మనకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మనం వెచ్చించే ధనం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరియు స్త్రీలు, చిన్న పిల్లల విషయంలో చాలా ఎక్కువగా ఉంది.
అయితే వేల సంవత్సరాల అనుభవంతో మన పెద్దలు చెప్పిన మూలికా వైద్యం ఈ ఆరోగ్య సమస్యలకు తక్కువ ఖర్చులో మిక్కిలి నమ్మకమైన నివారణను అందిస్తుంది.
ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఇంటి చుట్టూ పెంచుకొనే మూలికా వనాన్ని గృహౌషధవనము అంటారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యే కొన్ని ఔషధ మొక్కలను గుర్తించి, ఇంటి పెరటిలో పాతుకొని వాటిని సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రథమచికిత్సగా వాడుకోవటమే ఇటువంటి వనాలను ప్రోత్సహించడంలో పరమార్థం.
గ్రామీణ గృహ మూలికా వైద్యం యొక్క సంపూర్ణ వివరాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.
పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి.