హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు

బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం

బాలికల మాథ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు

బాలికల మాథ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం

ప్రస్తావన:

ఆర్ధిక మంత్రి తన 2006 – 07 బడ్జెట్ ప్రసంగంలో (పేరా – 38 – కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాల నిధుల జమ ) ఇతర విషయాలతో పాటు ఈ కింద విధంగా తెలిపారు.

“ 2004 వ సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాల పధకం యొక్క తొలి ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయి. అందుచే 2006 -07 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఇతర వెనుక బడిన తరగతులు మరియు అల్ప సంఖ్యాక వర్గాల బాలికల కొరకై 1000 వసతి (రెసిడెన్షి యల్) పాఠశాలలను ప్రారంభిస్తాము. నేను ` 128 కోట్ల రూపాయలు మంజూరు చేసాను. మరియు అదనంగా ఈ సంవత్సరానికి గాను 172 కోట్లు మంజూరు చేయుటకు అంగీకరించాను. ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణురాలై మాధ్యమిక పాఠశాలలో చేరినట్లయితే ఆ బాలిక పేరున 3000 రూపాయిలు జమచేసి, ఆ బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకొనేట్టుగా ప్రోత్సాహకాన్ని కూడా ప్రతిపాదిస్తున్నాను.

నేపధ్యం

బాలికలు 14 - 18 సంవత్సరాల వయస్సులో మాథ్యమిక స్ధాయి లో వుండి, ఎనిమిదవ ( VIII) తరగతి ఉత్తీర్ణులై అనేక సామాజిక ఆర్ధిక కారణాల వల్ల పాఠశాలను మద్యలో మానివేసే వారి నమోదును ప్రోత్సహించడం కోసం పై ప్రకటన చేయబడింది. బాలికలు పన్నెండవ (XII) తరగతి పూర్తిచేసేవరకు నిలుపుదల కోసం ఈ ప్రతిపాదించబడిన పధకం ఉద్దేశింపబడింది. బడిమానివేసిన బాలికల సంఖ్య 2004 – 05 సంవత్సరంలో I – VIII తరగతిలో 50.8% వరకూ, I – X తరగతిలో 64% వరకూ వుంది. అందువల్లనే దేశంలో కేవలం 36% మంది బాలికలు X తరగతి వరకు నిలుపుదల కలిగి వుంటున్నారు. దీనికి తల్లిదండ్రులు బాలికల చదువు ఖర్చును భరించలేకపోవడము ప్రధానం కారణం అనేదానిలో సందేహం లేకపోయినప్పటికిని వివిధ సామాజిక ఆర్ధిక కారణాలు కూడా కలిసివున్నాయి.

లక్ష్యం

ఈ పథకం షెడ్యూల్డ్ కులాల / తెగల వర్గాలలోని బడిమధ్యలో మానివేసే బాలికల సంఖ్యను తగ్గించి, నమోదును పెంచేందుకు మరియు వారు 18 సంవత్సరాలవరకు ఉన్నత పాఠశాల విద్యను కొనసాగించడానికి తగిన వాతావరణాన్ని(పరిస్ధితులను) కల్పించడం.

లక్ష్యనిర్దేశిత సమూహాలు మరియు అంశాలు

 • ఈ పథకం పరిధిలోకి వచ్చేవారు
  (i) VIII తరగతి ఉత్తీర్ణులైన షెడ్యూల్డ్ కులాల / తెగల బాలికలందరు
  (ii) కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాల నుండి VIII తరగతి ఉత్తీర్ణులై (షెడ్యూల్డ్ కులాల / తెగల బాలికలు అయినా కాకపోయిన) 2008 – 09 విద్యా సంవత్సరంలో IX తరగతిలో రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ, ప్రభుత్వ సహయంతో నడిచే, స్ధానిక సంస్ధ పాఠశాలల్లో నమోదు అయిన వారు. వివాహిత బాలికలకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ సహయంలేని పాఠశాలల్లో చదువుకునే బాలికలను కూడా ఈ పథకం నుండి మినహయించాలని ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ఈ పాఠశాలలు ఎక్కువ రుసుమును తల్లిదండ్రులనుండి వసూలు చేస్తాయి. కావున వారికి ఈ పధకంలో వర్తించే ధన సహాయం అవసరం ఉండక పోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు కూడా ఈ పథకం వర్తించదు. వారికి ఇటువంటి సదుపాయాలు ఇంతకు ముందే ఏర్పాటు చేసి వుండడంవల్ల లేక వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలై వుండడంవల్ల వారి తల్లిదండ్రులు వారి పిల్లల చదువు ఖర్చును ఎటువంటి సహకారం లేకుండా భరించగల్గి వుంటారు.
 • ప్రోత్సాహకం పొందిన బాలిక 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత దానిని తీసుకోవచ్చును. దురదృష్టవశాత్తు 18 సంవత్సరాల వయస్సు లోపల మరణించినట్లయితే ఆ ప్రోత్సాహక సొమ్ము కేంద్ర ప్రభుత్వ ఖాతాకు బదిలి చేయబడుతుంది.
 • తోమ్మిదవ (IX) తరగతిలో చేరేనాటికి (మార్చి 31 నాటికి) బాలిక 16 సంవత్సరాల వయస్సుకన్నా తక్కువ ఉండి అవివాహిత అయితే ఈ పథకంలోని లబ్దిని పొందేందుకు యోగ్యత కలుగుతుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందేవారి సంఖ్య 2008 -09 లో 11.72 లక్షలుగా, 2009 -10లో 12.31 లక్షలుగా, 2010 -11 నాటికి 12.92 లక్షలుగా మరియు 2011 – 12 సంవత్సరానికి 13.57 లక్షలుగా అంచనా వేయబడింది. కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలోని షెడ్యూల్డ్ కులాలు / తెగల బాలికల గణన ముందుగానే జరిగినందున అదనంగా అవసరం కలిగే ఆర్ధిక సహకారం వీటిలోని ఇతర వర్గాలకు చెందిన బాలికల సంఖ్య ఆధారంగా అంచనా వేయడం వలన వారికి 2008 -09 లో 0.185 లక్షలుగా, 2009 -10లో 0.194 లక్షలుగా, 2010 -11 నాటికి 0.204 లక్షలుగా మరియు 2011 – 12 సంవత్సరానికి 0.214 లక్షలుగా లెక్కించబడింది. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో మిగిలిన నాలుగు సంవత్సరాలకు ఈ పధకంవలన కలిగే ఆర్ధిక భారం 1556.73 కోట్ల రూపాయలు. దీనికై పదకొండవ పంచవర్ష ప్రణాళికలో కేటాయించిన 1500 కోట్ల రూపాయలకన్నా 56.73 కోట్ల రూపాయలు అధికం.
 • ప్రతి సంవత్సరం ఈ ప్రోత్సాహక సొమ్ము మొత్తంలో 1% సొమ్ము ఈ పధక నిర్వహణ, పర్యవేక్షణ మరియు మూల్యాంకనములపై ఖర్చు చేయబడుతుంది.
 • ఈ ప్రోత్సాహకాలను బాలికలకు అందించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఎందుకంటె షెడ్యూల్డ్ కులాలు / తెగల బాలికలు మరియు కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలో ఉత్తీర్ణులయ్యే బాలికలు ప్రభుత్వ, ప్రభుత్వ సహయంతో నడిచే, స్ధానిక సంస్ధ పాఠశాలల్లో చదువుకొనే బాలికలు సాధారణంగా సమాజంలోని అణగారిన వర్గాలవారై వుంటారు.

కార్యాచరణ భాగస్వాములు

ఈ పధక కార్యాచరణలో, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషితో మరియు నిర్వహణలో నడిచే పాఠశాలలు , స్ధానిక సంస్ధ పాఠశాలలు, పంచాయతీ రాజ్ సంస్ధలు భాగస్వామ్యం వహిస్తాయి. యోగ్యత కలిగిన అందేలాగా ప్రోత్సాహక నగదును జమ చేయడానికి రాష్ట్ర / కేంద్రపాలిత ప్రభుత్వాలకు నిధులు విడుదల చేయబడును.

ఆర్ధిక పరిమితులు

యోగ్యత కలిగిన ప్రతి బాలికకు ఆమె పేరు మీద 3000 రూపాయల సొమ్మును మాత్రమే కాల పరిమితిలో / ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ప్రభుత్వ రంగ బ్యాంకులో గాని, తపాలా కార్యాలయంలో కాని జమ చేయబడతాయి. జమ చేయబడిన నాటినుండి సొమ్ము యొక్క కాలపరిమితి బాలికకు 18 సంవత్సరాలు నిండు వరకు లెక్కింపబడుతుంది. నిర్ణీత కాలపరిమితికి ముందుగా సొమ్మును పొందుటకు వీలు కల్పించబడలేదు.

కార్యనిర్వహణ విదానం:

 • కార్యాచరణలో భాగస్వామి అయిన ప్రతీ పాఠశాల, యోగ్యత ప్రమాణాలను సరిగా పరిశీలించిన తర్వాత, ప్రోత్సాహక నగదు విడుదలకై ఒక ప్రతిపాదనను తయారు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర ప్రభుత్వాలకు సక్రమమైన మార్గంలో దాఖలు చేయాలి.
 • రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఒక సమీకృత ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ మరియు అక్షరాస్యతా విభాగానికి , మానవ వనరుల మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ కి కింద సూచించబడిన విషయాలను పేర్కొంటూ పంపిస్తాయి:
  1. రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలలో యోగ్యత కల్గిన పాఠశాలల సంఖ్య
  2. ఈ పథకం పరిధి లోనికి రాగల్గిన అవకాశం ఉన్న పాఠశాలల సంఖ్య
  3. కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలలో విద్యనభ్యసించి VIII తరగతి ఉత్తీర్ణులై షెడ్యూల్డ్
  కులాల / తెగలకు సంబంధించని బాలికలు మరియు షెడ్యూల్డ్ కులాల / తెగలకు చెందిన బాలికలను కూడగా ఈ పథకంలో లబ్ధి పొందే వారి సంఖ్య
  4. ఈ పథకం ద్వారా లబ్ధి పొందగల్గే బాలికల వయస్సు ఆధారంగా విభజించిన సంఖ్య
  5. కావలసిన ప్రోత్సాహక నగదు మొత్తం విడుదలకు ప్రతిపాదన
 • రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరమూ రెండు విడతలుగా ఈ నిధులు విడుదల చేయబడుతాయి. ప్రతిపాదన అందిన వెంటనే మొదటి విడత నిధులు విడుదల చేయబడతాయి. రెండవ వాయిదా నిధులు మాత్రం , మొదటి విడత నిధుల సొమ్ము వినియోగించబడిన తీరు యొక్క ధృవ పత్రం మరియు ప్రగతి నివేదికలను సంబంధిత రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రభుత్వాలు అందజేసిన తర్వాత మంజూరు చేయబడతాయి.
 • పాఠశాలలో చేరినప్పుడు నమోదైన పట్టికలోని సమాచారం ఆధారంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన జనన ధృవీకరణ పత్రమును పరిశీలించి , అభ్యర్ధనను సమగ్రంగా పరిశీలింపబడుతుంది.
 • ఒక ఖాతాను, లబ్ధిదారు పేరు మీద , సమీపంలో గల బ్యాంకులో గాని, తపాలా కార్యాలయంలోగాని, కార్యనిర్వహణ సంస్థ (రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రభుత్వాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నట్లయితే అవి ) తెరచి, ఆ సొమ్మును కాల పరిమితి గల (ఫిక్స్ డ్ డిపాజిట్ ) రూపంలో జమ చేస్తుంది.
 • విద్యార్ధికి ఒక పాస్ బుక్ లేదా ధృవపత్రము ఇవ్వబడును. అది ఆమెకు లబ్ధిదారు గుర్తింపుగా కూడా ఉపయోగపడ్తుంది.
 • లబ్ధిదారు ఈ పథకం ద్వారా ఫలితం పొందడానికి మాధ్యమిక పాఠశాలలో IX తరగతిలోచేరిన తర్వాత కనీసం రెండేళ్ళు విద్యనభ్యసించవలసి ఉంటుంది. సంబంధిత పాఠశాల ప్రధానాచార్యులు/ ప్రధానోపాధ్యాయుడు ఈ విషయమై ఒక ధృవీకరణ పత్రమును జారీ చేయవలసి ఉంటుంది.
 • లబ్ధిదారు పదవ తరగతి బోర్డు పరీక్ష విజయవంతంగా ఉత్తీర్ణురాలయినట్లయితే ముందస్తు షరతులేకుండా ప్రోత్సాహక నగదును పొందవచ్చు.
 • 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత దాఖలు చేయవలసిన పత్రాలు
  (i)పదవ తరగతి ఉత్తీర్ణతా ధృవీకరణ పత్రం
  (ii)పాఠశాల ప్రధానాచార్యులు/ ప్రధానోపాధ్యాయులు , లబ్ధిదారురాలైన బాలిక IX తరగతిలోచేరిన తర్వాత తన పాఠశాలలో కనీసం రెండేళ్ళు విద్యనభ్యసించినదని తెలుపుతూ ఇచ్చే ఒక ధృవీకరణ పత్రముతో అనుమతించి కార్యనిర్వహణ సంస్థ , బ్యాంకును జమ చేసిన సొమ్ము యొక్క వడ్డీతో కలిపిన మొత్తమును , లబ్ధిదారు బాలిక పేరు మీదకల సేవింగ్స్ ఖాతాలోనికి బదిలీ చేయాలని కోరుతుంది.

కాలపరిమితి

విద్యాసంవత్సరం ప్రారంభమైన నెలలోపల, ప్రతీ పాఠశాల యోగ్యత గల బాలికలను గుర్తించడం మరియు ప్రతిపాదనను తయారు చేయడం పూర్తి చేయాలి. రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రభుత్వాలు, విద్యాసంవత్సరం ప్రారంభమైన మూడు నెలల లోపు తమ సమీకృత ప్రతిపాదనను తయారుచేయడం మరియు పాఠశాల విద్యాశాఖ మరియు అక్షరాస్యతా విభాగానికి, మానవ వనరుల మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీకి అందజేయడం చేయాలి.

ఆధారం: పాఠశాల విద్య

3.01612903226
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు