హోమ్ / ఆరోగ్యం / అవయవదానం / కాలేయ మార్పిడి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాలేయ మార్పిడి

కాలేయం వంటి అరుదైన అవయవం పాడైతే వేరే ఇతర అవయవం ఆ విధుల్ని చేపట్టే అవకాశం లేదు. తప్పనిసరిగా ఇతరుల శరీరంలోని కాలేయాన్ని తీసుకొని అమర్చాల్సి ఉంటుంది.

‘పరోపకారార్థమిదం శరీరమ్‌||’ అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో కూరుకొన్నప్పుడు తోటి వారు స్పందించాల్సిన అవసరం ఉంది. తోటి మానవులేస్పందించి ఆ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాల్సి ఉంటుంది. మానవ శరీరంలో కొన్ని భాగాలు పాడైతే , ఆ అవయవాల్ని మార్కెట్‌ లో కొనుకొ్కనేందుకు వీలు లేదు. ఆ అవయవాలు కానీ, శరీర భాగాలు కానీ ఇతర మానవుల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తోటి వారు ముందుకు వస్తే అనేక మంది ఆరోగ్యం మెరుగవుతుంది. అవయవ దానం మీద అవగాహన పెరిగితేనే ఇది సాధ్యం అవుతుంది. మరీ ముఖ్యంగా కాలేయం వంటి అరుదైన అవయవం పాడైతే వేరే ఇతర అవయవం ఆ విధుల్ని చేపట్టే అవకాశం లేదు. తప్పనిసరిగా ఇతరుల శరీరంలోని కాలేయాన్ని తీసుకొని అమర్చాల్సి ఉంటుంది.

కాలేయ మార్పిడి అన్నది అంత తేలికైన ప్రక్రియ మాత్రం కాదు. ఇది చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన ప్రక్రియ. రెండు వైపుల వారికి ఈ పక్రియ గురించి వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రక్త పరీక్ష అవసరం అవుతుంది. కాలేయం నుంచి వచ్చే స్రావాలు, బైలిరుబిన్‌, అల్బుమిన్‌, ప్రోత్రాంబిన్‌, త్రాబో ప్లాస్టిన్‌ వంటి అంశాల్ని పరీక్షిస్తారు. దీంతో పాటు బ్లడ్‌ గ్రూప్‌, వైరల్‌స్టడీస్‌ ను పరిశీలిస్తారు. కడుపు ప్రాంతంలో అల్ట్రాసౌండ్‌పరీక్ష తో పాటు అవసరానికి అనుగుణంగా బయోప్సీ తీసి పరీక్ష జరుపుతారు. రక్తం సరఫరాను పరిశీలించటంతోపాటు ఎకో కార్డియో గ్రామ్‌ వంటి పరీక్షల ద్వారా గుండె స్పందనను పరిశీలిస్తారు. అన్ని రకాల పరీక్షలు చేశాకే అవయవ మార్పిడికి సిద్దం చేస్తారు

కాలేయ మార్పిడి అన్నది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దాదాపు 8-12 గంటల దాకా సమయం పడుతుంది. కడుపు భాగంలో ఒక చిన్న రంధ్రం పెట్టి ఈ ఆపరేషను మొదలు పెడతారు. ఆధునిక వైద్య శాస్త్రంలో లాపరోస్కోపిక్‌ చికిత్స చాలా అద్భుత ఫలితం అనుకోవచ్చు. కడుపును కోయాల్సిన పని లేకుండా చిన్న గాటు ద్వారా చికిత్సను పూర్తి చేయటానికి వీలవుతుంది. దీని ద్వారా ఒక వీడియో కెమెరాను శరీరంలోకి పంపించి, అక్కడి ద్రశ్యాలను తెర మీద చూస్తుంటారు. దీని ఆధారంగా చికిత్స చేయాల్సిన శరీర భాగాన్ని గమనించి, అక్కడ చికిత్స పూర్తి చేస్తారు.

జీర్ణ వ్యవస్థ లో అతి ముఖ్యమైన కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడి వైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలక పాత్ర పోషించటంతో పాటు. . ప్రోటీన్‌ సంశ్లేషణ, ఔషధ వినియోగం, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగ పడుతుంది. . నిరంతరాయంగా పనిచేసే క్రమంలో ఇది వ్యాధి గ్రస్తమవుతుంది. కాలేయం పూర్తిగా పనికి రాని స్థితికి చేరితే మాత్రం అసలు సమస్య ఏర్పడుతుంది. కనీసం పది శాతం పని చేసినప్పటికీ ఫర్వాలేదు. 30 శాతం పనిచేయగలిగితే కాస్తంత కుదుట పడవచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా మార్చటం ఒక్కటే పరిష్కారం. దీన్నే కాలేయ మార్పిడిగా చెప్పవచ్చు. రక్తం మాదిరిగానే కాలేయాన్ని కూడా వేరే ఒక వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. అందుచేత కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకొనే వ్యక్తిని గ్రహీత గా వ్యవహరిస్తారు.

కాలేయ మార్పిడి లో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. మ్రత దాత కాలేయ మార్పిడి (డీసీజెడ్‌ డోనార్‌ లివర్‌ ట్రాన్సు ప్లాంటేషను )అంటే బ్రెయిన్‌ డెడ్‌ లేదా మ్రత్యువు అంచుల్లో ఉన్న వారి నుంచి కాలేయాన్ని సేకరించి ఇతరులకు దాన్ని అమర్చటం అన్న మాట. హ్రదయ స్పందన లేని దాతలు ( నాన్‌ హార్టు బీటింగ్‌ డోనార్సు )పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి (అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలన్నీ నిర్జీవం అయిపోయిన స్థితి) కాలేయాన్ని సేకరించటం అన్నమాట. ఇటువంటప్పుడు చనిపోయన వెంట నే అంటే దాదాపు 20 నిముషాల్లోపే అవయవాన్ని ఇతరులకు అందచేస్తారు. సన్నిహితుల నుంచి సేకరించటం (లివింగ్‌ రిలేటడ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంటేషన్‌ )ఇటువంటి కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా దగ్గర సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరించి ఇతరులకు అందచేస్తారు.

దాత నుంచి కాలేయాన్ని సేకరించాక గ్రహీతలోకి అమర్చటం అన్నది నిపుణులైన వైద్యుల టీమ్‌మాత్రమే చేయగలుగుతుంది. ట్రాన్సు ప్లాంటేషన్‌ సర్జన్‌, అనెస్థటిస్టు, పెర్‌ఫ్యుషనిస్టు, హెపటాలజిస్టు వంటి నిపుణులు ఇందులో పాలు పంచుకొంటారు. కాలేయ మార్పిడిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం చాలా అవసరం. అదే సమయంలో సదరు ఆస్పత్రిలో అన్ని హంగులు ఉన్న ఆపరేషన్‌థియోటర్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, బ్లడ్‌బ్యాంక్‌, సపోర్టివ్‌ ల్యాబ్‌ లు ఉండాలి. సుశిక్షితులైన సిబ్బంది కూడా ఉండాలి. ఇవన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తే.. కాలేయ మార్పిడి అనేది చ ఖరీదైన అంశంగా గుర్తించాలి. కానీ, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌ లో మాత్రం చౌకగా జరుగుతుందని చెప్పవచ్చు.
ఆపరేషన్‌ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

ముందుగా శరీరంలో ద్రవాల కదలికలను పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్ని ట్యూబులను శరీరంలోకి ప్రవేశ పెడతారు. విభిన్న స్రావాల ద్వారా ఆపరేషన్‌ కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. మరీ ముఖ్యంగా కాలేయం నుంచి విడుదల అయ్యే పైత్యరసం అడ్డు పడకుండా చూసుకొంటారు. ఆ తర్వాత ఆపరేషన్‌ కు ఉపక్రమిస్తారు.

కాలేయ మార్పిడి అన్నది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దాదాపు 8-12 గంటల దాకా సమయం పడుతుంది. కడుపు భాగంలో ఒక చిన్న రంధ్రం పెట్టి ఈ ఆపరేషను మొదలు పెడతారు. ఆధునిక వైద్య శాస్త్రంలో లాపరోస్కోపిక్‌ చికిత్స చాలా అద్భుత ఫలితం అనుకోవచ్చు. కడుపును కోయాల్సిన పని లేకుండా చిన్న గాటు ద్వారా చికిత్సను పూర్తి చేయటానికి వీలవుతుంది. దీని ద్వారా ఒక వీడియో కెమెరాను శరీరంలోకి పంపించి, అక్కడి ద్రశ్యాలను తెర మీద చూస్తుంటారు. దీని ఆధారంగా చికిత్స చేయాల్సిన శరీర భాగాన్ని గమనించి, అక్కడ చికిత్స పూర్తి చేస్తారు. అవయవ దానంలో కూడా అవసరమైనంత మేర మాత్రమే గాయం చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా తొలగించాల్సిన కాలేయాన్ని గుర్తించి అక్కడ ఎంత వరకు శరీర భాగం వేరు చేయాలో నిర్ధారించుకొంటారు.

ఆ తర్వాత ఆ శరీర భాగానికి సంబంధించిన పైత్యరస వాహికలు, రక్త కేశ నాళికల్ని జాగ్రత్తగా తప్పిస్తారు. మరో వైపు దాత శరీరంలో కాలేయ ప్రాంతాన్ని గుర్తించి కొంత భాగాన్ని సేకరిస్తారు. ఈలోగా గ్రహీత శరీర భాగంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఉంచుతారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఈ కొత్త భాగాన్ని అక్కడకు చేర్చి అతుకుతారు. ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రక్రియను నిపుణులైన సర్జన్‌ లు మాత్రమే చేయగలుగుతారు. ఆధునిక వైద్య శాస్త్రంపై అవగాహన ఉన్నప్పుడు కొత్త టెక్నాలజీ ని ఉపయోగించుకొని అవయవ మార్పిడిని సజావుగా పూర్తి చేసేందుకు వీలవుతుంది.

కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక..అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే.. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. దీన్నే రిజక్షన్‌అని పిలుస్తారు. ఇది జాగ్రత్తగా చికిత్స చేయాల్సిన ప్రక్రియ. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ ను కాస్తంత బలహీన పరిచేందుకు మందులు వాడతారు.

ఒక్కోసారి ఈ మందుల డోసు పెరిగితే ఇతర సైడ్‌ఎఫెక్టులు రావచ్చు. అందుచేత జాగ్రత్తగా మెడికేషన్‌ అందిస్తారు. తక్కువ ఇమ్యూనోజెనిక్‌ సామర్థ్యం గల అవయ వంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువకాలం ఈ మందుల్ని వాడుతున్నా... చౌకగానే సాధ్యం అని గుర్తు ఎరగాలి. ఇటువంటి శస్త్ర చికిత్సల్లో తరచుగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట గా ఇన్‌ ఫెక్షన్‌ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడి కి ముందే వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

చాలా కాలం వరకు ఇటువంటి అవయవ దానాలు అభివ్రద్ది చెందిన దేశాల్లోనే జరుగుతు ఉండేవి. ఈ మద్య కాలంలో భారత్‌ వంటి వర్దమాన దేశాల్లో సైతం అవయవ దానాలు, అవ యవ మార్పిడి జరుగుతున్నాయి. కానీ ఈ సంఖ్య ఆశించినంత వేగంగా జరగటం లేదు. ఒ క వైపు అనేక మంది రోగులు అవయవాలు చెడిపోయి బాధ పడుతున్నా.. దీనికి ప్రత్యామ్నా యం అందించే అవకాశం లేని దుస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అవయవ మార్పిడి మీద అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది. అవయవ దానం చేసిన తర్వాత దాత తన జీవన విధులు నిర్వర్తించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. పైగా గ్రహీత కు అద్భుతమైన ఆరోగ్య దానం చేసినట్లవుతుంది. ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనల కారణంగా పెద్దగా ఇబ్బంది లేకుండా ఈ చికిత్సలు అందించేందుకు వీలవుతోంది.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

3.11926605505
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు