অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈ-మెయిల్స్‌ద్వారా వచ్చే ఉద్యోగావకాశాలపట్ల జాగ్రత్తగా ఉండండి

ఈ-మెయిల్స్‌ద్వారా వచ్చే ఉద్యోగావకాశాలపట్ల జాగ్రత్తగా ఉండండి
  • చాలామంది విద్యార్ధులు ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. వెబ్‌సైట్‌లలో నమోదైన వీరి వివరాలను మోసగాళ్ళు సేకరించి బూటకపు ఈ-మెయిల్స్ పంపుతుంటారు.
  • ఈ ఈ-మెయిల్‌కూడా నిజమైన కంపెనీలు పంపే మెయిల్‌లాగానే కనిపిస్తుంది. మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సైట్లద్వారా ఈ మెయల్స్‌ను పంపి ఇంటర్వ్యూలుకూడా నిర్వహిస్తారు.
  • బాధితుడికి ఉద్యోగంలో చేరమంటూ ఒక మోసపు నియామకపత్రం అందుతుంది. ఈ లేఖ అందుకున్నవారు ఒక పెద్దమొత్తం చెల్లించాలనికూడా మోసగాళ్ళు ఆ లేఖలో సూచిస్తారు.
  • మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సర్వీస్ ద్వారా ఉద్యోగనియామక పత్రాన్ని పంపుతారు. బహుళజాతిసంస్థ పేరుతో ఫోన్ చేయటం, ఉద్యోగ నియామకపత్రాన్ని పంపటం చేస్తుంటారు. వారి మాటలు నమ్మి ఉద్యోగార్థులు వారి ఖాతాలలో డబ్బును జమచేస్తారు. మోసగాళ్ళు వెంటనే ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు.

ముందుజాగ్రత్తలు

  • స్పామ్ మేయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో సరిచూసుకోకుండా జవాబు ఇవ్వరాదు.
  • అభ్యర్దులు సంస్థలతో స్వయముగా మాట్లాడనంత వరకు డబ్బులు ఖాతాలలో జమ చేయకూడదు.
  • డబ్బులు చెల్లించి ఉద్యోగాలను పొందునటువంటి ప్రక్క దారులను ప్రయత్నించకండి, అవి మోసపూరితమైనవి.
  • ఉద్యోగ అవకాశాలకై సంస్థలయోక్క వెబ్ సైట్లలో సరిచూసుకోండి.

సంస్థల నకిలీ ఈ-మెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి.

  • ఈ-మెయిల్స్‌ ద్వారా చేయు వ్యాపార లావాదేవీలకు ముందు ఈ-మెయిల్ ఐడి లోని ప్రతి అక్షరమును సరిచూసుకోండి.
  • నగదును సంస్థల ఖాతలలో జమచేయు ముందు వారి ఖాతా మరియు సంస్థ పేరుల వివరముల ఏమైన మార్పులు ఉన్నాయేమొ ఫోనులో అడిగి తేలుసుకోండి.
  • మీ ఎకౌంటును తెరుచుటకు సెకెండ్ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ (మొబైల్ ఎలర్ట్) ను నిర్వహించండి .
  • ఏదైన మోసపూరితమైనవి గమనించి నపుడు సంస్థలకు వెంటన తెలియపరచండి.
  • స్పామ్ ఈ-మెయిల్స్‌ ఎక్కడనుండి వచ్చాయే సరి చూసు కోకుండా ప్రత్యుత్తరము ఎవ్వకూడదు.

ఆధారము: http://www.infosecawareness.in/



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate