హోమ్ / విద్య / బాలల ప్రపంచం / మూడు ‘అర్’ ల పరిశీలన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మూడు ‘అర్’ ల పరిశీలన

వివిధ రకాల వనరులు మరియు పదార్థాలకు ఉండే విలువలను గౌరవించడం.మూడు “ఆర్లుగా పిలువబడే వినియోగం తగ్గించడం (Reduce), తిరిగి వాడడం (Reuse) రూపం మార్చి వాడడం (పునఃచక్రీయం) (Recycle) వల్ల కలిగే లాభాలను అర్థంచేసుకుందాం.

లక్ష్యం

1. వివిధ రకాల వనరులు మరియు పదార్థాలకు ఉండే విలువలను గౌరవించడం.

2. మూడు “ఆర్లుగా పిలువబడే వినియోగం తగ్గించడం (Reduce), తిరిగి వాడడం (Reuse) రూపం మార్చి వాడడం (పునఃచక్రీయం) (Recycle) వల్ల కలిగే లాభాలను అర్థంచేసుకుందాం.

నేపథ్యం

జనాభా పెరుగుదలతోపాటు జీవనశైలిలో మార్పుల కారణంగా, వనరులు, వస్తువుల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. మానవ కార్యకలాపాలు పెరగటం వలన వనరులు తరగటంతోపాటు వృధా చేయడం జరుగుతుంది. దీనివల్ల పర్వారణంపై ఒత్తిడి పెరుగుతున్నది. అందువల్ల వర్యావరణాన్ని సంరక్షించుకోడానికి కావలసిన సుస్థిర పద్ధతులు రూపొందించుకోవడం అత్యావశ్యకం. తగ్గించడం, తిరిగి వాడడం, పునఃచక్రీయాలను మన జీవన విధానంలో భాగంగా స్వీకరించి పర్యావరణ వినాశనాన్ని కొంత వరకు నియంత్రించవచ్చు.

పద్ధతి

 1. నిత్యజీవితంలో ఉపయోగించే వసువులు, వనరులను నమోదుచేయండి.
 2. పట్టికను పరిశీలించి వాటిలో ఏ ఏ వస్తువులు, వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చునో గుర్తించండి.
 3. ఏ ఏ వస్తువులను, వనరులను పునఃచక్రీయం చేయవచ్చో అంటే తిరిగి వాడవచ్చునో గుర్తించండి.
 4. ఈ పరిశోధన ఆధారంగా గమనించిన వస్తువులను వినియోగం తగ్గించడం, తిరిగి వాడడం, పునః చక్రియం చేయగల వనువులుగా వర్గీకరించండి.
 5. వివిధ రకాల వస్తువులను చిత్రాల ద్వారా వర్గీకరించి చార్ట్ రూపొందించండి. దానిని మీ ఇంటిలో లేదా పాఠశాలలో ప్రదర్శించండి. తద్వారా కుటుంబంలోని వ్యక్తులు, స్నేహితులు, మూడు “ఆర్" లను పాటించేలా చేయండి.

ముగింపు

కొన్ని ముఖ్య సూచనలు

 1. సాధ్యమైనంత తక్కువ వ్యర్థపదార్గాలు వుండేలా చూడండి. వ్యర్థపదార్గాలు భూమిలో చేరి పెద్దమొత్తంలో మిడైన్ను విడుదల చేస్తాయి. ఒక వేళ తగులబెట్టినప్పుడు కార్బన్-డై-ఆక్సైడ్ వెలువడుతుంది.
 2. ఆహారాన్ని ఎక్కువగా ఉండికించకండి.
 3. అన్ని క్యాన్లు, బాటిల్స్ ప్లాస్టిక్ బ్యాగ్‌లు రీసైకిల్ చేయండి. సాధ్యమయినంత వరకూ రీసైకిల్డ్ వస్తువులనే కొనండి.
 4. వండేటప్పుడు మూత ఉంచండి. లేదా సమయం, ఇంధనం ఆదా చెయ్యాటానికి ప్రెషర్ కుక్కర్ వాడండి.
 5. కడాయి, పెనము వంటి పాత్రలని తరచూ శుభ్రం చేయండి. పదే పదే నూనెల వాడకం వలన వాటిపైన పేరుకుపోయిన మడ్డివల్ల అవి త్వరగా వేడెక్కవు.

రవాణా విషయంలో చిట్కాలు

 • మెట్రోరైలు, బస్సులోగాని ప్రయాణించండి.
 • కారులో అందరితో కలిసి వెళ్ళండి.
 • కూడలి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇంజన్‌ను ఆన్‌చేసి వంచకండి. 10 సెకండు ఆన్‌లో వుంచినప్పుడు, మీరు తిరిగి స్టార్ట్ చేయటానికి అయ్యే దానికన్నా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్ దాని బరువుకు రెండున్నర రెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 • చుట్టుపక్కల మార్కెట్‌కి సైకిల్ పైన లేదా నడిచి వెళ్ళండి.
 • బస్సులో ప్రయాణించండి. ఒక బస్సులో ప్రయాణించగల 40 మంది రష్ వేళలలో 40 వాహనాలపైన ప్రయాణం చేస్తే సంవత్సరానికి 70,000 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. 175 టన్నుల పొగ  ఉత్పత్తి అవుతుంది. బస్సులో ప్రయాణిస్తే ఇది ఆదాయే కదా! మీ అధ్యయనం ఆధారంగా మూడు “ఆర్‌లను పాటించేలా కవిత్వం, పద్యం, వ్యాసం రాయండి.

తదుపరి చర్యలు

కింది అంశాలతో పర్యావరణ వారాన్ని నిర్వహించండి.

 1. వీధినాటకాలు లేదా ఏకాంకికలు వంటి వాటిద్వారా మూడు “ఆర్ లు పాటించడం వల్ల కలిగే లాభాలపై చైతన్యం కలిగించండి.
 2. "వ్యర్థపదార్థాలనుండి వస్తువులను తయారుచేయటం అనే అంశంపై ప్రదర్శనను నిర్వహించండి. విద్యార్థులద్వారా వ్యర్థపదార్థాలతో ಬಿ"ಮಿಲು, ఆటవస్తువులు, ప్రత్యేక సంచికలు తయారుచేయించండి.
 3. వ్యర్థ పదార్థాలతో హస్తకళా సామగ్రి తయారుచేయండి. ఉదా: క్యాలెండర్లు, పాత వార్తాపత్రికలతో కాగితం సంచులు. ఇలాంటి ఉపయోగకరమైన సామాగ్రి ఏమైనా తయారుచేయవచ్చా? ఆలోచించండి.

ఆధారముhttp://apscert.gov.in/

3.05050505051
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు