హోమ్ / విద్య / సమాచార సాంకేతిక (ఐటి) విద్య / కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు

కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు

కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు

కంప్యూటర్ అంటే ..

 1. ఉపోద్ఘాతం
 2. కంప్యూటర్ ఆవిర్భావం
 3. కంప్యూటర్ సంగతులు
 4. కంప్యూటర్ భాగాల నిర్మాణం
 5. పర్సనల్ కంప్యూటర్
 6. ఇన్ పుట్ సాధనాలు
 7. ఔట్ పుట్ సాధనాలు
 8. ఐ-ఓ సాధనాలు
 9. డేటా గుర్తించడం
 10. సాప్టు వేరు
 11. ఆపరేటింగ్ సిస్టము
 12. ప్రోగ్రాం ఎందుకు
 13. జాగ్రత్తలు
 14. నెట్ వర్కింగ్
 15. కంప్యూటర్ ఫండమెంటల్స్

కంప్యూటర్ మరియు ఇంటర్నెట్

తెలుగులో ఇ - మెయిల్ పంపించుట గురించి.

స్వేచ్ఛాసాఫ్ట్వేర్ మరియు ఓపెన్ సోర్స్ నిర్వచన ము

యూని కోడ్ అంటే ఏమిటి ?

విండోస్ యక్స్ పి లో తెలుగును ఎనేబిల్ చేయుట, మరియు ఇన్ స్క్రిప్ట్ కీ బోర్డ్ తో తెలుగు టైప్ చేయడం

ఉబుంటు లో తెలుగు

ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్ వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్థానిక భాషలకు కూడా మద్దతునిస్తుంది.ఉబుంటు లో తెలుగు చూడవచ్చు,వ్రాయనువచ్చు మరియు ఉబుంటు ను తెలుగు లో వాడుకోవచ్చు.

తెలుగు చూడడానికి:

చాలా వెబ్ సైట్లు,యునికోడ్ లో ఉన్న వెబ్ సైట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.కొన్ని వార్త పత్రికలు సొంత ఫాంట్లను వాడుతుంటాయి.వాడుకరి సహాయార్ధం వారు ఫాంట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటు లో ఉంచుతారు.ఆ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకొని దానిని తెరచినపుడు క్రింది విధంగా కనిపించును.

a2

ఇన్ స్టాల్ ఫాంట్ ని నొక్కినపుడు ఫాంట్ మన కంప్యుటర్ నందు ఇన్ స్టాల్ అవుతుంది.అపుడు ఫైర్ ఫాక్స్ ని తిరిగి ప్రారంభించినపుడు ఆయా సైట్ వెబ్ పేజీలు మనకు సరిగా కనిపించును.

తెలుగు లో వాడుకోవడానికి:

మొదట తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవాలి.ఉబుంటు లాంచర్ నందుగల System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

a3

మొదటిసారి Language Support ని తెరచినపుడు క్రిందివిధంగా అడుగుతుంది.

a4

ఇన్ స్టాల్ ని నొక్కిన తరువాత పాస్ వర్డ్ అడుగును.పాస్ వర్డ్ ని ఇవ్వగానే డౌన్ లోడ్ చేసుకొని,ఇన్ స్టాల్ చేసుకొని క్రింది విండో తెరవబడును

a5

Install/Remove Languages ని నొక్కినపుడు మరొక విండో తెరవబడును.అక్కడ తెలుగు ని ఎంచుకొని Apply Changes ని నొక్కినపుడు తెలుగు భాషకు మద్దతు మన కంప్యుటర్ లో స్థాపించబడును.

a6

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంని తెలుగులో కూడా వాడుకోవచ్చు.పైన చూపించిన విధంగా తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోన్న తరువాత Language Support లోనికి వెళ్లి అక్కడ చూపించబడిన భాషలలో తెలుగును లాగి (డ్రాగ్ చేసి) ప్రాధాన్యత క్రమం లో మొదట ఉంచవలెను.

a8

ఆ తరువాత సిస్టం ని లాగ్ అవుట్ చేసి మరలా లాగిన్ కావాలి.అప్పుడు క్రింది చిత్రాలలో చూపించినట్లు మెనూ మరియు డాష్ లో తెలుగు కనిపించును.

a9

తెలుగులో మేనూలు

a15

ఉబుంటు ని తెలుగులో ఉపయేగిస్తున్నపుడు అక్కడక్కడా ఇంగ్లీష్ లో కనిపించును.ఇంకనూ వాటి అనువాదాలు పుర్తికాకపోవడం వలన ఈవిధంగా కనిపించును.ఈ అనువాద పక్రియలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు.ఇక్కడ మనం ఇప్పటికే అనువాదాలు చేస్తున్న ఒత్సాహికులను చూడవచ్చు,మనం కూడా వీరితో చేరి అనువాదాలు చేయవచ్చు.

తెలుగు వ్రాయడానికి:

System Settings లో ఉన్న Keyboard ని తెరిచి Layout Settings లోకి వెళ్ళాలి.

a11

a12

ని నొక్కడం ద్వారా మరొక విండో తెరవబడును.అక్కడ పెట్టెలో తెలుగు అని టైప్ చేసినపుడు పైన పెట్టెలో తెలుగు కనిపించును.Add ని నొక్కినపుడు ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని చూపించును.అక్కడ నుండి మనం

ప్రతిసారి కీబోర్డ్ లేఅవుట్ ని మార్చుకోవచ్చు.ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని నొక్కి తెలుగు ను ఎంచుకొని తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.

a13

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.072
ANCHURI GOPAL Oct 10, 2018 06:43 PM

కంప్యూటర్ ఫై అవగాహన ఎంతో ముక్కము ఆధునిక భర్త దేశ్ అభివృద్ధిలో కంప్యూటర్ సమాచార సాంకేతిక అభివృధికి
తెలుగు మరియూ భర్తీహ్లా కృషి వుంది వవసాయ కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞమును మేము అభివృద్ధి చేసాము
దీనికి హనంకొండ,వరంగల్ పట్టణ విశ్వద్యాలయాలు తోడఁబడ్డయి దీనికి వారికీ అభినందనాలు మేము
బారతీయ వేదిక విజ్ఞానముపై కంప్యూటర్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నాము

అంచురి గోపాల్
కంప్యూటర్ పరిశోధన సహస్ర వేత్త
అసోసియేట్ ప్రొఫసర్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్
యూనివర్సిటీ రోడ్,హనంకొండ,వరంగల్ సిటీ-తెలంగాణ-ఇండియా
ఓరుగల్లు టెక్నాలజీ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ పార్టీశ్రమ
కాంటాక్ట్ ఫోన్: 81*****13

P Venkateswarlu Apr 30, 2015 03:45 PM

సర్ ఈ పేజి లో విషయాలు చాల బాగున్నాయి. ధన్యవాదాలు

v nagaraj Apr 30, 2015 10:34 AM

చాల భాగుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు