హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ)

రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ), VIII నుండి X తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ), VIII నుండి X తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నత పాఠశాల (X తరగతి వరకు)ని ప్రతి ఇరుగుపొరుగికి 5 కిలో మీటర్ల పరిధిలో పెట్టేలా చేసి, ఆర్ ఎమ్ ఎస్ ఎ కూడా ఉన్నత విద్యని దేశంలోని ప్రతి మారుమూలకి తీసుకువెళుతుంది. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ), ఉన్నత విద్యని అందరికీ అందివ్వాలన్న ( యు ఎస్ ఇ - యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ) లక్ష్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం ఇటీవల తలపెట్టిన మొదటి ప్రయత్నము.

లక్షల మంది పిల్లలకి ప్రాథమిక విద్యని అందివ్వడానికి ప్రభుత్వంచే ప్రారంభించిన సర్వ శిక్ష అభియాన్ పథకం చాలావరకు విజయవంతం అవడంతో, దేశమంతా ఉన్నత విద్య ఉపకరణ సౌకర్యాలు పటిష్ట పరచే అవసరం ఏర్పడింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ దీనిని గుర్తించి, 11 వ ప్లాన్ లో , ` 20,120 కోట్లతో రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ) అనే ఉన్నత విద్యా పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంది.

“సర్వ శిక్ష అభియాన్" విజయవంతంగా అమలుచేయడంతో, ఎక్కువ మంది విద్యార్థులు ప్రాధమికోన్నత తరగతుల నుండి ఉత్తీర్ణులౌతుండంతో, ఉన్నత విద్యకి పెద్ద డిమాండ్ పెరిగిందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ చెప్పింది.

లక్ష్యం(విజన్)

14-18 సంవత్సరముల వయస్సు గల అందరి యువకులకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య లభ్యమయ్యేలా, అందుబాటులో ఉండేలా మరియు తక్కువ ఖర్చుతో పొందేలా చేయడంమే ఉన్నత విద్య లక్ష్యం . ఈ లక్ష్యం / ముందు చూపు ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రిందివాటిని సాధించాలి.

 • నివాస స్థలానికి తగిన దూరములో అనగా 5 కిలో మీటర్ల దూరములో ఉన్నత పాఠశాల, 7 -10 కిలో మీటర్ల లోపల ఉన్నత విద్యను ఏర్పాటు చేయడం
 • 2017 నాటికి, ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయడం (GER of 100%) మరియు 2020 నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
 • సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలవారికి, విద్యా పరంగా వెనుకబడినవారికి, బాలికలకి, గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్న వికలాంగు పిల్లలకి మరియు షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుక బడిన తరగతులు వంటి ఇతర తక్కువ కేటగరీలకి మరియు విద్యా పరంగా వెనుకబడిన మైనారటీలకి (ఇ బి ఎమ్) ఉన్నత విద్యకి ప్రవేశం కల్పించడం

ఉద్దేశ్యాలు మరియు ఆశయాలు

అందరికీ ఉన్నత పాఠశాల విద్యని సాధించడానికి, ఉన్నత పాఠశాల విద్య రూపకల్పనలో మార్పుచేయవలసి ఉంది. ఈ విషయంలో మార్గదర్శక సూత్రాలు ఏమిటంటే; అందరికీ ప్రవేశం/ అందుబాటులో ఉండడం , సమానత్వం మరియు సామాజిక న్యాయం, పొందిక/ మరియు వికాశము మరియు భోధన మరియు నిర్మాణ దశలు. అందరికీ ఉన్నత పాఠశాల విద్య సమానత్వం వైపు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది. ‘ఉమ్మడి పాఠశాల’ అనే మనోభావాన్ని ప్రోత్సహించాలి. ఈ విలువల్ని వ్యవస్థలో నెలకొల్పడానికి, సహకారం లేని ప్రైవేటు పాఠశాలలతో సహా అన్ని రకాల పాఠశాలలు బడుగువర్గాల నుండి వచ్చిన పిల్లలని మరియు దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబంలోని పిల్లలని సరిపడినంతగా చేర్చుకుని అందరికీ సెకండరీ విద్య అందేలా దోహదపడాలి.

ముఖ్యమైన ఆశయాలు:

 • ప్రభుత్వ / స్థానిక సంస్థల మరియు ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలు మరియు ఇతర పాఠశాలలో తగిన రెగ్యులేటరీ మెకానిజం ద్వారా, కనీసం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, భౌతిక సౌకర్యాలు, సిబ్బంది, సరఫరాలు అన్ని ఉన్నత పాఠశాలలు కలిగి ఉండేలా చూడడం.
 • దగ్గర ప్రాంతము (అంటే, ఉన్నత పాఠశాలకు 5 కిలో మీటర్లు మరియు ఉన్నత విద్యకి 7 -10 కిలో మీటర్లు)/ సమర్థవంతమైన మరియు సురక్షిత రవాణా ఏర్పాట్లు/నివాస సౌకర్యాలు, స్థానిక పరిస్థితులను బట్టి ఓపెన్ స్కూలింగ్ ద్వారా ప్రమాణాల ప్రకారం అందరి యువకులకి ప్రవేశాన్ని మెరుగుపరచడం. అయితే, కొండ మరియు కష్టమైన ప్రాంతాలలో ఈ నిబంధనలను సడలించవచ్చు. ముఖ్యముగా ఈ ప్రాంతాలలో రెసిడెన్షియల్ పాఠశాలల్ని పెట్టవచ్చు.
 • లింగ, సామాజిక-ఆర్థిక, వికలాంగికత్వం మరియు ఇతర అడ్డంకుల వలన సంతృప్తికరమైన నాణ్యతగల ఉన్నత పాఠశాల విద్య ఏ పిల్లవాడు పోగొట్టకుండా చూడడం.
 • అభివృద్ధి చెందిన తెలివిగల, సామాజిక మరియు సాంస్కృతిక అభ్యాసానిచ్చే ఉన్నత పాఠశాల విద్య నాణ్యతని మెరుగుపరచడం.
 • ఉన్నత పాఠశాల విద్యని నేర్చుకుంటున్న విద్యార్థులకు నాణ్యత గల విద్య అందేలా చేయడం.
 • ఇతర ఆశయాలతో పాటు, పైన ఆశయాల్ని సాధించడం ద్వారా కామన్ స్కూల్ సిస్టమ్ దిశలో ధృఢమైన ప్రగతిని సూచిస్తుంది.

రెండవ దశకి మార్గము మరియు వ్యూహరచన

అందరికీ ఉన్నత పాఠశాల విద్యని అందించే సందర్భములో, అదనంగా పాఠశాలలు, అదనంగా తరగతి గదులు, ఉపాధ్యాయులు మరియు విశ్వసనీయత, నాణ్యతని సాధించడానికి కావలసిన ఇతర సౌకర్యాల వంటి వాటిని పెద్ద మొత్తంలో సమకూర్చడానికి ఏర్పాటు చేయాలి. విద్యావసరాలయొక్క అంచనా/ఏర్పాటు, భౌతిక ఉపకరణ సౌకర్యాలు, మానవ వనరులు, విద్యకు సంబంధించిన ఇన్ పుట్, పథకాలని అమలుపరచడానికి ప్రభావితమైన పర్యవేక్షణ మొదలైనవి కావాలి. ఈ పథకం ముందుగా X తరగతి వరకు ఏర్పాటు చేస్తుంది. తరువాత, ముఖ్యముగా అమలు చేసిన రెండు సంవత్సరముల లోపులో, హైయర్ సెకండరీ కూడా తీసుకోబడుతుంది. ఉన్నత పాఠశాల విద్య అందరికీ కల్పించే మరియు దాని నాణ్యతని మెరుగుపరచే వ్యూహరచన ఈ క్రింద ఇవ్వబడింది:

ప్రవేశం

దేశం యొక్క విభిన్న ప్రాంతాలలో పాఠశాల సౌకర్యాలలో చాలా వ్యత్యాసం ఉంది. ప్రైవేటు పాఠశాలల మధ్యన, ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయి. నాణ్యత గల సెకండరీ విద్యని అందరికీ అందుబాటులో ఉంచి అందించడానికి , ప్రత్యేకంగా రూపొందించిన విశాలమైన నిభంధనలను జాతీయ స్థాయిలో అభివృద్ధిచేసి మరియు భౌగోళిక, సామాజిక-సాంస్కృతిక, భాషా మరియు జనాభా సంబంధమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతీ రాష్ట్ర/యూనియన్ టెరిటరీలోనే కాకుండా స్థానికంగా అవసరమైనచోట ఏర్పాటు చేయడం అవసరం. సాధారణంగా కేంద్రీయ విద్యాలయాలకు సమానంగా సెకండరీ పాఠశాల నిభంధనలు ఉండాలి. ఉపకరణ సౌకర్యాల మరియు అభ్యాస వనరుల వికాశము ఈ క్రింది విధముగా చేపట్టాలి,

 • ప్రస్తుతం ఉన్న సెకండరీ పాఠశాలల విస్తారము/ వ్యూహరచన ప్రస్తుతం ఉన్న పాఠశాలలో హైయర్ సెకండరీ పాఠశాలలని మార్చడం.
 • మైక్రో ప్లానింగ్ ఎక్సెర్సైజ్ ఆధారంగా, కావలసిన ఉపకరణ సౌకర్యాలు మరియు ఉపాధ్యాయులతో ప్రాధమికోన్నత పాఠశాలల్ని అభివృద్ధి చేయడం. ప్రాధమికోన్నత పాఠశాలల్ని అభివృద్ధి చేసేటప్పుడు ఆశ్రమ్ పాఠశాలలకి ప్రాముఖ్యం ఇవ్వాలి.
 • అవసరాలకు తగ్గట్టుగా సెకండరీ పాఠశాలలని హైయర్ సెకండరీ పాఠశాలలుగా అభివృద్ధి చేయడం.
 • పాఠశాల మేపింగ్ ఎక్సెర్సైజ్ ఆధారంగా సేవలు లభ్యంకాని ప్రాంతాలలో, క్రొత్త సెకండరీ పాఠశాలలని/ హైయర్ సెకండరీ పాఠశాలలని తెరవడం. ఈ బిల్డింగులన్నీ తప్పనిసరిగా నీటిని నిల్వచేసే సిస్టమ్ మరియు వికలాంగులకు అనువుగా ఉండాలి..
 • ప్రస్తుతం ఉన్న పాఠశాల బిల్డింగులలో కూడా వర్షపు నీటిని నిల్వచేసే సిస్టమ్ ని పెట్టాలి.
 • ప్రస్తుతం ఉన్న పాఠశాల బిల్డింగులు కూడా వికలాంగులకు అనువుగా ఉండేలా చేయాలి.
 • పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ విధానంతో క్రొత్త పాఠశాలలను నెలకొల్పాలి.

నాణ్యత

 • బ్లాక్ బోర్డ్, ఫర్నీచర్, గ్రంథాలయాలు, సైన్స్ మేథమెటిక్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ లేబ్స్ మరుగు గదుల సమూహము వంటి కావలసిన వసతులు మరియు ఉపకరణాలను ఏర్పాటు చేయడం.
 • అదనపు ఉపాధ్యాయులను నియమించడం మరియు ఉద్యోగములో ఉండగా ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం.
 • VIII తరగతి ఉత్తీర్ణులౌతున్న విద్యార్థులకు అభ్యసించే సామర్థ్యాన్ని పెంచడానికి బ్రిడ్జ్ కోర్స్.
 • నేషనల్ కర్రిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, 2005 ప్రమాణాలను కలసేలా కర్రిక్యులమ్ పునః పరశీలించడం.
 • గ్రామీణ మరియు కష్టతరమైన కొండ ప్రాంతాలలో ఉపాధ్యాయులకు నివాశ వసతి కల్పించడం.
 • ఉపాధ్యాయునిలకు వసతి కల్పించడంలో ప్రాముఖ్యతనివ్వడం.
న్యాయము
 • షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుక బడిన తరగతులు మరియు మైనారటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత లాడ్జింగ్/బోర్డింగ్ సౌకర్యాలు.
 • వసతి గృహాలు/రెసిడెన్షియల్ పాఠశాలలు, క్యాష్ ఇన్సెంటివ్, యూనిఫారమ్, పుస్తకాలు, బాలికలకి విడిగా మరుగు గదులు
 • సెకండరీ స్థాయిలో ఉన్న యోగ్యతగలవారికి/అవసరమైన విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇవ్వడం.
 • అన్ని ఏక్టివిటీలకు సమేతమైన విద్య ముఖ్యలక్షణం. అన్ని పాఠశాలలో విభన్న సామర్థ్యాలు గలిగిన పిల్లలకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయాలి.
 • ప్రత్యేకంగా ఫుల్ టైమ్ సెకండరీ విద్యని చదవలేకపోయినవారికి మరియు ముఖాముఖి భోధన ద్వారా పరిపూర్తి/అభివృద్ధి చేయడం కొరకు ఓపెన్ మరియు డిస్టేన్స్ లెర్నింగ్ అవసరాలని విస్తరంచేలా చేయాలి. పాఠశాలలకి వెళ్ళలేని పిల్లలకి ఈ విధానం కూడా కీలకమైన పాత్ర వహిస్తుంది.
సంస్థాగత సంస్కరణలు మరియు వనరుల సంస్థల్ని పటిష్టం చేయడం
 • కేంద్ర సహకారానికి, ప్రతీ రాష్ట్రంలో కావలసిన పరిపాలన సంస్కరణలని ముందుగా ,చేయడం తప్పనిసరి. ఈ సంస్థాగత సంస్కరణలు ఏమిటంటే,
 • పాఠశాల పరిపాలనలో సంస్కరణలు – యాజమాన్యాన్ని మరియు జవాబుదారీని వికేంద్రీకరించడం ద్వారా పాఠశాల నిర్వర్తన మెరుగుచేయడం
 • ఉపాధ్యాయుల నియామకాలు,సిద్ధపరచడం, శిక్షణ, జీతము,మరియు వృత్తిలో పురోగతి యొక్క హేతుబద్ధమైన పాలిసీని అవలంబించడం.
 • నవీకరణ/ఇ-పరిపాలన మరియు నియుక్తించడం/వికేంద్రీకరణలతో సహా విద్యాపరమైన పరిపాలనలో సంస్కరణలని చేపట్టడం
 • అన్ని స్థాయిలలో, సెకండరీ విద్య విధానంలో కావలసిన వృత్తి మరియు విద్య సంబంధమైన ఇన్పుట్లను ఏర్పాటు చేయడం,అంటే పాఠశాల స్థాయి దగ్గర నుండి ; మరియు
 • త్వరగా నిధులు ఇవ్వడానికి మరియు వాటిని సద్వినియోగపరచడానికి, ఫైనాన్స్ విధానాలని సంస్కరించడం
 • వివిధ స్థాయిలలో, వనరుల సంస్థల్ని కావలసినంత పటిష్టంచేయడం, ఉదాహరణకి,
 • జాతీయ స్థాయిలో, రీజినియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ల (RIEs)తో సహా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), నేషనల్ యూనివెర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ ఎడ్మినిస్ట్రేషన్ (NUEPA) మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS).;
 • రాష్ట్ర స్థాయిలో, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT), స్టేట్ ఓపెన్ స్కూళ్ళు, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ లు మొదలైనవి.; మరియు
 • సైన్స్/సోషల్ సైన్స్/హ్యూమానిటీస్ ఎడ్యుకేషన్/ మరియు కాలేజెస్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (CTEs)/ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎడ్వాన్సుడ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (IASEs) వంటి ప్రఖ్యాతమైన సంస్థలకి, కేంద్రం స్పాన్సరు  చేసిన టీచర్ ఎడ్యుకేషన్ స్కీమ్ క్రింద, నిధులు కేటాయించబడినవి.
పంచాయత్ రాజ్ భాగస్వామ్యం

సెకండరీ విద్య యాజమాన్యంలో, పాఠశాల యాజమాన్య కమిటీలు వంటి సంఘాల ద్వారా పంచాయత్ రాజ్ మరియు పురపాలక సంఘాలు, కమ్యూనిటీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు ఇతర భాగస్వాముల నిర్వహణ, మరియు ప్లానింగ్ ప్రోసెస్, అమలు పరచడం, పర్యవేక్షణ మరియు ఎవాల్యుయేషన్లో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశములు జరిగేలా చూడాలి.

కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీకృత ప్రాయోజిత పథకాలను నడుపుతున్నది అవి:
 1. పాఠశాల సమీకృత కంప్యూటర్ విద్య: ఉన్నత మరియు ఇంటర్మీడియట్ విద్యాలయాలలో కంప్యూటర్ మరియు కంప్యూటర్ సంబంధిత విద్యలను అందించుటకుగాను రాష్ట్ర ప్రభుత్వాలకు సహయమునందించు పథకం.
 2. వికలాంగ విద్యార్ధులకు సమీకృత విద్య: వికలాంగ విద్యార్ధులకు పాఠశాల విద్యలో ప్రధాన స్రవంతి లోనికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనిచ్చు పథకం.
 3. స్వచ్ఛంద సేవా సంస్థలు ( ఎన్ జి ఒ ) లకు గ్రామీణ ప్రాంతాలలోని బాలికల వసతి గృహాలను నిర్వహించుటకుగాను ఉన్నత మరియు ఇంటర్మీడియట్ విద్యాలయాల బాలికలకు భోజన మరియు వసతి సదుపాయాలను మెరుగుపర్చు పథకం.
 4. ప్రపంచ సైన్స్ ఒలింపియాడ్ల సహాయంతో పాటు పాఠశాల విద్య శాస్త్ర విద్యను మెరుగుపర్చేందుకు, యోగ, పర్యావరణ మరియు జనాభా సంబంధిత విద్యా విషయాలను బోధించుటకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహయాన్నందించుటకు గాను పాఠశాలల్లో నాణ్యత మెరుగుపర్చు పథకం. ప్రస్తుతం అమలులోనున్న మరియు మార్పు చేయబడిన అన్ని పథకములు కొత్తగా వచ్చు పథకమలో మిళితమగును.
 5. అర్థికంగా వెనికబడిన విద్యార్ధులకు స్వయం ఉపాధి మరియు తాత్కాలిక ఉపాధికై శిక్షణనిచ్చుట. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జిల్లా మరియు బ్లాక్ స్థాయిలలో వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి.
కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు

ప్రగతిని పెంచే పాఠశాలలుగా మరియు వాటి పాత్రను పటిష్టం చేసే ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాలయాలని పెంచుతారు

ఆర్ధిక విధానం మరియు బ్యాంక్ ఖాతా తెరచుట

పదకొండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు మినహ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సదరు విభాగాలు అమలు పరిచేందుకు అయ్యే ఖర్చులో 75% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ( ఈ పథకంలో నిధులను కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమకూరుస్తాయి) ఈశాన్య రాష్ట్రాలు అయ్యే ఖర్చులో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వివిధ విభాగాలు అమలుపర్చేందుకు అయ్యే ఖర్చు లో 25% భరిస్తున్నది. ( ఈ పథకంలో నిధులను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమకూరుస్తాయి) ఈశాన్య రాష్ట్రాలు అయ్యే ఖర్చులో 10% ఆయా రాష్ట్రాలు భరిస్తున్నవి.

ప్రస్తుతం అమలులోనున్న సర్వ శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ ఎ ) సొసైటి ద్వారా నిధుల బదిలీ మరియు వినియోగం కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ఆర్ధిక నిర్మాణ విధానమును రూపొందిస్తుంది. ఈ విధానం పారదర్శకతను, సామర్థ్యతను, నైతికతను పాటించాలి మరియు లక్ష్య సాధనలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలి.

 • రాష్ట్ర , జిల్లా మరియు పాఠశాల స్థాయిలలో ఈ పథకం క్రింద వేరు వేరు ఖాతాలు తెరువబడును. ఈ ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో తెరువబడును. పాఠశాల స్థాయిలో ఖాతా కొరకు ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ఉమ్మడి ఖతాదారు అయి ఉంటారు. జిల్లా స్థాయిలో ఖతా కొరకు జిల్లా కార్యక్రమ కోఆర్డినేటర్ ఉమ్మడి ఖాతాదారు అయిఉంటారు.
 • పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం 50:50 అవనున్నది. ఈశాన్య రాష్ట్రాలు విషయంలో పదకొండవ మరియు పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య విధానం 90:10 గానే ఉండనున్నది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00925925926
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు