హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి)

పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి) ’ అనే ఈ పథకాన్ని 2004 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నది.

పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి) ’ అనే ఈ పథకాన్ని 2004 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నది. మాధ్యమిక స్థాయి విద్యార్థులకు సమాచార పరిజ్ఞానానికి, సమాచారం చేరవేసే పరిజ్ఞానానికి సంబంధించిన (ఐసిటి) నైపుణ్యాలను, ఐసిటి ఆధారిత అధ్యయన పద్ధతులపై అవగాహనను పెంపొందించుకునే అవకాశాలను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. వివిధ సామాజిక, ఆర్ధిక, భౌగోళిక పరిస్థితులకు చెందిన విద్యార్ధులమధ్య , కంప్యూటర్ పరిజ్ఞానపరమైన అంతరాలను తగ్గించడానికి ఈ పథకం ఎంతో ఉపకరిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు శాశ్వతంగా కంప్యూటర్ ల్యాబులను నిర్వహించుకోవడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలలో ' స్మార్ట్ స్కూల్స్ ' ను ఏర్పాటుచేసి, వాటిని ప్రదర్శనాత్మక కంప్యూటర్ పరిజ్ఞాన కేంద్రాలుగా నిర్వహిస్తూ, చుట్టు పక్కల పాఠశాలల విద్యార్ధులలో ఐసిటి నైపుణ్యాల పెంపుదలకు దోహదం చేయాలన్నదికూడా ఈ పథకం ఆశయం.

ప్రస్తుతం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ మాధ్యమిక, ఉన్నత పాఠశాలలలో అమలవుతున్నది. కంప్యూటర్లను, వాటికి అవసరమయ్యే ఇతర సామగ్రిని, విద్యావిషయికమైన సాప్ట్ వేర్ సమకూర్చుకోవడానికి; ఉపాధ్యాయులకు కంప్యూటర్ పరమైన శిక్షణ ఇవ్వడానికి ; ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటుకు ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి నాయకత్వంలోని, ' ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ గ్రూప్ (పి ఎమ్ ఇ జి) ' ఆమోదించే మేరకు, రాష్ట్రాలకు, ఇతర సంస్థలకు ఈ పథకంకింద ఆర్ధిక సహాయాన్ని అందిస్తారు.

పరిచయం

సమాజంలో మార్పుకు, దేశప్రగతికి ఎంతో కీలకమైన ప్రేరణగా ఐసిటికి ప్రపంచమంతంటా గుర్తింపు వుంది. అయితే ఐసిటి సంసిద్ధతలోను, వినియోగంలోను వున్న స్థాయీ భేదాలు, ఉత్పాదకత పరమైన స్థాయీ భేదాలుగా మారి, ఏ దేశ ఆర్ధిక ప్రగతినైనా ప్రభావితం చేయగలుగుతాయి. అందువల్ల, నిరంతరమైన సాంఘిక ఆర్ధిక ప్రగతికోసం పాటుబడే దేశాలకు, ఐసిటిపై అవగాహనను పెంచుకోవడం, దానిని మరింత ప్రయోజనదాయకంగా మలచుకోవడం ఎంతో కీలకం.

భారత దేశంలో ఐసిటికి సంబంధించి భౌగోళికంగా, జనసాంద్రత పరంగా ఎన్నో అంతరాలు వున్నాయి. ఐసిటి పరిజ్ఞానంకలిగినవారు అత్యధిక సంఖ్యలోవున్న దేశాలలో భారత దేశం ఒకటి. కంప్యూటర్ పరిజ్ఞాన కేంద్రాలుగా పేరొందిన బెంగుళూరు, గురుగావ్ వంటి చోట్ల, ఇంకా అధిక ఆదాయ వర్గాలలోను ఐసిటి వినియోగం చాలా ఎక్కువ. అయితే మరోవైపు, కనీసం టెలిఫోన్ కనెక్షన్ కూడాలేని ప్రాంతాలు దేశంలో అనేకం వున్నాయి.

ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ , సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ పై కార్యసాధక దళం (ఐటి టాస్క్ ఫోర్స్)

1998 జులైలో ప్రధానమంత్రి ఏర్పాటుచేసిన ఈ టాస్క్ ఫోర్స్, పాఠశాలలతోసహా మొత్తం విద్యారంగంలో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి సంబంధించి నిర్దిష్టమైన సిఫారసులు చేసింది. వాటిలో సంబంధిత పేరాలను ఈ క్రింద చూడవచ్చు.

కంప్యూటర్లు కొనుక్కోవాలనుకునే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు ఆర్ధికంగా ఆకర్షణీయమైన ప్రతిపాదనలతోకూడిన విద్యార్థి కంప్యూటర్ స్కీం, శిక్షక్ కంప్యూటర్ స్కీం, స్కూల్ కంప్యూటర్ స్కీం అనే పథకాలు వుంటాయి. పి.సి.ల ధర తగ్గించడం, సులభ వాయిదాలలో బ్యాంకులనుంచి రుణ సౌకర్యం కల్పించడం, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు కంప్యూటర్లను విరాళంగా ఇవ్వడం, విదేశాలలోని భారతీయులు భారీసంఖ్యలో కంప్యూటర్లను విరాళంగా ఇచ్చేలాచూడడం, ఇతరదేశాలనుంచి బాగాతక్కువధరకు కంప్యూటర్లను దిగుమతిచేసుకోవడం, వివిధ రకాలైన నిధులు సమకూర్చడం మొదలైన అనేక ప్రోత్సాహక చర్యలు ఈ పథకాలలో భాగంగా వుంటాయి.

2003నాటికి దేశంలోని అన్ని పాఠశాలలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలి.

ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీతోపాటు, వచ్చే సహస్రాబ్దిలో అత్యంత ప్రముఖ పాత్ర వహించే నైపుణ్యాల, విలువల వినియోగాన్ని అందుబాటులోకి తేవడంకోసం ఉద్దేశించిన ' స్మార్ట్ స్కూల్స్ ' ను ప్రయోగాత్మక ప్రాతిపదికపై అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలి. ఆ స్కూల్స్ ఏర్పాటులోని ఆశయాలు ఇవీ:

ఆశయాలు

  • గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలలో, ముఖ్యంగా ఉన్నత, మాధ్యమిక పాఠశాలలలో, ఐసిటి వినియోగాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించడం . ఐసిటి కి సంబంధించిన పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోవుండేలా చూడడం, ఐసిటి అక్షరాస్యతను పెంపొందించడం మొదలైన కీలకాంశాలన్నీ ఈ ప్రోత్సాహక వాతావరణం కిందకు వస్తాయి.
  • ఆన్ లైన్ లోను (ఇంటర్నెట్ లోను), అనుబంధ పరికరాల రూపంలోను; అటు ప్రైవేట్ రంగంలో, ఇటు ఎస్ ఐ ఎ టి ల ద్వారా నాణ్యమైన పరిజ్ఞానం అందుబాటులో వుండేలా చూడడం
  • బోధనలోను, అధ్యయనంలోను ఐసిటి పరికరాల వినియోగాన్ని ప్రవేశపెట్టడంద్వారా, ప్రస్తుత పాఠ్య ప్రణాళికను, బోధనా విధానాన్ని మెరుగుపరచడం
  • విద్యార్థులు తమ ఉన్నత విద్యకు, మంచి ఆదాయం లభించే ఉద్యోగాలకు అవసరమైనన కంప్యూటర్ నైపుణ్యాలను సమకూర్చుకునేలా చూడడం
  • విద్యార్థుల ప్రత్యేక విద్యావసరాలకు అనుగుణంగా, ఐసిటి పరికరాలతో చక్కని అధ్యయన వాతావరణాన్ని కల్పించడం
  • స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించడంద్వారా, విమర్శనాత్మకంగా ఆలోచించే ధోరణిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం
  • దూర విద్యలో దృశ్య- శ్రవణ మాధ్యమం, ఉపగ్రహ ఆధారిత పద్ధతులతోసహా ఐసిటి పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.09734513274
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు