పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

యోగ

యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పధ్దతిలో మెరుగుపరచుకోవడానికి లేక అభివృధ్ది చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది.

యోగ

యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పధ్దతిలో మెరుగుపరచుకోవడానికి లేక అభివృధ్ది చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది. సంస్కృతంలో ‘యోగ’ అనే మాటకు అర్ధం అక్షరాలా ‘యోకె ‘ అని. అందుచేత, యోగ అనే మాటను మన అంతరాత్మను, విశ్వాత్మతో ఐక్యం చేసే మార్గమని చెప్పవచ్చు. మహర్షి పతంజలి చెప్పినదాని ప్రకారం యోగ అనేది మనసులో సంభవిస్తూ ఉండే సవరణలను, మార్పులను అణగద్రొక్కి పెట్టేది.

యోగ – విశ్వవ్యాప్తంగా ఆచరించే ఒక క్రమశిక్షణ

సంస్కృతి, జాతీయత, వర్గం, కులం, మతం, విశ్వాసం, లింగబేధం, వయసు మరియ శారీరక స్ధితితో నిమిత్తంలేని, సాధన చేయడానికి మరియు అన్వయించుకోవడానికి కూడా యోగ ఒక విశ్వవ్యాప్తంగా యోగ్యత కల సత్ప్రవర్తనతో కూడి వుండే సాధన. కేవలం గ్రంధాలను చదవడం వల్ల, లేక ఒక సన్యాసి వేషాన్ని ధరించి ఉండడం వల్ల కూడా, ఎవరూ పరిపూర్ణమైన, నిష్ణాతుడైన సన్యాసి గానీ విరాగి గానీ కాలేరు. దీనిని సాధన చేయకుండా, లేక దీనిలో అంతర్లీనంగా ఉండే ప్రయోజనం గురించి కూడా గానీ, లేక యోగ లక్షణాలు గానీ, విశిష్టితలు వాటి వినియోగాల చిట్కాలను గురించి గానీ ఎవరికి గ్రాహ్యం కావడం గానీ, అనుభవంలోకి రావడం గాని జరగదు. రోజువారీ, ఒక క్రమపధ్దతిలో సాధన చేయడం వల్లనే శరీరాన్ని, మనసునూ ఉన్నత స్ధితికి చేర్చడానికి ఇది ఒక విధమైన ఒరవడిని సృష్టిస్తుంది. మనసును శిక్షణ ద్వారా లగ్నం చేస్తూ, అంతరాత్మను పరిశుధ్దం చేయడం ద్వారా ఉన్నత స్ధితిలో ఉన్న అంతరాత్మ యొక్క అనుభూతిని పొందడానికి సాధకుడిలో తీవ్రమైన మనోవాంఛ, కోరిక ఉండవలసి ఉంటుంది.

ఒక పరిణామాత్మకమైన ప్రక్రియగా యోగ

మానవ స్మృతిని, చేతనావస్ధను మెరుగుపరచుకోవడానికి, అభివృధ్ది చేసుకోవడానికి యోగ ఒక పరిణాత్మాకమైన ప్రక్రియ వంటిది. కేవలం ఏ ఒక్క మానవుడిలోనూ చైతన్యావస్ధలో కలిగే ఈ పూర్తి పరిణామ ప్రక్రియ తప్పనిసరిగా ప్రారంభం కావాలని ఏమీ లేదు, అయితే ఇది ఇలా జరగాలని ఒకరు కోరుకున్నప్పుడు మాత్రమే ఇది ఆరంభమవుతుంది. దుర్వ్యసనాలైన మద్యం మరియు మత్తు పదార్ధాల వినియోగం, అలసట కలిగే వరకూ పనిచేయడం, మితిమీరిన లైంగిక కార్యకలాపాలలో నిమగ్నమవడం మరియు ఇతర ప్రేరేపణలు వంటివి కలిగి ఉండడం, ఉపేక్ష, మతిమరుపును కోరుకోవడం వంటివి, అంటే తిరిగి అచేతన స్ధితికి చేరుకోవడం వంటిది. పాశ్చాత్య మనస్తత్వం ఎక్కడ ముగుస్తుందో అక్కడ నుండే భారతీయ యోగులు ప్రారంభిస్తారు. ఫ్రాయిడ్ యొక్క మనస్తత్వ శాస్త్రం వ్యాధులకు సంబంధించిన మనస్తత్వ శాస్త్రం అయితే, మాస్లో యొక్క మనస్తత్వ శాస్త్రం ఆరోగ్యవంతుడైన మనిషి యొక్క మనస్తత్వ శాస్త్రం, అయితే, భారతీయ మనస్తత్వ శాస్త్రం జ్ఞానోదయానికి, చైతన్యావస్ధకు చేర్చేది. యోగాలో ఇది కేవలం మనిషి యొక్క మనస్తత్వానికే సంబంధించిన ప్రశ్నే కాదు, ఇది ఒక ఉన్నత స్ధితికి తీసుకువెళ్లే చైతన్యావస్ధ వంటిది. అలాగే, ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన విషయం.

ఆత్మకు చికిత్సగా యోగ

యోగాలో అన్ని మార్గాలు కూడా (జపం, కర్మ, భక్తి మొదలైనవి) నొప్పులనుండి కలుగుతూ వుండే బాధలను దూరం చేస్తూ, వాటిని నయం చేయడానికి అవకాశం కలిగి ఉన్నవే. అయితే, దీనికి మనకు ముఖ్యంగా, ఒక నిష్టాతుడైన, సిధ్దుడైన, తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇప్పటికే ఇదే మార్గాన్ననుసరించి ఉన్న వ్యక్తి నుండి సరైన మార్గదర్శకత్వాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తిలో ఉండే జిజ్ఞాస వల్ల, సమర్ధుడైన, యోగ్యుడైన సలహాదారుని యొక్క సహకారంతో గానీ లేక సిధ్దహస్తుడైన ఒక యోగిని సంప్రదించి గాని ఈ ప్రత్యేక మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోవలసి ఉంటుంది.

జప యోగ

“ఓమ్”, “రామా”, “ అల్లా”, “దేవుడా” , “వాహే గురు” మొదలగు పవిత్ర నామోఛ్చరణతో లేక పవిత్ర వర్ణాలను, మంత్రాలను, మరల మరల జపిస్తూ, మనసులో ధ్యానిస్తూ, మనసును భగవధ్యానంలో లగ్నంచేసి, వీటిని  ఉఛ్చరిస్తూ, వాటిలోనే నిమగ్నమవడం.

కర్మ యోగ

కర్మయోగ ప్రతిఫలాపేక్ష లేకుండా, మనం కర్మలన్నింటిని నిర్వహించాలని బోధిస్తుంది ఇది. ఇటువంటి సాధనలో యోగి తాను చేసే ప్రతి కర్మ కూడా పవిత్ర మైనదిగా భావిస్తూ, దానిని మనస్ఫూర్తిగా, భక్తిభావంతో, భగవధ్యానంలో లీనమై కోరిక లన్నింటినీ దూరంగా పారద్రోలుతూ చేస్తాడు.

జ్ఞాన యోగ

నాది మరియు నాది కాదు అనే వాటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని గ్రహించాలని భోధిస్తుంది, అలాగే పవిత్ర గ్రంధాలను చదవడం ద్వారా, సాధు సాంగత్యం ద్వారా మరియు ధ్యానాన్ని సాధన చేస్తూ వుండడం ద్వారా , మనం ఆధ్యాత్మిక జ్ఞనాన్ని పొందాలని ఇది బోధిస్తుంది.

భక్తి యోగ

అత్యంత భక్తితో భగవంతుడికి తనకు తానుగా భగవంతునికి అర్పించుకొని, పూర్తిగా దాసుడై ఉండడంపై శ్రధ్ద వహిస్తూ, అత్యంత భక్తితో భగవధ్యానంలో లీనమయ్యే విధానం ఇది. భక్త యోగం యొక్క నిజమైన సాధకుడు అహంకారం లేకుండా ఉంటూ, వినయ, విధేయతతో ప్రాపంచిక ద్వందానికి ప్రభావితం కాడు.

రాజ యోగ

“ అష్టాంగ యోగ” అని ప్రముఖంగా పిలువబడే ఈ రాజ యోగ అన్నింటా మానవాభివృధ్దిని కలుగజేసేది. ఇవిః యమ, నియమ, ఆసన, ప్రణయామ, ప్రత్యహార, ధారణ, ధ్యాన మరియు సమాధి.

కుండలిని

తాంత్రిక సాంప్రదాయ పధ్దతిలో కుండలిని యోగ ఒక భాగం. సృష్టి ప్రారంభం నాటినుండి తాంత్రికులు మరియు యోగులు ఈ భౌతిక శరీరంలో 7 చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రంలో ఒక అవ్యక్తమైన శక్తి నివసిస్తూ ఉందని గ్రహించారు. ఈ కుండలిని ఉండే చోటు. వెన్నెముక యొక్క మూల స్ధానంలో ఒక చిన్న గ్రంధి వంటిది పురుష శరీరంలో ఇది మూత్ర మరియు మల నిసర్జనకు సంబంధించిన అవయవాల మధ్య ఉండే స్ధానంలో ఉంటుంది. స్త్రీ శరీరంలో దీని స్ధానం గర్భాశయ ద్వారం వద్ద ఉంటుంది. ఈ అలౌకిక, మానవాతీతమైన శక్తిని మేల్కొలిపిన వారిని ఋషులు, ప్రవక్తలు, యోగులు, సిధ్దులు మరియు ఇతర పేర్లతో కాల, సాంప్రదాయ, సాంస్కృతిక పరిస్ధితు లను బట్టి పిలువబడ్డారు. ఈ కుండలినిని మేల్కొలపడానికి మీరు షట్క్రియ, ఆసన, ప్రాణాయామ, బంధ, ముద్ర మరియు ధ్యానం వంటి యోగసంబంధిత పధ్దతుల ద్వారా సిధ్దపడి ఉండాల్సి ఉంటుంది. కుండలినిని మేల్కొలపడంతో, మెదడులో ఒక విధమైన విస్ఫోటనం చోటు చేసుకుంటూ, దానిలో నిద్రాణంగా, సుషుప్తావస్ధలో ఉన్న ప్రాంతాలు పూల మాదిరిగా వికసిస్తూ, విచ్చుకోవడం ప్రారంభిస్తాయి.

నాడి

యోగ గ్రంధాలలో వివరించబడినట్లుగా, మానసిక స్థాయిలో మనం చూడ గలిగే, గుర్తుపట్టగలిగే, శక్తితో ప్రవహిస్తూ, స్పష్టమైన ప్రవాహాల, కాంతి, రంగు, శబ్దం వంటి ఇతర లక్షణాలతో, విశిష్టతలతో ఉంటూ ఉండే శక్తి ప్రవాహాకాలే ఈ నాడులు. ఈ నాడుల పూర్తి సమాహారం (నెట్ వర్క్) ఎంత విశాలమైనదంటే చివరికి యోగ గ్రంధాలు కూడా వాటి సరైన సంఖ్యను లెక్కగట్డే విషయంలో బేదాభిప్రాయాలను కలిగి ఉన్నాయి. గోరక్షశతకం లేక గోరక్ష సంహిత మరియు హఠయోగ ప్రదీపికలను తిరగేసి చూసినపుడు మణిపుర చక్ర అనే నాభిస్ధాన కేంద్రంగా వీటి సంఖ్య 72,000 గా చెప్పబడింది. ఈ నాడులన్నింటిలోనూ సుషుమ్న అని పిలువబడే నాడి చాలా ముఖ్యమైనది. శరీరాన్ని లోపలవైపుకు మరియు బయటవైపుకు కలుపుతూ ఉండే ‘ద్వార మార్గాలు’ గా ‘శివ స్వరోదయ’ పది ప్రధాన నాడులను లెక్కించింది. ఈ పదిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి చాలా ముఖ్యమైనవి. వెన్నెముకతో పాటుగా ఉండే విద్యుత్ ఉప కేంద్రాలకు (సబ్ స్టేషన్స్) లేక చక్రాలకు ఈ శక్తిని అందజేస్తూ వెడుతూ ఇవి అత్యంత విద్యుత్ శక్తితో ప్రవహిస్తూ ఉండే తీగల వంటివి.

యోగ కోసం భారత దేశంలో ఉన్న జాతీయ స్ధాయి సంస్ధలు

మొరార్జీ దేశాయి జాతీయ యోగ సంస్ధ, కొత్త ఢిల్లీ

 • భారత ప్రభుత్వం లోని ఆయుష్ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, పూర్తి ఆర్ధిక సహకారంతో, సొసైటీల చట్టం, 1860 క్రింద నమోదు కాబడిన మొరార్జీ దేశాయి జాతీయ యోగ సంస్ధ ఒక స్వయం ప్రతిపత్తిగల సంస్ధ.
 • భారత దేశ రాజధాని కొత్త ఢిల్లీ నగరం నడిబొడ్డున, 68, అశోక రోడ్, లుట్యేన్ జోన్ లో నిర్మించబడ్డ రమణీయమైన పచ్చికమైదానం మధ్యగా ఈ సంస్ధ నెలకొల్పబడి ఉంది.
 • ఆరోగ్యానికి సంబంధించిన ఒక విజ్ఞానశాస్రంగా, యోగాకు ఉన్న బ్రహ్మాండమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ఒత్తిడి సంబంధింత, మనశ్చర్మ సంబంధిత వ్యాధుల విషయంలో, గతంలో ఉన్నటువంటి భారతీయ వైద్యవిధానాల పరిశోధన మరియు హోమి యోపతీ మండలి (కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమి యోపతీ) అప్పట్లో ఒక ప్రైవేట్ సొసైటీగా ఉండే విశ్వయాతన్ యోగాశ్రమ్ కు అనుసంధానంగా 1970లో 5 పడకల యోగా పరిశోధన ఆసుపత్రిని మంజూరు చేసింది. ఈ రంగంలో శాస్త్రీయ అధ్యయనాలు తేల్చిన దానిని బట్టి, రోగాల నివారణ, ప్రోత్సాహకమైన చికిత్స రోగాలను మరియు నయం చేయడం వంటి అంశాలలో యోగా పధ్దతుల సామర్ధ్యం, వాటి ప్రాముఖ్యతను గ్రహించుకున్న దరిమిలా, జనవరి 1, 1976 నాడు సెంట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ యోగా (సి.ఆర్. ఐ.వై –CRIY) (కేంద్రీయ యోగా పరిశోధన సంస్ధ) స్ధాపించబడింది. యోగా పరిశోధన ఆసుపత్రిలోనే పనిచేస్తూ ఉండే సిబ్బందిని దీనిలో విలీనం చేస్తూ, నియమించడం జరిగింది.
 • సాధారణ ప్రజానీకానికి ఉచిత శిక్షణ, వివిధ యోగా సాధనల మరియు యోగా మీద శాస్త్రీయ పరిశోధన ఈ సి.ఆర్.ఐ.వై. (కేంద్రీయ యోగా పరిశోధన సంస్ధ) యొక్క ప్రధాన కార్యకలాపాలు.. సి.ఆర్.ఐ.వై. (కేంద్రీయ యోగా పరిశోధన సంస్ధ) 1998 నుండి యోగాకు సంబంధించిన పరి శోధనా, శిక్షణా ప్రణాళిక, ప్రోత్సాహం మరియు సమన్యయ సంస్ధ గానే ఉంది. దేశవ్యాప్తంగా యోగాకు ఉన్న ప్రాముఖ్యతను గ్రహించుకోవడంతో పాటుగా, పెరుగుతున్నయోగా కార్యకలా పాలతో ఉన్నత స్ధాయి నాణ్యతతో కూడిన సేవలనందించ వలసిన అవసరం ఉండడడం వల్ల, జాతీయ యోగా సంస్ధను నెలకొల్పాలని సెంట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ యోగా (కేంద్రీయ యోగా పరిశోధన సంస్ధ) ను దీనితోపాటు విలీనం చేస్తూ, నిర్ణయం తీసుకుని, దీనికి మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎమ్.డి.ఎన్.ఐ.వై – MDNIY) అని పేరు పెట్టడం జరిగింది.
 • మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్: Morarji Desai National Institute of Yoga

ఆధారము : మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎబౌట్ ఆయుష్ (ఆయుష్ ను గురించి కల్పితాలు, వాస్తవాలు)

మత్స్యాసనం

ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...

పద్మాసన స్థితిలో కూర్చోవాలి. తర్వాత ఫొటోలో ఉన్నట్లు మోచేతుల సహాయంతో శరీరాన్ని మెల్లగా నేల మీదకు తీసుకురావాలి. ఈ స్థితిలో దేహం బరువు నడుము, మోచేతుల మీద ఉంటుంది. మెల్లగా వెన్ను, భుజాలు, తలను కూడా నేల మీదకు ఆనించి పడుకోవాలి.

అరచేతులను చెవులకు పక్కన నేలకు ఆనించాలి (ఈ స్థితిలో చేతి వేళ్లు భుజాలవైపు ఉండాలి). తర్వాత అరచేతుల మీద బలాన్ని మోపి నేలను నొక్కిపట్టి నడుమును, ఛాతీని పైకి లేపాలి. మెడను వెనక్కు వంచి తల నడినెత్తిని నేలకు ఆనించాలి.

ఇప్పుడు చేతులను తల పక్కనుంచి తీసి కాలివేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు ఆని ఉంటాయి. ఇది మత్స్యాసన స్థితి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అదెలాగంటే...

కాళ్లను వదిలి, అరచేతులను తలకు ఇరువైపుల నేలకు ఆనించాలి. తలను పైకి లేపి మెల్లగా భుజాలను నేలకు ఆనించిన తర్వాత తలను నేలకు ఆనించాలి. తర్వాత నడుము భాగాన్ని నేలకు ఆనించి, మోచేతుల సహాయంతో పైకి లేచి కూర్చోవాలి.

పద్మాసనాన్ని విప్పి శరీరాన్ని వదులు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 3-5 సార్లు చేయాలి. పద్మాసనం వేయలేని వాళ్లు లేదా పద్మాసన స్థితిలో ఎక్కువ సేపు ఉండలేని వాళ్లు... మత్స్యాసనాన్ని అర్ధపద్మాసనం వేసి వేయవచ్చు. అదీ సాధ్యం కానప్పుడు కాళ్లు చాపి కూడా చేయవచ్చు. కింద చెప్పిన అన్ని ప్రయోజనాలు చేకూరాలంటే పద్మాసన స్థితిలోనే వేయాలి.

మత్స్యాసనం ప్రయోజనాలు!
థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.

ఊపిరితిత్తులలోకి ప్రాణశక్తి బాగా అంది రక్తం శుద్ధి అవుతుంది.

ఉబ్బసం, ఆయాసం, శ్వాసనాళ సమస్యలు తగ్గుతాయి.

ఛాతీకండరాలు, మర్మాంగాలు శక్తిమంతం అవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం పోతుంది.

నడుము శక్తిమంతం అవుతుంది, గర్భకోశ సమస్యలు తగ్గుతాయి.

టాన్సిల్స్, మధుమేహం, మెదడు సమస్యల నుంచి ఉపశమనం.

నరాల సమస్యలు, చెవి, ముక్కు వ్యాధులు తగ్గుతాయి.

మత్స్యాసనాన్ని వీళ్లు చేయకూడదు!
సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.

హెర్నియా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

ఆస్త్మా నివారణకు ఉపకరించే మరికొన్ని యోగాసనాలు ఇవి!
ఉష్ట్రాసనం, శశాంకాసనం, శలభాసనం, సుప్తవజ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, కోణాసనం, పశ్చిమోత్తాసనం, సూర్యనమస్కారాలు, పవనముక్తాసనం, జలనేతి, సూత్రనేతి, కపాలభాతి, ఉజ్జయి, కుంజరధౌతి, విభాగ ప్రాణాయామం... మొదలైనవి. వీటిలో అనేక యోగాసనాలు గత సంచికలలో ప్రచురితమయ్యాయి.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

కపాలభాతి యోగ స్నానం !

స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే – ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.

కపాలభాతి ప్రయోజనాలు:

 • మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి.
 • శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది.
 • ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది.
 • జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి.
 • సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి.
 • కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది.

వీళ్లు చేయకూడదు!

హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.

ఎప్పుడు చేయాలంటే!

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.

జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.

బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.

అంతర వ్యాయామం: ఆయుర్వేదం

కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు. – డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు

యోగశాస్త్రం ప్రకారం

‘కపాలం’ అంటే మస్తిష్కం లేదా మెదడు. ‘భాతి’ అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.

సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.

మొదటి దశలో…

కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.

రెండవ దశలో…

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.

మూడవ దశలో…

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.

నాలుగవ దశలో…

చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.

నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.

ఆధారము: ప్రవాస రాజ్యం

2.85384615385
vasumathi, IGS Jan 23, 2015 01:08 PM

యోగాసనాలు వాటిని బొమ్మల రూపములో చూడటానికి ఈ లింక్/పేజి ని చూడండి.
te.vikaspedia.in/health/ayush/c2fc4bc17c3ec38c28c3ec32c41

pandranki venkataramana 9959690144 Feb 21, 2014 03:06 PM

యోగాసనాలు వాటిని బొమ్మల రూపము లో చూపిస్తూ , వాటివల్ల ఉపయోగాలు ఉంటే బాగుంటుంది .

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు