హోమ్ / విద్య / బాలల ప్రపంచం / భూగోళం వేడెక్కుతోంది.
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భూగోళం వేడెక్కుతోంది.

భూగోళం వేడేక్కదానికి గల కారణాలు, పర్యవసానాల గురించి తెలుసుకుందాము.

లక్ష్యం

భూగోళం వేడేక్కదానికి గల కారణాలు, పర్యవసానాల గురించి తెలుసుకుందాము.

భౌగోళిక వెచ్చదనం తగ్గించడానికి మనం ఏమేమి చేయాలో తెలుసుకుందాము.

నేపధ్యం

కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లు, క్లోరో ఫ్లోరో కార్బన్ లు, హైడ్రోకార్బన్ లు, మీథేన్ మొదలైన వాయువులను భూమిని వేడెక్కించే వాయువులు(గ్రీన్ హౌస్ వాయువులు) అంటారు.

భూమిని వేడెక్కించే వాయువులు రేడియేషన్ ని ఆపి, భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని నష్టపోకుండా చూస్తాయి. అంతే కాక భూమి ఉష్ణోగ్రతను అదుపు చేస్తాయి.వాతావరణంలో ఈ వాయువులు ఎక్కువైతే భూమి బాగా వేడెక్కుతుంది.

పద్ధతి

 1. ఒకే పదార్ధంతో చేసిన, ఒకేలా ఉన్న రెండు గ్లాసులను తీసుకోవాలి. రెండింటిలోనూ సమానంగా నీటిని పోయండి. (సగభాగం)
 2. ఉష్నమాపకంతో గ్లాసులలోని నీటి ఉష్ణోగ్రతను నమోదు చేయండి.
 3. రెండు గ్లాసులను బయట ఉంచాలి. గ్లాసులలోని నీటిపై సూర్య కిరణాలు పడేలా చూసుకోవాలి.
 4. ఒక గాజు గిన్నెను తీసుకొని గ్లాసును పూర్తిగా మూసి ఉంచేలా దాని మీద బోర్లించాలి.
 5. కనీసం రెండు గంటల తర్వాత రెండు గ్లాసులలోని నీటి ఉష్ణోగ్రతను నమోదు చేయాలి.
 6. రెండు ఉష్నోగ్రతల మధ్య తేడాలను లెక్కించండి.ఏ గ్లాసులోని నీరు వేడిగా ఉందో నమోదు చేయండి.
 7. నీటికి బదులుగా మళ్ళీ మంచుతో ప్రయోగాన్ని చేయండి.గ్లాసులోని మంచు పూర్తిగా కరగదానికి పట్టిన సమయాన్ని నమోదు చేయండి.
 8. రెండు గ్లాసులలో గల నీటి ఉష్నిగ్రతలలో తేడా ఉండడానికి మంచు కరుగుటకు పట్టిన సమయాలలోని తేడాలకు కారణాలను కనుగొనండి.

ముగింపు

భూగోళం వేడెక్కడానికి కర్మాగారాలు, రసాయనిక పరిశ్రమలు ప్రధానంగా కారణమవుతున్నప్పటికీ మనం అనుసరిస్తున్న పద్దతులు కూడా ప్రభావం చూపుతున్నాయి. రిఫ్రిజిరేటర్ల నుండి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లు, ఆకులు, టైర్లు, ప్లాస్టిక్ కవర్ల వంటి చెత్త తగలబెట్టడం వలన విడుదలయ్యే వాయువులు భూగోళం వేదేక్కదానికి కారణమవుతున్నాయి. ఈ ఉద్గారాలను తగ్గించడం మన చేతిలో ఉన్న పనే కాబట్టి బుగ్గ బల్బుల వాడకం తగ్గించడం, ప్రిజ్,ఏ.సి. లను అవసరమైన నెలలకు మాత్రమె పరిమితం చేసుకోవడం, ఆకులు కాల్చకుండా ఉంచడం ద్వారా మన వంతు భాద్యత నేరవేర్చుకోగల వారమగుతాము.

మీ పరిశీలనకు- భౌగోళిక వెచ్చదనానికి మధ్యగల సంబంధాన్ని విశ్లేషించండి.

తదుపరి చర్యలు

 1. ఎండలో ఉన్న ఒకే రకమైన రెండు కార్ల లోపలి ఉష్ణోగ్రతలను పరిశీలించండి. తరువాత మొదటి కారు కిటికీ అద్దాలు పూర్తిగా తెరచి ఉంచాలి. ఎండవ దాని కిటికీ అద్దాలు పూర్తిగా మూసి ఉండాలి. రెండు గంటల తర్వాతా మళ్ళీ ఉష్ణోగ్రతలను కొలవండి.
 2. భౌగోళిక వెచ్చదనం-దాని ప్రభావానికి సంబందించిన సమాచారాన్ని వార్తా పత్రికలూ, మ్యాగజైన్ల నుండి సేకరించండి.
 3. భౌగోళిక వెచ్చదనం వలన కలిగే దుష్ప్రభావం ఏమిటి? దీని తగ్గించ దానికి మీ ఇల్లు, స్కూలు, ఊరి స్థాయిలో మనం ఏమేమి చేయవచ్చో చర్చించండి.

ఆధారము: http://www.teachersbadi.in

2.94230769231
t.bhargavi Aug 27, 2018 06:35 AM

Lakshyam క్యూస్షన్ కి ఆన్సర్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు