లక్ష్యం
ఈ పథకం భారతదేశంలో భారతీయ సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యం, నాటకం, మూకాభినయం, దృశ్య కళ, జానపద కళ, సాంప్రదాయ మరియు దేశవాళీ కళ మరియు లైట్ క్లాసికల్ సంగీత రంగంలో యువ కళాకారులకు ఆధునిక శిక్షణ కోసం పని చేస్తుంది.
మొత్తం ఉపకార వేతనాల సంఖ్య 400
ఉపకార వేతనం ప్రదానం చేసే విషయము/క్షేత్రం
- భారతీయ సంప్రదాయ సంగీతం
- సంప్రదాయ హిందూస్థానీ సంగీతం (గాత్ర మరియు వాయిద్య) సంప్రదాయ కర్ణాటక సంగీతం (గాత్ర మరియు వాయిద్య మొదలైనవి)
- భారతీయ సంప్రదాయ నృత్యం/నృత్య సంగీతం
- భరత, కథక్, కూచిపూడి, కథాకళి, మోహినిఅట్టం, ఒడిస్సీ నృత్యం/సంగీతం, మణిపురి నృత్యం/సంగీతం తంగ్టా, గౌడియా నృత్యం, ఛౌ నృత్యం/సంగీతం సత్త్రీయ నృత్యం.
- నాటకం
- నటక కళలో ఎదైనా ప్రత్యేక విశయంలో, నటన, ధర్శకత్వం లాంటి వాటికి ఇస్తారు, కానీ నాటక రచన మరియు పరిశోధనను మినహాయించారు.
- మూకాభినయం.
- దృశ్య కళ
- లేఖా చిత్రాలు, శిల్పకళ, చిత్రలేఖనం, సృజనాత్మక చాయాచిత్ర కళ, మృణ్మయకళ & పింగాణీ, మొదలైనవి
- జానపద, సాంప్రదాయ మరియు దేశవాళీ కళలు
- కీలు బొమ్మలాటలు, జానపద నాటకం, జానపద నృత్యాలు, జానపద గీతాలు, జానపద సంగీతం, మొదలైనవి (గుర్తింపు సూచించే జాబితా పారా 10 'గమనిక'ను చూడవచ్చు)
- లైట్ క్లాసికల్ మ్యూజిక్
- తుమ్రి, దద్రా, తప్పా, కవాలీ, గజల్,
- లైట్ క్లాసికల్ సంగీత ఆధారిత కర్ణాటక శైలి మొదలైనవి,
- రవీంద్ర సంగీత్, నజ్రుల్ గీతీ, అతులప్రసాద్.
ఉపకార వేతనం వ్యవధి
ఉపకార వేతనం వ్యవధి 2 సంవత్సరాలు.
ప్రతీసారి శిక్షణ స్వభావాన్ని విద్యార్థి పూర్వ శిక్షణ మరియు నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తాయి. సాధారణంగా, అది ఒక గురువు/మాస్టర్ కింద లేదా గుర్తింపు పొందిన సంస్థ లో శిక్షణ అయి ఉంటుంది.
విధ్యార్థి కఠినమైన శిక్షణతీసుకోవలసి ఉంటుంది. సిద్ధాంత మరియు సంబంధిత విభాగాల అవగాహనా జ్ఞానం పొందటం కోసం గడిపిన సమయానికి అధనంగా కనీసం మూడు గంటల పాటు సాధన చేయవలసి ఉంటుంది.
ప్రతి విధ్యార్థికి తను ఉండటానికి అయ్యే ఖర్చులకు, ప్రయాణాలకు, పుస్తకాలకు, కళ వస్తువులు లేదా ఇతర పరికరాలకు మరియు ట్యూషన్ లేదా శిక్షణ కోసం నెలకు రూ. 5000/ - చొప్పున, రెండు సంవత్సరాలు చెల్లిస్తారు.
వినతి పత్రం విధానం
ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేయడానికి, ఇక్కడ క్లిక్కు చేయండి..
మూలం: indiaculture.gov.in