హోమ్ / విద్య / సమాచార సాంకేతిక (ఐటి) విద్య / సమాచార సాంకేతిక విద్య
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమాచార సాంకేతిక విద్య

ఈ విభాగం లో సమాచార భారత దేశ వివిధ ప్రాంతీయ భాషలలో టైపు చేయుట గురించి తెలపబడింది

ఈ వెబ్ పోర్టల్ యొక్క ఐటి అక్షరాస్యత విభాగం ఈ ప్రాంతాలలో వెబ్ లోని లభ్యమయ్యే రకరకాలైన టెక్నాలజీల గురించి తెలియజేసింది. కంప్యూటర్ యొక్క ప్రధానాంశాలు మరియు ఆధారభూతమైన హార్డ్ వేరు( అనగా చేతితో ముట్టుకొనగలిగినవి) టిప్స్ మరియు ఎంచుకున్న ప్రాంతీయ భాషలలో తరచుగా అడిగే ప్రశ్నలను అందిస్తుంది.

ఫోనిటిక్ కీ బోర్డ్ ఆధారంగా ఎటువంటి భారతీయ ప్రాంతీయ భాష నైననూ టైప్ చేయుట

కంప్యూటర్ లో భారతీయ భాషలను ఉపయోగించుట సాధారణ వ్యక్తికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భారతీయ భాషలలో క్విల్ పేడ్ మరియు లిపికార్ ఉచితంగా ఆన్ లైన్లో టైపు చేసే ఉపకరణములు. ముందుగా విశ్లేషించబడిన నియామకాల ప్రకారం లిప్యంతీకరణ సాంకేతికాలకు ఆధారంగా ఉంటుంది. లిప్యంతీకరణ సాంకేతిక విద్య టైపు చేసే వారికి, వారు సాధారణంగా ఎలా చేస్తారో అలా చేయనిస్తుంది. (rAshTrbhAshA కాకుండా rashtra bhasha లాగా ) నిర్దిష్టమైన  కేస్-సెన్సిటివ్ టైపింగ్ నియమాల లాగా లిప్యంతీకరణ ఉపకరణములు, ఆంగ్ల పదములు ఫొనిటికల్ గా టైపు చేయుటను ఆశిస్తుంది. దీనివల్ల టైపు చేయువారు వారి ఎన్నిక ప్రకారం వారి సొంత ప్రాంతీయ భాషలో సమాచారం పంపవచ్చును. పేజీ లోకి వెళ్ళగానే ప్రాంతీయ భాషతో టైపు చేయడానికి మీకు కావలసిన భాషను ఎన్నుకోవచ్చు. ఇటువంటి సౌలభ్యం కల్పించే వెబ్ సైట్ లు చాలా ఉన్నాయి.

http://www.google.com/transliterate

http://quillpad.com/

http://www.lipikaar.com/

ఫాంట్లను డౌనులోడ్ చేయుట

భారతీయ భాషల యొక్క సాంకేతిక అభివృద్ధి (టి డి ఐ ఎల్ ) కార్యక్రమం సమాచార సాంకేతిక విభాగము {ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  (డి ఐ టి)} మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం భారతీయ భాషలలో మానవ యాంత్రిక పరస్పర సంబంధము కలుగ జేయుటకు సమాచార గమన ఉపకరణాలను అభివృద్ధిచేయాలన్న ఆశయం కలిగిఉంది మరియు పలుభాషా జ్ఞాన వనరులను అందుబాటులోకి తెచ్చుటకు సాంకేతిక విద్యలను అభివృధ్ధి పరచాలని ఉంది. సామాన్య ప్రజల లబ్ధి కొరకు వెబ్ డౌన్ లోడ్ ల ద్వారా మరియు భాషా సిడిల ద్వారా ఫాంట్ లు అనేవి ప్రజలకు చాలా సులువుగా అందబడుచున్నవి. ఫాంట్లను డౌన్ లోడ్ కొరకు ఎంచుకున్న భాష మీద క్లిక్ చేయండి.

http://www.ildc.in/

ట్రూ టైప్ ఫాంట్ టెక్స్ట్ ను ఓపెన్ టైప్ ఫాంట్ టెక్స్ట్ లోకి మార్చుట (యూనికోడ్)

ఈ క్రింద ఇవ్వబడ్డ లింక్ ద్వారా ట్రూ టైప్ టెక్స్ట్ ను ఓపెన్ టైప్ టెక్స్ట్ గా (యూనికోడ్) T x T మార్చవచ్చు. ఫార్మాట్ లో ట్రూ టైప్ టెక్స్ట్ ఫైల్ ను అప్ లోడ్ చేయండి. మీరు వాడిన ఫాంట్సు ను ఎంచుకోండి మరియు ఔట్ పుట్ కొరకు ఫైనల్ పార్మాట్ ను ఎంచుకొండి. దానంతట అదే మారిపోయి ఔట్ పుట్ ను ఓపెన్ టైప్ టెక్స్ట్ లో (యూనికోడ్) ఇస్తుంది.

http://www.innovatrix.co.in/unicode/fileconverterindex.php5

పద్మా ప్లగిన్

పద్మా ప్లగిన్ సర్వజన మరియు యాజమాన్య సంబంధమైన ఫార్మాట్ ను ఇండిక్ టెక్స్ట్ లో కి మార్చడానికి వాడే సాంకేతిక విద్య. ఈ సాంకేతిక విద్య (ప్రస్తుతం తెలుగు, తమిళం, దేవనాగరి (మరాఠి కూడా), గుజరాత్, బెంగాల్ మరియు గురుముఖి వంటి భాషలకు ఆధారంగా నిలుస్తుంది.

యునికోడ్ యొక్క ఆధారం అన్నిచోటల విరివిగా అందుబాటులోకి వచ్చేంత వరకు, మూయబడి మరియు తెరవబడియున్న స్టాడర్డ్స్ కు మధ్య సాంకేతిక లోతుపాట్లను/దూరాలను పూరించడమే పద్మ ప్లగిన్ యొక్క ఆశయం. యాజమాన్య సంబంధమైన ఫార్మాట్ లో ఎన్ కోడ్ చేయబడ్డ ఇండిక్ టెక్స్ట్ పద్మ యూనికోడ్ లోకి వస్తుంది. ISCII మరియు లిప్యంతీకరణ పథకాలలాంటి ITRANS మరియు RTS (తెలుగు మాత్రమే) వంటివి మార్చడానికి కూడా పద్మ సహాయపడుతుంది. ప్లగిన్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్ లైన్ నిఘంటువులు

హిందీ నిఘంటువు

ఆంగ్లము నుండి హిందీ నిఘంటువు మరియు హిందీ నుండి ఆంగ్ల నిఘంటువు. ఆంగ్ల పదముల కొరకు వెదకవచ్చును లేక బిల్ట్ఇన్ కీ బోర్డ్ సహాయంతో హిందీ పదములు వెదకవచ్చును.

తెలుగు నిఘంటువు

తమిళ నిఘంటువు

బెంగాలి నిఘంటువు

మరాఠి నిఘంటువు

ఆంగ్లము నుండి ఆంగ్లము

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01492537313
Johng346 Jun 07, 2018 11:12 AM

Some really nice and useful information on this web site, also I conceive the style and design holds superb features. bkebgedabddg

Johna56 Jun 07, 2018 11:12 AM

Happy to become one of several customer for this wonder inspiring site D. bbdccfeaeffc

yugandhar jadi Mar 31, 2015 03:14 PM

ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులకు ఉత్తమ కంప్యూటర్ బోధనా మరియు శిక్షణను మరింత ప్రవితంగా అందించాలి. తద్వారా వారు భవిషత్తులో వారికి కావలిసిన నైపుణ్యాలు సంపాదించుకొంటారు. తద్వారా మనకు రాబోయే తరంలో కావలిసిన మనవ వనరులను సంవృద్దిగా పొందగలము.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు