కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న “నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS)” 2008 వ సంవత్సరంలో మే నెలలో ప్రారంభమైంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా ఆర్దికంగా వెనుకబడి, ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు స్కాలర్షిప్ ను మంజూరుచేయుట మరియు విద్యార్ధుల్లో డ్రాప్ అవుట్లను నివారించి విద్యలో కొనసాగెట్లు ప్రోత్సాహించడం.
స్కాలర్షిప్ మొత్తం
ప్రభుత్వ మరియు ప్రభుత్వ పరిధిలో గల స్కూల్స్ లో తొమ్మిది మరియు పదావ తరగతులలో గల ప్రతిభ కనపరచిన విధ్యార్దులకు ప్రతి సంవత్సరం ఆరువేల రూపాయలు (6000/-) (అనగా ప్రతిఅనెల 500/- ) ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానము:
తలిదండ్రుల సాంవత్సరిక ఆదాయం Rs. 1,50,000/- కంటే తక్కువగా ఉన్న విద్యార్ధులు అర్హులు.
రాష్ట్ర ప్రభుత్వ నిభంధనల మేరకు రిజర్వేషన్లు కల్పించబడతాయి.
కనీసం 55% ఉత్తీర్ణత గలవారు లేదా ఏడవ తరగతికి సమానమైన అర్హత గలవారు ఈ స్కాలర్షిప్ ఎంపిక పరీక్ష వ్రాయుటకు అర్హులు.
SC/ST విద్యార్ధులకు 5%సడలింపు ఉంటుంది.
విద్యార్ధి ప్రభుత్వ లేదా ఎయిడెడ్ స్కూల్ లో రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి..
కేంద్రీయ విద్యాలయ మరియు జవహర్ నవోదయ స్కూల్ లో చదువుకునే విద్యార్ధులకు ఈ స్కీమ్ వర్తించదు..
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే సాంఘీక సంక్షేమ స్కూల్స్ లో చదివేవారు మరియు ప్రైవేటు స్కూల్స్ లో చదివే విధ్యార్ధులు ఈ పధకానికి అనర్హులు.
అర్హత పరీక్ష
రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎంట్రన్స్ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.
ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన విద్యార్ధులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కి ఎంపిక చేయడం జరుగుతుంది.
వ్యాసం:వందనం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
మీ రేటింగ్
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి