ఏ టి యం నుండి దొంగనోట్లు వస్తే ఏం చేయాలి?
ఉపోద్ఘాతం
ఏ టి యం ... ఈ పేరు బ్యాంకు ఎకౌంట్ ఉన్న ప్రతివారికి పరిచయమే కదా.. చాలామంది ఏటియం అనగానే ఎనీ టైం మనీ అని అనుకుంటారు కానీ దీని అసలు రూపం ‘ఎసిన్ క్రోనస్ ట్రాన్ ఫర్ మోడ్’
బ్యాంకు నుండి డబ్బులు తీసుకోవడం:
- ఒకప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డబ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన తరువాత లైన్‌లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.
- అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వచ్చేశాయి. అవి ఎక్కడ పడితే అక్కడ మనకు అందుబాటులో ఉంటున్నాయి.
ఏటియం నుండి డబ్బులు తీసుకోవడం:
- ఈ అధునాతన టెక్నాలజీని వియోగించడం చాలా తేలిక.
- తక్కువ సమయం పడుతుంది.
వివరణ
ఎవరైనా మనకు దొంగనోట్లు ఇస్తే ఏం చేస్తాం.. వాటిని తిరిగి వారికే ఇచ్చేసి మంచి నోట్లని తీసుకుంటాం, కాని ఏటీఎం మెషిన్ నుండే దొంగనోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుని గగ్గోలు పెడుతాం.. కానీ వాటిని కూడా అసలైన నోట్లుగా మార్చుకొనే పద్ధతి ఉందని చాలా మందికి తెలియదు.. ఏటీఎంలలో దొంగనోట్లు వస్తే మాములుగా బ్యాంకుకి వెళ్లి అడుగుతుంటాం.. సదరు బ్యాంకు వాళ్ళు తమకు ఏం సంబంధం తెలియదని సమాధానం చెప్పుతుంటారు కానీ రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం నకిలీ నోట్లు వస్తే బ్యాంకు ద్వారానే అసలైన నోట్లని పొందవచ్చు. సో! ఇది చదివి ఎలా పొందాలో తెలుసుకోండి..
- ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసినపుడు మీకు నోట్లలో గానీ, లెక్కల్లో తేడా అనిపిస్తే అక్కడే ఏటీఎం లోపలే ఉండి వాటిని లెక్కపెట్టాలి.
- దొంగ నోట్లు అని అనుమానం వచ్చినా, చిరిగిన నోట్లు వచ్చినా అప్పటికప్పుడే ఏటీఎంలోని సీసీ కెమెరా వైపు ఆ నోట్లను చూపించాలి.
- ఏటీఎంలో మనకు నకిలీ నోట్లు వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇవ్వాలి..
- సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండే రిజిస్టర్‌లో మీరు విత్ డ్రా చేసిన మొత్తం, అసలైన నోట్లు ఎన్ని.. నకిలీ నోట్లు ఎన్ని వచ్చాయి.. ఏటీఎం స్లిప్ నెంబర్, నోటు నంబర్లు, తేది, సమయం వివరాలు రాసి సంతకం చేయాలి.
- ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి మేనేజర్ కి ఒక లెటర్ ద్వారా కంప్లైట్ చెయ్యాలి,
- లెటర్ తో పాటు ఏటీఎం స్లిప్ జీరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లని జత చేసి, ఏటీఎం వద్ద రిజిస్టర్ లో రాసిన వివరాలని అందించాలి.
- బ్యాంకు వారు మీ దగ్గర ఉండే నకిలీ నోట్లని తీసుకోని వాటిని స్కాన్ చేసి నకిలీ నోట్ల కాదా..! అని పరీక్షిస్తారు.
- అవి నకిలీ నోట్లే అయితే మీరు ఇచ్చిన వివరాలని సరి చూసుకొని సరైన నోట్లని తిరిగి ఇస్తారు.
ఇలా కంప్లైంట్ చేసే సమయంలో ఏటియం స్లిప్ ని, నకిలీ నోట్లని, కంప్లైంట్ లెటర్ ని ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇంకా ఉత్తమమైనది..
ముగింపు
రిజర్వ్ బ్యాంకు (RBI) నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు పైన చెప్పిన విధంగా చేయాలి.. అలా కాకుండా తమకు ఏం సంబంధం లేదని మాట్లాడితే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు, రిజర్వ్ బ్యాంకు ఇ-మెయిల్ కి కూడా తమ ఫిర్యాదుతో కూడిన లేఖను మెయిల్ రూపంలో పంపవచ్చు, లేదా స్థానికంగా ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే వారి నుండి తక్షణ సహాయాన్ని పొంది బ్యాంకు నుండి నకిలీ నోట్లకి బదులు అసలైన నోట్లని పొందవచ్చు.
వ్యాసం: వందనం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2024
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.