অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వినికిడి లోపం ఉన్న పిల్లల విద్యా కార్యక్రమాలు

వినికిడి లోపం ఉన్న పిల్లల విద్యా కార్యక్రమాలు

తల్లిదండ్రులు కోసం కరస్పాండెన్స్ కోర్సు

తల్లిదండ్రులు పిల్లల మొదటి మరియు సహజ ఉపాధ్యాయులు. అందరు పిల్లలు దాదాపు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రుల నుండి భాష నేర్చుకుంటారు. కరస్పాండెన్స్ కోర్సులు తల్లిదండ్రులు కోసం రూపొందించబడ్డాయి.

పిల్లలు కమ్యూనికేషన్ మరియు భాష నైపుణ్యాల అభివృద్ధి సమయంలో ఎదుర్కోబోయే సమస్యలను అవి వివరిస్తాయి. తల్లిదండ్రులకు భాషాభివృద్ది కోసం గృహ అధ్యయన ప్రణాళికను అందిస్తాయి. భాష నేర్వడానికి ముఖ్య కాలం 0-5 సంవత్సరాలు. ఈ వయసులో పిల్లకు ఇంట్లో భాషను నేర్పించ డానికి ఉపయోగ పడుతుంది.

ప్రస్తుతం అలాంటి దూర కోర్సులు వివిధ భాషలలో పలు సంస్థల వద్ద అందుబాటులో ఉన్నాయి. కొన్ని చిరునామాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

కంన్మంతర, M.D.D. AYJNIHH, కె.సి. మార్గ్, బాంద్రా రిక్లమేషను, బాంద్రా (W), ముంబై - 400050 (మరాఠీ కోసం) సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెఫ్ టీచర్స్ మున్సిపల్ స్కూల్ బిల్డింగ్, 3 వ అంతస్తు, YMCA స్విమ్మింగ్ పూల్ ఎదురుగా, ఫరూక్ ఉమరాబోయ్ పాత్ అగ్రిపడ, ముంబై - 400011 (మరాఠీ కోసం)
జాన్ ట్రేసీ క్లినిక్ 806, వెస్ట్ ఆడమ్స్ బౌలేవార్డ్, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా - 90007 (ఇంగ్లీష్ కోసం) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్సారీ నగర్, న్యూఢిల్లీ - 110 029 (హిందీ కోసం)

చాలా వరకు ఇటువంటి దూర కోర్సులు తల్లిదండ్రుల కోసం ఉచితంగా ఉంటాయి.

మాతృ శిశు కార్యక్రమం

ఈ కార్యక్రమాలు చాలా చిన్నవయసులోనే వినికిడి లోపం ఉన్నవారిని గర్తించడానికి ప్రవేశపెట్టారు. పిల్లల పూర్తి అభివృద్ధిని గమనించటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యము. వినికిడి సమస్యలు గల పిల్లలను ఒక భాష స్టిమ్యులేటింగ్ వాతావరణంలో పెంచడం వలన సహజ భాషను నేర్చుకొనే అవకాశం కల్పించటం దీని ఉద్దేశ్యము. ఈ కార్యక్రమానికి ఆయువు పట్టు మాతృ సాధికారతపై ఉంది. పేరు సూచించినట్లుగా, తమ శిశువులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో చేరటం వలన శిశు దశలోనే వారిని అభివృద్ధి చేస్తారు. దీని వలన తరువాతి దశలో సాధారణ విద్య పొందటంలో పిల్లలకు కష్టంకాదు

ఇటువంటి మాతృ శిశు కార్యక్రమాలు భారతదేశం లో కొన్ని కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఆ కేంద్రాలు:

A.Y.J.N.I.H.H. కె.సి. మార్గ్, బాంద్రా రిక్లమేషను, ముంబై - 400050 మైత్రి శిశు ట్రైనింగ్ సెంటర్ మున్సిపల్ బిల్డింగ్, 3 వ అంతస్తు, YMCA స్విమ్మింగ్ పూల్ ఎదురుగా, ఫరూక్ ఉమరబోయ్ పాత్, అగ్రిపడ, ముంబై - 400011 (మరాఠీ కోసం)
వికాస్ విద్యాలయ ఫర్ డెఫ్ A-3, మెహతా అపార్ట్మెంట్, ప్రొఫెసర్ అగశే రోడ్, దాదర్, ముంబై - 400028 బాలవిద్యాలయ్ స్కూల్ ఫర్ యంగ్ డెఫ్ చిల్డ్రన్ 14, 1 వ క్రాస్ వీధి, శాస్త్రి నగర్, చెన్నై - 600020 తమిళనాడు

తల్లిదండ్రులు కోసం సమక్ష శిక్షణ కార్యక్రమాలు

వినికిడిలోపం ఉన్న పిల్లల మంచి శిక్షణ కోసం వారి తలిదండ్రులు మరియు అద్యాపకుల మద్య సంబంధాలను ఏర్పరిచే కార్యక్రమాలను భారతదేశంలోని ప్రత్యేక పాఠశాలలో మామూలుగా నిర్వహిస్తారు. తగిన శిక్షణ ఇవ్వడానికి పిల్లల వయస్సు ఆధారంగా తరగతి గది బోధనా కార్యక్రమాలను తల్లిదండ్రులకు తెలియచేస్తారు.

అలాంటి కార్యక్రమాలను సాధారణంగా కిందివారు నిర్వహిస్తారు.

A.Y.J.N.I.H.H. K.C.మార్గం, బాంద్రా రిక్లేమేషను, ముంబై - 400050 K.D.N. శృతి స్కూల్ అఫ్ డెఫ్ జహూకర్ మార్గ్, చందన్ సినిమా వెనుక, J.V.P.D. స్కీమ్, ముంబై - 49
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద టీచర్స్ అఫ్ డెఫ్ మున్సిపల్ స్కూల్ బిల్డింగ్, 3 వ అంతస్తు, YMCA స్విమ్మింగ్ పూల్ ఎదురుగా, ఫరూక్ ఉమ్రాబోయ్ పాత్ అగ్రిపడ, ముంబై - 400011 బాలవిద్యాలయ స్కూల్ ఫర్ యంగ్ డెఫ్ చిల్డ్రన్ 14, 1 వ క్రాస్ వీధి, శాస్త్రి నగర్, చెన్నై - 600020 తమిళనాడు
లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ డెఫ్ 127, జి.బి. రోడ్, కేథడ్రల్ పి.ఒ., చెన్నై - 600006 తమిళనాడు

పూర్వ- ప్రాధమిక పాఠశాల కార్యక్రమాలు

సాధారణ పాఠశాలలో ఇండిగ్రేటెడు విద్య

పిల్లలు ఇంటిగ్రేటెడ్ పూర్వ-పాఠశాల లేదా సెగ్రిగేటెడ్ ప్రత్యేక పాఠశాల కార్యక్రమాల నుంచి మామూలు ప్రాథమిక పాఠశాలలో చేరుతారు. వినికిడి లోపం ఉన్న పిల్లలకు రాష్ర్టాలలోని రాష్ట్ర ప్రత్యేక విద్యా బోర్డు పాఠ్య ప్రణాళికను వాడతారు, కాని వారికి భాష మరియు మౌకిక పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రత్యేక పాఠశాలలో సెగ్రిగేటెడ్

ఆలస్యంగా గుర్తించిన పిల్లల లేదా తగినంత ఫంక్షనల్ భాష అభివృద్ధి జరగని వారు ప్రత్యేక పూర్వ- పాఠశాల విద్యా కార్యక్రమాలలో చేరుతున్నారు. ప్రత్యేక పాఠశాలలో, ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు బలమైన భాషా పునాదిని వేస్తారు. దీనివలన వారికి ప్రాధమిక మరియు సెకండరీ పాఠశాల విద్య నేర్చుకోవటం సులభం అవుతుంది. పిల్లల విజయాలను బట్టి అది సమీకృత వ్యవస్థలో లేదా ప్రత్యేక పాఠశాలలో కావచ్చు. ప్రత్యేక పాఠశాలలలో ఉపాధ్యాయులు వివిధ పద్ధతులు ఉపయోగించి సంభాషణా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపోయేందుకు ప్రత్యేక పూర్వ పాఠశాల పాఠ్య ప్రణాళికను రూపొందించారు. ఇది కథ చెప్పటం, మార్గదర్శక నాటకం లాంటివాటిని కలిగి ఉంటుంది. దీనివలన వ్యక్తీకరణ భాష అభివృద్ధి జరుగుతుంది.

ప్రత్యేక పూర్వ పాఠశాల కార్యక్రమాలు AY.J.N.I.H.H., ముంబైలో మరియు దాని ప్రాంతీయ కేంద్రాలలో మరియు దేశవ్యాప్త అనేక ప్రత్యేక పాఠశాలలో జరుగుతాయి. యంగ్ హియరింగ్ ఇంపెయిర్డ్ చిల్డ్రన్ పాఠ్య పణాళిక A.Y.J.N.I.H.H. వద్ద అందుబాటులో ఉంది.

ప్రాథమిక పాఠశాలలు

ఒక సాధారణ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ విద్య

ఇంటిగ్రేటెడ్ పూర్వ- పాఠశాల విద్య నుండి లేదా సెగ్రిగేటెడ్ ప్రత్యేక పాఠశాల కార్యక్రమాల నుండి గాని వచ్చిన పిల్లలు సాధారణ ప్రాధమిక పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రతి రాష్ట్రం లోని ప్రత్యేక రాష్ట్ర విద్యా బోర్డు సూచించిన పాఠ్యాంశాలను అనుసరిస్తారు, కానీ భాష మరియు మౌకిక పరీక్షల నుండి మినహాయింపు ఉంటుంది. ఒక రిసోర్సు ఉపాధ్యాయుడు లేదా ప్రత్యేక ఉపాధ్యయుడి సాయం మిగతా పిల్లతో సమానంగా పురోగతి సాధించటానికి సహాయపడుతుంది.

ప్రత్యేక పాఠశాలలో సెగ్రిగేటు విద్య

ఇప్పటికీ మంచి భాష మరియు సంభాషణ నైపుణ్యాలను అభివృద్ధి కాని వారికి చదవడానికి మరియు రాయడానికి మరింత సహాయం అవసరం అవుతుంది. అలాంటి పిల్లలకు ప్రత్యేక పాఠశాల ప్రాధమిక విద్యను కొనసాగించవచ్చు. ప్రత్యేక ఉపాధ్యాయులు వ్యక్తిగత విద్యా ప్రణాళిక రూపకల్పన మరియు పిల్లల వ్యక్తిగత అవసరాల ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి చెస్తారు. స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు పాఠ్య ప్రణాళికతో పాటు ప్రత్యేక ఉపాధ్యాయులు భాష మరియు వ్యక్తీకరణలను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు.

మాధ్యమిక పాఠశాల

సాధారణ పాఠశాలల్లో ఇంటిగ్రేటెడు విద్య

ఏకీకృత ప్రాధమిక పాఠశాలల నుండి లేదా ప్రత్యేక ప్రాథమిక పాఠశాల నుండి పిల్లలు మాధ్యమిక పాఠశాలలో చేరవచ్చు. అనేక కారణాల వలన ప్రత్యేక మాధ్యమిక పాఠశాలలో మాధ్యమిక విభాగం అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు, సదరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పాఠశాలలలో మాధ్యమిక పాఠశాలను నడపడానికి అనుమతిని ఉండకపోవచ్చు. అందువలన పిల్లలు ఏకీకృత మాధ్యమిక పాఠశాలల్లో నమోదు అవుతారు. ఈ సమయంలో కూడా అధిక స్థాయిలో పాఠశాల మానుకున్నవారు ఉంటారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి అందుబాటులోని ఎంపికలను చూసి విద్యను నిలిపివేయకుండా చూడాలి.

పాఠ్య ప్రణాళిక సదరు రాష్ట్ర బోర్డు సూచించినది అయినా వినికిడి లోపాల పిల్లలు భాషలో మినహాయింపును పొందుతారు దానికి బదులుగా అవసరమైన ఐచ్ఛిక విషయాలను ఎంచుకోవాలి.

సెగ్రిగేటెడు ప్రత్యేక పాఠశాలలు

ఏదైనా ఇతర కారణాల వలన పిల్లలు సాధారణ ప్రాధమిక పాఠశాలలో చేరలేక పోతె ప్రత్యేక పాఠశాలలో వారి మాధ్యమిక విద్యను కొనసాగించవచ్చు. రాష్ట్ర బోర్డుల మాధ్యమిక విద్య విద్యాప్రణాళికకు అదనంగా, వారు భాష మినహాయింపులను పొందుతారు. చాలా ప్రత్యేక పాఠశాలలు వృత్తి నైపుణ్యాలను బోధించే తరగతులను కూడా కలిగి ఉన్నాయి.

నిరంతర విద్య

నేషనల్ ఓపెన్ స్కూల్

సాధారణ విద్యాలయ వ్యవస్థలో చదువుకోలేని వారికి నేషనల్ ఓపెన్ స్కూల్ విద్యను అభ్యసించటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది వికలాంగ పిల్లలకు, ముఖ్యంగా పాఠశాల మానుకున్న వారికి నిరంతర విద్యను అందిస్తుంది. ఈ ప్రయోజనం కోసం పలు చోట్ల NOSలు న్యూనత కలిగిన వారి ప్రత్యేక గుర్తింపు కేంద్రాల (SAIED)లను ఏర్పాటు చేసింది. ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హాడీక్యాప్ట్ వినికిడి సమస్యలు గల పిల్లలకు నిరంతర విద్యను అందిస్తున్న గుర్తింపు పొందిన కేంద్రాలలో ఒకటి. ఇది రెండు కార్యక్రమాలను అందిస్తుంది - ఆరంభ కోర్సు మరియు మాధ్యమిక విద్యను హిందీ మరియు ఆంగ్ల మాధ్యమాలలో ఉంటుంది.

  1. ఆరంభ కోర్సు: ప్రవేశానికి ఐదవ స్టాండర్డు వరకు కనీస విద్యార్హత అవసరం అవుతుంది. ఆరంభ కోర్సు ఎనిమిదో స్టాండర్డుకు సమానం. ఏ పబ్లిక్ పరీక్షలు, మార్కులు లేదా సర్టిఫికెట్ ఉండవు. ఐదు విషయాలు ఉంటాయి. అందులో ఒకటి లేదా రెండు గాని భాషలు గ్రూపు Aలో ఉంటాయి. మిగిలిన 3 విషయాలు గ్రూపు Bలో ఉంటాయి.
  2. మాధ్యమిక విద్య: కనీస విద్యార్హత ఎనిమిదవ స్టాండర్డు లేదా నేషనల్ ఓపెన్ పాఠశాల నుంచి ఆరంభ కోర్సు. మాధ్యమిక విద్య పదో స్టాండర్డుకు సమానం. ఏదైనా ఒక భాష + ఐదు విషయాలు ఉంటాయి. విజయవంతంగా పూర్తయిన తర్వాత పబ్లిక్ పరీక్షలను నిర్వహించి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇస్తారు. దీని ప్రత్యేక లక్షణం ఏమిటంటే విద్యార్ధి ఐదేళ్లలో సంవత్సరానికి ఒక విషయాన్ని రాయవచ్చు అంటే విద్యార్ధి తన సొంత వేగంతో చదవవచ్చు.

హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్

వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ రెగ్యులరు పాఠశాల లేదా ప్రత్యేక పాఠశాల లేదా NOS నుండి విజయవంతంగా, సెకండరీ ఎడ్యుకేషన్నుగుర్తించబడిన బోర్డు ద్వారా, పూర్తి చేస్తారో వారు హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రవేశానికి అర్హులు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు భాష మినహాయింపుకు అర్హులు మరియు వేరే ఐచ్ఛిక అంశాలను ఎంచుకోవచ్చు.

ప్రత్యేక పాఠశాలలు

బధిర విద్యార్థులు ఎవరైతే విజయవంతంగా సెకండరీ ఎడ్యుకేషన్ను గుర్తించబడిన బోర్డు నుంచి ఇంటిగ్రేటెడ్ రెగ్యులర్ పాఠశాల లేదా ఓపెన్ స్కూల్ లేదా అన్ని నేషనల్ ఓపెన్ స్కూల్లలో పూర్తి చేస్తారో వారు ప్రవేశానికి అర్హులు. క్రింద కొన్ని పాఠశాల జాబితా ఇవ్వబడింది.

  1. లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హయ్యర్ సెకండరీ ఫర్ డెఫ్, 127, జి ఎన్ రోడ్, కేథడ్రల్ పి.ఒ. చెన్నై - 600 006, తమిళనాడు.
  2. St. లూయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్ , కెనాల్ బ్యాంక్ రోడ్డు, మహాత్మా గాంధీ నగర్, అడయార్, చెన్నై - 600 020

కాలేజ్ ఎడ్యుకేషన్

గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్ (సాధారణ)/ప్రత్యేక పాఠశాలల నుండి హైయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసిన వినికిడి లోపం ఉన్న వారు సాధారణ కళాశాల లో చేరడానికి అర్హులు లేదా ఉన్నత విద్య కోసం ఇగ్నో (ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)లో నమోదు చేసుకోవచ్చు.

సెగ్రగేటెడ్ ప్రత్యేక కళాశాలల చిరునామాలు:

  1. C.S.I. ఒకేషనల్ హై స్కూల్ ఫర్ డెఫ్, పోస్ట్ ఒకోలం, కొత్తారకర, జిల్లా క్విలన్, కేరళ
  2. St. లూయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్, కెనాల్ బ్యాంక్ రోడ్డు, మహాత్మా గాంధీ నగర్, అడయార్, చెన్నై - 600 020

భారతదేశం లో వినికిడి లోపం ఉన్న పిల్లల పాఠశాలల జాబితా

మూలం: ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate