హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / అభ్యాస డొమైన్ల బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అభ్యాస డొమైన్ల బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రము

అభ్యసనంలో ఒక రకము కన్నా ఎక్కువ కలవు. బెంజిమిన్ బ్లూమ్ అధ్యక్షతన (1956) కాలేజీల కమిటీ, విద్యాపరమైన మూడు డొమైన్ల కార్యకలాపాలని గుర్తించింది: గ్రహింపదగిన, మార్పు కలిగించేలా, సైకోమోటారు

అభ్యాస డొమైన్ల బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రము

మూడు రకాలైన అభ్యాసాలు

అభ్యసంలో ఒక రకము కన్నా ఎక్కువ కలవు. బెంజిమిన్ బ్లూమ్ అధ్యక్షతన (1956) కాలేజీల కమిటీ, విద్యాపరమైన మూడు డొమైన్ల కార్యకలాపాలని గుర్తించింది:

 • గ్రహింపదగిన: మానసిక నైపుణ్యాలు (పరిజ్ఞానం)
 • మార్పు కలిగించేలా: భావాలలో లేదా భావభరిత ప్రాంతాలలో పెరుగుదల(వైఖరి)
 • సైకోమోటారు: చేతి లేదా భౌతిక నైపుణ్యాలు (నైపుణ్యాలు)

ఉన్నత విద్య ద్వారా పని ఉత్పన్న మైనది కాబట్టి, మనము మామూలుగా ఉపయోగించే పదాలకన్నా పెద్దవిగా ఉంటాయి. డొమైన్లను వర్గాలుగా అనుకోవచ్చు. ఈ మూడు డొమైన్లను శిక్షణని ఇచ్చేవారు కె ఎస్ ఏ (పరిజ్ఞాణం, నైపుణ్యాలు మరియు వైఖరి) అని వ్యవహరిస్తారు. ఈ అభ్యసించే ప్రవర్తనల వర్గీకరణని “శిక్షణ విధాన లక్ష్యాలుగా ”అనుకోవచ్చు. అంటే, శిక్షణ తరువాత అభ్యాసం తీసుకున్నవారు కొత్త నైపుణ్యాలని, పరిజ్ఞానాన్ని మరియు/లేదా వైఖరులని పొందిఉండాలి.

కమిటి గ్రహింపదగిన మరియు మార్పు కలిగించే డొమైన్లకు ఒక విశదీకరించిన సంగ్రహాన్ని చేసింది. కాని సైకోమోటరు డొమైన్ కి మాత్రం ఎటువంటి సంగ్రాహాన్ని చేయలేదు. ఈ పొరపాటుకు వారి వివరణ ఏమిటంటే, కాలేజ్ స్థాయిలో చేతి నైపుణ్యాలని నేర్పడంలో వారికి పెద్దగా అనుభవం లేదు.

ఈ సంగ్రహం, చాలా చిన్న ప్రవర్తన మొదలుకుని చాలా క్లిష్టమైన ప్రవర్తన వరకు, మూడు డొమైన్లని చిన్నవర్గాలుగా విభజించింది. సంగ్రహించిన డివిజన్లు సంపూర్ణమైనవి కావు, విద్యాపరమైన మరియు శిక్షణా ప్రపంచంలో కనిపెట్టిన ఇతర విధానాలు లేదా తరతమ శ్రేణులు కూడా ఉన్నాయి. అయినప్పటికినీ, బ్లూమ్ వర్గీకరణ సులభంగా అర్ధమౌతుంది మరియు బహూశా ఈ రోజుల్లో చాలా విస్తారంగా అనువర్తనలో ఉన్నది.

గ్రహింపదగిన డొమైన్ ( క్షేత్రం )

పరిజ్ఞానం మరియు తెలివిగల నైపుణ్యాల వికాసం, గ్రహించే డొమైన్ లో కలిగి ఉంటాయి. నిర్దుష్ట కారణాల గుర్తింపు లేదా జ్ఞాపకం తెచ్చుకోవడం, విధానములు మరియు తెలివిగల సామర్ధ్యాలు మరియు నైపుణ్యాలు వికాసములో ఉపయోగపడే భావనలు. అవి ఆరు పెద్ద వర్గాలుగా ఉన్నాయి. చాలా చిన్న ప్రవర్తన నుండి చాలా క్లిష్ట ప్రవర్తన వరకు క్రింద ఒక క్రమంలో ఇవ్వబడినవి. వర్గాలను కష్టతరమైన దశలుగా అనుకోవచ్చు. అంటే, రెండవది నేర్చుకోకముందే మొదటి దానిని నేర్చుకోవాలి.

వర్గం ఉదాహరణలు మరియు ముఖ్యమైన పదాలు
పరిజ్ఞానం: డేటా లేదా సమాచారం జ్ఞాపకం. తెచ్చుకోవడం. ఉదాహరణలు: పాలసీ వల్లించిడం.మెమరీ నుండి ధరలని కస్టమరుకి తెలియపరచడం. సురక్షా నిబంధనలని తెలుసుకోవడం.
ముఖ్యమైన పదాలు: నిర్వచిస్తుంది, వివరిస్తుంది, గుర్తిస్తుంది, తెలుస్తుంది, లెబుల్ చేస్తుంది, జాబితా చేస్తుంది, సరిపోల్చుతుంది, పేర్కొనడం, సంగ్రహ పరుస్తుంది, జ్ఞాపకం చేస్తుంది, గుర్తిస్తుంది, తిరిగి ఉత్పన్నం చేస్తుంది, ఎంచుతుంది, చెపుతుంది.
అవగతం: అర్థము, అనువాదము అంతర్వేశనము మరియు, సూచనల మరియు సమస్యల భాషాంతరము లని అర్థం చేసుకుంటుంది. స్వంత పదాలాలో ఒకరి సమస్యని చెప్పడం. ఉదాహరణలు: వ్రాత పరీక్ష సూత్రాలని తిరిగి వ్రాస్తుంది. క్లిష్టమైన పని చేయడానికి సూచనలని తమ స్వంత పదాలలో వివరించడము. ఒక సమీకరణాన్ని కంప్యూటరు స్ప్రెడ్ షీట్ లోకి అనువదించడము.
ముఖ్యమైన పదాలు: అర్థం చేసుకుంటుంది, మారుస్తుంది, సమర్ధిస్తుంది, విచక్షణ చేస్తుంది, అంచనా వేస్తుంది, వివరిస్తుంది,పొడిగిస్తుంది, క్రమ పరుస్తుంది, ఉదాహరణలిస్తుంది, భావిస్తుంది, భాషాంతరపరుస్తుంది, అన్వయపరుస్తుంది, ఉహిస్తుంది, తిరిగి వ్రాస్తుంది, సంగ్రహపరుస్తుంది, అనువదించడము.
అనువర్తన: ఒక సంగ్రహణం యొక్క ప్రేరేపించని ఉపయోగాన్ని లేదా కొత్త పరిస్థితిలో భావం ఉపయోగించడం. తరగతిలో నేర్చుకున్న వాటిని, పని ప్రాంతాలలో కొత్త పరిస్థితులలో అనువర్తించడం. ఉదాహరణలు: ఒక ఉద్యోగస్తుని సెలవు సమయాన్ని లెక్కించడానికి ఒక మాన్యువల్ ని ఉపయోగించడం. వ్రాత పరీక్ష యొక్క విశ్వసనీయతని మూల్యాంకనం చేయడానికి సంఖ్యాశాస్త్ర సిద్ధాంతాలని అనువర్తించడము.
ముఖ్యమైన పదాలు: అనువర్తిస్తుంది, మార్పు చేస్తుంది, లెక్కిస్తుంది, నిర్మిస్తుంది, ప్రదర్శిస్తుంది, కనుగొంటుంది, చాతుర్యంతో నిర్వహిస్తుంది, సవరిస్తుంది, ఆపరేట్ చేస్తుంది, ఊహిస్తుంది, తయారు చేస్తుంది, ఉత్పన్నం చేస్తుంది, వివరిస్తుంది, చూపిస్తుంది, పరిష్కరిస్తుంది, ఉపయోగిస్తుంది.
విశ్లేషణ: మెటీరియల్ లేదా భావన లని, అంశాల భాగాలుగా చేసి, సంస్థ నిర్మాణాత్మకత అర్థం కావచ్చు కారణాలు మరియు అనుమాన ప్రమాణాలను విచక్షణ పరుస్తుంది ఉదాహరణలు: తర్కవిశ్లేషణ ద్వారా ఒక ఉపకరణం యొక్క సమస్యని తొలగించడం. తర్కములో న్యాయమైన భ్రమలని గుర్తించడం. ఒక విభాగం నుంచి సమాచారాన్ని సేకరించి, శిక్షణకి కావలసిన పనులని ఎంచుతుంది.
ముఖ్యమైన పదాలు: విశ్లేషిస్తుంది, విభజిస్తుంది, సరిపోల్చుతుంది, భేదము చూపుతుంది, బొమ్మని గీస్తుంది, కూల్చుతుంది, విభేధిస్తుంది, విచక్షణ చూపిస్తుంది, వ్యత్యాసం చూపిస్తుంది, గుర్తిస్తుంది, ఉదహరిస్తుంది, భావిస్తుంది, సంగ్రహపరుస్తుంది, వివరిస్తుంది, ఎంచుతుంది, విడదీస్తుంది.
సంయోగము: విభిన్న ఎలిమెంట్ల నుండి నమూనా లేదా నిర్మాణాన్ని నిర్మించాలి. కొత్త అర్థాన్ని లేదా నిర్మాణాన్ని సృష్టించేలా భాగాలని కలిపి పెట్టి మొత్తంగా ఏర్పరచాలి. ఉదాహరణలు: ప్రోసెస్ మాన్యువల్ లేదా కంపెనీ ఆపరేషన్లను వ్రాయాడం. ఒక నిర్ధిష్టమైన పనిని చేయడానికి ఒక మెషీన్ ని రూపొందించడం. ఒక సమస్యని పరిష్కరించడానికి అనేక మూలముల నుండి శిక్షణని సమన్వయ పరచాలి. ఫలితాన్ని మెరుగుపరచడానికి విధానాన్ని సవరించడం.
ముఖ్యమైన పదాలు: వర్గీస్తుంది, కలుపుతుంది, సంగ్రహ పరుస్తుంది, కూర్చుతుంది, సృష్టిస్తుంది, రూపొందిస్తుంది, రూపకల్పన చేస్తుంది, వివరిస్తుంది, పుట్టిస్తుంది, సవరిస్తుంది, నిర్వహిస్తుంది, ప్రణాళిక చేస్తుంది, తిరిగి నిర్మిస్తుంది, వివరిస్తుంది, తిరిగి నిర్వహిస్తుంది, సవరిస్తుంది, తిరిగి వ్రాస్తుంది, సంగ్రహిస్తుంది, చెపుతుంది, వ్రాస్తుంది.
మూల్యాంకనం చేయడం: నిర్దుష్ట ఆలోచనల లేదా మెటీరియల్ విలువల సరియైనవా కావా అని నిర్ధారించడం. ఉదాహరణలు: అత్యంత ప్రభావితమంతమైన పరిష్కారాన్ని ఎంచడం. అత్యంత అర్హతగల అభ్యర్ధిని ఉద్యోగములో పెట్టడం. కొత్త బడ్జెట్ ని వివరించి సమర్ధించడము.
ముఖ్యమైన పదాలు: వివరిస్తుంది, పోల్చుతుంది, సమాప్తం చేస్తుంది, భేదిస్తుంది, విమర్శిస్తుంది, ఆక్షేపణ చేస్తుంది, సమర్ధిస్తుంది, వివరిస్తుంది, విభేదిస్తుంది, మూల్యాంకనం చేస్తుంది, వివరిస్తుంది, భాషాంతరం చేస్తుంది, సమర్ధించడం, వివరిస్తుంది, సంగ్రహపరుస్తుంది, మద్దతు ఇస్తుంది.

మార్పుకలిగించే డొమైన్

మార్పుకలిగించే డొమైన్ (క్రాత్ఓల్, బ్లూమ్, మాసియా, 1973) లో భావనలు, విలువలు, ప్రశంస, ఆశక్తులు, ప్రచోదనలు మరియు వైఖరిలు వంటి ఉద్వేగ భరితమైన వాటిలో మనము వ్యవహరించడం ఉన్నాయి. అవి ఐదు పెద్ద వర్గాలు, చాలా చిన్న ప్రవర్తన నుండి చాలా క్లిష్ట ప్రవర్తన వరకు జాబితాలో ఇవ్వబడినవి.

వర్గం ఉదాహరణలు మరియు ముఖ్యమైన పదాలు

అనుభవము పొందడం : పరిజ్ఞానం, వినే ఆసక్తి, ఎంపిక చేసిన ధ్యానము

ఉదాహరణలు: మర్యాద పూర్వరంగా ఇతరులని వినడము. కొత్తగా పరిచయం చేసిన వ్యక్తులను వినడం మరియు వారి పేరులను గుర్తు పెట్టుకోవడము
ముఖ్యమైన పదాలు: అడగుడం,, ఎంచుడం, వివరించడం, అనుసరించడం, ఇస్తుంది, పట్టుకుంటుంది, గుర్తిస్తుంది, ఎక్కడుందో చెప్పుతుంది, పేరు పెడుతుంది, చూపిస్తుంది, ఎంచుతుంది కూర్చుంటుంది, నిలబెడుతుంది, జవాబిస్తుంది, ఉపయోగిస్తుంది.

అనుభవానికి ప్రతిస్పదించడం: అభ్యాసకుల భాగంలో చురుకుగా పాల్గొనడం. ఒక ప్రత్యేకమైన అనుభవానికి హజరయ్యి ప్రతిస్పందించడం. అభ్యాసం వలన ప్రతిస్పదించడంలో పాటించడాన్ని నొక్కి వక్కాణించడం ప్రతిస్పందించ డానికి ఆసక్తి చూపడం లేదా ప్రతిస్పందించడంలో సంతృప్తి        (ప్రేరణ)

ఉదాహరణలు: తరగతుల సంభాషణలో పాల్గొనడం, ప్రెజెంటేషన్ ఇవ్వడం. కొత్త ఆశయాలని, భావనలని, నమూనాలని మొదలైనవాటిని అర్థంచేసుకోవడానికి ప్రశ్నించడం సంరక్షణ నిబంధనలని తెలుసుకోవడం మరియు వాటిని అభ్యసించడం.
ముఖ్యమైన పదాలు: జవాబిస్తుంది, సహకరిస్తుంది, సహాయం చేస్తుంది, పాటిస్తుంది, నిశ్చయంగా చెపుతుంది, మాట్లాడుతుంది, పలకరిస్తుంది, సహాయ పడుతుంది, లేబుల్ చేస్తుంది, నిర్వహించడం, అభ్యసిస్తుంది, సమర్పిస్తుంది, చదువుతుంది, వల్లిస్తుంది, నివేదిస్తుంది, ఎంచుతుంది, చెపుతుంది, వ్రాస్తుంది.

విలువనివ్వడం:
ఒక నిర్దుష్టమైన వస్తువుకి, అనుభవానికి లేదా ప్రవర్తనకి ఒక వ్యక్తి విలువని ఆపాదించడం. ఈ విలువలపై మామూలు అంగీకార సంకల్పం నుండి చాలా ఎక్కువ క్లిష్టమైన సంకల్పం ధరకు ఉంటుంది. నిర్దుష్టమైన విలువల అంతర్గత పరచడం మీద విలువ చేయడం, మరి ఈ విలువల ఆధారాలు, అభ్యసించే వారి బహిరంగ ప్రవర్తన వ్యక్తపరుస్తాయి మరియు అవి తరచుగా గుర్తించబడతాయి.

ఉదాహరణలు: డెమోక్రేటిక్ విధానంలో నమ్మకాన్ని ప్రదిర్శిస్తుంది. వ్యక్తిగతమైన మరియు సంస్కృతి పరమైన వ్యత్యాసాలు (భిన్నత్వ విలువ) సునిశితంగా ఉంటాయి. సమస్యలని పరిష్కరించడానికి సామర్ధ్యం చూపిస్తుంది. సామాజిక వికాసానికి ప్రణాళికని ప్రతిపాదిస్తుంది మరియు సంకల్పంతో అనుసరిస్తుంది. బలంగా భావించే విషయాలని యాజమాన్యానికి తెలియ పరుస్తుంది.
ముఖ్యమైన పదాలు: పూర్తి చేస్తుంది, ప్రదర్శిస్తుంది, వ్యత్యాసం చూపిస్తుంది, వివరిస్తుంది, అనుసరిస్తుంది, ఏర్పరుస్తుంది, ప్రారంభిస్తుంది, ఆహ్వానిస్తుంది, కలుపుతుంది, సమర్ధిస్తుంది, ప్రతిపాదిస్తుంది, చదువుతుంది, నివేదిస్తుంది, ఎంచుతుంది, పాలుపంచుకుంటుంది, చదువుతుంది, పని చేస్తుంది.

నిర్వహణ: విభిన్న విలువలని భేదించడం, వాటి మధ్య వ్యత్యాసాలని పరిష్కరించడం ద్వారా మరియు ప్రత్యేకమైన విలువ విధానాన్ని సృష్టించడం ద్వారా ప్రయారిటీల విలవలని నిర్వహిస్తుంది

ఉదాహరణలు: స్వేచ్ఛ మరియు భాధ్యతాయుతమైన ప్రవర్తనల మధ్య సమీకరించే అవసరాన్ని గుర్తిస్తుంది. ఒకరి ప్రవర్తనకి భాధ్యత వహిస్తుంది. సమస్యలని పరిష్కరించడంలో క్రమమైన ప్రణాళిక పాత్రని వివరిస్తుంది. వృత్తి పరమైన నీతి పరమైన ప్రమాణాలు అంగీకరిస్తుంది. సామర్ధ్యాలు, ఆసక్తులు మరియు నమ్మకాల లో గల సామరస్యతతో జీవిత ప్రణాళికని సృష్టిస్తుంది. సంస్ధ, కుటుంబ మరియు సొంత అవసరాలని తీర్చడానికి సమయాన్ని అగ్రప్రాధాన్యతను బట్టి కేటాయిస్తుంది.
ముఖ్యమైన పదాలు: అనుసరిస్తుంది, మార్చుతుంది, సమ కూర్చుతుంది, కలుపుతుంది, సరిపోల్చుతుంది, పూర్తి చేస్తుంది, సమర్ధిస్తుంది, వివరిస్తుంది, సూత్రీకరిస్తుంది, క్రమ పరుస్తుంది, గుర్తిస్తుంది, సమన్వయ పరుస్తుంది, సవరిస్తుంది, ఉత్వర్వు ఇస్తుంది, నిర్వహిస్తుంది, తయారు చేస్తుంది, వివరిస్తుంది, సంయుక్త పరుస్తుంది.

విలువలని అంతర్గతం చేయడం (వర్ణన చేయడము): వారి ప్రవర్తనని నియంత్రించే విలువ విధానం ఉంది. ఈ ప్రవర్తన వ్యాపించేదిగాను, నిలకడైనదిగాను, ఊహించదగే విధంగాను ఉండి, అంతకన్నా ముఖ్యంగా, అభ్యసించే వారి లక్షణంగా ఉంటుంది. సూచన పరమైన లక్ష్యాలు, విద్యార్ధుల సామాన్య నమూనాల సర్దుబాటుకి సంబంధించి ఉంటాయి (వ్యక్తిగత, సామాజిక, ఉద్వేగభరిత).

ఉదాహరణలు: స్వతంత్రంగా పని చేసేటప్పుడు, ఆత్మ విశ్వాసం చూపిస్తుంది. సామూహిక పనులలో సహకరిస్తుంది. (టీమ్ వర్కు ప్రదర్శిస్తుంది). సమస్య పరిష్కారంలో విశేషమైన మార్గాన్ని ఉపయోగిస్తుంది. రోజూ వారీగా నీతిదాయకమైన అభ్యాసానికి వృతిపరమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. కొత్త సాక్ష్యాలు తెలిసినప్పుడు, న్యాయాలని సవరిస్తుంది మరియు ప్రవర్తనని మారుస్తుంది. వ్యక్తులు అంతర్గత గుణాన్ని. బట్టి విలువనిస్తుంది కాని వారి బాహ్యా రూపాన్ని దానిని బట్టి కాదు.
ముఖ్యమైన పదాలు: పనిచేస్తుంది, విభేధిస్తుంది, ప్రదర్శిస్తుంది, ప్రభావితం చేస్తుంది, వింటుంది, సవరిస్తుంది, చేస్తుంది, అభ్యసిస్తుంది, ప్రతిపాదిస్తుంది, అర్హతనిస్తుంది, ప్రశ్నిస్తుంది, మార్చుతుంది, సేవచేస్తుంది, పరిష్కరిస్తుంది, సరిచూస్తుంది.

సైకోమోటర్ డోమైన్

సైకోమోటర్ డొమైన్: కదలిక, సానుకూలత యంత్ర-నైపుణ్యాలని ఉపయోగించడాలని సైకోమోటర్ డొమైన్ లో (సింప్సన్, 1972) ఉన్నాయి. ఈ నైపుణ్యాల వికాసానికి అభ్యాసం అవసరము. వీటిని వేగము, నిర్ధిష్టత, దూరము, విధానములు లేదా నిర్వహించడంలో టెక్నిక్ ల ద్వారా కొలుస్తారు. ఏడు పెద్ద వర్గాలని చాలా చిన్న వర్గము నుండి చాలా పెద్ద క్లిష్ట వర్గములుగా జాబితా చేసారు

వర్గము ఉదాహరణలు మరియు ముఖ్యమైన పదాలు

భావన: యంత్రప్రక్రియను చేపట్టే  సంవేదిక సంజ్ఞలు ఉపయోగించి సామర్ధ్యం. ఇందులో సంవేదిక ప్రేరణ నుండి, సంజ్ఞ ఎంపిక, అనువాదము వరకు ఉంటుంది.

ఉదాహరణలు: క్రియలేని వర్తమాన సంజ్ఞలని పసి గడుతుంది. బంతి విసిరిన తరువాత అది ఎక్కడ పడు తుందో అంచనా వేసి, ఆ బంతిని పట్టుకోవడానికి సరియైన చోటుకి కదులుతుంది. అహారాన్ని రుచి చూసి, మరియు వాసన ద్వారా పొయ్యి వేడిని సరియైన ఉష్ణోగ్రతకు సర్దుబాటు చేస్తుంది. పేల్లెట్ మరియు ఫోర్క్ లను పోల్చడం ద్వారా పోర్కులిఫ్ట్ యొక్క ఫోర్క్ ఎత్తుని సర్దుబాటు చేస్తుంది.
ముఖ్యమైన పదాలు: ఎంచుతుంది, వివరిస్తుంది, పసి గడుతుంది, విభేధపరుస్తుంది, తారతమ్య పరుస్తుంది, గుర్తిస్తుంది, విడి పరుస్తుంది, వివరిస్తుంది, ఎంచుతుంది.

సెట్: చర్య తీసుకోవడానికి తయారుగా ఉండడం. ఇందులో మానసిక, భౌతిక మరియు ఉద్వేగభరిత సెట్ లు ఉన్నాయి. విభిన్న పరిస్థితులకు ఒక వ్యక్తి ప్రతిస్పందన ముందుగా కనుగొనే స్వభావాలు ఈ మూడు సెట్ లు. (కొన్ని సార్లు మైండ్ సెట్ అంటారు)

ఉదాహరణలు: తయారీ విధానంలో సూచనల క్రమం మీద చర్య తీసుకుంటుంది మరియు తెలుసు కుంటుంది. ఒకరి సామర్ధ్యాలని మరియు పరిమితులని గుర్తిస్తుంది. కొత్త విధానాన్ని నేర్చుకోవడానికి కోరిక చూపిస్తుంది (ప్రేరణ)
గమనిక: ఈ సైకోమోటర్ సబ్ డివిజన్, అనుభవానికి ప్రతిస్పందన మార్పు కలిగించే డొమైన్ సబ్ డివిజన్ కి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.
ముఖ్యమైన పదాలు: ప్రారంభిస్తుంది, ప్రదర్శిస్తుంది, వివరిస్తుంది, కదులుతుంది, ముందుకు వెళుతుంది, ప్రతి చర్య చేస్తుంది, చూపుతుంది, చెపుతుంది, తనకు తానే చేస్తుంది.

మార్గదర్శక ప్రతిస్పందన: అనుకరణ, ప్రయత్నం మరియు తప్పు సవరింపులు క్లిష్టమైన నైపుణ్యం నేర్చుకోవడంలో మొదటి దశలు.
అభ్యసించడం ద్వారా చాలినంత నిర్వర్తనని సాధించడం.

ఉదాహరణలు: చూపిన విధంగా గణాంక సమీకరణాన్ని చేయడం. నమూనాని నిర్మించడానికి సూచనలను అనుసరించడం. ఫోర్కు లిఫ్ట్ ని ఆపరేట్ చేసేటప్పుడు, సంబోధకుని చేత సంజ్ఞలకి ప్రతిస్పందిస్తుంది
ముఖ్యమైన పదాలు: కాపీ చేస్తుంది, కనుక్కొంటుంది, అనుసరిస్తుంది, ప్రతిచర్య చేస్తుంది,తిరిగి ఉత్పన్నం చేస్తుంది, ప్రతిస్పందిస్తుంది.

మెకానిజమ్: క్లిష్టమైన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో ఇది మధ్యస్ధదశ. నేర్చుకున్న ప్రతిస్పందనలు అలవాటు గా మారుతాయి మరియు కొంత విశ్వాసం మరియు సమర్ధతతో కదిలిక లని చేయవచ్చు.

ఉదాహరణలు: పెర్సనల్ కంప్యూటరుని ఉపయోగించడం. కారే కుళాయిని మరమత్తు చేయడం. కారుని నడపడం.
ముఖ్యమైన పదాలు: కూర్చుతుంది, క్రమాంక పరుస్తుంది, నిర్మిస్తుంది, విప్పుతుంది, ప్రదర్శిస్తుంది, కట్టి వేస్తుంది, బిగిస్తుంది, నలగగొడుతుంది, వేడిచేస్తుంది,  చాతుర్యంతో నిర్వహిస్తుంది. కొలుస్తుంది, మెరుగుపరుస్తుంది, కలుపుతుంది, నిర్వహిస్తుంది, బొమ్మ గీస్తుంది.

క్లిష్టమైన బాహాటమైన ప్రతిస్పందన: క్లిష్టమైన నమూనా కదలిక ఉండేయంత్ర చర్యల నైపుణ్యంగల నిర్వర్తన. కనీస శక్తి అవసరమయ్యే త్వరితమైన, ఖచ్చిత మైన మరియు ఎక్కువ సానుకూల పరిచే నిర్వర్తన ద్వారా సూచించిన ప్రావీణ్యత. సంకోచం లేకుండా చేయడం మరియు స్వతహాగా చేయడం ఈ వర్గం లో ఉన్నాయి. ఉదాహరణకి, క్రీడాకారు లు తరచుగా సంతృప్తితో ధ్వనులు చేస్తారు లేదా వారు టెన్నిస్ బాల్ ని కొట్టినప్పుడు వెంటనే అర్థంలేని పదాలని పలుకుతారు. ఎందుకంటే ఏ ఫలితాన్ని ఇస్తుందో, చర్య యొక్క భావన ద్వారా వారు చెప్పగలరు.

ఉదాహరణలు: ఇరుకైన సమాంతర పార్కింగ్ స్పాట్ లోనికి కారుని తీసుకుని వెళ్ళడం, త్వరగా, ఖచ్చితంగా కంప్యూటర్ ని ఆపరేట్ చేయడం. పియానోని వాయించినప్పుడు సమర్ధతని ప్రదర్శించడం
ముఖ్యమైన పదాలు: కూర్చుతుంది, నిర్మిస్తుంది, క్రమాంక పరుస్తుంది, విడదీస్తుంది, బిగిస్తుంది, కట్టివేస్తుంది, నలగగొడుతుంది, వేడి చేస్తుంది, నేర్పుతో నిర్వహిస్తుంది, కొలుస్తుంది, మెరుగుపరుస్తుంది, కలుపుతుంది, నిర్వహిస్తుంది, బొమ్మగీస్తుంది.
గమనిక: ముఖ్యమైన పదాలు మోకానిజం పదాలు లాగానే ఉంటాయి కాని నిర్వర్తన త్వరితంగా, మెరుగుగా మరింత ఖచ్చితంగా మొదలైన వాటిని సూచించే క్రియా విశేషణము లేదా విశేషణములు ఉంటాయి.

ఇమిడిక: నైపుణ్యాలు బాగా వికసింప బడినవి మరియు ప్రత్యేకమైన అవసరాలకి కదలిక నమూనాలని ఎవరైనా మార్చవచ్చు.

ఉదాహరణలు: ఊహించని అనుభవాలకి ప్రభావితంగా ప్రతిస్పందిస్తుంది. అభ్యాసకుల అవసరాలు తీర్చడానికి సూచనని సవరిస్తుంది. మొదటగా దానికోసం కాని మెషీన్ తో పనిని చేయడం (మెషీన్ పాడవ్వలేదు మరియు కొత్త పనిని చేయడంలో ప్రమాదము లేదు).
ముఖ్యమైన పదాలు: ఇమిడ్చుతుంది, మారుస్తుంది, సవరిస్తుంది, తిరిగి ఏర్పాటు చేస్తుంది, తిరిగి నిర్వహిస్తుంది, సవరిస్తుంది, మారుతుంది.

సృష్టి: ప్రత్యేకమైన పరిస్థితిని లేదా నిర్దుష్టమైన సమస్యని కుదర్చడానికి, కొత్త కదలిక నమూనాలని సృష్టించడం. బాగా వికాసం చెందిన నైపుణ్యాలని బట్టి సృజనాత్మకతని అభ్యాస ఫలితాలు ప్రస్పుటం చేస్తాయి.

ఉదాహరణలు : ఒక కొత్త సిద్ధాంతాన్ని నిర్మిస్తుంది. ఒక కొత్త మరియు పూర్తి శిక్షణ ప్రోగ్రాములని అభివృద్ధి చేస్తుంది. ఒక కొత్త జెమ్నాస్టిక్ రొటీన్ ని సృష్టిస్తుంది.
ముఖ్యమైన పదాలు: ఏర్పాటు చేస్తుంది, నిర్మిస్తుంది, కలుపుతుంది, కూర్చుతుంది, కడుతుంది, సృష్టిస్తుంది, రూపొందిస్తుంది, ప్రారంభిస్తుంది, చేస్తుంది, పుట్టిస్తుంది.

ఇతర సైకోమోటార్ డొమైన్స్

ఇంతకు ముందు తెలిపిన విధంగా, సైకోమీటర్ డొమైన్ నమూనా కోసం కమిటీ సంగ్రహాన్ని సమర్పించలేదు, కాని ఇతరులు సమర్పించారు. పైన చర్చించిన వాటిలో ఒకటి సింప్సన్ (1972). రెండు ఇతర ప్రఖ్యాతిగాంచిన వెర్షన్ లు ఉన్నాయి:

డేవ్ స్ (1975):

 • అనుకరణ: ఒకరి ప్రవర్తనని గమనించి నమూనా చేయడం. నిర్వర్తన చాలా తక్కువ నాణ్యత కలిగి ఉండవచ్చు. ఉదాహరణ: ఆర్ట్ పనిని కాపీ చేయడం.
 • చాతుర్యంతో నిర్వహించడం: సూచనలు అనుసరించడం మరియు అభ్యాసం చేయడం ద్వారా కొన్ని పనులు చేయగలగడం పాఠాలని తీసుకున్న లేదా వాటి గురించి చదివిన తరువాత, స్వంతంగా పనిని సృష్టించడం.
 • నిర్ధిష్టత: మెరుగుపరచడం, మరింత సరిగా చేయడం. కొన్ని తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఉదాహరణ : పలుసార్లు ప్రయత్నించి ఒక పనిని సరియైన పద్ధతిలో చేయడం.
 • భావప్రకటన: పనుల శ్రేణులని సానుకూలపరచడం, సామరస్యతని మరియు అంతర్గత నిలకడని సాధించడం. ఉదాహరణలు: సంగీతం, డ్రామా, రంగు, ధ్వని మొదలైనవి ఉండే వీడియోని నిర్మించడం.
 • సహజత్వం: అధిక స్థాయి నిర్వర్తన కలిగి ఉండడం సహజమౌతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించడం అవసరం లేకుండా. ఉదాహరణలు : మైఖేల్ జోర్డాన్ బాస్కెట్ బాల్ ఆడడం, నేన్సీ లోపెజ్ గోల్ఫ్ బాల్ కొట్టడం మొదలైనవి.

హేరో (1972):

 • ప్రతివర్తిత కదలికలు – అభ్యసించని ప్రతిచర్యలు.
 • ప్రాధమికమైన కదలికలు – నడవడం లేదా గ్రహించడం వంటి ప్రాధమిక కదలికలు.
 • దృష్టి – కనిపించే, వినిపించే, కైనీస్థెటిక్ లేదా స్పర్సకి సంబంధించిన విభేదము వంటి ప్రేరణకి ప్రతిస్పందన.
 • శారీరక సామర్థ్యములు – బలము మరుయు చురుకుతనము వంటి మరింత వికాసానికి శరీరపుష్టిని అభివృద్ధి చేయాలి.
 • నైపుణ్యంగల కదలికలు – క్రీడలలో లేదా నటనలో చూసిన విధంగా అభివృద్ధి చెందిన అభ్యసించిన కదలికలు.
 • డిస్కర్సివ్ కాని కమ్యూనికేషన్ – భావ సూచనలు మరియు ముఖ కవళికలు వంటి ప్రభావితమైన బాడీ లాంగ్వేజ్. (శరీర భావ సూచన) శారీరక భాష

సవరించిన బ్లూమ్ వర్గీకరణ

బ్లూమ్ మాజీ విద్యార్థి అయిన లోరిన్ ఏండర్సన్, 90 ల మధ్యలో వర్గీకరణ అభ్యాసంలో గ్రహించే డొమైన్ ని తిగిగి పరిశీలించి, కొన్ని మార్పులు చేసాడు. వాటిలో రెండు ముఖ్యమైనవి ఏమిటంటే, 1) ఆరు వర్గాలలో పేరులను నామవాచకం నుండి క్రియ రూపాలలోకి మార్చడం మరియు 2) వాటిని తిరిగి అమర్చడం.

ఈ కొత్త వర్గీకరణ మరింత చురుకైన బహుశా ఖచ్చితమైన ఆలోచనని ప్రతిబింబింస్తుంది:

ఆధారము: www.nwlink.com

2.99152542373
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు