బాలికల సంరక్షణ కోసం స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలుచేస్తోంది. ఆడపిల్లలకు షరతులతో నగదును బదిలీ చేసే 'ధనలక్ష్మి' అనే పథకాన్ని ఏడు రాష్ట్రాలలోని పదకొండు పంచాయతీ సమితులలో ప్రయోగాత్మకంగా 2008-09నుంచి అమలుచేస్తున్నారు. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీమతి కృష్ణ త్రిపాఠి రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియ జేశారు.
ఆడపిల్ల పుట్టిన సమాచారం నమోదు చేయించడం, టీకాలు వేయించడం, బడిలో చేర్పించడమేకాక ఏడవతరగతిదాకా చదివించడం వంటి కొన్ని షరతులను పాటించినట్లయితే ఆ బాలిక కుటుంబానికి నగదు బదిలీ చేసేవిధంగా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అంతేకాక ఈ పథకంలో...ఆ బాలికకు 18వ సంవత్సరం వచ్చేదాకా పెళ్ళి చేయకుండా ఉంచినట్లయితే బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. 2008-09 కాలంలో ఈ పథకంకింద 79, 555మంది బాలికలు లబ్ది పొందుతారని అంచనా.
కౌమారదశలో ఉన్న ఆడపిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించే న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ (ఎన్ పి ఏ జి) పథకాన్ని దేశంలోని 51 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. ఈ పథకంకింద సరైన పోషణలేని 11-19 ఏళ్ళ మధ్య వయసున్న ఆడపిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోగ్రాముల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నారు.
2009-10 సంవత్సరానికి గాను ధనలక్ష్మి పథకానికి ` 10.00 కోట్లను కేటాయించారు. కిషోరి శక్తి యోజన పథకానికి గాను రాష్ట్రాలకు 2009-10 సంవత్సరానికి మొత్తం ` 71.30 కోట్లను కేటాయించారు. రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సంవత్సరానికి ఒక్కో ప్రాజెక్టుకు ` 1.1 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తారు. కౌమార వయసులో ఉన్న ఆడపిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించే పథకానికిగానూ 2009-10 సంవత్సరానికి మొత్తం ` 162.77 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రాలకు...ఆయా రాష్ట్రాలలోని లబ్దిదారుల సంఖ్యనుబట్టి నిధులను కేటాయించారు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
దేశ ప్రజలందరూ సమర్గమైన విద్యను పొందుటకు భారతదేశ ప్...
జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా...