జలియన్ వాలాబాగ్ లో ప్రశాంతంగా వైశాఖ ఉత్సవాలను జరుపుకొంటున్న ప్రజల పై డైయర్ సేనాని నిర్దషిణ్యంగా కాల్పులు జరిపించాడు. కనీసం వేయిమంది మరణించారు; కొన్ని వేలమంది శతగాత్రాలయ్యారు. ఇంతటి దారుణానికి కారణభూతుడైన ఆ సేవానిచే ప్రభుత్వం కేవలం రాజీనామా చేయించి వదిలిపెట్టింది. అది భారత ప్రజలకు తీరని మనస్థాపం కలిగించింది.

కలకత్తా, నాగపూర్ లలో జరిగిన కాంగ్రేస్ సమావేశాలు 'సంపూర్ణ స్వరాజ్యమే ద్యేయం' అని నిర్ణయంచాయి. అందుకు 'సహాయ నిరాకరణమే' శరణ్యంగా నిర్ణయంపబడింది. సహాయనిరాకారణంలో భాగంగా ప్రభుత్వం వారిచ్చిన పథకాలను, బిరుదులను త్యజించారు. ఖద్దరు వస్త్రాలు ధరించారు. బ్రిటిష్ వారి పాఠశాలలో, వ్యయస్ధానాలు వదిలివేశారు. స్వదేశీ పాఠశాలలో స్ధాపింపబడ్డాయి. పటేల్ గుజరాత్ కాంగ్రెస్ సంఘానికాధ్యశుడై, స్వరాజ్య నిధికి 15 లక్షల రూపాయలు సేకరించారు.

1921 లో అహమ్మదాబాద్ లో జాతీయ కాంగ్రెసు సమావేశం జరిగింది. దానికి పటేల్ ఆహ్వానసంఘాధ్యషులు, ప్రజలను త్యాగాలకు సిద్ధం కమ్మని గాంధీజీ ఉద్బోధించారు. శాసనోల్లంఘన కార్యక్రమానికి బార్డోలీ తాలూకా ప్రజలను సమాయత్తుల్ని చేశారు.

ఇంతలో ఉత్తర ప్రదేశ్ లోని చౌరీచౌరాలో ఒక ఊరేగింపు పై పోలీసులమానుషంగా ప్రవర్తించారు. ప్రజలవేశపూరితులై పోలీస్ స్టేషన్ ను తగులబెట్టారు. ఆ మంటలలో 21 మంది పోలీసులు, ఒక షబ్ ఇన్ స్వెక్టరు కుమారుడు కాలి మసి అయ్యారు. గాంధీజీ ఈ వార్త విన్నవెంటనే శాసనోల్లంఘునా ప్రయత్నం విరమించారు.

ప్రభుత్వం ఆయనకరేండ్ల జైలుశిక్ష విధించింది. పటేల్ బాపూజీ అజ్జానుసరం నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. గుజరాత్ విద్యాపీఠానికి 10 లక్షల రూపాయలు సేకరించి సొంత భావనమేర్పరించిరు. ఆ విద్యాలయాభివృద్దికి ఎంతగానో పాటుపడ్డారు. గుద్దల దుకాణాలవద్ద పికెటింగ్ లు నిర్వహించారు. ఆ వర్తకులు తాము విదేశీ వస్త్రాలు తెప్పించబోమని ఆయనకు వాగ్దానం చేశారు.

జెండా సత్యాగ్రహం

కాంగ్రెస్ పెద్దలైనా హాకిం అజ్మల్ ఖాన్, రాజాజీలు వేర్వేరు సందర్భాల్లో జబల్ పుర ను సందర్సించారు. ఆయా సమయాల్లో మున్నిపల్ భవనం పై జాతీయ జండా ఎగురవేయబడింది. ఆ చర్యను నిషేధిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు.

జాతీయవారం సందర్భంగా నాగపురంలో స్వచ్ఛంద సేవకులు జాతీయపథకాలతో యూరోపియన్లు నివసిస్తున్న సైకిల్ లైన్స్ వైపు ఊరేగింపు జరిపారు. పోలీసులు వారి నాటకాయంచి చితకబాదారు. ఈ దారుణాన్ని ఎదుర్కోవాలని జిల్లా కమిటీ నిర్ణయంచింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి జామునలల్ బజాజ్ అరెస్టయ్యారు. అటుపిమ్మట ఈ ఉద్యమం పటేల్ కు అప్పగించబడింది. అయన అక్కడకు చేరుకునేసరికి సాటి ఉద్యమకారులందరు జైళ్లలో నిర్బంధించబడి ఉన్నారు. నాగపురానికి స్వచ్ఛంద సేవకులను పంపవలసిందిగా పటేల్ ప్రతి రాష్ట్ర కాంగ్రెస్ ను కోరారు. అయన విజ్జప్తి మేరకు తండోపతండాలుగా తరలివస్తున్న సంతాగ్రహులతో జైళ్ళు నిండాయి. అయన ఉద్యమం ఆగలేదు. చివరకు కాలినడకన వస్తున్నారు. ప్రభుత్వనికేం చెయ్యటానికి పాలుపోలేదు. చివరకు తానే ఒక మెట్టు దిగింది. సివిల్ లైన్నుగుండా జాతీయ పథకంతో ఊరేగింపు ననుమతిస్తానంది. ఖైదీల్ని విడుదల చేసింది. విజయేత్సహంతో పటేల్ సత్యాగ్రహాన్ని నిలిపివేశారు.

బార్డోలీ విజయం, పటేల్ కు సర్దార్ బిరుదం

1928 లో బార్డోలీ ప్రాంతంలో బొంబాయి ప్రభుత్వం భూమి శిస్తు విపరీతంగా పెంచేది. శిస్తు చెల్లించని రైతుల పొలాలను, పశువులను ప్రభుత్వం జప్తుచేయంచింది. రైతులు పటేల్ ను తమ నాయకునిగా ఎన్నుకొన్నారు. బార్డోలీ సమస్య యావద్బారత సమస్యగా మారింది. పటేల్ రైతుల పోషణ నిలిచి ప్రభుత్వాన్ని ఎదిరించారు. ఆ ప్రతిఘాతనకు ప్రాహుత్వం లొంగిరాక తప్పలేదు. శిస్తు భారం తగ్గించక తప్పలేదు.

బార్డోలీ విజయం పటేల్ విజయమే. అందుకే గాంధీజీ పటేల్ ను 'బార్డోలీ సర్దార్' అని సంభోధించి సత్కరించారు. అప్పటినుంచి 'వల్లభాయ్ పటేల్' 'సర్దార్ వల్లభాయ్ పటేల్' అయినారు.

ఉప్ప సత్యాగ్రహం

1929 డిసెంబర్ లో లెహెర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో 'సంపూర్ణ స్వరాజ్య' మే కాంగ్రెస్ లాశ్యంగా తీర్మాణింపబడింది. గాంధీజీ ఉపచట్టాన్ని ధిక్కరింపదలచారు. స్వరాజ్య సమరంలో ప్రజానీకం కావించవలసిన త్యాగాలను గూర్చి పటేల్ ప్రచారం చేసున్నారు. అది సహించలేక 'రాసు' ఉద్యమంలో ఆయనను అరెస్టుచేసి, 3 నెలలు జైలుశిక్ష విధించింది. ఏప్రిల్ 6  న గాంధీజీ "దండి" వద్ద ఉపచట్టని ఉల్లంఘించారు. ప్రభుత్వం ఆయనను, పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసింది. ఇంతలో వెటెల్ శిశకలం పూర్తియై విడుదలయ్యారు. నేడు కాంగ్రెస్ కు సమర్ధుడైన సారధి లేదన్న విషయం అయన గమనించారు. ఆ భారాన్ని తన తల పైకెత్తుకున్నారు. ఉప్ప సత్యాగ్రహంతో పాటు కైరా, బోథిసాద్ లలో పన్ను నిరాకరణోద్యమం కూడా సాగుతున్నది. ప్రభుత్వం మళ్ళీ తన దమన చర్యలు ప్రారంభించింది.

తిలక్ వర్ధంతి సందర్భంగా జులై 31 న బొంబాయి లో గొప్ప ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపుకు అద్వర్యం వహించిన కారణంగా పోలీసులు పటేల్ ను మరో మూడు నెలల పాటు జైలులో నిర్బంధించారు. ఆ శిక్షకాలం కూడా పూర్తిచేసుకొని అయన బయటకు వచ్చారు. రాజద్రోహ నేరం మేపి ఆయనకు మరో తొమ్మిదినెలలపాటు జైలుశిక్ష విధించారు.

మొదటి రౌడీటేబుల్ సమావేశంలో ప్రధాన రాజకీయపక్షమైనా కాంగ్రెస్ పాల్గొనలేదు. అందువల్ల దానికి ప్రాధాన్యత లేకపోయంది. కనీసం రెండవ రెండ్ టేబుల్ సమావేశంలోనైనా కాంగ్రెస్ ను పాల్గొనేట్లు, చేయాలనీ ప్రభుత్వం సంకల్పించింది. అందుకే బాపూజీ, పటేల్ మెదలైన బయకులను విడుదల చేసింది. గాంధీజీ, రాజప్రతినిధి ఇర్విన్ లకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

1931 వ సంవత్సరంలో పటేల్ అధ్యక్షతన కరాచీలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఈ సమావేశంలో పౌరుల ప్రాధమిక హక్కులనుగూర్చి తీర్మానం జరిగింది. ముస్లింలతో సమైక్య సహకారాలు సాధించటానికి ఒక కమిటీ ఏర్పాటాయండి.

ఇర్విన్ స్ధానంలో విల్లింగ్టన్ రాజప్రతినిధిగా ఢిల్లీ కోటాలో పాగావేశాడు. అతడు కాంగ్రెస్ ఎదల శత్రుత్వ వైఖరిని, ప్రజాదాద్యమాలపట్ల నిరంకుశధోరణిని ప్రదర్శిస్తున్నాడు. ఈ పరిస్ధితుల్లో తాను రోయండిటేబుల్ సమావేశానికి హాజరు కావడం నిరర్ధకమనీ గాంధీజీ ప్రకటించారు. అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక్కసారిగా సాధుజంతువుగా మారింది. గాంధీ-ఇర్విన్ ల ఒప్పందం సక్రమంగా అమలు జరుపబడుతుందని హామీ ఇచ్చింది. దాని పై సంతూరుప్తిపడి గాంధీజీ లండన్ వెళ్ళారు.

ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోకపోగా మరింత క్రారంగా ప్రవర్తిస్తుంది. అధ్యశుని హౌదాలో పటేల్ ఈ దారుణాలను ప్రతిఘాటిస్తున్నారు.

రూడీటేబుల్ సమావేశం బెడిసికొట్టింది. సీమనుండి తిరిగి వచ్చిన గాంధీజీ దేశం అగ్నిగుండంగా మారిపోవడం గమనించారు. పటేల్ అధ్యక్షతన కాంగ్రెస్ వారికింగ్ కమిటీ సమావేశమైయింది. తిరిగి శాసనోల్లంఘునం చేయాలనీ తీర్మానించింది. ప్రభుత్వం ఈ విషయం తెలిసి అపుమేఘాలమీద పోలీసుల్ని పంపి, గాంధీ, పటేల్ మెదలైన కాంగ్రెస్ పెద్దలను అరెస్టు చేయించింది. కాంగ్రెస్ కమిటీల సక్రమ సంఘాలుగా ప్రకటించి ఆ క్రార్యాలయాలకు సీళ్ళు వేయించింది. పాశవికంగా ప్రజల పై విరుచుకుపడింది.

ఈ సందర్భంగా పటేల్ గాంధీజీతో పాటు పదహారు నెలలపాటు ఎరవాడ జైలులో గడిపారు. ఆకాలంలో అయన గాంధీజీకి నీడలా తోడుండి, సమస్త సేవలు చేశారు. పటేల్ తో తన ఈ సాహచర్యం ఒక అదురుష్టంగా గాంధీజీ భావించారు. ఆయనలో తన మాతృమూర్తిని దర్షించానని ప్రశంసించారు.

జైలులో గాంధీజీ అస్పృఅశ్యత నిర్ములనోద్యమ విజయానికి ఉపవాసదీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం ఆయనకు అండ్ విడుదల చేసింది.

వల్లభాయ్ ముక్కుకు సంభందించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధికి శాస్ర్తచికిత్స చేయవలెనని, అందుచే ఆయనను విడుదల చేయవలసింది ప్రభుత్వానికి వైద్యులు సలహా ఇచ్చారు. ఆ పరిస్థితుల్లో అయన గాంధీజీ విడుదలైన 7 మాసాలకు విడుదలయ్యారు.

అయన తన అస్వస్ధతకు తాత్కాలిక చికిత్స పొందారు. వైద్యులపారేశాం అవసరమన్నారు. కానీ అంతటి వ్యవధి తనకు లేదని అయన తిరిగి సేవాకార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. గుజరాత్ విద్యాపీఠాన్ని క్రమబద్దంచేసి, అందులో గాంధీజీ బోధనలకు ప్రాధాన్యం కల్పించారు. బోథిసాద్ తాలూకాలో విజృంభించిన ప్లేగు వ్యాధి నివారణకేంతో కృషి చేశారు. ప్రభుత్వపు దోపిడీచే కృంగిపోయిన గుజరాత్ రైతులకోసం 10 లక్షల రూపాయలు పోగుచేసి అయన వారి నడుకొన్నారు.

కాంగ్రెస్ పాలన

1935 ఇండియా చట్టం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికలలో పోటీచేయడానికి కాంగ్రెస్ నిశ్చయంచిండి. ఈ కార్యకలాపాలను నిర్వహించడానికి, అధ్యార్ధులని నిర్ణయించటానికి కార్యవర్గం ఒక పార్లమెంట్ సబ్ కమిటీనేర్పరించింది. దానికి పటేల్ అధ్యషుడు. ఈ సందర్భాన కమిటీ నిర్వచించిన మౌలిక సూత్రాలను అయన అక్షరాలా అమలుజరిపారు. ఎవరి విమర్శలను లెక్కచేయలేదు. ఎన్నికలలో కాంగ్రేస్ ఘునివిజయం సాధించింది. 8 రాష్ట్రాలలో కాంగ్రెస్, 2 రాష్ట్రాల్లో ముసలోమిలీగ్ ప్రభుత్వాలేర్పడ్డాయి.

వల్లభాయ్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో ప్రముఖస్ధానం వహించారు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విషయాలలో కె.ఎఫ్.నారిమన్ (బొంబాయి), ఎస్.బి.ఖరే (మధ్యప్రదేశ్), సుభాష్ చంద్రబోస్ (బెంగాల్) మెదలైన వారితో అయన తలపట్ల పత్తివలసి వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సుకు, హరిజనోద్ధరణకు ఎంతగానో పాటుపడ్డాయి. వాటి కనుగుణంగా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వాల పాలన ప్రజారంజకంగా  రెండు సంవత్సరాలు సాగింది.

రెండవ ప్రపంచ యుద్ధమేఘాలు ఐరోపా ఖండన్నవారించాయి. బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రేస్ ను సంప్రతిహించకుండానే భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి ఏడిచిందీ. అందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి.

జర్మనీకి జపాను కూడా తోడుకావడంతో మిత్రరాజ్యాల పరిస్ధితి మరింత దిగజారిపోయంది. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంనుంచి సైన్యాల్ని, ధనాన్ని సమీకరిస్తున్నది. దీన్ని వ్యతిరేకించిన నెహ్రు ప్రభృతులను నిర్భంధించింది. గాంధీజీ ఈ అక్రమాలను సహించలేక 'వ్యక్తి సత్యాగ్రహాన్ని' ప్రారంభించారు. రెండవ సత్యాగ్రాహిగా నిర్ణయంపబడిన పట్ల యర్వేద జైలులో నిర్బంధించబడ్డారు.

ప్రభుత్వ కూటనీతి కారణంగా దేశంలో మతకలహాలు చెలరేగాయి. అందువల్ల గాంధీజీ సత్యాగ్రహాన్ని నిలిపివేశారు. జైలులో పటేల్ ఆరోగ్యం శినీంచింది. ఆ కారణంగా ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది.

ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పరిస్ధితి మరింత క్లిష్టమయండి. భారతీయుల సహకారం పొందాలనే ఉద్దేశంలో జరిపిన క్రీప్స్ రాయబారాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది.

క్విట్ ఇండియా

1942  ఆగష్టు 8 న బొంబాయి లో కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. 'ఆంగ్లేయులు తమ మూట, ముల్లె సర్దుకుని దేశాన్ని విడిచిపోవాలంటు' ఉద్యమం ప్రారంభమయండి. బాపూజీ గర్జనలకు జడిసి ప్రభుత్వం ఆయనతోపాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులను జైళ్ళలో నిర్భంధించింది. ఈ సందర్భంగా పటేల్ ను అహమ్మద్ నగర్ కోటాలో 34 నెలలు నిర్భంధించింది. ఈ దీర్ఘకాలపు జైలు శిక్షలో ఆయనకు ప్రేవుల తాలూకు వ్యాధి మళ్ళీ తిరగబెట్టింది. అయినా ప్రభుత్వం ఆయనను విడిచిపెట్టదలచుకోలేదు.

భారత వైస్రాయి కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతో జూన్ 25 న సిమ్లాలో చర్చలు జరపాలని నిశ్చయంచారు. ఆ అవసరం గుర్తించి పటేల్ ను మిగిలిన కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రభుత్వం విడుదల చేసింది. పటేల్ ఆ సమావేశంలో గాంధీజీని కలిశారు. ముస్లింలీగ్ వారి మడత పేచీలతో సిమ్లా చర్చలు విఫలమయ్యాయి.

స్వాతంత్య్రా భానూదయం

1945 లో బ్రిటిష్ లో భారతదేశం పై సానుభూతిగల అట్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, మిత్రరాజ్యాలకు విజయం లభించింది. భారతదేశంలో 1946 లో ఎన్నికలు జరిగాయి. కేంద్ర శాసనసభలో నూటికి 91 సీట్లను కాంగ్రెస్ గెల్చుకొన్నది. అంతేకాక 8 రాష్ట్రాల్లో మంత్రివర్గాలు స్ధాపించగలిగింది. రెండురాష్ట్రాలలో ముస్లింలీగ్, ఒక రాష్ట్రంలో మిశ్రమ మంత్రివర్గం ఏర్పడ్డాయి. ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికార మంత్రివర్గం భారతదేశానికి అట్లీ రాయభారం పంపాడు. ఫలితంగా అర్ధంతర ప్రభుత్వమేర్పడింది. అందులో నెహ్రు, పటేల్ రాజాజీలున్నారు.

తమకు ప్రత్యేక రాజ్యం కావాలని ముస్లింలీగ్ తమ పాలనలోని రాష్ట్రాల్లో మతకలహాల్ని సుర్ష్టిస్తోమది. ఎందరో హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో ఆ ప్రాంతాల్ని విడిచి ఇతర రాష్ట్రాలకు వలస వచ్చారు. దుష్టంగాన్ని ఖండించి శేష శరీరానికి రక్షణ కల్పించవలసిన పరిస్ధితి ఏర్పడింది. ఆ కారణంగా అనిష్టమైన దేశ విభజనకు తల ఒగ్గవలసివచ్చింది. 1947 ఆగష్టు 15 న దేశ పాకిస్ధాన్, భరత్ అనే రెండు ముక్కలుగా విడిపోతూ స్వాతంత్య్రాన్ని సముపార్జించుకొన్నది. అధ్యషులు బాబు రాజేంద్రప్రసాద్, ప్రధాని నెహ్రు, ఉపప్రధాని పటేల్.

దేశ విభజనానంతరం కూడా ఆశించిన ఫలితాలు సమకూడాలేదు. పాకిస్ధాన్ నుండి లక్షల మంది హిందువులు, సిక్కులు భారతదేశానికి తరలి వస్తున్నారు. వారిందరి పునరావాసాలకు పటేల్ అహర్నిశలు పాటుపడ్డారు.

స్వదేశ సంస్ధానముల విలీనం

బ్రిటిష్ పాలనా కాలంలో దేశం రెండు భాగాలుగా ఉండేది. వానిలో 'బ్రిటిష్ ఇండియా' అనబడే భాగం బ్రిటిష్ ప్రభుత్వంచే పాలింపబడేది. 'నేటివ్ ఇండియా' అనబడే భాగం ఆంగ్ల ప్రభుత్వానికి లోబడి స్వదేశ సంస్ధానాధీశులచేత పరిపాలింపబడుతుండేది. ఈ సంస్ధానాలు 562 వీటిపై బ్రిటిష్ సార్వభౌమత్వం 1947 జూన్ 3 నాటికీ అంతమవుతుంది. ఇవి ఇండియాలోగాని, పాకిస్ధాన్ లోగాని కలియవచ్చు. లేదా సాతంత్రంగానైనా ఉండవచ్చునని వారి ప్రకటించారు. వీటిలో 550 సంస్ధానాలు భారత భూభాగంలోను, మిగిలినవి పాకిస్ధాన్ లోను ఉన్నాయి.

ఈ దేశం గతంలో చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. అంత కలహాల కారణంగా వేయి సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గి బలహీనపడింది. ఇంత శ్రమపడి స్వతంత్రత సంపాదించుకొని ఏనాడూ కూడా వారినలాగే వదిలివేస్తే ఈనగాచి నక్కలపాలు చేసినట్లవుతుంది. అందువలన ఈ సంస్ధానాలశాఖ ఒకటి ఏర్పడింది. దానికి మంత్రి పటేల్. అయన సంస్ధానాధీశుల్ని సమావేశపరిచారు. వారికేన్నోవిధాలా నచ్చజెప్పి వారి భయాల్ని తీర్చారు. వారు కూడా ఆయనగారి ప్రతిపాదనలకు సంమథించి, తమ సంస్ధానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. కానీ జునాగడ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్ధానాల దగ్గరే సమస్యలెదురయ్యాయి. కానీ పటేల్ తన అచంచల ధైర్యసాహసాలతో, పట్టుదలతో వాటిని కూడా ఇండియన్ యూనియన్ లో విలీనం చెయ్యగలిగారు.

దేశ విభజన కారణంగా మనదేశం 3.6 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం కోల్పోయంది. కానీ పటేల్ రాజనీతివల్ల తిరిగి 5 లక్షల చదరపు మైళ్ళ ప్రాంతం మనకు సమకూడింది.

అస్తమయం

వయెభారం వల్ల, అనారోగ్యం వల్ల, కార్యభారం వల్ల పర్ల్ క్రుంగిపోయారు. బొంబాయి వాతావరణం ఆయనకు ఉపశాంతి విస్తుందన్న వైద్యుల సలహా మేరకు అయన అక్కడకు చేరారు. కానీ ప్రయెజనం లేకపోయండి. మహౌషదాలు సైతం ఆ సమయానికి ఓడిపోయాయి. నవభారత నిర్మాత, సుస్ధిర, రక్షకుడు, మకుటంలేని మహారాజు, భారతజాతి ప్రియతమా నాయకుడు, ఉక్కుమనిషి, కార్యశూరుడునైన పటేల్ తన 75 వ ఏట, 1950 డిసెంబర్ 15 న స్వర్గస్ధులయ్యారు. అయన చివరి కోర్కెప్రకారం బొంబాయి లోని 'క్వీన్స్ మేరీ' శ్మశానవాటికలో అయన పవిత్ర దేహాన్ని దహనం కావించారు. అగ్నిదేవుడా శరీరంనహుతిగొనేవేళ లశోప లక్షల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. నెహ్రు తన కుడిభుజం పడిపోయినట్లుగా ఎంతగానో వాపోయారు.

నేటికయినా దేశం ఏదైనా శిష్ట పరిస్ధితి నెదుర్కొన్నపుడు 'ఈ సమయంలో పటేల్ ఉంటే ఎంత బాగుండేదో!' అనే మాట ప్రజల నాలుకల పై ఆడుతుంటుంది.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate