హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పథకం

ఈ విభాగంలో జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పథకం గురించి వివరించబడినది

లక్ష్యాలు

NCLP పథకం కోరుకుంటుంది:

A. అన్ని రకాల బాల కార్మిక పద్ధతులను తొలగించడానికి

  • ప్రాజెక్ట్ ఏరియాలో బాల కార్మికుల గుర్తింపు మరియు దానినుంచి బాలలందరికీ విముక్తి
  • కాపాడిన పిల్లలకు వృత్తి శిక్షణతో పాటు ప్రధాన విద్యను అందించటం
  • పిల్లల ప్రయోజనాలు మరియు వారి కుటుంబాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు/ఏజన్సీల ద్వారా అందించిన సేవలును వారికి చేరేలా చేయటం

B. ప్రమాదకర వృత్తులు/ప్రక్రియల నుండి అందరు పిల్లలను బయటకు తెచ్చేందుకు మరియు వారి నైపున్యాన్ని పెంచటం ద్వారా తగిన వృత్తుల్లో చేర్చడానికి దోహదం చేసేందుకు

  • ప్రమాదకర వృత్తులు/ప్రక్రియలలోని అందరు బాల కార్మికుల గుర్తింపు మరియు ఉపసంహరణ
  • ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా ఇటువంటి బాలలకు వృత్తి శిక్షణ నైపుణ్యాలను మరియు సదుపాయాల కల్పన

C. 'బాల కార్మికులు' మరియు 'ప్రమాదకర వృత్తులు/ప్రక్రియల్లో బాల కార్మికుల ఉపాధి సమస్యలను గురించి భగస్వామ్యులకు పరిచయం. NCLPలు మరియు ఇతర కార్యకర్తలు మధ్య అవగాహన పెంచటం

D. బాల కార్మికుల పర్యవేక్షణ, ట్రాకింగ్ సిస్టమ్ మరియు రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించటం.

టార్గెట్ గ్రూప్

పథకం కింది వాటిపై దృష్టి పెడుతుంది:

1. లక్ష్యిత ప్రాంతంలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అందరు బాల కార్మికులు.

2. లక్ష్యిత ప్రాంతంలో ప్రమాదకర వృత్తులు/ప్రక్రియలలో పనిచేస్తున్న 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్మికులు.

3. గుర్తించిన లక్ష్య ప్రాంతంలో బల కార్మికుల కుటుంబాలు.

వ్యూహం

1. ప్రేరణ పొందిన పిల్లకు పాఠశాలల్లో చేరే పర్యావరణాన్ని సృష్టించడం మరియు పని చేయకుండా వివిధ చర్యలు మరియు ఇతర పథకాల ద్వారా వారిని పాఠశాలకు వెళ్లేలా చేయటం. వారి కుటుంబాల ఆదాయ స్థాయిలు మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయాలు కల్పించటం వంటివి లక్ష్యిత ప్రాంతంలో ప్రారంభించడం.

2. NCLPS రాష్ట్రం, జిల్లా పరిపాలన మరియు పౌర సమాజాలతో సన్నిహిత సమన్వయాన్ని అమలు పరుస్తుంది. బాల కార్మిక నిర్మూలన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. జిల్లా పరిపాలన, స్థానిక సంఘాలు, పౌర సమాజ సంస్థలు, NGO లు, విద్యావేత్తలు మరియు అమలు సంస్థల వంటి ఇతర వాటాదారులు ఇందులో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. పథకం అమలు ఏర్పాటు చేయటమే కాకుండా సమర్థవంత కార్యాచరణ, పర్యవేక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థీకరణకు కూడా ప్రయత్నించాలి.

ఫలితాల అంచనా

1. అన్నిరకాల బాల కార్మికుల గుర్తింపు మరియు నివారణ;

2. లక్ష్య ప్రాంతంలో ప్రమాదకర వృత్తులు మరియు ప్రక్రియల్లో కౌమారదశలోని వారి గుర్తింపు మరియు తీసివేయటం;

3. విడిపించిన బాల కార్మికులను సాధారణ పాఠశాలల్లో చదును కొనసాగించేలా చూడటం మరియు NCLPS ద్వారా పునరావాసం.

4. ప్రమాదకర వృత్తులు/ప్రక్రియల నుంటి బయటపడిన కౌమార దశ పిల్లలకు అవసరమైన చోట శిక్షణ మరియు చట్టబద్ధ వృత్తులలో పెట్టడం.

5. బాల కార్మికత యొక్క దుష్పలితాలను గురించి సామాజిక సమీకరణ కార్యక్రమం (లు)తో అవగాహన మరియు సమాచారాన్ని ప్రజా సంఘాలకు మరియు నిర్దిష్ట వర్గాలకు తెలియచేయటం.

6. సమస్య పరిష్కారానికి కృషిచేయడానికి NCLP సిబ్బంది మరియు ఇతర కార్యకర్తలకు శిక్షణ.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూలం: Ministry of కార్మిక & ఉద్యోగ మంత్రిత్వ శాఖ

2.93617021277
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు