హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / అర్ధరాత్రి తింటే మెదడుకు ముప్పు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అర్ధరాత్రి తింటే మెదడుకు ముప్పు

నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలూ సంభవిస్తాయి.

నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలూ సంభవిస్తాయి.

వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.

ఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అని పెద్దలు అంటుంటారు. వేళాపాల లేకుండా ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనే ఉద్దేశంతో పెద్దలు చెబుతుంటారిలా.

నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది.


కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్‌నైట్‌ జంక్‌ఫుడ్‌ తినే వారిని జాగ్రత్తగా పరిశీలించారు. వారి వివరాలను పొందుపరిచారు. పడుకునే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.98039215686
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు