অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తెలంగాణా మైనారిటీస్ రెసిడెంషియల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ సొసైటీ (టి. ఎం.ఆర్ ఇ.ఐ.ఎస్)

తెలంగాణా మైనారిటీస్ రెసిడెంషియల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ సొసైటీ (టి. ఎం.ఆర్ ఇ.ఐ.ఎస్)

తెలంగాణా మైనారిటీస్ రెసిడెంషియల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ సొసైటీ (టి. ఎం.ఆర్ ఇ.ఐ.ఎస్),హైదరాబాద్ అల్పసంఖ్యాక బాలబాలికలకు గురుకుల పాఠ శాలలను నెలకొలిపి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించుటకై ఏర్పరిచిన స్వయంప్రపత్తిగల ప్రత్యేక సంస్థ టి. ఎం.ఆర్ ఇ.ఐ.ఎస్ రాస్ట్రం లోని ప్రతి ఎసెంబ్లీ నియోజకవర్గములో ఒకటి చొప్పున పాఠశాలలు ఉండాలని ఆశించబడినది.. ఆవిధంగా రాష్ట్రం లో 120 పాఠశాలలను నెలకొల్పటం జరుగుతుంది. విద్యాసంవత్సరము 2016-17 లో మొదటివిడతగా 71 గురుకుల పాఠశాలలు (బాలురకొరకు39, బాలికలకొరకు32 ) నెలకొల్పబడతాయి. మిగిలిన పాఠశాలలను రెండవ విడతలో నె;లకొల్పటం జరుగుతుంది.

ఆశయము

కేవలం తెలంగాణా రాష్ట్ర ములో అత్యంత వెనుకుబాటుతనంతో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలబాలికలు ప్రభుత్వములో మరియు పబ్లిక్ రంగ సంస్తలలో మరియు ప్రైవేటు రంగంలో ఉద్యోగ ఊపాధి పొందెందుకు వీలయ్యే విధముగా వారు వ్రుత్తిపరమైన కోర్సులలో చేరెందుకు గాను వారికిఉచితముగా నాణ్యమైన విద్యను అందించటమే కాకుండా , ఇతర సామాజిక వర్గాలకు సమానముగా విద్యారంగములో వారికి ఉత్తమ అవకాశాలను కల్పించాలన్నది ఈ సొసైటీ యొక్క ఆశయం.

  • నేటి సమాజ అవసరానికి తగినట్లుగా శిక్షణను అందించి అన్ని పోటీ పరీక్షలలో అల్ప సంఖ్యాక బాల బాలికలు పాల్గొని వాటిని ఎదుర్కొనుటకు తగినరీతిలో ఉత్తమమైన విద్యను అందించుట.
  • ఈ గురుకులపాఠ శాలలో చేరినప్రతి విద్యార్ధి పట్ల ప్రత్యేక శ్రధ్ధ చూపి వారివారి కుటుంబాలలొ, భారీ స్తాయిలో భౌతిక, మానసిక, మరియు సామాజిక పురోగతి సాధించుట .
  • 5నుండి 10 వ తరగతి విద్యార్ధులు మరియు 11 మరియు 12 తరగతుల విద్యార్ధుల ప్రత్యేకఅవసరాలను ద్రుష్టిలోపెట్టుకొని విద్యాబోధన చేయుట.
  • దీనిలోని సిబ్బందికి చక్కటి సదుపాయాలు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా ఎప్పటికప్పుడు సమీక్షించి తగినవిధం గా ఆదునీకరణచేయు విషయమై నిర్ణయాలు తీసుకొని అవసరమైన వార్షిక ఖర్చులు భరించుట.
  • విద్యార్ధి జీవితం లో విద్య, భౌతిక , పర్యావరణ విలువలు మరియు సాంస్క్రుతిక అవసరాలను తీర్చ గలిగే మౌళిక వసతుల నిర్మాణమునకు సహకరించుట .

ప్రతిపాందించిన పాఠశాలల వివరములు

హైదరాబాద్:

బహదూర్ పూర్, ఆసిఫ్నగర్, సైదాబాద్, సికింద్రా బాద్  కంటోన్మెంట్ –బాలురకు(4)

బహదూర్ పూర్,చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ –బాలికలకు(4)
రంగారెడ్డి: బాలానగర్, కుత్బుల్లాపూర్ ,శేరిలింగంపల్లి ,వికారాబాద్, పరిగి –బాలురకు(5)
రాజేన్ద్రనగర్,మాల్కాజిగిరి, ఉప్పల్,తాండూర్ – బాలికలకు(4)
నిజామాబాద్: ఆర్మూర్ ,ఎల్లారెడ్డీ , కోటగిరి – బాలురకు(3)
నిజామాబాద్,బోధన్, బాంస్ వాడ – బాలికలకు(3)
మెదక్: సిద్దిపేట, సదాశివపేట ,పటాంచెరువు, ఆందోల్, నర్సాపూర్, దుబ్బాక- బాలురకు(6)
సంగారెడ్డి,గజ్వేల్,అల్గోల్, మెదక్, నారాయణ్ ఖేడ్,- బాలికలకు(5)
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్,జడ్చర్ల, నారాయణ్ పేట్ , అచ్చం పేట, దేవరకద్ర – బాలురకు(5)
గద్వాల్,షాద్ నగర్, కల్వకుర్తి- బాలికలకు(3)
అదిలాబాద్: అదిలాబాద్,భైంసా, కాగజ్ నగర్, ఖానాపూర్ – బాలురకు(4)
అదిలాబాద్, నిర్మల్,మంచిర్యాల- బాలికలకు(3)
కరీం నగర్: కరీం నగర్,కోరుట్ల, రామగుండం,హుజూరాబాద్ – బాలురకు(4)
కరీం నగర్,సిరిసిల్లా,జగిత్యాల, పెద్దపల్లి- బాలికలకు(4)
వరంగల్ : మహబూబాబాద్, జనగాం- బాలురకు(2)
వరంగల్ ,హనుమకొండ,- బాలికలకు(2)
నల్లగొండ: సూర్యాపేట ,భువనగిరి, దేవరకొండ – బాలురకు(3)
మిర్యాలగూడ, కోదాడ, - బాలికలకు(2)
ఖమ్మం: ఖమ్మం,ఇల్లందు,సత్తుపల్లి – బాలురకు(3)
ఖమ్మం,కొత్తగూడెం – బాలికలకు(2)

ప్రవేశాలలో రిజర్వేషన్లు : ప్రవేశాలలో రిజర్వేషన్లు ఈ క్రింద చూపబడిన నిష్పత్తిలో ఉంటాయి. అల్ప సంఖ్యాకులు;75 శాతం ‘ ఇతరులు;25 శాతం. మరిన్ని వివరములకు: tmreis.telangana.gov.in సందర్శించండి.

ఆధారం : tmreis.telangana.gov.in

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate