విధానపరమైన నిర్ణయాలు లేదా అభివృద్ధిపథంపై పర్యావరణ వేత్తల కృషి పర్యావరణ ఉద్యమ ప్రభావాన్నితెలుసుకుందాము..
సహజ, సామాజిక వాతావరణాన్ని పరిరక్షించాలన్నా తిరిగి పొందాలన్నా మరియు మెరుగుపరచాలన్నా పర్యావరణవాదం ఉండాలి. సహజ వనరుల సంరక్షణ కాలుష్య నివారణ, సుస్థిరంగా నేలను ఉపయోగించడం మొదలైనవన్నీ పర్యావరణవాదం కిందకు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణంపై ప్రభావం చూపే అన్ని చర్యలను బాధ్యతగల పౌరులుగా మనం మాపనం చేయాలి. ఆరోగ్యకరమైన పర్యావరణం ఉండాలంటే మనకోసం ప్రమాణాలను రూపొందించుకోవటం కూడా అవసరం. పెద్దవారు, తోటివారిపై ప్రభావం చూపగల గొప్పశక్తి యువతరానికి ఉంది.
1. దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న పర్యావరణవేత్తల పేర్లు, (శక్తివంతమైన) పర్యావరణ ఉద్యమాలను ఐదింటిని రాయండి.
2. ఒక పర్యావరణవేత్తను గురించిగాని , పర్యావరణ ఉద్యమాన్ని గురించిగాని అధ్యయనం చేయండి.
3. పర్యావరణవేత్తలు, పర్యావరణ ఉద్యమాలు ఏ పనులపై కేంద్రీకృతమైనవో కనుగొనండి.
4.పర్యావరణవేత్త, పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి ఈ కింది సమాచారాన్ని సేకరించండి.
5. పర్యావరణ సృహను కల్లించడంలో, పర్యావరణాన్ని అభివృద్ధిపరచుటలో వారు చేసిన సేవలను పేర్కొనండి.
ఒక చెట్టును నరికివేయకుండా కాపాడడం, ప్రమాదంలో ఉన్న పిట్టకో, కుక్కకో వైద్యం చేయించడం, నీటి కుంటలోకి మురుగు, చెత్త చేరకుండా చూడడం వంటివి కూడా పర్యావరణ పరిరక్షణే. పాఠశాల ఆవరణంలో
మొక్కల పెంచడం, నల్లా దగ్గర బురద మురికి కాకుండా చూడడం, మన ఇంటిని, పాఠశాలను ప్లాస్టిక్ రహితంగామార్చుకోవడం వంటివి కూడా ఉద్యమంలా చేపట్టవలసిన అంశాలు.
మీ పరిశీలనల ఆధారంగా, పర్యావరణ విషయాల పట్ల ప్రజలలో ఏవిధంగా సృహను కల్లించవచ్చో నివేదిక తయారుచేయండి. మీ సహవిద్యార్థుల సలహాలను జోడించండి.
1.మీరు సేకరించిన సమాచారాన్ని పాఠశాల ప్రదర్శనాబల్లపై ప్రదర్శించండి.
2. పాఠశాలలో పర్యావరణానికి సంబంధించిన చిత్రాలను (డాక్యుమెంటరీ ఫిలిమ్స్) ప్రదర్శించేలా ఏర్పాటుచేయండి.
3. మీ పాఠశాలలో పర్యావరణమిత్ర (ఎకో ఫ్రెండ్లీ) కార్యక్రమాలను నిర్వహించి ఫలితాలు నమోదు చేయండి.
4. పర్యావరణవేత్తలు, పర్యావరణఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇతరులకు తెలియ చేయండి.
ఆధారము: apscert
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020