অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉపయుక్తమైన వనరులు

ఉపయుక్తమైన వనరులు

ప్రభుత్వ వనరులు

సర్వశిక్షాభియాన్‌ (ఎస్‌.ఎస్‌.ఎ) - భారతదేశపు ప్రాధాన్యతాంశంగాగల సార్వత్రిక ఎలిమెంటరీ విద్య (యు.ఇ.ఇ) సాధనకై చేయుకార్యక్రమ సమాచారం ఇందులో ఉంటుంది.
http://ssa.nic.in/index.asp

అందరికీ విద్య - జాతీయ నివేదిక (ఎన్‌.ఆర్‌.పి.ఎమ్‌) - భారతీయ ప్రస్తుత విద్యావిధానం దృష్ట్యా అందరికీ విద్య కార్యక్రమంలో  భారతదేశపు లక్ష్యాలు, వ్యుహాలు పొందుపరచబడి ఉంటాయి.
http://www.unesco.org/new/en/unesco/worldwide/asia-and-the-pacific/India

భారత ప్రభుత్వం –విద్యాశాఖ - రాష్ట్రాలలోని విద్యాస్ధితిగతులతో బాటు జాతీయ విధాన వ్రాతప్రతులు, గణాంక వివరాల సమాచారం ఉంటుంది.
http://www.education.nic.in/

జాతీయ విద్యాప్రణాళిక - పరిపాలన సంస్ధ (నీపా - ఎన్‌.ఐ.ఇ.పి.ఎ) - శిక్షణా సామగ్రి, వ్యాసక్తులు, సంబంధిత పత్రాలు, విద్యాసంబంధిత విషయాల జాబితా అందుబాటులో ఉంటుంది.
http://www.nuepa.org

జాతీయ విద్యాపరిశోధన - శిక్షణా మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి) - ఇతర విద్యా విషయాలతో బాటు సర్వేలతో లింకులు ఏర్పరచడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు అనుసంధాన విద్య, బాలికా విద్య  అవకాశాలను తెల్పుతుంది.
http://www.ncert.nic.in

జాతీయ సార్వత్రిక విద్య  సంస్ధ (ఎన్‌.ఐ.ఒ.ఎస్‌) - కీలక తేదీలను గుర్తుంచుకోవడానికి - అనగా నమోదు పత్రాన్ని సమర్పించే చివరి తేది మొదలగునవి ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవడం, ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పెట్టిన నమోదు సంఖ్య స్ధితిని తెలుసుకోవడం, ఇతర విద్యా విషయల వివరణ, మూల్యాంకన విధానం ,వృత్తి విద్యా కార్యక్రమాలు వాటికి మద్దత్తు తెల్పే సేవల వివరాలను అందజేస్తుంది.
http://www.nos.org

ప్రపంచీకరణ వనరులు

అంతర్జాతీయ విద్యాప్రణాళిక సంస్ధ - విద్యా ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాక అంతర్జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ సంస్ధ (ఐ.ఐ.ఇ.పి)  యొక్క శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన , ఆన్‌లైన్‌ ప్రచురణలను కూడ ప్రకటిస్తుంది.
http://www.unesco.org/iiep/

ఐక్యరాజ్యాల విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్ధ (యు.ఎన్‌.ఇ.ఎస్‌.సి.ఒ) యునెస్కో విద్యా సమాచార సేవలుః

విద్యా పథకాల, ప్రచురణల యొక్క నిర్వహణ సంస్ధల ముఖ్యమైన వివరాలు ఉంటాయి.  ఇంటర్నెట్‌  ద్వారా ఇతర విద్యా సర్వర్లతో లింకు ఏర్పరుచుకొని సంధాన విషయాలను చూపిస్తుంది. యునెస్కో భాగస్వాములతో విద్యా పరమైన లింక్ ఉంటుంది.  ఈ సెట్‌ విస్త్రతపరచబడడమే కాక ఎప్పటికప్పుడు పరిణతి  చెందిన అంశాలను తెలియజేస్తుంది.
http://en.unesco.org/themes/education-21st-century

అందరికీ విద్య - వేదిక - దేశాల నివేదికలను, స్ధితిని ,పరిణామాల సమాచారం , ప్రచురణలు అందుబాటులో ఉంటాయి . ప్రత్యేక అంశాలను అందరికీ విద్య ప్రకటనలు, జరగబోయే సభలు , సమావేశాలు తెలుస్తాయి.
http://www.unesco.org/education/efa/index.shtml

అందరికీ విద్య వేగవంతమైన మార్గానికి ప్రారంభకం - ప్రజావేదిక సైట్‌ ఎంచుకున్న సమాచారాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది. వేగవంతమైన పథమునకు ప్రారంభకాన్ని నిర్మాణప్రక్రియతో బాటు వ్రాతప్రతిని, పత్రికల సమాచారంతో నివేదికలలో ఎఫ్‌.టి.ఐ  దాతల సమావేశాలను ఏర్పరచడం. ఎఫ్‌.టి.ఐ దేశీయ ప్రతిపాదనలను ఆమోదించడం మొదలగు అంశాల సమాచారం ఉంటుంది, వార్తలు, విశేషాంశాల వివరాలను పొందుపరుస్తుంది.
www.worldbank.org/en/topic/education

ఐక్యరాజ్యాల అంతర్జాతీయ బాలలనిధి ( యునిసెఫ్‌) - మల్టీ మిడియా రూపకల్పనతొ విశ్వవ్యాప్తంగా బాలల సమాచారం తెలుసుకోవచ్చు, విద్యార్ధుల కొరకు విద్యాకార్య కలాపాల వనరుల విశేషాలను వివరిస్తుంది.
www.unicef.org

యునిసెఫ్‌ యొక్క ప్రపంచ బాలల 2004 నివేదిక - బాలికా విద్యా వ్యూహ మార్గాలను పొందడం అనేది బాలబాలికల హక్కుగాను , ఒక దేశపు అభివృద్ధికి చేసే చర్చనీయాంశాలకు ముందుగా చేసే బహుళగతుల విధానంతోబాటు గణాంక, సమాచార వివరాల మద్దత్తు ఉంటుంది.
http://www.unicef.org/sowc04/

ప్రపంచ బ్యాంకు విద్యాసూక్ష్మవేదిక - ప్రపంచ బ్యాంకు ప్రచురణల పూర్తి విషయాలు, విద్యావనరుల సామగ్రి, సాధనాపేటిక, పూర్వ ప్రాథమిక విద్య , బాలికా విద్య ప్రభావిత పాఠశాలలు, ఉపాధ్యాయులు, వయోజన విద్య, పాఠశాల - ఆరోగ్యం, విద్యాగణాంక వివరాల సమాచారం , ప్రపంచ బ్యాంకు విద్యాకార్యకలాపాలు సైట్‌ లో అందుబాటులో ఉంటుంది. అనేక దేశాల విద్యావ్యూహాల వివరాలు ప్రాంతీయ సమాచారం ఇతర సంబంధిత లింకులు ఉంటాయి.
http://www.worldbank.org/education/

అంతర్జాతీయ అక్షరాస్యత బహిర్గతాంశం (ఎక్స్‌ ప్లోరర్‌ ) - అంతర్జాతీయ పరంగా, అక్షరాస్యత, ప్రాతిపదిక విద్యావిషయాలపై సంక్షిప్త విశేషాలు అందుబాటులో ఉంటాయి.
http://www.literacyonline.org/explorer/index.html

అంతర్జాతీయ విద్యాప్రణాళిక సంస్ధ - విద్యా ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాక అంతర్జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ సంస్ధ (ఐ.ఐ.ఇ.పి)  యొక్క శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన , ఆన్‌లైన్‌ ప్రచురణలను కూడ ప్రకటిస్తుంది.
http://www.unesco.org/iiep/

ఐక్యరాజ్యాల విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్ధ (యు.ఎన్‌.ఇ.ఎస్‌.సి.ఒ) యునెస్కో విద్యా సమాచార సేవలుః

విద్యా పథకాల, ప్రచురణల యొక్క నిర్వహణ సంస్ధల ముఖ్యమైన వివరాలు ఉంటాయి.  ఇంటర్నెట్‌  ద్వారా ఇతర విద్యా సర్వర్లతో లింకు ఏర్పరుచుకొని సంధాన విషయాలను చూపిస్తుంది. యునెస్కో భాగస్వాములతో విద్యా పరమైన లింక్ ఉంటుంది.  ఈ సెట్‌ విస్త్రతపరచబడడమే కాక ఎప్పటికప్పుడు పరిణతి  చెందిన అంశాలను తెలియజేస్తుంది.
http://en.unesco.org/themes/education-21st-century

అందరికీ విద్య - వేదిక - దేశాల నివేదికలను, స్ధితిని ,పరిణామాల సమాచారం , ప్రచురణలు అందుబాటులో ఉంటాయి . ప్రత్యేక అంశాలను అందరికీ విద్య ప్రకటనలు, జరగబోయే సభలు , సమావేశాలు తెలుస్తాయి.
http://www.unesco.org/education/efa/index.shtml

శిక్షణ, జ్ఞానం - పరస్పర వనరులు

ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (భారత దేశం) - ఆన్‌ లైన్‌ ద్వారా ఉపాధ్యాయ శిక్షణ కొరకు పత్రికలు ,  ఉపాధ్యాయ శిక్షణ వనరులకు పత్రాలు , లింకులు ఉంటాయి.
http://www.ncte-in.org

ఆన్‌లైన్‌ విద్య - ఆన్‌ లైన్‌ వేదిక ద్వారా ఉపాధ్యాయులు , పరిశోధకులు , బోధకులు , సంబంధిత వ్యక్తులకు మధ్య చర్చలు , పరీక్షా విషయాలు , ప్రాతిపదిక విద్య, అభ్యసన వనరులు, సామగ్రి వంటి వాటిపై చర్చలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
http://www.vidyaonline.net/

బోధనాభ్యసనం - ఆలోచనలు ( యునిసెఫ్‌)
ఉపాధ్యాయ వనరుల అనుక్రమాలు, ప్రస్తుత రచనలు, అభిప్రాయాలు , బోధనాభ్యసనం, ఆటలు - క్రీడలు , కృత్యాలు, ఇతర ఉపాధ్యాయ వనరుల పరిశోధన  తో    ఈ సైటు 3 భాగాలుగా ఉంటుంది. అవి

  1. అభ్యాసకుడు
  2. ఉపాధ్యాయుడు
  3. బాలల స్నేహపూర్వక వాతావరణం

http://www.unicef.org/teachers/ideas.htm
యునిసెఫ్‌ - తీసుకోవలసిన చర్య - పరస్పర ప్రజ్ఞ పోటీలు, సాధనా సామగ్రితో బాటు కొన్ని ఆన్‌ లైన్‌ పథకాలను ఉపాధ్యాయుల కొరకు, విద్యార్ధులకు వినియోగించడానికై అందుబాటులో ఉంటాయి.
http://www.unicef.org/teachers/action/index.html

ప్రభావితమైన పాఠశాలలు, ఉపాధ్యాయులు (ప్రపంచ బ్యాంకు) - ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత పాఠశాలల సమాచారం అందుబాటులో ఉంచుతుంది.  కార్యక్రమాలగురించి రచనలు , ప్రత్యేక అధ్యయనాల సమాచారంతో బాటు జ్ఞానవనరుగా పనిచేస్తుంది . అధ్యయన రీతులకు, క్లిష్ట విషయాన్ని నిర్వహించే నిర్వాహకులకు, కార్యక్రమాన్ని రూపకల్పన చేసేవారికి, నిర్ణయాధికారులకు , సృజనాత్మక ప్రభావిత పాఠశాలలుగా ఉంటాయి.  రచనలు, సహాయకర వ్యాసాలు, అధ్యయనాలు, లింకులు,  ప్రదర్శనాత్మక అంశాలు ఉంటాయి.
http://www.worldbank.org/education/est/

భారతదేశం - అభివృద్ధికి మార్గం - ప్రపంచబ్యాంకు - ప్రపంచీకరణ అభివృద్ధికి ఈ వెబ్‌ సైట్‌ మార్గంగా దేశము యొక్క ప్రత్యేక సైట్‌ గా ఉంటుంది. ఆన్‌ లైన్‌ ద్వారా అనేక రకాల అభివృద్ధి విషయాలు, వనరులను  చర్చలను  నివేదికలను ప్రచురణలను అందిస్తుంది.
http://www.developmentgateway.org

ఉపాధ్యాయ వేదిక - ఉపాధ్యాయులు వారి భావనాలను పంచుకోవడానికి ఆన్‌ లైన్‌, వేదికను కల్పిస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పరిచయాలను ఏర్పరుస్తుంది.
http://www.unicef.org/teachers/forum/index.html

ప్రాథమిక విద్య మరియు లింగ సమానత్వము

బాలురతో పోలిస్తే బాలికలు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు.  యునిసెఫ్‌ ఒక విభాగాన్ని కేటాయించి బాలికా విద్యకు అంకింతం చేస్తున్నది.  బాలికలు ఎదుర్కొంటున్న అవరోధాల గురించి మాట్లాడడం, బాలికా విద్యను మెరుగు పరుస్తూ విద్యను అందుబాటులోకి తెచ్చేటట్లు చేస్తుంది.  బాలికా విద్యపై జరుగు ఉద్యమాలను , సంబంధిత వాస్తవాలను, సంఖ్యలను తెల్పుతుంది.
http://www.unicef.org/girlseducation

బాలల హక్కులు- సానుకూల వనరులు

ప్రపంచవ్యాప్తంగా బాలకార్మిక వ్యవస్ధపై తిరుగుబాటు. వార్తల సేకరణ, వనరులకు ఇతర మార్గాలను కలుపుకోవడం.
www.globalmarch.org

బాలల హక్కుల సమాచార నెట్‌ వర్క్‌ - బాలల జీవితాలను మెరుగు పరచడంలో చేసే సమావేశాలలో బాలల హక్కుల గురించి కృషి చేసే వ్యక్తులకు, సంస్ధలకు కావలసిన సమాచారం అందించడం. బాలల హక్కుల సదస్సులో  దీనిని మెరుగు పరచడంలో మద్దతును ప్రకటిస్తుంది.
http://www.crin.org/

ప్రపంచీకరణ ప్రచారం - విద్య ( జిసిఇ) - అందరికీ విద్య వీడియో సమావేశం ప్రపంచబ్యాంకు ప్రతిలో ప్రచార క్లుప్తసమాచారం, స్ధితిగతుల పత్రాలు ఉంటాయి.  వివిధ హోదాలలోగల వారు వివిధ స్వచ్చంధ సేవా సంస్ధలలోగల సభ్యుల ఉపన్యాసాలు, విద్యావిషయాల పరంగా  పౌరసంఘాల నెట్‌ వర్క్‌ లో ఉద్యమాలు, అభిప్రాయాలు విద్య కొరకు ప్రపంచీకరణ ప్రచారం ప్రాతినిధ్యం వహిస్తుంది.
http://www.campaignforeducation.org/

ప్రత్యేక అవసరాలుగల బాలల విద్య - అందరితో కలుపుకొని - అంతర్జాతీయ విద్యః
ఇది అభ్యసన లోపాలుగల పిల్లల కొరకు, పిల్లలకే అంకితం చేయబడిన అనుకూల నెట్‌ వర్క్‌ నిర్మాణాత్మక అభివృద్ధిలో వైకల్యాల అంశాలను ఎట్లా కలుపుకోవాలి లేదా నిర్లక్ష్యం చేయబడిన అంశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రయోజనకరమైన వ్యాసాలు, నివేదికలు ఉంటాయి.
www.inclusion-international.org

విద్యాగణాంక వనరులు

2001 జనాభా ఫలితాలతో లింకు కల్గిన సైట్‌ కొన్ని గణాంక వివరాలు, భారతదేశపటాలు, రాష్ట్రాల వారిగా పటాలు, విలువైన గణాంక వివరాలు, పి.డి.ఎఫ్‌ ఫైల్సులో ఉంటాయి.
http://censusindia.gov.in/

యునెస్కోగణాంక సంస్ధ - పూర్వప్రాథమిక, ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్ధాయిలు, సెకండరీ స్ధాయిలో అధికార, అనధికారికంగా విద్యనందించడం, ఆర్ధిక విద్య యొక్క సమాచార వివరాలు ఉంటాయి.
అక్షరాస్యత, లింగవివక్ష, బడిబయట పిల్లలు మొదలగు విషయాలను విద్య సూచికలుగా ప్రాధాన్యత చూపడం.
http://www.uis.unesco.org/ev.php?URL_ID=3753&URL_DO=DO_TOPIC&URL_SECTION=201

చక్కటి ఆరోగ్యం గల బాలల గణాంక వివరాలు - ప్రపంచ బ్యాంకు 2004 నివేదిక నుండి  ఈ వేదికకు వచ్చిన అంశాలలో అత్యవసరమైన ప్రాతిపదిక సూచికలుగా చెప్పబడిన శిశుమరణాల నుండి పోషణ ఆరోగ్యం, ఆరోగ్యసేవలు, విద్య జాబితా పట్టికలు ఉంటాయి.
http://www.unicef.org/sowc04/sowc04_tables.html

అంతర్జాతీయ కార్యనిర్వాహక విభాగం

విద్య (ఐ.బి.ఇ) (యునెస్కో) - కొద్దిగా పాతబడినవైనప్పటికిని ఉపయోగపడే నివేదికలు ప్రపంచం మొత్తంలో 80 కన్నా ఎక్కువ దేశాల విద్యాసమాచార వివరాలు అందుబాటులో ఉంటాయి.
http://www.ibe.unesco.org/

విశ్వవ్యాప్త విద్యా సమగ్ర సమాచారం - దేశీయ సమగ్ర సమాచార వెదుకుదల ఉంటుంది, ఛార్టులు, వివరాల విశ్లేషణకు గ్రాఫ్‌లు, విని యోగదారునికి వెసులుబాటుకొరకు బహుళ దేశాల పోలికకు వెదుకుదల సూచికలు అందుబాటులో ఉంటాయి.
http://qesdb.edie.org/ged/index.html

అభ్యసన  ప్రసారమాధ్యమం - ప్రపంచ మొత్తంలో గల అధ్యయనాలు , విశ్లేషణలు, ఎప్పటికప్పుడు తాజాగా ఇచ్చే ప్రేరణాత్మక విద్యా వార్తలుంటాయి  స్వచ్చంద సేవాసంస్ధల నూత్నపోకడలు, ప్రభుత్వ విధానాలను పూర్తిగా ప్రకటించడం. విద్యపై ఆమోదము తెల్పిన ఆన్‌ లైన్‌ చర్చావేదికలు, విద్యాహక్కులు, వాస్తవాలు అనే అంశంపై ప్రపంచవ్యాప్త విద్యాఉద్యమం ఆధ్వర్యంలో జరుగు చర్చలు కూడా ఉంటాయి.
www.learningchannel.org

దక్షిణ ఆసియా ఒక ప్రపంచం - ఒక తరహాలోగల స్వఛ్చంద సేవాసంస్ధలు, అంతర్జాతీయ వ్యవస్ధలు విద్య, మానవ హక్కులు , సంబంధిత ముఖ్య విషయాలలో పర్యావరణ, జీవన నాణ్యత ఆధ్వర్యంలో ఇతర విషయాలతో కూడుకొని బోధనా సమూహంతో విస్త్రత వనరులతో ఈ సైట్‌ లో ఉంటుంది.
http://southasia.oneworld.net

భారతదేశంతో కలసి మెలసి - సామాజిక ,రాజకీయ విషయాలు ,సంఘటనలు ప్రధానాంశాలుగా ఉంటాయి.
http://www.indiatogether.org/c/education-law-and-policy

అంతర్జాతీయ ఏజన్సీలుః

అక్షన్‌ ఎయిడ్‌ ఇండియా
www.actionaidindia.org

ఆగాఖాన్‌ పౌండేషన్‌
www.agakhanfoundation.org

కేథొలిక్‌ రిలీఫ్‌ సర్వీస్‌ ఇండియా
www.catholicrelief.org

సి.ఎ.ఆర్‌.ఇ (కేర్‌ ) ఇండియా
www.careindia.org

డెలిగేషన్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ కమిషన్‌ ఇన్‌ ఇండియా
http://eeas.europa.eu/delegations/india/index_en.htm

డిపార్ట్‌మెంట్‌ ఫర్‌  ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ ఇండియా
www.dfid.gov.uk/countries/asia/india.

ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఇండియా
http://www.fordfound.org

జి.ఒ. ఎ.ఎల్‌  ఐర్లెండ్‌ ఇండియా
http://www.goal.ie

ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా
http://www.plan-international.org/wherewework/asia/india/

సేవ్‌ ది చిల్డ్రన్‌ ఇండియా
http://www.savethechildren.net

సెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా
http://www.sense.org.uk

స్వదేశ్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీ ఇండియా
www.sida.se

యునైటెడ్‌నేషన్స్‌ డెవలప్‌ మెంట్‌ ఏజన్సీ ఇండియా (యు ఎన్‌ డి పి)
www.undp.org.in

యునైటెడ్‌నేషన్స్‌ ఏడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌  ఆర్గ నైజేషన్‌ (యునెస్కో) ఇండియా
http://www.unesco.org/new/en/newdelhi

యునైటెడ్‌నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌
www.unicef.org/india

యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజన్సీ ఫర్‌  ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా
http://www.usaid.gov/india

వరల్డ్‌ బ్యాంకు ఇండియా
www.worldbank.org/in

వరల్డ్‌ విజన్‌ ఇండియా
http://www.worldvision.in/

ఆధారము: రీచ్ ఇండియా

జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు

జాతీయ, అంతర్జాతీయ దినోత్సవములు నెలల వారీగా ఈ క్రింద పొందుపరచడమైనది

జనవరి నెలలో

1: రహదారి భద్రతా దినోత్సవం
2: ప్రపంచ శాంతి దినోత్సవం
3: మహిళా టీచర్స్ డే
4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5: సైనిక దినోత్సవం
9: ప్రవాస భారతీయ దివస్
10: ప్రపంచ నవ్వుల దినోత్సవం
11: జాతీయ విద్యాదినోత్సవం
12: జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
21: మణిపూర్, మేఘాలయ,
త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
23: సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
25: ఇండియా టూరిజం దినోత్సవం,
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
26: భారత గణతంత్ర దినోత్సవం,
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
30: అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.

ఫిబ్రవరి నెలలో

1: భారత తీర రక్షక దళ దినోత్సవం
2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం
4: వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
11: ప్రపంచ వివాహ దినోత్సవం
12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం,
గులాబీల దినోత్సవం.
14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం
20: మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం
21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం, కవలల దినోత్సవం
24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
25: జాతీయ సైన్స్ దినోత్సవం.

మార్చి నెలలో

4: జాతీయ భద్రతా దినోత్సవం
5: అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం
ప్రపంచ బధిరుల దినం
8: అంతర్జాతీయ మహిళా దినం
9: వరల్డ్ కిడ్నీ డే
10: కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే
15: ప్రపంచ పౌర హక్కుల దినం
18: మానవ హక్కుల దినం
20: సాంఘిక సాధికారత స్మారక దినం
21: ప్రపంచ అటవీ దినం, ప్రపంచ అంగ వికలుర దినం, ప్రపంచ కవితా దినం
22: ప్రపంచ జల దినోత్సవం
23: ప్రపంచ వాతావరణ దినోత్సవం,
అమర వీరుల దినోత్సవం
24: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినం
26: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం
27: అంతర్జాతీయ నాటక దినోత్సవం
28: నేషనల్ షిప్పింగ్ దినోత్సవం

ఏప్రిల్ నెలలో

1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2: పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5: నేషనల్ మారిటైమ్ డే
7: ప్రపంచ ఆరోగ్య దినం
8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10: ప్రపంచ హోమియోపతి డే
12: ప్రపంచ రోదసీ దినోత్సవం
13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ
దినోత్సవం
14: అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, మహిళా పొదుపు దినోత్సవం
15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16: తెలుగు రంగస్థల దినోత్సవం
17: ప్రపంచ హిమోఫిలియా దినం
18: ప్రపంచ సాంస్కృతిక దినం
21: జాతీయ సమాచార హక్కుల దినం,
జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25: ప్రపంచ మలేరియా దినం
26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం,
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28: ప్రపంచ భద్రతా దినోత్సవం,
ప్రపంచ పశుచికిత్సా దినం
29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.

మే నెలలో

1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం
3: ప్రపంచ ఆస్తమా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం
4: బొగ్గు గని కార్మిక దినోత్సవం
5: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
6: ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
7: ఠాగూర్ జయంతి, నవ్వుల దినోత్సవం
8: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
11: జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం
12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం,
అంతర్జాతీయ వలస పక్షుల దినం
13: మాతృ దినోత్సవం
15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం
18: ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే
21: తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
24: కామనె్వల్త్ దినోత్సవం
27: నెహ్రూ వర్థంతి
29: వౌంట్ ఎవరెస్ట్ దినోత్సవం,
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం
30: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
యు.ఎస్. స్ట్ఫా దినోత్సవం
31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.

జూన్ నెలలో

1: అంతర్జాతీయ బాలల దినోత్సవం,
ప్రపంచ పాల దినోత్సవం
4: అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం
5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8: ప్రపంచ సముద్ర దినోత్సవం
12: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం
14: పతాక దినోత్సవం
18: గోవా స్వాతంత్య్ర దినోత్సవం
20: తండ్రుల దినోత్సవం, మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21: ప్రపంచ సంగీత దినోత్సవం
23: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
25: ప్రపంచ అవయవ దాన, మార్పిడి దినోత్సవం
26: ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
28: పేదల దినోత్సవం
29: గణాంక దినోత్సవం.

జూలై నెలలో

1: వైద్యుల దినోత్సవం, వాస్తు దినోత్సవం, ప్రపంచ వ్యవసాయ దినోత్సవం, వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
11: ప్రపంచ జనాభా దినోత్సవం
12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
17: పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26: కార్గిల్ విజయోత్సవ దినం
29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే

ఆగస్టు నెలలో

1: తల్లిపాల దినోత్సవం
2: ఆంగ్లో ఇండియన్ దినోత్సవం
6: హిరోషిమా దినోత్సవం
8: క్విట్ ఇండియా దినోత్సవం
9: నాగసాకి దినోత్సవం
10: డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినం
12: లైబ్రేరియన్స్ డే
13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే
15: స్వాతంత్య్ర దినోత్సవం,
పశ్చిమ బెంగాల్ దినోత్సవం
18: అంతర్జాతీయ స్వదేశీవాదుల దినం
19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినం
20: సద్భావన దినం (రాజీవ్ గాంధీ జయంతి)
మలేరియా నివారణ దినం
24: సంస్కృత దినోత్సవం
29: తెలుగు భాష దినోత్సవం, జాతీయక్రీడా దినోత్సవం

సెప్టెంబర్ నెలలో

1: పోషక పదార్థాల వారోత్సవం
2: కొబ్బరికాయల దినోత్సవం
4: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ
దినోత్సవం (ఆంధ్రప్రదేశ్)
5: ఉపాధ్యాయ దినం- రాధాకృష్ణన్
జన్మదినం
8: ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
9: వరల్డ్ ఫస్ట్‌ఎయిడ్ డే
10: హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం
14: హిందీ దినోత్సవం
15: ఇంజినీర్స్ దినోత్సవం, సంచాయక దినోత్సవం
16: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
17: మహిళల మైత్రీ దినోత్సవం
20: రైల్వే భద్రతాదళ వ్యవస్థాపక దినం
21: బయోస్ఫియర్ దినం,
అంతర్జాతీయ శాంతి, అహింస దినోత్సవం,
ప్రపంచ అల్జిమర్స్ దినోత్సవం
22: క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం, గులాబీల దినోత్సవం
24: ప్రపంచ హృదయ దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం, ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం.
26: చెవిటి వారి దినోత్సవం
27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
28: అంతర్జాతీయ సమాచార హక్కుల దినం, గన్నర్స్ డే, వరల్డ్ హార్ట్ డే,
ప్రపంచ నదుల దినోత్సవం.
సెప్టెంబర్ 4వ ఆదివారం- కూతుళ్ల దినోత్సవం.

అక్టోబర్ నెలలో

1: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, వన్యప్రాణి వారోత్సవాలు, జాతీయ తపాలా దినోత్సవం, స్వచ్ఛంద రక్తదాన దినం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
2: మానవ హక్కుల పరిరక్షణ దినం, గాంధీ జయంతి, గ్రామ్‌స్వరాజ్ డే,
ఖైదీల దినోత్సవం.
ప్రపంచ జంతువుల దినోత్సవం
4: ప్రపంచ జంతు సంక్షేమ దినం
5: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
6: వరల్డ్ స్మైల్ డే,
ప్రపంచ గృహవసతి దినం
8: భారత వాయుసేన దినోత్సవం
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ
దినోత్సవం
9: ప్రపంచ పోస్ట్ఫాస్ దినోత్సవం,
న్యాయ సేవా దినం,
జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం.
10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం
12: ప్రపంచ దృష్టి దినోత్సవం
13: ప్రపంచ గుడ్డు దినోత్సవం
14: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15: అంతర్జాతీయ అంధుల ఆసరా దినం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ కవిత్వ దినం.
16: ప్రపంచ ఆహార దినం
17: అంతర్జాతీయ దారిద్ర నిర్మూలన
దినోత్సవం
21: పోలీస్ సంస్మరణ దినం
23: అంతర్జాతీయ పాఠశాల గ్రంథాలయ
దినోత్సవం
24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల
అవతరణ దినోత్సవం
27: పదాతిదళ దినోత్సవం, శిశుదినోత్సవం
28: అత్తవార్ల దినోత్సవం
30: ప్రపంచ పొదుపు దినోత్సవం
31: జాతీయ సమైక్యత దినోత్సవం,
జాతీయ పునరంకిత దినం,
ఇందిరాగాంధీ వర్ధంతి.

నవంబర్ నెలలో

1: ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భవ దినోత్సవం.
గర్వాల్ రైఫిల్ దినం
7: ఎన్.టి.పి.సి. స్థాపన దినోత్సవం,
బాలల సంరక్షణ దినం
8: వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే
9: లీగల్ సర్వీసెస్ దినం,
ప్రపంచ నాణ్యతా దినోత్సవం
10: రవాణా దినం
11: వెటరన్స్ డే, జాతీయ విద్యా
దినోత్సవం
14: ప్రపంచ మధుమేహ దినోత్సవం,
ప్రపంచ బాలబాలికల దినోత్సవం,
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు,
జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.
17: ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
19: ప్రపంచ సాంస్కృతిక,
వారసత్వ దినం, పౌరుల దినోత్సవం
20: యూనివర్సల్ చిల్డ్రన్స్ డే
21: ప్రపంచ మత్స్య పరిశ్రమ దినం, ప్రపంచ టెలివిజన్ దినం.
25: అంతర్జాతీయ స్ర్తిలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం, జాతీయ జంతు సంక్షేమ దినం, ఎన్‌సిసి దినోత్సవం.
26: జాతీయ న్యాయ దినోత్సవం,
సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.

డిసెంబర్ నెలలో

1: ప్రపంచ ఎయిడ్స్ దినం,
నాగాలాండ్ దినోత్సవం,
సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం
2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా
దినోత్సవం
4: భారత నౌకాదళ దినోత్సవం
5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం
6: పౌర రక్షణ దినం
7: సైనికదళాల పతాక దినం,
అంతర్జాతీయ పౌర విమానయాన
దినోత్సవం
8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం
జలాంతర్గాముల దినోత్సవం
9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం
10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం.
ప్రపంచ జంతువుల హక్కుల దినం
11: యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం
12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం
14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
15: ఇంటర్నేషనల్ టీ డే
17: పెన్షనర్స్ డే
18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,
మైనారిటీ హక్కుల దినం (్భరతదేశం)
19: గోవా విముక్తి దినోత్సవం.
22: ప్రపంచ గణిత దినం
23: కిసాన్ దినోత్సవం
24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే
26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
31: వరల్డ్ స్పిరిట్యువల్ డే.

ఆధారము: తెలుగుపథం బ్లాగ్

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు

ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల ఫీజుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు!! ఇక.. ఏ కోర్సు అయినా పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలంటే ఆ మొత్తం మరింత ఎక్కువే !! ఇలాంటి పరిస్థితుల్లో సైతం...తక్కువ ఖర్చుతో కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంది! నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ.. మరో వైపు స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్‌లు పొందొచ్చు. అంతేకాదు.. ఆయా కోర్సుల ద్వారా ఉజ్వల కెరీర్‌ను సైతం సొంతం చేసుకోవచ్చు. ఇందుకు మార్గం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్‌స్టిట్యూట్‌లు. ఉన్నత విద్య.. ఉన్నత వర్గాలకే పరిమితం అనేది నిన్నటి మాట. ఇప్పుడు ప్రతిభ, అకడమిక్ నైపుణ్యాలు ఉంటే బ్యాచిలర్స్ డిగ్రీనుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వరకు అన్ని కోర్సులను స్వల్ప వ్యయంతో పూర్తి చేయొచ్చు. వచ్చే విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు, అవి అందించే కోర్సులపై ప్రత్యేక ఫోకస్...

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో బ్యాచిలర్స్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అంది స్తోంది. ఆయా కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్/యూజీసీ -సీఎస్‌ఐ ఆర్ నెట్/జెస్ట్ తదితర ఎంట్రెన్స్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది. ఆయా కోర్సుల కు ఫీజులు నామమాత్రమే. అంతేకాకుండా స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. దాంతో విద్యార్థు లకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కోర్సులు అభ్యసించే అవకాశం లభిస్తోంది.కోర్సుల వివరాలు..

బ్యాచిలర్‌‌స ఆఫ్ సైన్స్(రీసెర్చ్)
బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులను రీసెర్చ్ దిశగా నడిపించాలనే ఉద్దేశంతో రూపొందించిన కోర్సు ఇది. నాలుగేళ్ల కోర్సులో విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లలో ఒక సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకుని రీసెర్చ్ చేయొచ్చు.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు:
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత.
జేఈఈ-మెయిన్ స్కోరు; జేఈఈ-అడ్వాన్స్‌డ్ స్కోర్, ఏఐపీఎంటీ ర్యాంకు.
ఫీజులు:
ప్రతి ఏటా రూ. 20 వేలలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్స్: కేవైపీవై, జేఈఈ(మెయిన్, అడ్వాన్స్‌డ్), ఏఐపీఎంటీ ర్యాంకు పొందినవారికి ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీని కింద నెలకు రూ.4000 నుంచి రూ.5 వేల వరకు అందిస్తారు.

పీజీ కోర్సులు
కోర్సులు:
ఎంఈ/ఎంటెక్/మాస్టర్ ఆఫ్ డిజైన్/మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్‌‌స డిగ్రీ/బీఆర్‌‌క/బీడిజైన్ ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్/సీడ్/క్యాట్/జీమ్యాట్‌లలో ర్యాంకు ఆధారంగా.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
కోర్సులు:
బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్.
అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత; బీఈ ఉత్తీర్ణులు మ్యాథమెటికల్ సెన్సైస్ ప్రోగ్రాంకే అర్హులు.
ప్రవేశం: జామ్‌లో ర్యాంకు ఆధారంగా.

రీసెర్చ్ ప్రోగ్రామ్స్
కోర్సులు:
పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ ఇంజనీరింగ్.
అర్హత: సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఫార్మసీ/ వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చర్ /హ్యుమానిటీస్‌లో పీజీ లేదా ఎంఈ/ ఎంటెక్/ ఎంఆర్క్ ఉత్తీర్ణత. పీజీ ఔత్సాహికులు నిర్దేశించిన కోర్సుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశం: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా యూజీసీ-నెట్; లేదా డీబీటీ జేఆర్‌ఎఫ్ లేదా ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్; లేదా జెస్ట్ లేదా గేట్ ఎంట్రెన్స్‌లలో ప్రతిభ ఆధారంగా.

కోర్సులవారీగా ఫీజుల వివరాలు
పీహెచ్‌డీ:
ఏడాదికి రూ.16,800.
ఎమ్మెస్సీ(ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్: ఏడాదికి రూ.13,300; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దాదాపు యాభై శాతం మేరకు రాయితీ ఉంటుంది.

స్కాలర్‌షిప్‌లు

  • ఇన్‌స్టిట్యూట్‌లోని రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ అర్హతతో ప్రవేశించిన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు; ఎంటెక్/ఎంఈ అర్హతతో ప్రవేశం పొందితే నెలకు రూ.18 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అభ్యర్థులు వారి అకడమిక్ అర్హతల ఆధారంగా నెలకు రూ.10 వేలు; రూ.16 వేలు; రూ.18 వేలు స్కాలర్‌షిప్ పొందొచ్చు.
  • ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్ కోర్సుల విద్యార్థులకు నెలకు రూ.8 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.

వెబ్‌సైట్: www.iisc.ernet.in

ఐఐఎస్‌ఈఆర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్).. ప్యూర్ సైన్స్ విభాగంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లివి. దేశవ్యాప్తంగా ఐదు (మొహాలి, తిరువనంతపురం, పుణె, కోల్‌కతా, భోపాల్) క్యాంపస్‌లలో ఇంటర్మీడియెట్ అర్హతతోనే డ్యూయల్ డిగ్రీ కోర్సులు చేసే అవకాశం లభిస్తోంది. వివరాలు..

బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ
అర్హత:
60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (ఎస్‌ఏ స్ట్రీమ్) అర్హత లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత. ఈ రెండు అర్హతలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ర్యాంకు సాధించాలి.
వ్యవధి: ఐదే ళ్లు
ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌లో రూ. 21,200 చెల్లించాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.13,200 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మేర ఫీజు రాయితీ లభిస్తుంది.
స్కాలర్‌షిప్: ఇన్‌స్పైర్ లేదా కేవైపీవై స్కీం ద్వారా నెలకు రూ. 5 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
స్పెషలైజేషన్స్:
బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్.
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లను బ్యాచిలర్స్ డిగ్రీలో చదివి ఉండటంతోపాటు 6 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులు పొందాలి. ఫిజికల్ సెన్సైస్ ఔత్సాహికులు జెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించాలి.
ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫస్ట్ సెమిస్టర్‌లో రూ.20,575, తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.15,075 చెల్లించాలి.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ.10వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.

పీహెచ్‌డీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ తదితర విభాగాలు.
అర్హత:
సంబంధిత సబ్జెక్ట్‌లు స్పెషలైజేషన్స్‌గా పీజీలో 6.5 సీజీపీఏ లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వీటితోపాటు సీఎస్‌ఐఆర్, యూజీసీ- జేఆర్‌ఎఫ్/గేట్/ఇన్‌స్పైర్ పీహెచ్‌డీ ఫెలోషిప్/ఎన్‌బీహెచ్‌ఎం ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: మొదటి సెమిస్టర్‌కు రూ.15,340, రెండు నుంచి ఆరో సెమిస్టర్ వరకు రూ. 10,840.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ. 16 వేల నుంచి రూ. 18 వేల వరకు జేఆర్‌ఎఫ్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.iiserpune.ac.in

జేఎన్‌సీఏఎస్‌ఆర్ - బెంగళూరు
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్).. సైన్స్ రంగంలో అకడమిక్, రీసెర్చ్‌పరంగా దశాబ్దాల ఘనత పొందిన ఇన్‌స్టిట్యూట్. ఈ విద్యా సంస్థ స్వల్ప మొత్తం ఫీజులతో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా పలు కోర్సులు అందిస్తూ.. స్కాలర్‌షిప్‌ల పేరిట ఆర్థిక చేయూత కల్పిస్తోంది.

ఎంఎస్ (ఇంజనీరింగ్), ఎంఎస్ (రీసెర్చ్)
అర్హత:
బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్, యూజీసీ, సీఎస్‌ఐఆర్-నెట్- జేఆర్ ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్, డీబీటీ-జేఆర్‌ఎఫ్, జెస్ట్, ఇన్‌స్పైర్‌లలో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫీజు: ఏడాదికి రూ. 3 వేల నుంచి రూ. 3.5 వేలు.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ.16 వేలు.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: మెటీరియల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్
అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ/బీఈ /బీటెక్ ఉత్తీర్ణత.
ప్రవేశం: జేఎన్‌సీఏఎస్‌ఆర్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: ఏడాదికి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల లోపు
స్కాలర్‌షిప్స్: మొదటి మూడేళ్లు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీకి లభించే ఫెలోషిప్‌లకు అర్హులవుతారు.

పీహెచ్‌డీ
ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ 20కు పైగా విభాగాల్లో పీహెచ్‌డీలను అందిస్తోంది.
ఫీజు: ఏడాదికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల లోపు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ.
స్కాలర్‌షిప్స్: మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పేరిట నెలకు రూ. 16 వేలు; మూడో ఏడాది నుంచి మూడేళ్లపాటు నెలకు రూ. 18 వేలు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్:www.jncasr.ac.in

టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్).. ఇంటర్‌డిసిప్లినరీ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ఎంటెక్/బీఈ/ బీటెక్/ఎంఎస్ ఉత్తీర్ణత.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ. 16 వేలు చొప్పున, సదరు సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాక నెలకు రూ.18 వేలు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అర్హత: బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్/ ఎంబీబీఎస్/బీఫార్మసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్/జెస్ట్/సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లలో ఉత్తీర్ణత సాధించినవారికి టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
స్కాలర్‌షిప్స్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున, మూడో ఏడాది నుంచి నెలకు రూ.18 వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
తాజా నోటిఫికేషన్: జనవరి 2015 నుంచి ప్రారంభమయ్యే పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీల్లో మిడ్ టర్మ్ ప్రవేశాలకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 21, 2014.
వెబ్‌సైట్: gsadmissions.tifrh.res.in/

హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ల్లో పరిశోధనలు, ఇతర అకడమిక్ నైపుణ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా అలహాబాద్‌లో ఏర్పాటైన హెచ్‌ఆర్‌ఐ ఫిజిక్స్‌లో పలు స్థాయిలలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. వివరాలు..

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ (ఫిజిక్స్)
అర్హత:
సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.

పీహెచ్‌డీ (ఫిజిక్స్)
అర్హత:
ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: జెస్ట్ ఉత్తీర్ణులకు ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్)
అర్హత:
సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్)
అర్హత:
55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
స్కాలర్‌షిప్స్: తొలి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ.18 వేలు చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.hri.res.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్- భువనేశ్వర్
కేంద్ర ప్రభుత్వంలోని అణు శక్తి శాఖ, ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్.. హై ఎనర్జీ ఫిజిక్స్, కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
అర్హత: ఫిజిక్స్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ.
ప్రవేశం: జెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
స్కాలర్‌షిప్స్: మొదటి ఏడాది నెలకు రూ. 16 వేల చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ. 18 వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్:www.iopb.res.in

ఆధారము: సాక్షి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate