హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / వికలాంగ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్

దీనీవలన ముఖ్యంగా ప్రాథమిక దశ నుండి ద్వితీయ దశ పరివర్తనసమయంలో పాఠశాల వదిలివేయటాన్ని తగ్గించవచ్చు.

లక్ష్యాలు

 1. IX మరియు X తరగతులు అధ్యయనం కోసం వికలాంగులకు సహాయం చేయటం. దీనీవలన ముఖ్యంగా ప్రాథమిక దశ నుండి ద్వితీయ దశ పరివర్తనసమయంలో పాఠశాల వదిలివేయటాన్ని తగ్గించవచ్చు.
 2. IX, X తరగతులలో మరియు పూర్వ మెట్రిక్ దశలో వికలాంగ విద్యార్ధులు రావటాన్ని మెరుగుపరచడం.
 3. వికలాంగులకు చదువుకోవడానికి సహాయం చేసి వారు తమ జీవనోపాది పొందేలా చేయాలి. వారికి సమాజంలో గౌరవ ప్రదమైన స్థానాన్ని కల్పించాలి. వారు విద్య కొనసాగించటానికి శారీరక, ఆర్థిక, మానసిక వత్తిడి లోనవుతారు మరియు గౌరవంగా బ్రతకడానికి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. తద్వారా అలాంటి విద్యార్థులు వారి గుప్త నైపుణ్యాల నియంత్రణ కోల్పోయి అవకాశాలను కోల్పోతుంటారు.
 4. యుజిసి ద్వారా గుర్తింపు పొందిన అన్ని గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ కింద వ్యవహరిస్తారు.

ఉద్దేశం

IX, X, XI, XII తరగతులు, పోస్ట్ మెట్రిక్యులేషన్ డిప్లొమా/సర్టిఫికేట్లు మరియు బాచిలర్ డిగ్రీ లేదా భారతదేశంలో డిప్లొమా మరియు UGC చేత గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండి అయినా మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వికలాంగులకు ఈ పథకం వర్తిస్తుంది. వీరు వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ మరియు పూర్తి పార్టిసిపేషన్) చట్టం, 1995, మరియు నేషనల్ ట్రస్టు ఫర్ ది వెల్ఫేర్ అఫ్ పర్సన్ విత్ ఆటిసమ్, పాక్షిక పక్షవాతము, మెంటల్ రిటార్డేషన్ మరియు బహుళ వికలాంగుల చట్టం, 1999 మరియు/లేదా సంబంధిత లీగల్ శాసనం క్రిందకి వస్తారు.

కేవలం భారతీయులు మాత్రమే స్కాలర్షిప్లకు అర్హత కలిగి ఉంటారు. పథకం కింద స్కాలర్షిప్ సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ, భారత ప్రభుత్వం అందిస్తారు.

అర్హత నిబంధనలు

సాధారణ షరతులు

 • ఈ స్కాలర్షిప్లు భారతీయులకు మాత్రమే.
 • 40% కంటే తక్కువగా వైకల్యం కలిగిన (రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంత సమర్థ వైద్య అధికారుల ద్వారా సర్టిఫై అయినవారు.) విద్యార్థులకు అర్హత లేదు.
 • ఒక తల్లిదండ్రులకు ఇద్దరు వికలాంగుల కంటే ఎక్కువ ఈ పథకం ప్రయోజనాలను అందుకోవటానికి అర్హత ఉండదు. ఒకవేళ పిల్లలు కవలు అయితే ఈ నియమం వర్తించదు.
 • ఏ తరగతి చదువుతున్న వారికైనా స్కాలర్షిప్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక విద్యార్థి ఒక తరగతి తిరిగి చదివితే ఆమె/అతను స్కాలర్షిప్ రెండవ (లేదా తదుపరి) సంవత్సరం పొందండానికి వీలు ఉండదు.
 • ఈ పథకం కింద ఒక స్కాలర్షిప్ హోల్డర్ ఏ ఇతర స్కాలర్షిప్/వేతనం తీసుకోవడానిక వీలు లేదు. ఏ ఇతర స్కాలర్షిప్/వేతనం పొందే విద్యార్థులు అతని/ఆమెకు ఏది మరింత ఉపయోగకరంగా ఉంటుందో ఎంపిక చేసుకొని దానిని ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ ద్వారా అధికారులకు సమాచారం తప్పక తెలియచేయాలి. అతడు/ఆమె మరొక స్కాలర్షిప్/వేతనం అంగీకరించిన తేదీ నుండి ఈ పథకం కింద విద్యార్థులకు స్కాలర్షిప్ చెల్లించబడదు. అయితే, ఉచిత లాడ్జింగ్ లేదా గ్రాంటు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మానిటరీ సహాయం లేదా ఇతర వనరుల నుంచి పుస్తకాలు, పరికరాలు లేదా బస ఖర్చుల సహాయాన్ని పొందవచ్చు.
 • ఎవరైతే ముందు పరీక్ష శిక్షణ కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో పొందుతున్నారో వారికి కోచింగ్ ప్రోగ్రామ్ కాలంలో కోచింగ్ పథకాల కింద వేతనం అర్హత ఉండదు.

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్

 • ఆమె/అతను ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఒక పాఠశాలలో IX లేదా X తరగతి లేదా కేంద్ర/రాష్ట్ర బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా చదువుతున్న పూర్తి స్థాయి విద్యార్ధి అయి ఉండాలి.

స్కాలర్షిప్ విలువ

ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ విలువ కోర్సు పూర్తి కాలానికి కింది విధంగా ఉంటుంది:

స్కాలర్షిప్ మరియు గ్రాంట్ రేట్లు

అంశాలు డే స్కాలర్స్ వసతి గృహాల వారికి
స్కాలర్షిప్ రేటు (రూ. నెలకు) ఒక విద్యా సంవత్సరంలో 10 నెలలకు చెల్లించవలసినది. 350 600
పుస్తకాలు మరియు అడ్ హాక్ మంజూరు (రూ. ఏడాదికి) 750 1000

అలవెన్స్

అలవెన్స్ మొత్తం (రూ.)
ఎ) బ్లైండ్ విద్యార్థులకు నెలకు రీడర్ అలవెన్స్ 160
బి) నెలకు రవాణా అలవెన్స్, అటువంటి విద్యార్థులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రాంగణంలో హాస్టల్ లో నివసించరో వారికి. 160
సి) తీవ్రం వికలాంగులకు (అనగా 80% లేదా ఎక్కువ వైకల్యం) గల డే స్కాలర్స్/తక్కువ తీవ్రత కలిగిన వైకల్యం కలిగిన విద్యార్థుల నెలవారీ ఎస్కార్ట్ అలవెన్స్ 160
డి) ఒక విద్యాసంస్థ హాస్టల్ లో నివసిస్తున్న ఒక తీవ్ర ఆర్తోపీడిక్ వికలాంగ విద్యార్థికి ఒక సహాయకని అవసరానికి హాస్టల్ ఉద్యోగి ఉంటే అతని నెల సహాయ భృతి. 160
ఇ) బుద్ధిమాంద్యత మరియు మానసిక అనారోగ్యంతో ఉన్న విద్యార్ధుల నెల కోచింగ్ భత్యం 240

స్కాలర్షిప్ గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్కు చేయండి. .

మూలం: జాతీయ స్కాలర్షిప్ పోర్టల్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు