హోమ్ / ఆరోగ్యం / ఆయుష్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆయుష్

అయుష్ అనునది ఆయుర్వేదం, యోగ, యునాని, ప్రకృతి వైద్యం (నాచురోపతి), సిద్ధ, హోమియోపతిల కలయిక. ఇచ్చట అనేకనేక వ్యాదులకు అయుష్ కి సంబందించిన వైద్య విధానాలు, చికిత్స మొదలగు సూచనలు పొందుపరచదమైనది.

ఆయుర్వేదం
భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం.
యోగ
యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పధ్దతిలో మెరుగుపరచుకోవడానికి లేక అభివృధ్ది చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది.
ప్రకృతి వైద్యం
ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం.
యునాని
భారతదేశంలో యునాని వైద్య విధానానికి ఒక ఆకర్షణీయమైన, సుదీర్ఘ చరిత్ర (రికార్డ్) ఉంది. ఇంచుమించు 11వ శతాబ్ద కాలంలో అరబ్బులు మరియు పర్షియన్లచే ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ రోజు యునాని విధానంలో వైద్యాన్ని అనుసరించడానికి సంబంధించినంత వరకూ ప్రపంచ అగ్రగామిదేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.
సిద్ధ
భారతదేశ వైద్యవిధానాలలో సిద్ధ అనేది ఒక అతి పురాతనమైన విధానం. ‘సిద్ధ’ అనే మాటకు అర్ధం సాధించడం మరియు ‘సిధ్ధార్లు’ అనే వారు వైద్యంలో ఫలితాలను సాధించిన సాధువులు. ఈ వైద్య విధానాన్ని అభివృధ్ది చేయడానికి 18 మంది సిధ్ధార్లు కృషి చేసినట్లు చెప్పబడుతోంది. సిద్ధకు సంబంధించిన సాహిత్యం అంతా కూడా తమిళ భాషలో ఉంది.
హోమియోపతి మరియు అల్లోపతి
ఈ రోజుల్లో హోమియోపతి వేగంగా అభివృధ్ది చెందుతున్న విధానం. ఇది ఇంచుమించుగా ప్రపంచమంతటా అనుసరించబడుతున్నది. హోమియోపతీ యొక్క బిళ్లల భధ్రతతో, ఇది సురక్షితమైన, సున్నితమైన వ్యాధి నివారణ స్వభావంతో ఉండడం వల్ల ప్రతి ఇంటా వినిపిస్తూ వుండే మాటగా మారింది.
మహత్తరం.. రక్తదానం
రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం... ఒకరిరక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు.
ఔషధ తయారీ సంస్థలు
ఔషధములను తయారు చేసే పరిశ్రమ ఔషధములను అభివృద్ధి చేసి,తయారు చేసి,అనుమతి పొందిన వాటిని మందుల దుకాణములలో దొరికేలా విక్రయించి ,వాటిని వైద్యము కొరకు వాడుకోవడానికి వీలుగా చేస్తుంది.
మూలికావైద్యం
మూలికావైద్యం. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడదే ఇన్‌థింగ్. ఆధునికత అంగీకరించి ఆహ్వానిస్తున్న పురాతన విధానం.
ఆరోగ్యానికి యోగ
యోగాసనాలు వేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి! యోగా ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా? వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి
నావిగేషన్
పైకి వెళ్ళుటకు