హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / అప్రమత్తతే రక్ష
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అప్రమత్తతే రక్ష

తక్షణం కిడ్నీ మార్పు కోరుతున్నవారు రాజధానిలో దాదాపు రెండు వేల మంది ఉన్నారని అంచనా..

తక్షణం కిడ్నీ మార్పు కోరుతున్నవారు రాజధానిలో దాదాపు రెండు వేల మంది ఉన్నారని అంచనా.. వీరిలో కేవలం 8 నుంచి 10 శాతం మందికే దాతలు దొరుకుతున్నారు. మిగిలిన వారు నిత్యం జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్రతి 100 కిడ్నీ వ్యాధులతో బాధపడేవారిలో 30 నుంచి 40 శాతం మందికి ఆ సమస్య ఉన్నట్లే గుర్తిచలేకపోతున్నారు. కనీసం వ్యాధి నిర్ధారణ చేసుకున్నవారు కూడా చికిత్స తీసుకునేవారు కేవలం 15 శాతం లోపు ఉండటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం

సీకేడీ - రక్తంలో సుద్ద (ప్రోటీసు) పోవడం, పుట్టుకతో మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలుండటం, కిడ్నీల్లో నీటి తిత్తులుండటం మూత్రనాళ ఇన్పెక్షన్లు - మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు కిడ్నీకి పాకి (పైలోనెప్రైటిస్‌) దానివల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చి కిడ్నీ విఫలమయ్యే అవకాశం

ప్రోస్టెటు - పురుషుల్లో పెద్దవయసు వచ్చేసరికి ప్రోస్టెటు గ్రంథి పెద్దదై(బీపీహెచ్‌).. దానివల్ల మూత్రం ధార తగ్గి కొంత లోపలే నిల్వ ఉండిపోవడం. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం
రాళ్లు - కిడ్నీల్లో రాళ్ల వల్ల మూత్ర ప్రవాహం, పీడనాల్లో తేడా రావడం వల్ల వెనక్కి ప్రవహించి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం. దాని ద్వారా దీర్ఘకాలిక వ్యాధిలోకి వెళ్లే అవకాశం.

 

కిడ్నీ వ్యాధుల లక్షణాలు
ఎక్కువసార్లు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కవసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం, మూత్రం పోసినప్పుడు నురగ కనబడటం, అధిక రకత్తపోటు, కాళ్ల వాపులు, కాళ్లకు నీరు రావడం, నొక్కితే గుంట పడటం మూత్రంలో రక్తం పడటం, నీరసంగా ఉండటం, ఆకలి తగ్గిపోవడం, రక్తహీనత, చర్మం నల్లబడటం, రక్తపోటు బాగా పెరగటం,
ఆయాసం, వికారం, ఉత్సాహంగా లేకపోవడం, ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అసలు ఇష్టపడకపోవడం. ఒళ్లంత దురదలు, ఆహారం చూస్తే వాంతి వచ్చేలా ఉండటం. మూత్రపిండాల శుద్ధి సామర్థ్యన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి.

ఏటా కంప్టీట్‌ యూరిన్‌ ఎగ్జామిన్‌ (సీయూఈ) పరీక్ష తప్పకుండా చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారైతే 3 నుంచి 6 నెలలకొకసారి చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగా గుర్తించేందుకు వీలుంటుంది.
మూత్రంలో అల్బుమిన్‌ - అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను(సుద్ద). ఇది ఎక్కువగా మూత్రంలో పోతుంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గి పోతున్నట్లే లెక్క. అందుకే ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే.
రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌ - మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌ - ఈజీఎఫ్‌ఆర్‌)ను లెక్కించి సమస్య ఎంత వరకూ ఉందనేది అంచనా వేస్తారు. సాధారణంగా 110 మి.లీ వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ కన్నా తక్కువగా ఉంటే మూత్రపిండాలు సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నట్లే.. సీరమ్‌ క్రాయాటినైన్‌ను పరీక్షించి దానితోపాటు వయసు, బరువు, ఎత్తు, వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.
సీకేడీ వ్యాధి అయిదు దశలు
వడపోత సామర్థ్యాన్ని బట్టి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని అయిదు దశలుగా వర్గీకిరిస్తారు. సాధారణంగా ఈజీఎఫ్‌ఆర్‌ 90 కంటే ఎక్కువ ఉండాలి. 80 కంటే తక్కువగా ఉంటే సీకేడీ మొదలైందని అర్థం. కాబట్టి వీరు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈజీఎఫ్‌ఆర్‌ ఎంఎల్‌/మినిట్‌ దశ
60-90 మొదటి దశ
50-60/70 రెండో దశ
30-50 మూడోదశ
15-30 నాలుగో దశ
15 కన్నా తక్కువ అయిదో దశ
వ్యాధి వచ్చాక కిడ్నీ కాపాడు కోవాలంటే...
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చింగా నియంత్రణలో ఉంచుకోవాలి
హెచ్‌బీఏ 1 సీ(గ్లైకాసిలేటెడ్‌ హెమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితాం 7 కన్నా తక్కువుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి 3 నెలలకొకసారి మధుమేహం అదుపులో ఉందో లేదో పరీక్షించుకోవాలి
రక్తంలో కొలెసా్ట్రల్‌ పెరగకుండా చూసుకోవడంతోపాటు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి
మూత్రం పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి
కిడ్నీ సమస్యలున్నవారు తక్షణమే పోగ, మద్యం తాగడం ఆపేయాలి.
వైద్యుల సూచన లేకుండా వళ్లు నెప్పుల మాత్రలు తీసుకోకూడదు
ఆహారంలో మాంసకృత్తులు (ప్రాటీను) తక్కువగా తీసుకోవాలి.. పాలు, గుడ్డులో తెల్లసొన వంటివి తీసుకోవచ్చు చికిత్స..
మూత్ర పిండాల వ్యాధి గ్రస్థులకు రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
రక్తాన్ని శుద్ధి చేయడాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు క్రమపద్ధతిలో డయాలసిస్‌ చేయించుకోవడం. పూర్తిగా మూత్రపిండాలు చెడిపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయడం నివారణ
ఆహారంలో ద్రావణాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం దానితోపాటు ఫైబర్‌ ఆహారం తీసుకోవడం
మంచినీరు ఎక్కువగా తాడం, నిత్యం కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం వంటివి చేయాలి.

 

ఈజీఎఫ్‌ఆర్‌ 20మి.లీ కన్నా తగ్గితే ప్రమాదం
కిడ్నీ వ్యాధులు ముందస్తుగా గుర్తించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. ప్రారంభ దశలోనే మనం కనిపెట్టగలిగితే చాలా వరకు సమస్యను అధిగ మించొచ్చు. సాధారణంగా ఈజీఎఫ్‌ఆర్‌ 90 మి.లీ కంటే ఎక్కువ ఉండాలి. అది 20 మి.లీ కన్నా తగ్గితే వెంటనే వారికి ప్రత్యేక చికిత్స అవసరం. వారి స్థితిని బట్టి డయాలసిస్‌ క్రమ పద్ధతిలో చేయాల్సి వస్తుంది. ఒకోసారి కిడ్నీలు బాగా దెబ్బతిన్న తరవాత గుర్తిస్తే మూత్రపిండాలు మార్చాల్సి వస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. దీనితోపాటు ఆహార నియమాలు కూడా పాటిస్తే వీటి బారిన పడకుండా ఉండొచ్చు.

- డాక్టర్‌ హుస్సేనీ, నెఫ్రాలజిస్ట్‌

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

3.02298850575
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు