ఆరవ తరగతి ప్రవేశానికి జవహర్ నవోదయ (జె.ఎన్ . వి. ఎస్ . టి) వారు నిర్వహించే ఎంపిక పరీక్ష
ప్రవేశం పొందే విధానం:
ప్రాధమికోన్నత విద్యా విషయాల బోర్డు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా జవహర్ నవోదయ విద్యాలయాల పాఠశాలలలో పిల్లలను ఆరవ తరగతి స్థాయి నుండి చేర్చుకోవడం జరుగుతుంది. తొమ్మిది మరియు పదకొండవ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ విద్యాలయాలు ప్రాంతీయ స్థాయిలో జరిపే పరీక్షా ఫలితాలను బట్టి లేదా అంతకుముందు జరిపిన అర్హతా పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నవోదయ పాఠశాలలలో ఉచిత విద్యా సౌకర్యం కలదు. మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంతపు పిల్లలకూ, కనీసం 33 శాతం బాలికలకూ కేటాయిస్తారు. చట్ట ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియి జాతుల వారికి వరుసగా 15 శాతం మరియు 7.5 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది. దేశంలోని ప్రతి జిల్లాలో కూడా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చెయ్యాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
ధరఖాస్తు ఫారమునకు, ఎంపిక పధ్ధతి, ఇంకా ఇతర వివరములకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడగలరు http://www.navodaya.nic.in/welcome%20sbs.htm
కేంద్రీయ విద్యాలయాలలో ప్రవేశం గురించి 2007-2008 సంవత్సరం నుండి అమలులో ఉండే విధంగా ఈ దిగువ మార్గదర్శక సూత్రాలను జారీ చేయడం జరిగింది.
ప్రవేశ విధానం:
కేంద్రీయ పాఠశాలలలో ప్రవేశానికై పిల్లలు తమ పేర్లను నమోదు చెసుకోవటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ప్రాంతీయ కార్యాలయం వారు ఫిబ్రవరి మొదటి వారంలో, మండల స్థాయిలలోని స్థానిక వార్తా పత్రికలలో ప్రచురింపబడే విధంగా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకటనలో ప్రవేశానికై నమోదు చేసుకోవటానికి కావలసిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ విధంగా విడుదల చేసిన ప్రకటన- కేంద్రీయ విద్యాలయాలలోకి ప్రవేశం కేంద్ర ప్ర్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాదనీ, మరియు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, కేవలం కొన్ని వర్గాలకు చెందిన పిల్లలకు ప్రవేశంలో కొంత ప్రాధాన్యత మాత్రం ఇవ్వబడుతుందని స్పష్టంగా తెలియ జేయాలి. షెద్యూల్డ్ కులాల, జాతుల వారికి మరియు వికలాంగులకు ఏ మేరకు ప్రవేశంలో కేటాయింపులు ఉన్నాయో ఈ ప్రకటనలో తప్పనిసరిగా సూచించాలి.
ధరఖాస్తు ఫారమునకు, ఎంపిక పధ్ధతి, ఇంకా ఇతర వివరములకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.
http://kvsangathan.nic.in/guidelines1.aspx
పిల్లలలో విద్యావిషయాల నైపుణ్యతను పెంపొందించి తద్వారా వారిని దేశంలో ఉన్న అత్యుత్తమ పాఠశాలల లోని విద్యార్ధులతో సరిసమానంగా తీర్చిదిద్దటానికై కేంద్ర అకాడమి కృషి చేస్తుంది. ప్రణాళికా బధ్ధమైన కార్యక్రమాలు, విలువయిన పరిశోధనలు చేపట్టటం ద్వారా కేంద్రీయ పాఠశాలల విద్యార్ధులలో ఉన్న జ్ఞాన తృష్ణను సంతృప్తి పరచటానికై అకాడమి తీవ్రంగా కృషి చేస్తున్నది.
మరిన్ని వివరాల కోసం ఈ దిగివ ఇచ్చిన వెబ్ సైట్ ను సందర్శించండి.
http://www.centralacademyshools.org/htm/admission.htm
APSWREIS పాఠశాలలో ప్రవేశము కొరకు మరియు ఇతర అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
APRS పాఠశాలలో ప్రవేశము కొరకు మరియు ఇతర అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
APTWREIS పాఠశాలలో ప్రవేశము కొరకు మరియు ఇతర అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
APTWREIS పాఠశాలలో ప్రవేశము కొరకు మరియు ఇతర అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు