హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / సమ్మిళిత పాఠశాలలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సమ్మిళిత పాఠశాలలు

సమాజంలోని బాలబాలికలందరిలో ఒకే పాఠశాల విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మన పాఠశాలలలో కార్యరూపంలో కనిపించవు.అందుకే సమ్మిళిత విద్య అవసరం.

పరిచయం

సమాజంలోని బాలబాలికలందరిలో ఒకే పాఠశాల విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మన పాఠశాలలలో కార్యరూపంలో కనిపించవు. ప్రస్తుతం మన పాఠశాలలో అన్ని రకాలు, వర్గాల పిల్లలు చేరుతున్నప్పటికీ బాలకార్మికులు, బలహీన వర్గాల పిల్లలను ఇతర వర్గాల పిల్లలతో సమానంగా చూడకుండా ఉపాధ్యాయులు, తలిదండ్రులు మరియు సమాజం కూడా వీరిని ప్రత్యేకంగా చూడడం మనం గమనించవచ్చు.

సాధారణంగా పాఠశాలలో చదివే ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, బడికి దూరమై ఉన్న పిల్లలు, బాల కార్మికులుగా ఉన్న పిల్లలు, వివిధ బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుతున్నప్పటికీ వారిని ప్రత్యేకంగా చూడడమే జరుగుతుంది కాని ఇతర పిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించబడడం లేదు. వీరికి ఎంత చెప్పినా చదువురాదు అనే భావనతో ఉపాధ్యాయులు వీరి పట్ల శ్రద్ధ కనపరచడం లేదు. సాధారణంగా పిల్లలతో వీళ్ళను కలపడం వాళ్ళ సాధారణ పిల్లల యొక్క ప్రగతి కూడా కుంతుపడుతుండానే అపోహా అక్లిగి ఉన్నారు. బాలలకు ఉన్న హక్కులను విస్మరించడంవల్ల సరైన అవకాశాలను కల్పించకపోవడం.

సమ్మిళిత పాఠశాలల ఆవశ్యకత

సమ్మిళిత పాఠశాల ఆవశ్యకత నేటి సమాజంలో ఎంతో అవసరముంది.

 • అన్ని రకాలకు, వర్గాలకు చెందినా పిల్లలందరూ పాఠశాలలో చేరడం పాఠశాలలో కొనసాగేలా చేయడం.
 • ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించి ‘మేమూ నేర్చు కోగలం.’ అనే నమ్మకాన్ని కలిగించడం.
 • బాలల హక్కులను పరిరక్షించడం.
 • మధ్యలో బడి మానివేసిన, సొంత కారణాల చేత బడికి దూరంగా ఉన్న పిల్లలందరికీ చడుకొనే అవకాశం కల్పించడం.
 • చదువులో వెనకబడిన వారికి చేయూత అందించడం.
 • లింగ వివక్షత లేకుండా చదువు అందరికి సమానమే అనే భావన కల్పించడం.
 • కుల, మత, వర్గ బేధం లేకుండా అందరికి సమానమైన అవకాశాలు, నాణ్యమైన విద్యను అందించడం.
 • HIV/AIDS వంటి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న విద్యార్ధులకు సమాన విద్యావకాశాలు కల్పించడం.
 • వలసప్రాంత విద్యార్ధులకు, పట్టణప్రాంతంలోని బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు, సాధారణ పాఠశాలలకు చెందిన విద్యను పొందే అవకాశం కల్పించడం.
 • బహుభాషా నేపధ్యాలు గల పిల్లలందరికీ భాషావివక్షత లేకుండా విద్యను అభ్యసించేలా చేయడం.
 • ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనే భావన లేకుండా అందరూ సమానమే అన్న భావనను పెంపొందించడం.
 • పిల్లల్లో ఆత్మన్యూనతా భావాన్ని  తొలగించి వారిని సమర్దులుగా తయారు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం.
 • పిల్లల్లో సహకారం, కలసిపనిచేయడం, ఇతరులపట్ల సహానుభూతి కలిగి ఉండడం వంటి విలువలను పెంపొందించడం.
 • పిల్లలు స్వేచ్చాయుత వాతావరణంలో పాల్గొంటూ విద్యను అభ్యసించడం.
 • పిల్లలందరూ పాఠశాలలోని బోధనేతర కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర వహించేలా చూడడం.

ముగింపు

 • పాఠశాలలలో పిల్లలందరికీ సమ్మిళిత విద్యని అందించడం వలన సమాజంలోని పిల్లలందరూ సమాన విద్యావకాశాలను పొంది సమానంగా అభివృద్ధి చెందుతారు.
ఆధారము:apscert
3.03
మహేందర్ Nov 18, 2019 05:59 PM

విద్య యొక్క భాగస్వామ్యం ఎవరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు