లాటిన్ భాషా పదాలైన సైన్షియా లేదా సిరే అనే పదాల నుంచి ‘సైన్‌స’ అనే పదం వచ్చింది. సైన్షియా అంటే జ్ఞానం అని అర్థం. దీని ప్రకారం విజ్ఞానశాస్త్రం అంటే క్రమబద్ధమైన విజ్ఞానం అని అర్థం. కార్‌ల పియర్సన్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వ చరిత్ర, అందులోని జీవ ప్రపంచం ఒక ముడి పదార్థం.
శాస్త్రం = పద్ధతులు + జ్ఞానం
= ప్రక్రియ + ఫలితం
= జ్ఞానం + జ్ఞానం సముపార్జించే మార్గం
= శాస్త్రీయ పద్ధతి+శాస్త్రీయ వైఖరి+ శాస్త్రం
1) శాస్త్రం అనుభవాత్మకం
2) శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యం
3) శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైంది
4) శాస్త్రీయ జ్ఞానం అసమానమైంది
5) శాస్త్రీయ జ్ఞానం పునరావర్తనమై ఉంటుంది
6) శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైంది
7) శాస్త్రం విలువలతో కూడింది
శాస్త్రీయాభివృద్ధి శాస్త్రీయ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది.
శాస్త్రీయాభివృద్ధి తెలిసిన దాని నుంచి తెలియని దానికి, సులభం నుంచి క్లిష్టమైన దానికి, సరళం నుంచి సంక్లిష్టతకు మూర్తం నుంచి అమూర్తానికి జరుగుతుంది.
వ్యవసాయ రంగంలో ఆధునిక పోకడలు, పరిశోధనా రంగంలో మార్పులు, రవాణా సాధనాలు, ప్రసార రంగంలో ప్రగతి, ప్రకృతి సమస్యల నివారణ, సాంఘిక సమస్యలు, జనాభా నియంత్రణ, పేదరిక నిర్మూలన.
ఇవి రెండు రకాలు. అవి 1.సంశ్లేషాత్మక నిర్మాణం, 2.ద్రవ్యాత్మక నిర్మాణం
1.సంశ్లేషాత్మక నిర్మాణం:
దీంట్లో ప్రక్రియలు, పద్దతులు, వైఖరులు ఉంటాయి.
2.ద్రవ్యాత్మక నిర్మాణం:
1. యథార్థాలు
2. భానవలు
3. సూత్రాలు
4. నియమాలు
5. సిద్ధాంతాలు
ఉదా: కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి.
చర్య జరిగే విధానాన్ని అనుసరించి రసాయన చర్యలు అనేక రకాలు.
పరికల్పన - రకాలు
శూన్య పరికల్పన - నీటి లోతుకు పీడనానికి సంబంధం లేదు.
ప్రకటనాత్మక పరికల్పన: ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం కురవడానికి సంబంధం ఉంది.
ప్రాగుక్తి పరికల్పన: ఆకాశం మేఘావృతం అయింది. కాబట్టి వర్షం రావచ్చు.
ప్రశ్న పరికల్పన: ఆకాశం మేఘావృతం అయితే వర్షం పడుతుందా?
సిద్ధాంతం: అయస్కాంత సిద్ధాంతాలు, కాంతి స్వభావ సిద్ధాంతాలు.
నియమాలు: న్యూటన్ నియమం, ద్రవ్యనిత్యత్వ నియమం.
సూత్రం: ఆర్కిమెడిస్ సూత్రం.
ప్రయోగం: ఓమ్ నియమ నిరూపణ, ఫారడే నియమాల ప్రయోగం.
1. సాంఘిక విలువలు
2. ఉత్తేజాన్ని కలిగించే విలువ
3. క్రమశిక్షణా విలువ
4. సృజనాత్మక విలువ
5. వివరణాత్మక విలువ
6. నైతిక విలువ
7. ఉన్నత విద్య, వృత్తివిద్యకు భూమిక
8. ఉన్నత జీవితానికి భూమిక
9. సాంస్కృతిక విలువ
10. సౌందర్యాత్మక విలువ
11. బౌద్ధిక విలువ
12. విరామ సమయం వ్యాపకం
ఆధారము: భౌతిక, రసాయన బోధనాపద్దతులు, తెలుగు అకాడమి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020