অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బోధించుట మరియు నేర్చుకొనుట

బోధించుట మరియు నేర్చుకొనుట

 1. నిర్మాణాత్మక సిధ్ధాంతం
  1. సంగ్రహం
  2. అవకాశం/ అన్వయం
  3. నియమములు
 2. అనుభవాత్మకమైన అభ్యాసం
  1. సంగ్రహం
  2. రోజర్స్ ప్రకారం, అభ్యాసాన్ని ఎప్పుడు ఇవ్వాలంటే
  3. అమలు పరచుట
  4. నియమములు
 3. గ్రహించడం ద్వారా అభ్యసించడం
  1. గ్రహించడాన్ని ఎలా నేర్చుకుంటాము?
 4. సంభోధన మరియు నేర్పించే వ్యూహరచనలు
  1. ఉపదేశము యొక్క 6ఈ + ఎస్ మోడల్
  2. రోల్-ప్లేయింగ్ & సిమ్యులేషన్స్ (నటించడం & అనుకరించడం)
  3. బహు వయస్సులుగలవారి తరగతికి భోధించడం
  4. సహకారంతో నేర్చుకోవడం
  5. అభ్యసనా శైలిలు – రకాలు
   1. దృశ్యమాన అభ్యాసకులు (చూడటం ద్వారా అభ్యసించటం
   2. శ్రవణసంబంధమైన అభ్యాసకులు (వినటం ద్వారా అభ్యసించటం)
   3. శారీరక/పనిచేస్తూఅభ్యసించేవారు/స్పర్శ సంబంధమైన కదలికలు (పనిచేస్తూ మరియు స్పర్శద్వారా అభ్యసించటం)
  6. ఉపాధ్యాయుల కరదీపిక

బోధించుట మరియు నేర్చుకొనుట అనేది అనేక అంశాలతో కూడుకున్న ప్రక్రియ. లక్ష్యం కొరకు శ్రమించేటప్పుడు, కొత్త జ్ఞానం, ప్రవర్తన అలవరచుకొనేటప్పుడు, మరియు నైపుణ్యం వంటివి వారు నేర్చుకునే అనుభవాలకు నైపుణ్యం తోడైనప్పుడు అభ్యాసకులకు ఈ విభిన్న చలనరాసులు ఒక దానికొక్కటి పనిచేస్తాయి.

గత శతాభ్ధంలో అభ్యసించుట మీద వివిధ రకాలైన ధృక్పధాలు ఉద్బవించినవి. వాటిలో గ్రహించడం ద్వారా (మానసికంగా నేర్చుకొనుట) మరియు కన్ స్ట్రక్టివిస్ట్ (అభ్యసించునప్పుడు కలుగు జ్ఞానము). ఈ రెండు సిద్ధాంతములను విడివిడిగా చూచుట కంటే, అభ్యాస అనుభవంలో అవకాశము ఉన్న వీటిని కలిపి ఉపయోగించుట మంచిది. ఈ సమైక్యతా పద్ధతిలో, కొన్ని అంశములను ముఖ్యముగా పరిగణలోకి తీసుకోవాలి – గ్రహించే పధ్ధతి, నేర్చుకునే విధానం, మన వివిధ తెలివి తేటల స్వభావాలు మరియు అభ్యసించుట. అభ్యసించడం అనేది వివిధ రకములైన నాగరికతల నుండి వచ్చువారికి మరియు ప్రత్యేకమైన అవసరం కలిగిన వారికి సంబంధించినది.

నిర్మాణాత్మక సిధ్ధాంతం

(జె. బ్రూనర్)

"విద్యార్థికి ఉన్న జ్ఞానము,నమ్మకములు,నైపుణ్యముల నుండి సాధించునది నిర్మాణాత్మకంగా నేర్చుకునే వ్యూహరచన. నిర్మాణాత్మకమైన ప్రయత్నంతో, విద్యార్థులు కొత్త సమాచారము మరియు ముందుగా నేర్చుకున్న వాటి నుండి కొత్త అవగాహన అలవర్చు కుంటారు."

నిర్మాణాత్మక సిధ్ధాంతాన్ని నేర్పించేగురువు, విద్యార్థులకు సమస్యలను ఇచ్చి , వాటిని సాధించు విధానమును పర్యవేక్షించి , విద్యార్థులు నేర్చుకునే విధానమునకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి కొత్త ఆలోచనా నమూనాలని ప్రోత్సహిస్తారు.చాలావరకు ముడి డేటా, ప్రాథమిక వనరులు మరియు మెటీరియల్, నిర్మాణాత్మకమైన అభ్యాసం,విద్యార్థుల్ని వారి స్వంత డేటాతో పని చేయమని మరియు వారి స్వంత కొత్త పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించడం నేర్చుకుంటారు. చివరిగా, ఆర్జించిన మరియు వికసిస్తున్న విజ్ఞానము అని విద్యార్థులు తమ అభ్యాసముతో గ్రహిస్తారు. నిర్మాణాత్మక ధృక్పధము పెద్దవారితో సహా అన్ని వయస్సుల అభ్యాసుకులకి బాగా పనిచేస్తాయి.

సంగ్రహం

బ్రూనర్ యొక్క సిద్ధాంతపరమైన నిర్మాణంలో ముఖ్య విషయము ఏమనగా, అభ్యాసకులు తమకున్న ప్రస్తుత/పూర్వ జ్ఞానం ఆధారంగా సరికొత్త ఆలోచనలు,కల్పనలు నిర్మించగలరు. అభ్యాసకులు, సమాచారాన్ని ఎన్నుకొని మరియు మార్చి, ప్రతిపాదన చేసి, నిర్ణయములు తీసుకుంటాడు. అలాచేయడానికి గ్రహణ స్ట్రక్చరుపై ఆధారపడతారు. ఈ గ్రహణ స్ట్రక్చరులు (స్కీమా, మెంటల్ మోడల్) ఆ అభ్యాసకునికి అర్థాన్ని,అనుభవాలకి సంస్థను మరియు ప్రతి అభ్యాసకుడు ఇచ్చిన సమాచారం కన్నా అధిగమించడానికి వీలు కలుగుతుంది.

ఆదేశానికి సంబంధించినంత వరకు, భోధకుడు విధ్యార్ధులను తమకు తామే నియమాలను కనుగొన డానికి ప్రయత్నించేలా ఉత్సాహపరచవలెను.భోధకుడు మరియు విద్యార్థి చురుకుగా సంభాషించు కోవాలి (అంటే సోక్రేటిక్ అభ్యాసం). బోధకుడు, అప్పటికిగల విద్యార్థి గ్రాహకశక్తికి తగినట్లుగా నేర్చు కొనుటకు వీలగు ఫార్మేట్ లో నేర్చుకొనే సమాచారాన్ని మార్చాలి. భోధకుడు తన విధ్యార్థికి తెలిసి యున్న విషయములపై నిరంతరంగా నేర్చుకొనుటకు కొత్తగా భోధించబోవు పాఠ్యాంశములను సర్పిలాకారముగా ఉంచవలెను.

బ్రూనర్ 1966 భోధన సూత్రములు 4 ముఖ్య అంశాలను కలిగి ఉండవలెనని చెప్పారు.

 • చదువు పై ప్రత్యేక ఆసక్తి.
 • విధ్యార్థి వెను వెంటనే గ్రహించుటకు విజ్ఞానసూత్రములు నిర్మించుట.
 • విషయమును మిక్కిలి ప్రభావ శీలముగ సమర్పించుట.
 • శిక్షలు మరియు బహుమతులను ఇచ్చుటలో క్రమపధ్ధతిని అనుసరించుట.

విజ్ఞానమును క్రమపధ్ధతిలోఉంచుటకు మంచి విధానములను అనుసరించుట వలన సమాచారంను సూక్ష్మీకరించుటకు కొత్త ప్రతిపాదనలను కనుగొనుటకు, ఆ సమాచారాన్ని ఎక్కువ గా మార్చవచ్చు.

బ్రూనర్ (1986 , 1990, 1996) ఇటీవల కాలంలో తన సిద్ధాంతపరమైన విధానాలని విస్తరించి సామాజిక , మరియు సాంస్కృతిక విషయముల అభ్యాసాలను మరియు చట్టాల అభ్యాసాన్ని కూడా ఉంచాడు.

అవకాశం/ అన్వయం

బ్రూనర్ యొక్క నిర్మాణాత్మక సిధ్ధాంతం, గ్రహించే అధ్యయనం ఆధారంగా భోధనకుపయోగించు సాధారణ నియమం. ఈ సిధ్ధాంతము చాలావరకు పిల్లల అభివృద్ధి పరిశోధనతో ముడిపడింది. (ముఖ్యంగా పియాగెట్). బ్రూనర్ 1960 లో సూచించబడిన విషయములు సైన్స్ మరియు గణిత అభ్యాసములపై దృష్టి నిలిపిన ఒక సమావేశములోనుండి పుట్టినవి. ఆ విధముగా బ్రూనరు బాలురకు ఉద్దేశించిన గణిత మరియు సైన్స్ ప్రోగ్రాములలో తన సిధ్ధాంతమును విశదీకరించాడు. రీజనింగ్ పద్ధతులకు మూలక అభివృద్ధి పరిధిలో బ్రూనర్ గుడ్ నౌ , ఆస్టన్ 1951 నందు వివరించబడినది. బ్రూనర్ 1983 చిన్న పిల్లలకు భాష నేర్పించడం పైననే కేంద్రీకరించాడు .

తత్వ శాస్త్రము మరియు సైన్స్ నిర్మాణాత్మాకమైన ఒక సువిశాలమైన భావన విధానమని గుర్తించవలెను. బ్రూనర్ సిధ్ధాంతం ఒక ప్రత్యే,కమైన ధృక్పధాన్ని తెలియచేస్తుంది.

ఉదాహరణ: ఈ ఉదాహరణ బ్రూనర్ 1973 నుండి గ్రహింపబడినది.

"నిర్మాణము ద్వారా, పూర్తి చేసిన వరుసలు, దొంతులలో గుప్పెళ్ళ కొలది గింజలను పెట్టడం సాధ్యపడదని గ్రహించినప్పుడు బాలుడు ఈ ప్రధాన సంఖ్యల అంశము సులువుగా అర్థం చేసుకో వచ్చని అనిపిస్తుంది. అటువంటి పరిమాణాలని ఒక ఫాల్ లో ఉంచుట గాని లేదా అసంపూర్ణమైన వరుస-దొంతుల డిజైన్ లో గాని ఉంచాలి. ఎప్పుడూ ఒకటి అదనంగా గాని లేదా మరికొన్ని గాని నింపడానికి డిజైన్ లో ఉండవచ్చును. ఈ పధ్ధతులను ప్రధానమైనవిగా పిలువబడునని ఆ బాలుడు నేర్చుకుంటాడు. ఇచ్చట నుండి మల్టిపుల్ టేబుల్ కి వెళ్ళడం చాలా సులువు. మల్టిపుల్ టేబుల్ అనేది పూర్తైన మల్టిపుల్ వరుసలు , దొంతుల పరిమాణముల పత్రమని బాలుడు గుర్తిస్తాడు.ఇక్కడ నిర్మాణంలో ఉన్న భాగాహారం,గుణకారం మరియు ప్రధాన సంఖ్యలని చూడవచ్చును "

నియమములు

 • అనుభవములు,సంధర్భములు విద్యార్థికి ఇష్టానికి సంబంధించినవిగా ఉండి నేర్చుకొనేలా భోధన ఉండాలి (సంసిద్ధత)
 • విధ్యార్థి సులువుగా అర్ధమగునట్లు భోధనను నిర్మించవలెను (స్పైరల్ ఆర్గనైజేషన్)
 • విస్తరణ సౌలభ్యం ఉండేటట్లు మరియు లేదా ఖాళీలను పూరించడానికి వీలగునట్లు భోధనను రూపొందించవలెను.(ఇచ్చిన సమాచార పరిధిని దాటి)

ఆధారము: tip.psychology.org/bruner.html

అనుభవాత్మకమైన అభ్యాసం

సి. రోజర్స్

అనుభవాత్మకమైన అభ్యాస సిధ్ధాంతం, అభ్యసించే విధానం యొక్క హోలిస్టిక్ మోడల్ మరియు మల్టిలీనియర్ మోడల్ని ఇస్తాయి. ఈ రెండూ, ప్రజలు ఏ విధముగా అభ్యసించి , ఎదిగి మరియు అభివృద్ధి చెందుతారో వాటికి అనుగుణంగా ఉంటాయి. అభ్యసించు విధానములో అనుభవము యొక్క పాత్రను నొక్కి చెప్పుటకు, మిగిలిన అభ్యాసన సిధ్ధాంతముల నుండి అనుభవాత్మకమైన అభ్యాసన సిధ్ధాంతం యొక్క తేడాను గుర్తించే ఈ సిధ్ధాంతాన్ని “అనుభవాత్మక మైన అభ్యాసం” అంటారు. అందువలనే, స్పందన కన్నా గ్రహించడాన్ని నొక్కి చెప్పే “గ్రహించడం ద్వారా అభ్యసించే సిధ్ధాంతం” మరియు అభ్యసించే విధానంలో విశేషమైన అనుభవం యొక్క భూమికని కాదనే “ప్రవర్తన ద్వారా అభ్యసించే సిధ్ధాంతం” రెండింటి నుండి అనుభవాత్మకమైన అభ్యాస సిధ్ధాంతం యొక్క తేడాని గుర్తించడానికి “అనుభవాత్మకమైన” అనే పదాన్ని ఉపయోగిస్తారు.

అభ్యాసాన్ని, అనుభవాత్మకమైన అభ్యాస సిధ్ధాంతం “అనుభవాల పరివర్తన ద్వారా పరిజ్ఞాన్నాన్ని సంపాదించే విధానం” అని నిర్వచిస్తుంది. అనుభవాలని గ్రహించి మరియు పరివర్తనమవడాన్ని మేళవించడం ద్వారా పరిజ్ఞాన్నాన్ని పొందవచ్చు.

సంగ్రహం

రెండు రకాల అభ్యాసాల యొక్క తేడాల్ని రోజర్స్ గుర్తించాడు: గ్రహించడం (అర్థంలేని) మరియు అనుభవాత్మకమైనది (ముఖ్యమైన). ముందుది శబ్ధ సంగ్రహం లేదా గుణకార పట్టికల వంటి విద్యా పరమైన పరిజ్ఞానానికి మరియు తరువాతది, కారుని మరామ్మత్తు చేయడం గురించి చెప్పే అనువర్తన పరిజ్ఞానానికి సంబంధించినది.

అనుభవాత్మకమైన అభ్యాసం యొక్క ముఖ్యమైన ప్రత్యేకత, అభ్యాసకుల అవసరాలు మరియు కోరికల్ని గుర్తించడం. అనుభవాత్మకమైన అభ్యాసం యొక్క ఈ లక్షాణాలని రోజర్స్ జాబితాలో పెట్టాడు:స్వంతంగా నిమగ్నమవడం, తమకుతాము ముందుకు రావడం, అభ్యాసకులతో నాణ్యత పెంచుకోవడం, అభ్యాసకులమీద మరియు వ్యాప్తిచెందే ప్రభావాలు.

అనుభవాత్మకమైన అభ్యాసం రోజర్స్ కి వ్యక్తిగతమైన మార్పు మరియు పెరుగుదల రెండూ ఒకటే. అభ్యసించే సహజమైన అభిలాష మానవులందరికీ ఉంటుందని రోజర్స్ భావిస్తాడు.

అటువంటి అభ్యాసాన్ని ఇవ్వడం ఉపాధ్యాయుల పాత్ర..ఇవి ఏమిటంటే:

 • అభ్యాసానికి వాస్తవమైన వాతావరణాన్ని కల్పించాలి.
 • అభ్యాసకుల ఉద్దేశ్యాలని స్పష్టంచేయాలి.
 • అభ్యాస వనరులని దొరికేలాచేసి నిర్వహించాలి.
 • అభ్యాసం యొక్క తెలివితేటల మరియు భావభరితమైన అంశములను సంతులనం చేయాలి.
 • అభ్యాసకుల మనోభావాలని మరియు ఆలోచనలని పంచుకోవాలి గాని అధికారం చూపించకూడదు

రోజర్స్ ప్రకారం, అభ్యాసాన్ని ఎప్పుడు ఇవ్వాలంటే

 • విద్యార్థి అభ్యాస విధానంలో పూర్తిగా పాల్గొంటాడు మరియు దాని స్వభావం, మార్గదర్శ కత్వంమీద నియంత్రణ కలిగి ఉంటాడు.
 • ఇది ప్రాధమికంగా ప్రయోగాత్మక,సామాజిక,వ్యక్తిగత లేదా పరిశోధన సమస్యలమీద నేరుగా ఆధారపడుతుంది. మరియు
 • అభివృద్ధి లేదా విజయాన్ని అంచనాని, స్వంతంగా నాణ్యతని పెంచడం ముఖ్యమైన పద్ధతి. అభ్యాసంకోసం అభ్యాసం చేయడం మరియు మార్పులకు నిష్కపటంగా ఉండడం ముఖ్యమైనవని రోజర్స్ కూడా నొక్కి చెపుతారు.

అమలు పరచుట

అనుభవాత్మకమైన అభ్యాసం చాలా సమర్థవంతమైన విద్య విధానం.ఎక్కువ వ్యక్తిగత స్థాయిలో ప్రతి ఒక్కరి అవసరాలు మరియు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని అభ్యాసకులని అభ్యాసంలో పెడుతుంది. అనుభవాత్మకమైన అభ్యాసానికి తమకుతాము ముందుకు రావడం, తమకుతాము నాణ్యతని కట్టుకోవడం వంటి లక్షణాలు కావాలి. అనుభవాత్మకమైన అభ్యాసం సమర్థవంతగా ఉండాలంటే లక్ష్యాన్నినిర్ణయించడం దగ్గర నుంచి ప్రయోగం చేయడం మరియు గమనించడం, పర్యవేక్షణ,చివరిగా పనుల ప్రణాళిక వరకూ మొత్తం అభ్యాస చక్రాన్ని ఉపయోగించాలి. ఈ మొత్తం విధానం కొత్త నైపుణ్యాలని, కొత్త వైఖరులని లేదా మొత్తానికి కొత్తగా ఆలోచించే విధానాలని అభ్యాసించడానికి వీలుకల్పిస్తుంది.

మనం పిల్లలుగా ఉన్నపుడు ఆడిన ఆటలని గుర్తుచేసుకోండి? టీమ్ యాజమాన్యం, కమ్యూనికేషన్ మరియు నాయకత్వం వంటి అనేక విలువైన విద్యాపరమైన మరియు సామాజిక నైపుణ్యాలని తొక్కుడు బిళ్ళాట వంటి సాధారణమైన ఆటలు భోధిస్తాయి. ప్రయోగాత్మకమైన అభ్యాస కిటుకులుగా ఆటలు ప్రాముఖ్యమవడానికి తమాషాగా ఉండడమే కారణం - తమాషాగా అభ్యసించడం ద్వారా ఎక్కువ కాలం అభ్యాసాలని గుర్తుపెట్టుకోవడానికి అభ్యాసకునికి దోహద పడుతుంది.

అభ్యాస విధానంలో అనుభవం యొక్క ముఖ్యమైన పాత్రని చాలామంది ఉపాధ్యాయులకి తెలుసు. నవ్వుతోకూడిన మరియు అభ్యాసల సామర్థ్యాలు తమాషా అయిన అభ్యాసించే వాతావరణంలో, సమర్థవంతమైన ప్రయోగాత్మకమైన అభ్యాస వాతావరణం పెరుగుతుంది. కొత్త పరిజ్ఞాన్నాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి మరియు సమాచారాన్ని చాలా కాలం వరకూ జ్ఞాపకం పెట్టుకోవడానికి, ప్రతి ఒక్కరుని అనుభవంలో నేరుగా తమకుతామే నిమగ్నమవడానికి ప్రోత్సాహించడం ముఖ్యం.

నియమములు

 • విద్యార్థి తమ స్వంత అభిరుచిలకు సంబంధించిన విషయాలు అర్థవంతంగా నేర్చుకోవడం జరుగుతుంది.
 • బహిర్గత భయాలు తక్కువగా ఉన్నపుడు, తమని భయపెట్టే విద్య (ఉదా: కొత్త వైఖరులు లేదా ఉద్దేశ్యాలు )ని ఎక్కువ సులువుగా అర్థం చేసుకోవచ్చు.
 • తమకి భయం తక్కువగా ఉన్నపుడు నేర్చుకోవడం, త్వరగా సాగుతుంది.
 • స్వతహాగా ప్రారంభించే విద్య ఎక్కువ సేపు మరియు విస్తృతంగా ఉంటుంది.

గ్రహించడం ద్వారా అభ్యసించడం

గమనించడం , ఉపదేశాన్ని తీసుకోవడం మరియు ఇతరుల ప్రవర్తనని అనుసరించడం ద్వారా మనుష్యులు సమర్ధవంతంగా నేర్చుకుంటారు. వినడం , చూడడం మరియు ముట్టుకోవడం లేదా అనుభవముతో వచ్చేది ‘గ్రహించడం ద్వారా అభ్యసించడం’. ఇది ఇతరుల్ని అనుసరించడంలో పరిమితం కాకుండా, పరిజ్ఞాన్నాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన విధానము. మా వెబ్ సైస్స్ట్ ని చదవడం ద్వారా ఏమి నేర్చుకుంటారన్నది శిక్షణ ఎప్పుడూ వివరించదు. గ్రహించడం ద్వారా అభ్యసించడం యొక్క ప్రాముఖ్యతని ఈ విద్య స్పష్టపరుస్తుంది. మానసికంగా లేదా గ్రహణ పధ్ధతుల ద్వారా, సమాచారాన్ని నేర్పుతో తారుమారు చేసే మన బుర్రలో ఉన్న పధ్ధతుల ద్వారా పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని పొందడాన్ని ‘గ్రహించడం ద్వారా అభ్యసించడం’ అంటారు. సాకారమైన వస్తువుల మరియు సంఘటనల యొక్క మనో చిత్రాలని సృష్టించడం మరియు సమాచారాన్ని ఫ్రోసెస్ చేసే ఇతర విధానాలు, గ్రహించే విధానాలలో కలిగి ఉంటాయి.

గ్రహించడాన్ని ఎలా నేర్చుకుంటాము?

గ్రహించడం ద్వారా అభ్యసించే విధానంలో, వినడం , చూడడం , ముట్టు కోవడం చదవడం లేదా అనుభవం ద్వారా మరియు దానిని అపుడు ప్రోసెస్ చేసి మరియు సమాచారాన్ని జ్ఞాపకం చేసు కోవడం ద్వారా నేర్చుకుంటారు. మోటారు సంబంధమైన కదలిక లేకపోవడంతో ఈ నేర్చుకునే విధానం స్తబ్ధత కూడినదిగా కనిపించవచ్చు. అయినప్పటకినీ , కొత్తగా వచ్చిన సమాచారాన్ని ప్రోసెస్ చేసి మరియు గుర్తించుకోవడంద్వారా నేర్చుకునేవారు ‘గ్రహించే విధానం’లో చాలా చురుకుగా ఉంటారు.

గుర్తులు, విలువలు, నమ్మకాలు మరియు నియమాలతో కూడిన క్లిష్టమైన సాంప్రదాయాన్ని ‘గ్రహించడం ద్వారా అభ్యసించే విధానం’ సృష్టించి మరియు పంపేలా మనల్ని చేస్తుంది. మానవ ప్రవర్తన యొక్క చాలా అవస్థలలో గ్రహించే కార్యములు ఉండటంవలన , ‘గ్రహించడం ద్వారా అభ్యసించడం’ ఒక్క మనుష్యలలోనే సంభవిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికినీ , వివిధ రకాలైన చాలా జంతువుల యొక్క జాతులు చూడడం ద్వారా నేర్చుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, జంతు ప్రదర్శనశాలలోని ఒక కోతి అప్పుడప్పుడూ మానవ సందర్శకులనీ లేదా ఇతర కోతులను అనుకరిస్తాయి.

సంభోధన మరియు నేర్పించే వ్యూహరచనలు

ఉపదేశము యొక్క 6ఈ + ఎస్ మోడల్

6ఈ(6E)లు మరియు ఎస్(S)(Engage - ఒప్పందము, Explore - వెదకు, Explain - వివరించు, Elaborate - విడమర్చిచెప్పు, Evaluate – పరీక్షించి, Extend - విస్తరించు మరియు Standards - ప్రమాణాలు) సంభోధన యొక్క నిర్మాణాత్మక మోడల్ ఆధారంగా మరియు విద్యా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సంప్రదించి అభివృద్ది చేసిన పాఠ్యాంశాల ప్రణాళిక పార్మాట్ . విద్యార్థులు ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానాన్ని మించి కొత్త పరిజ్ఞానాన్ని పొందడానికి పాఠ్యాంశాల ప్రణాళికలని రూపకల్పన చేశారు. ఈ పాఠ్యాంశాల ప్రణాళికలు ప్రణాళికల యొక్క విభాగాల మరియు పనులలో సంభోధన యొక్క నిర్మాణాత్మాక సంభోధన మోడల్ మీద ఆధారపడి ఉంటాయి.

ప్రతి 6 ఈ లు నేర్చుకునే దశలని వివరిస్తాయి మరియు ప్రతి దశ ‘ఈ(E)’ అనే అక్షరముతో ప్రారంభ మవుతుంది. Engage - ఒప్పందము, Explore - వెదకు, Explain - వివరించు, Elaborate - విడమర్చిచెప్పు, Evaluate - పరీక్షించి మరియు Extend – విస్తరించు.ఇదివరకటి పరిజ్ఞానం మరియు అనుభవాన్ని ఉపయోగించి నిర్మించడానికి, అర్థాన్ని కట్టడానికి, మరియు వారి భావనలపై వారి యొక్క అర్థం చేసుకునే సమర్ధతని నిరంతరంగా అంచనా వేయడానికి విద్యర్థులు మరియు ఉపాధ్యాయులు సాధారణ పనుల అనుభవం పొందడానికి ఈ 6 ఈ లు అనుమతిస్తాయి.

ఎంగేజ్ (Engage-ఒప్పందము) : ఈ ‘ఒప్పందము’ అనే చర్య గత మరియు ప్రస్తుతము నేర్చుకునే అనుభవాల్ని సంయుక్త పరచాలి. చర్యలని ముందుగా తెలుసుకుని, ప్రస్తుతము చర్యల యొక్క విద్యా ఫలితాలపై విద్యార్థుల ఆలోచనలమీద కేంద్రీకృతం చేయాలి. కల్పన, విధానము లేదా నేర్చు కోవలసిన నైపుణ్యములలో విద్యార్థులు మానసికంగా నిమగ్నమవ్వాలి. ప్రతి పాఠ్యాంశ ప్రణాళిక ఒక ‘ముఖ్యమైన ప్రశ్న’ని కలిగి ఉంటుంది.ఇది వారి విచారణకు ఆధారం. మామూలుగా ఎక్స్ ప్లోర్ (వెదకు) విభాగంలో పరిశోధనల మార్గదర్శకత్వంలో దోహదపడడానికి ఈ విభాగం కొన్ని ముఖ్య మైన ప్రశ్నలని కలిగి ఉంటుంది.

ఎక్స్ ప్లోర్ (Explore-వెదకు): ఇందులో విద్యార్థులు చాలా జాగ్రత్తగా విషయాల్ని పరిశోధిస్తారు. ముఖ్యమైనది ఏమిటంటే, ఏవిధమైన నిర్భంధం లేకుండా మెటీరియల్ని నేర్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వబడుతుంది.ఎక్కువ మార్గదర్శకత్వాన్ని ఇవ్వనక్కర్లేదు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను, విద్యార్థుల్ని అడుగుతూ, వారి సంభాషణల్ని వింటూ ఉపాధ్యాయులు విద్యార్థులకి కొంత మార్గదర్శకత్వాన్ని ఇస్తూ వారు ఆ పని మీద ఉండేటట్లు చూడాలి.

ఎక్స్ ప్లేన్ (Explain-వివరించు): విద్యార్థులు వారు వెదికే కల్పనలని వివరించడానికి ఈ దశ దోహదపడుతుంది.వారు అర్థంచేసుకున్న కల్పనల్ని చెప్పడానికి లేదా కొత్త నైపుణ్యాల్ని లేదా ప్రవర్తనల్ని చూపించడానికి అవకాశాలు ఉంటాయి. క్రమబద్ధమైన పదాలు,నిర్వచనాలు మరియు కల్పనలు, విధానాలు, నైపుణ్యాలు లేదా ప్రవర్తనల వివరణలని చెప్పడానికి ఉపాధ్యాయులకు అవకాశాన్ని కూడా ఈ దశ కల్పిస్తుంది.

ఎలాబొరేట్ (Elaborate-విడమర్చిచెప్పు): ఇందులో విద్యార్థులు అప్పగించిన పనిని నేరుగా చేయ గలుగుతారు. కొత్త సమాచారాన్ని అనువర్తించడాన్ని మరియు వారు కనుగొన్న వాటిని లేదా ముగింపులను ఇతరులకు చూపించడానికి ఇది అవకాశం. మెటీరియల్ నాణ్యత తెలుసు కునేందుకు మెటీరియల్ని అప్పగించడానికి, ప్రెజెంటషన్లు చేయడానికి మరియు అప్పగించిన పనిని లేదా ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఇది మంచి సమయం.

ఎవాల్యుఏట్ (Evaluate-నాణ్యత పెంచటం) : నాణ్యత పెంచటం ఈ విధానంలో నిరంతంరంగా జరిగే దైనప్పటికీ, ఉపాధ్యాయులు ఈ విభాగంలోనే ఇప్పటివరకు జరిగిన అభ్యాసాన్ని నాణ్యతని పెంచుతారు. సాధారణంగా విద్యార్థులు ఒప్పగించిన పనిని ఇప్పుడే ఇస్తారు.ఈ దశలో, స్వంతంగా నాణ్యతని కట్టడం, గ్రూపు నాణ్యతని పెంచటం మరియు అలా చేయడానికి కావలసిన స్వంత సాధనాలని అభివృద్ధి చేసేలా విద్యార్థుల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం.

ఎక్స్ టెండ్ (Extend-విస్తరించు) : ఈ పాఠములకు విద్యార్థుల్ని పరిమితంకాకుండా ఉండే సూచన లని ఈ విభాగం కలిగి ఉంది. వారు కనుగొన్న వాటిని ఇతరుల దగ్గరకి తీసుకు రావడానికి లేదా వారు అర్థం చేసుకున్నదాన్ని కొత్త మరియు తెలియని పరిస్థితులలో అనువర్తించే విధానాలని పరిశీలించడానికి ఉద్దేశించబడింది. సాధారణంగా, వారు పూర్తిచేసిన దానివలన వచ్చిన ఉత్సాహం నుంచి ఈ విధమైన చర్య ఎక్కువ అవుతుంది. విద్యార్థులు వారి పనిని పోటీతో ప్రవేశ పెట్టాలని లేదా వారి ప్రదర్శనలని తమ స్వంత పాఠశాల బయట స్థానాలకి తీసుకు వెళ్ళాలని ఉపాధ్యాయు లు విద్యార్థులకి మెల్లగా సలహా ఇవ్వాలని అనుకొన్నప్పటికీ,ఈ విభాగం ఎక్కువగా విద్యార్థులతో చేయబడుతుంది.

స్టేండర్డ్స్(Standards-ప్రమాణాలు) : ప్రస్తుతము పాఠ్యాంశ ప్రణాళిక నుండి పాఠ్యాంశ ప్రణాళికకి ఈ ప్రమాణాలని సంయుక్త పరుస్తున్నారు. ఈ విభాగంలో, రాష్ట్ర, దేశ మరియు/ లేదా జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉంటాయి. ఇది ప్రాధమికంగా ఉపాధ్యాయులకి సమాచారం ఇస్తుంది. స్థానిక బోర్డు,జిల్లా లేదా పాఠశాల సంగ్రహంలో పాఠ్యాంశాలని చేర్చడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలి.

ఆధారము: www.nortellearnit.org

రోల్-ప్లేయింగ్ & సిమ్యులేషన్స్ (నటించడం & అనుకరించడం)

నటించడం & అనుకరించడం వంటి నేర్పించే వ్యూహరచనలు విద్యార్థులకి అకస్మాత్తుగా చూపించినపుడు బాగా పనిచేస్తాయి. అయినప్పటికిని, రోల్ ప్లే ప్రభావితంగా ఉపయోగించడానికి సన్నాహము,మంచిగా నిర్వచించిన ఫార్మేట్,స్పష్టంగా నిర్వచించిన ఉద్దేశ్యము మరియు ఫలితాలు, సిమ్యులేషన్ తరువాత పరిశీలనకి సమయం అవసరం. విద్యార్థులకి వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఉపయోగించి ఎకాయెకిగా చెప్పడానికి రోల్-ప్లేయింగ్ & సిమ్యులేషన్స్ అవసరం. ఈ విధానంలో సూక్ష్మమైన ఆలోచన మరియు సహకారంతో నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. వైఖరులను మరియు తత్వాలని స్పష్టీ కరించడంలో దోహదపడడానికి,వియుక్త భావాలకి మరియు వాస్తవ ప్రపంచ సంఘటనలకి మధ్య సంబంధము చేయడానికి ఈ నేర్పించే సాధనాలు ప్రభావితంగా ఉంటాయి.

బహు వయస్సులుగలవారి తరగతికి భోధించడం

బహు వయస్సులుగలవారి తరగతిలో, నేర్చుకొనేవారి యొక్క భిన్నత్వాన్ని ఉపయోగించి శిక్షణని వృద్ధిచేస్తారు.అంశాల వారీగా యూనిట్లు నిర్వహించబడతాయి. విద్యార్థులు ప్రతీ గ్రేడ్ స్థాయిలో, యూనిట్లలో విభిన్నమైన అప్పగించిన పనుల మీద పని చేస్తారు. విభిన్న వయస్సులు మరియు సమర్థత స్థాయిలు గల విద్యార్థుల మధ్య భేధాల్నివిలువనిస్తూ శిక్షణా వాతావరణంలో ఒకరికొకరికి సహాయ పడేలా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తారు. సహకరిస్తూ చేసే పనిలో, కొత్తగా నేర్చుకునే వారికి పాత విద్యార్థులు రోల్ మోడల్స్ గా మరియు గురువులుగా ఉంటారు.

బహు వయస్సులుగలవారి తరగతిలో వివిధ రకాలైన శిక్షణ మరియు అంచనా వ్యూహరచనల్ని ఉపయోగించి, మృదువైన గ్రూపు నమూనాలని ఉపయోగించడానికి, నిర్దుష్టమైన నేర్పించే ఉద్దేశ్యాలని ఇనుమడింప చేయడానికి, చురుకుగా అందరు విద్యార్థుల్ని పాల్గొనేలా చేయడానికి, తమకి మరియు ఇతరులకి మర్యాదనిచ్చే వాతావరణాన్ని పెంపొందించడానికి, విభిన్న వయస్సు గల విద్యార్థుల్ని సంభోధించడానికి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహిస్తారు.

సహకారంతో నేర్చుకోవడం

పరిశోధించిన శిక్షణ వ్యూహరచనలలో సహకారంతో నేర్చుకోవడం అనేది ఒక మంచి వ్యూహరచన. కలిసి నేర్చుకునే అవకాశం ఉన్న విద్యార్థులు తొందరగా, ఎంతో సమర్థవంతంగా నేర్చుకుంటారు,ఎక్కువగా సంగ్రహాన్ని కలిగి ఉంటారు, నేర్చుకునే అనుభవం గురించి ఎక్కువ నిశ్చయమైన అనుభూతిని పొందుతారని పలితాలు చెపుతున్నాయి. విద్యార్థుల్ని గ్రూపులో పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఇవ్వవచ్చని చెప్పడం లేదు. గ్రూపు పని విజయవంతమవడానికి నిర్దుష్టమైన పద్ధతులు ఉన్నాయి మరియు దీనిని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విధానాలని చాలా దుర్వినియోగం చేయడంవలన ఈ మధ్యన విమర్శ వచ్చింది.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఉపాధ్యాయులు తమ భాధ్యతల్ని మరచి పోవడానికి ఇది మార్గంకాదు.ఎందుకంటే విద్యార్థులు గ్రూపులో పనిచేస్తుంటే, ఉపాధ్యాయులు పేపర్లని సరిదిద్దుతారు. అంశవంతులైన విద్యార్థుల్ని నిరంతరంగా నేర్చుకునే గ్రూపుల అధీనంలో పెట్టి వారి అవసరాల్నితీర్చడం ఉపాధ్యాయుల విధానం కాదు. అవసరమైన వ్యక్తిగతమైన జీవన నైపుణ్యాల్ని నేర్చుకోవడం, సహకారంతో పనిచేసే సామర్థ్యాన్ని వృద్ధిచేసు కోవడం విద్యార్థుల విధానం. ఇప్పుడు ఇది పనిచేసే చోట ఎక్కువగా అవసరమయ్యే నైపుణ్యం. ఫెసిలిటేటర్,రిపోర్టర్,రికార్డర్ మొదలైన విభిన్నమైన భూమికలను ఒక దాని తరువాత ఒకటిని విద్యార్థులు పోషించే మార్గమిది. సహకార గ్రూపులో,ప్రతీ విద్యార్థికి ఒక నిర్దుష్టమైన పని ఉంటుంది, ప్రతీ విద్యార్థీ నేర్చుకోవడం లేదా ప్రాజెక్ట్ చేస్తూఉండాలి అంతేగాని బరువుగా ఉండ కూడదు. గ్రూపు విజయం, ప్రతీ ఒక్కరి విజయవంతమైన పనిమీద ఆధారపడి ఉంటుంది.

చిన్నగ్రూపులలో, వాళ్ళలోవారికి సహకారం చేసుకోవడానికి విద్యార్థులు విద్యావిషయకమైన పనులమీద కలసి పని చేస్తారు. వారి టీమ్ లోని వారు కలసి నేర్చుకుంటారు. సాధారణంగా, సహకారంతో నేర్చుకొనే విధానాలు ఈకింది ఐదు లక్షణాలని పాలుపంచుకుంటాయి.

 • గ్రూపుల ద్వారా బాగా చేసే సాధారణమైన పనులని లేదా నేర్చుకొనే చర్యలని విద్యార్థి కలిసి పని చేస్తాడు.
 • రెండు లేక ఐదుగురి మెంబర్లు కలిగిన చిన్న గ్రూపులో విద్యార్థులు కలిసి పనిచేస్తారు.
 • సాధారణమైన పనులని లేదా నేర్చుకొనే చర్యలని పూర్తిచేయడానికి విద్యార్థులు సహకారం, సాంఘికమైన ప్రవర్తనను ఉపయోగిస్తారు.
 • విద్యార్థులు ఒకరికొకరు ఆధారపడి ఉంటారు. కార్యక్రమములు రూపొందించబడి ఉంటాయి. సాధారణమైన పనులని లేదా నేర్చుకొనే చర్యలని పూర్తిచేయడానికి విద్యార్థుల కి ఒకరికొకరు అవసరంపడుతుంది.
 • వారి పనులు లేదా నేర్చుకోవడంపై విద్యార్థులు ఒక్కొక్కరిగానే జవాబుదారీగా లేదా భాధ్యులై ఉంటారు.

అభ్యసనా శైలిలు – రకాలు

దృశ్యమాన అభ్యాసకులు (చూడటం ద్వారా అభ్యసించటం

ఈ అభ్యాసకులు ఒకపాఠములోని విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకునేందుకు ఉపాధ్యాయుడి ముఖ కవళికలను శారీరక భాషను చూడాల్సిన అవసరం ఉంటుంది. దృశ్యపరమైన అడ్డంకులను (ఉదా.ఇతరుల తలలు) తప్పించుకోవటానికి వారు తరగతిగది లో మొదటకూర్చుంటానికి మొగ్గుచూపుతారు. వారు చిత్రాల రూపములో ఆలోచించవచ్చు మరియు రేఖాచిత్రాలు,బొమ్మలతో కూడిన పాఠ్యపుస్తకాలు.ఓవర్ హెడ్ ట్రాన్సపరెన్సీస్,వీడియోలు, ఫ్లిప్ చార్టులు,మరియు హాండ్ ఔట్లు వంటి వాటి ద్వారా చాలా చక్కగా నేర్చుకుంటారు. పాఠము చెపుతున్నప్పుడు లేదా తరగతిగదిలో చర్చ జరుగుతున్నప్పుడు దృశ్యమాన అభ్యాసకులు సమాచారాన్ని గ్రహించేందుకు వివరంగా నోట్సు రాసుకోవటానికి మొగ్గుచూపుతారు తరచూ.

శ్రవణసంబంధమైన అభ్యాసకులు (వినటం ద్వారా అభ్యసించటం)

మౌఖిక ఉపన్యాసాలు,చర్చలు,మాట్లాడటం మరియు యితరులు ఏమిచెప్తున్నారు అన్నది వినటం వంటి వాటిద్వారా వీరు చక్కగానేర్చుకుంటారు. శ్రవణసంబంధమైన అభ్యాసకులు ప్రసంగాన్ని వినటంద్వారా అందులోని అంతరార్ధాన్ని స్వరం,శృతి,వేగం మరియు ఇతర స్వల్ప బేధాలను వారు అన్వయించుకుంటారు.రాతపూర్వకమైన సమాచారాన్ని వినకపోతే అది వారికి అర్ధరహితం.వీరు పాఠాలను పెద్దగా చదవటంద్వారా లేదా టేప్ రికార్డర్ ను ఉపయోగించటంద్వారా తరచూ ప్రయోజనం పొందుతారు.

శారీరక/పనిచేస్తూఅభ్యసించేవారు/స్పర్శ సంబంధమైన కదలికలు (పనిచేస్తూ మరియు స్పర్శద్వారా అభ్యసించటం)

శారీరక/పనిచేస్తూఅభ్యసించేవారు స్వహస్తాలతో చేసి చూసి బాగా నేర్చుకోగలరు,తమచుట్టూ ఉన్న భౌతికప్రపంచాన్ని చురుగ్గా అన్వేషిస్తారు.ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవటం వారికి కష్టంగా ఉంటుంది మరియు తమ చురుకుదనానికి మరియు అన్వేషణకు అందువల్ల దూరమవుతారు.

ఆధారము: ldpride

ఉపాధ్యాయుల కరదీపిక

పిల్లలు ప్రాథమికస్థాయి పూర్తిచేసేసరికి చదవటం, అర్థం చేసుకోవడం, సొంతంగా రాయగల్గడం వంటి కనీస సామర్థ్యాలతోబాటు వాళ్ళలోని స్వాభావిక సృజనాత్మకతను వికసింపజేయడం, భాషను వివిధ సందర్భాలలో సమర్ధంగా వినియోగించగల నైపుణ్యాలను పెంపొందించడం భాషాపరంగా ఆశించే ప్రధానలక్ష్యం.

తరగతి వారీగా భాషా విద్యా ప్రమాణాలను సాధించటానికి పాట్యపుస్తకం కేవలం ఒక సాధనం మాత్రమే. పాట్యపుస్తకం తాత్వికతను అర్థంచేసుకొని భోధనాభ్యసన ప్రక్రియలు చేపట్టినపుడే ఆశించిన సామర్థ్యాలను సాధించగల్గుతాం. 4,5 తరగతుల నూతన పాట్యపుస్తకాలలోని పాటాలు వివిధ ప్రక్రియలలో ఉన్నాయి. భాషా సామర్థ్యాలను సాధించటానికి అనువుగా అభ్యాసాలను పొందుపరిచారు. బట్టీ విధానాలకు స్వస్తిపలికి పిల్లలు తమ అనుభవాల ఆధారంగా ప్రతిస్పందిచేలా, సృజనాత్మకంగా ఆలోచించేలా, వివిధ కోణాల్లో సమస్యలను పరిష్కరించేలా జ్ఞానాన్ని, సామర్థ్యాలను, నైపుణ్యాలను అభివృద్ధిచేసేలా పాట్యపుస్తకాలను రాష్ట్ర విద్య, పరిశోధన మరియు శిక్షణా సంస్థ వారు రూపొందించారు. ఆ కరదీపిక ఈ క్రింద విభాగాల వారీగా అందుబాటులో ఉన్నాయి.

భోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ సోపానాలు – ప్రణాళికలు

పాట్య బోధనకు ఉపాధ్యాయుల వనరులు

పాట్య బోధనకు ఉపాధ్యాయుల తయారీ మరియు వనరులు

నిరంతర సమగ్ర మూల్యాంకనం, నమూనా ప్రశ్నలు - ప్రశ్నా పత్రాలు

నిరంతర సమగ్ర మూల్యాంకనం

ఆధారము: రాష్ట్ర విద్య, పరిశోధన మరియు శిక్షణా సంస్థ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate