অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హోమియోపతి మరియు అల్లోపతి

హోమియోపతి మరియు అల్లోపతి

 1. హోమియోపతి - పరిచయం
 2. చికిత్సలు, నివారణలు
  1. తయారీ విధానం
  2. పలుచగా చేయడిన మిశ్రమాలు
  3. చికిత్స ఫలవంతమైనట్లు ఋజువులు
 3. "చురుకుగా పనిచేసే" వస్తువులు
 4. సంబంధిత సాధనలు
  1. ఐసోపతి
  2. పుష్పాలతో చికిత్సలు
  3. ఎలక్ట్రో హోమియోపతీ
 5. జాతీయ హోమియోపతీ సంస్ధ, కలకత్తా
 6. డిప్రెషన్‌ - హోమియో వైద్యం
 7. చిన్న చిన్న సమస్యలకు హోమియో పరిష్కారాలు
  1. మీ హోమియో కిట్...
  2. హోమియో మందులు ఎలా పనిచేస్తాయి?
  3. హోమియో - అపోహలు - వాస్తవాలు
 8. వివిధ వ్యాధులు - హోమియో వైద్యం
  1. డయాబెటిస్ రోగుల్లో ఆర్థరైటిస్ ముప్పు
  2. ఊపిరి...ఉక్కిరి బిక్కిరి
  3. రుమాటిక్ వ్యాధులకు ఆధునిక వైద్యం
  4. హిస్టీరియా
  5. గర్భాశయం జారిపోతే...
  6. డిఫ్తీరియా
  7. వేధించే ఎగ్జిమాకు హోమియో చికిత్స
  8. మతిమరుపుకు మందు అల్యూమిన్
  9. జాగ్రత్తలు
  10. అల్జీమర్స్‌కు నిద్ర మందు!
  11. మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
  12. ఫంగస్ వ్యాధుల (తామర) నివారణకు
  13. నెలసరి కడుపు నొప్పి
  14. గర్భాశయ సమస్యలకు పల్సటీల్లా
  15. న్యుమోనియాకు బ్రయోనియా
  16. మధుమేహ నియంత్రణలో హోమియో
  17. సుఖవ్యాధులు హోమియో చికిత్స
  18. అల్లొపతీ(Allopathy):
  19. అల్లోపతి వైద్యం ఆవిర్భావం

హోమియోపతి - పరిచయం

ఈ రోజుల్లో హోమియోపతి వేగంగా అభివృధ్ది చెందుతున్న విధానం. ఇది ఇంచుమించుగా ప్రపంచమంతటా అనుసరించబడుతున్నది. హోమియోపతీ యొక్క బిళ్లల భధ్రతతో, ఇది సురక్షితమైన, సున్నితమైన వ్యాధి నివారణ స్వభావంతో ఉండడం వల్ల ప్రతి ఇంటా వినిపిస్తూ వుండే మాటగా మారింది. ఉజ్జాయింపుగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం తమ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు ఇంచుమించు 10 శాతం భారతదేశ జనాభా పూర్తిగా హోమియోపతి వైద్యం మీదే ఆధారపడి ఉన్నట్లు తేలింది, అలాగే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ వైద్య విధానంగా ఇది పరిగణించ బడుతోంది.

భారతదేశంలో నేటికి ఒకటిన్నర శతాబ్దానికి మించి హోమియోపతి విధానం అనుసరించబడుతోంది. జాతీయ వైద్య విధానాలలో ఒకటిగా గుర్తించబడి, దేశ సాంప్రదాయాలతో మిళితం చేయబడిన విధానంగా ఇది పాతుకుపోయింది. అధిక సంఖ్యాక ప్రజానీకానికి ఇది ఆరోగ్య సంరక్షణను కలుగజేయడంలో ఒక అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తోంది. అనారోగ్యంతో ఉండే వ్యక్తి యొక్క మానసిక, భావోద్రేక, ఆధ్యాత్మిక మరియు శారీరక స్ధాయిలను అంతర్గత సమతుల్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మరియు పరిపూర్ణమైన చికిత్సా విధానంతో, ఋజువు కాబడినదిగా దీని ప్రతిభ, సామర్ధ్యం విదితమవుతాయి.

‘హోమియోపతి’ అనే మాట ‘హోమోయిస్’ అంటే అదే మాదిరి మరియు ‘పథోస్’ అంటే బాధపడడం, అనే రెండు గ్రీకు మాటల నుండి ఉధ్బవించింది. సూక్ష్మంగా హోమియోపతి వైద్యం అంటే ఆరోగ్యవంతులు ఈ మందులను తీసుకున్న వెంటనే అదే వ్యాధి వంటి లక్షణాలు చూపించగలిగే సామర్ధ్యంతో ఉండే, ఖచ్ఛితమైన మరియు సూక్ష్మమైన మోతాదులతో వ్యాధి నివారణతో నయం చేయడం. ఈ చికిత్సా విధానం ‘సిమిలియా సిమిలబస్ క్యూరేంటర్’ అంటే ఒక రకమైన వ్యాధి, అదే రకమైన వ్యాధికారకాలతో నయం చెయ్యబడడం అనే అర్ధం వచ్చే, ఉపశమనాన్ని కలిగించే ప్రకృతిసిధ్దమైన సూత్రంపై ఆధారపడి ఉంటుంది. 19వ శతాబ్ధం మొదట్లో దీనికి ఒక శాస్త్రీయ ప్రతిపత్తిని కలుగజేసింది డా. శామ్యుల్ హనేమాన్ (1755-1843). డా. హనేమాన్ యొక్క సిధ్ధాంతపరమైన ఆలోచనా విధానంతో, సహజమైన, సమర్ధవంతమైన మరియు. శాస్త్రీయ సూత్రాల ఆధారంగా రెండు శతాబ్దాలకు పైగా ఇది బాధననుభవిస్తూ ఉండే మానవాళికి సేవచేస్తూ, కాలమాన పరిస్ధితులకు తట్టుకుని నిలబడగలిగి, కాలగమనంతో పరీక్షింప తగ్గ చికిత్సా విధానంగా అవతరించి, ఈ నాటికీ విజయవంతంగా అనుసరింపబడుతోంది.

చికిత్సలు, నివారణలు

‘చికిత్స లేక నివారణ’ అనేది రోగి వినియోగానికి ఉద్దేశింపబడి ఒక ప్రత్యేక పధ్దతిలో తయారు చేయబడిన ఒక పదార్ధం అనే భావాన్నిచ్చే హోమియోపతీలోని ఒక సాంకేతిక పదం. ఇది సామాన్యంగా వాడుతూ వుండే మాటలతో అర్ధాన్నిచ్చేది అని అనుకోవడానికి లేదు.

చికిత్స లేక నివారణలను సూచించే ముందు హోమియోపతి వైద్యులు రెండు రకాలైన నిర్దేశకాలను (రిఫరెన్స్) చూస్తారు – మెటిరియా మెడికా (వైద్య పదకోశం) మరియు వివిధ వైద్య శబ్ద భాండాగారాలవంటి గ్రంధాలను పరిశీలించి చూస్తారు – ఒకటి హోమియోపతి మెటిరియా మెడికా అంటే ‘మందులకు సంబంధించిన చిత్రాల’ తో అక్షరక్రమంలో వ్రాయబడిన ‘చికిత్స లేక నివారణల’ సంకలనం వంటిది. ఇది ఒక్కొక్క నివారణకు, చికిత్సకు, నివారణకు సంబంధించిన వ్యాధి లక్షణాలను అదే అక్షరక్రమంలో వివరిస్తుంది. హోమియోపతీ రిపర్టరీ (వివిధ వ్యాధులకు సంబంధించిన విషయాలను వివరించే ఒక గ్రంధం వంటిది) స్పష్టమైన వ్యాధి లక్షణాలకు సంబంధించిన చికిత్సలు లేక నివారణల జాబితాతో ఉండే ఒక విషయసూచిక వంటిది.

తయారీ విధానం

స్ఫటికాలు మరియు నత్తగుల్లలతో సహా పొడిగా చేయడానికి వీలుకానటువంటి పదార్ధాలను పొడిగా చేయడానికి రోలు, రోకలి మరియు పొత్రాన్ని వాడడాన్ని హోమియోపతి చికిత్సలలో ఉపయోగించేవారు.

వ్యాధులకు నివారణలను తయారుచేయడంలో డైనమేజేషన్ లేక పొటెంటైజేషన్ అనే ఒక ప్రక్రియను వినియోగించేవారు. సక్సిషన్ అనే ఒక ప్రక్రియతో ఒక పదార్ధాన్ని ఆల్కహాల్ లేక శుధ్దిచేసిన నీటితో కలిపి, పలుచగా చేసి, అటు తర్వాత దానిని తీవ్రంగా కుదుపుతూ 10 దెబ్బలతో సాగుతూ వుండే దానిపై బాదుతూ ఉండేవారు. హనేమాన్ చికిత్స చేస్తూ ఉండే వ్యాధిలో ఉండే లక్షణాలనే ఉత్పత్తి చేయగలిగే పదార్ధాలను ఉపయోగించడాన్ని సూచించాడు. అయితే, ఈ పదార్ధపు మోతాదులు ఒకోసారి ప్రమాదకరమైన, విషపూరితమైన ప్రతిచర్యలకు దారితీస్తూ వ్యాధి లక్షణాలను మరింతగా ముదిరేటట్లు, తద్వారా పరిస్ధితి తీవ్రతరం చేస్తున్నట్లుగా కనిపెట్టేడు. అందుచేత, ఇటువంటి పదార్ధాల తీవ్రతను తక్కువ చేయాలని స్పష్టీకరించాడు. ఈ తీవ్రత పలుచన చేయబడిన పదార్ధాన్ని తయారు చేయడానికి సక్సిషన్ అనే ప్రక్రియ మరింత బలంగా చేసి, చురుకుగా పని చేయిస్తున్నట్లు తెలుసుకున్నాడు. సక్సిషన్ ను చేయడానికీ వీలుగా హనేమాన్ పేటికలను తయారుచేసే వడ్రంగి చేత చెక్కతో ఒక పక్క గుర్రపు జుట్టుతో నింపబడి, తోలుతో కప్పబడి ఉండే ఒక ప్రత్యేక బోర్డును చెక్కతో తయారు చేయించాడు. నీటిలో కరగనటువంటి పదార్ధాలు, అంటే స్ఫటికశిల, నత్తగుల్లలు వంటివి పాలపంచదారతో (ల్యాక్టోజ్) (ట్రిట్యురేషన్ - చూర్ణంక్రింద చేయడం) కలిపి, నూరడం ద్వారా పిండిగా పలుచగా చేయబడతాయి.

పలుచగా చేయడిన మిశ్రమాలు

హోమియోపతిలో మూడు క్రమ పధ్దతులలో సంవర్గమానాల (లోగారిధమ్స్) యొక్క శక్తి కొలమానాలు ఉపయోగంలో ఉన్నాయి. హనేమాన్ ప్రతి దశలోనూ ఒక పదార్ధాన్ని 100 తో పలుచన చేస్తూ సెంటెసిమల్ (100వ వంతు భాగం ) లేక సి (C) కొలమానాన్ని సృష్టించాడు. అతని జీవితకాలంలో చాలావరకూ హనేమాన్ సెంటిసేమల్ ను అనుసరించడంలో ఇష్టం కనబరచాడు. 2సి పలుచగా చేయబడిన పదార్ధం అంటే ఒక పదార్ధం వందలో ఒక భాగానికి పలుచన చేయబడి, అటు తర్వాత దానిలో కొంత భాగం మరొకసారి ఒక వందలో ఒక భాగానికి మరింత పలుచన చేయబడుతుంది. ఇది అసలు ద్రవ పదార్ధం యొక్క 10,000 భాగాలలో 1 భాగం అవుతుంది. ఒక 6-సి తో పలుచన చేయబడిన పదార్ధం దీనిని 6 సార్లు మరల తిరిగి చేస్తుంది, ముందుగా పలుచన చేయబడని అసలు (ఒరిజినల్) పదార్ధం యొక్క గుణకం 100−6=10−12(one part in one trillion or 1/1,000,000,000,000). పలుచన చేయబడుతుంది తరువాత, పలుచనలను చేసే ప్రక్రియలు కూడా ఇదే పధ్దతి ద్వారా జరుగుతాయి. హోమియోపతీలో అతి పలుచగా ఉండే ఒక సొల్యూషన్ (ఇతర పదార్ధాలతో మిశ్రమం చేయబడినటువంటిది) అధిక శక్తిని కలిగి ఉన్నదిగా నిర్వచింపబడుతుంది. అలాగే అత్యధికంగా పలుచన చేయబడిన పదార్ధాలు హోమియోపతి వైద్యులచే చాలా శక్తివంతమైన, బలమైనవిగా లోతైన రీతిలో పనిచేసే నివారణలుగా పరిగణించబడతాయి. వాడుకోవడానికి అనువుగా, చివరిగా తయారైన ఉత్పత్తి ఎంత పలుచన చేయబడుతుందంటే దీనిలో మిశ్రమంగా కలుపబడే స్వఛ్చమైన నీరు, పంచదార లేక ఆల్కహాల్ పదార్ధాలు వేటినుండీ కూడా విడిగా చూడడం సాధ్యం కాదు. చాలా వాటి కోసం హనేమాన్ 30సి స్ధాయిలో పలుచన చేయడాన్ని సూచించాడు. (అంటే, గుణకం 10-60 తో పలుచన చేయడం). హనేమాన్ కాలంలో నివారణలు పరిమితి లేకుండా పలుచన చెయ్యవచ్చని ఊహించడం సబబైనదే. ఎందుకంటే ఒక పరమాణువు లేక అణువు ఒక రసాయన పదార్ధపు సూక్ష్మాతి సూక్ష్మమైన యూనిట్ అనే భావన సబబైనదిగా విశ్వసింపబడడం, గుర్తింపబడడం కూడా అప్పుడే ప్రారంభమయింది కాబట్టి. సముచితంగా, పలుచన చేయబడని అసలు (ఒరిజినల్) పదార్ధంలో కనీసం ఒక అణువైనా ఉండడానికి అవకాశం ఉన్న అత్యంత పలుచన చేయబడే ప్రక్రియ 12సి.

చికిత్స ఫలవంతమైనట్లు ఋజువులు

హనేమాన్ రోగులపై చికిత్సను చేపట్టేముందు తనపైన మరియు ఇతరులపైన, అనేక సంవత్సరాల పాటు, ప్రయోగాలు చేసాడు. నివారణతో ఏ విధమైన లక్షణాలను వచ్చాయో, అలాగే వ్యాధి నుండి ఏ విధమైన లక్షణాలు వచ్చాయి అనే దాన్ని నిర్ణయించడాన్ని, సరిగా అదే మాదిరిగా ఉండే వ్యాధి లక్షణాలను పుట్టించే సమర్ధత కల ఒకే మాదిరి నివారణ అసాధ్యం చేస్తుంది, అని అతను నమ్మడంవల్ల ముందుగా అనారోగ్యంతో ఉన్నవారికి నివారణ కోసం అతను ప్రయోగాలు చేయలేదు. అందుచేత అనారోగ్యంతో ఉన్న వారు ఈ ప్రయోగాల నుండి మినహాయింపబడే వారు. నిర్దుష్టమైన వ్యాధులకు ఏ చికిత్సలు, ఏ నివారణలు అనువుగా ఉంటాయి అన్న విషయాన్ని నిర్ణయించుకునేందుకు ఉపయోగించే పధ్దతికి), ప్రూవింగ్ (ఋజువు చేయడం) అనే మాట ఉపయోగంలోకి వచ్చింది. ఇది వాస్తవంగా జర్మన్ మాట అయిన ‘ప్రోఫంగ్’, అంటే ‘పరీక్ష (టెస్ట్)’ నుండి వచ్చింది. హోమియోపతి ఋజువు హోమియోపతి చికిత్స, నివారణ యొక్క స్వరూపాన్ని నిర్ణయించే పధ్దతి.

"చురుకుగా పనిచేసే" వస్తువులు

చికిత్సలో, నివారణలో కనిపిస్తూ ఉండే వస్తువులు ఈ ఉత్పత్తిలో వాస్తవంగా కలిసివుంటాయనే నమ్మకంతో వినియోగ దారులను అపోహలోకి నెట్టివేయవచ్చు. సాధారణ హోమియోపతి సాధనల ప్రకారం పూర్తయిన ఉత్పత్తిలో చురుకైన దినుసులు మామూలుగా వర్ణించినట్లు కాకుండా, అవి సజీవంగా ఉండని స్ధితి వరకూ పలుచన చేయబడిన, చురుకైన వస్తువులతో నివారణను తయారుచేయడం ప్రారంభించబడుతుంది. వాస్తవంగా వీటి తయారీలో ఉపయోగించబడిన వస్తువుల జాబితా మొదట వాడిన వస్తువులను సూచిస్తూ ఉంటుంది. ఈ క్రింద ఇవ్వబడినది ప్రయోగాత్మకమైన ప్రత్యక్షమైన ఉదాహరణ:

సంబంధిత సాధనలు

ఐసోపతి

హోమియోపతిలో నుండి పుట్టినటువంటిది ఐసోపతి అనే చికిత్స. ఇది 1830 సం||లలో జోహాన్ జోసెఫ్ విల్హెమ్ లక్స్ చే కనిపెట్టబడింది. సాధారణంగా ఐసోపతి హోమియోపతికి సంబంధం లేనిది. ఇందులో ‘నోసోడ్స్‘ అనే చికిత్సలు, నివారణలు వ్యాధిని కలుగజేసే వాటితో లేక వ్యాధికి సంబంధించిన ఉత్పత్తులనుండి చేయబడినటువంటివై ఉంటాయి, అంటే చీము వంటివి. ‘హోమియోపతి టీకాలు’ అని పిలువబడే అనేకమైనవి ఐసోపతి రూపం వంటివి.

పుష్పాలతో చికిత్సలు

పుష్పాలతో చికిత్సలు, నివారణలకు పుష్పాలను నీటిలో వేసి, వాటిని సూర్యరశ్మికి గురిచేయడం ద్వారా తయారు చేయవచ్చు. ఎడ్వర్డ్ బాక్ అనే వైద్యుడు మరియు హోమోపత్ చే అభివృధ్ది చేయబడిన అత్యంత ప్రముఖమైన బాక్ పుష్పలతో చికిత్సలు. నివారణలు వీటిలో ముఖ్యమైనవి. ఈ చికిత్సలను, నివారణలను ప్రతిపాదించిన వారు హోమియోపతి యొక్క ప్రధాన ప్రాపంచిక దృష్టిని పంచుకుంటున్నప్పటికీ, మరియు ఈ చికిత్సలు, నివారణతలు హోమియోపతి లాగే ప్రధాన శక్తితో పనిచేస్తున్నాయని చెబుతున్నప్పటికీ, వీటిని తయారుచేసే విధానంలో తేడా ఉంది. ఈ బాక్ పుష్పలతో చికిత్సలు ‘సున్నితమైన, మృదువైన’ పధ్దతిలో తయారు చేయబడతాయి, అంటే ఆ పుష్పాలను సూర్యరశ్మిలో ఉండే నీటితో నింపిన కప్పుల వంటి వాటిలో ఉంచడం, అలాగే చికిత్సలు, నివారణలు కూడా సక్సెషన్ చేయబడనివి. ఈ పుష్పాలతో చికిత్సలు సమర్ధవంతమైనవని చెప్పడానికి ఏ విధమైన, సంతృప్తికరమైన శాస్త్రీయ లేక చికిత్సా సంబంధిత (క్లినికల్) ఋజువులు లేవు.

ఎలక్ట్రో హోమియోపతీ

ఎలక్ట్రో హోమియోపతి చికిత్సలో హోమియోపతీని విద్యుత్ చికిత్సతో కలిపి చేసే 19వ శతాబ్దపు చికిత్సావిధానం ఇది.

జాతీయ హోమియోపతీ సంస్ధ, కలకత్తా

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం క్రింద జాతీయ హోమియోపతీ సంస్ధ (ఎన్.ఐ.హెచ్-NIH) కలకత్తాలో 10 డిసెంబరు 1975లో ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్ధగా నెలకొల్పబడింది. ఈ సంస్ధ 1987 నుండి హోమియోపతీలో డిగ్రీ కోర్సులను, 1998-99 నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. 2003-04 వరకూ ఎన్.ఐ.హెచ్ (NIH) కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్ధగా ఉండేది. అటు తరువాత 2004-05 నుండి పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయానికి (వెస్ట్ బంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) అనుబంధ సంస్ధగా మారింది. ఎన్.ఐ.హెచ్. (NIH) ఉపాధ్యాయులకు మరియు వైద్యులకు రెగ్యులర్ ఓరియంటేషన్ కోర్సులను కూడా అందిస్తోంది.

బి.హెచ్.ఎమ్.ఎస్. (BHMS) కోర్సు 5½ (అయిదున్నర) సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది (ఒక సంవత్సరం పాటు విధిగా ఉండే ఇంటరన్ షిప్ తో కలిపి). ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ (వైద్యంలో శాస్త్రవిచార సూత్ర పధ్దతి), రిపర్టరీ (గ్రంథస్థ బాంఢారానికి సంబంధించినది) మరియు మెటిరియా మెడికా (వైద్య పద కోశానికి సంబంధించినది) అనే మూడు అంశాలలో (సబ్జెక్టు లలో) ఎమ్.డి. (హోమియోపతి) కోర్సు అందుబాటులో ఉంది. ప్రతి అంశం (సబ్జెక్టు)లో ఆరు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ : National Institute of Homoeopathy

ఆధారము: ఆయుష్ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము

డిప్రెషన్‌ - హోమియో వైద్యం

కొందరు చిన్న చిన్న సంఘటనలకు కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. వారికి సరియైన సమయంలో చికిత్స ఇప్పించకపోయినట్లయితే సమస్య మరింత తీవ్రమయి ఇతరులను గుర్తుపట్టలేని స్థితికి వస్తారు. డిప్రెషన్ కాస్తా మానసిక వ్యాధిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు హోమియోలో మంచి వైద్యం అందుబాటులో ఉందంటున్నారు డాక్టర్ యం. శ్రీకాంత్. ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి తదితర అంశాలు డిప్రెషన్‌కు కారణమవుతుంటాయి. కొందరు డిప్రెషన్ నుంచి సులభంగానే బయటపడతారు. కొందరిలో మాత్రం ఏళ్ల తరబడి ఉంటుంది. సాధారణంగా డిప్రెషన్ మూడు రకాలుగా ఉంటుంది.

 1. మేజర్ డిప్రెషన్ :చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇది వ్యక్తి జీవితవిధానంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. చదువు, నిద్ర, ఆహారం విషయంలో, ఇతర పనులతోనూ సంబంధం కలిగి ఉంటుంది. జీవితాంతం వేధించే సమస్య ఇది.
 2. డిస్‌థిమియ:ఇది కొంచెం తక్కువ స్థాయిలోఉంటుంది. కానీచాలా ఏళ్ల వరకు ఉంటుంది. డిస్‌థిమియాతో బాధపడుతున్న వారు రోజువారీ పనులను చేసుకోగలుగుతారు. కానీ ఉత్సాహంగా చేయలేరు.
 3. బై పోలార్ డిజార్డర్ :దీనిని మానిక్ డిప్రెషన్ అని కూడా అంటారు. దీనిలో డిప్రెషన్, సివియర్ డిప్రెషన్‌తో పాటు కొన్నిసార్లు మానియా కూడా ఉంటుంది.

లక్షణాలు:
ఆందోళన, ఆత్రుత, చిరాకు, తప్పు చేశాననే భావన, నిరాశ, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, చనిపోవాలనే ఆలోచనలు, కొన్ని సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి లక్షణాలు డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి.

బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తికి మాట్లాడటంలో ఇబ్బంది, పనిలో తొందరపాటు, పనిమీద ఆసక్తి లేకపోవడం, నిద్రలేమి, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. డిప్రెషన్ లక్షణాలు వ్యక్తులను బట్టి, సమస్య తీవ్రతను బట్టి మారుతుంటాయి.

కారణాలు :

 • జన్యుపరమైన కారణాల వల్ల డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి.
 • మెదడులోని కొన్ని రసాయన మార్పుల వల్ల(న్యూరోట్రాన్స్‌మిటర్స్‌లో మార్పు) డిప్రెషన్‌కు లోనవుతారు.
 • మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు, విడాకులు, దగ్గరి వ్యక్తులు చనిపోవడం లాంటి సమస్యలు డిప్రెషన్‌కు కారణమవుతాయి.
 • ఆరోగ్యపరమైన ఇబ్బందులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
 • స్టిరాయిడ్స్, నార్కోటిక్స్ వంటి మందుల వాడకం వల్ల డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది.
 • మానసిక వ్యాధులు, ఆందోళన, స్కిజోఫ్రినియా వల్ల నిరాశ, నిస్పృహలకు గురికావచ్చు.

చికిత్స :
సాధారణ డిప్రెషన్‌ను తగ్గించడానికి కౌన్సెలింగ్, యాంటీడిప్రెసెంట్ మందులు బాగా ఉపకరిస్తాయి. ఎలక్ట్రో కంవల్సివ్ థెరపీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స వల్ల మెదడులో రసాయనిక మార్పులు జరుగుతాయి. తద్వారా డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయి. యోగా, ధ్యానం వంటివి రోగిని సాధారణ స్థితికి తీసుకురావడానికి బాగా ఉపకరిస్తాయి. హోమియో వైద్య విధానంలో శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి మూల కారణాన్ని తొలగించేందుకు అవసరమైన మందులను ఇవ్వడం జరుగుతుంది.

బెల్లడొన :కోపం, నవ్వడం, పండ్లు కొరకడం, మతిస్థిమితం లేని వారిగా ప్రవర్తించడం, దయ్యాలు, జంతువులు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయనే భావన వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు. ఏదీ లేకపోయినా ఏదో ఉందీ అని అరవడం, అసభ్యంగా మాట్లాడటం, నిద్రలేమి, శబ్దం వల్ల సమస్య ఎక్కువకావడం, రాత్రివేళ తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ మందు ఇవ్వవచ్చు.

కోనియం :జ్ఞాపకశక్తి తగ్గడం, తొందరగా బాధపడే స్వభావం, కోపం, గట్టిగా అరవడం, ఎదురు మాట్లాడితే భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపకరిస్తుంది. అర్జెంటమ్ నైట్రికం : తెలియని ఆందోళన, ఎప్పుడూ మత్తుగా ఉన్నట్లు అనిపించడం, తలనొప్పి, ఆరోగ్యం గురించి ఆందోళన, ఒకచోట కుదురుగా ఉండలేకపోవడం, అతితొందర వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన మందు.

హయోసయామస్ :ఆత్రుత, నిలకడలేకపోవడం, భయపడే స్వభావం, అసూయ, అనుమానం, ఎక్కువగా మాట్లాడటం, ఏడ్చే స్వభావం, కోపం, రాత్రివేళ సమస్య అధికం కావడం, నడిచినపుడు, ముందుకు వంగినపుడు ఉపశమనంగా అనిపించడం, చిరాకు, నోరు ఎండిపోవడం, మూత్రాశయ ఇబ్బందులు, తలనొప్పి, పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి దివ్యౌషధం.

స్ట్రామోనియం :అధికంగా మాట్లాడే స్వభావం, అతిగా నవ్వడం, పాటలు పాడుతూ ఉండటం, ఎక్కువ వెలుతురును చూసినపుడు సమస్య అధికం కావడం, చీకటి అంటే భయం, పొడవుగా ఉన్నానని అనుకోవడం, దయ్యాలు, జంతువులు కనిపిస్తున్నాయనే భావన, శబ్దాలు వినిపిస్తున్నాయని అనడం, చిన్న వస్తువులు పెద్దగా కనిపించడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.

-డా. యం. శ్రీకాంత్

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

చిన్న చిన్న సమస్యలకు హోమియో పరిష్కారాలు

ఉష్ణం ఉష్ణేన శీతలం, వజ్రాన్ని వజ్రమే కోస్తుంది లాంటివి మన సామెతలే. వీటిని  చాలాసార్లు వినే ఉంటారు. కానీ శామ్యూల్ హనీమన్ మహనీయుడు ఆ సిద్ధాంతాలను చికిత్స ప్రక్రియకు అన్వయింపజేశాడు. అలా అందరికీ అందుబాటులో ఉండే చవకైన, సులభమైన ఒక కొత్త చికిత్స ప్రక్రియకు నాంది పలికాడాయన. చాలా మందికి చికిత్స అంటే భయం. మరెంతో ఆందోళన. చేదు మందుల్ని మింగాల్సి వస్తుందనీ, మేని కోతల్ని భరించాల్సి వస్తుందనే బెంగ. వీటన్నింటినీ దూరం చేస్తూ... ‘‘రోగి కోరేదీ... వైద్యుడిచ్చేదీ ఒకటే అయితే...’’ అనే మనదైన మరో సామెతనూ నిజం చేసేలా మందుల్ని రూపొందించాడాయన. ఏప్రిల్ నెల 10న ఆయన పుట్టిన రోజు.

దీన్ని ప్రపంచ హోమియో దినంగా జరుపుకుంటున్న సందర్భంగా... ఈ చికిత్స ప్రక్రియపై అవగాహనతో పాటు... మనకు రోజూ కనిపించే అనేక చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల కోసమే ఈ ప్రత్యేక కథనం.

మీ హోమియో కిట్...

జ్వరాలు (ఫీవర్స్)

అనేక రుగ్మతలకు జ్వరం ఒక లక్షణం మాత్రమే. హోమియోలో లక్షణాల ఆధారంగా మందును నిర్ణయిస్తారు కాబట్టి జ్వరంతో పాటు ఆయా లక్షణాలను బట్టి వాడాల్సిన మందును నిర్ణయించుకోవచ్చు.

బెల్లడోనా: అకస్మాత్తుగా జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే... అతి ప్రేమ-ఆప్యాయతలు కనబరచడం, కోపం వంటి లక్షణాలు ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక పులుపు ఎక్కువగా ఇష్టపడేవారూ, జ్వరం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా మారిపోయేవారికి ఇది మంచి మందు.

అకోనైట్: తీవ్రమైన జ్వరం (హైఫీవర్), అతి భయం, చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన చెందడం, తలనొప్పితో బాధపడటం, మాటిమాటికీ దగ్గు, జలుబు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.

క్యాంథరిస్: తరచూ మూత్రంలో మంట వల్ల తీవ్రమైన జ్వరం (హై ఫీవర్), విపరీతమైన కోపం, చలిజ్వరం, మూత్రంలో మంటరావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడాలి. మందు తీసుకున్న నాలుగు గంటల్లో జ్వరం తగ్గుతుంది.

చైనా: మాటిమాటికీ చలిజ్వరం , సాయంకాలం జ్వరం, అన్ని విషయాలపై అసంతృప్తిగా ఉండటం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో నాలుగు వారాలు వాడటం వల్ల జ్వరం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది.

బాప్టీషియా: లోజ్వరం, దీర్ఘకాలం జ్వరం కొనసాగడం వల్ల రక్తం విషపూరితం కావడం, దాహం తక్కువగా ఉండటం, చెమట వాసనతో ఉండటం లాంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు.

ఆర్సినిక్ ఆల్బమ్: చలిజ్వరం, అతి దాహం, జ్వరం వచ్చినప్పుడు నిద్రలేకపోవడం, అర్ధరాత్రి నిద్రలేవడం, జ్వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవడం, భయపడటం, అభద్రతా భావం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉదయం-సాయంకాలం ఒక డోసు వాడితే జ్వరం తగ్గిపోతుంది.

రస్టాక్స్: జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, నాలుక తడారిపోవడం, చలి ఎక్కువగా ఉండటం, నిద్రలేకపోవడం వంటి లక్షణాలకు ఈ మందును 200 పొటెన్సీలో ఒక్క డోసు వాడాలి.

స్పంజియా: తరచూ జలుబు, పసుపు రంగులో గల్ల (కళ్లె) పడటం, ఉదయం దగ్గురావడం, వేడిని తట్టుకోలేకపోవడం, జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, దగ్గుతో తెమడ పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో రోజుకు రెండుసార్లు వాడవచ్చు.

సిలిసియా: ముక్కులు బిగుసుకుపోవడం, చలిగా ఉండటం, ఒళ్లంతా వణుకుతో జ్వరం, కాళ్లూ-చేతులు చల్లబడటం, ఎక్కువ చెమట వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.

పల్సటిల్లా: రోజు విడిచి రోజు జ్వరం రావడం, చలి తర్వాత వేడిగా అనిపించడం, దాహం లేకపోవడం, జలుబు వల్ల వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి శారీరక లక్షణాలతో పాటు సున్నిత స్వభావం కలిగి ఉండటం వంటి లక్షణాలు న్నవారికి ఈ మందును 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు.

కాలీ సల్ఫ్: రాత్రివేళల్లో తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) రావడం, తరచూ జ్వరం తిరగబెడుతుండటం, నాలుక పసుపురంగులో ఉండటం, త్వరగా కోపం రావడం, చిరాకుగా ఉండటం, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో వారం రోజుల పాటు వాడాలి.

అలోయేస్: నీళ్ల విరేచనాలతో జ్వరం రావడంతో పాటు వేడిని తట్టుకోలేకపోవడం, అందరిపై ఆధిపత్యధోరణి వంటి లక్షణాలు కలిగి ఉన్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో పై లక్షణాలతో జ్వరం వస్తే ఇది చాలా మంచి మందు.

పోడోఫిల్లమ్: దాహం తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం, విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉండటం, ఫుడ్‌పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది.

కోలోసింథిస్: కడుపునొప్పి రావడం, విరేచనాలు కావడం, ఏది తిన్నా /తాగినా విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.

జలుబు

నక్స్‌వామికా:  తరచూ వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన విసుగు, చలిని తట్టుకోలేకపోవడం కనిపిస్తే నక్స్‌వామికా 30 పొటెన్సీలో తీసుకోండి.

ఆర్సెనికమ్ ఆల్బమ్: తరచూ విపరీతంగా తుమ్ములు వస్తూ, దుమ్మూ-ధూళికి గురికాగానే అవి మరింత ఎక్కువ కావడం, అతిశుభ్రత, నిత్యం అపనమ్మకంతో పాటు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వంటి లక్షణాలుంటే 30 పొటెన్సీలో తీసుకోవాలి.

బొవిస్టా: విపరీతమైన తుమ్ములు, జ్వరం వచ్చినట్లుగా ఉండటం, ఏ పనిపైనా ధ్యాస లేకపోవడం, కొంచెం అమాయకత్వం, వేడిని తట్టుకోలేకపోవడం, దాహం తక్కువగా ఉండటం లాంటి లక్షణాలుంటే దీన్ని 30 పొటెన్సీలో  వాడుకోవచ్చు.

సిలిసియా: జలుబు వల్ల తల బరువుగా ఉండటం, గళ్ల (కళ్లె) పసుపురంగులో పడటం, పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపే గుణం ఉండటం, మొహమాటం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.

అల్లియమ్ సెపా: విపరీతమైన తుమ్ములతో పాటు కళ్ల నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం, తలనొప్పిగా ఉండటం, దగ్గు రావడం వంటి సమస్యలుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.

తలనొప్పి

నేట్రమ్ మూర్: ఎండలో ఎక్కువగా తిరిగితే వచ్చే తలనొప్పికి ఈ మందును వాడవచ్చు.

బెల్లడోనా: అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో పాటు ప్రతి చిన్న విషయానికీ కోపం రావడం, తలనొప్పి వల్ల ముఖం ఎర్రగా మారడం వంటి లక్షణాలున్నవారికి ఇది మంచి మందు.

స్పైజీలియా: తలనొప్పి వల్ల కళ్లనొప్పి కూడా రావడం, కళ్లు బరువుగా అనిపించడం, జ్వరం రావడం, సూది మందుకు త్వరగా భయపడటం, ఎడమవైపు నొప్పి, ఎండలో తలనొప్పి, మైగ్రేన్ వంటి తలనొప్పికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది.

బ్రయోనియా ఆల్బ్: తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలపై సుత్తితో కొట్టిన భావన. చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది.

సాంగ్యునేరియా: కుడివైపు తలనొప్పి విపరీతంగా ఉండటం, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉంటూ, రాత్రివేళ తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు చక్కగా పనిచేస్తుంది.

కడుపునొప్పి

కడుపునొప్పి ఉన్నవారు, ఇతర లక్షణాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ మందులను వాడుకోవచ్చు.

న్యాట్‌ఫాస్: కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎక్కువగా మసాలాలు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలతో పాటు మొహమాటం ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి మందు.

నక్స్‌వామికా: మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన గ్యాస్ సమస్యకు ఇది మంచి మందు. కోపం ఎక్కువగా రావడం, టైమ్‌కు ఆహారం తీసుకోకపోవడం వంటి వారికి ఈ మందును 30 పొటెన్సీలో ఇవ్వడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.

సీనా: కడుపులో నులిపురుగులు (వార్మ్స్ ఉండటం వల్ల వచ్చిన కడుపునొప్పికి ఇది మంచి మందు. కోపంతో ఉండే స్వభావం ఉన్నవారికి దీన్ని సూచించాలి.

కొలోసింథ్: మహిళల్లో రుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. విపరీతమైన కడుపునొప్పితో పాటు, రక్తస్రావం ఎక్కువగా కనిపించేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.

వడదెబ్బ

వేసవిలో వడదెబ్బ చాలా తరచూ కనిపించే సమస్య. దీనికోసం మందులివే...

గ్లోనైన్: వేడిని తట్టుకోలేకపోవడం, రక్తపోటు ఎక్కువ కావడం, తలనొప్పిగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి.

నేట్రమ్ మూర్: వడదెబ్బకు లోనైన ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత  లక్షణాలను సరిచూసుకుని ఈ మందువాడాలి. అవి... ఎవరితోనూ ఎక్కువగా మాటలాడకపోవడం, పనులపైనా ఎప్పుడూ అసంతృప్తితో ఉండటం, నీరసంగా ఉండటం, తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం వంటి సమస్యలున్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.

జెల్సీమియమ్: వేడిని తట్టుకోలేకపోవడం, అతి భయం, అన్ని విషయాలకూ ఆతృత పడటం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం... వంటి లక్షణాలు ఉంటే ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి.

నేట్-కార్బ్: ఎండలోకి వెళ్తే దద్దుర్లలా కనిపించడం, కళ్లు తిరగడం, వాంతులు రావడం, ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.

ఓపియమ్: అతిసున్నితత్వం, ఏ విషయంపైనైనా త్వరగా స్పందించడం వంటి లక్షణాలున్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో పాటు... ఎండలోకి వెళ్లి తిరిగి రాగానే నీరసంగా ఉండటం, అతినిద్ర, త్వరగా అలసిపోవడం, ఊబకాయం ఉన్నవారికి వడదెబ్బ రాకుండా నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. దీన్ని 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.

క్యాంఫర్: ఎండలోకి వెళ్లగానే కళ్లు తిరగడం, శరీరం, చేతులూ చల్లబడటం, చలికాలంలో హుషారుగా ఉండి, వేసవిలో నీరసంగా ఉండటం వంటి లక్షణాలుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.

చర్మంపై కనిపించే అలర్జీలు

కొందరికి పడని వస్తువులు తారసిల్లిన వెంటనే దాని గుణం చర్మంపై ప్రతిఫలిస్తుంది. అప్పుడు వాడాల్సిన మందులివి...

సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది మంచి మందు. అకస్మాత్తుగా ఒంటిపై దద్దుర్లు రావడం, ఆర్టికేరియా ర్యాష్, దద్దుర్లు పెద్దవి కావడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి తీసుకోవాలి.

నేట్-మూర్: ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

డల్కమారా: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. దద్దుర్లు పెద్దగా ఉండటం, వర్షంలో తడిసిన తర్వాత దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.

గ్రాఫైటిస్: గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. త్వరగా ఏడ్వటం, సున్నితమైన స్వభావం, లావుగా ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.

హెపార్ సల్ఫ్: చలికి తట్టుకోలేకపోవడం, దురద ఎక్కువగా ఉండటంతో పాటు దద్దుర్లు రావడం, తొందరపాటు ఎక్కువగా ఉండటం, విపరీతమైన కోపం రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది మంచి మందు.

ఏయే దేశాల్లో ఉంది?

ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రత్యామ్నాయ ఔషధంగా హోమియోవైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాలల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉంటోంది. అందులో ఫ్రాన్స్‌ది మొదటిస్థానం. ఇంగ్లండ్ రాజకుటుంబం హోమియోవైద్యాన్ని కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.

పొటెన్సీ అంటే...

హోమియో మందుల మోతాదును పొటెన్సీ అనే ప్రమాణం ద్వారా నిర్ణయిస్తారు. హోమియో మందుల్లో ఉన్న సామర్థ్యానికి (పవర్‌కు) పొటెన్సీ అన్నది ఒక సూచిక. హోమియో మందులో ప్రతి మందుకూ ఒక అత్యద్భుత శక్తి (డైనమిక్ పవర్) ఉంటుంది. ఏ జబ్బు తీవ్రతకు ఎంత మేరకు శక్తి కలిగిన మందు ఇవ్వాలన్నది హోమియో వైద్యులు నిర్ణయిస్తారు. జబ్బు తీవ్రతను బట్టి 200, 30, 1ఎమ్ అనే పొటెన్సీల్లో (మోతాదుల్లో) మందులు ఇస్తారు.

రోగి చేయాల్సిన పథ్యం...

హోమియో మందులు తీసుకునే వారు ఎలాంటి పథ్యాన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే రోగికి వచ్చిన జబ్బును బట్టి అతడిలోని వ్యాధిని తొలగించడానికి ఇచ్చే మందు ఒక అంతర్గత శక్తిలా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి ఆహారాలూ అవరోధించలేవు. కాబట్టి హోమియో మందులకు ఎలాంటి పథ్యనియమాలూ పాటించాల్సిన అవసరం లేదు.

హోమియో మందులు ఎలా పనిచేస్తాయి?

హోమియో మందు ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోడానికి హానీమన్ అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే చాలు. సింకోనా అనే మొక్క బెరడును తింటే వాంతులు అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని హనీమన్ పరిశీలించారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి హనీమన్ చాలా కొద్ది మోతాదులో సింకోనా బెరడును ఇచ్చారు. తత్ఫలితంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ వ్యక్తికి చలిజ్వరం తగ్గింది. ఏదైనా జబ్బుకు కారణమయ్యే అంశాన్ని చాలా కొద్ది మోతాదుల్లో ఇస్తే ఆ జబ్బు తగ్గుతుందనేది హోమియో ప్రధాన సిద్ధాంతం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని హానీమన్ ఎన్నో మొక్కలనుంచి, జంతువులనుంచి ఔషధగుణాలున్న రసాయనాలను సేకరించారు. అలాగే ఖనిజ లవణాలనుంచీ స్వీకరించి పరిశీలించారు. అలా ఎన్నో జబ్బులకు మందులను రూపొందించారు. కాబట్టి స్థూలంగా మనకు కనిపించే చక్కెర గోలీలు, వాహికగా పనిచే ఆల్కహాల్ ఒకటే అయినా... అందులో కలిపే మందు మాత్రం వేర్వేరుగా ఉంటుంది.

హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు

 • హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. తరచూ అభిప్రాయాలు మారడం ఇందులో ఉండదు.
 • హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం.
 • హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం.
 • హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.
 • ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహమంతటినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.
 • ఈ మందులతో ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు, పైగా వీటిని ఎన్ని రోజులు వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పని సరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు.
 • కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియోమందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలనూ దేహంలో వదలవు.
 • ఈ శాస్త్రం గురించి నిపుణులు రాసిన పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా అర్థమయ్యేరీతిలో రాసినవే ఇవన్నీ.

త్వరగా తగ్గే అవకాశాలూ ఉంటాయి...

సాధారణంగా హోమియో మందులు చాలా ఆలస్యంగా తమ ఫలితాలను కనబరుస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంతవరకూ ఇది నిజమే అయినా హోమియో చికిత్స ద్వారా కొన్ని వ్యాధుల విషయంలో చాలా త్వరగా గుణం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఈ ఆలస్యం జరగడానికి కారణం... చాలామంది చాలాకాలం పాటు అనేక వైద్య విధానాలను ప్రయత్నించి రోగాన్ని ముదరబెట్టుకుని, అప్పుడు హోమియో విధానానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో జబ్బు నయం కావడంలో ఆలస్యం జరగడం మామూలే. వ్యాధి అంతగా ముదరకముందే వస్తే నయం కావడం కూడా త్వరగానే జరుగుతుంది.

జబ్బు దానంతట అదే నయం అయ్యిదంటే కాస్త ఆలోచించాల్సిందే...

కొన్ని జబ్బులు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గుతాయని ఇంగ్లిష్ విధానంలో డాక్టర్లు చెబుతుంటారు. కానీ హోమియో విధానం ప్రకారం అది పూర్తిగా వాస్తవం కాదు. ఉదాహరణకు చిన్నప్పుడు వచ్చే ఉబ్బసం (ఆస్తమా) కొందరిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఇంగ్లిష్ మందుల ప్రక్రియలో చెబుతుంటారు. కానీ హోమియో వైద్య విధానం ప్రకారం అది తగ్గకుండా ఇంకొక అంచెకు చేరుకుంటుంది. అంటే... అది గ్యాస్ట్రిక్ సమస్యగానో లేదా హార్మోన్ల అసమతౌల్యతకో దారితీయవచ్చు. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది పూర్తిగా తొలగిపోయేలా చికిత్స జరగాలి. అందుకే హోమియో విధానంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు. వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి జబ్బు తగ్గేలా చేయడం కంటే... అసలు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి జబ్బులన్నవే మటుమాయం అయ్యేలా చేసే ప్రక్రియే హోమియో.

హోమియో సమర్థంగా తగ్గించిన వ్యాధులివి...

ట్యూబర్‌క్యులోసిస్, సిఫిలిస్, గనేరియా, సోరా (స్కేబిస్), క్యాన్సర్, కుష్టువ్యాధులను హోమియో మందులతో సమూలంగా తగ్గించవచ్చు.

19వ శతాబ్దంలో కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఇతర మందులతో నియంత్రించలేని దశలో హోమియో మందులతో తగ్గాయి.

హోమియో - అపోహలు - వాస్తవాలు

అపోహ: హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి. జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు పనిచేయవు.

వాస్తవం: హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులను, స్వల్పకాలిక వ్యాధులను రెండింటినీ నయం చేస్తుంది. జలుబు, ఇన్‌ఫెక్షన్‌లు, జ్వరం, అతిసార వంటి వ్యాధులను సమర్థంగా నయం చేస్తుంది.

అపోహ: హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి.

వాస్తవం: స్వల్పకాలిక అనారోగ్యాలకు తక్షణ చర్య ఉండేలా, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతోనూ మందులను రూపొందిస్తారు. ఆస్థ్మా, బ్రాంకైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆస్టియోపోరోసిస్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరు తెలియడానికి కొంత కాలం పట్టే మాట నిజమే. ఇది కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికీ మారుతుంది. వారి వారి వ్యాధి నిరోధక శక్తి, ఒత్తిడిని తట్టుకునేస్థాయి, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు వంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది.

అపోహ: హోమియోపతి మందుల తయారీలో స్టెరాయిడ్స్ వాడతారు.

వాస్తవం: హోమియోపతి మందులను మొక్కలు, జంతువుల నుంచి సేకరించిన సహజమైన పదార్థాలు, ఖనిజాలతో తయారు చేస్తారు. మొక్కలలో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల సత్ఫలితాలే తప్ప ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవని నిర్ధారణ అయింది.

అపోహ: గర్భిణులకు హోమియో మందుల వల్ల హాని కలుగుతుంది.

వాస్తవం: హోమియోపతి మందులు గర్భిణికి చక్కటి ఔషధం అని చెప్పాలి. అల్లోపతి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే వారికి చక్కటి ప్రత్యామ్నాయం హోమియో మందులే. గర్భిణిలో తల తిరగడం, రక్తహీనత, వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం, వేవిళ్లు, గుండెలో మంట, అతిసార, రక్తపోటు, ఆందోళన, ఉద్వేగానికి లోనుకావడం వంటి సమస్యలకు హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా హోమియో మందుల వాడకం శ్రేయస్కరమే.

అపోహ: హోమియో చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రక్రియలు ఉండవు, కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులకు హోమియోమందుల వల్ల ప్రయోజనం ఉండదు.

వాస్తవం: హోమియో మందులతో క్యాన్సర్‌ని సమర్థంగా నిర్మూలించిన సంఘటనలు అనేకం. క్యాన్సర్ రావడానికి మూలకారణాన్ని తెలుసుకుని, ఆ కారణానికి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది.

అపోహ: ఇన్‌ఫెక్షన్ తగ్గాలంటే యాంటీ బయాటిక్స్ తప్ప మరో మార్గం లేదు.

వాస్తవం: యాంటీ బయాటిక్స్ ఇన్ఫెక్షన్‌ని అణచివేస్తాయి, ఈ ప్రక్రియలో వ్యాధి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం జరగదు. వ్యాధి కారక మైక్రోబ్స్‌ను చంపకపోగా వ్యాధి లక్షణాలు అణచివేయబడతాయి. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం, వికారం, అతిసార వంటి సైడ్‌ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. హోమియో మందులు వ్యాధి కారక క్రిములను నిర్మూలించడంతోపాటు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఒకసారి హోమియో కోర్సు తీసుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ రావడానికి అవకాశాలు తక్కువ.

అపోహ: హోమియోపతిలో మందులంటే చక్కెర గుళికలు మాత్రమే.

వాస్తవం: హోమియోలోని చక్కెర గుళికలు మందును ఇముడ్చుకున్న రూపాలు మాత్రమే. హోమియో మందులలో మూడు వేల రకాల సమీకరణలుంటాయి. వ్యాధిని బట్టి ఏయే ఔషధాలను ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఆ మందును చక్కెర, పిండి పదార్థంతో కలిపి గుళికలుగా చేస్తారు.

అపోహ: హోమియోపతిలో చక్కెర గుళికల మందులు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కాదు.

వాస్తవం: హోమియో మందుల తయారీలో ఉపయోగించేది లాక్టోజ్ తియ్యదనమే, ఇందులో గ్లూకోజ్ ఉండదు. పైగా ఇందులో ఉండే చక్కెర అతి తక్కువ కాబట్టి ఇది రక్తంలో షుగర్‌లెవెల్స్ మీద ప్రభావం చూపదు. హోమియో వైద్యవిధానంలో ప్యాంక్రియాస్ గ్రంథిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే స్థితికి తీసుకురావడం సాధ్యమే. దీని ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు.

అపోహ: హోమియో మందులు వాడుతున్న కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీలను మానేయాల్సి ఉంటుంది.

వాస్తవం: హోమియో మందు వేసుకోవడానికి 15 నిమిషాల ముందు, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే నియమం ఉంటుంది. అంతే తప్ప ఏదీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో పరిమితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.

అపోహ: హోమియో వైద్యంలో ఎటువంటి పరీక్షలు చేయకనే వ్యాధిని నిర్ధారణ చేస్తారు.

వాస్తవం: హోమియో వైద్యంలో సాధారణంగా రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మందును నిర్ధారణ చేస్తారు. ప్రతి చిన్న అనారోగ్యానికీ పరీక్షలు చేయించి నిర్ధారణ చేయడం ఉండదు. కానీ కొన్ని రోగాలకు రోగ తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయిస్తారు.

హోమియో సిద్ధాంతాలూ... విధానాలు

హోమియో వైద్యుడికి ఉన్న ఏకైక, అతి ముఖ్యమైన లక్ష్యం రోగిని అస్వస్థత నుంచి దూరం చేసి అతడికి పూర్తి ఆరోగ్యాన్ని అందించడమే... హోమియోపతి డాక్టర్లందరికీ హనీమన్ చెప్పిన మొదటి సూత్రం ఇది.

‘ఆర్గనాన్ మెడిసిన్’ అనే పుస్తకం ద్వారా హోమియోపతి వైద్య విధానంలోని సిద్ధాంతాలను వివరించారు. అందులోని సిద్ధాంతాలను ‘అఫోరిజమ్స్’ అంటారు.

తొలి సిద్ధాంతం (అఫోరిజమ్)

రోగికి ఒక జబ్బుకోసం మందు ఇస్తే... అది ఆ జబ్బును అణిచివేయవచ్చు. కానీ అది మరికొన్ని రుగ్మతలకు దారి తీసే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మందు తీసుకోవడం అంటే మరికొన్ని జబ్బులను ఆహ్వానించడం లాంటిదే. అందుకే ఈ ఆధునిక సమాజం ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తోంది. ఒక జబ్బుకు మందు వేయడం వల్ల అది మరో స్థాయి (నెక్ట్స్ లెవెల్)కి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. ఉదాహరణకు చర్మ వ్యాధులను  ఆయింట్‌మెంట్ ద్వారా అణచివేస్తే అది శ్వాసకోశ వ్యాధులకూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులకూ, హార్మోన్‌ల స్థాయుల మార్పులకూ దారితీయవచ్చు. ఈ జబ్బులు వంశపారంపర్యమూ రావచ్చు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల వల్ల ఈ పరిణామాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ హోమియోపతి వైద్యవిధానం ద్వారా మనిషిలోని జబ్బును తగ్గించడం కంటే పూర్ణారోగ్యాన్ని బాగు చేయడానికి కృషి జరుగుతుంది. ఫలితంగా జబ్బూ తగ్గుతుంది. దాంతో అప్పటివరకూ ఉన్న ఆ వ్యాధితో పాటు దాని అనుబంధ వ్యాధులన్నింటినీ హోమియో నిర్మూలిస్తుంది. ఈ సిద్ధాంతాన్నే ‘సిమిలియా నిమిలిబస్ క్యూరెంటర్’ అంటారు. మనిషి తాలూకు వ్యాధి నిరోధకశక్తిని బాగు చేయడం వల్ల ఇలా అతడి ఆరోగ్యాన్ని కాపాడి, అతడు ఎల్లప్పుడూ పూర్తిగా ఫిట్‌గా ఉండేలా చేయవచ్చు.

ఔషధం ఎంపిక ఇలా...

మనిషిలోని వ్యాధి నిరోధక తత్వాన్ని ప్రేరేపించి, అతడు అన్ని జబ్బులకూ అతీతుడయ్యేలా చేయడానికి అతడి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మందు ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియనే ‘రిపార్టరైజేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఔషధాన్ని ఎంపిక చేయాలంటే మనిషి అన్ని లక్షణాలనూ,  గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియను ‘కాన్‌స్టిట్యూషన్’ పద్ధతి అంటారు. ఏ మందు, ఏ కాన్‌స్టిట్యూషన్స్‌తో జతపడుతోంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా మందుకూ, కాన్‌స్టిట్యూషన్స్‌కూ లంకె కుదిరేలా పరిశీలించడాన్ని ‘సిమిలియమ్’ అంటారు. ఈ సిమిలియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రోగికి మళ్లీ జబ్బు రాకుండానూ, అదే సమయంలో అతడి వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర జబ్బులకు దారి తీయకుండానూ కాపాడవచ్చు. ఉదాహరణకు టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బులు. ఈ జబ్బుల విషయంలో ఇంగ్లిష్ మందుల రూపంలో ఉపయోగించే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తొలి దశలో జబ్బు తగ్గినా, వ్యాధి కారక క్రిములు ఆ యాంటీబయాటిక్ పట్ల నిరోధాన్ని (రెసిస్టెన్స్‌ను) పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల అసలా జబ్బు తగ్గకపోవచ్చు కూడా. కానీ హోమియోపతి వైద్య విధానం ప్రకారం కచ్చితమైన డ్రగ్ ఇవ్వడం వల్ల జబ్బు తగ్గి మళ్లీ రాకుండా చేయవచ్చు. అంతేకాదు అతి తక్కువ మోతాదులతో, నొప్పి లేని మందులు ఇవ్వడం అన్నది హోమియో విధానం తాలూకు ప్రత్యేకత. ఈ విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హనీమన్ సూచించారు. అందుకే అతి తక్కువ మోతాదులో శరీరంలోని జన్యుస్థాయికి వెళ్లి హోమియో మందులు పనిచేస్తాయి.

వ్యక్తి తాలూకు మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకుని హోమియో విధానంలో మందును ఎంపిక చేయడం ఎందుకు జరుగుతుందంటే... శరీరంలో ‘మైండ్’ అన్నది కూడా ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడ నుంచి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచే కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగవిముక్తి జరగాలన్నది హోమియో విధానం సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత.

సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు?

ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే... అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలనూ శరీరం నుంచి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఈ ప్రక్రియతో సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ (సైడ్‌ఎఫెక్ట్స్) కలగవు.

ప్రయాణాల్లో హోమియో...

తరచూ ప్రయాణం చేసేవారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచూ ప్రయాణాలు చేసేవారు లేదా వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ కింది మందులను తమ వద్ద ఉంచుకోవడం వాళ్లకెంతో మేలు చేస్తుంది.

కాకులస్ ఇండికస్: ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారూ, ప్రయాణం తర్వాత తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు... 200 పొటెన్సీలో ఈ మందు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

నక్స్ వామికా: ప్రయాణాల్లో వచ్చే ఉదర సంబంధమైన సమస్యలకు ఇది మంచి మందు. ప్రయాణ సమయాల్లో దీన్ని 30 పొటెన్సీలో వరసగా మూడు రోజులు తీసుకోవడం మేలు.

ఆర్జంటమ్-నైట్రికం: ప్రయాణం అంటే అతిగా భయపడేవారు, ప్రయాణాల్లో అతి జాగ్రత్త పాటిస్తూ బాధపడేవారికి ఈ మందు ఇవ్వవచ్చు.

పెట్రోలియమ్: తరచూ కార్లలో ప్రయాణం చేసేవారికి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దీన్ని 200 పొటెన్సీలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పోడో ఫిల్లమ్: తరచూ ప్రయాణాలు చేసేవారికి విరేచనాలూ, కడుపునొప్పి కనిపిస్తే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును గంటలకోసారి చొప్పున తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి.

ఆధారము: సాక్షి

వివిధ వ్యాధులు - హోమియో వైద్యం

డయాబెటిస్ రోగుల్లో ఆర్థరైటిస్ ముప్పు

 

డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఆర్థరైటిస్ సమస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఆర్థరైటిస్ సమస్యలకు ఏవేవో మందులు వాడేస్తూ ఉంటారు. అయినా ఫలితం లేక నిరాశ చెందుతుంటారు. కానీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను సులువుగా అధిగమించవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను.

ఇన్సులిన్ నిల్వ తగ్గిపోవడం లేదా శరీర కణాలు ఇన్సులిన్ తగు విధంగా వినియోగించుకోలేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫరిణామాలను డయాబెటిస్‌గా గుర్తించవచ్చు. ఈ అసమతుల్యత వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరగడం, తద్వారా కణాలకు శక్తి అందక నీరసానికి గురికావడం జరుగుతుంది. హార్మోన్ సమస్యగా ప్రారంభమై కండరాలు, కీళ్లు కూడా అసమతుల్యతకు గురయ్యే అవకాశం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. అయితే డయాబెటిస్ వల్ల ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ వల్ల డయాబెటిస్ వస్తుందని నియమం లేదు.

టైప్-1తో రుమటాయిడ్ ఆర్థరైటిస్

ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్ కణాలలో దీర్ఘకాలిక వాపు, మార్పుల వల్ల ఉత్పత్తి తగ్గి డయాబెటిస్‌కు దారితీస్తుంది. అయితే రోగనిరోధక వ్యవస్థలో జరుగు ఉత్పరివర్తనం వల్ల నష్టం మొదలై రకరకాల పర్యవసనాలకు, రోగ లక్షణాలకు దారితీయవచ్చు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడేవారికి చాలా సామాన్యంగా రుమటాయిడ్ సమస్యలు తలెత్తడం జరుగుతుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కీళ్ల చుట్టూ ఉండే సైనోవియల్ మెంబరెన్స్‌పై నిర్మాణ మార్పులు జరిగి దీర్ఘకాలిక వాపుకు దారితీయవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ ఉత్పరివర్తన, దీర్ఘకాలిక వాపు రెండింటిలో సామాన్యం. సిఆర్‌పీ, ఐఎల్-6 వంటి రక్తపరీక్షల ద్వారా రెండింటికి అనుసంధానం తెలిసింది. నిర్లక్ష్యం చేస్తే ఒక సమస్యగా మొదలై రకరకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

ఆస్టియో ఆర్థరైటిస్, టైప్-2 డయాబెటిస్

శరీర కణాలు శక్తినిచ్చే గ్లూకోజ్‌ను తగుశాతంలో వినియోగించుకోలేకపోవడాన్ని టైప్-2 డయాబెటిస్‌గా పేర్కొనవచ్చు. ఇన్సులిన్ శాతం ఆరంభ దశళో సాధారణ స్థాయిలో ఉన్నా కూడా అసమతుల్యత పెరుగుతున్న కొలదీ నిల్వలు తగ్గి టైప్-1 డయాబెటిస్‌కు దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్‌తో బాధపడేవారు అధిక బరువు ఉన్నట్లయితే పాంక్రియాస్‌గ్రంథిపై ఒత్తిడి పెరిగి నిర్మాణ మార్పులకు దారితీయవచ్చు. పైగా గుండె, రక్తకణాలు కూడా ఒత్తిడికి గురికావడం వంటివి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. టైప్ -2 డయాబెటిస్ రోగుల్లో కీళ్లనొప్పులు మోకాళ్లలో రావడం గుర్తించాం. రక్తసరఫరాలో మార్పులు, నరాలకు నష్టం చేకూరడం వంటివి సంబంధిత ప్రేరేపకాలుగా ఉండటం గమనించవచ్చు.

కారణాలు

డయాబెటిస్ వల్ల ఆర్థరైటిస్ లేదా ఆర్థరైటిస్ వల్ల డయాబెటిస్ రావడం అంటూ జరగదు. కాని రెండింటిలో జరుగు అసమతుల్యతలు ఒక్కటే కావడం రకరకాల అధ్యయనాలకు నాంది పలికిందని చెప్పవచ్చు. జన్యు నిర్మాణ మార్పులకు మానసిక ఒత్తిడి, పర్యావరణ మార్పులులాంటివి తోడవడం జరిగినపుడే అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి.

శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, రకరకాల మందులు వాడటం, పొగతాగడం, ఆహార నియమాలు పాటించకపోవడం, కాలుష్యం వంటివి ఆర్థరైటిస్, డయాబెటిస్‌కు సాధారణ ప్రేరేపకాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యంగా రావడం అనివార్యం కాదు ఒక అవకాశం మాత్రమే. ఒకే కుటుంబంలో ఒకరికి డయాబెటిస్ ఉంటే మరొకరికి ఆర్థరైటిస్ రావచ్చు.

హోమియో చికిత్స

డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో చక్కని చికిత్స అందుబాటులో ఉంది. కొంతమందికి రక్తపరీక్షల్లో నార్మల్ అని తేలినా తిమ్మిర్లు, మంటలు, చూపుతగ్గడం, బరువు పెరగడం లేదా తగ్గడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ల సమస్యలు, శృంగార సమస్యలు వంటివి రావడం జరుగుతుంది. ఒక్కోసారి శారీరక పరీక్షల్లో సాధారణంగా ఉన్నా రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. శరీరం ఎప్పుడూ రకరకాల లక్షణాల ద్వారా జరుగుతున్న, జరగబోయే లక్షణాలను తెలియజేస్తుంది.

వీటిని గమనించి సరియైన చికిత్స తీసుకుంటే ప్రాథమిక దశలోనే సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. జరిగిన నిర్మాణ మార్పులను బట్టి తిరిగి యథాస్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే హోమియో చికిత్స తీసుకోవడం మొదలు పెట్టిన తరువాత జరుగుతున్న నష్టం ఆగిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వ్యాధి సులభంగా తగ్గిపోతుంది.

- డాక్టర్ శ్రీకర్ మను

ఫౌండర్ ఆఫ్ డా.మనూస్

హోమియోపతి,

ఫోన్ : 9032 108 108

9030339999

ఊపిరి...ఉక్కిరి బిక్కిరి

ఒక్క క్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే విలవిల్లాడిపోతాం. కానీ చాలా మంది పొగతాగే అలవాటుతో శ్వాససంబంధ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉందంటున్నారు డాక్టర్ రవికిరణ్.

మన శరీరంలో జీవక్రియలు సజావుగా జరగాలంటే శరీర భాగాల్లోని కణజాలానికి నిరంతరం తగినంత ఆక్సీజన్ అందాలి. అక్సీజన్ సరిగ్గా అందాలంటే ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండాలి. అయితే వయస్సుతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. పొగతాగే అలవాటు ఉన్న వారిలో ఊపిరితిత్తులు మరింత త్వరగా క్షీ ణిస్తాయి. సాధారణంగా పొగతాగే వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తుంటాయి. పొగతాగే వారు వదిలే పొగలో సుమారు 43 రకాల క్యాన్సర్ పదార్థాలు, 30 రకాల లోహాలు, 4500 రకాల పదార్థాలు ఉంటాయి. వీటి వలన శ్వాసనాళాలు కుచించుకుపోయి దీర్ఘకాలంపాటు దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యను క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అంటారు.

లక్షణాలు ఈ సమస్యతో బాధపడే వారిలో కనిపించే ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు శ్లేష్మం వస్తుంటుంది. పగటి వేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళల్లో వాపు, శ్వాసించేటప్పుడు గరగర శబ్ధం రావడం, శ్వాసనాళాల్లో అడ్డుగా అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పొగతాగే వారిలో, వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణం కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువయినపుడు రాత్రుళ్లు నిద్రపట్టదు. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇదికొంత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కనిపించదు.

గుర్తించడమెలా? ఈ సమస్యను మొత్తంగా మూడు దశలలో వర్గీకరించవచ్చు. ప్రారంభ దశ : దగ్గు ఉంటుంది. కొన్నిసార్లు కళ్లె వస్తుంది. పొగతాగడం వల్ల వస్తోందని భావిస్తారే తప్ప సమస్యగా గుర్తించరు. బాగా శ్రమకు లోనైనపుడు శ్వాసపీల్చడంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యస్త దశ : దగ్గు ఎక్కువగా ఉండటం, కళ్లె రావడం జరుగుతుంది. కొంత శ్రమకు గురైనా శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఉంటుంది. జలుబు లేదా ఇతర ఇన్‌ఫెక్షన్ల బారినపడినపుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

తీవ్రమైన దశ : దగ్గు, కళ్లె పడటం ఎక్కువగా ఉంటుంది. పగలైనా, రాత్రివేళయినా శ్వాసించడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ల వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బరువు తగ్గిపోతారు.

క్రానిక్ బ్రాంకైటిస్ ఒక ఏడాదిలో కనీసం మూడు నెలల చొప్పున వరుసగా రెండేళ్లపాటు కళ్లెతో కూడిన దగ్గు ఉంటే దానిని క్రానిక్ బ్రాంకైటిస్‌గా అనుమానించాలి. దీనిలో కూడా శ్వాసనాళం ఇన్‌ఫెక్షన్ల వల్ల అవి దళసరిగా మారుతాయి. ఫలితంగా గాలిని పీల్చుకోవడంలో, బయటకు విడవడంలో ఇబ్బందులు వస్తాయి. వాయునాళ పొరల్లో ఉండే గ్రంథులు కఫం(మ్యూకస్) అనే జిగురుస్రావాన్ని తయారుచేస్తాయి. ఇది గాలిలోని దుమ్ముకణాలను వడగొట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌తో బాధపడే వారిలో ఆ గ్రంథులు పెద్దగా అవుతాయి. దానివల్ల కఫం అక్కడే ఎక్కువగా తయారయి ఊపిరితిత్తులోకి చేరి తిష్ట వేస్తుంది. దీంతో తెరలు తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఏళ్ల తరబడి ఉండిపోయినపుడు రెసిస్టెన్స్‌పవర్ తగ్గిపోతుంది. నిర్ధారణ

స్పైర్‌మెట్రి పరీక్ష, చెస్ట్ ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. స్పైర్‌మెట్రి ద్వారా వ్యాధి నిర్ధారణతో పాటు వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు - ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, వాహనకాలుష్యం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. - శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుండాలి. - నిత్యం వాకింగ్ చేయడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో కండర పటిష్టతను పెంచే వ్యాయామాలు చేస్తుండాలి. - పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి. - ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.

హోమియో చికిత్స శ్వాససంబంధ సమస్యలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆర్సనిక్ ఆల్బం, ఇపికాక్, అంటినమ్ క్రూడ్ వంటి మందులు ఈ వ్యాధిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాకే చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియో మందులు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ నుంచి చాలా వరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొదిస్తాయి. పైగా హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి.

రుమాటిక్ వ్యాధులకు ఆధునిక వైద్యం

ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, జన్యుపరమైన లోపాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా రుమాటిక్ వ్యాధులు ఏర్పడుతుంటాయి. శరీరంలోని కీళ్లకు సంబంధించిన ఈ వ్యాధులు అనేక రకాలు. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథయేటస్, స్ల్కీరోడర్మా, స్పాండైలో ఆర్థపతీస్, ఇన్‌ఫెక్షవస్ ఆర్థరైటిస్, గౌట్, పాలీయాల్జియా రుమాటికా, పాలీమయోసైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, బర్సయిటస్, టెండినైటిస్‌గా ఈ వ్యాధులను పేర్కొంటారు. వీటిలో ప్రధానమైనవిగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైట్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్‌ని చెప్పవచ్చు.

ఆస్టియో ఆర్థరైటిస్ ఇది సర్వసాధారణంగా వచ్చే ఆర్థరైటిస్‌సమస్య. కార్టిలేజ్‌తోపాటు ఎముకను కూడా ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. కీళ్లలో ఎముకల చివరను కుషన్‌లాగా కప్పి ఉంచే పదార్థాన్ని కార్టిలేజ్ అంటారు. ఈ వ్యాధి కారణంగా కార్టిలేజ్‌తోపాటు ఎముకకూడా దెబ్బతింటుంది. దీని వల్ల నొప్పి, ఎముకలు బిగుసుకుపోవడం జరుగుతుంది. కీళ్లకు పదేపదే దెబ్బతగలడం వల్ల కార్టిలేజ్ బలహీనపడడం లేదా కీళ్లపై ఎక్కువ ఒత్తిడి కలగడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వాపులు ఏర్పడి కార్టిలేజ్‌ను ప్రభావితం చేస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పి, బిగుసుకుపోవడం, వాపు, కీళ్ల కదలిక తగ్గిపోవడం జరుగుతుంది. ఈ వాపులు ప్రధానంగా చేతులు, కాళ్ల కీళ్లను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్ టైరోసిన్ ఫాస్పుటేజ్ నాన్ రిసెప్టర్ 22(పిటిపిఎన్ 22)ను సూచించే జీన్ కోడ్‌లో తేడా వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్, ల్యూపస్ వ్యాధులు ఏర్పడతాయని గుర్తించారు. జన్యుపరంగా లోపాలు ఉన్నవారిలో కొన్ని వైరస్‌లు ఈ వ్యాధులకు దారితీస్తాయని తెలుస్తోంది.

జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ ఇది చిన్నపిల్లల్లో వచ్చే సర్వసాధారణమైన వ్యాధి. కీళ్లలో నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం, కదలికలు తగ్గిపోవడం దీని లక్షణాలు. తరచు జ్వరం, కీళ్ల వద్ద కమిలిపోవడం, దద్దుర్లు ఏర్పడతాయి. లక్షణాలు రుమాటిక్ వ్యాధుల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఒకటి గాని లేదా అంతకంటే ఎక్కువ కీళ్లలో వాపు, తెల్లవారుజామున కీళ్లు బిగుసుకుపోవడం, కీళ్లలో విపరీతమైన నొప్పి, కీళ్ల కదలికలు తగ్గిపోవడం, కదల్చలేని పరిస్థితి, ఎవరు నిర్ధారిస్తారు కేవలం రుమటాలజిస్టు మాత్రమే ఈ వ్యాధులను కచ్ఛితంగా నిర్ధారణ చేయగలరు. రోగికి శారీరక పరీక్షలతోపాటు రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, ఇమేజింగ్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఎఎన్ఎ, సిసిపి, రియాక్టివ్ ప్రొటీన్ టెస్ట్, కాంప్లిమెంట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, క్రియాటినైన్, ఇఎస్ఆర్, పిసివి, రుమటాయిడ్ ఫ్యాక్టర్ వంటి రక్తపరీక్షలను సూచించడం జరుగుతుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్, యురిన్ అనలైసిస్ ద్వారా నిర్ధారణ జరుగుతుంది.

హోమియో మందులు రుమాటిక్ వ్యాధులకు హోమియోలో చాలా చక్కని మందులు ఉన్నాయి. వీటిలో అపిస్ మెల్లిఫికా, అయోడిన్, కాలిఐడ్, బ్రయోనియా, లెడమ్ పాల్, కాస్టికమ్ కీళ్ల సమస్యలను సమూలంగా నిర్మూలించగలవు. అయితే వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడవలసి ఉంటుంది. హోమియో కేర్ ఇంటర్నేషన్‌లో ప్రత్యేక పరిశోధన, చికిత్సా విభాగం ద్వారా రుమాటిక్ సమస్యలకు ఆధునిక చికిత్స అందచేయడం జరుగుతుంది. కాన్ట్సిట్యూషనల్ చికిత్స ద్వారా వ్యాధిని సమూలంగా నిర్మూలించడం మా ప్రత్యేకత.

హిస్టీరియా

ఇది ఒక విచిత్రమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల్లో శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు చాలా వింతగా ఉంటాయి. అకారణంగా నవ్వడం, ఏడ్వడం వంటివి చేస్తుంటారు. నిద్రపోతున్న వారు కూడా హఠాత్తుగా లేచి ఏదో ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమాత్రం నిలకడలేని ఉద్వేగాలు, స్పర్శకు సంబంధించిన వివిధ సమస్యలూ కనిపిస్తాయి. ఒక్కోసారి ఓదార్పు కొరకు వీరు లేని బాతతధలను ఉన్నట్లు చెబుతారు.

- కొందరిలో భావోద్వేగాలు వెంట వెంటనే మారుతూ ఉంటాయి. అంటే సంతోషం నుంచి కోపానికి, నవ్వు నుంచి ఏడ్పు ఇలా మారుతూ ఉంటాయి. తరచూ ఏవో నిట్టూర్పులు, లోలోన చింతించడం కూడా ఉంటాయి. సులభంగా భయపడడం, కొన్ని సార్లు కోపంగా ఉండడం ప్రతి విషయంలోనూ తొందర కనిపిస్తాయి. వీరికి ఇగ్నీషియా-200 మందును ప్రతి ఆరుగంటలకు ఒక డోసు చొప్పున 9 సార్లు వేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఈ మందును రాత్రి పూట ఎప్పుడూ ఇవ్వకూడదు.

- కొందరికి గొంతులో ఏదో ముద్ద తట్టుకున్నట్లు అనిపిస్తుంది. చర్మాన్ని తాకితే బాధగా ఉంటుంది. అదేపనిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే విషయాలు పొంతన లేకుండా ఉంటాయి. వీరిలో ఉండే మానసిక ఉద్వేగాలన్నీ నిద్ర తరువాత ఎక్కువవుతాయి. వీరికి లేకసిస్-200 మందును ప్రతి 12 గంటలకు ఒకసారి 9 సార్లు వేస్తే పరిస్థితి త గ్గుముఖం పడుతుంది.

- కొందరికి కడుపులోంచి బంతిలాంటిది గొంతులోకి వచ్చినట్లు అనిపిస్తుంది. తేన్పులతో అది తొలగిపోయినట్లు ఉపశమనంగా ఉంటుంది. భోజన సమయంలో మూర్ఛ వస్తుంది. నోటినుండి ఎడతెరిపి లేకుండా తెల్లటి నురగ వస్తుంది. కడుపులో వికారంగా ఉంటుంది. వీరికి మెగ్నీషియా మూర్-200 మందును ప్రతి 12 గంటలకు ఒకసారి అలా 7 సార్లు వేయాలి.

- కొంద రు ఏకాస్త ఉద్రేకానికి లోనైనా మూర్ఛలోకి వెళుతుంటారు. అకారణంగా అందరినీ తిడుతూ ఉంటారు. శరీరం ఒక్కోసారి చల్లబడుతుంది. ఏకధాటిగా మాట్లాడేస్తుంటారు. గొంతులో ఏదో నొక్కుతున్న భావనకు గురవుతారు. ఎదురుగాలిలో నడుస్తున్నప్పుడు మూర్ఛవస్తుంది. వీరికి మోస్కస్-200 మందును ప్రతి 12 గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేస్తే ఫలితం కనిపిస్తుంది.

గమనిక :ఇందులో సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

గర్భాశయం జారిపోతే...

కొంత మందిలో గర్భాశయం కిందికి జారుతుంది. సమస్య తీవ్రమైనప్పుడు గర్భాశయ ద్వారాన్ని తోసుకుని జననాంగంలోకి కూడా ప్రవేశిస్తుంది. సమస్య ఉన్నవారు మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా కడుపు మీద ఒత్తిడి కలుగ చేసే పనులకు దూరంగా ఉండాలి. బరువులు ఎత్తడం, ఎక్కువ శ్రమ కలిగించే పనులు చేయడం మానుకోవాలి. అలాగే మలబద్దకం రాకుండా జాగ్రత్త పడాలి.

సమస్య ఉన్నవారిలో కొందరికి కాళ్లు మెలిక వేసి కూర్చుంటే ఉపశమనంగా ఉంటుంది. పొత్తి కడుపు బాగా సన్నబడుతుంది. పొత్తి కడుపు లోంచి ఏదో జారిపోతున్న భావన నిరంతరంగా ఉంటుంది. బహిష్టు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. మలబద్దకంతో బాధపడుతుంటారు. వీరు సెపియా-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున అలా 7 డోసులు వేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది.

కొందరికి గార్భశయం వద్ద పుండులాంటిది ఏర్పడుతుంది. వీరు నిరంతరం ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఇతర విషయాలమీద ఏకాగ్రత కుదరదు. పొత్తికడుపులో నుంచి జారుతున్నట్టు అనిపించడం వల్ల వీరెప్పుడూ కాళ్లు మెలిక వేసి కూర్చుంటారు. మనసు ఎప్పుడూ అసహనంగా ఉంటుంది. జననాంగం మీద ఒత్తిడి పడినప్పుడు వీరికి శృంగార వాంఛలు ఎక్కువవుతాయి. వీరు మ్యూరెక్స్-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకోవచ్చు.

కొందరికి కడుపులోనూ, పొత్తి కడుపులోనూ ఏదో జరుగుతున్న భావన కలుగుతుంది. జననాంగం మీద చేతిని ఉంచి పైకి నెట్టడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం వల్ల బాధలు మరింత ఎక్కువవుతాయి. మల, మూత్ర విసర్జనకు తరుచూ వెల్ల వలసి వస్తుంది.

ఏ కారణంగానైనా వె ళ్లలేకపోతే ఛాతీ బరువుగా అనిపిస్తుంది. ప్రతి నెలా నిర్ణీత సమయం కన్నా ముందే బహిష్టు వస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాకుండా కదిలినప్పుడు రక్తస్రావం అవుతుంది. దుర్వాసనగా కూడా ఉంటుంది. వీరు లిల్లియం టిగ్-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక :ఇక్కడ సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

డిఫ్తీరియా

డిఫ్తీరియా ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి. శరీరంలోని మ్యూకస్ పొరల మధ్య అసహజమైన మరో పొర కమ్ముకుపోవడం ఇందులో సమస్య. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన సమస్యలు కలుగచేస్తుంది. సాధారణంగాఈ జబ్బు రెండేళ్లకు పైబడి, పదేళ్లలోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

తలనొప్పి, జ్వరం ఉంటాయి. గొంతునొప్పితో పాటు గొంతులో బూడిద రంగులో ఒక పొర కమ్ముకుంటుంది. టాన్సిల్స్ పైన కూడా ఈ పొర కనిపిస్తుంది. మెడలోని లింఫ్‌నోడ్స్‌లో వాచిపోతాయి., నోటినుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఈ వ్యాధి మరీ చిన్న పిల్లలకు గానీ, పెద్ద వారికి గానీ వస్తే అది మరింత విషమంగా ఉంటుంది.

గొంతు వాపు కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, నొప్పి అంతగా ఉండదు. విపరీతమైన నీరసం, జ్వరంతో పాటు ఎప్పుడూ మత్తుగా ఉంటుంది. గొంతులో వార్నిష్ పూసినట్లుగా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. గొంతులో చురుకులు పోట్లు ఉంటాయి. చల్లటి నీటితో ఉపశమనంగా ఉంటుంది. చిన్న నాలిక ఉబ్బిపోయి కిందికి వేళ్లాడుతూ ఉంటుంది. అందుకే మింగడం కష్టంగా ఉంటుంది. వీరికి ఎపిస్ మెలిఫికా-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున 7 డోసులు వాడవచ్చు.

ముక్కునుండి గానీ, నోటినుండి కానీ వచ్చే స్రావాలన్నీ జిగురుగా తీగలా సాగుతూ ఉంటాయి. వ్యాధి గొంతు నుంచి పైకి పాకుతూ ముక్కును, స్వరపేటికను దెబ్బ తీస్తుంది. గొంతులో పెరిగిన పొర పసుపు రంగులో ఉంటుంది. ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల పై పెదవి మీద పుండు కూడా ఏర్పడవచ్చు. వీరికి కాలీబైక్రోమిక ం-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున 5 సార్లు వేసుకోవచ్చు.

కొందరిలో ఈ జబ్బు ఎడమ పక్కన మొదలై కుడి పక్కకు పాకుతుంది. వేడి ఆహారం, నిద్ర జబ్బును ఎక్కువ చేస్తాయి. గొంతులో నొప్పి చెవిలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది. నాడీ తక్కువగా ఉంటుంది. కాళ్లూ చేతులూ చల్లగా ఉంటాయి. నాలుకు ముందుకు చాచితే వణుకుతూ ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి ఆరుగంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు ఇస్తే ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఇక్కడ సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకు ఉద్దేశించినవి. ఒక వేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

వేధించే ఎగ్జిమాకు హోమియో చికిత్స

చర్మవ్యాధుల మూలంగా కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దురదతో మొదలయ్యే ఎగ్జిమా వంటి చర్మవ్యాధుల వల్ల చికాకు, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అయిట్‌మెంట్లు పైపూతగా రాయడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప వ్యాధి పూర్తిగా తొలగిపోదు. కానీ రూట్‌లెవెల్‌లో చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్లు.

ఎగ్జిమా తీవ్రమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు చర్మం ఎర్రగా మారి, పొలుసులు, దురదతో కూడిన పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరి సోకదు. ఎగ్జిమా బారినపడిన వారిలో చర్మం పొడిబారి పోతుంది. కొందరిలో విపరీతమైన దురదతో పాటు రక్తం కారడం కనిపిస్తుంది. ఎగ్జిమా ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా పిల్లల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. పిల్లల్లో ఒకసారి ఎగ్జిమా కనిపిస్తే అప్పుడది తగ్గిపోయినా తరువాత పెరిగి పెద్దయ్యాక ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉంది.

రకాలు

అటోపిక్ ఎగ్జిమా

ఇది జన్యు సంబంధమైన కారణాల వల్ల వస్తుంది. కొన్ని జన్యువుల మధ్యన జరిగే చర్యల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు కూడా కారణమవుతాయి. ఎక్కువ మంది రోగులలో కుటుంబ సభ్యుల్లో ఒక రికి ఎగ్జిమా ఉండి ఉంటుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఏడు సంవత్సరాల వయసున్న పిల్లల్లో సాధారణంగా ఇది కనిపిస్తుంది. అటోపిక్ ఎగ్జిమా సోకిన తరువాత కొంత కాలం ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ చర్మం తేమను కోల్పోయినపుడు లక్షణాలు బయటపడతాయి.

కొన్ని సార్లు ఇది జాయింట్లు, కీళ్లపై ప్రభావం చూపుతుంది. నలుపు చర్మం ఉన్న వారిలో మోకాలు, మోచేయి ప్రాంతంలో ప్రభావం చూపుతుంది. అటోపిక్ ఎగ్జిమా శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న ప్యాచ్‌ల మాదిరిగా బయటపడవచ్చు. అటోపిక్ ఎగ్జిమా సాధారణ లక్షణం దురద. దీనిమూలంగా రాత్రుళ్లు నిద్ర పట్టదు. చికాకు, ఒత్తిడి పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళతారు.

కాంటాక్ట్ ఎగ్జిమా

సాధారణంగా కనిపించే సమస్య ఇది. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్, రెండవది అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్.

ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ : కొన్ని రకాల వస్తువులు చర్మానికి సరిపడవు. అవి ఉపయోగించినపుడు చర్మం అతిగా స్పందించి దురద మొదలవుతుంది. సబ్బులు, డిటర్జెంట్స్, హెయిర్ కాస్మెటిక్స్, బ్లీచ్ వంటివి కొందరికి పడవు. ఎవరైతే చిన్నతనంలో అటోపిక్ ఎగ్జిమా బారినపడతారో వారిలో ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో చర్మం పొడిబారడం, ఎర్రగా మారడం, చర్మం కాలిన మాదిరిగా కనిపించడం వంటి లక్షణాలుంటాయి.

అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ : ఇది అతి సాధారణంగా కనిపించే సమస్య. అలర్జీ మూలంగా మొదలవుతుంది. కొన్ని రకాల కెమికల్స్‌ను శరీరతత్వానికి పడకపోవడం మూలంగా అలర్జీ వస్తుంది. చేతులపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. చర్మం పొడి బారిపోతుంది. దురద ఉంటుంది. చర్మం పగిలిపోయినట్లుగా తయారవుతుంది. నొప్పి ఉంటుంది. అలర్జీని కలిగించే వాటిలో ముఖ్యమైనది నికెల్. బంగారు ఆభరణాలలో, ప్యాంటులకు ఉపయోగించే జిప్పుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. కాస్మెటిక్స్‌లో, కొన్ని రకాల క్రీమ్స్‌లోనూ, స్టెరాయిడ్స్, కళ్లలో, చెవులలో వేసే మందులు కూడా అలర్జీకి కారణమవుతాయి.

గ్రావిటేషనల్ ఎగ్జిమా

స్త్రీలలో ఈ రకమైన ఎగ్జిమా ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లలో రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడినా, వెరికోస్ వెయిన్స్ ఉన్నా, స్థూలకాయం సమస్య ఉన్నా గ్రావిటేషనల్ ఎగ్జిమా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సెబరోయిక్ ఎగ్జిమా

ఇది పెద్దల్లోనూ, పిల్లల్లోనూ కనిపిస్తుంది. పెద్దవారిలో తలలో చుండ్రు మాదిరిగా మొదలవుతుంది. తలలో దురద, ఎర్రగా మారడం వంటి లక్షణాలతో ప్రారంభ మవుతుంది. తరువాత ముఖం, మెడపైకి విస్తరిస్తుంది. కనుబొమ్మలు, ముక్కు పక్క భాగాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ఎర్రగా, చిన్న తెల్లటి ఫ్లేక్స్ మాదిరిగా గోచరిస్తుంది.

చెవి వెనుక భాగాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెబరోయిక్ ఎగ్జిమా అరుదుగా తలపైన, ముఖంపైన వస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ఛాతీ, వీపు భాగాల్లోకి విస్తరిస్తుంది. చిన్న పిల్లల విషయానికొస్తే ఏడాదిలోపు వయస్సున్న వారిలో కనిపిస్తుంది. శిశువు జన్మించిన తరువాత రెండు నుంచి ఆరు నెలల మధ్య వయస్సున్న సమయంలో అకస్మాత్తుగా వస్తుంది. వీపు భాగంలో మొదలయి తల, ముఖం, మెడ భాగంలో విస్తరిస్తుంది. చర్మం ఎర్రగా మారుతుంది.

హోమియో చికిత్స

జెనెటిక్ హోమియోపతిలో కానిస్టిట్యూషనల్ పద్ధతిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొదట లక్షణాల ఆధారంగా వ్యాధి ఏ దశలో గుర్తించాలి. శారీరక, మానసిక లక్షణాలు, రోగి శరీర తత్వాన్ని పరిశీలించి మందులు ఇవ్వాలి. వ్యాధి లక్షణాలు తగ్గించేందుకు మాత్రమే కాకుండా వ్యాధి మూలాన్ని తొలగించేందుకు చికిత్స అందించడం ద్వారా సమూలంగా ఎగ్జిమాను నయం చేయవచ్చు.

ఎగ్జిమా నివారణలో సల్ఫర్, నట్ సల్ఫ్, కాల్క్ సల్ఫ్, కాలి కార్బ్, నాట్రమ్ మ్యూరాటికమ్, గ్రాఫైటిస్, సోరినమ్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన హోమియో వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ఎగ్జిమా సమూలంగా తొలగిపోతుంది.

మతిమరుపుకు మందు అల్యూమిన్

వృద్ధాప్యంలో వచ్యే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. ఈ సమస్య ముదిరినపుడు ఇంట్లో వాళ్లని సైతం గుర్తించలేని పరిస్థితి తలెత్తుతుంది. తమ స్వంత పనులు కూడా చేసుకోలేని విధంగా తయారవుతారు. ఈ పరిస్థితి ఇంటిల్లిపాదిని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యకు హోమియోలో చక్కటి వైద్యం అందుబాటులో ఉందంటున్నారు డా. ప్రభాకర్.

వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి సన్నగిల్లడం సాధారణమే అయినా ఇంట్లో వాళ్లని సైతం గుర్తు పట్టలేకుండా తయారయినపుడు కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరుగుతుంది. వస్తువులు పెట్టిన చోటు మరచిపోవడం సహజంగా కనిపించేదే అయినా మతిమరుపు తీవ్రమయి ఏదీ గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే దాన్నే అల్జీమర్స్ అంటారు. అల్జీమర్స్‌ను వాడుకభాషలో మతిమరుపు(డిమెన్షియా)అంటారు. ఇది మెదడుకు సంబంధించిన సమస్య. ఇది మొదట మెదడులోని భాగాలలో ప్రభావం చూపుతుంది. క్రమంగా మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, మాట్లాడే పద్ధతిలో మార్పును తీసుకువస్తుంది. దీనివల్ల మనిషి బాగా అలవాటుపడ్డ పనులలో తేడా కనిపిస్తుంది. మెదడులోని కణాలు నశించి, నరాలు దెబ్బతినడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన, జీవన విధానంలో, రోజూ చేసే పనులలో తేడా వస్తుందని అలెస్ అల్జీమర్ అనే వైద్యుడు కనుగొన్నాడు. ఆయన పేరుపైనే ఈ వ్యాధినిఅల్జీమర్స్ అని పిలుస్తున్నారు.

కారణాలు :

కుటుంబంలో ఎవరైనా అల్జీమర్స్‌తో బాధపడుతున్నప్పుడు, వంశపారపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల జీన్స్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా మెదడులో కొన్ని ప్రొటీన్లు రక్తంలో కొలెస్టరాల్‌ను పెంచి అల్జీమర్స్ రావడానికి దోహదం చేస్తున్నాయి. ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగిలినపుడు మెదడులో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినపుడు కూడా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆక్సిజన్ అందకపోయినా...

గుండె కొట్టుకుంటున్నప్పుడు 20 నుంచి 20 శాతం రక్తం రక్తనాళాల ద్వారా గుండె నుంచి మెదడుకు సరఫరా అవుతుంది. మెదడులోని కణాలకు అవసరమైన ఆక్సిజన్ ఈ రక్తసరఫరా ద్వారానే అందుతుంది. ఒకవేళ రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినపుడు, మెదడుకు జరిగే రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు అక్సిజన్ అందడం నిలిచిపోతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, డయాబెటిస్, కొలెస్టరాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు దెబ్బతిని అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం, మధ్యపానం వల్ల కూడా రక్తనాళాలు దెబ్బతిని అల్జీమర్స్ అవకాశం ఎక్కువగా ఉంది.

లక్షణాలు :

అల్జీమర్స్ వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణం మతిమరుపు. ఈ వ్యాధి మొదటి దశలో జ్ఞాపకశక్తి కోల్పోవడం,అల్జీమర్స్‌తో బాధపడే వారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడేకొద్దీ మతిమరుపు పెరుగుతుంది. బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను సైతం మర్చిపోవడం, కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకోలేకపోతుండటం, ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం, చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవదశలో బ్రష్ ఎలా చేసుకోవాలో మరచిపోవడం, తల ఎలా దువ్వుకోవాలో మరచిపోవడం, ఇంట్లో వారిని గుర్తుపట్టకపోవడం జరుగుతుంది. సరిగ్గా మాట్లాడలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, రాయలేకపోవడం, చదవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.భోజనం చేశామో లేదో గుర్తుండదు.పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోతారు.సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి తెలియకుండానే బయటకు వెళ్లిపోవడం, స్వంత ఇంటిని గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు

ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అల్జీమర్స్ ను నివారించుకునే వీలుంది.

నిర్ధారణ :

 • ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
 • వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.
 • మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 • వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.
 • తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.
 • మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.

అల్జీమర్స్‌కు నిద్ర మందు!

వయసు పెరుగుతున్నకొద్దీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే 'అల్జీమర్స్‌' ముప్పూ పెరుగుతుంటుంది. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాబట్టి దీన్ని నివారించుకునే మార్గాలపై పరిశోధకులు చాలాకాలంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక మంచి సమాచారం బయటపడింది. కంటి నిండా నిద్రపోతే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమున్నట్టు వెల్లడైంది. మెదడులో అమీలాయిడ్‌ బీటా గార పేరుకుపోవటమనేది అల్జీమర్స్‌కు సూచిక. రోజుకి 5 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోయే వృద్ధులతో పోలిస్తే.. కంటినిండా నిద్రపోయే వృద్ధుల మెదళ్లలో గార పోగుపడటం తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెదడులో గార మోతాదుకూ నిద్రకూ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందూ వెల్లడైంది. నిద్ర సరిగా పట్టకపోవటం వల్లనే అమీలాయిడ్‌ గార పోగుపడుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. మెదడులో తలెత్తే మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశముందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అడమ్‌ స్పైరా అంటున్నారు. నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో మెదడులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలోనూ వెల్లడైన సంగతిని ఉదహరిస్తున్నారు. మెదడులో చురుకైన సర్క్యూట్లలోని నాడీకణాలు అమీలాయిడ్‌ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి.. వీటిని శాంతింప జేయటం, నిద్ర సరిగా పోవటం ద్వారా అల్జీమర్స్‌ను నివారించుకునే వీలుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతమాత్రాన నిద్రమాత్రలు ఈ ముప్పును తగ్గించగలవని అనుకుంటున్నారేమో. అలాంటి అవకాశమేమీ లేదు. నిద్ర సమస్యల నుంచి తప్పించుకోవటానికి నిద్ర మాత్రలు వేసుకునేవారికీ అల్జీమర్స్‌ ముప్పు పొంచి ఉంటోందనే సంగతిని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

 • Brain exercise medicine,మతిమరుపునకు మెదడుకు పని మందు

సెప్టెంబర్‌ 21న ‘వరల్డ్‌ అల్జీమర్స్‌ డే’----- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి.

ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుందనుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాలన్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు

మెమొరీ గేమ్‌ --- చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.

 • విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే నిచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
 • శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుపరుస్తుంది.
 • పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చ ర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి ఓదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవం డి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి.
 • భాషాపర వెైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగు వుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది.

ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎంతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

బ్రెయిన్ సి.టి స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్, రక్తపరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు.

చికిత్స :

అల్జీమర్స్ తో బాధపడుతున్న వ్యక్తికి హోమియో చికిత్స అందించడం ద్వారా జీవన విధానంలో మార్పు తీసుకురావచ్చు. ముందుగా రోగి శారీరక, మానసిక లక్షణాలు పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ సి.టి చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. హోమియో మందులు మెదడులోని నరాలు, రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. కోబాల్ట్, అల్యూమిన్, తుజా...వంటి హోమియో మందులు మెదడులో రక్తనాళాలపై ప్రభావం చూపించి రోగి మానసిక స్థితిని మెరుగుపరచడానికి దోహదపడతాయి.

ఫంగస్ వ్యాధుల (తామర) నివారణకు

డెర్మటో ఫైట్స్ అనే క్రిముల మూలంగా వచ్చే చర్మవ్యాధులన్నిటినీ ఫంగస్ వ్యాధులు అంటారు. వీటిలో ఏవో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ అంటువ్యాధులే. ఈ వ్యాధులు ఎండాకాలంలో ఎక్కువగా వస్తాయి, చెమట మూలంగా ఎక్కువవుతాయి. దురద ప్రధాన లక్షణంగా ఉంటుంది. వ్యాధిని అణచివేసే చికిత్స వల్ల పలురకాల కొత్త జబ్బులు పుట్టుకొస్తాయి. వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూ ఉంటుంది. లక్షణాలను అనుసరించి హోమియో మందులు వేసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు.

కొందరికి చర్మం పొడిబారిపోయి గరుకుగా ఉంటుంది. దుర ద ఎక్కువగా ఉంటుంది. గోకిన తరువాత మంట మొదలై, గోకిన భాగంలోంచి రక్తం కూడా రావచ్చు. వెచ్చని కాపడంతో వీరికి ఉపశమనంగా ఉంటుంది. ఇలాంటి వారు ఆర్సెనికం ఆల్బం-200 మందును ప్రతి ఆరుగంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.

దుస్తులు ధరించని భాగాల్లో కొందరికి ఎక్కువగా చెమట పోస్తుంది. విపరీతమైన దురద ఉంటుంది. వ్యాధి సోకి న భాగం మిగతా చర్మం కంటే మందంగా ఉంటుంది. వీరికి తూజా-200 మందును ప్రతి 12 గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేస్తే ఫలితం కనిపిస్తుంది. ముందు ఆర్సెనికం ఆల్బం వేసుకున్న వారికి ఈ మందు మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది.

కొందరికి చర్మం పూర్తిగా పొడిబారిపోయి ఏమాత్రం చెమట పోయదు. దురదతో పాటు చర్మంమీద పగుళ్లు ఏర్పడతాయి. ఉదయం వేళల్లో దురద అధికంగా ఉంటుంది. గోకిన తరువాత చర్మం మండుతుంది. మంట లాంటి నొప్పి కూడా ఉంటుంది. శరీరం దుర్వాసన వే స్తుంది. పాదాల్లో వచ్చే మంటలు చ న్నీళ్లతో కడిగితే ఉపశమిస్తాయి. కానీ స్నానం చేస్తే మాత్రం మంటలు అధికమవుతాయి. వీరు సల్ఫర్-200 మందును ప్రతి ఆరుగంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

కొందరికి చర్మం తడిగా ఉంటుంది. దురద అంతగా ఏమీ ఉండదు. చర్మం నుంచి చిక్కని రసి వస్తూ ఉంటుంది. మలబద్ధకంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చలికి ఏమాత్రం తట్టుకోలేరు. వీరు గ్రాఫైటిస్-200 మందును ప్రతి ఆరు గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే చాలా వరకు త గ్గిపోతుంది.

గమనిక : ఇక్కడ సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకు ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలోఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

నెలసరి కడుపు నొప్పి

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. లక్షణాలను అనుసరించి హోమియో మందులు వే సుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి రక్తస్రావం పెరిగేకొద్దీ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వీరికి సింసిఫ్యూగా-200 మందును నెలసరికి ముందే తరుచూ ఇవ్వడం ద్వారా ఈ నొప్పి రాకుండానే నివారించవచ్చు.

కొంతమంది స్త్రీలకు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది. పైగా తరచూ నిరాశా నిస్పృహలకు గురవుతూ ఉంటారు. వీరికి ప్లాటినా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేస్తే ఈ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి నొప్పి అధికంగానే అయినా ఆగి ఆగి వస్తూ ఉంటుంది. రక్తస్రావం నొప్పి ఒకేసారి వస్తాయి. రక్తంలో పొరలు కనపడతాయి. ఆ పొరలు కనపడగానే నొప్పి కొంత తగ్గుతుంది. వీరు బొరాక్స్-200 మందును ప్రతి రెండు గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొందరికి రక్తం తీగలా, నల్లగా సాగుతూ ఉంటుంది. కొద్దిపాటి కదలికతో కూడా రక్తస్రావం అధికమవుతుంది. పొత్తి కడుపులోనొప్పి నడము వరకు పాకుతుంది. పాదాలు చల్లబడతాయి. వీరికి క్రోకస్ సటైవా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున ఏడుసార్లు వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అన్ని రకాల లక్షణాలనూ తగ్గించే మందులు కూడా హోమియోలో ఉన్నాయి. అలాంటి వాటిలో మెగ్నీషియా ఫాస్-200 ఒకటి. ప్రతి అర గంటకు ఒక డోసు చొప్పున 5 సార్లు ఈ మందును వేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

గమనిక: సూచించిన ఈ మందులన్నీ ప్రధమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో ఉపశమనం లభించకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

గర్భాశయ సమస్యలకు పల్సటీల్లా

కడుపులో బిడ్డ పూర్తిగా ఎదిగిన తరువాత గర్భకోశం సంకోచం చెంది శిశువు బయటకు విడుదల అవుతుంది. అలాకాకుండా నెలలు నిండక ముందే అంటే బిడ్డ పూర్తిగా ఎదగక ముందే గర్భకోశం సంకోచం చెందితే...? దాని ఫలితమే అబార్షన్... గర్భస్రావం. అండం ఫలదీకరణం చెందిన తరువాత జరాయువు కూడా పూర్తిగా ఏర్పడక ముందే కొందరిలో ఆ పిండము బయటకు వచ్చేస్తుంది.

దీన్నే గర్భస్రావం అంటారు. నెలలు నిండక ముందే గర్భకోశం సంకోచం చెందడమే దీనికి కారణం. గర్భస్రావం 28 వారాల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. సాధారణంగా 12 వారాలలోపు ఎక్కువగా జరుగుతుంది. గర్భస్రావం తరచుగా ఒకే సమయంలో జరుగుతున్నట్లయితే దానిని హాబిచ్యువల్ ఆబార్షన్ అంటారు.

లక్షణాలు :

గర్భస్రావం జరిగినపుడు సాధారణంగా కనిపించే లక్షణం నొప్పి, రక్తస్రావం. అండం గర్భాశయం నుంచి విడిపోయినపుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తమే గర్భాశయానికి ఫారెన్‌బాడీగా పనిచేస్తుంది. దాంతో గర్భాశయం సంకోచం చెందుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అండం బయటకు పంపించబడుతుంది. ఉదరం రక్తస్రావంతో నిండి ఉంటుంది. చర్మం రంగు ఎరుపుగా మారుతుంది.

కారణాలు :

పుట్టుకతో గర్భాశయం సరిగ్గా ఏర్పడకపోవటం. థైరాయిడ్ సమస్య ఉండటం. దీర్ఘకాలిక మలబద్దకం. ఎక్కువగా పెయిన్‌కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులు వాడటం. ఎక్కువ శారీరక శ్రమ, ఆందోళన. సిఫిలిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు. ఫైబ్రాయిడ్స్. అధిక రక్తపోటు, డయాబెటిస్.

చికిత్స :

హార్మోన్లలో మార్పులు, గర్భాశయ ఇన్‌ఫెక్షన్, మలబద్దకం వంటి సమస్యలకు సహజపద్ధతుల ద్వారా చికిత్సనందించవచ్చు. గర్భాశయంలో పుట్టుకతోనే లోపాలుంటే శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. తరచుగా గర్భస్రావం అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడం, తల భాగం కిందకు ఉండేలా పడుకోవడం,

గర్భంతో ఉన్నప్పుడు శృంగారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు చల్లని నీటితో రెండు పూటలా స్నానం చేయాలి. దీనివల్ల గర్భాశయపు వాపు తగ్గుతుంది. యోగిక్ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా హార్మోన్లలో మార్పులను సవరించుకోవచ్చు. సర్వాంగాసన, వజ్రాసన, భుజంగాసన, శలభాసన, ధనురాసన, త్రికోణాసన వంటి యోగాసనాలు వేయడం ద్వారా థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్, లైంగిక హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. గర్భం ధరించిన రెండు నెలలవరకు ఈ యోగాసనాలు వేయవచ్చు.

హోమియో మందులు

ఎపిస్ :అండాశయంలో వాపు, భరించలేని నొప్పి, ఎక్కువగా కుడిపైపు అండాశయంలో నొప్పి, ఉదరంలో నొప్పి, గర్భాశయంలో నొప్పి, తలనొప్పి, బలహీనత, భయం, కోప స్వభావం, బాధ, మూత్రాశయ సమస్యల వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు వాడదగిన ఔషధం.

బెల్లడోనా :ఇది తరచుగా జరిగే గర్భస్రావానికి వాడదగిన మందు. నడుం నొప్పి, రుతుస్రావంలో సమస్యలు త్వరగా రావడం, అధిక రక్తస్రావం, తొడ భాగంలో నొప్పి, ఉదరంలో నొప్పి, ఛాతి బరువుగా ఉండి నొప్పితో ఉండటం, వక్షోజాలలో కణితి ఏర్పడటం, పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, వెలుతురు, శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు బెల్లడోనా మందు ఉపయోగించవచ్చు.

కామమిల్లా :రుతుస్రావం ఎక్కువగా కావడం, భరించలేని నొప్పి, రుతుచక్రంలో సమస్యలు, లుకేరియా, కోప స్వభావం, చిరాకు, దాహం ఎక్కువ, నొప్పి ఉన్న చోట మొద్దుబారడం, రాత్రుళ్లలో చెమటలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.

పల్సటిల్లా : తరచుగా జరిగే గర్భస్రావానికి వాడదగిన మందు. రుతుస్రావం రాకపోవడం, ఆలస్యంగా రావడం, లుకేరియా, నడుం నొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, రక్తహీనత, పిరికితనం, భయం వంటి లక్షణాలకు వాడదగిన మందు.

సబైన :రుతుచక్రంలో సమస్యలు, రుతుస్రావం ఎక్కువగా కావడం, తరచుగా గర్భస్రావం జరగడం, అండాశయంలో వాపు, గర్భాశయ వాపు, గర్భాశయంలో కణితి, నొప్పి వెనకభాగం నుంచి ముందుకు వ్యాపించడం, భరించలేని తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపకరిస్తుంది.

సికెల్‌కార్ :రుతుచక్రంలో సమస్యలు, నొప్పి, గర్భాశయంలో నొప్పి, మంట, తరచుగా గర్భస్రావం కావడం, జ్వరం, లుకేరియా వాసనతో కూడి ఉండటం, ఆందోళన, బలహీనత, దాహం, ఆకలి ఎక్కువ, రక్తపోటు, తలనొప్పి, జుట్టురాలడం, ముఖం పాలిపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం ఇది.

నక్స్‌మాస్కట :గర్భాశయ సమస్యలు, రుతుస్రావంలో సమస్యలు, లుకేరియా రక్తంతో కూడి ఉండుట, మత్తుగా ఉండటం, రుతుస్రావం సమయానికి రాకపోవడం, బలహీనత, మతిమరుపు, చల్లగాలిని భరించలేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడదగినది. క్రోకస్ : రక్తస్రావం పలుచగా గడ్డలు, గడ్డలుగా పడుతుండటం, కడుపులో ఏదో కదిలినట్లు అనిపించడం, వికారం, కదిలితే రక్తస్రావం కావడం వంటి లక్షణాలకు వాడదగిన మందు.

ఎరిజిరాన్ :ఎక్కువ శారీరక శ్రమ వలన గర్భస్రావం కావడం, మూత్రాశయంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో వేడి, మంట, లుకేరియా రక్తంతో ఉండటం, గర్భాశయం బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్న వారికి సూచించదగిన మందు.

న్యుమోనియాకు బ్రయోనియా

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా న్యుమోనియా బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సరియైన సమయంలో చికిత్స అందించకపోతే న్యుమోనియా వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యకు హామియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.

న్యుమోనియా అంటే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. బాక్టీరియా లేక వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఫంగస్, శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కొన్ని రకాల ఇరిటెంట్స్ ద్వారా వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి అంతగా అభివృద్ధి చెందని చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే 65 సంవత్సరాలు పైబడిన వారు న్యూమోనియా బారినపడే అవకాశాలు ఎక్కువ.

వ్యాధి నిరోధక శక్తి తగ్గితే...

వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉండదు. దీనివల్ల త్వరగా వ్యాధి బారినపడతారు. సీఓపీడీ, హెచ్ఐవీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కీమోథెరపీ తీసుకున్న వారిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుమ్ము, కెమికల్స్, గాలి కాలుష్యం, హానికర పదార్థాలు ఎక్కువగా విడుదలయ్యే ప్రదేశాలలో పనిచేసే వారిలో ఈ ఇన్‌ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది.

స్మోకింగ్, ఆల్కహాల్ : ఊపిరితిత్తుల్లో ఉండే సన్నని కేశాలు క్రిములను, బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి. పొగతాగడం వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. తద్వారా బాక్టీరియా చేరిపోయి న్యుమోనియా బారినపడతారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆస్టిలేషన్ న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. శ్వాస పీల్చుకునేటప్పుడు కొన్ని రకాల పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఈ రకమైన న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా వాంతులు అయినపుడు చిన్న పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం ద్వారా న్యుమోనియా వస్తుంది.

హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యుమోనియా : ఇతర కారణాల వల్ల వచ్చే న్యుమోనియా కంటే ఇది తీవ్రంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి సహాయంగా వెంటిలేటర్స్ పెట్టినపుడు సమస్య తీవ్రతరం అవుతుంది. వెంటిలేటర్స్ వల్ల రోగి దగ్గలేకపోవడంతో క్రిములు ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి. సర్జరీ, గాయం: గాయాల బారినపడినపుడు, సర్జరీ జరిగినపుడు ఎక్కువ సమయం పడుకోవలసి ఉంటుంది. దీనివల్ల మ్యూకస్ ఊపిరితిత్తుల్లోకి చేరి బాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.

లక్షణాలు

చలి ఎక్కువగా ఉండటం, దగ్గుతో పాటు కఫం, శ్వాసలో ఇబ్బంది. ఛాతీలో నొప్పి.

నిర్ధారణ - ఫిజికల్ ఎగ్జామినేషన్, ఛాతీ ఎక్స్‌రే, రక్తపరీక్షలు

చికిత్స యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా న్యుమోనియా తగ్గించవచ్చు. దగ్గు చాలా రోజుల వరకు ఉన్నా, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పడతాయి. వైద్యుని సలహా మేరకు మందులు వాడటం వల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.

హోమియో మందులు బ్రయోనియా : న్యుమోనియాకు వాడదగిన మందు. రాత్రివేళ పొడిదగ్గు అధికం కావడం, భోజనం చేసిన తరువాత సమస్య ఎక్కువ కావడం, వాంతులు, ఛాతీలో నొప్పి, దగ్గుతో పాటు కఫం, దాహం ఎక్కువ, నాలుక పొడిగా ఉండటం, మలబద్దకం, చిరాకు, కుడి ఊపిరితిత్తిలో నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన ఔషధం.

ఫాస్పరస్ : గొంతులో నొప్పి, స్వరపేటికలో నొప్పితో సరిగ్గా మాట్లాడలేరు. చల్లగాలికి దగ్గు అధికం, ఛాతీలో నొప్పి, మంట, బరువుగా ఉండటం, ఎడమవైపు పడుకుంటే సమస్య ఎక్కువ కావడం, దగ్గుతో పాటు రక్తం, భయం, జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం, చల్లటి నీరుతాగాలనిపించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు సూచించదగిన మందు.

స్పాంజియ : వాయుమార్గం పొడిగా ఉండటం, గొంతులో నొప్పి, మంట, పొడిదగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు, రాత్రివేళ సమస్య అధికం కావడం, భోజనం తరువాత దగ్గు ఎక్కువ కావడం, ఆస్తమా, పిల్లికూతలు, బలహీనంగా ఉండటం, ఆందోళన వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన హోమియో ఔషధం.

సాంబుకస్ : ఛాతీలో నొప్పి, బరువు, దగ్గు తరచుగా రావడం, శ్వాసలో ఇబ్బంది, రాత్రివేళ సమస్య అధికం, జలుబు, ముక్కు పొడిబారడం, ముఖం నీలంరంగులోకి మారడం, చెమటలు ఎక్కువగా పట్టడం, భయపడే స్వభావం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు సూచించదగిన మందు.

కాలికార్బ్ : ఛాతీలో నొప్పి, కుడివైపు పడుకున్నప్పుడు సమస్య అధికం, గొంతులో నొప్పి, పొడి దగ్గు, ఉదయం పూట దగ్గు అధికం, పిల్లికూతలు, చిరాకు, భయం, ఆందోళన, శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.

జస్టినియా : పొడిదగ్గు, ఛాతిలో నొప్పి, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు తుమ్ములు, శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి, ఆహారపదార్థాలు రుచిగా అనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు.

ఆర్స్ఆల్బ్ : ఆస్తమా, రాత్రివేళ సమస్య అధికం, ఛాతీలో నొప్పి, మంట, దగ్గు, కఫం, ఊపిరితిత్తులలో నొప్పి, ఎక్కువగా కుడివైపున నొప్పి, పిల్లికూతలు, పొడిదగ్గు, ఆందోళన, దాహం ఎక్కువ తదితర లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ ఔషధం ఉపకరిస్తుంది.

డ్రాసిర : పొడిదగ్గు, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు కఫము, గొంతులో ఏదో ఉన్నట్టుగా అనిపించడం, దురద, మాట్లాడినపుడు ఆయాసం, శ్వాసలో ఇబ్బంది, బరువు కోల్పోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.

మధుమేహ నియంత్రణలో హోమియో

మధుమేహం ఛాయలు ఏ కాస్త కనిపించినా విపరీతంగా వణికి పోతున్నారిప్పుడు. ఆ వ్యాధి కారణంగా వచ్చే దుష్ప్రభావాలే ఇందుకు ప్రధాన కారణం. శరీరంలోని కీలక భాగాలన్నిటినీ దెబ్బ తీసే మధుమేహం అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు? అయితే, మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా , వ్యాధి తాలూకు దుష్ప్రభావాల నుంచి కాపాడటంలో కూడా హోమియో మందులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని శాశ్వతంగానే నయంచేసే అవకాశం ఉందీ అంటున్నారు, హోమియోపతి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.

అన్నింటికీ యంత్రాల మీదే ఆధారపడుతున్న ఆధునికుల్లో సహజంగానే శరీర శ్రమ బాగా త గ్గిపోతోంది. ఫలితంగా ఏ కొంచెం తిన్నా, శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోతోంది. తినే మోతాదు తగ్గిస్తూ పోతేనేమో శరీరం బలహీనపడుతోంది. వాస్తవానికి ఆహారం మామూలుగానే తీసుకుంటూ శరీర శ్రమ పెంచడం సరియైన విధానం. సమయం లేదన్న కారణంగా అందరూ ఆహారపు మోతాదునే తగ్గిస్తున్నారు. ఫలితంగా నీరసం నిస్సత్తువా ఆవరిస్తున్నాయి. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పాత్ర చాలా కీలకం. క్లోమగ్రంధి నుంచి ఉత్పన్నం అయ్యే ఈ హార్మోన్ ర క్తంలోకి వెళ్లే గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. అయితే, ఇన్సులిన్ సరియైన పరిమాణంలో ఉత్పన్నం కాకపోయినా, సరియైన రీతిలో పనిచేయకపోయినా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. ఒక దశలో ఇది మూత్రంలోకి కూడా వెళుతుంది. అందుకే రక్తంలో, మూత్రంలో మధుమేహ లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలేమిటి?

మధుమేహం రావడం అన్నది కేవలం క్లోమగ్రంధికే పరిమితమైన సమస్య కాదు. మొత్తం జీవక్రియల్లో వచ్చిన తేడాలే దీనికి మూల కారణం. జీవక్రియల్లో ఆ తేడా రావడానికి కొందరిలో వారసత్వ కారణాలు కూడా ఉంటాయి. ఇకపోతే ఈ సమస్యకు శరీర శ్రమ లేక పోవడం మరో ప్రధాన కారణం. శ్రమ లేకపోవడం వల్ల సహజంగానే శరీరం బరువు పెరుగుతుంది. శరీర బరువు మధుమేహానికే కాదు మరెన్నో సమస్యలకు దారి తీస్తుంది.

ఇవీ లక్షణాలు...

మధుమేహ సమస్య మొదలైన కొందరిలో అతిగా అకలి కావడం, తరుచూ దాహం వేయడం, ఎక్కువ సార్లు మూత్రం రావడం, బరువు తగ్గడం, నీరసం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాల్లో ఏదో ఒకటి కానీ, ఒకటికి మించి గానీ కనిపించవచ్చు అయితే, మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లక్షణం కనిపిస్తుందని కాదు. కొందరిలో వ్యా«ధి తీవ్రమయినా ఏ లక్షణమూ కనిపించకపోవచ్చు. అందుకే ఏటా ఒకసారి మధుమేహ పరీక్షలు చేయించుకోవడం అన్నింటికన్నా ఉత్తమం.

దుష్పలితాలేమిటి?

వైద్య చికిత్సలు లేకుండానే దీర్ఘకాలికంగా వ్యాధి కొనసాగుతూ పోతే శరీరంలోని కీలక భాగాలన్నీ దెబ్బ తినే ప్రమాదం ఉంది. వాటిలో ముఖ్యంగా కి డ్నీలు, గుండె, క ళ్లు, మెదడు, నాడీ వ్యవస్థ బాగా దెబ్బ తింటాయి. నరాలు దెబ్బ తినడం వల్ల కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు, మంటలూ ఉంటాయి. నీరసం, నిస్సత్తువ వేధిస్తాయి. వీటికితోడు లైంగిక సామర్థ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.

నియంత్రణే లక్ష్యం

రోగి, శారీరక మానసిక ధర్మాలను పరిశీలించి అతని జీవన శైలిని కూడా గమనించి చికి త్స చేయడం హోమియో విధానం. మధుమేహం తాలూకు దుష్ప్రభావాలను అరికట్టడంలో హోమియోపతి మిగతా వైద్య విధానాలన్నిటికన్నా ముందు ఉంటుంది. రోగి మానసిక ఒత్తిళ్లకు గురైనప్పుడు కూడా ఆ ప్రభావం రోగిపైన పడకుండా చేస్తుంది. మరే కారణంగానైనా అల్లోపతి మందులు వాడుతున్న సమయంలో కూడా హోమియో మందులు వాడవచ్చు. అలా వాడటం వల్ల ఏ దుష్ప్రభావాలూ ఉండవు. దీర్ఘకాలికంగా ఉన్న మ«ధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం అన్నది చాలా కష్టమైన పని. హోమియోలోనే కాదు మరే విధానంలోనూ అది సాధ్యం కాదు. కాకపోతే వ్యాధి మొదలైన తొలి దశలోనే గుర్తించి హోమియో చికిత్సలు తీసుకుంటే వారిలో 50 శాతం మంది ఆ వ్యాధి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.

ఆహార, వ్యాయామాలు

మధుమేహ వ్యాధి నియంత్రణలోకి రాకపోవడానికి సగం కారణం ఆహార, వ్యాయామాల విషయంలో రోగి శ్రద్ధ వహించకపోవడమే. మధుమేహం ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆహారంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పిండి పదార్థాలను బాగా తగ్గించాలి. వాటి స్థానంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండే చిక్కుడు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు , కాయగూరల మోతాదును బాగా పెంచాలి. అయితే కాయగూరల్లో ఆలు గడ్డ, కంద గడ్డ వంటివి తగ్గించాలి. ఈ గడ్డల్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు శరీర శ్రమ తప్పనిసరి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా అరగంట నుంచి గంట దాకా వాకింగ్ చేయాలి.

మధుమేహం ఉన్నప్పుడు తినే ఆహారం మోతాదు తగ్గించినా శరీరంలో విటమిన్ లోపాలు, ప్రొటీన్ లోపాలు తగ్గకుండా చూసుకోవాలి. అరటి, సపోటా, ద్రాక్ష, వంటి గ్లూకోజ్ ఎక్కువగా ఉండేవి తప్ప మిగతా పండ్లలో కొన్ని పరిమితంగా తీసుకోవచ్చు. స్వీట్లు, నూనె పదార్థాలు తగ్గిస్తే అది అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఆహార నియమాలు పాటిస్తూ హోమియో మందులు కూడా తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉండడమే కాదు. వ్యాధి తాలూకు ఏ ఒక్క దుష్ప్రభావమూ శరీరం మీద పడదనేది వాస్తవం.

సుఖవ్యాధులు హోమియో చికిత్స

శృంగారం మధురమైన అనుభవం, తెలిసీ తెలియని వయసు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్రేకాలు, ఏదో తెలియని తపన, ఆందోళన, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత, అనుకోని తప్పటడుగు, అంతే ఇక మెుదలవుతుంది.. సునామి.తెలియని విషయాలతో చాలా మంది పెళ్ళికి ముందే, పెళ్ళి తరువాత చాలా మందిలో సంబంధాలు పెట్టుకుంటారు, స్నేహితుల చొరవతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.దాని తరువాత కలిగే బాధలు, వాటికి తగు నమ్మకమైన పరిష్కార మార్గాలెకై డా మధువారణాశి ఏమంటారో చూద్దాం.

చాలా మంది మగవాళ్ళు పరాయి సంబంధాలు చాలాసార్లు కలిస్తేనే సుఖ వ్యాధులు వస్తాయని అనుకుంటారు, కానీ సుఖవ్యాధులు ఉన్న వారితో ఒక్కసారి పాల్గొన్నా వ్యాధి రావటం జరుగుతుంది.

ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల గురించి చర్చిద్దాం...

గనేరియా...

పరాయి సంపర్కం తరువాత మొదటగా కనిపించే లక్షణం, మూత్రంలో మంట, మూత్రనాళం దగ్గర దురదగా ఉంటుంది.జిగురు జిగురుగా ద్రవం వస్తుంది.దీనినే గనేరియాగా చెప్పవచ్చు.ఒక్కేకసారి రక్త పరీక్షలలో గనేరియా బయటపడక పోవచ్చు.దీనినే Non Gonococcal Urethritis అంటారు.80-90% కేసులలో ఏ వ్యాధి క్రిమి కనబడదు. కానీ మూత్ర నాళంలో బాధ, మూత్రం మంటగా కనిపిస్తుంది.Trichomonas, Bacterial, Fungal Infections వుండటం కారణం.కొందరిలో పొత్తికడుపు నొప్పి, వీర్యంలో మంట, వీర్యంలో రక్తం రావడం కనిపిస్తాయి.

Herpes Simplex :

చాలా మందిలో కనిపించే లక్షణం, లైంగిక కలయిక తరువాత పురుషాంగం మీద చెమట పొక్కులంత ఆకారంలో నీటి పొక్కులు కనిపిస్తాయి.నీటి పొక్కులు ఎర్రగా వుండి దురదగా అనిపిస్తాయి.నీటి పొక్కులు పగిలి ఎర్రగా పుండు పడుతుంది.ఇటువంటి సమయంలో తగు జాగ్రత్త వహించకపోతే, ఇది వేరొకరికి సోకే ప్రమాదం వుంది.లైంగిక కలయిక ద్వారా సంక్రమించే ఇటువంటి వ్యాధిని అని Herpes Genitalis అంటారు.

లైంగిక సంపర్కం ద్వారా వచ్చే Herpes తిరిగి రావడం జరగ వచ్చు లేదా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మళ్ళీ కనిపించ వచ్చు.కొన్నిసార్లు ఒకటి రెండు సంవత్సరాల తరువాత కనబడ వచ్చు.ఈ వ్యాధి ఉన్నా ప్రాణహాని కలిగించడం మాత్రం ఉండదు.స్ర్తీల లో కూడా యోని మీద చిన్న చిన్న పొక్కుల లాగా వచ్చి ఎర్రగా మారి, విపరీతమైన నొప్పి రావడానికి ఆస్కారం వుంటుంది.

Venereal Warts :

పురుషాంగం మీద చిన్న Cauliglower type లో పులిపిరులు వస్తాయి.ఇవి గుత్తులు గుత్తులుగా తయారవుతాయి.లైంగిక సంపర్కం వలన రావచ్చు లేదా వైరస్‌ క్రిమి వల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది.

షాంకరాయిడ్‌ పళ్ళు :

ఇది కూడా లైంగిక వ్యాధి.లైంగిక సంపర్కం వలనే వచ్చే సమస్య.ఒకరి ద్వారా ఒకరికి సంక్రమిస్తుంది.లైంగిక సంపర్కం తరువాత 3 నుంచి 5 రోజుల లోపల ఈ వ్యాధి బయటపడవచ్చు.జననాంగం మీద రెండు, మూడు పుళ్ళు ఏర్పడతాయి.ఇది మొదట చిన్న నీటి బుడగ లాగా వచ్చి చీము ఏర్పడి పగులుతుంది.పుండు ఎర్రగా మారి రుద్దినప్పుడు నొప్పి వస్తుంది.ఇది పక్కకు వ్యాపించడానికి ఆస్కారం వుంది. కొద్ది మందిలో జ్వరం, నొప్పులు వుంటాయి.మూత్రంలో మంట, నొప్పి వుంటుంది.

హోమియో చికిత్స...

Arsenic Albus :

మూత్రంలో మంట, నొప్పి, మూత్రం తక్కువగా వస్తుంది.మూత్రంలో రక్తం వుంటుంది.

Thuja :

మూత్ర ద్వారం దగ్గర వాపు మూత్ర విసర్జన నెమ్మదిగా, చ్కులు చుక్కలుగా పడుతుంది.తరచుగా మూత్రనాళం ఐజ్ఛఛ్టిజీౌట వస్తాయి.

Cannabinis :

విపరీతమైన నొప్పి, మూత్రం రెండు ధారలుగా బయటకు వస్తుంది.మూత్ర ద్వారంలో నొప్పిగా వుంటుంది.

Sulphur :

మూత్రంలో మంట, అరికాళ్ళలో మంట, మూత్రంలో ఒకసారి దుర్వాసన వుంటుంది.

హోమియో చికిత్స మానసిక, శారీరక లక్షణాలపై ఆధారపడి పని చేస్తుంది.రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేసి, మూలకారణాన్ని గుర్తించి సమూలంగా నిర్మూలిస్తుంది.అనుభవజ్ఞులైన వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే లైంగిక సమస్యలకు పరిష్కారం దొరికి సుఖమయ జీవితానికి పునాధులు వేసుకొనే ఆస్కారం వుంది.

వ్యాధి నిర్ధారణ...

 • VDRL Test
 • HSV I & II IGM & IGT
 • HIV Test
 • Urine Examination

టెస్ట్‌లతో నిర్ధారణకు రావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు...

 • అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మాని వేయాలి.
 • నిరోధ్‌ వాడితే సుఖ వ్యాధులు సంక్రమించటం తగ్గుతాయి.
 • జీవిత భాగస్వామితో మాత్రమే సంబంధాలు కొనసాగించాలి.
 • వేశ్యా సంపర్కం తరువాత, భార్యతో కలిసినచో ఆమె కూడా మందులు వాడాలి.
 • మర్మావయాల శుభ్రత కలిగి ఉండాలి.
 • వివాహానికి పూర్వం లైంగిక సంబంధాలు కలిగి వుంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.

అల్లొపతీ(Allopathy):

దీనిని నవీన వైద్య విధానమందురు. మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. ఈ వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది ,జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది.

అల్లొపతీవైద్య విధానములో ఒక రోగము వలన కలిగే బాధలను తగ్గించడానికి తగిన మందులివ్వడమే కాకుండా ఆ రోగము రావడానికి గల మూలకారణము వివిధ పద్దతులద్వారా కనుగొని, కారక సూక్ష్మక్రిములను తెలుసుకొని తదనుగునముగా చికిత్స చేయుదురు. నేడు ఎన్నో రకములైన లేబొరటరీ పరీక్షలు, ఎక్షురే పద్దతులు, స్కానింగ్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయి. ఈ వైద్యవిధానము లో చికిత్స చేయు వైద్యునకు సంభందిత డిగ్రీ ఉదా: MBBS, MD, MS, MCh, DM, లాంటి చదువులు అవసరము.

అల్లోపతి వైద్యం ఆవిర్భావం

మనం ఇప్పుడు అల్లోపతి వైద్యంగా చెప్పుకునే ఆధునిక వైద్యం చరిత్ర 500 సంవత్సరాలే. భారతీయ, గ్రీకు, రోమన్‌, అరబిక్‌ వైద్యాల మధ్య వందల ఏళ్లుగా జరిగిన సమ్మేళనం ఫలితంగా, పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో యూరోపులో తొలి ఆధునిక వైద్యం ఆవిర్భవించింది. ఆయుర్వేదం, సిద్ధవైద్యం మన ప్రాచీన వైద్యాలు. ఆత్రేయ (క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు), శుశ్రుతుడు, చరకుడు ( క్రీస్తు శకం 200 సంవత్సరాలు) మనకు తెలిసిన తొలినాటి గొప్ప వైద్యులు. చరకుడు 500 మందుల గురించి ఆనాడే రాశాడు. నాటి భారతీయ వైద్యులు సర్పగంధి అనే మొక్కను మందుగా వాడేవారు. రక్తపోటుకు వాడే 'రిసర్ఫిన్‌' అనే అలోపతి మందును ఈ మొక్కనుండే కనుగొన్నారు. దీన్ని రక్తపోటుకు వాడతారు. చరక సంహిత, సుశ్రుతసంహిత అనే గ్రంథాలను క్రీస్తు శకం 800 సంవత్సరంలో పర్షియన్‌, అరబిక్‌ భాషలలోకి అనువదించారు. ఇటువంటి విభిన్న వైద్య వ్యవస్థలలో జరిగిన కృషికి కొనసాగింపుగానే అలోపతి వైద్యం ఆవిర్భవించింది. అలోపతి వైద్యానికి యూరోపియన్‌ పారిశ్ర్రామిక విప్లవకాలపు ప్రోత్సాహం పెద్ద ఎత్తున లభించింది. అదేకాలంలో మన దేశంలో పాలకుల మద్దతు లేకపోవడంతో ఆయుర్వేదం క్రమేణా దెబ్బతిన్నది.

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate