অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

చట్టబద్ధమైన ఉత్తర్వు

ఈ చట్టంలో పొందుపరచబడిన కార్యనిర్వాహక కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్టంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంలో ప్రదర్శించాలి.
  • బాలలు తమ హక్కులను అనుభవించే ప్రక్రియలో ఆటంక పరచే అన్ని కారణాలను పరీక్షించడంలో ఉగ్రవాదం, సాంఘిక హింస, హింసాత్మక చర్యలు, కలహాలు,  ప్రకృతి వైపరీత్యాలకు, గృహ హింస, హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌, పిల్లల అక్రమ రహణా,  అవమానకరంగా ప్రవర్తించడం, అనుచితంగా చూడడం, క్రూరంగా ప్రవర్తించడం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించడం వ్యభిచార గృహాలకు చేరవేయడం వంటి వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించడం.
  • ఆందోళనకు లోనైన, దుఃఖాన్ని కల్గివున్న,  నిర్లక్ష్యానికి గురైన, కుటుంబ ఆసరాలేని, చెరసాలలో ఖైదుననుభవించే వారి పిల్లలకు సరియైన పరిష్కార సూచనలు ఇవ్వడం.
  • రక్షణ షరతులతో బాటు సంఘంలో అవగాహనను పెంచే రీతిలో సమాజంలోని అనేక రకాల విభాగాల వారికి బాలల హక్కుల గురించి తెలియజేసే జ్ఞానాన్ని కల్పించడం.
  • బాల నేరస్తుల గృహాలు, పిల్లల కొరకు వసతి కల్పించిన వసతి గృహాలు, సంస్ధలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో, ఏ ఇతర అధికారిక సంస్ద ఆధ్వర్యంలోను, సామాజిక సేవా సంస్ధల పరంగాను పనిచేస్తున్న వాటిని తనిఖీ చేయడం. చికిత్స, సంస్కరణ మరియు రక్షణ  నిమిత్తం చేర్చిన పిల్లలను చూసే తీరును గమనించడం.
  • బాలల హక్కులను భంగం కల్గించె అంశాలను విచారణ చేసి, స్వయంగా తమంతట తాముగా ప్రకటించి, ప్రారంభక ఉత్తర్వులను ఇవ్వడంలోః
    1. బాలల హక్కులను భంగం పర్చడం మరియు నష్టపరచడం.
    2. బాలల రక్షణ, అభివృద్ధికి సంబంధించిన చట్టాలను అమలు పరచక పోవడం .
    3. పిల్లల సంక్షేమానికి ఉపశమింపచేయడానికి గల విధి విధానాల నిర్ణయాలను, మార్గదర్శక
    4. సూత్రాలను సూచనలను పాటించక పోవడం లేదా,
    5. ఈ విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేయడం.
    6. బాలల హక్కులపై సూచనలు, సలహాలు, ఒప్పందాలను అధ్యయనం చేసి, అంతర్జాతీయ
    7. విధానాల ద్వారా నిర్ణీత కాలవ్యవధులలో సమీక్షిస్తూ ప్రస్తుత వి ధానాలను, కార్యక్రమాలను ఇతర
    8. కార్యకలాపాలను పటిష్టంగా అమలు పరచడంలో పిల్లలపై గల చక్కటి శ్రద్ధతో  సూచనలివ్వాలి.
    9. బాలల హక్కుల దృష్ట్యా ప్రస్తుతమున్న చట్టాలను విశ్లేషించి పాటింపు ఎంతవరకు ఉందో విచారణ
    10. చేసి, నివేదికలను పంపుతూ  విధానము, సాధన  పిల్లలపై ప్రభావితంగా జరుగుతుందో లేదో  చూసి
    11. నూతన శాసనాలను ప్రతిపాదించడం.
    12. పిల్లల అభిప్రాయల వెుర  తీవ్రంగా స్పందించి, ఆ రీతిలో ప్రభుత్వ శాఖలు, సంస్ధలు పని చేయడం.
    13. బాలల హక్కుల సమాచారాన్ని తయారు చెసి ప్రచారం చేయడం .
    14. పిల్లలు సమాచారాన్ని సంకలనం జేసి విశ్లేషణ చేయడం మరియు,
    15. పిల్లల గురించి పనిచేసే వ్యక్తుల సమూహాలకు, ఉపాధ్యాయ శిక్షణలోను, పాఠశాల విద్యా
    16. ప్రణాళికలోను,  పిల్లల హక్కుల విషయాన్ని చేర్చాలి.

పరిష్కార ఏర్పాటు - ఒప్పందం

కేంద్ర ప్రభుత్వం ద్వారా మూడేళ్ళపాటు పనిచేసే విధంగా కార్యనిర్వాహక సంఘ సభ్యులు క్రింది విధంగా ఉంటారు.

  • పిల్లల సంక్షేమాభివృద్ధికి ప్రధానంగా పనిచేసిన ప్రసిద్ధమైన నిష్ణాతుడైన వ్యక్తి అధ్యక్షులుగా ఉంటారు.
  • బాలలకు న్యాయాన్ని  కల్పించడం, నిర్లక్ష్యానికి  గురైన బాలలు మరియు ప్రత్యేక బాలల యెడల
  • శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను  రూపుమాపే దిశలో పనిచేసిన, బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన
  • చట్టాల గురించిన అవగాహన, సమగ్రత, సమర్ధత,  అనుభవము, నిపుణత, నైతికత గల్గి, విద్య, శిశు
  • ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, అభివృద్ధి  శాఖల నుండి సమర్ధతగల ఆర్గురు సభ్యులు ఉంటారు.
  • సంయుక్త కార్యదర్శి హోదాకు తక్కువగాని వ్యక్తి కార్యదర్శిగా ఉంటారు.

అధికారాలు

పౌర న్యాయ స్ధానానికి గల అన్ని అధికారాలు ఈ కమీషన్‌కు ఉంటాయి. వాటితో పాటు ప్రత్యేకంగా క్రింది అంశాలకు సంబందించిన అధికారాలు ఉంటాయి.

  • భారత దేశంలో ఎక్కడున్న వ్యక్తికైనా సమన్లు పంపి, వారిని  రప్పించి , ప్రమాణం చేయించి పరీక్షించడం
  • కావలసిన దస్తావెజులు తెలుసుకోవడం, దాఖలు చేయడం.
  • ప్రమాణ ప్రకటన (అఫిడవిట్‌ )  ద్వారా  సాక్ష్యాన్ని స్వీకరించడం.
  • ఏ న్యాయస్దానం లేదా  కార్యాలయం నుంచైన ప్రభుత్వ రికార్టు లేదా నకలు పొందడం.
  • దస్తావెజు సాక్ష్య పత్రాలను పరిశీలించడంలో కమీషన్లు జారీచేయడం.

పిర్యాదు యంత్రాంగం

కమీషన్‌ యొక్క ఉత్తర్వు ద్వారా బాలల హక్కులకు భంగం చేసే అన్ని పిర్యాదులను విచారణ జరపడం. బాలల  హక్కులకు ఆటంకం కల్గించే తీవ్ర వ్యవహారంలో స్వయం ప్రేరిత ప్రకటన ద్వారా విచారణార్హత కల్గిన అంశంలో బాలలు వారి హక్కులను పొందలేకపోవడానికి గల కారణాలను పరిశీలించడం.

  • కమీషనుకు పిర్యాదును రాజ్యాంగంలో గల 8వ  షెడ్యూలు ప్రకారం ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు.
  • ఇటువంటి పిర్యాదులపై ఎటువంటి  రుసుము వేయబడదు.
  • ఫిర్యాదుకి సంబంధించిన పూర్తి చిత్రణ అయ్యాక విషయాన్ని ప్రకటించవచ్చును.
  • ప్రమాణ ప్రకటన ద్వారా ఇంకను కావలసిన సమాచారాన్ని పొందవచ్చును.

పిర్యాదుచెసేముందుఇవితప్పనిసరిగాఉండేటట్లుచూడాలి.

  • పిర్యాదు సుస్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి అనామకంగా, నకిలీ పేర్లలొ అస్పష్టంగా ఉండరాదు.
  • ఇటువంటి పిర్యాదులపై ఎటువంటి  రుసుము వేయబడదు.
  • ఆస్తి హక్కులు, ఒప్పందపు బాధ్యతలు వంటి పౌర సంబంధిత వివాదాలను పిర్యాదు చెయకూడదు.
  • ఉద్యోగ విషయాలను సంబంధించిన అంశాలు అయి ఉండకూడదు.
  • చట్టం పరంగా ఏర్పరచబడిన  ఏదేని కోర్టులో / ట్రిబ్యునల్‌ లో పూర్తి కాని (పెండింగ్‌ ) విషయమై ఉండరాదు.
  • కమీషన ద్వారా ఇంతకు ముందు నిర్ణయించబడని విషయం.
  • ఏ ఇతర కారణాలవల్లనైన కమిషన్‌  పరిధిలోనికి రానిది.

సంప్రదించవలసిన వివరాలు

పేరు

హోదా

ఫోన్‌నంబరు

ఇ-మెయిల్‌

శ్రీమతి. శాంతాసిన్హా

అధ్యక్షురాలు

23731583 23731584

Shantha.sinha@nic.in

శ్రీమతి. సంధ్యా బజాజ్‌

సభ్యురాలు

23724021

Sandhya.bajaj@nic.in

శ్రీమతి. దీపాదీక్షిత్‌

సభ్యురాలు

23724022

Dixit.dipa@rediffmai.com

శ్రీ. వి.సి. తివారి

కార్యదర్శి

23724020

ms.ncper@nic.in

ఇ పి బి ఎక్స్‌

 

23724027

 

రైల్వే పరిసరాలలో పిల్లల హక్కుల పరిరక్షణ

జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రైల్వే ఫ్లాట్ ఫాంల పై నివసించే పిల్లల హక్కుల పరిరక్షణకై మార్గదర్శక సూత్రాలను రూపొందించటానికి వివిధ స్వచ్చంద సంస్థలతోనూ, పిల్లల హక్కులకై పోరాడే కార్యకర్తలతోను అనేకమార్లు  సమావేశాలు నిర్వహించడం జరిగింది. NCPCR సభ్యురాలైన సంధ్య బజాజ్ అధ్యక్షత వహించిన ఈసమావేశాలలో ఇటువంటి పిల్లలకు సంబంధించి; మత్తు పదార్థాల వాడకం, వీరిపై రైల్వే పోలీసుల భౌతికపరమైన అత్యాచారాలు, ఎటువంటి నీడ లేకపోవటం, నివాస సౌకర్యాల కొరత, గుర్తింపు లేకపోవటం, పునరావాసం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవటం మరియు HIV / AIDS లాంటి జబ్బుల బారినపడటం వంటి వివిధ సమస్యలపై చర్చించటం జరిగింది.

గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో జరిగిన ఈ సమావేశాలలో 25 స్వచ్చంద సేవాసంస్థలు
మరియుఫ్లాట్ ఫాంలపై ఉండే పిల్లలు కూడా పాల్గొనటం జరిగింది. ఈ సమావేశాలలో సాధి, అనుభవ్, ప్రాజెక్ట్ కన్.సర్న్ ఇంటర్నేషనల్ , ఢిల్లీ బ్రదర్ హుడ్ సొసైటి, చేతన, సలాం బాలక్ ట్రస్టు, యాక్షన్ ఎయిడ్, హ్యూమన్ రైట్స్-లా-నెట్ వర్క్, చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, మరియు చైల్డ్ రైట్స్ ఫోరం మొదలగు స్వచ్చంధ సేవాసంస్థలు పాల్గొన్నాయి.

ఈ సమావేశాలలో దిగువ ఇచ్చిన విధంగా, వివిధ సూచనలు ప్రతిపాదింపబడ్డాయి. ఈ సూచనలను
రైల్వే ఫ్లాట్ ఫామ్ పై నివసించే పిల్లల పరిరక్షణకై జరుపబోయే జాతీయ స్థాయి సమావేశంలో కూలంకషంగా చర్చించటం జరుగుతుందని బజాజ్ చెప్పారు. ఆ తరువాత తదనుగుణంగా రైల్వే అధికారులకు మార్గదర్శక సూత్రాలను జారీచేయటం జరుగుందని కూడా ఆవిడ తెలిపారు.

సూచనలు;

  • రైల్వే ఫ్లాట్ ఫామ్ ల వద్ద వైట్ ఫ్లూయిడ్ (తెల్లటి ద్రావకం) అమ్మకాన్ని నిషేదించటం. ఈ ద్రావకాన్ని పిల్లలు ఒక మత్తు పదార్ధంగా ఉపయోగించటం అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది.
  • రైల్వే ఫ్లాట్ ఫామ్ ల మీద పిల్లల హక్కులను పరిరక్షింటం అనేది రైల్వే అధికారులు తమ భాధ్యతగా అంగీకరించాలి.
  • భౌతికంగా, లైంగికంగా ఫ్లాట్ ఫామ్ ల పై అత్యాచారాలకు గురైన పిల్లలకోసం సత్వర వైద్యచికిత్సా  సౌకర్యాలు కలిగించాలి.
  • ఫ్లాట్ ఫామ్ ల పై నివసించే పిల్లలను వివిధ శ్రేణుల క్రింద విభజించాలి.
  • వృధాగా పడి ఉండే ప్లాస్టిక్ సామాన్లను ఏరివేసి, స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో
  • తోడ్పడుతున్న చెత్తను ఏరివేసే పిల్లల హక్కులను కూడా పరిరక్షించాలి.
  • ఫ్లాట్ ఫామ్ ల పై ఉండే పిల్లల కోసం పనిచేస్తున్న స్వచ్చంద సేవాసంస్థలకు రైల్వే పోలీసు దళాలు గుర్తింపు కార్డులను జారీచేయాలి.
  • దళాలు గుర్తింపు కార్డులను జారీచేయాలి.
  • ఈ పిల్లల హక్కులకి సంబంధించి, NCPCR రైల్వే పోలీసు దళాలకు తగిన ఆదేశాలు జారీచేయాలి.
  • రైల్వే ఫ్లాట్.ఫామ్ ల పై వదిలివేయబడిన, మరియు తప్పిపోయిన పిల్లలకు సంబంధించి కేంద్రీకృత ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలి.ఈ విషయానికి సంబంధించిన సంపూర్ణ వివరాలతో NCPCR ఒక కేంద్రీకృత సమాచార నిధిని నిర్వహించాలి.
  • అనాధలయిన, తప్పిపోయిన, మరియు అత్యాచారాలకు గురైన పిల్లల సమస్యలను వేగవంతంగా తత్కాలంలో - 10 నిమిషాలలో పరిష్కరించే యంత్రాగాన్ని ఏర్పాటుచేయాలి.
  • ఈ పిల్లల భవిష్యత్తు విషయమై NCPCR  ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనే విధంగా ఒక కట్టుదిట్టమయిన పర్యవేక్షణా వ్యస్థను ఏర్పాటు చేయాలి.
  • పునరావసం కల్పించబడిన పిల్లల కోసం నిర్మింపబడిన ఆవాసగృహాలు జైళ్ళలాగా ఉండకూడదు.
  • వాటిలో పరిశుభ్రత పాటించి పిల్లలను సరిగ్గా చూడాలి.
  • ప్రతి రైల్వేస్టేషన్ దగ్గరలో ఒక బాలల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
  • నిర్భంధ గృహాల పనితీరును పున: సమీక్షించాలి, సామాజిక తనిఖీలు నిర్వహించాలి.
  • పునరావాస కేంద్రాలు, రైల్వేఫ్లాట్ ఫామ్ ల పై తప్పిపోయిన, అనాధల మరియు అత్యాచారాలకు గురైన పిల్లల కోసం ఏర్పాటుచేసిన నిర్భంధ గృహాల సంక్షేమానికై పనిచేసే స్వచ్చంధ సేవాసంస్థల పనితీరును పర్యవేక్షించటానికి NCPCR నిర్ణీత సామాజిక తనిఖీ విధానాన్ని రూపొందించాలి.

బాలల హక్కుల చట్టం

హోదా - భావనలు

18 ఏళ్ళ లోపు వారందరూ బాలలె. పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావడం , అభివృద్ధి పరచడం తల్లిదండ్రుల ప్రాధమిక బాధ్యత. బాలల హక్కులను గౌరవించి, అమలుపర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది.

  • నా హక్కుల గురించి తెలుసుకోవడం నాహక్కు ( ప్రకరణం - 42)
  • బాల్యం నా హక్కు.  నేను ఎవరిని నేను ఎక్కడ నివసి స్తున్నాను, నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు,  నేనే భాష మాట్లాడతాను,  నాది ఏ మతం,  నేను  అబ్బాయినా/అమ్మాయినా, నాది ఏ సంస్కృతి,  నేను అంగవైకల్యంతో  ఉన్నానా,  నేను ధనవంతమా, పేదా  అనే నిమిత్తం లేకుండా నన్ను సరిగ్గా చూడాలి.  ఈ విషయాలు  తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత(ప్రకరణం 2).
  • నా అభిప్రాయాలను  స్వేచ్చగా వ్యక్తపరచడానికి నాకు హక్కు గలదు.  దీనిని తీవ్రంగా పరిగణించాలి మరియు ఇతరులు చెప్పేది  వినడం ప్రతి ఒక్కరి బాధ్యత ( ప్రకరణం 12,13)
  • పొరపాట్లు చేయడం నా హక్కు, పొరపాట్ల నుండే  నేర్చుకుంటామని ప్రతి ఒక్కరు  అంగికరించి, బాధ్యత  వహించాల్సిందే  . (ప్రకరణం 28 )
  • నా సామర్ధ్యాలను పెంచుకుంటూ పోవడం నాహక్కు. ఇతరులకు గల వైయుక్తిక భేదాలను గౌరవించడం అందరి బాధ్యత (ప్రకరణం 23).

అభివృద్ధి

  • నాణ్యమైన చదువుకు పొందడం నా హక్కు.  పిల్లలందరిని బడికి వెళ్ళేటట్లు ప్రోత్సహించడం అందరి బాధ్యత (ప్రకరణం 23, 28 , 29 )
  • మంచి ఆంరోగ్యపరి రక్షణ పొందడం  నా హక్కు మరియు  రక్షిత మంచి నీటిని,  ప్రాథమిక
  • ఆరోగ్య పరిరక్షణను ఇతరులు పొందడానికి సహయపడడం ప్ర తి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 24).
  • మంచి ఆహారాన్ని తీసుకోవడం నా హక్కు.  ప్రజలెవ్వరూ ఆకలి బాధకు గురికాకుండా చూడడం అందరి బాధ్యత (ప్రకరణం 24).
  • పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడం నా హక్కు. వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 29).
  • ఆడుకోవడం,  విశ్రాంతి తీసుకోవడం నా హక్కు (ప్రకరణం 31).

భధ్రత & రక్షణ

  • హాని, దుర్భాషలాడడం నుంచి రక్షణ పొందడం నా హక్కు.  ఇతరులను ప్రేమించడం, శ్రద్దను కల్గి  గౌరవించడం అందరి బాధ్యత (ప్రకరణం 19).
  • కుటుంబంతో క్షేమంగా , సౌకర్యంగా ఇంటి వాతావరణంలో ఉండడం నా హక్కు.  పిల్లలను
  • ఇంటిలో కుటుంబంతో కలసి మెలసి ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 9, 27 ).
  • నా వారసత్వం , సంస్కృతి, నమ్మకాలకు  గర్వించడం  నా హక్కు . ఇతరుల నమ్మకాలను, సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 29, 30 ).
  • హింసాత్మక చర్యలు, దండన (మాట ద్వారా, శారీరకంగా మానసికంగా)  లేకుండా బతకడం
  • నా హక్కు. ఇతరులను దండించకుండా,  హింసించకుండా  ఉండడం  ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం  2, 28, 37, 39) .
  • ఆర్థిక దోపిడి , లైంగిక వేధింపుల నుండి రక్షణ పొందడం నా హక్కు . బలవంతంగా  పిల్లలను పనిలో  చేర్చరాదు మరియు భద్రతా వాతావరణంలో స్వేచ్చగా ఉండేటట్లు చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకరణం 32, 34).
  • ఏరకమైన దోపిడికి గురికాకుండా రక్షణ పొందడం నా హక్కు.  ఏ ఇతర విధానాల ద్వౌరా కూడా దోపిడికి గురి కాకుండా చూడడం  ప్రతి ఒక్కరి బాధ్యత (ప్రకర ణం 36).

పిల్లలకు సంబంధించిన అన్నింటిలో పిల్లల ఇష్టాలను పరిశీలనలోకి తీసుకొనే ప్రాథమిక ప్రతిపాదన 1989వ సంలో బాలల హక్కుల గురించి జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో బాలల హక్కులకు ప్రముఖస్థానమివ్వబడింది. దీనిలో ప్రపంచవ్యాప్తంగాగల అన్నిబాలలహక్కులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై 1992వ సంలో భారతప్రభుత్వం సంతకం చేసింది.

బాలల హక్కుల ప్రధాన సంరక్షకులుగా పంచాయతీలు

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం , చిన్నసోలిపేట గ్రామ సర్పంచ్‌గా శ్రీ నరసింగరావు బాధ్యత చేపట్టినపుడు, ముందుగా ఆయన గమనించిన విషయం ఏమిటంటే, పాఠశాలలను కల్యాణ మంటపాలుగానో, ఏవైనా వేడుకలు జరపడానికో,ఇతర అనేక రకాల కార్యక్రమాలకో ఉపయోగిస్తున్నారుకాని, చదువుకు సంబంధించి మాత్రం అవి బొత్తిగా ఉపయోగపడడంలేదని.

నర్సింగరావు చేసిన మొదటి పని, ఆ పాఠశాలలను శుభ్రం చేయించి, మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యం కల్పించి, పాఠశాలలను పిల్లలచదువుకోసం తప్ప మరే పనికి ఉపయోగించకుండా కట్టుదిట్టం చేయడం. తర్వాత, గ్రామ యువత, పంచాయతీ ప్రతినిధులతో గ్రామ విద్యా సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రతి నెల ఆ విద్యా సంఘం సమావేశమై తమ ప్రాంతంలోని పిల్లల చదువు తీరుతెన్నులపై శ్రద్ధవహించే చర్యలు తీసుకున్నారు.

" పంచాయతీరాజ్ సంస్థలు.( పి ఆర్ ఐ లు)..బాలల హక్కులు " అనే అంశంపై , బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంస్థ (ఎన్ సి పి సి ఆర్), పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో, ఇలా కొన్ని పంచాయతీలు చేపట్టిన ఉత్తమమైన పద్ధతులను గురించి ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. నేడు పిల్లలకు ఎదురవుతున్న అసంఖ్యాకమైన సమస్యల దృష్ట్యా, బాలల హక్కులను పర్యవేక్షించడం, కాపాడడంలో పంచాయతీల పాత్ర ప్రాముఖ్యాన్ని ఈ సదస్సు ప్రధానంశంగా చేపట్టింది.

పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాజ్‌వంత్ సంధు, బాలలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతగురించి పేర్కొంటూ, భారతదేశంలోని గ్రామాలలో 30 కోట్లమంది పిల్లలు వున్నారని, అయితే అక్కడ వారికి ఆరోగ్య, విద్యా సౌకర్యాల కొరత దారుణంగా వున్నదని, నాణ్యమైన విద్యనేర్చుకోగలిగే అవకాశాలుకూడా పలువురికి లేవని, రోజుకు రెండుపూటలా తిండికూడా వారికి కరువేనని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇటీవల విడుదలచేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయన నివేదిక ప్రకారం, భారత దేశంలో 47 % పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనికూడా ఆమె పేర్కొన్నారు.

అయితే, పంచాయతీరాజ్ సంస్థలు బాలల హక్కుల పరిరక్షణకు నడుంబిగించిన ప్రతిచోట, విద్య, ఆరోగ్యం, బాలల అక్రమరవాణా నిరోధం వంటి అభివృద్ధి సూచికలు ఒక్కసారిగా మెరుగుపడిన వాస్తవాన్ని ఈ సదస్సు వెలుగులోకి తెచ్చింది. ఈ వాస్తవానికి గుర్తింపుగానా అన్నట్టు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ మణిశంకర్ అయ్యర్ , ఈ సదస్సులో చేసిన ప్రారంభోపన్యాసంలో, బాలల హక్కుల విషయంలో నిర్మాణాత్మకంగా ప్రతిస్పందించే విధంగా, ప్రభుత్వం పంచాయతీలకు సాధికారత కల్పించడం అవసరమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ సంస్థలు, ఎన్నికైన ప్రజా ప్రాతినిధ్య సంస్థలు, బాలల హక్కులను సంస్థాపరంగా చేపట్టడానికి వీలుగా, తగిన కార్యక్రమాలను, నిధులను, నిర్వాహక సిబ్బందిని పంచాయతీలకు తప్పనిసరిగా, అందుబాటులో వుంచాలనికూడా ఆయన ప్రతిపాదించారు.

బాలల హక్కులను స్థానిక పాలనలో భాగంగా చేయడంలో, ఎన్ సి పి సి ఆర్ సాధించిన ప్రగతిని, కమిషన్ కార్యక్రమాల తీరుతెన్నులపై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో, ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ అభినందించారు. ఎన్ సి పి సి ఆర్ కార్యక్రమాలకు తన తోడ్పాటును ప్రధానమంత్రి ప్రకటించారు.

బాలల హక్కుల పరిరక్షక పాత్ర విషయంలో, పంచాయతీ ఏ మేరకు ప్రభావం చూపగలదనేదానికి ప్రతీకగా, షాబాద్ మండల గ్రామ పంచాయతీ, ఆరోగ్య సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘం, అంగన్‌వాడీలను, బాలలలో పోషకాహార స్థాయిని , ఏ ఎన్ ఎం ల పనితీరును, టీకాల నిర్వహణను, అదనపు విటమిన్ మాత్రల పంపిణీని, ఇతర సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తుంది.

తమ పంచాయతీ, బాలల హక్కులను ఒక ప్రధానాంశంగా చేపట్టినందువల్ల, షాబాద్ మండలంలో బాలలు కార్మికులుగా మారుతున్న సంఘటన ప్రస్తుతం, ఒక్కటికూడాలేదని, శ్రీ రావు సగర్వంగా ప్రకటించారు.

మేఘాలయలో, పిల్లలు ఇళ్ళనుంచి తప్పిపోయిన సంఘటనలు 132 వున్నాయని, అయితే, పోలీసులకు కాని, కోర్టులకు కాని ఈ విషయం తెలియదని, అక్కడి పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, ఈ తప్పిపోవడాలనుగురించి, ఇప్పుడు, ఐక్యరాజ్య సమితి, మాదక ద్రవ్యాలు, నేర వ్యవహారాల, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పరిశోధిస్తున్నది.

బాలల హక్కుల విషయంలో చక్కని కృషి చేసినవిగా ఎన్ సి పి సి ఆర్ ప్రముఖంగా ప్రస్తావించిన, 600 గ్రామ పంచాయతీల ప్రతినిధులకు, రావు ఒక ప్రతీకగా పేర్కొనదగిన సభ్యుడు. బాలల హక్కుల గురించిన అవగాహన కలిగి, వారి సమస్యలపై స్పందించడానికి , బాలల హక్కులకు సంబంధించిన ప్రభుత్వ సంస్థల పనిని పర్యవేక్షించడానికి, తగిన వ్యవస్థను రూపొందింఛుకున్న ఈ 600 గ్రామ పంచాయతీలు, దేశంలోని ఇతర ప్రజా ప్రతినిధులకు ఈ విషయాలలో శిక్షణ ఇవ్వగలిగే వనరుల కేంద్రాలుగా పనిచేయగల శక్తిసామర్ధ్యాలను కలిగివున్నాయనికూడా, ఎన్ సి పి సి ఆర్ చైర్‌పర్సన్ పేర్కొనడం విశేషం.

బాలల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను సంస్థాపరంగా చేపట్టడంలో పి ఆర్ ఐ లకు సహకరించడానికి, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కృషిచేస్తున్నాయి. ఉదాహరణకు, బెంగుళూరుకు చెందిన బాలల హక్కుల సంస్థ (చైల్డ్ రైట్స్ ట్రస్ట్) , గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ తోడ్పాటుతో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహిస్తున్నది. " పిల్లలలో పోషకాహార లోపం, బాలలకు సంబంధించిన ఇతర అన్ని అంశాలతో సహా, గ్రామ పంచాయతీ చక్కగా వుండడానికి పూర్తి బాధ్యత పి ఆర్ ఐ లదేనని కర్ణాటక పంచాయతీల చట్టం నిర్దిష్టంగా పేర్కొంటున్నది. అంటే, బాలల సంక్షేమానికి బాధ్యత స్థానిక స్వపరిపాలన సంస్థలదేనని స్పష్టం చేయడమే కదా '' అని ఈ ట్రస్ట్‌కు చెందిన శ్రీ వాసుదేవ శర్మ వివరించారు.

పూనేకు చెందిన ఎస్ ఇ డి టి 350 పంచాయతీలలో పనిచేస్తున్నది. " గ్రామ పంచాయతీలు ఇప్పటికే , చట్టపరంగా నిర్వహించవలసిన పాత్రను నిర్దిష్టంగా పేర్కొంటూ, కొన్ని గ్రామ సంఘాలను ఏర్పాటుచేశాయి. అందువల్ల , బాలల హక్కుల కార్యక్రమాలను ఈ సంఘాల ద్వారా ప్రవేశపెట్టడం మాకు సులువైంది '' అని ఎస్ ఇ డి టి కి చెందిన సూర్యకాంత్ కులకర్ణి పేర్కొన్నారు.

ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బాలల హక్కులపై శిక్షణ సాధారణంగా, స్థానిక బాలలకు సంబంధించి, జననాల నమోదు, వివాహ సమయంలో వారి తలిదండ్రుల వయస్సులు, బడికివెళ్ళే పిల్లల సంఖ్య, బడిమానివేసిన పిల్లల సంఖ్య, టీకాలు, ఇతర ఆరోగ్య వివరాల వంటి గణాంకాలను సేకరించి, విశ్లేషించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించే విధంగా వారికి తగిన అవగాహనను పెంపొందించడంతో మొదలవుతుంది. పిల్లలు పాఠశాలలు సరిగా హాజరవుతున్నది లేనిది , పాఠశాలలలో ప్రాథమిక సౌకర్యాల అవసరం ఎప్పటికఫ్ఫుడు ఎలా పెరుగుతున్నది గమనిస్తుండడం, ఎన్ ఆర్ ఇ జి ఎ వంటి శ్రమతో కూడిన పనులకు సంబంధించిన పథకాలలో పిల్లలను నియోగించకుండా జాగ్రత్తపడడం , మధ్యాహ్న భోజనం వంటి పథకాలు, అంగన్‌వాడీలు పిల్లల ఆహార అవసరాలను తీర్చేవిధంగా శ్రద్ధ వహించడం వంటి విషయాలలో గ్రామ పంచాయతీలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించవచ్చు.

" నేను సర్పంచ్‌గా పదవీ స్వీకారం చేసిన సమయంలో, పిల్లలను సంరక్షిస్తానని ప్రమాణం చేశాను. మా ఊరి బాలల సంక్షేమంపైననే , మా ఊరి భవిష్యత్తు ఆధారపడి వుంది '' , అని మధ్యప్రదేశ్ లోని తికంఘర్ బ్లాక్, హీరానగర్ గ్రామ సర్పంచ్ మింత్రం యాదవ్ , ఈ సదస్సులో పేర్కొన్నట్టు, గ్రామీణ భారత దేశంలోని 30 కోట్లమంది పిల్లలకు వారి పంచాయతీలనుంచి లభించే సంరక్షణే వారి జీవితాలను మెరుగుపరిచే ఒక మహదవకాశం కావచ్చు.

పునరావాస పథకాలలో బాలల హక్కులకు స్థానం

ప్రాజెక్టులవల్ల ఉనికి కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించి, ఆ కుటుంబాలు తిరిగి స్థిరపడేలా దోహదం చేయడానికి ఉద్దేశించిన జాతీయ విధాన పత్రం-2003, జాతీయ పునరావాస విధాన పత్రం-2006 లలో , బాలల అవసరాలు, వారి హక్కులు చోటు చేసుకునేలా ఎన్ సి పి సి ఆర్ కొన్ని మార్పులను సూచించింది.

అభివృద్ధి కార్యక్రమాల కారణంగానో, విపత్తులు, సంఘర్షణల కారణంగానో ప్రజలను ఆ ప్రదేశాలనుంచి తరలించిన సందర్భాలలో, పిల్లల పరిస్థితి ఎలా వుందన్న విషయాన్ని సమీక్షిస్తే, అంత భారీ స్థాయిలో పిల్లల సౌకర్యాలకు ఏర్పడే కొరతను పునరావాస కార్యక్రమాలు చాలావరకు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కనిపించడంలేదని, ఎన్ సి పి సి ఆర్ అధ్యక్షురాలు శ్రీమతి శాంతా సిన్హా , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రఘువంశ్ ప్రసాద్ గారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

చాలా సందర్భాలలో ఆహార , వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక పిల్లలు ఆకలితో కడుపు మాడ్చుకోవలసి రావడం, పోషకాహార లోపంతో బాధపడడం జరుగుతున్నాయని ఆమె ఆ లేఖలో వివరించారు. అదే, బడికి వెళ్ళే పిల్లలయితే, వారిని బడులకు దూరం చేస్తున్నారు గాని, కొత్త ప్రదేశంలో వారిని తిరిగి పాఠశాలలలో చేర్పించడానికి, ఎలాంటి ఏర్పాటు చేయడంలేదని ఆమె పేర్కొన్నారు.

తిరిగి బడులలో చేరాలంటే-ముఖ్యంగా, వారి కుటుంబాలు పొరుగు రాష్ట్రాలలో పునరావాసం పొందినపుడు- వారికి సాధికారికమైన గుర్తింపు లేకపోవడం, అడ్మిషన్ తతంగాలు, అంతకు ముందు చదివిన పాఠశాలవారు ఇచ్చిన బదిలీ సర్టిఫికెట్‌ను ఒప్పుకోకపోవడం వంటి అనేక సమస్యలను ఈ పిల్లలు ఎదుర్కోవలసి వస్తున్నదని ఆమె ఆ లేఖలో ఏకరువు పెట్టారు.ఎందరో పిల్లలు, తమకు అయినవారందరిని కోల్పోయి ఎలాంటి ఆదరణకు, సంరక్షణకు నోచుకోవడం లేదని ఆమె వాపోయారు. పునరావాస వ్యవహారాలను బాలల కోణంనుంచి పరిశీలించవలసిన ఆవశ్యకతగురించి, పునరావాస వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఒక నివేదిక ద్వారా వివరించాలనికూడా కమిషన్ యోచిస్తున్నది. '' కుటుంబాల తరలింపువల్ల, పిల్లలకు పోషకాహారం, విద్య, ఆరోగ్యం, ఇతర సౌకర్యాల అందుబాటుకు విఘాతం కలుగుతుంది. అందువల్ల కుటుంబాల తరలింపు బాలల హక్కుల ఉల్లంఘనకు కూడా దారితీస్తుంది' అనే వాస్తవాన్ని, పునరావాస కల్పన జాతీయ విధాన పత్రం ఉపక్రమణిక ( ప్రి యాంబుల్)లో నిర్దిష్టంగా పేర్కొనాలనికూడా కమిషన్ కోరుతున్నది. కుటుంబాల తరలింపు అనేది పిల్లలకు సంబంధించిన అన్ని రకాల హక్కులపైన,అవకాశాలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదో మదింపు జరపాలని ; ఈ మదింపు వయస్సునుబట్టి, లైంగికతను(జండర్)బట్టి కూడా నిర్దిష్టంగా వుండాలనికూడా కమిషన్ ఆశిస్తున్నది.

పునరావాస కుటుంబాల బాలలలోకూడా, ఎస్ సి / ఎస్ టి కుటుంబాల పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వారికి ఎలాంటి అంతరాయం లేకుండా చదువుకొనసాగే వీలును విధానపత్రంలో పొందుపరచాలని కమిషన్ కోరుతున్నది. ఈ పిల్లలకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, ఐ సి డి ఎస్ లలో విధిగా చోటు కల్పించాలని, అదే విధంగా స్కాలర్ షిప్పులు, ఇతర అన్ని రకాల సౌకర్యాలను, హక్కులను వీరికి తప్పనిసరిగా వర్తింపజేయాలని కమిషన్ ప్రతిపాదిస్తున్నది. కుటుంబ ఆస్తులను అనుభవించే విషయంలో , కొడుకులతో సమానంగా వివాహంకాని కూతుళ్ళకుకూడా సర్వహక్కులు వుండాలని ; వీరికోసం పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, హాస్టళ్ళ నిర్మాణానికి తగినంత భూమిని సేకరించాలని కమిషన్ సిఫారసుచేస్తున్నది. ఈ వ్యవస్థలను నడపడానికి ఎంపికచేసే సిబ్బంది జాబితాను ప్రకటించాలనికూడా కమిషన్ ఆ లేఖలో పేర్కొన్నది.

జాతీయ పునరావాస విధానాన్ని (ఎన్ ఆర్ పి) పరిశీలించే విషయంలో , మహిళా శిశు సంక్షేమ శాఖ, సామాజిక న్యాయ శాఖ, కార్మిక శాఖ, మానవ వనరుల శాఖలకు చోటుకల్పించాలని కమిషన్ పేర్కొన్నది. తరలింపునకు గురయ్యే ప్రతి కుటుంబంలోని పిల్లల ఆరోగ్య పరిస్థితికి, పోషకాహార స్థాయికి, విద్యా స్థాయికి సంబంధించి, తప్పనిసరిగా సర్వే నిర్వహించి, జాబితా(వయస్సు, లైంగికత వారీగా) రూపొందించాలన్న కొత్త నిబంధనను ఎన్ ఆర్ పి లో చేర్చాలనికూడా కమిషన్ పట్టుపడుతున్నది. విద్యకు సంబంధించి, పాఠశాల చదువు, ముఖ్యంగా ఏ తరగతి చదువుతున్నది ఆ సర్వే వివరంగా పేర్కొనాలని, తద్వారా, ఆ పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా చదువుకొనసాగించే ఏర్పాటు తప్పనిసరిగా జరగాలని కమిషన్ పేర్కొంటున్నది.

పునరావాస ప్రణాళికలో, అవసరమైనన్ని పాఠశాలలు, హాస్టళ్ళు, ఐ సి డి సి కేంద్రాలు, బ్రిడ్జ్ స్కూల్స్ ఏర్పాటుచేయడానికి, వీటి నిర్వహణకు అవసరమయ్యే వనరుల కేటాయింపునకు పునరావాస వ్యవహారాల అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహించవలసి వుంటుందని కమిషన్ పేర్కొన్నది.

కుటుంబాల తరలింపునకు, పునరావాస కల్పనకు మధ్య వుండే వ్యవధిలో, పిల్లల ఆరోగ్యానికి, పోషకాహారానికి, చదువునకు సంబంధించిన హక్కులకు భంగంఏర్పడే పరిస్థితి తలెత్తితే, వారికి పాఠశాలలలో, ఐ సి డి సి కేంద్రాలలో తాత్కాలికంగా చోటు కల్పించాలని కమిషన్ స్పష్టంచేసింది. బాలల హక్కుల ఉల్లంఘన, వాటి నివారణకు తీసుకున్న చర్యలగురించి ఎన్ సి పి సి ఆర్ కు నిర్దిష్ట కాల వ్యవధిలో తప్పక తెలియజేయాలనికూడా కమిషన్ కోరింది.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మార్గదర్శకాలు

బాల కార్మిక (నిషేధ, క్రమబద్ధీకరణ) చట్టం-1986, 15 వృత్తులలో, 57 పనులలో (షెడ్యూల్- ఏ, బి విభాగాలు) బాల కార్మికత్వాన్ని నిషేధిస్తున్నది. ఈ నిబంధనను ఉల్లంఘించి, పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై కార్మిక శాఖ కేసులను నమోదు చేయాలి. పిల్లలను పనిలో పెట్టుకోవాలనుకునే యజమానులకు కఠినమైన హెచ్చరికలు జారీచేయాలి. దీనిని ఒక ఉద్యమంలా చేపట్టి, నమోదైన కేసులను ప్రాంతాలవారీగా, ప్రణాళికాబద్ధంగా, సంచార న్యాయస్థానాలద్వారా పరిష్కారమయ్యేలా చూడాలి
నిరాదరణకు గురైన, నేరాలకుపాల్పడిన బాలల సంక్షేమానికి (ఆదరణ, సంరక్షణ, అభివృద్ధి, పునరావాసం) ఉద్దేశించిన బాలల న్యాయ చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్...జె జె చట్టం) -2006 పరిధిలోకి, బాల కార్మికులు కూడా వస్తారు.
సెక్షన్ 2 (డి) (1ఎ) లో, " ఆదరణ చూపవలసిన, సంరక్షించవలసిన బాలలు '' అనే నిర్వచనంకింద, ' పనిచేసే పిల్లలు ' అనే ప్రస్తావన కూడా వుంది. జె జె చట్టం, సెక్షన్ 2 (కె) , '' బాలలు '' అంటే, 18 ఏళ్ళు నిండనివారు అని నిర్వచించింది. అందువల్ల, కేవలం 14 ఏళ్లలోపు బాలలను పనిలోపెట్టుకోవడాన్ని మాత్రమే నిషేధించే బాల కార్మిక చట్టంకంటె, 18 ఏళ్ళు నిండేవరకు పిల్లలందరికి, తగిన సంరక్షణను, ఆదరణను అందించే ఈ చట్టం మరింత విస్తృతంగా ప్రయోజనదాయకమైంది. మరో విధంగా చెప్పాలంటే, బాల కార్మిక చట్టంలో నిషేధింపబడని బాల కార్మికత్వం కూడా, జెజె చట్టం పరిధిలోకి వస్తుంది.
పిల్లలను పనిలోపెట్టుకునే యజమానులపై కేసులు పెట్టడానికి, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం (బాండెడ్ లేబర్ సిస్టం అబాలిషన్ యాక్ట్)-1976 ను ప్రయోగించాలి. ఎందుకంటె, యజమానులనుంచి తమతల్లిదండ్రులు ముందస్తుగా తీసుకున్న సొమ్ము (బయానా...అడ్వాన్స్) కు బదులుగానే, చాలామంది పిల్లలు పనిచేస్తున్నారని తేలింది. వీరుకూడా చాలావరకు, వలసవెళ్ళిన కార్మికులుగా పనిచేస్తున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే నిఘా సంఘాలను ( విజిలెన్స్ కమిటీలను) చైతన్యపరచాలి; రెవిన్యూ, కార్మిక శాఖలు చట్టాన్ని కచ్చితంగా అమలు జరపాలి. కేసులు నమోదుచేయడానికి వయస్సుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని, పిల్లల తలిదండ్రులకు ఎలాంటి బయానా (అడ్వాన్స్) చెల్లించలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ యజమానిపైనే వుంటుందని గమనించడం అవసరం.
ఇంతేకాకుండా, ఎవరైనా దళారీ (కాంట్రాక్టర్) ద్వారా పిల్లలను పనిలోపెట్టుకుంటే, ఆ యజమానిపై కాంట్రాక్ట్ లేబర్ (క్రమబద్ధీకరణ, నిషేధ) చట్టం కింద శిక్షించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఈ విధంగా పనిలోపెట్టుకోవడం చాలామంది చేసే పనే. తాము తప్పిదస్తులుగా కనిపించకుండా వుండాలనుకుని, చాలా కంపెనీలు ఇలా కాంట్రాక్టర్ల ద్వారా పనిలో పెట్టుకుంటాయి. అయితే, బాల కార్మికులను పెట్టుకునే కంపెనీలపైన, కాంట్రాక్టర్లపైన బినామీ నేరం (వికేరియస్ లయబిలిటి) కింద ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు.
వ్యవసాయం , దాని అనుబంధ రంగాలతో సహా, బాల కార్మికులుగా పనిచేస్తున్న ఎందరో పిల్లల విషయంలో, పైన పేర్కొన్న చట్టాలు వర్తిస్తాయి. వీరిని పనులలో నియోగించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వము లేదా, ఇతర సంస్థలు, వ్యక్తులు సందర్భాన్నిబట్టి ఈ చట్టాలను విడివిడిగానో, అన్నీ కలిపో ప్రయోగించవచ్చు. చట్టాన్ని కచ్చితంగా అమలుజరపడమే, యజమానులను వెనుకడుగువేయించే సాధనంగా ఉపయోగపడుతుందని గ్రహించాలి. మరో విషయమేమిటంటే, తక్కువ జీతంతో, ఎక్కువ సమయం పనిచేయించుకోవచ్చుననే పిల్లలను పనిలో పెట్టుకుంటారు. పిల్లలను పనిలోపెట్టుకోవడం వారికేదో మేలుచేయడానికి కాదు, యజమాని తన ఖర్చు తగ్గించుకోవడానికిమాత్రమే. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు, తమ సంస్థ సిబ్బంది ఎవరూ తమ ఇండ్లవద్ద ,లేదా కార్యాలయాలలో ఏవిధంగాకూడా పిల్లలను పనిలోపెట్టుకోకూడదని నిర్దేశిస్తూ, ఈ విషయంలో వారు పాటించవలసిన నియమావళిని రూపొందించి, సిబ్బందికందరికీ పంపిణీచేయాలి. పైన పేర్కొన్న అంశాలనన్నిటిని కార్యరూపంలోకి తేవడంకోసం, నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించవలసిందిగా, అన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్ సి పి సి ఆర్ ఆదేశించింది.

బాలికల సంక్షేమం

బాలికల సంక్షేమానికి, పురోగతికి ఉద్దేశించిన అనేక పథకాలను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలుజరుపుతున్నది. కొన్ని నిబంధనల మేరకు, బాలికల పేర నగదు బదిలీ చేసే " ధనలక్ష్మి '' పథకాన్ని ఏడు రాష్ట్రాలలోని 11 బ్లాక్స్‌లో 2008-09 నుంచి , ప్రయోగాత్మకంగా అమలుజరుపుతున్నారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి కృష్ణ తీర్థ, రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
ఈ పథకం వివరాలను మంత్రి తెలియజేస్తూ, ఆడ శిశువు పుట్టినట్టు నమోదు చేయించడం, టీకాలు వేయించడం, బడిలో చేర్పించడం , ఎనిమిదవ తరగతివరకు చదువు మాన్పించకుండా బడిలో కొనసాగించడం వంటి నియమాలను పాటించే బాలికల కుటుంబాలకు నగదు బదలాయింపు చేస్తారని; 18 వ ఏటి వరకు ఆ అమ్మాయికి పెళ్ళిచేయకపోతే బీమా సౌకర్యం లభిస్తుందని తెలియజేశారు. ఈ పథకంవల్ల 2008-09 లో 79, 555 మందికి ప్రయోజనం చేకూరినట్టు మంత్రి పేర్కొన్నారు.
కిశోరి శక్తి యోజన (కె ఎస్ వై) అనే మరో పథకాన్ని 6118 ఐ సి డి ఎస్ (సమీకృత శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులలో (11-18 సంవత్సరాల లోపు) తరుణ వయస్కులకు అమలుజరుపుతున్నారు. ఐ సి డి ఎస్ లలోని వనరులను ఉపయోగించుకుని, ఈ బాలికలలో ఆరోగ్యం , పోషకాహారం, అక్షరాస్యత, గణిత నైపుణ్యం, వృత్తులపరమైన నైపుణ్యం పెంపొందించి, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తారు.
తరుణ వయసు బాలికలకు పోషకాహారాన్ని అందించే ఎన్ పి ఏ జి కార్యక్రమాన్ని, దేశంలోని 51 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలుజరుపుతున్నారు. 11-19 ఏళ్ళ మధ్య వయస్కులైన, సరియైన పోషణలేని బాలికలకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల వంతున ఈ పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తారు.
2009-10 సంవత్సరానికి " ధనలక్ష్మి" పథకానికి 10.00కోట్లు రూపాయలు కేటాయించారు. కిశోరి శక్తి యోజన కింద 2009-10 సంవత్సరానికి, రాష్ట్రాలకు మొత్తం 71.30కోట్లు రూపాయల నిధులు కేటాయించారు. రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతానికి , ఒక్కొక్క ప్రాజెక్టుకు 1.1 లక్షల రూపాయల వంతున నిధులు విడుదలచేశారు. తరుణ వయసు బాలికలకు పోషకాహారాన్ని అందించే ఎన్ పి ఏ జి కార్యక్రమానికిగాను, 2009-10 సంవత్సరానికి మొత్తం 162.77 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఏఏ రాష్ట్రంలో ఎందరు లబ్ధిదారులుంటారనేదానినిబట్టి రాష్ట్రాలకు నిధులను కేటాయించారు.

టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొనే పిల్లలకు భద్రత

టి వి కార్యక్రమాలలోను, ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్)లోను పాల్గొనే పిల్లల గురించి వ్యక్తమవుతున్న ఆందోళనల విషయంలో పరిశీలించడానికి ఎన్ సి పి సి ఆర్ ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేసింది. మాజీ బాల నటుడు సచిన్ పిలగోంకర్, అడ్మాన్ ప్రహ్లాద్ కక్కర్ తో పాటు పత్రికా, టివి రంగానికి సంబంధించిన ప్రతినిధులు ఈ బృందంలో వున్నారు.

టి వి సీరియల్స్‌లో, రియాలిటి షోలలో, అడ్వర్టైజ్‌మెంట్స్ లో బాలల హక్కులు దారుణంగా ఉల్లంఘనకు గురవుతుండడాన్ని నియంత్రించాలని ఈ బృందం సభ్యులు చర్చించారు. వారి పని పరిస్థితులను క్రమబద్ధంచేయడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్ సి పి సి ఆర్ సభ్యురాలు సంధ్యా బజాజ్ ప్రతిపాదించారు. పిల్లలు పాల్గొనే అన్ని టి వి కార్యక్రమాలలో పిల్లలతో రోజుకు ఎన్ని గంటలకు మించి పనిచేయించకూడదో, సంవత్సరం మొత్తంలో ఎన్నిగంటలు మాత్రమే పనిచేయించవచ్చునో ఈ నియమావళిలో స్పష్టంగా పేర్కొంటారు.

టి వి కార్యక్రమాలలో పాల్గొనే పిల్లలు, వారి కుటుంబ సభ్యులు చేసే ఫిర్యాదులపై తగిన ఉపశమన చర్యలు గైకొనడానికి; బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే టి వి చానల్స్‌పైన, నిర్మాణ సంస్థలపైన తీసుకోవలసిన చర్యలను సూచించడానికి; బాలల హక్కుల పరిరక్షణ విషయంలో తల్లిదండ్రుల, కార్యక్రమ నిర్వాహకుల బాధ్యత ఏమిటో నిర్వచించడానికి, చదువుకోవడానికి ఉపయోగపడే బాండ్లు / సర్టిఫికేట్ల వంటి ఏ రూపంలో బాలలకు పారితోషికం చెల్లించాలో సూచించడానికి, ఇంతేకాకుండా మొత్తం నియమావళిని సమీక్షించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ కార్యాచరణ బృందం , తదనంతర చర్యలపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతారు.

బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనలో న్యాయశాఖ

బాల సదనాలను బాలలకు అత్యంత శ్రేయస్కరంగా మార్చడం

నేడు మన దేశంలోని ఎక్కువ బాలసదనాలు బాలల సంరక్షణ మరియు తీసుకోవలసిన ప్రామాణిక జాగ్రత్తలను పాటించడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఏమైనా, సరైన జోక్యం వలన బాలసదనాలలోని బాలలు మరియు సిబ్బంది జీవనంలో మార్పులు తేవచ్చునని జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికి దగ్గరలో గల హతీయాలో ప్రత్యక్షంగా నిరూపిం చబడింది. ఇక్కदीदीడి స్త్రీ పరివీక్ష సదనం తప్పిపోయిన బాలికలకు, శారీరకంగా, మానసికంగా హింసించబడిన యువతులకు, చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న బాలికలకు మరియు ప్రేమికునితో పారిపోయి వచ్చిన మైనర్ బాలికలకు నెలవుగా మారింది.

ఈ సదనం 1981 నుండి ఒక కారాగారమునకు అనుబంధమైనది కాగా, దీనిలో వుంచబడిన వారికి జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా అందించబడలేదు. వీరిలో చాలామంది బాలికలు ఈ గదులలోనే యువతులుగా ఎదుగుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా మంది పిల్లలు చేరి దయనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు.

అయితే, న్యాయశాఖ జోక్యం మరియు స్వచ్ఛంద కార్యకర్తల కృషి వలన ఆరు నెలల కాలంలోనే నాటకీయంగా ఈ సదనంలోని వారి జీవనంలొ ఎంతో అభివృద్ధి జరిగింది. దీనికై కృషి చేసిన వారికి ధన్యవాదాలు. కనీస ప్రమాణాలు అమలుపరచడం ద్వారా 60 మంది ఆదరణకు నోచుకోని వ్యక్తులు, వారిపట్ల శ్రద్ద చూపడం వల్ల వారు చిరునవ్వులు చిందించే బృందముగా మారారు.

2005 వ సంవత్సరంలో, ఒక స్వచ్చంద సంస్ధ జోక్యంతో ఈ సదనంలో మౌలిక సదుపాయాలు శూన్యమని కనుగొనడంతో ఈ మార్పు సంభవించింది. గాలి, వెలుతురు సరిగా రాని జైలు గదులవంటి వాటిలో ఎక్కవ సమయం బాలికలను తాళంవేసి లోపలే వుంచేవారు. నీటి సరఫరా ఏర్పాటు సక్రమంగా ఉండేది కాదు. . ఆహారం కూడా నాసి రకంగా ఉండి చాలీ చాలకుండా ఉండేది. అలాగే విద్యాభ్యాసానికి ఎటువంటి సదుపాయాలు లేవు మరియు వృత్తి విద్య శిక్షణ లేదు.సదనంలోని వారిని వారివారి కుటుంబాలకు తిరిగి చేర్చే ప్రయత్నాలు జరుగలేదు. తగిన ఆరోగ్య సంరక్షణ కూడా ఉండేది కాదు.  మరియు భిన్నమైన సామర్ధ్యము కల్గిన వారి  (వికలాంగులు) పైన ఏమీ శ్రద్ధ చూపలేదు.

సదనంలో పనిచేస్తున్న సిబ్బందికి బాల నేరస్తుల న్యాయచట్టం పైన, చట్టనిబంధనల పైన అవగాహన లేదు. ఆ  ప్రకారము బాలల పట్ల జాగ్రత్త వహించడానికి ప్రణాళిక లేదు. అంతేకాక ఆ సిబ్బందికి సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని కనుగొన్నారు. వారు సదనంలోని బాలలకు కేవలం కనీస సౌకర్యాలు మాత్రమే అందించగలిగారు. ఈ పరిస్ధితులన్నింటిని జార్ఖండ్ హైకోర్ట్ దృష్టిలోకి తేవడంతో ఈ వ్యవస్ద యొక్క నియమ నిబంధనలను అమలుపరుచడంలో వ్యవస్ధ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. న్యాయ యంత్రాంగం సహయంతో జార్ఖ్ండ్ లోని బాల సదనాలలోని పరిస్ధితులను అభివృద్ధి పరచడంపై సమావేశాలను నిర్వహించారు.   ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకొని ఆయనకు బాలల యొక్క అవసరాలపై అవగాహన కల్పించారు.

హతియా  సదనంలోని పిల్లలను రాంచి నగర పరిధిలోని నమ్ కామ్ మహిళా వసతి గృహన్ని పునర్నిర్మించి అక్కడికి మార్చారు.  న్యాయ యంత్రాంగం మరియు  స్వచ్చంద కార్యకర్తలు వసతి గృహంలో కనీస ప్రమాణాలను అమలుపరిచేలా పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు, జిల్లా న్యాయ యంత్రాంగం మరియు హైకోర్టు సహకారంతో ఎంతో మంది పిల్లలను వారి తల్లి తండ్రుల వద్దకు చేర్చగలిగారు.   నియత విద్యాబోధన ప్రారంభించి బాలలను పాఠశాల విద్యాబోధనలోకి తెచ్చే ముందు అవసరమైన బ్రిడ్జ్ కోర్స్ లలో చేర్పిస్తున్నారు. దీపశిఖ అనే స్వచ్చంద సంస్ధ నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక పాఠశాలలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేరుస్తున్నారు.  వారికి వైద్య భద్రత కల్పించడమే కాక వృత్తి నైపుణ్యాలను క్రమబద్దతతో నేర్పిస్తున్నారు.  ప్రస్తుతం ఆ సదనాన్ని నమ్ కామ్ మహిళా రక్షణ సదనం అని పిలుస్తున్నారు.  ఇక్కడవున్న పిల్లలు కేవలం వుండడమనేదేకాకజీవిస్తున్నారు.

గతంలో మరల మరల ప్రోత్సాహం, పర్యవేక్షణ అవసరమైన సిబ్బందికి ఇప్పుడు ఉన్నత స్ధాయి మద్దతు లభించడంతో బాల సదనాల సిబ్బంది ఆదరణ చూపే బృందంగా తమను  తామే మలచుకొన్నారు. జార్ఖండ్ న్యాయ సేవల సంస్ధ న్యాయ సహాయం అందించడంలో విశేష కృషి చేసింది. అంతేగాక  చట్టపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల విషయాలపై దర్యాప్తు నిర్వహించి వాటిని బాలల కోర్టుల ద్వారా పరిష్కరిస్తోంది.

అధికారులు మరియు న్యాయ యంత్రాంగం, స్ధానిక ప్రజలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎలా కృషి చేయగలరో ఈ హతీయా ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

శరీర సంభంధమైన శిక్షను నిషేధించుట

శరీర సంభంధమైన శిక్షను నిషేధించుట

వ్రేలి కణుపుల మీద తట్టుట , బడి ఆవరణలో పరిగెత్తడం , మోకాలి మీద కూర్చోబెట్టడం, గంటల తరబడి నిలబెట్టడం , బెత్తంతో కొట్టడం , గిచ్చడం , దవడమీద కొట్టడం, ఇవ్వన్నియు చాలాకాలం నుండి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆమోదించిన పద్దతులుగా ఉపాధ్యాయులు చూస్తున్నారు.

కాని  ఈ రకమైన  క్రమశిక్షణను అంగీకరించవచ్చునా? లేదు, కొత్తగా నియమించబడిన పిల్లల హక్కులని కాపాడే జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్ సి పి సి ఆర్)  ఒప్పుకోదు. పిల్లలపై శారీరక సంబంధమైన శిక్షలు నిషేధించే సుప్రీమ్ కోర్టు 2000 తీర్పుకు అనుగుణంగా, పిల్లలకు సరైన స్వాతంత్ర్యమైన, మర్యాద పూర్వకమైన వాతావరణంలో , భయానికి దూరంగా విద్యను అందెలా చేయాలని రాష్ర్టాన్ని ఆదేశించింది.

కానీ క్రమశిక్షణ అనే ముసుగు లో పిల్లల హక్కులు నిరంతరంగా భంగపరచబడు చున్నవి. రాజస్థాన్ లో ఒక విద్యార్థి, అతని టీచరు చేత దెబ్బలు తిన్న రెండు రోజుల తర్వాత మరణించాడు. ఆంధ్ర ప్రదేశ్ లో హెడ్ మాష్టర్ సహాయంతో ఒక టీచరు పిల్లల్ని విద్యుత్ షాక్ కు గురిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవ్వన్నియు ప్రత్యేకమైన అంశములు కావని హింసా సంస్కృతి వల్ల పిల్లల పట్ల మరియు వారి హక్కుల పట్ల కనబడే నిర్లక్ష్య ప్రవర్తన  
అని కమిషన్ భావిస్తుంది.

ఈ సమస్యను రూపుమాపుటకు త్వరితగతిన  చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తించి , యన్ సి పి సి ఆర్  అన్ని  రాష్ర్టాల  ముఖ్య సెక్రెట్రీలకు ఆయా విద్యా విభాగాలలో పిల్లల మీద దౌర్జన్యము జరగకుండా ఉండుటకు గాను ఏ చర్యలు అవసరమో , అవన్నీ తయారుచేయమని ప్రేరేపించింది.

అన్ని రకములైన శారీరక శిక్షలు మానవ హక్కులకు ప్రాధమిక భంగము కలిగించేవి. ఒక చెంప దెబ్బ/అరచేతి దెబ్బ కూడా ఒక విచారింపదగిన పెద్దగాయం వలె పిల్లల హక్కులకు బాధాకరమైనది. నిజానికి దీనికి తారతమ్యములు లేవు ఎందుకంటే, ఇటువంటి చిన్న చర్యలని క్షమించడం వలన పెద్ద ఉల్లంఘన లకు దారి తీయడం చూడవచ్చు. ఇది చట్టపరంగా కూడా అనుమతిచబడదు.

భయంచేత, పిల్లలు తరచుగా మౌనం వహించి, తిరిగి ప్రశ్నించకుండా హింసకు గురౌతారు. కొన్నిసార్లు వారి ప్రవర్తనలో తీవ్ర నిస్పృహ కనబడుతుంది కానీ అది గమనించబడదు. ఇలా జరగడం వలన మరలా హింసకు గురౌతారు. కాని ప్రతి స్కూలులో వారి వివరములు లేకుండా ఫిర్యాదులను వేసే పెట్టె ఒకటి ఉన్నట్లైతే, ఈ సమస్యను ఆపవచ్చు. స్కూళ్ళలో ఫిర్యాదుల పెట్టె ఏర్పరుచటయే ముఖ్యమని కమీషన్ సిఫార్సు చేసినది.

వ్రేలి కణుపుల మీద తట్టడం , బడి ఆవరణంలో పరిగెత్తించడం , మోకాలి మీద కూర్చోబెట్టడం , గంటల తరబడి నిలబెట్టడం, గోడ కుర్చీవేయడం , బెత్తంతో కొట్టడం, గిచ్చడం మరియు అఱచేతిదెబ్బలు తినడం వంటివి కమీషను శారీరక శిక్షల కింద చేర్చింది. తరగతి గదులలో పిల్లల్ని ఒంటరిగా బంధించడం, విద్యుత్ షాక్ కు గురిచేయడం వంటి చిత్రహింస కోవలోకి వచ్చును. బాల లైంగిక వేధింపు , అవమానించడం, చిన్నపుచ్చడం , మానసిక  , శారీరక గాయములు మొదలైనవి కమీషన్ ద్వారా ఖండించబడినవి. శిక్ష నుండి పిల్లల్ని కాపాడే బాధ్యత టీచర్లు మరియు స్కూల్ యాజమాన్యం వహించాలని కమీషన్ నిర్దేశించింది. కమీషన్ విద్యా విభాగాలను ఈ క్రింది విధంగా ఆజ్ఞాపిస్తుంది.

  • శారీరకంగా  శిక్షించే చర్యకు  వ్యతిరేకంగా మాట్లాడే మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే హక్కు పిల్లలకు కలదని వారికి ప్రచారాల ద్వారా తెలియజెప్పుట.
  • పిల్లలు వారి భావాలను వ్యక్తపరిచేరీతిగా స్కూల్స్ లో, హస్టల్స్ లో, బాలరక్షక గృహాలలో , వసతి గృహాలలో ఒక వేదిక నియమించవలెను.
  • అన్ని స్కూళ్ళ ల్లో ఒక ఫిర్యాదుల పెట్టె.
  • పిటీఏ (పేరెంట్ టీచర్ అసోసియేషన్ ) స్కూల్ ఎడ్యుకేషనల్ కమిటి, మరియు (గ్రామ విద్యా కమిటీలు ప్రతినెల వచ్చిన ఫిర్యాదులు వాటికి తగిన చర్యలు తీసుకోబడ్డాయా లేదా అని చూచుటకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయవలెను.
  • పిటిఎ లను, పిల్లల ఫిర్యాదులకు అనుగుణంగా , హాని జరగకముందే చర్య తీసుకునేటట్టు ఉత్సాహపరచవలెను.
  • స్కూల్ లోని పిల్లల పాత్రకు ఎటువంటి లోటు జరిగే భయం లేకుండా పిల్లలు మరియు పెద్దలు శారీరక శిక్షకు వ్యతిరేకంగా మాట్లాడుటకు ఉత్సాహపరచవలెను.
  • గ్రామ , జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో విద్యావిభాగాలు పిల్లలు ఇచ్చిన ఫిర్యాదులకు స్పందన మరియు తీసుకున్న చర్యలను పర్యవేక్షించుటకు కొత్త పద్ధతులను నియమించ వలెను. ఈ చర్యలని అవలంబింస్తే స్కూలుకు వెళ్ళడం ఒక సంతోషదాయకమైన అనుభూతిలా ఉంటుంది.ఇలా జరగాలంటే అధ్యాపకులు బెత్తాన్ని మరియు విద్యార్థిని వదలిపెట్టవలెను.

ప్రతి బాలిక/ బాలుడు తన హక్కులు నిర్భయంగా ఆనందించేలా సంరక్షింపబడును

సంస్థలని కాపాడటం కాకుండా పిల్లల్ని కాపాడవలసిన అవసరం చాలా ఉందని ఎన్నో సిఫార్సులు నొక్కి వక్కాణించి చెప్పాయి. కాని దానికొరకు తల్లిదండ్రులు, టీచర్లు మరియు స్కూల్ యాజమాన్యం వారి మధ్య గొప్ప అవగాహన ఉండాలి. ప్రతి బాలిక/ బాలుడు తమ హక్కులు నిర్భయంగా ఆనందించేలా సంరక్షింపబడేలా స్కూల్ యాజమాన్యం చేయాలి.

సిఫార్సులు

  • స్కూల్ /హాస్టల్/బాల గృహాలు వంటి సంస్థలలో నమోదైన పిల్లల సంక్షేమ భాధ్యత వారే వహించాలి.పోలీస్ స్టేషన్/ జైలులోని ఉన్న వ్యక్తుల గురించి పోలీసుల ఏ విధంగా బాధ్యత వహిస్తారో, అదే విధంగా గాయము/రుగ్మత/దాడిచేయుట/మరణం వంటి విషయములపై ఆ సంస్థే మొత్తం బాధ్యత వహించాలి.
  • సంస్థలో సంభవించు మరణం/గాయము మరియు ఏదైనా సంఘటన వల్ల హాస్పిటల్ లో చేర్పించిన యెడల , సంస్థ యాజమాన్యం నష్టపరిహరం చెల్లించవలెను.
  • పిల్లలకు వ్యతిరేకంగా జరుగు ప్రతి హింసాత్మక చర్యకు, దానికి సంబంధించిన విద్యావిభాగం,    బోర్డు సమాంతరంగా విచారణ జరిపించవలెను. ఇటువంటి దర్యాప్తులో పిటిఎ పాలుపంచు కోవలెను.
  • బాల్య లైంగిక దురాచార విషయమై , తల్లి/తండ్రి  గాని కేసు వాపసు తీసుకున్న యెడల , బాలిక/    బాలునికి ఎటువంటి హాని  జరగకుండా,దోషిపై కఠిన చర్య తీసుకునేటట్టు ప్రభుత్వం న్యాయబద్ధ మైన విచారణ జరిపించవలెను.
  • బాలుడు/బాలిక గాని విచక్షణ పరంగా ఫిర్యాదు చేసినచో , యస్ సి/యస్ టి (పిఓఎ) యాక్ట్ కింద కేసు నమోదు చేయవలెను.
  • శారీరక శిక్షల విషయమై, విద్యావిభాగం/బోర్డు శారీరక శిక్షలమీద పిల్లల చేత ఒక సోషల్ ఆడిట్ నిర్వహించాలి.
  • పిల్లల సంక్షేమాన్ని కాపాడుట కొరకు , ప్రతి జిల్లాలోని పిల్లల సంక్షేమ కమిటీలను బలపరచి మరియు సహాయం చేయాలి. పిల్లల మరణం ( లేక యత్నం ) ఆత్మహత్య మరియు హస్పిటల్ లో చేర్చు విషయమై :
  • ఆత్మహత్య విషయమై ఆత్మహత్యకు ప్రేరణ గా పరిగణింపబడును మరియు సంస్థ యొక్క యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి.
  • పిల్లవాడు అధికముగా బాధింపబడును కాబట్టి బాలుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే, అది చట్టపరంగా ఆత్మహత్యా ప్రయత్నంగా నమోదు చేయబడదని గుర్తించాలి.
  • ఆత్మహత్య/లైంగిక వేధింపు/హాస్పిటల్ లో చేర్చడం వంటివి టీచర్ల చర్యల వల్ల జరిగినట్లైతే , వారిని, విచారణ పూర్తికాకుండానే సస్పెండ్ చేయబడును.
  • పిల్లవాడు అనుమానస్పదగాయం/రుగ్మతతో హాస్పటల్ లో చేరిన యెడల , ఆ హాస్పటల్ ఒక మెడికో - లీగల్ కేసును నమోదు చేసి మరియు పిల్లవాని స్టేట్ మెంట్ ని తీసుకోవలెను.
  • ఏదైన హాస్టల్ లో పిల్లవాడు రుగ్మతకు గురైన యెడల పిల్లవాడిని హాస్పటల్ కు ఎలా తీసుకు వెళ్ళలో (బడ్జెట్ లోఉంచాలి), తల్లిదండ్రులు స్కూలుకు వెళ్ళి పిల్లవాడిని తీస్కురావటానికి సరైన సహాయం లభిస్తుందా అనే మొదలైన అనుసరించే ప్రవర్తనా నియమావళిని విద్యావిభాగం లేక యస్ డబ్ల్యు జెడి తయారుచేయాలి.

ప్రైవేటుసంస్థలు

  • ప్రైవేటు పిల్లల సంక్షేమ/విద్యా సంస్థలకు లైసెన్సింగ్ విధానాలను సమీక్షించుటకు మరియు ఈ ప్రైవేటు సంస్థల క్రమబద్దీకరణ విధానాలను స్థాపించడానికి మరియు ఈ ప్రైవేటు సంస్థలను పర్యవేక్షించుటకొరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరచవలెను.

ఆధారము:
జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను
5వ అంతస్ధుః చంద్రలోక బిల్డింగ్‌ ,
36, జనపథ్‌,
న్యూఢిల్లీ - 110001
ఇండియా

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate