హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / బరువు ఆరోగ్యంగా తగ్గాలి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బరువు ఆరోగ్యంగా తగ్గాలి

కొందరు త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో అధికంగా వ్యాయామం చేయడం, చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమేమోగానీ బలహీనంగా తయారువుతారు.

బరువు తగ్గాలనుకునే వారు కేలరీలు కరింగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో కొందరు త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో అధికంగా వ్యాయామం చేయడం, చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమేమోగానీ బలహీనంగా తయారువుతారు. అందుకే కొవ్వు కరిగించుకోవాలనుకునే వాళ్లు ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం.


బరువు తగ్గాలనే ఆతురతతో కొందరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుంటారు. అలా చేయడం వల్ల ప్రొటీన్లు, కొన్ని రకాల అవసరమైన కొవ్వుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు సరిపడా అందవు. దానివల్ల శరీరం బలహీనంగా అయిపోతుంది. అందుకే బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం.

ఈ సమయంలో ప్రొటీన్లు అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయిలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.

బరువు తగ్గాలనుకునేవారు కేవలం జిమ్‌ కసరత్తులకే పరిమితం కాకుండా యోగా, డాన్స్‌, వాకింగ్‌ కూడా అప్పుడప్పుడు చేస్తుండాలి. నిద్రలేమి వల్ల కొందరిలో హార్మోన్‌ సమస్యలు తలెత్తుతుంటాయి. బరువు పెరగడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చు. అందుకే కంటినిండా నిద్రపోడం కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూర్తి ఆరోగ్యంతో బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

అంతేకానీ వ్యాయామాలు, డైటింగ్‌ వంటివి అదేపనిగా చేయకూడదు. అలా చేయడం వల్ల బరువు తగ్గడం ఏమోగానీ శరీరం బలహీనం అవుతుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.98901098901
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు