অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మన మానవ మూలాలు

రాతి యుగం

బైబిల్ ప్రకారం ప్రప్రథమ మానవులు ఆడామ్, ఈవ్ లు. వాళ్న అచ్చం నేటి మనుషుల లాగానే ఉండేవారట. ఆధునిక యుగం వరకు యూదులు, క్రిష్టియున్ల మరియు ముస్లిం న కూడా అలాగే అనుకునేవారు.

అయితే ఈ ఆడామ్, ఈవ్ లు ఎప్పుడు సృష్టింపబడ్డారు? బైబిల్ కచ్చితంగా సమాధానం చెప్పదు. కాని బైబిల్ చదివిన వాళ్లు ఆ కాలాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నించారు. బైబిల్ లో తదనంతరం జరిగిన కొన్ని సంఘటనల తారీఖులు వాళ్ళకి తెలుసు. ఉదాహరణకి బాబిలోనియన్లు  జెరూసలాం ని ముట్టడించి అక్కడి ఆలయాన్ని ధ్వంసం చేసింది క్రీ.పూ. 586 లో అని తెలుసు.

ఆ సంగతిని ఆసరాగా తీసుకుని ఇంకా గతంలోకి వెరు. బైబిల్ లో చెప్పబడ్డ రాజులు ఒక్కొక్కరు ఎంత కాలం పరిపాలించి ఉంటారో ఆలోచించారు. ప్రాచీనులైన అబ్రహాం, నోవాలు ఎంతెంత కాలం జీవించి ఉంటారో, వాళ్లు జన్మించకపూర్వం  వారి  తండ్రుల వయసు ఎంతుండేదో - ఇవన్నీ లెక్కలు కట్టడ౦ జరిగింది.

ఇలా ఆలోచించి 1630 లో జేమ్స్ ఉషర్ (1581-1656) అనే ఐరిష్ పండితుడు సృష్టి జరిగిన తేదీని అంచనా వేయడం జరిగింది. క్రీ.పూ. 4004లో సృష్టి జరిగింది అని లెక్కలు వేసి చెప్పాడు. అదే నిజమైతే ఈ ప్రపంచం వయసు సుమారు  ఆరు వేల ఏళ్లు న కూడా ఉండదు.

బైబిల్ తో సంబంధం లేకుండా లభ్యమయ్యే చరిత్ర మాటలేమిటి?

ఉషర్ కాలంలో సామాన్య చరిత్ర గతంలోకి అంత దూరం పోయేది కాదు. ప్రాచీన రోమ్ చరిత్ర తెలిసి ఉండేది. అయితే రోమ్ సాపించబడింది కేవలం క్రీ.పూ. 753 లోనే. ప్రాచీన గ్రీకు చరిత్ర మరికొంచెం వెనక్కు వెళ్ళేది. మొటమొదటి ఒలింపిక్ క్రీడలు క్రీ.పూ. 776 లో జరిగాయి. ఐతిహాసిక యుద్దం క్రీ.పూ. 1200 కి కొద్దిగా ముందు జరిగి ఉన్నట్ను కనిపిస్తోంది.

బైబిల్ ప్రకారం సృష్టి ముహూర్తం ఇంకా ఎంతో గతంలో ఉంది. మరి గ్రీకు చరిత్రకి ముందు అసలు చరిత్ర అంటూ ఉందా?

ఈజిప్ట్ చరిత్ర తమ చరిత్ర కన్నా మరింత పురాతనమైనది అనుకునేవారు ప్రాచీన గ్రీక్ చారిత్రకులు.

ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన ఎన్నో శిలాశాసనాలు, లిపులు దొరికాయి గాని వాటిని ఎవరూ చదవలేకపోయేవారు. ఈజిప్ట్ చరిత్ర గురించిన వివరాలు సంపాదించడం ఎలాగో ఎవరీ అర్థం .

1799లో నెపోలియన్ బోనపార్టీ నేతృత్వంలో ఫ్రెంచ్ సేనలు ఈజిప్ట్ ని ముటడించాయి. ఆ సమయంలో ఒక సైన్యాధికారి నైలు నది ముఖద్వారం వద్ద ఉండే రోసెటూ అనే ప్రదేశం లో ఒక శిలాశాసనాన్ని కనుక్కున్నాడు. ఈ రోసెటూ శిల మీద మూడు లిపులలో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. రెండు ఈజిప్షియన్ లిపులు, ఒక గ్రీకు లిపి. గ్రీకు భాష ఎలా చదవాలో చారిత్రకారులకు  తెలుసు. మూడు భాషలలోను ఉన్న రాత ఒక్కటనే అయితే రోసెటూ శిలలో ఈజిప్షియన్లు దేశానికి గ్రీకు అనువాదం దొరికింది అన్నమాట. ఆ విధంగా గ్రీకుని ఆలంబనగా చేసుకుని ఈజిపియన్లు  భాష ఎలా చదవాలో తెలుసుకున్నారు చారిత్రకులు. అయితే గ్రీకు మూలం ఉన్నా, ఈజిప్షియన్ చిహ్నాలకి ఏఏ గ్రీకు పదాలు సరిపోతాయో చెప్పడం కొంచెం కష్టమైన పనే. పురోగతి మందకొడిగా సాగేది. ఇదిలా ఉండగా థామస్ యంగ్ (1773-1829) అనే ఇంగ్లీష్ డాక్టరు 1818లో ఈ సమస్యలో మొటమొదటి విజయం సాధించాడు. తరువాత 1821లో జాన్ ప్లాన్సువా షాంపోల్యోన్ (1790-1832) అనే ఫ్రెంచ్ పండితుడు పని పూర్తి చేశాడు.

ఈజిపియన్ లిపి చదవగలిగిన చారిత్రకులు మొల్లగా ఈజిపియన్ చరిత్రను ఊహించే ప్రయత్నాలు చేశారు. పిరమిడలో అతి పెద్హవి  రమారమి క్రీ.పూ. 2500 కాలంలో నిర్మించబడాయి. ఈజిపియన్ రాజ్యం రమారమి క్రీ.పూ. 2850 కాలంలో స్థాపించబడింది.

ఇదిలా ఉండగా 1846లో పాశ్చాత్య ఇరాన్ లో ఎన్నో భాషలలో రాయబడ్డ  శిలాశాసనం దొరికింది. ఆ భాషలలో ఒకటి అత్యంత ప్రాచీనమైనది. ప్రస్తుతం మనం ఇరాక్ అనుకునే దేశంలో టైగ్రిస్, యఫ్రాటిస్ నదీ తీర మండలాలలో వెలసిన ప్రాచీన నాగరికతలలో ఆ భాష వాడేవారు.

ఆ ప్రాంతపు సంస్కృతి ఈజిప్ట్ కన్నా ప్రాచీనమైనదని తెలిసింది. రమారమి క్రీ.పూ. 3200 కాలంలో ఇరాక్ లో సుమేరియన్ జాతి లిపిని కనుక్కుంది.

ఈ చారిత్రక సంగతులన్నీ బైబిల్ తో సరిపోతున్నట్లు ఉన్నాయి. సృష్టి పుట్టుక క్రీ.పూ. 4004 లో జరిగిన ప్రాచీన సంస్కృతుల పుట్టుకకు  పెరుగుదలకి ఇంకా తగినంత సమయం ఉంది.

ఇంతలో భూమి యొక్క అంతరాళాన్ని అధ్యయనం చేసే భౌగోళిక శాస్త్రంలో కొత్త ఒరవడి .

స్కాటూండ్ కి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త జేమ్స్ హటన్ (1726-1797) రాళ్లు ఎలా ఏర్పడతాయో అధ్యయనం చేయసాగాడు. కొన్ని రాళ్లు బురద రూపంలో ఆరంభమై, ఆ బురద మీద ఒత్తిడి పెరిగి, లోన నీరు బయటికి వచ్చి, ఆ బురద గట్టి  పడిన తర్వాత రాళ్లు గా రూపొందినట్లు  అనిపించింది. దీన్నే అవక్షేపక (సెడిమెంటరీ) శిల అంటూరు. ఇది కరుడుకట్టి  అన్న అర్థంగల లాటిన్ పదం నుండి వచ్చింది.

మరి కొన్ని రాళ్లు  అగ్నిపర్వతాల నుండి వచ్చే వెడెక్కిన, కరిగిన లావా నుండి పుట్టాయి.వాయు ప్రభావం చేత, నీటి ప్రభావం చేత రాళ్లన్ని  కాలక్రమేణా ఒరుసుకు పోతుంటూయుని తెలిసింది.

రాతిని తయారు చేసే ప్రక్రియ అయినా, తరుగదీసే ప్రక్రియ అయినా అది చాలా నెమ్మదిగా సాగే వ్యవహారం అని మాత్రం అర్థమయ్యింది. ఆ రాళ్లు  తయారు కావడానికి కోటను కోట్ల  సంవత్సరాలు పట్టి  ఉండవచ్చు. 1785 లో హట్టాన్ తన పరిశోధనల గురించి వ్రాస్తూ భూమి అత్యంత ప్రాచీనమైనది అయ్యుంటుంది అంటూ తన  వెలిబుచ్చాడు.

చాలా కాలం వరకు ఎవరూ హటన్ చెప్పింది ఒప్పుకోలేదు. ఎందుకంటనే అతడు చెప్పింది బైబిల్ కి విరుద్దంగా తావిస్తుంది . అయితే 1830 మరియు 1833 మధ్య కాలంలో చార్లెస్ లయల్ (1797-1875) అనే మరో స్కాటిష్ భౌగోళిక శాస్త్రవేత్త హట్టాన్ వాదనలని సమర్థిస్తూ  మూడు భాగాల గ్రంథాన్ని రాశాడు. హటున్ తదనంతరం మరిన్ని సాక్ష్యాధారాలు బయటపడాయి. ఉదాహరణకి భూమి పైపొర కి చెందిన రాళ్లు స్తరాలుగా (పొరలు) ఏర్పడి ఉంటాయని, ఈ స్తరాలు గొప్ప దూరాలు విస్తరించి ఉంటుందని  కనుగొనబడింది. ఈ స్తరాల రూపురేఖలని బటర్టీ వాటిలో ఇమిడి ఉండే రాళ్ళ  తత్వాన్ని బట్టి  భూమి యొక్క గత చరిత్ర గురించి అంచనా వేయవచ్ఛు. లయల్ ఈ వివరాలన్నీ చాలా స్పష్టంగా వివరించాడు. ఈ విశ్లేషణ తరువాత భూమి అత్యంత ప్రాచీనమైనదని శాస్త్రవేత్తలు తీర్మానించారు. సృష్టి కార్యం గురించి బైబిల్ చెప్పిన కథ వటర్షి కథ అని నిర్ణయించారు.

దీన్ని బటన్నీ చూస్తే భూమి మీద మనుషులు క్రీ.పూ. 4004 కంటే ఎంతో ముందు నుంచే ఉండి ఉండాలని అర్ధమయింది.

ఉదాహరణకి ముడి ఇనుము నుండి ఇనుమును పెలికి తీసే విద్య గతంలో ఒక దశలో ఉండేది కాదని చారిత్రకారులకు తెలుసు. క్రీ.పూ. 1000 కి కొద్ధిగా ముందు మాత్రమే ఆ విద్య మనుషులకి తెలిసింది. అంతకు ముందు అస్త్రశస్త్రాలలో కంచు వాడేవారు. ఉదాహరణకి గ్రీకు ఇతిహాసమైన ఇలియడ్ లో గ్రీకు,టర్లోజన్ యోధులు కంచు కవచాలు ధరించి పోరాడేవారు.

కాని కంచు కూడా రమారమి క్రీ.పూ. 3200 లోనే వినియోగంలోకి వచ్చింది. ఇంచు మించు అదే సమయంలో వ్రాతలిపి కనుగొనబడింది. అంతకు పూర్వం అసలు లోహం గురించిన ప్రస్తావనే ఉండేది కాదు. అంతకు పూర్వం మనుషులు పదును పెట్టిన రాళ్ళను పనిముట్లు వాడి పూడ్చేవారు.

లోహశాస్త్రం యొక్క పరిణామక్రమాన్ని డేనిష్ శాస్త్రవేత్త క్రిస్టియన్ జోరెన్సన్ థామ్సన్ (1788-1865) 1834లో ఈ విధంగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది ఇనుప యుగం. అంతకు ముందు ఉన్నది కంచు యుగం. అంతకు ముందు ఉండేది రాతి యుగం .

లిపి ఉంటే గాని చరిత్ర అన్నది లేదు.మనుషులకి లిపి తెలియని కాలంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలంటే ఆ నాటి ఇళ్లు,ఆలయాలు, పనిముట్లు  పరిశీలనే మనకు గత్యంతరం. వాటనీ నుండి మనకు కొంత సమాచారం దొరుకుతుంది. కాని ఏం జరిగింది? ఏ క్రమంలో జరిగింది? ఇవన్నీ రాబట్టడం కష్టం. మరి చరిత్రకి కావలసింది సరిగా ఇదే.

లిపికి ముందున్న కాలాన్ని పూర్వచారిత్రక యుగం అంటారు. రాతి యుగం పూర్వచారిత్రక యుగం. అప్పుడు ఉండే మనుషులు పూర్వచారిత్రక మానవులు. మొటమొదటరీ ఈజిపియన్, సుమేరియన్ కాలాల నుండి కూడా రాతి పని ముట్లు ఉండేవి. ఈ పనిముట్లలో కొన్ని మంచి పనితనం కనిపించేది. అంటనే పనిముట్లని మనిషి చాలా కాలంగా తయారు చేస్తూ వాడుతున్నాడు .పనిముట్ల తయారీలో కౌశలన్ని కూడా

ప్రదర్శిస్తున్నాడు . బహుశ ఈజిప్ట్, సుమేరియన్ నాగరకతలకు పూర్వం కొన్ని వేల సంవత్సరాలు  పూర్వమే మరింత మోటైన పనిముట్లు  ఉండి  ఉండవచ్చు .

1797లో ఇంగ్లండ్ లో జాన్ ప్రేరే అనే భౌగోళిక శాస్త్రవేత్త ఉండేవాడు. అతగాడు దక్షిణ ఇంగ్లండ్ లో జరిపిన తవ్వకాలలో కొన్ని మోటు పనిముట్లని కనుక్కున్నాడు. భూగర్భంలో పదమూడు అడుగుల లోతులో దొరోకినాయి.ఇవి పూర్వచారిత్రక మానవులు వాడేసి వదిలేసినా పనిముట్లు  అయ్యుంటాయి. కాలక్రమేణా మటర్జీ కింది రాళ్ళ క్రింద పనిముట్లు పూడుకుపోయాయి. వాటి మీద రాతి పొరలు ఏర్పడటానికి పట్టిన సమయాన్ని బట్టి చూస్తే అవి కచ్చితంగా ఎన్నో ఏళ్ళ నాటివి అయ్యుంటాయి.

ఆ పనిముట్లతో పాటు కొన్ని జంతువుల అస్తికలు కూడా ఉన్నాయి. అవి ప్రసుతం మనకు తెలిసిన జంతువుల ఎముకలు కావు. మనకు తెలిసిన జంతువులకి అవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. అలాంటి జంతువులు ఇప్పుడు లేవు.

వాటనీ ఎముకలు ఎంత కాలంగా భూస్యాపితమైన ఉన్నాయంటనే అవి క్రమంగా రాయిగా మారిపోయాయి. అలా రాయిగా మారిన ఎముకలని, రాతిలో మిగిలే ప్రాచీన జీవరాశుల ఆనవాళ్ళని  శిలాజాలు (ఫాసిల్) అంటారు. (ఈ ఫాసిల్ అనే పదం తవ్వకం అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది.)

ఆ జంతువులన్నీ వినాశనం చెంది చాలా కాలం అయ్యింది. వాటి వేట కోసం తయారు చేసిన పనిముట్లు ఇంకా ముందు నుంచీ ఉండి ఉండాలి. మరి ఆ పనిముట్లను  తయారు చేసిన మనుషులు ఇంకా ముందు నుండి ఉండి ఉండాలి.

మరిన్ని మోటైన, పురాతనమైన పనిముట్లు అక్కడక్కడ తవ్వకాలో దొరికాయి. 1860లో ఎడ్వర్డ్ ఆర్మాంట్ లారే (1801-1871) అనే ఫ్రెంచ్ ప్రాచీన జీవశాస్త్రవేత్త (paleontologist) (mammoth) యొక్క దంతాన్ని కనుక్కున్నాడు. ఆధునిక గజానికి ఈ మహాగజం ఓ విష్పష్టమైన  ప్రతిరూపం. కొన్ని వేల ఏళ్ళుగ  ఒక్క మహాగజం కూడా సజీవంగా ఉన్న ఆధారాలు లేవు.

ఆశ్చర్యం ఏమిటంటనే ఆ మహాగజం యొక్క దంతం మీద ఒక మహాగజం యొక్క బొమ్మ చెక్కబడి ఉంది. మహాగజం యొక్క అస్తిపంజరాల ఆధారంగా వాటి రూపురేఖల గురించిన మన అంచనాలతో కచ్చితంగా సరిపోతోంది ఆ బొమ్మ ఆ బొమ్మలో చాలా చిన్న

చిన్న వివరాలు ఉన్నాయి. ఆ బొమ్మను వేసిన చిత్రకారుడు ఆ జంతువును ప్రత్యక్షంగా చూసి వేసి ఉండాలి.

ఈ ఆధారాలని బట్టి పూర్వచారిత్రక యుగానికే మనుషులు ఎంతో కాలంగా జీవించి ఉండాలి అని అనిపిస్తోంది. ఆ కారణం చేత పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, నవ్యరాతి యుగం అని మూడు దశల గురించి చెప్పుకోసాగారు శాస్త్రవేత్తలు. తవ్వకాలలో దొరికిన పాత పనిముటని పరిశీలించి వాటిని వీలైనంత క్షణంగా పరిశోధించారు. ఆ విశ్లేషణలో అత్యంత ప్రాచీనమైన పనిముట్లు కొన్ని వందల వేల సంవత్సరాలకి  పూర్వం ఉండేవని పరిణామ ప్రవాహంలో మనుషులు అత్యంత మందగతిలో ఆ పనిముట్లకి మరిన్ని మెరుగులు దిద్దుతూ వచ్చారని అర్హమవుతోంది.

1879లో మార్పెల్లినోద సౌటరోలా (మరణం 1888) అనే స్పానిష్ భౌగోళిక శాస్త్రవేత్త అప్పుడే కొత్తగా కనుక్కున్న ఎన్నో గుహలని పర్యటించాడు. పూర్వచారిత్రక మనుషుల ఆనవాళ్న వెదకాలంటే గుహలలోనే వెదకాలి. ఎందుకంటే ఆ రోజులో గుహలని నివాసాలుగా వాడేవారు (అందుకే అప్పటి మనుషులని గుహవాసులు (cavemen) అనేవారు.)

లాంతరు కాంతిలో తవ్వకాలు జరిపే తరుణంలో మార్పెల్లినోద సౌటరోలా యొక్క ఐదు సవంత్సరాల  కూతురు అక్కడే ఉంది. ఉన్నట్నుండి ఆ పాప ఎదులు! ఎదులు! అని అరిచింది. తండ్రి తలెత్తి చూస్తే గోడల మీద, పై కప్పు మీద నానా జంతువుల పలువార్త చిత్రాలు? కనిపించాయి. కనుక పూర్వచారిత్రక మానవులు మనలాగా చదువుకోకపోయినా, మనలాగే చక్కని కళా దృష్టి ఉన్నవారు అయ్యుంటూరు.

సేయుండరల్ మానవుడు

పూర్వచారిత్రక మానవులు ఎలా ఉండేవాళు? ఆ సంగతి పురాతన అస్తికలు, అప్పటి మనుషుల శిలాజాలు దొరికితే సులభంగా చెప్పొచ్చు. కాని చిక్కేంటంటే జంతువులు నీటి లో మునిగిపోతేనో, బురదలో కూరుకుపోతేనో శిలాజాలు ఏర్పడతాయి. ఆ బురద అవక్షేపక (సెడిమెంటరీ) రాయిగా మారినప్పుడు జంతువులలో కఠినమైన భాగాలు, ముఖ్యంగా దంతాలు, శిలాజాలుగా మారతాయి.

కాని మానవులు తెలివితేటలు గల వారు కనుక నీటలోనో, బురదలోనో అంత సులభంగా చిక్కుపడిపోరు. కనుక మానవ శిలాజాలు అరుదుగా దొరుకుతాయి. అయితే అప్పుడప్పుడు మానవశిలాజాలు కూడా కనిపిసుంటూయి.

1868లో అంటే మొటమొదటి గుహ్య వర్ష చిత్రం దొరికిన పదొకండు ఏళ్నకి ముందు దక్షిణ ఫ్రాన్స్ లో ఒక చోటు రైలు పట్టాలు వెయడానికి బాట పేస్తున్నారు. ఆ ప్రయత్నంలో క్రోమాగ్నన్ అనే గుహ లోంచి ఓ సొరంగం తవ్వాల్సి వచ్చింది. అలా తవ్విన గుహలో ఐదుగురు మానవుల అస్తిపంజరాలు బయటపడాయి.

మహాగజపు చిత్రం ఉన్న మహాగజపు దంతాన్ని కనుక్కున్న లారే కూడా ఆ స్థలానికి వెళ్లి చూశాడు. అస్తికలు ఇమిడి ఉన్న రాళ్ళని జాగ్రత్తగా పరీక్షించాడు. ఎముకల వయసు 35,000 ఏళ్న అయ్యుండవచ్చని తేలింది. అలాంటిపే ఇతర అస్తిపంజరాల వయసు 50,000 ఏళ్న దాకా కూడా ఉండవచ్చు.

దాంతో క్రోమాగ్నన్ మానవులు అంటే ఆడామ్ కి, ఈవ్ కి పేల ఏళ్నకి పూర్వం గుహలలో బొమ్మలు పేసుకుంటూ బతికిన రాతియుగపు మానవులు అయ్యుంటూరు అనుకున్నారు నిపుణులు.

అయితే అస్తిపంజరాల బటన్నీ చూస్తే క్రోమాగ్నన్ మానవులు చాలావరకు మనలాగానే ఉన్నారు. నిజం చెప్పాలంటనే సేటటీ మానవుల సగటు ఎతు కన్నా ఇతడు మరి కాస్త ఎతుగా ఉన్నాడు. మొదడు పరిమాణం కూడా మన కన్నా కాస్త ఎక్కువే.

1735లో స్వీడెన్ కి చెందిన కారోస్ లిన్నాయియస్ (1707-1778) అనబడే వృక్ష శాస్త్రవేత్త తనకి తెలిసిన మొక్కలని, జంతువులని వర్గీకరించాడు. ఒక్కొక్క దానికి రెండేసి భారమైన లాటిన్ పదాలతో విచ్చలవిడిగా నామకరణం చేశాడు. ఆ పేర్లలో మొదటిది ఆ జంతువు యొక్క కోవ (genus) ని చెబుతుంది. రెండవది జాతి (species) ని పేర్కొంటుంది.

లిన్నాయియస్ వర్గీకరణ పద్దతి ప్రకారం మానవులని హోమో సేపియన్ను అనడం జరిగింది. హోమ్ అన్న పదం మనుషుల కోవని సూచిస్తుంది. లాటిన్ లో హోమ్ అంటే మానవుడు. జాతి సేపియన్స్. ఇది ప్రతిభావంతమైన అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది. కనుక హోమో సేపియన్స్ అంటే ప్రతిభ గల మానవుడు అని అర్థం.

క్రోమాగ్నన్ మానవుల అస్తిపంజరాలు ఆధునిక మానవుల అస్తిపంజరాల మాదిరిగానే ఉన్నాయి. అంటే క్రోమాగ్నన్ మానవులు కూడా హోమో సేపియస్తే అని తెలుస్తోంది.

మరయితే బైబిల్ లో చెప్పినట్ను మనుషులు సంపూర్ణ మానవాకృతిలో ఎక్కణ్నుంచో ఊడిపడారని అనుకోవచ్చా? బహుశ తారీఖులు తప్పయి ఉండొచ్చు. 6000 ఏళ్నకి బదులు 50,000 ఏళ్న పూర్వం ఆడామ్, ఈవ్ లు సృష్టించబడి ఉండొచ్చు. అంతకు క్రితం భూమి మీద అసలు మనుషులే లేకపోవచ్చు.

అయితే ఇందుకు భిన్నంగా ఆలోచించిన వాడు బ్రిటిష్ జీవశాస్త్రవేత్త చార్లెస్ రాబర్స్ డార్విన్ (1809-1882). ఇరవై నాలుగేళ్న వయసులో డార్విన్ ఒక ఓడ సిబ్బందిలో చేరాడు. ఆ ఓడ ఐదేళ్న పాటు సాగే వైజ్ఞానిక యాత్ర మీద బయలుదేరింది. ఈ యాత్రలో డార్విన్ కి ప్రపంచ వ్యాప్తంగా నానా రకాల వృక్ష, జంతు జాతులని అధ్యయనం చేసే అవకాశం దొరికింది. ఓడ దక్షిణ అమెరికా తీరం వెంట ముందుకి సాగుతుండగా అక్కడి జంతుజాతుల లక్షణాలలో స్థలానికి అనుగుణమైన, క్రమమైన మార్పులు ఉండడం గమనించాడు డార్విన్. పసిఫిక్ మహాసముద్రం లో గలపాగోస్ అనే ద్వీప మాలికలో ఫిన్స్ లనబడే పక్షులలో పద్నాలుగు వివిధ ఉపజాతులు గుర్తించాడు. ఆ జాతులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాని దక్షిణ అమెరికా ఖండం మీద కనిపించే ఒక విధమైన ఫిన్స్ జాతికి ఈ పద్నాలుగు ఉపజాతులకి మధ్య చాలా పోలిక్షలు ఉన్నాయి. ఇదెలా జరిగింది?

కాలానుగుణంగా జీవజాతులు మారుతాయి కాబోలు అనుకున్నాడు డార్విన్. పాత జాతుల నుండీ మొల్ల మొల్లగా అభివృద్ధి చెందుతాయి, లేదా పరిణామం చెందుతాయి కాబోలు అనుకున్నాడు. తన సిదాంతాన్ని సమర్శించే సాక్ష్యాధారాలని సేకరించసాగాడు. బైబిల్ బోధనలని వ్యతిరేకిస్తుంది కనుక తన సిదాంతం చాలా మందికి నచ్చబోదని అతడికి బాగా తెలుసు.

1859లో అతడు జీవజాతుల (The Origin of Species) అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం గొప్ప సంచలనం రేకెత్తించింది. పరిణామ  సిదాంతం మీద సవత్సరాల తరబడి వాదోపవాదాలు సాగాయి. కాని చివరికి పైజానిక ඒජල ප් సిదాంతాన్ని లోకంలోని వృక్ష, జంతు జాతులన్నీ పూర్వపు జాతుల నుండీ ఆవిర్భవించి ఉంటే మరి మనుషుల మాటనేమిటి? మనుషులు మానవేతర జీవజాతుల నుండి అవతరించి ఉంటనే, ఆ

జాతులు ఇంకా ఉపమానవ జాతుల నుండీ అవతరించి ఉంటాయా? ఇంతకే మానవజాతికి మూలజాతి ఏమిటి?

ఈ విషయం గురించి డార్విన్ తన పుస్తకంలో చర్చించలేదు. కాని ఆ సంగతి గురించి ఇతరులు ఆలోచించసాగారు. 1863లో లయల్ అనే భౌగోళిక శాస్త్రవేత్త ఒక పుస్తకం లో మనుషులు కూడా అదే విధంగా పరిణామం చెందారని వాదించాడు. 1871లో డార్విన్ మరో పుస్తకాన్ని రాశాడు. అందులో ఈ భావనని సమర్థించే సాక్ష్యాధారాలని ప్రకటించాడు.

ఎంత లేదన్నా మానవ శరీరాకృతులు ఆఫ్రికాలో కనిపించే గొరిలా, చిజీపాంజీ ల వంటి వానరాల శరీరాకృతులని పోలి ఉంటూయుని మనకి తెలిసిందే. మరి ఈ మూడు జాతులూ ఎన్నో పేల సవంత్సరాలకు పూర్వం భూమి మీద జీవించిన ఒక ఏకైక పూర్వ జాతి నుండి అవతరించి ఉండొచ్చు ?

అయితే బైబిల్ వాదులకి అలాంటి ఆలోచన జుగుప్సాకరంగా తోచింది. ఆడామ్, ఈవ్ లు కోతులాంటి పూర్వీకుల నుండి అవతరించారా?

డార్విన్ సిదాంతమే నిజం అయితే నరులకి, వానరులకి మధ్యస్థంగా ఉండే జీవుల అస్తిపంజరాలకి సంబంధించిన శిలాజాలు ఉండి ఉండాలి. అలాంటి శిలాజాలు దొరికితే ఈ రెండు జాతుల మధ్య కనిపిస్తున్న ఎడం సంపూర్తి అవుతుంది. డార్విన్ కాలంలో మాత్రం అలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. అలాంటి సాక్ష్యాన్నే లోపించిన లంకె (missing link) గా పేర్కొంటూ వచ్చారు.

లోపించిన లంకె పాప్తించని పక్షంలో మానవుడు మరో పూర్వ జాతి నుండి పరిణమించాడన్న భావనని సమ్మతించడానికి నిపుణులు ఒప్పుకోలేదు. క్రో మాగ్నన్ అస్తిమంజరాలు అంత పురాతనమైనవైనా పూర్తి మనిషిఆకారం లో ఉన్నాయి. వాటిని లోపించిన లంకెలు అనడానికి .

అయితే క్రోమాగ్నన్ అస్తిపంజరాలు దొరకడానికి ముందు, నిజానికి డార్విన్ పుస్తకం ప్రచురించబడడానికి కూడా ముందే, కొన్ని ముఖ్యమైన అస్తికలు దొరికాయి.

పశ్చిమ జర్మనీలో రైన్ నదీ తీరంలో నియ౦డర్తల్ అనే లోయ ఉంది. 1857లో నియండర్తల్ లోయలో జరిగిన తవ్వకాలలో కొన్ని చేతుల కాళ్లు  అస్తికలు, కపాలాలు దొరికాయి. ఇవి మనిషి అస్తికలని పోలి ఉన్నాయి గాని పూర్తిగా మానవాకృతిలో లేవు.

కపాలంలో నుదురు వెనక్కు పోయి ఉంది. కనుబొమ్మలు ఉండేచోట ఉబ్బెతుగా లేచిన ఎముక కనిపించింది. మనుషుల దంతాల కన్నా ఆ దంతాలు మరింత పెద్దవిగా ఉన్నాయి. దవడ మరింతగా పొడుచుకుని వచ్చినటు ఉంది, గడ్డం మరింత లోపలికి పోయింది. మొత్తం మీద మానవ లక్షణాల కన్నా కపి లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సంగతులు శాస్త్రవేత్తలలో కొంత ఉత్సాహాన్ని కలిగించినా ఎముకలకి ఎవరూ అంతగా షాధాన్యత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా డార్విన్ సిదాంతాన్ని నమ్మని అడోల్ఫ్ ఫిరోవ్ (1821-1902) అనే జర్మన్ డాక్టరు ఆ అస్తిపంజరం ఎముకలు వ్యాధి వచ్చిన మామూలు మనిషిపే అన్నాడు.

చాలా మంది శాస్త్రవేత్తలు ఫిర్కోవ్ చెప్పినదాంతో ఏకీభవించారు. కాని ఫ్రెంచ్ డాక్టర్ పియర్ పాల్ బోకా (1824-1880) మరోలా వాదించాడు. ఆ కపాలం యొక అసాధారణ రూపం ఎముక వ్యాధి వలన వచ్చింది కాదని అందులో ఎముక మంచిదేనని అతడు వాదించాడు.

తదనంతరం అటుంవటి  అస్తిపంజరాలే అక్కడక్కడ దొరికాయి. అన్నిటీలో , వెనక్కు పోయిన నుదురు, కనుబొమ్మల వద్ద ఉబ్బెతు, వెనక్కు పోయిన గడ్డం, పెద్ద పళ్ళు - ఈ లక్షణాలే మళ్ళీ మళ్ళీ కనిపించాయి. వాటికి కారణం ఎముకల వ్యాధి కాదు. బోకా చెప్పింది నిజం. ఫిర్కోవ్ చెప్పింది తప్పు

శాస్త్రవేత్తలు నియ౦డర్తల్ మానవుడి గురించి మాట్లాడడం మొదలు పెట్టారు . అతగాడికి హోమో నియండర్తలెన్సిస్ అని ఓ భారమైన లాటిన్ పేరు కూడా ఇచ్చారు. మనుషుల కోవకే ఇతడు కూడా చెందినా జాతి మాత్రం పేరని భావించారు.

ఇదిలా ఉండగా 1911లో పియర్ మార్సెలిన్ బూల్ (1861-1942) అనే ఫ్రెంచ్ ప్రాచీనజీవన శాస్త్రవేత్త (paleontologist) తవ్వకాలలో ఒక నిండు     నియండర్తల్ ఆస్థి పంజరాన్ని కనుక్కున్నాడు.

ఆస్థి పంజరాన్ని బట్టి  సజీవమైన నియండర్తల్ మానవుడు ఎలా ఉండేవాడో ఊహాత్మకంగా పునర్నిర్మించడానికి వీలయ్యేట్ను అనిపించింది. క్రోమాగ్నన్ మానవుడితో పోల్చితే ఇతగాడు కొంచెం పొటవాడు. పురుషులు సగటున ఐదు అడుగుల కన్నా కాస్త ఎతు ఉంటూరేమో. స్త్రీలు మరి కాస్త తక్కువ ఎతు ఉండొచ్చు.

వీళే వానరులు అనుకున్నారు కొందరు. బొమ్మలలో కూడా వారిని అలాగే చిత్రించే వారు. క్రోమాగ్నన్ మానవుడి బొమ్మ గీసినప్పుడు గాని, శిల్పం మలచినప్పుడు గాని అతగాడు నున్నగా గడ్డం గీసుకుని హుందాగా, మహా తెలివైనవాడిలా కనిపిస్తాడు. సేయండర్తల్ మానవుడు మాత్రం మాసిన గడ్డంతో, కాస్త గూనితో, మొరటుగా, దద్దమ్మలా కనిపిస్తాడు.

ఇలాంటి వివక్ష అనాధారితం అనిపించింది. నియండర్తల్ అస్తిపంజరాలని మరింత క్షణంగా అధ్యయనం చేస్తే బూల్ కి దొరికిన అస్తిపంజరం ఆర్త్ రైటిస్ గల ముసలివాడికి చెందినదని తేలింది. ఆరోగ్యవంతమైన అస్తిపంజరాలని పరీక్షించగా సేయండర్తల్ మానవుడు కూడా మనలాగానే నిటూరుగా నించునే వాడని తెలిసింది. మన ప్రస్తుత ప్రమాణాల బటనీ అతడు అందగాడు కాకపోవచ్చు. కాని మొదడు మాత్రం మన మొదడంత  కనుక కేవలం అస్తిపంజరాన్ని దృష్టిలో పెటుకు చూస్తే అతడు నిండు నూరు పాళ్న మనిషేనని తీర్మానించాల్సి వస్తుంది.

సేయండర్తల్ మానవుడి ఆనవాళ్న యూరప్ లోనే కాదు, ఉత్తర ఆఫ్రికాలోను, ఆసియా లోను కూడా దొరికాయి. నలభై విభిన్న స్థలాలలో ఇప్పటికి నూరు అస్తిపంజరాల దాకా దొరికాయి.

వర్తమానానికి అత్యంత సన్నిహితమైనవి 30,000 ఏళ్న నాటివి. కనుక క్రోమాగ్నన్ మానవుడు, సేయండర్తల్ మానవుడు ఈ భూమి మీద 20,000 ఏళ్ళ పాటు సహజీవనం చేసి ఉండాలి. సేయండర్తల్ ఆవిష్కరణలలో ముఖ్యమైనవి ఈ రెండు జాతులకి మధ్యస్టంగా ఉండే ఆకారాలకి చెందిన అస్తిపంజరాలు. అంటే రెండు జాతులు కలిసిన సంకర జాతులు కూడా ఉండేవన్నమాట.

కనుక నియాండర్తలు మానవుడు కూడా హోమో సేపియున్స్  అని శాస్త్రవేత్తలు ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు. హోమో నియండర్తల్ అన్న పేరు ఇప్పుడు భూస్యాపితమైపోయింది. అయితే నియండర్తల్ మానవుడు హోమో సేపియన్లలో కెలా అత్యంత ప్లాచీన ఉపజాతికి చెందిన వాడు. 100,000 లేదా 150,000 ఏళ్నకి పూర్వం కూడా నియండర్తల్ మానవుడి ఆనవాళ్న ఉన్నాయి. క్రోమాగ్నన్ మానవుడికి 100,000 ఏళ్న కన్నా ముందు ఇతగాడు భూమి మీద సంచరించి ఉండాలి.

కొంత కాలం తరువాత నియండర్తల్ మానవుడు అంతరించిపోయాడు. తన కన్నా బలిషుడైన, దీర్వ కాయుడైన క్రోమాగ్నన్ చేతిలో ఇతడు నాశనమయ్యాడా? దీనికి సమాధానం ఎవరికీ కచ్చితంగా తెలీదు. ఆ అవకాశం కూడా తక్కువే. రెండు జాతులూ మరేదో పూర్వ జాతి నుండి అవతరించి .

జావా మానవుడు - పెకింగ్ మానవుడు

నియండరల్ మానవుడు కూడా హోమో సేపియనే అయితే అతడు నిశ్చయంగా లోపించిన లంకె, అంటే నరుణ్ని వానరుడితో కలిపే అజ్మాత సంధి జాతి, అతడు కాడు.

డార్విన్ సిదాంతాన్ని నమ్మిన వాళ్లు  అలాంటి జాతి ఎక్కడో ఉంటుందనే నమ్మేవారు. ఎర్నెస్ట్ హైనిక్ హెకెల్ (1834-1919) అనే జర్మన్ జీవశాస్త్రవేత్త ఆ జాతికి పితికాంత్రోపస్ (Pithecanthropus) అని ఒక పేరు కూడా పెట్టడం జరిగింది . ఈ పదం గ్రీకులో వానరుడు అన్న అర్థం గల పదం నుండి వచ్చింది. ఇది మనిషికి, వానరానికి మధ్యస్థంగా ఉండే జాతి అని అతడు విశ్వసించాడు.

యూజీన్ దుబ్వా (1858–1941) అనే డచ్ డాక్టర్ పితికాంత్రోపస్ ఎముకల కోసం ఆత్రంగా వెదికాడు. వాటి కోసం ఎక్కడ పెదకాలో ఆలోచించాడు. మానవ జాతికి సుదూర పూర్వీకులు అంటనే వానరాలు ఇప్పటికీ నివసించే స్థలమే పితికాంత్రోపస్ అన్వేషణకి శ్రేష్టమైన స్థలం అని ఇతడి ఆలోచన. మనకు తెలిసిన నాలుగు రకాల వానరాలలో చింపాజీ, గొరిలాలు ఆఫ్రికాలో ఉంటాయి. ఒరాంగుటూన్, గిబ్బన్ ఆగ్నేయాసియాలోను, ఇండొనేసియాలోను ఉంటాయి.

పితికాంత్రోపస్ మరో వానరం అయ్యుంటుంది. అది కూడా తక్కిన వానరాల లాగానే ఒకే పూర్వ జాతి నుండి ఆవిర్భవించి ఉంటుంది. కనుక అది ఉంటనే ఆఫ్రికా లోనైనా ఉండాలి, లేదంటనే ఆగ్నేయాసియాలో, బహుశ ఇండొనేసియాలో ఉండాలి.

వానరాలన్నిటిలోను గిబ్బన్ లక్షణాలు మనిషి లక్షణాలతో అతి సన్నిహితంగా ఉన్నాయని హెకల్ కి అనిపించింది. (నిజానికి అతడి ఆలోచన తప్పు; మనిషికి జిబ్బన్ కి పోలిక మధ్య వానరాలలో కెలా అతి తక్కువగా ఉంటుంది. అయితే హెకెల్ తప్పన్న సంగతి దుబ్వాకి తెలీదుగా మరి!) కనుక ఆసియాలోనే వెదకడం సమంజసం అని దుబ్వా నిర్ణయించాడు.

ఆ రోజులో ఇండొనేషియన్ దీవులు నెదర్లాండ్ హయాంలో ఉండేవి. వాటిని డచ్ ఈస్ట్ ఇండీస్ అనేవారు. దుబ్వా డచ్ పౌరుడు కనుక ఎలాగోలా ఈస్ట్ ఇండీస్ కి పెళ్లి అక్కడ పితికాంతోపస్ కోసం గాలించొచ్చు అనుకున్నాడు.

విశ్వవిద్యాలయంలో ఉద్యోగం విడిచిపెట డచ్ సేనా విభాగంలో చేరాడు. (అది తెలుసుకుని స్నేహితులు కంగారు పడారు!) 1887లో మిలిటరీ డాక్టరుగా ఈస్ట్ ఇండీస్ లో పని పేయించుకున్నాడు. తీరా అక్కడికి చేరుకున్నాక ప్రాచీన మానవ శిధిలాల కోసం గుహలలో తవ్వకాలు సాగించాడు.

మూడేళ్న అన్వేషణ తరువాత, 1891లో దక్షిణ మధ్య జావాలో, ట్రినిల్ అనే గ్రామం లో ఒక పురాతన కపాలానికి చెందిన కొన్ని శకలాలు, దంతాలు దొరికాయి. ఈ కపాలంలో కూడా నుదురు వెనక్కుపోయి ఉంది. సేయండర్తల్ మానవుడిలోలా కనుబొమల మధ్య ఎముక ఉబ్బెతుగా ఉంది. అయితే కపాలం లోపలి భాగం కాస్త చిన్నగా ఉంది.

సగటు మానవ మెదడు మూడు పౌనులు ఉంటుంది. దుబ్వా కనుకున్న పుర్రెలో మొదడు రెండు పౌన్లకి మించి ఉండదు. అది పసివాడి కపాలంలే అని కొట పారేయడానికి లేదు. ఎందుకంటనే కనుబొమల మధ్య ఎముక వంతెన ఎంత బాగా రూపదేలి ఉందంటనే అది ఎదిగిన జీవి యొక్క కపాలమే అయ్యుండాలి.

అయితే ఆ కపాలంలో ఉండే మొదడు మన మొదడు కన్నా చిన్నదే కావచ్చు. కాని గొరిలా మొదడులో మాత్రం అది సగమే ఉంటుంది. అంటే ఆ మొదడు పరిమాణం మనిషి మొదడుకి, వానరం మొదడుకి ఇంచుమించు మధ్యస్థంగా ఉందన్నమాట. పళ్న మాత్రం కొంచెం వానర దంతాలకే సన్నిహితంగా ఉన్నాయి.

తాను కనుక్కున్నది కచ్చితంగా పితికాంతోపసే అని సంబరపడాడు దుబ్వా. అక్కణ్నుంచి గుహలన్నీ శ్రద్దగా గాలించసాగాడు, అలాంటి శిధిలాలే ఇంకా ఏవైనా దొరుకుతాయేమోనని. ఏడాది గడిచాక తను మొదట కపాలాన్ని కనుక్కున్న ప్రదేశానికి 45 అడుగుల దూరంలో సరిగా కపాలం దొరికినంత లోతులోనే అతడికి ఒక తొడ ఎముక కనిపించింది. అది ముందు దొరికిన కపాలం అంత పాతదే అనిపించింది. కాని అది మానవ అస్తిక లాగానే ఉంది. దాని రూపురేఖలని బట్న ఆ ఎముకని కలిగిన జీవి మనిషిలాగే నిటూరుగా నిలిచి నడువగలిగేది అని స్పష్టమయ్యింది.

తాను కనుక్కున్న అస్తిపంజరానికి సంబంధించిన జాతికి పితికాంత్రోపస్ ఎరెక్టస్ (అంటే నిటూరు వానరం) అని పేరు పెటూడు దుబ్వా. అయితే ఆ భారమైన పేరుకి బదులుగా మరి కొంచెం సరథం జావా మనిషి అన్న పేరు తదనంతరం సంక్రమించింది.

1894లో దుబ్వా తన పరిశోధనలని ప్రచురించాడు. తదుపరి సంవత్సరం అతడు నెథరాండ్ కి తిరిగి వచ్చేసరికి దేశం యుద్దంలో మునిగి ఉంది.

లోపించిన లంకె ဗင်္လည္အပ္ అవకాశం ఉన్న మొటమొదటి శిలాజాన్ని అతడు కనుక్కున్నాడు. డార్విన్ సిదాంతం అంటే గిటుని వాళ్న అది కేవలం ఓ కోతి పుర్రె, అన్నారు. ఎదుగు బొదుగులేని మొదడు ఉన్న ఓ మూఢుడి కపాలం అన్నారు మరి కొందరు. అసలు ఆ రెండు శిలాజాలు ఒక దాంతో ఒకటి సంబంధం లేనివని, కపాలం కోతిది, తొడ ఎముక మనిషిది

అన్నవారు కూడా ఉన్నారు.

దుబ్వా వీళ్లందరితో వాదించి పేసారిపోయాడు. అసలు ఇవన్నీ ఎందుకు కనుక్కున్నానురా దేవుడా అని బాధపడాడు. ఇక చివరికి తిక్కలేచి ఎముకలన్నీ ఎవరికీ దక్కకుండా దాచేశాడు. చాలా కాలం పాటూ ఎవరినీ వాటి జోలికి రానీయలేదు.

ఈ సమస్య తేలాలంటే మళ్లీ జావాకి మళ్లి మరిన్ని జావా మానవాస్తికల కోసం గాలించడమే గత్యంతరం అనిపించింది. ఆ కార్యాన్ని చేపట్చన ఘనుడు జర్మన్ ప్లాచీన జీవశాస్త్రవేత్త గసావ్ హెచ్. ఆర్. ఫాన్ క్యోనిగ్స్వాల్స్,

1930 లలో ఇతగాడు జావా వెళ్ళి కొన్నేళ్ళ పాటు అన్వేషించాడు. సానికులు అతడికి చాలా సాయం చేశారు. కచ్చితంగా దేని కోసం వెదకాలో వివరించి వాళ్న తెచ్చిన ప్రతీ వస్తూవుకి, అది ఎంత చిన్నదైనా సరే, వస్తూవు  పది సెంట్ను చొప్పున ప్రతిఫలంగా ఇస్తానన్నాడు. దాంతో ఉత్సాహంగా గాలింపుకి దిగిన సానికులు పురై, దొరికితే దాన్ని పుటడు ముక్కలు చేసి ముక్క ముక్కకి కాసులు రాబటూరు.

అంత గందరగోళంలో కూడా ఫాన్ క్యోనిగ్స్వాల్డ్ మూడు పుర్రెలు, ఇంకా పళ్న రాళని కాసిని దవడ ముక్కలు సంపాదించగలిగాడు. చిన్న కపాలం ఉన్న ఒక్క మూరుడు ఉన్నాడంటనే నమ్మవచ్చు. నలుగురూ మూరులే నంటే నమ్మడం కష్టం. జావా మనిషి నిజంగా మానవ సదృశమైన జీపే. కాని హోమో సేపియన్ కాడు.

ఒక పక్క హోమో సేపియను, మరో పక్క మానవ సదృశమైన ఆకారం కలిగినా హోమో సేపియన్ను కాని ఇతర జీవజాతులు - వీటన్నిని కలిపి ఇప్పుడు హోమినిడ్ను అంటున్నారు. హోమో సేపియన్ కాని హోమినిడలో మనకు దొరికిన మొదటి వాడు జావా మనిషే. ఫాన్ క్యోనిగ్స్బర్స్ తన ఆవిష్కరణలు చేసిన నాటికి దుబ్వా బాగా ముసలివాడు అయిపోయాడు. వయసు ఎనభై దాటింది. తెరిపిలేని ఘరణతో బాగా చితికిపోయాడు. జావా మనిషి అంటే అతడికే నమ్మకం పోయింది. ఆ అస్తిపంజరం మనిషిది కాదు, కోతిదే అని తనే

అనడం మొదలెటూడు. అది కోతి కాదని ఫాన్ కోనిగ్స్వాల్డ్ ఎంత వివరించినా దుబ్వా ముమ్మాటికీ ఒప్పుకోలేదు. ఆ అవిశ్వాసంతోనే పాపం ఆ వృదుడు కన్ను మూశాడు.

ఇదిలా ఉండగా మొల్లగా దృష్టి చైనా మీదకి మళ్లింది. శిలాజాలలోని ఎముకలని, దంతాలని పొడిగా నూరి మందులుగా వాడచ్చని చైనా డక్షర్లలో ఒక నమ్మకం ఉండేది. అందుకే చైనాలో మందుల షాపులలో నానా రకాల శిలాజాలు దొరికేవి. ఆ విధంగా 1900 లో ఓ పాత మానవ దంతం దొరికింది. మానవ పూర్వ జాతులేపైనా ఒకప్పుడు చైనా ప్రాంతంలో నివసించేవా అంటూ ప్లాచీన జీవశాస్త్రవేత్తలు ఆలోచించసాగారు.

ప్రసుతం చైనా రాజధాని అయిన పెకింగ్ (బెయ్మింగ్) కి ఇరవై ఏడు మైళ్ళ దూరంలో చొకోటటియెన్ అనే చిన్న ఊరు ఉంది. అక్కడ మటతో పూడ్వబడ్డ ఎన్నో గుహలు ఉన్నాయి. పాత హోమినిడ ఆనవాళ్న కావాలంటనే అలాంటి చోటనే వెదకాలి.

ఆ గుహలో ఒక చోట క్వార్స్ రాతి శకలాలు కనిపించాయి. అక్కడ క్వార్స్ సహజంగా ఏర్పడే అవకాశం తక్కువ. బహుశ ఆదిమ హోమినిడ్ను దాంతో ఏవైనా పనిముట్ను చేసుకునే వారేమో. ఆ ఆవిష్కరణలతో ఉత్సాహం వచ్చిన కెనెడాకి చెందిన ప్లాచీనజీవశాస్త్రవేత్త డేవిడ్సన్ బాక్ (1884-1934) ఎంతో కాలం ఆ ప్రాంతంలోనే పనిచేసూ ఉండిపోయాడు.

1923లో ఒక పన్ను కూడా దొరికింది. 1926లో మరొకటి దొరికింది. 1927లో మరొకటి. ఈ దంతాలని క్షణంగా అధ్యయనం చేశారు. అవి కచ్చితంగా మనిషివని చెప్పడానికి චීඨ, అలాగని కచ్చితంగా వానర దంతాల లాగానూ లేవు. ఇదేదో కొత్త జాతికి చెందిన హోమినిడ్ అని భావించి దానికి సైనాంత్రపొస్ పెకినెన్సిస్ (Sinanthropus pekinensis) అని పేరు పెటూరు. అంటే పెకింగ్ కి చెందిన చైనా వ్యక్తి అని అర్థం.

చివరికి 1929లో చైనాకి చెందిన పై అనే ప్లాచీన జీవశాస్త్రవేత్త కపాలం యొక్క వంపులా తోచిన ఒక శకలాన్ని తవ్వకాలలో కనుక్కున్నాడు. ఇంకా అలాగే తవ్వుతూ పోగా మరిన్ని పుర్రెలు, దవడ ఎముకలు, దంతాలు దొరికాయి. 1934లో బాక్ యొక్క మరణం తరువాత ఈ కృషి ఫాన్స్ వైడెనైక్ (1873-1948) అనే జర్మనీకి చెందిన ప్రాచీనజీవశాత్రవేత్త అధ్వర్యంలో కొనసాగింది. చివరికి నలభై విభిన్న హోమినిడ భాగాలు దొరికాయి.

ఈ సారి సందేహమే లేదు. పెకింగ్ మనిషి హోమ్ కోవకి చెందని హోమినిడ్ మాత్రమే.

అయితే దురదృష్టవశాతు 1937లో జపాన్ చైనాని ముట్టడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. కాని తవ్వకాలు మాత్రం కొనసాగనిచ్చింది. 1941లో పరిస్థితులు మరింత విషమించాయి. జపాన్ కి అమెరికా దేశానికి మధ్య యుధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాచీన జీవశాస్త్రవేత్తలు ఆ ఎముకలని అమెరికా దేశానికి చేరవేస్తే అక్కడ సురక్షితంగా ఉంటాయని నిర్ణయించారు. 1941 డిసెంబర్ 5 వరకు ఆ ఎముకల ప్రయాణం మొదలుకాలేదు. మరి రెండు రోజుల తరువాత జపాన్ అమెరికాలోని పెరెల్ హార్బర్ మీద దాడిచేసింది.

ఆ తరువాత జరిగిన గందరగో ఛంలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. పెకింగ్ మనిషి ఎముకలు మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఆ అస్తికల అస్తిత్వం శాశ్వతంగా నాశనమై ఉంటుంది.

ఎముకల అధ్యయనాలు జరిగిన కాలంలో పెకింగ్ మనిషికి, జావా మనిషికి మధ్య చాలా పోలికలు ఉన్నాయని తెలిసింది. కాని తేడా ఏమిటంటనే ఇద్దరిలో పెకింగ్ మనిషి మొదడు కొంచెం పెద్దది. జావా, పెకింగ్ మానవులని హోమినిడ్సలో రెండు ఉపజాతులుగా పరిగణిస్తే మేలని నేడు ప్రాచీన జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నియండర్తల్, క్రోమాగ్నన్ మానవులు ఏ విధంగా అయితే ఒకే జాతి యొక్క రెండు ఉపజాతులో, వీళ్న కూడా హోమినిడ్సలో రెండు ఉపజాతులు అన్నమాట.

నాంతోపస్ వంటరీ పేరు అవతల పారేయాలి. పెద్ద మొదడు ఉన్న హోమో సేపియన్ల కి ముందు వచ్చిన హోమో ఎరెక్టస్ జాతికి జావా, పెకింగ్ మానవులు ఉపజాతులు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత హోమో ఎరెక్టస్ కి చెందిన ఎముకలు ఆఫ్రికాలో దొరికాయి. అలాంటివి యూరపో కూడా ఉండే అవకాశం ఉంది. (అయితే అది వటర్షి అవకాశం మాత్రమే. అమెరికా ఖండాలలోకి గాని, ఆస్ట్రేలియాలోకి గాని, ప్రపంచంలో తదితర ముఖ్యమైన దీవులలోకి గాని, హోమోసేపియన్ను రంగప్రవేశం చేయడానికి ముందు హోమినిడ్ను ఎప్పుడూ ప్రవేశించలేదు.

హోమో సేపియన్ల మొదడులో హోమో ఎరెక్షస్ మొదడు 2/3 వంతులే ఉంటుంది. కాని అది కూడా మనిషి లాగే నడువగలిగేది, పని ముట్ను చేసుకోగలిగేది. అంతే కాదు. పెకింగ్ మనిషికి అగ్నితో పరిచయం ఉందని తెలిపే ఆధారాలు చొకొటియన్ గుహలలో దొరికాయి. హోమో ఎరెక్టస్ 1.5 మిలియన్ సంవత్సరాల క్రితం అవతరించి, 500,000 ఏళ్న క్రితం అంతరించి ఉంటుంది.

హోమో ఎరెక్టస్ నిజంగానే అంతరించి పోయిందా? లేక దాని మొదడు పరిమాణం పెరుగుతున్న కొలది క్రమంగా హోమోసేపియన్ గా పరిమాణం చెందిందా?

ఈ భావన సమంజసంగానే అనిపించింది. కాని ఆ భావనతో ఏకీభవించని ఓ ప్రాచీన జీవశాస్త్రవేత్త  ఉన్నాడు. అతడు ఇంగ్లండ్ కి చెందిన లూయిూ ఎస్.బి. లీకీ (1903– 1972).

లీకీ తల్లిదండులు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు సాగించేవారు. లీకీ బాల్యం తూర్పు ఆఫ్రికాలో సాగింది. ఆ కాలంలో తన తల్లిదండులు ఆ ప్రాంతాలో పనిచేసేవారు. లీకీ పై చదువులు కేంబ్రిడ్స్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకుని తిరిగి తూర్పు ఆఫ్రికాకి వెళ్ళి పోయాడు. ఇంచుమించు జీవితాంతం అక్కడే ఉండిపాయాడు.

1931లో అతడు తూర్పు ఆఫ్రికాలో ఉన్న టాంజానియా దేశంలో ఓల్బువాయ్ కనుమ లో తవ్వకాలు సాగించాడు. ఆ ప్రాంతంలో 2 మిలియన్ సంవత్సరాలుగా సెడిమెంటరీ రాయి స్థిరంగా ఏర్పడి ఉంది. మొటమొదటి హోమినిడ ఆచూకీ అందులో దొరుకుతుంది అనుకున్నాడు లీకీ.

1960 లలో తొలి సంవత్సరాలలో అతడికి మూడు కపాలాలు దొరికాయి. చూడడానికి అవి హోమైూ ఎరెక్షస్ కి చెందిన కపాలాల లాగానే ఉన్నాయి. కాని ఇంకా బాగా చిన్నవిగా ఉన్నాయి. హోమో సేపియన్ల మొదడులో వీటి మొదడు సగమే ఉంటుందేమో. పైగా హోమో ఎరెక్షస్ ఎముకల కన్నా ఈ ఎముకలు మరింత పెళుసుగా ఉన్నాయి. ఈ కపాలం 1.8 మిలియన్ ఏళ్న నాటివి అయ్యుంటాయి. లీకీ ఈ కపాలాలకి హోమో హాబిలిస్ అని పేరు పెట్చూడు. అంటే కౌశలం గల మనిషి అని అర్థం.

హోమో అన్న పూర్వనామాన్ని ఆపాదించ దగినంతగా నేటి మనిషిని పోలి ఉన్న అత్యంత పురాతనమైన హోమినిడ్ ఈ హోమో హాబిలిస్. హోమో హాబిలిస్ రెండు దిశలలో పరిణామం చెందింది అని లీకీ అభిప్రాయం. ఒక పరిణామ క్రమంలో మొదడు పరిమాణం పెరుగుతూ వచ్చింది. పుర్రె ఎముక మందం పెరుగుతూ వచ్చింది. కనుబొమలని కలిపే ఎముక దటం అవుతూ వచ్చింది. దంతాలలో కూడా మార్పులు వచ్చాయి. ఈ పరిణామానికి తారసాయి హోమో ఎరెక్టస్. రెండవ పరిణామ క్రమంలో మొదడు మరింత పెద్దది అయ్యింది గాని, పుర్రె ఎముకలు సన్నగానే మిగిలిపోయాయి. ఈ పరిణామ క్రమానికి అంతంలో హోమో సేపియన్ అవతరించాడు.

అయితే ఈ గందరగోళం అంతా పక్కన బెటర్టీ మొండు క్రమంగా ఎదుగుతూ వచ్చిందని, ఆ క్రమం లో వరుసగా హోమో హాబిలిస్ హోమో ఎరెక్షస్ గాను, హోమో ఎరెక్షస్ హోమోసేపియన్ గాను పరిణమించారు అనుకోవడం తార్కికంగా అనిపిస్తుంది.

మరిన్ని హోమినిడ్ శిలాజాలు దొరికితే తప్ప హోమినిడ్ లు ఏ క్రమంలో పరిణమించాయో తేల్చుకోవడం కష్టం.

కుబ్న వానరులు

ఇంతవరకు మూడు రకాల హోమినిడ గురించి చెప్పుకున్నాం. మూడూ హోమో కోవకి చెందినవే. మొదటి జాతి హోమో సేపియన్ను (అంటే మనం, క్రోమాగ్నన్ మానవుడు, సేయండర్తల్ మానవుడు), రెండవది హోమో ఎరెక్టస్ (అంటే పెకింగ్ మనిషి, జావా మనిషి), మూడవది హోమొూ హాబిలిస్.

హోమో అన్న పూర్వనామానికి అనర మై, ఆధునిక మానవుల కన్నా బాగా పేరుగా ఉండే హోమినిడ్ ఉపజాతులు ఏవైనా ఉన్నాయా?

అలాంటి హోమినిడ్ ని కనుక్కున్న ఘనత ఆస్ట్రేలియా కి చెందిన డాక్టర్ రేమండ్ ఆర్డర్ డార్స్ (జననం 1893) కే దక్కింది. ఇతగాడు 1923లో దక్షిణ ఆఫ్రికాలోని జోహానెస్ బర్స్ కి అక్కడ వైద్యవిద్యాలంలో శరీరశాస్త్రం సేర్చిదామని వెళ్ళాడు.

1924లో అతడు ఎవరో ఇంటికి వెళే అక్కడ అలంకార వసువుగా ఓ బాబూన్ కపాలం యొక్క శిలాజం దర్శనమిచ్చింది. అది తవాంగ్ అన్న ప్రాంతం నుండి వచ్చింది. సున్నపు రాళ్ళలో చేస్తున్న తవ్వకాలలో దొరికిందా శిలాజం.

ఇలాంటిపే ఇంకా ఏవైనా శిలాజాలు ఉంటనే చూబించమని డార్స్ సందేశం పంపాడు. త్వరలోనే అతడికి ఓ పెట్పడు సున్నపురాతి శిలాజాలు అందాయి. ఆ శిలాజాల ముక్కల్ని జాగ్రత్తగా అమర్చి చూస్తే పళ్ళు, దవడ ఎముకలు, ముఖం ఎముకలు, అన్నీ కలిపితే ఓ కుర్రవానరపు ఎముకలా అనిపించాయి. కాని కచ్చితంగా కుర్రు వానరానివని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటనే పుర్రెలో మొదడు ఉండే ఖాళీ మరీ పెద్దదిగా ఉంది.

కనుబొమల మధ్య ఉబ్బెత్ను ఎముక లేదు. ముఖం మరీ కోతి ముఖం అనేటంత ఇదిగా ఏం !!!

డార్స్ ఆ జీవానికి ఆస్థలో పితికస్ ఆఫ్రికాన్సస్ (అంటే దక్షిణ ఆఫ్రికా కోతి) అని పేరు పెట్నూడు. 1925 లో అతడు తన ఎముకల వర్తన ప్రచురించాడు. ఆ ఎముకలు నరులకి, వానరాలకి మధ్యస్థంగా ఉన్నాయని సూచించాడు.

అప్పటికి ఇంకా జావా మానవ వివాదాలు హోరాహోరిగా చెలరేగుతూనే ఉన్నాయి. దుబ్వా తాను కనుక్కున్న ఎముకల వధకి ఎవర్నీ రానివ్వడం లేదు. పెకింగ్ మనిషికి చెందిన ఏకదంతం మాత్రం దొరికిందంతే! డార్స్ సిదాంతాన్ని ఒప్పుకోవడానికి లోకం సిద్దంగా లేదు. డార్స్ వర్తన చదివిన నిపుణులు ఆ ఎముకలు ఓ బాల వానరానివని, అది మనిషి కన్నా చింపాజీకి, గొరిలాకి సన్నిహితంగా ఉందని అభిప్రాయపడారు.

ఈ వివాదం మీద ఓ పదేళ్న పాటు ఏ పురోగతీ లేదు. కొత్తగా హోమినిడ్ శిలాజాలేవీ దొరకలేదు.

అయితే డార్స్ సిదాంతంతో ఏకీభివించిన వ్యక్తి ఒకడున్నాడు. అతడు స్కాటిష్ ప్రాచీనజీవశాస్తపేత రాబర్స్ బూమ్ (1866-1951). 1934లో ఇతడు దక్షిణ ఆఫ్రికాకి వచ్చి డార్స్ కనుక్కున్న జీవానికి చెందిన మరిన్ని ఎముకలు కనుక్కున్నాడు. ద్రోహానెస్ బర్స్ కి కొద్ది దూరంలో సున్నపురాతి గుహలు ఉన్నాయని, వాటిలో ఒక దాంట్రల్లో ఓ బాబూన్ కి చెందిన ఎముకలు ఉన్నాయని, తెలుసుకున్నాడు బూమ్.

1936లో బూమ్ ఆ గుహలని సందర్శించి త్వరలోనే మరో ఆస్త్రలో పితికస్ కి చెందిన పుర్రె శిలాజాన్ని కనుక్కున్నాడు. ఆ పుర్రె కుర్రు కోతిది కాదు, ఎదిగిన కోతిది!

రెండేళ్ళ పాటు వేసట లేకుండా సున్నపురాతి తవ్వకాలలో మునిగిపోయాడు బూమ్. అడపాదపా ఏదో ఒకటి కనిపిసూ ఉండేది. ఓ సారి ఓ తొడ ఎముక కనిపించింది. మరో ప్రదేశంలో అలాంటి శిలాజాన్ని కనుక్కున్న ఓ స్కూల్ విద్యార్థి అతడికి తారసపడాడు. బూమ్ 9.9 కొత్త ప్రదేశానికి వెల్లి వెదికాడు. ఓ పెద్ద దవడ ఎముక ముక్క, ఓ పురై, దొరికాయి.

డార్స్ కనుక్కున్న జీవం కన్నా ఈ శిలాజానికి చెందిన జీవం మరింత పెద్దదిగా ఉంది. బూమ్ దానికి పరాంతోపస్ అని పేరు పెట్చూడు. ఆ పేరుకి అర్ధం మనిషిని పోలినది అని. వానరాల కన్నా నరుడుకి దగ్గరగా ఉందని దానికలా పేరు పెట్చూడు. అప్పటికే జావా మనిషికి పైజానిక లోకంలో ఆమోదం దొరికింది. పెకింగ్ మనిషి కూడా కనుగొనబడాడు. ఆ నేపథ్యంలో మరింత ప్రాచీన హోమినిడ గురించి తెలుసుకునేందుకు పైజానిక లోకం మరింత సిద్దంగా ఉంది.

అయితే రెండవ ప్రపంచ యుధం వల్ల ఈ కార్యక్రమాలకి కొంత కాలం తెర పడింది. కాని యుధం ముగియగానే బూమ్ మళ్లీ పనికి ఉపక్రమించాడు. చివరి క్షణం వరకు శ్రమిసూ మరెన్నో శిలాజాలు కనుక్కున్నాడు. వాటిలో పరాంతోపస్ పెదవి ఆస్ట్రలో పితికస్ లాగా చిన్నవి.

ప్రస్తుతం ఈ రెండు ఉపజాతులూ ఒకే కోవకి చెండినవని నమ్ముతున్నారు. అయితే ఆ కోవ హోమ్ కోవ కాదు. పరాంత్తాపస్, ఆస్థలో పితికస్ జాతులు హోమ్ కోవకి చెందకపోయినా, రెండూ హోమినిడే. వాటి దంతాలు కోతి కన్నా మనిషి దంతాలని ఎక్కువగా పోలి ఉంటాయి. వాటి నడుము ఎముకలని బటర్టీ అవి నిటూరుగా నిలిచి నడిచేవని అర్థం అవుతుంది.

అయితే అవి మరుగుజ ఆకారాన్ని కలిగి ఉండేవి. బహుశ పరాంతోపస్ హోమో ఎరెక్టస్ అంత ఎత్తే ఉండేదేమో. కాని ఆస్ట్రలో పితికస్ ఎతు నాలుగు అడుగులు మించి ఉండదు. ఆధునిక మానవుడి మొదడులో దాని మొదడు సగమే ఉంటుంది. ఇక ఆస్త్రలో పితికస్ మాటకొస్తే దాని మొదడు ఆధునిక గొరెలా మొదడు ని మించి ఉండదు. కాని ఆస లోపితికస్ S చిన్న చిన్న రాతి పనిముట్ను చేసుకోగలిగేటంత తెలివితేటలు ఉన్నాయి. గొరిల్పాలకి అన్ని తెలివితేటలు లేవు! దానికి కారణం బహుశ గొరిలా మొదడు కన్నా ఆస్ట్బలోపితికస్ మెదడు మరింత చిన్న శరీరాన్ని శాసించడమే కావచ్చు.

అంటచే ఆస్ట్రాలో  పితికస్, దాని దేహ పాలనకి . మేుదడు అక్కర్వేదు కనుక, మిగతా మెదడుని మరింత కష్టతరమైన కార్యక్రమాల్లో (మోటైన రాతి పనిముట్ను చేయడం లాంటివి) ప్రవేశపెటగలిగింది అన్నమాట!

రూపంలో కూడా ఆస్ట్రాలో  పితికస్, పరాంతోపస్ కన్నా మరింత మానవీయంగా ఉంటుంది. హోమో హాబిలిస్ ఆస్థలో పితికస్ నుండీ పరిణామం చెంది ఉండొచ్చు. పరాంతోపస్ శాఖ వారసత్వం లేకుండా అంతరించిపోయి ఉండొచ్చు. ఆస్ట్బలోపితికిస్ మొటమొదట 4 మిలియన్ సంవత్సరాల క్రితం రంగప్రవేశం చేసింది. 500,000 ఏళ్న క్రితం వరకు అది జీవించి ఉండవచ్చు. అంటే హోమో హాబిలిస్, హోమో ఎరెక్టస్ జాతుల ఉపశాఖలు ఆవిర్భవించిన తరువాత కూడా అవి సజీవంగా ఉండి ఉండొచ్చు.

ఆ విధంగా మానవ పూర్వీకుల అన్వేషణ అంతా సజావుగా సాగిపోయిందని అనడానికి లేదు. తప్పుడు సిదాంతాలు కూడా కొంతకాలం చలామణి అయ్యాయి.

ఉదాహరణకి 1935లో (జావా మనిషి యొక్క మరిన్ని అస్తిపంజరాల కోసం జావా వెళ్లిన) ఫాన్ కోనిగ్స్ వాల్డ్ కి హాంకాంగ్ లోని మందుల కొటలో నాలుగు చక్కని దంతాలు దొరికాయి. అవి మానవ దంతాల లాగానే ఉన్నాయి. కాని మరి కాస్త పెద్దవిగా ఉన్నాయి.

అంత వరకు దొరికిన ప్రాచీన హోమినిడ్ను హోమో సేపియన్ల కన్నా కురుచగా ఉన్నారు. బహుశ బృహత్పరిమాణం గల హోమినిడ్ను కూడా ఉన్నారేమో. బైబిల్ లో మహాకాయుల వర్ణన ఉండనే ఉంది. ఎన్నో సంస్కృతుల జానపదాలలో మహాకాయుల ప్రసక్తి వసూనే ఉంటుంది. ఈ మహాకాయులు సామాన్యంగా మందమతులుగా వర్ణించబడుతారు. వాళ్నకి తనువు ఎక్కువ తెలివి తక్కువ అన్నమాట.

తనకి దొరికిన దంతాలకి సంబంధించిన ప్రాణికి జైగాంట్రలో పితికస్ అని పేరు పెటూడు ఫాన్ కోనిగ్స్ వాల్డ్ . అంటే మహావానరం అని అర్హం.

ఓ ఇరవై ఏళ్న పాటు ఈ జైగాంట్రలో పితికస్ ఎలా ఉంటుందబ్బా అని తల కొటుకున్నారు నిపుణులు. ఈ విషయం మీద 1955లో చైనీజ్ శాస్త్రవేత్తలు అలాంటి జీవం యొక్క ఇతర దేహాంగాలు ఏవైనా దొరుకుతాయేమోనని తమ మందుల కొటున్నీ తెగ తిరిగారు. డజన్ల కొద్దీ పఛ్న, కాసిని కింద దవఛ్ను దొరికాయి.

జైగాంటనో పితికస్ నిజంగానే దాని పేరు సారకం చేసుకుంది. అదసలు హోమినిడ్ కాదు. చరిత్రలోనే అతి పెద్ద కపి. దంతాలు మనిషి దంతాల లాగ ఉన్నాయే గాని, దవడలు పూర్తిగా వానరపు దవడలే.

ఈ జైగాంట్రలో పితికస్ లక్ష ఏళ్లకు పూర్వమే వినష్టమైపోయి ఉంటుంది. కాని అది హోమో సేపియున్న అవతరణ తరువాతే జరిగి ఉంటుంది. మతిలేని మహాకాయుల గురించిన గాధలకి -53 జైగాంటనో పితికిస్ ఆధారం అయ్యుంటుంది.

కాని జైగాంట్రలో పితికస్ అసలు హోమినిడ్ కాదు. కనుక నేటికీ మనకి తెలిసిన హోమినిడ లో అత్యంత ఎత్తయినది, భారీ శారీరం గలది అయినది హోమో సేపియనే అని చెప్పుకోవాల్సి వసుంది.

ఇంకా ఆశ్చర్యకరమైన వృతాంతం ఏంటంటే 1911లో దక్షిణ ఇంగ్లండ్ లో పిల్స్ డౌన్ అనే ఊచో మరో జైగాంటనో పితికస్ అస్తికలు దొరికడం. చార్లెస్ డాసన్ (1864-1916) అనే ఇంగ్లీష్ లాయరు కనుక్కున్నాడు దాన్ని దాని కపాలం మానవ సదృశంగాను, దవడ వానర సదృశంగాను ఉన్నాయి. దీనికి ఇయోఆంతోపస్ అని పేరు పెటూరు. దాని అర్థం ఉదయ మానవుడు. దీన్నే పిల్స్ డౌన్ మనిషి అని కూడా మామూలుగా పిలుచుకుంటూ ఉంటూరు.

ఓ నలభై ఏళ్ళ పాటు దీన్ని మానవ పూర్వీకుల వంశవృక్షంలో ఎక్కడ పెట్వూలో ప్రాచీన జీవశాస్త్రవేత్తలకి అర్థం కాలేదు. తక్కిన అన్ని హోమినిడ్లలో పురై అంతకంతకు మానవీయంగా వికాసం చెందుతుంటచే, దవడ కూడా అదే విధంగా పరిణామం చెందుతూ వసుంది. అర్వాచీన కపాలం, ప్రాచీన దవడ ఎముక కలగలిసిన ఈ జీవం కాస్త విడూరంగా తోచింది.

అది విడూరం కాదు, వటన్డీ అబద్దం అని తరువాత తెలిసింది. పురై నిజంగానే మనిషిది, దవడ నిజంగానే వానరానిది. పుర్రె బాగా ప్రాచీనంగా కనిపించేటుగా దానికి తగు రసాయన సంస్కారాలు చేశారు. దవడ కాస్త చిన్నగా కనిపించేటుగా దాన్ని కాస్త అరగదీశారు.

1911లో ప్లాచీన జీవశాస్త్రవేత్తలకి ప్రప్రథమ హోమినిడ్ల గురించి అంతగా తెలీదు. అందుకే అన్నేళ్లపాటు వాళ్నని అంధకారంలో ఉంచగలిగింది ఆ అబద్దపు అస్తిపంజరం.

ఆంత్రా ఎలా మొదలయ్యింది.

చివరికి లోపించిన లంకె గురించి నిజంగా ఎక్కడా చెప్పుకోలేదు. ప్రప్రథమ హోమినిడ్ అయిన ఆస్ట్రలో పితికస్ ఆఫ్రికానస్ వానరాల కన్నా హోమో సేపియన్లకే సన్నిహితంగా ఉంది. ఇక పిల్స్ డౌన్ మనిషి వటర్టీ అబద్దం అని తెలుసుకున్నాం.

అయినా కూడా గొరిల్లా, చింపాంజీల పూర్వీకులు ఉన్న కాలంలోనే ఆఫ్రికాలో ఆస్త్రలో పితికస్ కూడా ఉండి ఉండాలి. చింపాజీకి, గొరిలాకి, హోమినిడకి కూడా పూర్వం ఉండి, నిజమైన లోపించిన లంకె అని పిలువ దగ్గ పాణి ఏమైనా ఉందా?

1934లో అమెరికన్ ప్లాచీనజీవశాస్త్రవేత్త జి. ఎడ్వర్డ్ లువిస్ ఉత్తర భారత దేశంలో శివాలిక్ పర్వత శ్రేణిలో తవ్వకాలు సాగించాసాగాడు. అక్కడ కొన్ని దంతాలు, దవడ ఎముకలు దొరికాయి. దాన్ని ఆస్త్ర లోపితికస్ అనడానికి అక్కడి రాళ్న మరీ ప్రాచీనమై ఉన్నాయి. ఆ దంతాలు ఏ పాణికి చెందినవో గాని ఆ జీవం 7 నుండి 14 మిలియన్ల ఏళ్న నాటిది అయ్యుంటుంది.

లువిస్ ఆ జీవానికి రామాపితికస్ అని పేరు పెట్చూడు. రాముడు భారతదేశంలో ఆరాధించబడే దేవతలో ముఖ్యుడు. కనుక ఆ దేశంలో దొరికిన శిలాజానికి ఆ పేరు పెటూరు.

మరీ చిన్నవైన ఆ దంతాలు వానరానికి చెందినవి కాకపోవచ్చని లువిస్ . రామాపితికస్ ఆహారాన్ని చేతో పటుకోగలిగేదై ఉండాలి. అది హోమినిడ్ యే అయ్యుండాలని అనుకున్నాడు లువిస్. కాని అప్పటి ప్లాచీన జీవశాస్త్రవేత్తలు అతడినితో ఏకీభవించలేదు.

అయితే 1961లో లీకీ ఆఫ్రికా లోని కెన్యా దేశంలో అచ్చం రామాపితికస్ ని పోలిన జీవం యొక్క దంతాలని కనుక్కున్నాడు. ఇతర దంతాలు, దవడ ఎముకలు కూడా దొరికాయి. కాని తక్కిన శరీరానికి చెందిన ఎముకలు మాత్రం దొరకలేదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యాలన్నీ సమీకరించి లువిస్ చెప్పింది సబబేనని ప్లాచీనజీశాస్త్రవేత్తలు చివరికి ఒప్పుకున్నారు. రామాపితికస్ అత్యంత ప్లాచీనమైన హోమినిడ్ ఆస్త్రలో పితికస్ కన్నా చిన్నది. బహుశ అప్పటికే అది రెండు కాళ్ళ మీద నడువగలిగేదేమో! ఇంతవరకు దొరికిన హోమినిడ్సలో అదే ప్రప్రథమం. వాస్తవంలో కూడా అదే మొటమొదటి హోమినిడ్ అయ్యుంటుంది.

మరి వానరాల పూర్వీకుల మాటనేమిటి? జైగాంట్రలో పితికస్ గురించి ముందే చెప్పుకున్నాం. అది వినష్టమైపోయిన వానరజాతి అయినా అది ఆధునిక వానరాలకి పూర్వజాతి కాదు. అందుకు మనం ఇంకా సుదూరమైన గతానికి వెళ్ళాలి.

లూయిూ లీకీ, అతడి భార్య మేరీ, తూర్పు ఆఫ్రికాలో ని విక్టోరియా సరస్సు గటున జరిపించిన తవ్వకాలలో స్పష్టంగా వినష్టమైన ఓ వానర జాతిని కనుక్కున్నారు. దవడాలు, దంతాలు చూస్తే అవి వానరాలని సందేహమే ఉండదు.

లీకీ ఆ వానర జాతికి పోకన్సల్ అని పేరు పెట్చూడు. కన్సల్ అనేది లండన్ జూ లో అందరికీ బాగా తెలిసిన ఓ చింపాజీ పేరు. లీకీ పెటన పోకన్సల్ అన్న పేరుకి కన్సల్ కి ముందు అన్న అర్థం వస్తుంది. పోకన్సల్ కి చెందిన ఎన్నో అస్తికలు దొరికాయి. వాటిలో ఇంచుమించు ఓ నిండు అస్తిపంజరం కూడా ఉంది. దాని సహాయంతో సేటి వానరాల కన్నా అది ఏ విధంగా పూర్వతరానికి చెందినదో ప్లాచీనజీవశాస్త్రవేత్తలకి అధ్యయనం చెయ్యడానికి వీలయ్యంది.

పోకన్సల్ ఓ ఆదిమ వానర జాతి బృందంలో ఓ సభ్య జాతి. ఇవన్నీ కూడా డ్రయోపితికస్ (అంటే ఒక వృక్షపు కోతి) అనే కోవకి చెందినవే. ఆ అస్తికలు దొరికిన శిలాజాలతో బాటు కొన్ని ప్రాచీన ఓక్ వృక్షపు అవశేషాలు కూడా దొరికాయి.

డయోపితికస్ జాతి చెట్ను మీదే నివసించేదేమో. నిటూరుగా కూడా నడవకపోవచ్చు. 1856లో మొటమొదటి డ్రయోపితికస్ అస్తికలు ఫాన్స్ లో కనుక్కున్నారు. కాని ఇటీవల కాలంలో తూర్పు ఆఫ్రికాలో డ్రయోపితికస్ ని పోలిన ఎన్నో శిలాజాలు దొరికాయి.

డయోపితికస్ పరిమాణంలో ఎంతో వైవిధ్యం ఉన్నట్ను కనిపిస్తుంది. కొన్ని చాలా చిన్నవి, మరి కొన్ని గొరిలా అంత పెద్దవి కూడా. వీటిలో మొటమొదటి జాతి 25 మిలియన్ ఏళ్న నాటిది ఆధునిక చింపాజీలకి, గొరిలాకి ఈ డయోపితికస్ వానరాలు పూర్వజాతి. మరి రామాపితికస్ జాతి వీటి నుండి ఆవిర్భవించిందా నరులకి వానరాలకి మధ్య లోపించిన లంకె ఇదేనా కాదా అన్న ప్రశ్నలకి కచ్చితమైన సమాధానాలు లేవు.

ఈ విషయం మీద ప్రాచీనజీవశాస్త్రవేత్తలు తర్జనభర్శనలు పడుతున్నారు. విషయాన్ని కచ్చితంగా తేల్చాలంటే రామాపితికస్ శరీరానికి చెందిన మరిన్ని అస్తికలు దొరకాలి.

40 మిలియన్ ఏళ్న నాటి ఈజిప్ట్ కి చెందిన శిలాజాలు కూడా దొరికాయి. ఆ కాలంలో కూడా వానర జాతులు ఉన్నాయనటానికి ఈ శిలాజాలు ఋజువులు. వాటిలో ఒక జాతి ఈజిపో పితికస్ (అంటనే ఈజిప్ట్ వానరం అని ).

హోమినిడ్డకి, ఆఫ్రికా వానరాలకి సమాన పూర్వీకుడు డ్రయోపితికస్ కాకపోతే, అదే కాలానికి చెందిన ఈజిపో పితికస్ జాతో, లేదా అటువంటిదే మరో జాతో అయ్యుండాలి.

ఇంత వరకు ఎప్పుకున్న విషయాలన్నీ సమీకరించుకుని మానవ మూలాల గురించి కుప్తంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు.

70 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసారు. అంతరించిపోయాక, కోతులని పోలిన జీవాలు మరింత ఆదిమమైన జీవాల నుండి పరిణామం చెంది ఉంటాయి. అవి ఆధునిక లేముర్ లని స్టాపోలి ఉండవచ్చు.

40 మిలియన్ ఏళ్ళ క్రితం ఈ కోతులని పోలిన జీవాలు తమ తోకలని పోగుటుకుని, మొదళ్న పెదపై, చేతులు మరింత సమర్శవంతమై, చివరికి వానరాలుగా వికాసం చెందాయి. ఈజిపో పితికస్ జాతి అలాంటి పరిణామానికి తార్కాణం.

కాలక్రమేణా ఇలాంటి వానరజాతులు దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాలకి వలస వెళ్లి అక్కడ జిబ్బన్ల గాను, ఓరాంగుటూన్ల గాను పరిణామం చెందాయి.

డయోపితికస్ పరిణామం మరో దిశలో సాగింది. పళు, దవడ ఎముకలు పెద్దపై, ఎముకలు పటవీప్యమై, మొుదడు  పరిమాణం గలదై, కాలక్రమేణా చింపాజీలుగాను, గొరిల్పాలుగాను పరిణామం చెందింది.

అయితే 20 మిలియన్ ఏళ్ళ క్రితం మాత్రం డ్రయోపితికస్ పరిణామం మరో మలుపు తిరిగింది. పళ్ళు, దవడలు ఎముకలు పలుచనయ్యాయి. పళ్న, దవడలు చిన్నవి కనుక, ఈ డ్రయోపితికస్ జాతి ఆహారాన్ని చేతో పటుకుని నోటలో పెటుకోవడం నేర్చుకున్నాయి.

ప్రచండ సూర్య తాపానికి అడవులు దగమైపోతే అవి చెట్ను దిగి నేల మీద సంచారం మొదలెటూయి. వాటి నడుము ఎముకలు వాటిని పచ్చిక బయళ్ళలో నిగ్రీూరుగా నించుసేటు చేశాయి. ఇక నడవడానికి చేతులతో పని లేదు కనుక చేతులతో మరింత వైవిధ్యం గల చేష్టలు చేయడం నేర్చుకున్నాయి.

వసువులని స్పృశించడం, ఎత్తడం, ఎతుకుపోవడం, ఎక్కలాగడం, పొడవడం, పీకడం మొదలైన నానా రకాల చేష్టలూ చేయగలిగాయి. అలా వాటి అనుభవ రంగం విస్తరించగా మొదడుకి కూడా తగినంత ఉత్ప్రేరణ దొరికి మొదడు పరిమాణం కూడా పెరిగింది.

ఆ విధంగా నిటూరుగా నించుని చేతులతో పని చెయ్యగల హోమినిడ్ జాతి 20 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద సంచరించేది.

మనకు తెలిసిన మొటమొదటి హోమినిడ్ జాతి రామా పితికస్. ఇది తూర్పు ఆఫ్రికాలో మొటమొదట అవతరించి 10 మిలియున్న ఏళ్న క్రితం ఆసియాకి వ్యాపించింది.

ఆఫ్రికాలో రామాపితికస్ మరింత పెద్దదై, మరింత తెలివైనదై రమారమి 4 మిలియన్ ఏళ్న క్రితం ఆస్థలో పితికస్ ఆవిర్భవించింది.

ఆ విధంగా శరీరం, మెదడు రెండూ వృద్ధి చెందే దిశలో పరిణామం సాగింది. అలా 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడితో తగినంత సాన్నిహిత్యం గల, హోమ్ కోవకి చెందే అరత గల, మొటమొదటి హోమినిడ్ జాతి ప్రత్యక్షమయ్యింది. అదే హోమో హాబిలిస్. అప్పటికే హోమినిడ్ మొదడు ఎంతగా పరిణామం చెందింది అంటనే గతంలో భూమి మీద సంచరించిన వానర జాతులన్నిటికన్నా వీటి మొదడు పెద్దదిగా ఉండేది. అయితే ఆధునిక మానవుడి మొదడు కన్నా దాని మొదడు చిన్నదిగానే ఉండేది.

1.5 మిలియన్ సంవత్సరాల క్రితం హోమో ఎరెక్షన్ ఆవిర్భవించింది. ఈ జాతి ఆసియా అంతా విస్తరించి చైనా, ఇండొనేషియా వరకు చొచ్చుకుపోయింది. వాటి జ్వాపికలే పెకింగ్ మనిషి, జావా మనిషి.

మిలియన్ సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ మొదడులో గణనీయమైన వృద్ది జరిగింది. అగ్ని కనుగొనబడింది. 150,000 ఏళ్ల క్రితం మొదడు యొక్క వృద్ది ఎంతగా పురోగమించిందంటే ఇక ఆ దశలో ఉన్న జాతులని హోమో సేపియన్ను అనుకోవచ్చు.

హోమో సేపియన్లలో అత్యంత ప్రాచీనమైన ఉదాహరణ సేయండర్తల్ మనిషి. 50,000 ఏళ్ళ క్రితం క్రో మాగ్నన్ మనిషి ప్రత్యక్షం అయ్యాడు. అప్పట్నుంచి ప్రగతి మరింత పేగవంతం

10,000 ఏళ్ళ క్రితం హోమెూ సేపియన్ జీవి సేద్యం, పశు సంరక్షణ, నగర నిర్మాణం వంటి ನಿ"ಮಿರಾಲು అలవరచుకున్నాడు. ఆ విధంగా నాగరికత అంకురించింది. 5000 ఏళ్న క్రితం లిపి కనుగొనబడింది. చరిత్ర పుటర్జ్చీంది. 4OO ఏళ్న క్రితం ఆధునిక విజ్యానం ఆరంభమయ్యింది. 200 ఏళ్న క్రితం పారిశ్రామిక విప్లవం జరిగింది.

ఇన్ని జరిగినా ఇప్పటికీ మన మానవ మూలాలకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలు మిగిలిపోయాయి.

ఆధారం: జంసాక్ ఎసిమెూవ్


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate