অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్యా బోధన అభివృద్ధికి మరియు నేర్చుకొనే విద్యకు అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం

విద్యా బోధన అభివృద్ధికి మరియు నేర్చుకొనే విద్యకు అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం

విద్యా బోధన అభివృద్ధికి మరియు నేర్చుకొనే విద్యకు అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం

మీ పాఠశాల కు అవసరమైన సాంకేతిక సాధన సంపత్తి ఎంచుకోవడము మీ ముఖ్య బాధ్యత. అప్పుడే ఐసిటి ఉపయోగాన్ని మీ పాఠశాల సమర్ధవంతం గా వాడుకోగలుగుతుంది. ఈ విభాగం విద్యాబోధన లోఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం సమాచారం, ఈ క్రమం లో ఐసిటి ఎదుర్కొనే సవాళ్ళ గురించి వివరిస్తుంది.

ఐసిటి అంటే ఏమిటి?

ఈ పదము ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసిటి) అంటే, సమాచార, సంసర్గ సంబం ధిత సాంకేతికపరిజ్ఞానం, అది సృష్టించే, ప్రసారం చేసే, దాచే, చూపించే, పంచుకునే ఎలక్ట్రానిక్‌ సాధనాల గురించి వాడబడింది. ఇంత విస్తారమైన నిర్వచనం కల ఐసిటి రేడియో, టెలివిజన్‌, వీడియో, డి.వి.డి., టెలిఫోన్, (ఫోన్లు, మొబైల్‌ ఫోన్లు) ఉపగ్రహ (శాటిలైట్‌) సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సాఫ్ట వేర్‌ హార్డ్‌వేర్‌ ల సముదాయాని కి వర్తిస్తుంది. ఇంతే కాక ఈ సాంకేతిక పరిజ్ఞానాని కి అవసరమైన పరికరాలు, వాటి సేవల కు కూడా వర్తిస్తుంది. ఉదాహరణలుః వీడియో కాన్ఫరెన్సింగ్‌, ఇ-మెయిల్‌ మరియ బ్లాగులు.

ఈ సమాచార యుగము లో విద్య యొక్క లక్ష్యాలు సాధించడానికి ఆధునిక సమాచార సంసర్గ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్య తో అనుసంధించాలి. ఇది సమర్ధవంతంగా నిర్వహించడానికి, విద్యా పధక రచయితలు, పాఠశాల ప్రధానధికారులు, ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు, ఎన్నో నిర్ణయాలను ఈ విషయాల్లో తీసుకోవలసి ఉంటుంది. సాంకేతిక  శిక్షణ, ఆర్ధిక, బోధన, నిర్మాణ సౌకర్యాల అవసరాలు.
చాలమందికి క్రొత్త భాష నేర్చుకోవడమే కాక, ఆభాష లో బోధించడం లాంటి కష్ట సాధ్యమైన పని ఇది. ఈ విభాగం సాంకేతిక సాధనాల గురించే కాక, దేశాలను కలిపే ఉపగ్రహాల నుంచి పాఠశాల గదుల్లో విద్యార్ధులు ఉపయోగించే యంత్రాల వరకు వివరిస్తుంది. ఇది బోధకులకి సహాయకారి గాను, విధానకర్తలు, ప్రణాళికా రచయితలు, పాఠ్యాంశాలు వృద్ధి పరిచే వారు, ఇంకా ఇతరులకి  ఐసిటి సాధనాలు పదాలు, పద్ధతుల ఉపయోగించే క్రమం లో కలిగే గందరగోళాన్ని నివారించడం లో ఉపయోగపడుతుంది.

విద్యావిధానం లో ఐసిటి పాత్ర

బోధకులు, విధానకర్తలు, పరిశోధకులు, అందరూ కూడ విద్యావిధానం పై ఐ.సి.టి యొక్క ప్రముఖమైన అభ్యుదయమైన బలమైన ప్రభావాన్ని అంగికరించారు. జరిగే చర్చంతా విద్యా సంస్కరణ లో ఐ.సి.టి యొక్క నిర్దుష్ట పాత్ర, దానిని ఎంత శక్తివంతంగా నిర్వహించగలము అన్న దాని మీదే సాగుతోంది.
ఈ విభాగంలో వ్యాసాలు, ఆన్‌లైన్‌ పత్రికలకు అనుసంధానలు(లింక్స్‌), మరియు వెబ్‌ సైట్స్‌,విద్య పైఐ.సి.టి. ఏ విధంగా ప్రభావం చూపిందో తెలుపుతాయి. సాంకేతిక విజ్ఞానం పాఠశాలల్లో ఏవైపు సాగాలో చెబుతుంది.
(విద్యావిధానం లో ఐ.సి.టి. ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తుంది.అంతే కాకుండ, వ్యాసాలు, ఉదాహరణలు, ఇవ్వబడి ఐ.టి.సి ను విద్యావిషయాల్లో అనుసంధించడానికి దిశా నిర్దేశ సూత్రాలను అందిస్తుంది. ఇంకా గమనించవలసిన విషయాలను , నేర్చుకోవలసిన పాఠాలను, సామాన్యంగా చేసే తప్పులను తొలగించుకోవడంలోనూ సహాయం చేస్తుంది.)

సాంకేతిక పరిజ్ఞానం పనిచేసే క్రమం

ఆవిష్కరణ కధనాలు, ప్రపంచం మొత్తం నుంచి తీసుకున్నజయాపజయాల గాధలు, విధాన ప్రకటనలు,ప్రణాళికలు, సాంకేతిక విజ్ఞాన కార్యాచరణ సూత్రాలు. ప్రత్యేకమైన, మిశ్రమమైన అంశాల క్రమం :

 • మల్టీ-ఛానల్‌ లెర్నింగ్‌ (వివిధ మార్గాలద్వారా బోధన).
 • విద్యావిషయమైన దూరదర్శన్‌ కార్యక్రమాలు (టెలివిజన్‌).
 • విద్యావిషయ రేడియో.
 • వెబ్‌ ఆధారిత సూచనలు.
 • ఆవిష్కరణలకు గ్రంధాలయాలు.
 • శాస్త్ర, సాంకేతిక రంగాల క్రియాత్మక చర్యలు.
 • మీడియా (మాధ్యామాలు).
 • సాంకేతిక విజ్ఞానం ప్రయోగించగలిగే సందర్భాలుః బాల వికాసం, తక్కువ సాంద్రత జనాభా, వయోజన విద్య, స్త్రీ విద్య, కార్మిక శక్తి యొక్క అభివృద్ధి.
 • ఉపాధ్యాయ సన్నద్ధత, వృత్తిపరమైన శిక్షణలో సాంకేతిక విజ్ఞానం.
 • విధాన ప్రణాళిక, రచన, విషయ నిర్వహణ లో సాంకేతిక విజ్ఞానం.
 • పాఠశాల నిర్వహణ లో సాంకేతిక విజ్ఞానం.

నేటి సాంకేతికతః

బోధనలోని వివిధ విభాగాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు పై పరిశీలనః

 • బోధనా సాధనములు.

ఆడియో (శ్రవణ), విజువల్‌ (దృశ్య), డిజిటల్‌ పరికరములు.

 • సాప్టవేర్‌  మరియు కంటెంట్‌-వేర్‌.
 • అనుసంధానం లో రీతులు.
 • మీడియా.
 • విద్యా విషయక వెబ్‌-సైట్స్‌.

రేపటి సాంకేతిక విజ్ఞానము :
వృత్తి నిపుణులు, నిర్ణయకర్తల కల్పనలను ఉత్తేజపరచడమే కాకుండ వారికి తోడ్పాటు అందించే విధంగ అందుబాటులో సాంకేతిక విజ్ఞానం ఉంచడం. రాబోయే విషయాల గురించి కూడ వారికి తెలియజేయడం భవిష్యత్తు సాంకేతిక విజ్ఞానం యొక్క కార్యాచరణ.

రేడియో మరియు టెలివిజన్‌

రేడియో మరియు టెలివిజన్‌ :
ఇరవైవ శతాబ్దం ఆరంభం నుంచి రేడియో మరియు టెలివిజన్‌ విద్యావిధానంలో ఉపయోగించబడ్డాయి.మూడు ప్రధాన విధాలుగా ఐ.సి.టి. ఈ రూపాల్లో వినియోగించబడ్తోందిః

 • రేడియో శిక్షణ-ప్రతిస్పందన(ఇంటారాక్టివ్‌ రేడియో ఇన్‌స్ట్రక్షన్‌) ఐ.ఆర్‌.ఐ.-టెలివిజన్‌ ద్వారా ప్రత్యక్ష తరగతి గది బోధన.
 • పాఠశాల ప్రసారాలు, ఉపధ్యాయ బోధన తో పాటు రేడియో ప్రసార బోధన, మరియు ఎటువంటి వనరులు అందుబాటు లో లేనప్పుడు నేర్చుకునే ప్రక్రియ.
 • సామాన్యమైన విద్యా కార్యక్రమాలు, సాధారణమైన విద్యావకాశాలను కలుగజేయడం.

రేడియో  శిక్షణ -ప్రతిస్పందన (ఐ.ఆర్‌.ఐ.) ప్రసారాల్లో తరగతి గదుల్లోనికి రోజూవారి పాఠాలు ఉంటాయి
నిర్దుష్టమైన అంశాల్లో రేడియో పాఠాలు ఉండి ప్రత్యేకమైన స్థాయిల్లో, స్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులకు మంచి బోధనను వృద్ధి పరుచుకునేందుకు, నేర్చుకోవడాన్ని పెంపుంచేందుకు ఒక క్రమ పద్ధతిలో తోడ్పడతాయి. ఐ.ఆర్‌.ఐ.  విద్యావ్యాప్తిని మారుమూల పాఠశాలలకు, శిక్షణాలయాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నపాఠాలను ప్రసారం చేయడంద్వారా ఉపాధ్యాయుల మరియు ఇతర సాధన సంపత్తి లేని లోటును తీరుస్తుంది. ఒక పరిశీలన ప్రకారం ఐ.ఆర్‌.ఐ. పధకాలు సాధారణ విద్యా, క్రమబద్ధమైన విద్యలకు కూడ అందుబాటు లో ఉంచడంలో బలమైన ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఇది చాల మంది ప్రజలకు తక్కువ ఖర్చు తో విద్యావ్యాప్తిని చేయగలుగుతోంది.

టెలివిజన్‌ పాఠాలు, పాఠ్యాంశాల ను మెరుగు పరచడానికి గాని, అవే పాఠాలుగా గాని ఉపయోగపడ్తాయి. ఈ పాఠాలు ఉపాధ్యాయులు మాట్లాడ్డము తో మొదలై ఆకట్టుకునే అంశాలతో విద్యార్ధులకు అవసరమైన విషయాల ప్రతిస్పందన కార్యక్రమాలుగా కూడ అభివృద్ధి చెందాయి. విద్యాటెలివిజన్‌ కార్యక్రమాలు , ప్రచురణలు ఇంకా ఇతర అంశాల తో చేరి బోధనని స్పందనని పెంచుతున్నాయి.

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాలలో విద్యా ప్రసారాలు విశేషంగా వ్యాప్తి చెందాయి.ఉదాహరణకి మన భారత దేశం లోని ఇంది రా గాంధి జాతీయదూర విశ్వవిద్యాలయం, (ఐ.జి.ఎన్‌.ఒ.యు) టెలివిజన్‌, రేడియో, మరియు వీడియో సమావేశాల విషయాలను ప్రసారం చేస్తుంది.

రేడియో మరియు టెలివిజన్‌ ప్రత్యేకమైన పాఠాలను మాత్రమే కాకుండ సామాన్యమైన విద్యా విషయాల గురించి కూడ కార్యక్రమాలను కూడ ప్రసారం చేస్తాయి. ఏదైన కార్యక్రమం విద్యకు సంబంధించి ఉన్నట్లైతే  “సామాన్య విద్యా కార్యక్రమం (జనరల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌)” అని అంటారు. “ సెసమ్‌ స్ట్రీట్‌ ”- అనేది యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా  యొక్క పిల్లలకు సంబంధించిన విద్యా టెలివిజన్‌ కార్యక్రమం. ఇంకొక ఉదాహరణ, “ ఫార్మ్‌ రేడియో ఫోరమ్‌ ”- అనే ఒక కెనెడియన్‌ రేడియో విద్యా చర్చాగోష్థి.

విద్యా విధానం లో రేడియో, టెలివిజన్‌ ప్రసారాలు ఎంత వరకు దోహదపడ్డాయి?

రేడియో, టెలివిజన్‌ విద్యాసాధనాలుగా పంతొమ్మిది వందల ఇరవైలలో, యాభైలలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.రేడియో, టెలివిజన్‌ ప్రసారాలు మూడు రకాలుగా విద్యా విధానం లో తోడ్పడతాయి.

 • తాత్కాలికంగా ఉపాధ్యాయులు లేని లోటును భర్తీ చేసే విధంగా తరగతి గదుల్లోబోధన.
 • ఉపాధ్యాయులు, వేరే సాధన సంపత్తి లేనప్పుడు పాఠశాల లోనే విద్యా కర్యక్రమాలు అదనంగా చేయడం.
 • సామాన్యమైన విద్యా కార్యక్రమాల ప్రసారం. జాతీయ, అంతర్జాతీయ స్టేషన్ల ద్వారా ప్రసారం చేసి  సామాన్య విద్యావకాశాలు కల్పించడం.

దీనికి మంచి ఉదాహరణ, ఐ.ఆర్‌.ఐ. (శిక్షణ-ప్రతిస్పందన) కార్యక్రమం నేరుగా తరగతి గదుల్లోనికి ప్రసారం కావడం. ఈ విధానం లో “ఇరవై, ముప్పై నిముషాల నిడివి గల సిద్ధమైన బోధన-శిక్షణ కార్యక్రమం తరగతి గదుల్లోనికి ప్రతి దినం ప్రసారం చేస్తారు. ఈ రేడియో పాఠాలు ప్రత్యేకమైన లక్ష్యాలతో రూపొందించబడ్డాయి. లెక్కలు, సైన్స్‌(శాస్త్రము), ఆరోగ్యము, భాష  లాంటి విషయాలను జాతీయ రాష్ట్ర పాఠ్యాంశాల తో క్రోడీకరించి కొన్ని స్థాయిల్లో, తరగతి బోధనని ఒక క్రమ పద్ధతిలో జరిగేటట్లు చేసి తక్కువ వనరులున్న పాఠశాలల్లోను, శిక్షణ సరిగ్గా లేని ఉపాధ్యాయులున్న పాఠశాలల్లోను ఉపయోగించబడ్తాయి.” ఐ.ఆర్‌.ఐ. పథకాలు భారతదేశం లోను, ఇతర దక్షిణ ఆసియా దేశాల్లోను ప్రయోగింపబడ్డాయి. ఆసియా లో ఐ.ఆర్‌.ఐ. మొట్టమొదట థాయ్ లాండ్‌ లో1980 లో ఉపయోగించారు.1990 లలో ఇండోనేసియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌,నేపాల్‌ తమదైన ఐ.ఆర్‌.ఐ. పధకాలతో ముందుకు నడిచాయి. ఐ.ఆర్‌.ఐ., మిగిలిన దూర విద్యావిధానాలకు గల ముఖ్యమైన భేదం ఏమిటంటే తన ప్రాథమిక లక్ష్యం విద్యా బోధన అందుబాటు లో ఉంచడం కన్నా దానిని శ్రేస్ఠమైనదిగా మలచడం. ఈ విషయం లో ఐ.ఆర్‌.ఐ. రెండింటిలోను విజయం సాధించింది. ప్రపంచమంతా విస్తృతమైన అధ్యయనం చేసిన తరువాత ఐ.ఆర్‌.ఐ. పధకాలు, శిక్షణ, నైపుణ్యం పైన విద్య, ఆర్ధిక అంశాలలో మంచి ఫలితాలనిచ్చినట్టు తెలుస్తుంది.వేరే విధానాల కంటే ఈ మాధ్యమం ద్వారా వ్యయ పట్టిక లో తక్కువ ఖర్చైనట్లు నిరూపింపబడింది.

కేంద్రీకృతమైన టెలివిజన్‌ కార్యక్రమాలను ఉపగ్రహం ద్వారా దేశం మొత్తానికి ఒకే సమయం లో సామాన్య పాఠశాలలో బోధించే మాధ్యమిక విద్య పాఠ్యాంశాలను అన్ని పాఠశాలలకు ప్రసారం చేస్తారు. నిర్ణీత సమయంలో ఒక్కొక్క విషయం మీద, ఉపాధ్యాయ క్రియాశీలత పైన కేంద్రీకరించబడి ఉంటుంది. విద్యార్ధులు ఎంతో మంది ఉపాధ్యాయుల ద్వారా టెలివిజన్‌ లో పాఠాలు నేర్చుకుంటారు. కాని ప్రతీ తరగతి కి తమదైన స్వంత ఉపాధ్యాయుని ప్రతివిషయానికి (సబ్జెక్ట్‌) వారి పాఠశాలలో కలిగి ఉంటారు.

ఈ కార్యక్రమాల ప్రణాళిక సంవత్సర సంవత్సరానికి మార్పుకు లోనై వట్టి “మాటల పోగులు” గా ఉండే శిక్షకుల నుంచి స్పందన-ప్రతిస్పందన కలిగిన చురుకైన కార్యక్రమాల వరకు వృద్ధి చెందింది. “బోధించే పద్ధతి సముదాయాలను అనుసంధానించే ప్రక్రియ గా మారింది. ఈ ప్రణాళిక ఉద్దేశ్యం సంఘం యొక్క పరిస్తితులను కార్యక్రమాల్లో చూపించడం. అందువలన సంఘం, పాఠశాల విధివిధానం, నిర్వహణ లో పాలుపంచుకోవడం, విద్యార్ధులు సంఘకార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం వలన సమగ్ర విద్య సాధ్యమౌతుంది”. టెలివిజన్‌ కార్యక్రమాల సమీక్షా ఫలితాలు ప్రోత్సాహకరము గా ఉన్నాయి. సామాన్య మాధ్యమిక పాఠశాలల్లో, సాంకేతిక పాఠశాలల్లో అర్ధాంతరంగా మానేసే విద్యార్ధుల కంటే ఈ పాఠశాలల్లో హాజరు బాగుంది. ఆసియా లో చైనా లోని నలభైె నాలుగు రేడియో, టెలివిజన్‌  విశ్వవిద్యాలయాలు (ద చైనా సెంట్రల్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ యూనివర్సిటి) ఇండోనేసియా లోని యూనివర్సిటాస్‌ టెర్బూకా, ఇందిరాగాంధి ఓపెన్‌ యూనివర్సిటి, రేడియో, టెలివిజన్‌ ని విస్తారంగా ఉపయోగించి తమ తమ అధిక జనాభా కి చేరువయ్యేటట్లు ప్రత్యక్ష తరగతి బోధన  పాఠశాల ప్రసారాల ద్వారా చేసాయి. ఈ సంస్థల ప్రసారాలతో పాటు ప్రచురింపబడిన రచనలు, ఆడియో కేసట్లు పంపుతారు.

జపాన్‌ యూనివర్సిటి 2000 సంవత్సరంలో నూట అరవై రేడియో విద్యా విషయాల ను ప్రసారం చేసింది. ప్రతి విషయం పై 15 నుంచి -45 నిముషాల వ్యవధి కలిగిన ఉపన్యాసాలను దేశం మొత్తానికి వారాని కొకసారి చొప్పున 15 వారాలు ప్రసారం చేసింది. ఈ విద్యా కార్యక్రమాలు యూనివర్శిటి స్టేషన్‌
ల ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమయ్యేవి. విద్యార్ధుల కు అదనంగా పుస్తకాలు (ప్రింట్‌ మెటీరియల్స్‌), ముఖాముఖి బోధన, ఆన్‌ లైన్‌ సూచనలు ఇవ్వబడ్డాయి.
పుస్తకాలు, కేసెట్లు, సి.డి.రామ్స్‌ తో పాఠశాల ప్రసారాలు సాగించడం వలన ప్రత్యక్ష తరగతి బోధన వివిధ విషయాల ను జాతీయ పాఠ్యాంశాల పరిధి లోనికి తెస్తుంది. ప్రత్యక్ష బోధన (డైరెక్ట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ) వలె కాకుండ పాఠశాల ప్రసారాలు (స్కూల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ) ఉపాధ్యాయుని కి బదులుగా, వాడబడవు. సంప్రదాయ తరగతి విద్య ను ఇంకొంత పరిపుష్టం చేయడానికి వాడబడతాయి. పాఠశాల ప్రసారాలు ఐ.ఆర్‌.ఐ. కంటె సరళమైనవి. ఎందుకంటే, ఉపాధ్యాయులు తమ బోధన లో ప్రసారాలను ఎలా వాడుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. పెద్ద ప్రసార సంస్థలు, పాఠశాల ప్రసారాలను చేసే వాటి లో బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌  కార్పొరేషన్‌ ఎడ్యుకేషన్‌ రేడియో, టి.వి. అనే యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సంస్థ, ద ఎన్‌.హెచ్‌.కె. జపనీస్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌  స్టేషన్‌ ప్రధానమైనవి. వర్ధమాన దేశాల్లోపాఠశాల ప్రసారాలు విద్యా మంత్రిత్వశాఖ, సమాచార మంత్రిత్వశాఖ తో కలిసి భాగస్వామ్యం తో చేస్తాయి.  సామాన్య విద్యా కార్యక్రమాలు డాక్యుమెంటరీలు (సమాచార చిత్రాలు), ప్రశ్నోత్తరావళి (క్విజ్‌), కార్టూన్లు (హాస్య చిత్రాలు) వంటి వివిధ కార్యక్రమాలతో కలసి ఉంటాయి. దీని వలన అన్ని రకాల విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించినట్లౌతుంది. ఇలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రపంచ ఛానల్స్‌.
ఉదాహరణలుః యునైటెడ్‌ స్టేట్స్‌ టెలివిజన్‌ షో సేసేమ్‌ స్ట్రీట్‌, పూర్తి సమాచారం తో ఉండే నేషనల్‌ జాగ్రఫిక్‌ మరియు డిస్కవరీ ఛానల్స్‌, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో కార్యక్రమాలు. ది  ఫార్మ్‌ రేడియో ఫోరమ్‌ అనే 1940ల లో మొదలైన కెనడా రేడియో చర్చా కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా అటువంటి కార్యక్రమాలకు నమూనా గా ఉన్నది. ఇది సాధారణ విద్యా కార్యక్రమాలకు ఒక మంచి ఉదాహరణ.

నేర్చుకునే వాతావరణాన్ని, నేర్చుకునే వ్యక్తులకు అనుగుణంగా మార్చడంలో ఐ.సి.టి. ఏ విధముగా దోహదపడ్తుంది?

అధ్యయనాలు నిరూపించిన దాని బట్టి సరైన విధంగా ఐ.సి.టి. లను ఉపయోగిచడం వలన 21వ శతాబ్దపు ముఖ్యమైన  విద్యాసంస్కరణ లలో విషయం, బోధన లలో ఉత్తేజితమైన మార్పు ఖచ్చితంగా కనిపించింది. సరైన విధం గా ఐ.సి.టి. లను వినియోగించడంవలన ముఖ్యంగా కంప్యూటర్‌ మరియు ఇంటర్నెట్‌ విజ్ఞానం ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఇంతకుముందు వారు నేర్చుకున్న విధం కంటే మెరుగైన బోధన, శిక్షణ ఈ పద్ధతులలో సాధ్యపడుతుంది. ఈ విధమైన క్రొత్త పుంతలు తొక్కిన బోధన, ప్రయోజనాత్మకమైన సిద్ధాంతాలతో ముడిపడి ఉంది. ఉపాధ్యాయుడు బోధించే పాఠాలు  బట్టీ పట్టడం, వల్లె వేయడం, వంటి పాతకాలపు రొడ్డగొట్టుడు పద్ధతి నుంచి జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా మార్చడం లో ఐ.సి.టి. ప్రాధాన్యంగా ఉంది.. సరిగ్గా ప్రణాళిక వేసి అమలుపరచినట్లైతే, ఐ.సి.టి. ఆధారిత జ్ఞాన నైపుణ్యాలను విద్యార్ధులు తమ జీవిత పర్యంతం పొందేటట్లు తోడ్పడుతుంది.

ఉత్తేజితకరమైన బోధన : ఐ.సి.టి. ఆధారిత బోధన, పరీక్షావిధానం లో, గణనలో, సమాచారాన్ని విశ్లేషించడం లో సాధన సంపత్తి ని సిద్ధంగా ఉంచుతుంది. అందువలన విద్యార్ధుల కు నూతన విషయాల పై ఆసక్తి, విశ్లేషణ, అభిలాష కలగడానికిసరైన వేదిక లభ్యమౌతుంది. విద్యార్ధులు నేర్చుకోవడమే కాకుండ ఎప్పుడెప్పుడైతే నిజజీవితంలో సమస్యలు వస్తాయో వాటిక్కూడ  పరిష్కారాలను సరైన విధంగా క్రియాత్మకంగా కనుగొనేటట్లు చేస్తుంది. ఈ  విధంగా బట్టీ పెట్టడం వంటి బోధనా విధానాలకు విరుద్ధం గా విద్యార్ధి ఆసక్తి పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఐ.సి.టి. ఆధారిత బోధన విద్యార్ధులు ఎప్పుడు ఏది కావాలంటే అది నేర్చుకునే విధంగా- “సమయనికి తగు రీతి--(జస్ట్‌ ఇన్‌ టైమ్‌)” ఉంటుంది.

సహకార బోధన : ఐ.సి.టి. ఆధారిత బోధన విద్యార్ధులు తమ లో తాము సహకరించుకుని నేర్చుకునేటట్లు ప్రోత్సహిస్తుంది. నిజజీవిత ప్రతిస్పందన పద్ధతులలోనే కాకుండ ఐ.సి.టి ఆధారిత విద్య, వివిధ సంస్కృతుల ప్రజలతో కలసి పనిచేయించడం వలన వారి సాముదాయిక స్ప్రుహ, నైపుణ్యాలు పెంచడమే  కాకుండ వారికి లోకజ్ఞానం కూడ కలిగేటట్లు చేస్తుంది. విద్యార్ధి జీవితమంతా నేర్చుకునే ఆసక్తిని కేవలం తనతోటి వారితో మాత్రమే కాకుండా ఎన్నో విషయాల్లో నిష్ణాతులైన వారితో కలిసి చేసేటట్లు పెంపొందిస్తుంది.

ఐ.సి.టి. ఆధారిత విద్య నిజంగా పని చేస్తుందా?

ఐ.సి.టి ఆధారిత విద్య ప్రభావం, అది ఏవిధంగా ఉపయోగిస్తున్నారు, ఏ లక్ష్యం కోసం వాడుతున్నారన్నదాని మీద ఆధారపడి ఉంది. మరేవిధమైన సమస్య వలెనే ఐ.సి..టి. లో కూడ సాధక బాధకాలు విద్యాసాధనాలలోనో లేక అవి వ్యక్త పరచడం లోనో ఉన్నాయి. ఇది కూడ అందరికీ అన్ని వేళ లా ఒకే విధంగా పని చెయ్యదు.

అందుబాటు ని అధికం చేయుట :
ప్రాధమిక విద్యకు ఎంత పరిమాణం వరకు ఐసి.టి. అందుబాటు లో ఉన్నదీ చెప్పడం కష్టం. ఎందుకంటే, చాలా వరకు ఈ ఉద్దేశ్యాలను చేపట్టే ఐ.సి.టి.లు చిన్న తరహావి లేక అనామకమైనవి అయి ఉండడం చేత ప్రాధమిక దశ లో ఐ.సి.టి. ఆధారిత పధకాలు అభివృద్ధి చెందినట్లు నిరూపణ కాలేదు. కాని ఉన్నత విద్య, వయోజనవిద్య లో మాత్రం  వ్యక్తులు లేక సంఘాలు ఎవరైతే సంప్రదాయక విశ్వవిద్యాలయ విద్య ను పొందలేక పోయారో వారికి విద్యావకాశాలు కలిగించినట్లు తెలుస్తుంది. అతి పెద్ద 11 విశ్వవిద్యాలయల్లో ప్రతి ఒక్కటి, ప్రపంచం లో అతి పెద్దవి బాగా ప్రాచుర్యం లో ఉన్న దూరవిద్యా సంస్థలలో (వాటి లో ద ఓపెన్‌ యూనివర్సిటి ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌ డమ్‌, ద ఇందిరా గాంధి నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటి ఆఫ్‌ ఇండియా, ద చైనా టి.వి.యూనివర్సిటి సిస్టమ్‌, ద యూనివర్సిటాస్‌ టెర్బూకా ఆఫ్‌ ఇండోనేసియా మరియు ద యూనివేర్సిటి ఆఫ్‌ సౌత్‌ ఆఫ్రికా మున్నగునవి.) సంవత్సరానికి లక్ష విద్యార్ధులు నమోదు అవుతున్నారు. మొత్తం కలిపితే 2.8 మిలియన్ల మంది కి ఇవి సేవ చేస్తున్నాయి. దీనిని యునైటెడ్‌ స్టేట్స్‌ లోని 3500 కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 14  మిలియన్ల విద్యార్ధుల  నమోదుతో పోల్చిచూడండి.

నాణ్యత పెంపు :
రేడియో, టెలివిజన్‌, విద్యా ప్రసారాలు ప్రాధమిక విద్య నాణ్యత పై చూపే ప్రభావం ఇంకా పూర్తిగా అధ్యయనం కాలేదు. కాని పరిశీలన జరిగినంతవరకు , సంప్రదాయ తరగతి బోధన తో సమానంగా ఈ కార్యక్రమాల ప్రభావం కూడ ఉందనేది తెలిసింది. విద్య ప్రసార పధకాల్లో ద ఇంటరాక్టివ్‌ రేడియో ఇన్‌స్ట్రక్షన్‌ ప్రోజెక్ట్‌ (ప్రతి స్పందన రేడియో బోధనా పధకం) ఎక్కువగా విశ్లేషించబడింది. ఈ పధకం ప్రభావం విద్య నాణ్యత ని పెంచడం లో ఎంత వరకు ఉన్నదీ, విద్యార్ధులు సాధించిన విజయాంకాల(స్కోర్స్‌), హాజరు ని బట్టి చెప్పవచ్చు.

దీనికి విరుద్ధంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సంబంధిత సాంకేతిక విజ్ఞాన  పద్ధతుల దూరవిద్య సంశయం గా ఉంది. రస్సెల్‌, అతడి సంపూర్ణ అధ్యయన పరిశీలనలో, సంప్రదాయక విద్య ఐన గురుముఖత శిక్షణ పొందిన విద్యార్ధులకు ఐ.టి.సి. ఆధారిత దూర విద్య ద్వారా నేర్చుకున్న విద్యార్ధుల ఫలితాలకు మధ్య “పెద్ద వ్యత్యాసం” లేనట్లు చెబుతాడు. కాని ఇతరులు, ఇటువంటి తీర్పులు అసమగ్రమైనవి అని అంటున్నారు. వారు చెప్పే దానికి దృష్టాంతం గా ఐ.సి.టి. ఆధారిత దూరవిద్య పై పెద్ద సంఖ్య లో వచ్చే వ్యాసాలు, సరైన విధంగా అధ్యయనం చేసిన కేస్‌ స్టడీ పై ఆధారపడినవి కావని వారు చెబుతున్నారు. ఇంకా చాల అభిప్రాయాల ప్రకారం, కంప్యూటర్లు, ఇప్పుడు ఉన్న పాఠ్యాంశాల నాణ్యతను పెంచడంలో బాగా ఉపయోగపడ్తున్నాయని ప్రామాణికమైన పరీక్షలనంతరం తెలుస్తోంది. పాఠశాల మానేసే విద్యార్ధుల శాతం  ఐ.సి.టి. దూరవిద్యావిధానం  వలన ఎక్కువైనదని వేరే విమర్శకుల వాదన.

ఇంకా కొన్ని పరిశీలనల ప్రకారం, కంప్యూటర్‌  ల వాడకం వలన పాఠ్యాంశాల బోధన లో మెరుగైన ఫలితాలు ప్రామాణిక పరీక్షల అనంతరం వస్తున్నాయని తెలిసింది. ముఖ్యంగా ఒక అధ్యయనం ప్రకారం కంపూటర్లు బోధకుల పాత్ర వహిస్తే విద్య అభ్యాసం లో, సంప్రదాయ బోధన లో ప్రాథమిక నైపుణ్యాలను పెంచడం లో, విషయపరిజ్ఞానం లో ఎక్కువ విజయాంకాలను సాధించడంలో  కేవలం సంప్రదాయ విద్యా బోధనలో కంటే సాధిస్తుంది. విద్యార్ధులు అతి త్వరగా నేర్చుకుని, నేర్చుకున్నదానిని జ్ఞాపకం పెట్టుకోవడం లో ప్రతిభ, ఆసక్తి కనబరుస్తున్నారు. కాని కొందరు ఇది చాల తక్కువ మంది లోనే సాధ్యపడుతుందని అంటున్నారు. ఎలాగైనా ఈ అధ్యయనాల ప్రతిపాదనలన్నిటిలో ఎన్నో కొన్ని లోపాలున్నాయి.

అందువలన ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, ప్రొత్సాహం తో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, దానికి సంబధిత సాంకేతిక విజ్ఞానం, అందుబాటు లో ఉంచినట్లైతే విద్యా బోధన వాతావరణం విద్యార్ధి తగినట్లు గ మారుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని వీటిని విమర్శించే వారు, ఇది కేవలం మాటల కే పరిమితం కాని చేతలకు కాదని అంటున్నారు. ఈ ఆధునిక విద్యా వాతవరణం, బోధన విలువలను పెంచినట్లు ఇంకా ఎక్కడా నిరూపణ కాలేదు. విద్యార్ధి, ఉపాధ్యాయుల అనుభవాలను కొందరు పరిశీలించి, విశ్లేషించి ఈ బోధన యొక్క బలమైన ప్రభావం విద్య పై కలిగి ఉందని చెప్పడం మాత్రమే ఉంది.

అన్నిటికంటే కష్టమైన సమస్య ఏమిటంటేె కంప్యూటర్లు ఇంటర్నెట్‌ ప్రభావాన్ని విద్యావిధానాన్ని మార్చడంలో అంచనా వెయ్యడం, విద్యార్ధి కేంద్రంగా కలిగే బోధన లో క్రమబద్ధమైన పరీక్ష ద్వారా ఫలితాలను రాబట్టాడం. సాంకేతిక విజ్ఞానం పూర్తిగా  విస్తృతమైన బోధనావిధానం  లో కలిపేయడం వలన  విద్యాబోధన ఫలితాల్లో, టెక్నాలజి పాత్ర ఎంతో తెలియడం చాల కష్టం. ఆ ఫలితాలు  సాంకేతిక విజ్ఞానం వలన వచ్చినవా లేక వేరే కారణం వలన వచ్చినవా, లేకపోతే ఈరెండింటి కలయిక తో వచ్చినవా అని ఖచ్చితంగా చెప్పలేము.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate