హోమ్ / ఆరోగ్యం / ఆయుష్ / ఆరోగ్యానికి యోగ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరోగ్యానికి యోగ

యోగాసనాలు వేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి! యోగా ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా? వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి

బరువు తగ్గాలా... కోపాన్ని అదుపు చేసుకోవాలా.. అయితే యోగా చెబుతున్న అగ్ని ముద్రను ట్రై చేయండి. అగ్ని ముద్ర శరీరంలో 'అగ్ని' అంశం సంతులనం కోసం ఉంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి. ఇది బరువు తగ్గడం కొరకు బాగా సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ యొక్క విధానాన్ని వేగవంతం చేస్తుంది.

ఇక జ్ఞాన్ ముద్ర ఏకాగ్రత కోసం ప్రాథమిక యోగ ముద్రగా ఉంది. ఉదయం పద్మాసనంలో కూర్చుని ఈ ముద్రను చేయాలి. ఈ ముద్ర ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది నిద్రలేమి నివారణతో పాటు కోపాన్ని అదుపులో ఉంచుతుంది.

ఆధమరు: తెలుగు.వెబ్ దునియా.కం

యోగాసనాలు వేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి!

యోగాసనాలు వేసే ముందు కొన్ని జాగ్రత్తలు విధిగా పాటించాల్సి వుంటుంది. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగాకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితాలను చూస్తారు.

ఆసనాలు వేస్తున్నాం కదా.. అని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.

 • ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగా చేయాలి.
 • తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే యోగాసనాలు వేయాలి.
 • ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.
 • తెల్లవారుజామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
 • శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.
 • పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా మీకు ఇష్టమైన ఆసనాన్ని వేయండి.
 • ప్రశాంతంగా కనులు మూసుకోండి.
 • మీ ధ్యాస శ్వాసమీదే నిలపాలి.
 • గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించండి. (దీనికై, పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరి కాదని గుర్తించాలి.)
 • ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి.
 • ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందర పడొద్దు.
 • వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి.
 • ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి.
 • కుంభకం వేసేటపుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే వేయాలి.
 • గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
 • ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకండి. మీ శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే ఉండండి.

ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం

యోగా: ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

 • ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.. శరీరం కాంతివంతమవుతుంది.
 • జీర్ణశక్తి పెరుగుతుంది.
 • మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
 • బద్ధకం తగ్గుతుంది.
 • రక్తం శుభ్రపడుతుంది
 • శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది
 • తద్వారా ఆక్సిజన్ బాగా అందుతుంది
 • నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై చురుకుగా ఉంటారు.
 • కుండలినీ శక్తి మేలుకుంటుంది.
 • రజో గుణం, తమోగుణం నశిస్తాయి.
 • మంచి ఆకలి, ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి.
 • రక్తం శుభ్రపడుతుంది.

ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం

వైట్ కాలర్ ఉద్యోగమా...? మానసిక పటుత్వానికి భుజంగాసనం వేయండి

సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని ఆసన అంటే వ్యాయామం అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. ఈ ఆసనం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికిగాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.

విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.

ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి. భుజంగాసనం రెండు విధాలుగా ఉంటుంది: సాధారణం, సంక్లిష్టం.

భుజంగాసనం వేయు విధానం :
 • మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి.
 • కాలిమడమల బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.
 • చుబుకాన్ని నేలకు ఆనించాలి.
 • అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి.
 • మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక ప్రక్కగా ఉంచండి.
 • మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు.
 • ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి.
 • నాభి స్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి.
 • తిరిగి మెల్లగా మకరాసనంలోకి రండి.
ప్రయోజనాలు :
 • రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ది చేకూరుస్తుంది.
 • అండాశయం మరియు మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
 • గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. పొత్తికడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
 • మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
 • స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేయండి.
 • పెద్దప్రేగు మరియు పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.
 • వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి భుజంగాసనం మంచి వ్యాయామం.
 • ఐటి ఉద్యోగులు క్రమం తప్పకుండా భుజంగాసనం వేయాలి. వీరి శారీరక, మానసిక పటుత్వానికి ఇది సరైన వ్యాయామం

ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం

3.0
పి.శివ Jun 29, 2015 08:34 PM

యోగ అంటే నాకు చాలా ఇష్టం

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు