অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సయ్యద్ నశీర్ అహ్మద్ బేగం హజరత్ మహల్

సయ్యద్ నశీర్ అహ్మద్ బేగం హజరత్ మహల్

ప్రధమ స్వాతంత్య్ర సమరంలో భాగంగా దేశవ్యాప్తంగా సాగిన తిరుగుబాట్లలో ప్రధానమైనది 'లక్నో' పోరాటం. ఈ చారిత్రాత్మకమైన పోరు అవధ్ మహారాణి బేగం హజరత్ మహల్ నేతృత్వంలో జరిగింది. బ్రిటిష్ మష్కారంకాల సామ్రాజ్య విస్తరణకాంక్షకు భారతగడ్డ మీద ఒక్కొక్క సంస్ధానం బలైపోతున్న పరిస్ధితులవి. లక్నోను కూడా తమ ఆధీనంలోకి తెచ్చేకోవాలన్న కాంక్షతో బ్రిటిష్ పాలకులు ప్రతిపాదన చేయగా, లక్నో సంస్ధానాధీశుడైన నవాబ్ వాజిద్ అలీషా వ్యతిరేకించాడు ల్నో వజీర్ యేలినబీఖాన్ ను లోబరుచుకుని, నమ్మక ద్రోహంతో ఆలీషాను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకొని కలకత్తా కారాగారానికి రహస్యంగా తరలించింది. సంస్ధానాధీశుని అడ్డు తొలిగించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం లక్నో సంస్ధానం రద్దయినట్టు ప్రకటించింది.

ఈ కుతంత్రాలను తొలుత నుండి గ్రహించిన అవధ్ బేగం తీవ్రంగా వ్యతిరేకించింది. బేగంను కూడా నిర్బంధంలోకి తీసుకునేందుకు బ్రిటిష్ సైనికాధికారులు వలపన్నాగా ఎంతో చాకచక్యంతో తప్పంచుకుని ఆమె అజాతంలోకి వెళ్ళిపోయారు. బేగం సురాశియంతంగా తప్పించుకున్నారన్న వార్త విన్న ప్రజానీకం బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. బేగం హజరత్ మహల్ తన 13 సంవత్సరాల కుమారుడు బీర్జాస్ ఖరీర్ ను వెంట తీసుకుని మారువేషంలో లక్నో సంస్ధను ప్రాంతమంతా తిరుగుతా తిరుగుబాటు విరులైన నానాసాహెబ్. తాంతియాతోపే, మౌల్వి అహమ్మదుల్లాఖాన్ తదితరులను కలుసుకుని బ్రిటిష్ ముష్కరులను మాతృగడ్డ నుండి తరిమివేసేందుకు నడుంకట్టారు.

ప్రజలలో రహస్యంగా తిరుగాడుతూ తిరుగుబాటు ఉద్దేశ్యాలను వివరిస్తూ ప్రజానీకాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించసాగారు. అదను చూసి 1857 మే 30 వ తేదీన లక్నో 'చావని' లో ఫిరంగిపేల్చి బేగం హజరత్ మహల్ తిరుగుబాటు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తాకిడికి తట్టుకోలేకపోయిన బ్రిటిష్ సైన్యం పరారవ్వగా, బ్రిటిష్ తిరుగుబాటును నడిపించిన బేగం హాజరత మహల్ తిరిగి లక్నోను స్వాధీనం చేసుకున్నారు. ఆనతి కూలినవర్గాలు ఒక మహిళను పాలకురాలిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేరని గ్రహించిన ఆమె తన కుమారుడ్ని తాజాగా ప్రకటించి పరిపాలనను తాను చేపట్టారు. హిందూ ముస్లింల ఐక్యత యెక్క బలాన్ని గ్రహించిన ఆమె రాజా జియాలాల్. రాజమం సింగ్, రాజా దేవి, బాష్ సింగ్. రాజా బెనిముద్దులంటి హిందూ ప్రముఖులను ఆహ్వానించి తన ఆస్ధానంలో తగిన స్ధానం కల్పించారు.

బేగం హజరత్ మహల్ గా ఖ్యాతిగాంచిన ఆమె అసలు పేరు మహమ్మదీ బేగం. పద్నాల్గవ ఏట వివాహం చేసుకునే నాటికే ఆమె అన్ని రకాల యూదుడు విద్యలను నేర్చి ఉండటంతో షాజన్ పూర్, లక్నో యుద్ధాలలో తాను స్వయంగా పాల్గొన్నారు. ప్రజలను, స్వదేశీ సైనికులను ఆకట్టుకునేట్టుగా, తిరుగుబాటు సైనికులను ప్రత్సాహించే విధంగా తన అద్భుత స్రంగాలను అనూహ్యమైన సైనిక విన్యాసాలకు ఆమె పెట్టింది పేరు.

బేగం హజరత్ మహల్ చేతిలో ఎదురైనా పరాభవాన్ని భరించలేని బ్రిటిష్ సైనాధికారులు అపార సైనిక శక్తిని సమకూర్చుకుని మళ్ళి లక్నో మీద దాడి చేశారు. అప్పటికే పలుచోట్ల తిరుగుబాటును అణచివేసిన ఉత్సాహంతోనున్న బ్రిటిష్ సైనికాధికారులు లక్నోను నాలుగువైపులా నుండి చుట్టుముట్టారు.  బేగం స్వయంగా యుద్ధభూమిలో దిగి బ్రిటిష్ సైనిక మూకలను చీల్చి చెండాడసాగింది. తుపాకులు, ఫిరంగిదళాలతో అన్ని వైపులా నుండి ఉప్పెనలా ముంచుకువస్తున్న బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ బేగం అనుచరులు ఒక్కొక్కరు నేలకొరిగి పోసాగారు. బేగం సైనికబ లం బలహీనపడసాగింది. యుద్ధ ఫిలితం ఎలాగున్నా హజరత్ మహల్ ను సజీవంగా పట్టుకుని, బంధించి లొంగదీసుకోవాలని బ్రిటిష్ సైనిక అధిక్రరులు వ్యూహం వున్నారు. ఆ విషయం తెలుసుకున్న బేగం శత్రువు చేత చాకచక్కంగా తప్పించుకున్నారు. లక్నో ఆంగ్లేయుల వశమైపోయంది.

యుద్ధ రంగం నుండి నేరుగా నేపాల్ అడవులకు చేరుకున్న ఆమె తన సైన్యాన్ని కూడగట్ట నారభించి నానాసాహెబ్ ను కలుసుకుని తిరిగి చేసేందుకు సమాలోచనలు జరుపసాగారు. అజాతం నుండే ప్రజలకు ప్రేరేపిస్తూ దేశభక్తులైన సైనికులను సమీకరించారు. అందుకు తన యావత్తు సంపదను నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయసాగారు. బేగం ప్రయత్నాలను పసిగట్టిన బ్రిటిష్ సైనికాధికారులు ఆమెను లొంగదీసుకునేందుకు గాను 17 లక్షల రూపాయల పెన్షన్ సంక్రమింపచేస్తామని ఆశ చూపుతూ ప్రతిపాదనలు పంపారు. మాతృభూమి విముక్తి తప్ప ఠాణాకేదీ అంగీకారం కాదని బేగం స్పష్టంగా ప్రకటించి ఆంగ్లేయులను ఆశ్చర్యచకితుల్ని చేశారు. విక్టోరియా మహారాణి ప్రకటనకు ప్రతిగా లక్నో సంస్ధానం నుండి తాను తన స్వదేశీ ప్రకటన విడుదల చేసి చారిత్రాత్మక సంచనలం సృష్టించారు.

మాతృగడ్డ స్వేచ్ఛ, విముక్తి కోసం సాగే పోరాటంలో మరణమే తప్ప మారేది ఆఖరి మజిలీ కాదని ప్రకటించిన బేగం హజరత్ మహల్ 1879 లో నేపాల్ పర్వతాల్లో సాధారణ మహిళగా కన్నుమూశారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate