పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతరములు

విద్యకి సంబందించిన ఇతర పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి.

పాఠశాల యాజమాన్య కమిటీ

భారత ప్రభుత్వం 86 వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ఆర్టికల్ 21(ఎ) ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

రెసిడెన్షియల్ పాఠశాలలు (గురుకుల పాఠశాలలు)

 • లక్ష్యం: గ్రామీణ పిల్లలకు మంచి విద్య అందించడానికి నేర్చుకునే ప్రదేశాల్లో ఉచిత వసతి, మరియు బస సదుపాయాలను కల్పించడం.
 • అర్హత: మండలం స్థాయిలో 14వ ర్యాంక్ కంటే తక్కువ కాకుండా,తెలుగు మీడియంలో 4వ తరగతి నుండి 7వ తరగతి చదువుతున్న గ్రామీణ విద్యార్థులు.
 • లబ్దిదారులు: ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు.
 • ప్రయోజనాలు: ఉచిత వసతి, మరియు బస సౌకర్యాలు.
 • సంప్రదించాల్సిన వివరాలు: మండల విద్యా అధికారి/ జిల్లా విద్యా అధికారి.
 • జి.ఓ నం.: G.O.Ms.No.53 విద్యా శాఖ., 2003.

పాఠ్యపుస్తకాల ఉచిత సరఫరా

 • లక్ష్యం: మెట్రిక్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ఉచిత సరఫరా ద్వారా విద్యా సాయం.
 • అర్హత: ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.12,000/- తక్కువ గల మైనార్టీలకు చెందిన ప్రి మెట్రిక్ విద్యార్థులు.
 • లబ్దిదారులు: మైనార్టీలకు చెందిన బి.పి.ఎల్ ప్రి మెట్రిక్ విద్యార్థులు.
 • ప్రయోజనాలు: ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరా.
 • సంప్రదించాల్సిన వివరాలు: ప్రధాన ఉపాధ్యాయులు/మండల విద్యా అధికారి/ జిల్లా విద్యా అధికారి/జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి.
 • జి.ఓ నం.: G.O.Ms.No155 మైనారిటీల సంక్షేమశాఖ,తేది 10.9.1997.

కిషోర్ బాలిక పథకం

 • లక్ష్యం: చిన్న వయసు లో పెళ్ళిళ్ళు ఆపడానికి అమ్మాయిలను ప్రాథమిక విద్య కు 100% నమోదు ఉండేలా చూడటం.
 • అర్హత: 15 సంవత్సరాలలోపు బాలికలు.
 • లబ్దిదారులు: బి.పి.ఎల్ కుటుంబాల 15 సంవత్సరాలలోపు బాలికలు.
 • ప్రయోజనాలు: నైపుణ్య శిక్షణ, బ్రిడ్జ్ కోర్సులో అవగాహన సందర్శనలు,శిబిరాలు మరియు శిక్షణ నిర్వహణ.
 • సంప్రదించాల్సిన వివరాలు: అంగన్ వాడి టీచర్ /ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్/ఐ.సీ.డీ.ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్/మహిళా సంక్షేమ ఆఫీసర్.
 • జి.ఓ నం.: G.O.Ms.No. 70,మహిళా సంక్షేమశాఖ, తేది 10.7.1999.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

సాక్షర భారత్‌

సాక్షర భారత్‌ కేంద్రాలను అక్టోబర్‌ 2, 2010న ప్రారంభించారు. మొదట ఈ కార్యక్రమానికి వయోజన విద్య అని నామకరణం చేశారు. ఆ తర్వాత సంపూర్ణ అక్షరాస్యత (అక్షర సాధన), అక్షర సంక్రాంతి, అక్షర భారతి, సాక్షర భారత్‌గా నామకరణం చేసారు. సాక్షర భారత్‌, వయోజన విద్యా కేంద్రాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పూర్తిగా చదువుకోలేని వారి కోసం సాక్షర భారత్‌, చదువుకున్న వారికి చదువును పెంపొందించేందు కుగాను దీంతో పాటు, క్రీడలపై అవగాహన పెంచడం వయోజన విద్యా కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యం. సాక్షర భారత్‌లో చేరిన వారికి ఆరు నెలల వ్యవధి తర్వాత ఓపెన్‌ స్కూళ్ల ద్వారా ఢిల్లిలో పరీక్షలు నిర్వహిస్తారు. సాక్షర భారత్‌కు సంబంధించి ప్రతీ మండలానికి ఒక కో-ఆర్డినేటర్‌, పెద్ద పంచాయతీ అయితే ఇద్దరు కో-ఆర్డినేటర్లు, లేదంటే ఒకే కో-ఆర్డినేటర్లు ఉంటారు.

పంచాయతీరాజ్ సంస్థల పాత్ర

గ్రామ ప్రజలకు అతి దగ్గరలో యున్న ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ గ్రామ పంచాయితి. ఇట్టి పంచాయితీలు గ్రామ పాలనలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. 73వ రాజ్యాంగ సవరణల ద్వారా ఇట్టి స్థానిక ప్రభుత్వాలు ఇంకా బలోపేతమయినాయి. ఈ సవరణ ప్రకారం పంచాయతీకి దాఖలు పరచవలసిన 29 అంశాలలో వయోజన విద్య ఒకటి. ఇట్టి పరిస్థితులలో పంచాయితీల ద్వారా ”సాక్షర భారత్‌” కార్యక్రమాలు అమలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం అమలుకు కావలసిన నిధులు, విధులు, సిబ్బందిని పంచాయతి స్థాయిలలోనే ఏర్పాటు చేశారు.

గ్రామస్థాయి పంచాయతీ లోక శిక్ష సమితి ఏర్పాటు :

 • ప్రతి పంచాయతీలోను పంచాయతీ లోక్‌ శిక్షా సమితి ఏర్పాటు చేయాలి. దీనికి పంచాయతీ సర్పంచ్‌ అధ్యక్షులుగా ఉంటారు. సీనియర్‌ మహిళా వార్డు సభ్యులు ఉపాధ్యక్షులుగా ఉంటారు. పంచాయతీ మహిళా సభ్యులు, విద్యా కమిటి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎస్‌.సి. / ఎస్‌.టి. / మైనారిటీ ప్రతినిధులు, వినియోగదారుల గ్రూపుల ప్రతినిధులు, విద్యావంతులు, ప్రభుత్వోద్యోగులు వంటివారు సభ్యులుగా ఉంటారు. సభ్యులలో కనీసం 50% మంది మహిళలు ఉండాలి.
 • పంచాయతీ కార్యదర్శి ఈ సమితికి సభ కార్యదర్శిగా ఉంటారు.
 • ప్రతి పంచాయతీలో పంచాయితీ లోక్‌ శిక్షా సమితి ఏర్పాటు చేయాలి. సమితి ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది.
 • ప్రజా విద్యా కేంద్రం నిర్వహించడం, నిర్వహించిన కార్యక్రమ వివరాలు డాక్యుమెంటు చేయడం. పంచాయతీ ప్రజా విద్యా సమితి, అక్షరాస్యతా కేంద్రాల నిర్వహణకు ప్రాజెక్టు నివేదిక తయారు చేయడం.
 • అక్షరాస్యతా అనుకూల వాతావరణ కల్పన, గ్రామపంచాయితీలో, నిరక్షరాస్య పురుషులు, స్త్రీలను గుర్తించడం, వాలంటీర్లను, ప్రేరకులను ఎంపిక చేయడం.
 • సాక్షర భారత్‌ కార్యక్రమంలో పంచాయితీ లోక్‌ శిక్ష సమితి యొక్క బాధ్యత అతి ప్రధానమైనది.
 • ఒక నిర్దిష్ట కాలములో ఇట్టి సమితి అతి కీలకమైన బాధ్యతలు వహించినట్లయితే కార్యక్రమాలు విజయవంతమవుతాయి.

కమ్యూనిటీ మొబిలైజేషన్‌ (సమీకరణ) :

 • కార్యక్రమంకు అవసరమైన వ్యక్తులను గుర్తించాలి.
 • స్థానికముగా ఉన్నటువంటి వివిధ కళారంగాలకు చెందిన కళాకారులను గుర్తించాలి. వీరి సేవలను అవసరమయినపుడు వాడుకొనుటకు ప్రేరణ కల్పించాలి.
 • స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను గుర్తించి, వారి కార్యక్రమాల ద్వారా అభ్యాసకులను ఇట్టి కార్యక్రమములో పాల్గొనునట్లు చేయవచ్చును.
 • కుల/మత పెద్దలను సంప్రదించి వారి ద్వారా ఇట్టి కార్యక్రమము విజయవంతమునకు కృషి చేయాలి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను ఇట్టి కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
 • గ్రామ యువజన సంఘాలు, మహిళా మండలాలు మొ|| వాటిని కూడా భాగస్వాములను చేయాలి.
 • వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను వారి పార్టీలకు అతీతముగా కార్యక్రమములో పాల్గొనునట్లు చూడవలెను.
 • గ్రామములో ఉన్న ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు మరియు విశ్రాంతి ఉద్యోగులను గుర్తించి వారిని కూడా కార్యక్రమములో పాల్గొనునట్లుగా చూడవలయును.

గ్రామ కో-ఆర్డినేటర్ల గుర్తింపు :

 • గ్రామాభివృద్ధి, అక్షరాస్యత పట్ల ఆసక్తి, అనుభవం ఉన్నవారికి గ్రామాభివృద్ధి కో-ఆర్డినేటర్లుగా గుర్త్తించాలి.
 • ప్రభుత్వము వారిచ్చిన మార్గదర్శకత్వాల ప్రకారముగా గ్రామ కో-ఆర్డినేటర్లను ఎంపిక చేయవలయును.
 • ప్రభుత్వము వారిచ్చిన జాబ్‌ చార్టు ప్రకారముగా కో-ఆర్డినేటర్లు విధులు నిర్వహించాలి. కో-ఆర్డినేటర్ల పనితీరును గ్రామ లోక్‌ శిక్షా సమితి సమీక్షించాలి.

వివిధ అభివృద్ధి సంస్థలతో సమన్వయం :

 • గ్రామ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములతో పనిచేయుచున్న వివిధ శాఖలతో సమన్వయము ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
 • ప్రభుత్వ శాఖలు అమలు చేయుచున్న అభివృద్ధి పథకాల యొక్క లబ్ధిదారులందరూ కూడా గ్రామాలలోని నిరక్షరాస్యులే కావున అభివృద్ధి శాఖల అధికారులు కూడా ఇట్టి కార్యక్రమము కొరకు పని చేసినట్లయితే వారి ద్వారా అభ్యాసకులు మోటివేట్‌ అవుతారు. (వివిధ రకాల ఫించన్లు, ఇందిరమ్మ ఇండ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరా క్రాంతి పథకం, చౌక ధరల నిత్యావసరాలు పంపిణీ, దీపం పథకం మొ||)

సాక్షర భారత్ యొక్క ముఖ్యాంశాలు, ఇతర వివరాలు మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: భూమిక మరియు అపార్డ్

3.08
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు