ప్రాథమిక సమాచారం
ఇప్పటికే అడుగంటిపోతున్న సహజవనరైన నీటి యొక్క విలువను పిల్లలలో అభివృధ్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పాఠ్యభాగం వివిధ నీటి వనరులు, నీటి ఉపయోగాలు, జలచక్రం, నీటి సంరక్షణ మొదలైన భావనలను వివరిస్తుంది.
పాఠ్య ప్రణాళిక వివరాలు
నిడివి: 05 గంటలు.
పరిచయం:
సజీవులన్నింటికీ నీరు ఎంతో అవసరం. మనకు తాగడానికి, వంటలు వండడానికి, బట్టలు ఉతకడానికి స్నానం చేయడానికి నీరు అవసరం. అంతేకాక నీరు వ్యవసాయానికి,పరిశ్రమలకు,జలరవాణాకు కూడా ఎంతో అవసరం.
మన ఈ భూగ్రహం 70% నీటిచే ఆవరించబడి ఉన్నందున దీనిని “నీలిగ్రహం” అని కూడా అంటారు. ఇంత నీరున్నప్పటికీ 1% మాత్రమే తాగడానికి పనికివస్తుంది. మిగిలిన నీరంతా సముద్రాలలోనూ, మహా సముద్రాలలోనూ ఉప్పునీటిరూపంలో లేదా ఘనస్థితిలో మంచురూపంగానో ఉంది.
పెరుగుతున్న జనాభాకు సరిపడా సరఫరా లభ్యతతక్కువ ఉన్నందున demand పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు భాగాలు నీటికొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి అమూల్యమైన వనరుని భావితరాల వారిని దృష్టిలో ఉంచుకొని వివేకవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరంఉంది. ఈ భావనను ఉపాధ్యాయులు విద్యార్థులలో అభివృధ్ధి చేయాలి. ఈ పాఠ్య ప్రణాళికను ఈ భావన ఆధారంగానే అభివృధ్ధి చేశారు.
లక్ష్యం:
సోపానాలు:
ఈ పాఠ్యభాగం ఐదు సెషన్లగా విభజించబడింది.
మొదటి సెషన్ : నీటి ఉపయోగాలు 3వ తరగతికి - పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
రెండవ సెషన్ : నీటి వనరులు 4వ తరగతికి - పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మూడవ సెషన్ : జలచక్రం 5వ తరగతికి - పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నాల్గవ సెషన్ : నీటి కాలుష్యం 6వ తరగతికి - పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదవ సెషన్ : నీటి సంరక్షణ 6వ తరగతికి - పి.డి.ఎఫ్. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
ఈ అంశం బ్లూ ఫ్లాగ్ బీచ్లు సంబంధిత సమాచారాన్ని అంద...
మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో ...
భూమిపై గాలి పొర భూ ఉపరితలం నుంచి సుమారు 1000 కి.మీ...
డ్రింకింగ్ వాటర్ కాళీ పొట్టతో తాగితే హెల్త్ కి చాల...